Author Topic: ఆచార్యుని అమృత వాణి  (Read 6265 times)

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
ఆచార్యుని అమృత వాణి
« on: April 13, 2016, 08:02:52 AM »
జై సాయి మాస్టర్,

శ్రీ గురుదేవుల ఆరాధనోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి వీలైనప్పుడల్లా  " శ్రీ సాయి మాస్టర్ స్మృతులు -2 " పుస్తకం నుంచి ఆణిముత్యాల లాంటి మాటలు ఇక్కడ రాసుకొని మరో సారి మననం చేసుకోవాలని....

సబ్ ధరతి కాగజ్ కరూం సబ్ లేఖిని బనరాయ్
సాత్ సముందర్ కి మసి కరూం గురు గుణ లిఖా న జాయ్

---భక్త కబీర్

గురు మహిమ ఎంత అపారమంటే ఈ భూమినంతటినీ కాగితంగా , వృక్షాలన్నింటిని లేఖినిగా , సప్త సముద్రాల నీటినంతటిని సిరా గా ఉపయోగించి గురుచరితామృతాన్నిలిఖించటం మొదలు పెడితే కాగితమంతా అయిపోయినా , లేఖిని అరిగిపోయినా, సిరా అంతా అయిపోయినా కూడా గురు మహిమ ఇంకా మిగిలే ఉంటుంది.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #1 on: April 14, 2016, 08:27:46 AM »
సాయి మాస్టర్ స్మృతులు -2

" మనం విశ్వ ప్రేమ ను, సౌభ్రాతృత్వాన్ని పెంచుకొని, కులమత భేదాలను పోగొట్టుకోగలిగితేనే నిజమైన హిందువులుగా మనగలిగేది"

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #2 on: April 15, 2016, 06:42:54 AM »
" మనస్సులో రాగ ద్వేషాలు లేకుండా సాత్త్విక భావం తో పారాయణ చెయ్యి. అప్పుడు ఫలితం ఎక్కువ గా ఉంటుంది. ఎప్పుడు పారాయణ చేసినా, మనలోని అవలక్షణాలను తొలగించుకోడానికి ప్రయత్నించాలి. అంతేగానీ ఎన్ని సార్లు పారాయణ చేసాము అన్నది ముఖ్యం కాదు. మనలోని అవలక్షణాలు తోలిగిపోతున్నాయా, లేదా అన్నది ముఖ్యం."

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #3 on: April 16, 2016, 08:24:49 AM »
ఒక సారి గుంటూర్ లో సత్సంగం జరుగుతుంటే, ఒక మాస్టర్ గారిని ఎవరూ ఊహించని విధంగా " మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని సమాధి చేస్తారా? లేక దహనం చేస్తారా? " అంటూ ప్రశ్నిస్తే, తోటి భక్తులు అల అడగకూడదని నివారించ బోతే " అడగనీ, తప్పేముంది?" అంటూ ఒక్క క్షణ మాగి " నేను నా భార్యా పిల్లలతో సమానం గా మిమ్మల్ని చూచుకున్న వాడి నైతే సమాధి చేస్తారు, లేకపోతె దహనం చేస్తారు" అని ముఖం లో ఎలాంటి భావం లేకుండా సమాధానమిచ్చారు.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #4 on: April 17, 2016, 07:07:02 AM »
" సాధన బాగా చేయడం చేత కావాలంటే ఎలా సార్ ? ఈ ప్రపంచం లో మామూలు జీవితానికీను, సాధనామయ జీవితానికి పొట్టు కుదరటం లే" అని ఒక భక్తుడు అడిగితే దానికి మాస్టర్ గారు సైకిల్ నేర్చుకోవదాన్ని ఒక ఉదాహరణగా సాధనకు అన్వయం చేస్తూ చెప్పారు.

" సైకిల్ నేర్చుకునే మొదట్లో కిందకు చూస్తూ తొక్కుతాడట, ఎవరు పిలిచినా పలక్కుండా. ఎవరన్నా పలకరిస్తే  బ్రేక్ వేసి ఆగి మరీ మాట్లాడతాడట. అలా మొదట్లో చాలా కష్టపడతాడట. బాగా వచ్చిన తర్వాత చేతులు వదిలేసి త్రోక్కడం, ప్రక్క వాళ్ళతో మాట్లాడుతూ పోవటం, ఒక చెయ్యి హేండిల్ మీద ఉంచి రెండో చేత్తో సిగరెట్ తాగుతూ జోరుగా వెళ్తుంటాడు. అలాగే సాధనామయ జీవితం కూడా మొదట్లో ఇబ్బంది అనిపించినా, పోనూ పోనూ చక్కటి సమన్వయము కుదురుతుంది. "

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #5 on: April 18, 2016, 07:17:34 AM »
" బాబా గురించి పది మందికీ చెప్పండి. అలా చెప్పినట్లయితే చిన్నప్పుడే ఒక మహాత్ముడు తారసిల్లి ఉద్ధరింప బడతారు."

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #6 on: April 20, 2016, 08:33:35 AM »
" వచ్చే జన్మ లో కూడా మీరే మా గురువు ఆవాలి అని అడిగినా కూడా " పారాయణ చెయ్యండమ్మా" అని చెప్పారు మాస్టారు . అట్లా పారాయణ చెయ్యగా వచ్చిన అనుభవాలను డైరీ లో రాయండి" అని చెప్పారు మాస్టారు.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #7 on: April 21, 2016, 08:32:34 AM »
జై సాయి మాస్టర్,

" మీకు కావాల్సింది అన్నమే కదమ్మా ! నాలుగు హారతులు పాడండి! బాబా మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెడతాడు".

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #8 on: April 22, 2016, 07:38:40 AM »
జై సాయి మాస్టర్,


" భగవంతుడు సర్వాంతర్యామి.  ఏనుగులలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. మనం అవతలి వారిని ఏ దృష్టి తో చూస్తే, అవతలి వారు మనల్ని అదే దృష్టి తో చూస్తారు. వాటిని( జంతువులను )  మనం చంపాలి అనుకుంటే అవి మనల్ని చంపుతాయి".

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #9 on: April 23, 2016, 08:25:53 AM »
జై సాయి మాస్టర్,

" తలలో ఏమీ లేని వాడికి తలపైన జుట్టు ప్రధానం గానీ , తల లో కావాల్సింది ఉన్నవాడికి జుట్టు లేకపోయినా ఒకటే ."

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #10 on: April 25, 2016, 06:08:44 AM »
జై సాయి మాస్టర్,

మాస్టర్ గారు సత్సంగాల విషయం చెపుతూ " చాలా సింపుల్ గా ఉండాలి. ఎవరి దృష్టి మన మీద పడకూడదు. చాలా నిరాడంబరంగా , క్రమశిక్షణ గా సత్సంగాన్ని జరుపుకోవాలి. నిజంగా మనం బాబా బిడ్డలమైనప్పుడు, చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఏ మాత్రం తప్పు చేసినా చూడు, వీళ్ళు బాబాసేవ చేస్తామంటూ ఇలా ప్రవర్తిస్తున్నారు అని వేలెత్తి చూపిస్తారు కాబట్టి మన ప్రవర్తన చాల నిర్దుష్టంగా ఉండాలి."

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #11 on: April 27, 2016, 09:38:08 AM »
జై సాయి మాస్టర్,

" బాబా నిన్ను రెండు పైసలు అడుగుతున్నారు. ఇవ్వలేవా? కోట్లు, లక్షలు అడగటం లేదు. శ్రద్ధ, సభూరి, ఈ రెండు పైసలు ఇవ్వలేవా?"

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #12 on: April 28, 2016, 08:13:46 AM »
జై సాయి మాస్టర్,

" గురువు ను చేరాలంటే మనిషి చాలా కష్టపడాలి. ఎంత కష్టపడాలో మిలారేపా చరిత్ర చదివితే తెలుస్తుంది".

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #13 on: April 30, 2016, 08:31:22 AM »
జై సాయి మాస్టర్,

" అమ్మా ! బాబా కలలోకి రావడమే అదృష్టం. అలానే పారాయణ చేస్తుండు. మనకు భారత భాగవతాలు చెప్పేవారు ఎవరూ లేరు. అవి చదివితే ఎట్లాగో ఈ పుస్తకం చదివితే కూడా అంటే ఫలితం వస్తుంది. ".

జై సాయి మాస్టర్.

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: ఆచార్యుని అమృత వాణి
« Reply #14 on: May 03, 2016, 07:54:01 AM »
జై సాయి మాస్టర్ ,

ఒక సారి మాస్టర్ గారు త్వరిత గతిన నడిచే విధానం గురించి చెప్పారు. " యోగులు పాదచారులై తిరిగే వారు. పాద లేపనాలు పూసుకొని మాత్రం కాదు. నడక లో ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ని కరెక్ట్ గా పట్టుకోగలిగితే అది త్వరిత గమనమే గాక శరీరానికి, మనసు కి కూడా సాధన గా మారుతుంది. చాలా తేలిక గా శరీరం గమ్యం చేరగలుగుతుంది. "

జై సాయి మాస్టర్.