Author Topic: Guru Charitra lo Doubt  (Read 1184 times)

mca.teja

  • Jr. Member
  • **
  • Posts: 57
  • Akkala Kota swami vari padhukalu
    • View Profile
Guru Charitra lo Doubt
« on: March 02, 2015, 11:14:05 AM »
గురుచరిత్ర లొ సుందరి  భర్త చనిపొయినప్పుడు ఆమె కత్తి తొ పొదుచుకొబొతుంటె ఊరి జనము వద్ధు అని వారిస్తరు కాని అగ్ని ప్రవెశము చెయమంటారు అది అందరు ఒప్పుకుంటరరు ఎందుకు?శ్రీ గురుడు భ్రహ్మచారిలా వచ్చి ఆమెను అగ్ని ప్రవెశము చెయమంటరు ఎందుకు? (లేద) విధవా ధర్మలు పాటించమంటారు (సన్యాస దర్మాలు గ) ఇది ok మాస్టారు గారు చెప్పిన వివరన కుద అర్దమైనది. కాని అగ్ని ప్రవెసము చెయవచ్చు అంటారు కాని కత్తి తొ పొడుచొవదు అంటారు ఎందుకు?

kittulahri

  • Newbie
  • *
  • Posts: 22
    • View Profile
Re: Guru Charitra lo Doubt
« Reply #1 on: November 22, 2015, 08:25:37 PM »
మీ ప్రశ్న కొంత మేర నేను చదివిన దాన్ని బట్టీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

ఆత్మ హత్య అనేది ఎక్కడా ఎప్పుడూ సమర్ధింప బడలేదు.. ఆత్మ హత్య మహా పాపమని శ్రీ గురువు ఉదర శూల తో బాధ పడే బ్రాహ్మణుని విషయంలో చెప్తారు..

అగస్త్యుని భార్య అయిన లోపా ముద్ర పాతివ్రత్యాన్ని వర్ణిస్తూ దేవ గురువు బృహస్పతి పతివ్రతా ధర్మాలు వివరిస్తారు (ఇవే శ్రీ గురువు సిద్ధుడి రూపంలో వచ్చి సువాసినికి వివరిస్తారు) అదే సందర్భంలో భర్తని కోల్పోయిన స్త్రీకి, పాటించవలసిన ధర్మాలుగా "సహగమనాన్ని" లేదా "విధవా ధర్మాల్ని" వివరిస్తారు. సహగమనం చేసిన స్త్రీ తనతో పాటు 42 తరాలని స్వర్గానికి తీసుకు వెళ్ళగలదనీ, అలాగే ఒక వేళ తన భర్త పాపాత్ముడైనా కూడా అతనిని కూడా తనతో స్వర్గానికి తీసుకు పొగలదనీ చెప్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే "దూర ప్రాంతంలో భర్త చనిపోయినప్పుడు లేదా పాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు సహగమనం నిషేధించ బడినది"

అయితే సువాసిని వైధవ్య ధర్మాల్ని పాటించడం కష్టంగా ఇంకా ఆశక్యంగా ఉన్నవనీ, వైధవ్య ధర్మం అసిధారా వ్రతం వంటిదనీ తన సౌందర్యం, యవ్వనం పుణ్యమును హరింప వచ్చుననీ అలాగే బహు నిందలూ అపవాదులూ ఈ కలియుగములో కలుగ వచ్చుననీ సహగమనం వైపుకు మొగ్గు చూపుతుంది

References:

1. Mastaaru raasina "Sri Guru Charitra"
2. Sri Guru Charitramu by "Sripada Srivallabha Mahaasamsthaanam" Anuvaadamu : Sri Pannala Bhatta Sharma garu

G.Sudhakar

  • Guest
Re: Guru Charitra lo Doubt
« Reply #2 on: November 24, 2015, 06:25:44 PM »
తేడా: మంత్రపిండము x మాంసపిండము
మంత్రాగ్ని అని గుర్తు పెట్టుకోవాలి.
కత్తితో పొడవడము అంటే పై తెర చింపివేయడము. అప్పుడు మనకు మాంసమే కనిపిస్తుంది. ఏ మంత్రములు చదువుతూ పొడుస్తాము? మనకి తెలిసీ అలాంటి మంత్రాలు లేవు.
ఈ దేహము మంత్రపిండము. మాంసపిండము కాదు నిజానికి. 
అగ్నిహోత్రము నిర్వహించిన అగ్నితోనే చితి ఏర్పరుస్తారు.
అయితే ఇవి స్థూలమైనవి. అసలైన జ్ఞాన యజ్ఞము ముందు ఇవి కూడా తుచ్ఛాలే. పురుష సూక్త రహస్యములో ఈ విషయము మాస్టరు గారు చెప్పారు. ఇది వేదము గూర్చి శొధన చేసే వారికి గూడా సుపరిచితమే