Author Topic: ఆచార్యుని అమృత వాణి  (Read 5158 times)

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #30 on: July 20, 2016, 06:57:16 AM »
జై సాయి మాస్టర్,

గురు బంధువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు !

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం నుంచి ( పేజీ 72)

మాస్టర్ గారు ఒక రోజు కృతజ్ఞత గురించి ప్రకృతి ని సోదాహరణగా చెప్తూ విసదీకరించారు.

" మనం తింటున్న ప్రతి మెతుక్కూమనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం జేబులో డబ్బులున్నందు వల్ల మనం కొనేసుకుంటున్నాము, తింటున్నాము, అని అనుకోవటం కరెక్ట్ కాదు. సృష్టి లో ఉండే జీవరాసులు మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించ కుండా డ్యూటీ లాగా చేసే పని, మనకు ఆహారమై జీవనానికి కారణమైంది. ఈ ఆహారం తయారు కావడానికి ఎన్నింటి మీదనో ఆధారపడ తావు నువ్వు. ఇన్నింటి సహకారాన్ని భోంచేస్తూ నువ్వు వాటికి తిరిగి చేయాల్సిన అవసరం లేదని అనుకుంటే ఇదే ప్రిన్సిపుల్ నీకు సమాధానం ఇస్తుంది. ఈ సమాజం లో, ఈ వాతావరణం లో ఏ జీవి సహకారం తీసుకునే అర్హత / యోగ్యతా నీకు లేదు" అని ఎంతో ఘాటు గా విసదీకరించారు. "

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #31 on: August 06, 2016, 08:24:52 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం ( పేజీ 73)

వయసు లో ఉన్న కుర్రవాడికి ఆ వయసు లో ఉన్నటు వంటి ఇబ్బందులు, బలహీనతల వల్ల మోసపూరితమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిని కట్ చేయటానికి మాస్టర్ గారు ఇలా చెప్పారు " ఒకబ్బాయి ఒకమ్మాయి ని మోసం చేసాడనుకోండి. అతను ఆ అమ్మాయిని మాత్రమె మోసం చేసాడనుకోవటం పొరపాటు. ఆ అమ్మాయికి ఎన్నో రకాల బాంధవ్యాలుంటాయి. తల్లితండ్రులకు కూతురు. తోబుట్టువులకు అక్కగా, చెల్లిగా, కాబోయే భర్తకు భార్యగా, కాబోయే అత్తమామలకు కోడలి గా, పుట్టబోయే బిడ్డలకు తల్లిగా, ఆ అమ్మాయిని ఒక్క దాన్ని మాత్రమె కాదు. ఇలా ఇన్ని రకాల బాంధవ్యాలను నువ్వు మోసం చేస్తున్నావు. తిరిగి దానికి సరైన పనిష్మెంట్ ఎప్పుడు జరిగేటట్లు? మళ్ళీ ఇన్ని రకాల సంబంధాల మనుష్యుల చేత నువ్వు మోసగింపబడినప్పుడు. అది ఎప్పుడు అంటే ఎప్పుడో ఒకప్పుడు " అని అంటూ " నువ్వు ఇంతగా నష్టపోవడానికి సిద్ధపడ్తావా? ఏమయ్యా బుద్ధిమంతులు చేసే పనేనా ఇది?" అని మాస్టర్ గారు తీవ్రంగా చెప్పారు.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #32 on: August 12, 2016, 08:12:33 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం ( పేజీ డెబ్భై ఆరు నుంచి)

" మీరంతా ఒక ఆడపిల్ల ను రచ్చ కీడ్చి వాళ్ళింటి కెళ్ళి గొడవ చేయటానికి సిగ్గు వెయ్యలేదా? డిగ్రీ మొదటి సంవత్సరం చదివే నీకు, తల్లితండ్రుల దయాభిక్ష లేకుండా గడవని నీకు, స్వతంత్రంగా బతకలేని నీకు, ఇంతలోనే మగతనాన్ని ప్రదర్శించాలనిపిస్తోందా? అసలు మగతనమంటే ఏమిటో తెలుసా? గాడిదలా తిరగటం కాదు మగతనమంటే. నిగ్రహమోయ్ !నీ శరీరం మీద, మనసు మీద అదుపు ఉండటమే నిజమైన మగతనము. అమ్మను అమ్మగా, చెల్లిని చెల్లి గా, మనవారినెలా చూసుకోగలవోఅలాగే అందరి వాళ్ళు అందరికీ అలాగే కదా!అదే మంచి భావం తో అందరినీ చూడగలగటమే మగతనం కానీ ఇలా పశువుల్లా ప్రవర్తించటం కాదు."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #33 on: August 19, 2016, 07:53:29 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం ( పేజీ 96 నుంచి)

" జందెం ( యజ్ఞోపవీతం ) ఎందుకు వేసుకోవాలి అని అడిగితే " జంద్యం లోని మూడు ముళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతం. వారి మువ్వురి కలయికయే ఈ సృష్టి స్వరూపం అని నిరంతరం స్మరణ చేసుకోవటానికే గానీ, వీపు గీరుకోవటానికి కాదు" అన్నారు.

జై సాయి మాస్టర్.