Author Topic: ఆచార్యుని అమృత వాణి  (Read 6567 times)

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #15 on: May 03, 2016, 04:18:56 PM »
Jai SaiMaster

Welcome back !! Kalpna garu.

Can you also please share the book and page #. Thanks

Jai SaiMaster
« Last Edit: June 10, 2016, 09:58:18 PM by Swayam »
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #16 on: June 06, 2016, 08:35:37 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం (పేజీ నెంబర్ 57)

" జాగింగ్ లాగా నడవటం . అంటే ఏమిటి? ఇక్కడున్న కాలు మరొక చోటికి కదలడం. కాలు కదులుతున్నది గానీ నేల కదలకుండా ఉంది. అందువల్ల నువ్వు (ఒక చోట నుండి మరొక చోటకు వెళ్తున్నావు.) డిస ప్లేస్ అవుతున్నావు. ఒకటి కదులుతున్నది అని దేని చేత గ్రహించ బడుతున్నది? కాంట్రాస్ట్ ఇన్ రిలేషన్ టు ది అదర్ ( మరొక దానీతో పోల్చడం వలన) కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు కదలడం అంటే స్థలం మారడం తెలియడం లేదు. " తెలుస్తూనే వుంది గదా సార్"  అంటే అప్పడు దేనితో కంపేర్ చేస్తున్నావు( పోలుస్తున్నావు) అంటే నువ్వు కళ్ళు మూసుకొని నడుస్తున్నప్పుడు కూడా లోపల కదలికలు లేనిది ఒకటుండాలన్న మాట. దాంతో పోల్చుకొని ఇది కదులుతున్న సంగతి దానికి తెలుస్తున్నది. ఉదా : శీర్షాసనం వేసావు. తలకిమ్డులయ్యాక నీ వ్యక్తిత్వం (పర్సనాలిటీ) తలకిందులై పోయిందా? నీ ఎగ్జిస్తేన్స్ ( ఉనికి) తలకిందులు అయిందా? లేదే, నువ్వు మాత్రం స్ట్రెయిట్ గానే ఉంటావు. " ఐ యాం " అనేది తలకిమ్డులవటం జరగదు. ఎప్పుడూ ఓకే రకంగా ఉంటుంది. ఇట్ గేట్స్ బాలన్సేడ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్. అదేమిటో దాని మీద మనసు ని పెట్టి కాళ్ళను నడవనివ్వండి. ప్రయత్నించండి. ప్రయత్నించండి."

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #17 on: June 07, 2016, 08:05:10 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం ( పేజీ 58 నుంచి)

 నడక కు సంబంధించి మాస్టర్ గారు చెప్పిన మొదటి ప్రిన్సిపల్ ఏమిటంటే నడుమును బాగా టైట్ చేయండి. కాళ్ళను ఫ్రీ గా కదిలిస్తూ లోపల కదలకుండా ఉన్నదేదో దాన్ని ట్రై చేసి పట్టుకొని దాని మీద మనసు ని నిలపండి. అలా చేస్తే నడిచిన శ్రమ తెలియదు.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #18 on: June 08, 2016, 09:03:43 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ( పేజీ 58 నుంచి)

ఇంకొక సారి వారు ( శ్రీ మాస్టర్ గారు) నాడుల గురించి చెపుతూ " మన యోగులు వాళ్ళు చెప్పే నాడులు ఈ నాడులు కావట. వారు చెప్పేవి శరీరం లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ప్రవహించే ఛానల్స్. అయితే అవి నిద్రావస్థ లో ఉంటాయట. చైతన్యం లో క్లారిటీ పెరిగే కొద్దీ అది ఏ స్థాయి కి పెరిగిందో దానికి అనుకూలంగా ఉన్న ఛానెల్ ఓపెన్ అవుతుందట. ఆ ఛానెల్ కి సంబంధించిన ప్రత్యేకత దానికి వస్తుందట. అట్లాంటి వయ్యుండోచ్చు వారు చెప్పే నాడులు. అలాగా అవతల వాడి మనస్సు లోని ఆలోచనలు నా ఆలోచన లాగానే తెలుస్తుంటాయి .అంతేగానీ భగవంతుడు దిగి ప్రక్కన కూర్చొని అన్నీ చెప్పడు" అని అన్నారు.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #19 on: June 09, 2016, 08:11:56 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం ( పేజీ 58 నుంచి)

శ్రీ మాస్టర్ గారు ఒక సారి హేతువాదుల్తో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒకతను అడిగాడు.

" మీరు ఆత్మ, చైతన్యం, జ్ఞానం అని ఇంతలా మాట్లాడుతున్నారు గదా ! అసలు మీకు ఆత్మజ్ఞానం కలిగిందా?" అని అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు " ఆ...పొందాను" అన్నారు. అతను బిత్తర పోయి కొంత సేపైన తర్వాత..." ఆ, అయినా మీకు మామకు తేడా ఏముంది? మీరు కూడా మాలాగే ఉన్నారు కదా" అని అడిగాడు.
" అన్నింటిలోనూ ఏమీ తేడా ఉండదు. మీకెంత తెలుస్తుందో మాకూ అంతే తెలుస్తుంది. ఆత్మ జ్ఞానం పొందినంత మాత్రాన జనాల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవడం అనేది ఉండదు. కాకపొతే దుఖం కలిగినప్పుడు ఆత్మ జ్ఞానం పొందని వాడు దుఖిస్తాడు. ఆత్మజ్ఞాని తనదైన బ్రహ్మానంద స్థితి నుంచి లేశమాత్రమైనా వైదొలగడు. అట్లా అని అవతలివాడు కష్టాలననుభవీస్తూ ఉంటే వీడు ఆనందిస్తాడని కాదక్కడ. తన బాధ్యతని మాత్రం తప్పక చేస్తాడు." అన్నారు మాస్టర్ గారు చిరునవ్వుతో
.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #20 on: June 10, 2016, 08:18:10 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం ( పేజీ 60 నుంచి)

" చెప్పే విధానం లో తేడా ఉండవచ్చు కానీ ఉన్న సత్యం ఒక్కటే.; దాన్లో మార్పేమీ ఉండనప్పుడు మతాల మధ్య విభేదానికి తావుండదు."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #21 on: June 11, 2016, 08:25:11 AM »
జై సాయి మాస్టర్,

" ఒరేయి, నువ్వు నన్ను ఎన్ని సార్లు తప్పు పట్టాలని చూస్తావో అన్ని సార్లు తల పైకెత్తి ఉమ్మి వేయడం లాంటిదిరా".

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #22 on: June 12, 2016, 07:30:14 AM »
" జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం నుంచి ( పేజీ 65)

టైం ను వృధా చేసుకోవద్దని చెపుతూ " ఇప్పుడు నీకు హాయిగా జరిగిపోతుంది. ఇప్పుడు గనుక దాన్ని వృధా చేస్తే కొరడా తో కాల్చి మరీ చేయించుకుంటారు బాబా. ఇతర్ల కోసం ఏదో ఒకటి నీకు చేతనైంది చేయి" అనేవారు.

జై సాయి మాస్టర్.


Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #23 on: June 13, 2016, 07:46:30 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం (పేజీ 68 నుంచి)

" హిందూయిజం అంతా తప్పుఅల తడికలా  వక్రీకరించారు. అందువల్ల హిస్టరీ తిరిగి రాయాలి."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #24 on: June 14, 2016, 08:06:16 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం నుంచి (పేజీ 69)

" నేను నమ్మిన భావాలు పూర్తిగా పొరపాటైనవి అని ఎవరైనా నన్ను వొప్పించగలిగితే నా పుస్తకాలన్నింటని కట్ట కట్టి బావిలో వేస్తా. ఇప్పటికీ నేను రెడీ నే! "

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #25 on: June 16, 2016, 08:37:54 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ( పేజీ 68 నుంచి)

" పిల్లల్లో సరియైన అవగాహన కలిగించి  వాళ్ళలో సరియైన వ్యక్తిత్వం పెంపొందించేలా స్కూల్స్ లో సిలబస్ ఉండాలి. పిల్లలకు ఫ్రీ థింకింగ్ అలవాటు చేయాలి. కేవలం డిగ్రీల మీద ఆధారపడ కూడదు. గవర్నమెంట్ ఉద్యోగాలకై పాకులాడకూడదు. చిన్నపని, పెద్ద పని అనే భేదం లేకుండా అందరూ అన్నీ పనులు చేయడం నేర్చుకోవాలి. కొబ్బరి తాళ్ళు పెనడం దగ్గర్నుంచి ఏ పనైనా సరే  నేర్చుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్తాము. మన పర్సు పోయింది. అపుడు ఇంకోళ్ళ దగ్గర చెయ్యి చాపనవసరం లేకుండా మనకొచ్చిన పని చేసి నాకు అన్నం పెట్టండి అని అడగవచ్చు. చేతి పని గనుక నేర్చుకుంటే ఎట్లా బతకాలి అన్న భయం ఉండదు."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #26 on: June 17, 2016, 07:54:48 AM »
జై సాయి మాస్టర్,

" శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం ( పేజీ 69 నుంచి)

పిల్లల గురించి చెపుతూ " వాళ్ళల్లో ఉండే " అన్నీ తెలుసుకోవాలనే " ఉత్సాహాన్ని చల్లార్చకుండా ఓపిగ్గా వాళ్ళ సందేహాలు తీర్చాలి. ' బాబా కు నమస్కారం పెట్టు' అని బలవంతం గా పెట్టించ కుండా వాళ్ళకు అర్థమయ్యే రీతి లో చెప్పి వారిలో అవగాహన కల్పించాలి. అలా చేస్తే వారు సత్సంగాల పట్ల ఆకర్షితులవుతారు." అనేవారు.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #27 on: June 18, 2016, 09:23:12 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం ( పేజీ 69 నుంచి)

" సత్సంగ సభ్యుల కుటుంబాలు కనీసం వారానికోకసారో, పదిహేను రోజుల కొకసారో తరచుగా కలుసుకుంటూ ఓకే చోట పూజలు, సత్సంగాలు చేసుకోవటం, కలిసి భోజనాలు చేయటం వల్ల సత్సంబంధాలు పెరుగుతాయి."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #28 on: June 19, 2016, 09:25:16 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -రెండవ భాగం ( పేజీ 69 నుంచి)

" నేనెవరినీ తాంబూలం పెట్టి పిలవను.ల పోయేవారిని పోవద్దనను. వచ్చే వారిని రావద్దు అని అనను. ఏంటిటా నాకు పోయేది. నల్ల వెంట్రుక తెల్లబడుతుందా?" అని అనేవారు " నాకేం నష్టం" అన్న అర్థం లో.

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #29 on: June 21, 2016, 09:00:28 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ సాయి మాస్టర్ స్మృతులు - రెండవ భాగం (పేజీ 70 నుంచి)

ఒక సారి సాధన చెడిన వారి పరిస్థితి గురించి ఉదాహరణ గా తీసుకొని " ఒక చీమ విజయవాడ నుండి మద్రాస్ పోవాలని పోతూ ఉందట. కొంచెం దూరం వెళ్ళిన తరువాత మద్రాస్ నుండి విజయవాడ పోయే లారీ వస్తుంటే దాన్నేక్కిందట. పోతూనే ఉందట కానీ మద్రాస్ కాదు. మళ్ళీ విజయవాడే. అడినేను పురోగమిస్తున్నా మద్రాస్ వైపు అని అనుకుందట. కానీ దానికి తెలీదట పాపం వెనక్కు, ఇంకా ఇంకా వెనక్కు అంటే తన గమ్యానికి ఇంకా దూరంగా పోతున్నట్లు" అని చెప్పారు.

జై సాయి మాస్టర్.