Author Topic: అద్వైతం గురించి కొన్ని ప్రశ్నలు  (Read 2432 times)

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారికి సాష్టాంగ ప్రణామాలు.

"త్రిపుర రహస్య జ్ఞాన ఖండ సారం" అని శ్రీ రమణాశ్రమం వారిచే అచ్చు వేయబడిన పుస్తకంలో ఉన్న దాన్ని అర్ధం చేసుకోవడానికి నేను "ధ్యాన యోగ సర్వస్వం" చదువుతూంటాను. మాస్టారు అద్వైతానికి వ్యాఖ్య రాశారా అనిపిస్తూంటుంది.

ఒక చిత్రమైన ప్రశ్న ఈ సందర్భంగా నా మనసులోకి వచ్చింది.

"ఈ జగత్తంతా చిత్తు యొక్క విలాసమే అయితే లేదా "బ్రహ్మ" కి వచ్చిన కలలో మనమంతా పాత్రధారులమే అయితే ఆ కల ముగియగానే జగత్తు అంతరిస్తుంది కదా. ఇంకా జీవుడు ముక్తికి ఎందుకు ప్రయత్నించాలి?

నీ స్వరూపం ఎప్పుడూ "ఆత్మ". ఈ "ఆత్మ" తనకి ఉన్న స్వేచ్చ చేత ఈ జగత్తుని తనలోనే ప్రకాశింప చేస్తూంటే ఆ ఆత్మ మళ్ళీ తనకుండే అపరిమితమైన స్వేచ్చ వల్ల ఆ జగత్తుని తనలో లయం చేసుకుంటూంటే నేను ప్రత్యేక ప్రయత్నం ద్వారా నా స్వరూపాన్ని ("ఆత్మ"ని) ఎందుకు తెలుసుకోవాలి?
దయచేసి తెలియ చెయ్యగలరు. ఒక వేళ నేను అర్ధం చేసుకోవడం లో లోపం ఉంటె వివరించగలరు.

ధ్యాన యోగ సర్వస్వం లో పేజెస్ 35-36 నుంచి వచ్చిన ప్రశ్న ఇది
« Last Edit: November 18, 2015, 09:51:49 PM by kittulahri »

G.Sudhakar

 • Guest
సృష్టి వేరు జగత్తు వేరు

సృష్టి ప్రళయ సమయములో బీజ రూపములో ఉంటుంది పరమాత్మ యందు. సృష్టి అంటే ఇంతకుమునుపు లేదని కాదు. తిరిగి ప్రకటము చేయడమే సృష్టి. ఇది గురుచరిత్రలో చెప్పబడ్డది. ఇంతకు మించి సృష్టి తత్వము చెప్ప సాధ్యము కాదు. 

పరబ్రహ్మ అనుభవము కానిదంతా జగత్తు. జగత్తంటే కామ క్రోధాది అరిషడ్ వర్గ రూపానికి నెలవు కా గలిగినది. ఇది ఎప్పుడూ లేదు. ఉన్నట్లు అనిపించడము మిధ్య మాత్రమే. జ్ఞానముతో ఉన్నదంతా పరబ్రహ్మమే అనీ జగత్తు అసలు లేదని తెలుస్తుంది.     
 

G.Sudhakar

 • Guest
సృష్టి తత్వము ఇక్కడ చెప్పబడ్డది. త్రిపురా రహస్యము ఇదే, గాయత్రీ రహస్యము ఇదే (ఇది ఎందుకు రాస్తున్నానో నాకు తెలియదు) : G.Sudhakar

 • Guest
ఉన్నదంతా పరబ్రహ్మమే, కామక్రోధాది అరిషడ్వర్గాలు అసలు లేవు.

జీవాత్మ వేరు పరమాత్మ వేరు.

జీవుడంటే భయము. అది ఉన్నది కదా? అందుకు తెలుసుకోవాలి. కనుక ముక్తికై ప్రయత్నించాలి. ప్రత్యేక ప్రయత్నము కావాలి.

ప్రకృతి పరమైన అహంకారము వేరు అహంబ్రహ్మోస్మి అహంకారము వేరు. బ్రాకెట్ లోని ఆత్మ ఇక్కడ ప్రకృతిపరమైన అహంకారము సూచిస్తుంది.

ఆత్మను తెలుసుకోవడము ఎంతో కష్టమైన విషయము. అనాత్మను ఆత్మ గా భ్రమించే వీలుందనే "అంధగోళాంగూలన్యాయము" అని ఒక న్యాయము ఉన్నది. తర్వాత రాస్తాను, తెలుసుకోవాలని ఉంటే.

G.Sudhakar

 • Guest
ఆత్మే జీవాత్మ, ఆత్మే పరమాత్మ. అయితే శుద్ధి కాకుండా, జీవాత్మ, పరమాత్మ వేరు అని చెప్పాలి.

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
సుధాకర్ గారు..మీరిచ్చిన సమాధానాలు చూసాను..

నా ప్రశ్నఇంకా వివరించడానికి ప్రయత్నం చేస్తాను..

నాకు ఒక కల వచ్చింది అనుకుందాం.. ఆ కల కి సంబంధించినంత వరకూ నేను వేరే ఏదో నాలోనే  చూస్తున్నాను..ఉదాహరణకి ఆ కలలో ఏవో పాత్రలు ఏమైనా చేసినా..మెలకువ వచ్చాకా నేను ఆ కలలో నాకు వచ్చిన పాత్రలని ఏదో చెయ్యాలని ఆశించను కదా మరి ఈ జగత్తంతా చిత్తు యొక్క విలాసమే అయితే లేదా "బ్రహ్మ" కి వచ్చిన కలలో మనమంతా పాత్రధారులమే అయితే ఆ కల ముగియగానే జగత్తు అంతరిస్తుంది కదా. ఇంకా జీవుడు ముక్తికి ఎందుకు ప్రయత్నించాలి?

మాస్టారు గారు ఇచ్చిన ఉదాహరణె తీసుకుందాం సినిమా తెర మీద రకరకాల చిత్రాలు వచ్చి పోతూంటాయి.. లేదా "పలక"  ఉదాహరణ తీసుకుంటే A అనే దాంట్లో ఉన్నదే B అనే దాంట్లో ఉంది..అయితే "పలక" లో విభాగాలు ఉన్నాయా? లేవు..అంటే ఈ జగత్తంతా ఆ "చితి" లోనే భాసిస్తోంది..ఇది చూసి నా ప్రశ్నకి సమాధానం చెప్పవలసింది

G.Sudhakar

 • Guest
మీరు చెప్పినది సరిగ్గానే ఉంది. అందుకే "అహం కర్తా" అన్న కర్తృత్వ అభిమానము ఉండకూడదని చెప్పబడ్డది. అయితే మీరు చెప్పినది కర్తృత్వ అభిమానము పోవడానికి, లేక ఆయన మనలో ఉండి నడిపిస్తాడు అని పట్టుదలా ధైర్యము ఇచ్చి నడిపించడానికి అయితే ఫర్లేదు. అసలు మీరు చెప్పినట్లు కూడా ఆలోచిస్తే ఇలా అలోచించగలము కూడా. 

అయితే మీరు చెప్పినట్లు ఆలోచించి చేసే పనులన్నీ ఆ పరమాత్మకి అంకితము చేస్తే సరే. కానీ మీరు చెప్పినదాని తత్వము పూర్తిగా అర్ధము చేసుకోకపోతే అప్పుడు ఈ సమస్యలు వస్తాయి. అంటే కొంత మాత్రమే ఆలోచిస్తే:

1. అంతా ఆత్మ/పరబ్రహ్మము అని పని చేయకపోవడము (పనులు అంకితము చేయడము కాదు) గురించీ మాస్టరు గారు చెప్పారు ప్రవచనములలో. ఆకలైతే మాత్రము ఇడ్లీయో కాఫీయో అంటామా? పరబ్రహ్మమా ఇడ్లీ అనాలి ఇస్తే తినాలి లేకపోతే లేదు...ఇలా చెప్పారు. మరి నిజంగా అలా ఉండచ్చా? ఉండచ్చు. బాబా చరిత్రలో బాబా 12 సంవత్సరాలు కేవలము వేపాకు తిని సద్గురు చింతలో ఉన్నామని చెపారు. 

మీరు చెప్పినట్లు చింతిస్తూ అలానే ఉండగలరా? అంతటి భావము ఉంటే మంచిది. 


2. "సర్వసాక్షియైన ఆత్మయే సత్యము. దానిని గుర్తిస్తూ మనస్సుని నిగ్రహించినవాడే ధన్యుడు" ఈ వాక్యము లీలామృతములో వస్తుంది(http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=9)

ఇందులో పై విధముగా చెప్పిన వాడు చివరకు ఆకలిదప్పులతో తిరుగుతూనే ఉంటాడు. మీరు చెప్పినదానికి, దీనికి గల సంబంధము గమనించగలరు.

గురువుకి సర్వ సమర్పణ చేసుకోవాలన్న బాబా పద్ధతే సరి అయినదని చివరకు తేలుతుంది. మనము నామ రూపాలతో ఉన్న ఈ ప్రపంచములో ఉన్నాము. కనుక ఆత్మ రూపి అయిన సద్గురువుని ఆశ్రయైంచటమే ఉత్తమమైన పద్ధతి.

3. అంధగోళాంగూలన్యాయము చెప్పినట్లు అనాత్మను ఆత్మ గా భావిస్తాము, నష్టపోతాము, సద్గురు అనుగ్రహము లేకపోతే. సాయి సన్నిధి లో కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివి ఆత్మ విచారణ చేయమని చెప్పడము బాబా పద్ధతి కాదని చెప్పారు (http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Sai-Sannidhi&page=193). గురుచరిత్రలో మరణ సమయములో సామాన్యులకు ఉర్ధ్వగతులలో మనస్సు లయము చెందుతుందని చెప్పబడ్డది. జీవి మరణసమయములో ఏది తలుస్తే అదే పొందుతాడని చెప్పబడ్డది. మరి ఆ సమయములో శరీరము నశించేప్పుడు కూడా ఆత్మ విచారణ చేస్తూ మీరు చెప్పిన భావాన్ని అంటి పెట్టుకోగలమా? అంతెందుకు 1, 2 రోజులు పూర్తి ఉపవాసము ఉండది. ఇప్పుడు చెప్పండి మీ భావము మీకు ఇంకా నిలిచే ఉన్నదా?

4. అందుకే లీలామృతములో చెప్పినట్లు ప్రపంచలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల, మహనీయుల, అనుభవాలసారమంతా అందులోనే ఉన్నది: (http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?chapter=9)

ధ్యానయోగసర్వస్వములో చెప్పినట్లు సాధనలోని రహస్యము మనస్సు సర్వకాల సర్వావస్తలలోనూ ధ్యేయరూపమై ఉండాలి. ఈ పద్ధతి కి గ్యారెంటీ/పూచీ ఉన్నది. జీవితకాలమంతా చేసేది.

5. అయితే ఇంతకంటే గొప్పది అకర్తృత్వ భావము (http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Sai-Sannidhi&page=194)

mca.teja

 • Jr. Member
 • **
 • Posts: 57
 • Akkala Kota swami vari padhukalu
  • View Profile
jai Sai master

@ kittulahri garu
i understood  your doubt , but  i dont have  correct answer , i too have these type of doubts, "anni neane chesedi neane "  ani baba cheppinadaniki
mari neanu yadduku cheyali ,yami cheyali , cheyaka pothe yami avutundhi,baba nu yandhu ku poojinchali ,preminchali, baba naa problems yandhu ku solve cheyali ela chala questions vastaye
I think it is just like pacheesu aata(Gavvala aata) pande varaku repeat ga adutu undaTame ani naa opinion .

 hide and seek gamr dantlo pillalu , one find other , but here finding our self ,manamu yavari uuha(chitam)nundi vachamu ,potaamu .
knowing (telusukonatam) anedhi game
Ela tera meedha vachinaTlu  raavaTam poovaTam jarugutune unTundhi Mukti pondina Kuda Saibabala mana Master gari la avadhutala ,but our aim is to find manam yakkadinunchi vastannamu ani neanu anukunTunnanu
if it Correct  ok ,if not please discard