Recent Posts

Pages: 1 ... 8 9 [10]
91
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

తాతగారు ప్రతిరోజూ కొంతమంది భక్తుల ఇళ్లకు వెళ్లి వారి అవసరములను బట్టి దీవించుచూ వారి కష్టములను తొలగించుచూ అనేక విధములుగా వారిని ఆనందపరచుచుండిరి . ఈ సంఘటలన్నియు సందర్భానుసారము  వివరింపబడినవి . ఇట్లు రెండు  రోజులసప్తాహ కార్యక్రమము పూర్తయ్యి మూడవరోజు కూడా నిర్విఘ్న్వముగా సాగుచుండగా రాత్రి 10. నిమిషములకు తాతగారు తమ పర్యటన ముగించుకు వచ్చుసరికి హఠాత్తుగా కారుమేఘములు కమ్మి కుంభవృష్టి వాన మొదలాయెను . సప్తాహమునకై వేసిన గుడారములన్నీ తడిసిపోయి నీరంతా లోపలకు ప్రవేశించు ప్రమాదమేర్పడినది . అప్పుడు తాతగారు గర్జిస్తూ చెమటలు పట్టగా అనేక సంకేతములనిచ్చిరి .  ఆ రకంగా కేకలు వేస్తూ సప్తాహ ప్రాంగణమంతా కలియతిరుగుతూ కొంతసేపు ఆ రకంగా చేయగా కుండపోతగా పడిన వర్షము తగ్గి చిరుజల్లు మాత్రము పడుచున్నది . భక్తులందరూ సంతోషముగా తాత దరిచేరి ప్రకృతిని శాసించిన విధమును గూర్చి చర్చించుకుంటుండగా హఠాత్తుగా ఒక భక్తుడు తాను గాంచిన అద్భుత దృశ్యమును అక్కడున్న వారందరికీ తెలిపెను . అదేమనగా చిరుజల్లుగా పడుతున్న వాన ఒక్కచుక్క కూడా తాతగారిపై పడకపోవడం ఆ భక్తుడు గమనించి ఆశ్చర్యానందములతో   తాత తలమీద చేయిపెట్టి చూడగా నిజముగానే అక్కడ ఒక చుక్క నీరు పడుటలేదు . తాత చుట్టూ చేరిన భక్తమండలి మాత్రం ఆ వానజల్లులో తడుచుచుండిరి . ఈ భక్తుడు విషయము చెప్పగనే అప్పటివరకు ప్రకృతిని శాసించి వానను ఆపిన తాతశక్తికి మైమరచుచుండగా ఇప్పుడు ఈ దృశ్యమును కన్నులారా గాంచి తాత కృపాదృష్టిలో అందరూ తడిసి ముద్దయిరి . ఆందరూ ఆనందపారవశ్యములో " అవధూత రామిరెడ్డి తాత మహారాజ్ కీ జై " అని జయజయ ధ్వనులు చేసిరి . కొంతసేపటి పిదప తాత బయటకు వచ్చి నిలిచి ఆకాశం వైపు చూచుచూ బిగ్గరగా అరువగా వెంటనే ఆ వానజల్లు కూడా ఆగిపోయి ఆకాశం ప్రకాశవంతమైనది .  ఈ దృశ్యమును గాంచిన ప్రతి  భక్తునకు షిరిడీలో తుఫాను రాగా బాబా దానిని ఆపివేసి ప్రజలను రక్షించిన సంగతి మదిలో మెదలగా వారు తాతలో సాక్షాత్ బాబాను దర్శించి తరించిరి . అనేక శ్రమల కోర్చి వారు చేయు నామసంకీర్తన యందు ఎటువంటి ఆపద కానీ ,ఆటంకం కానీ రానీయక తాతగారు సదా వారికి అండదండగా నిలచి  ఈ కార్యక్రమము నిర్విఘ్నముగా జరుగునట్లు కాపాడుచుండిరని అందరకూ తేటతెల్లమైనది . రెండు రోజుల తరువాత కూడా ఈ పరిస్థితి ఏర్పడగా తాత ఈ విధముగానే అదుపు చేసిరి .
 
 
 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 
92
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అనుకున్న శుభ సమయము ఆసన్నమాయెను . తాత వచ్చు రైలు ఆగీ ఆగగానే భక్తజన ప్రవాహం కడలి ముందుకు సాగి ఒకరికంటే ఒకరు ముందు ఆ దివ్యమంగళ రూపమును దర్శించి పూలమాలలు వేయుటకు ఆతురత అపడిరి . మంగళ
 ప్రదాతా ,దివ్యస్వరూపుడు అగు తాతగారు పాదం మోపుట తోడనే దిక్కులు పిక్కటిల్లునట్లు జయ జయ ధ్వానములు చేసి లెక్కకు మించిన పూలహారములను తాత  మెడలో వేసి సాష్టాంగముగా నమస్కరించిరి . తాతగారు కూడా వారి ఆతురతను భక్తిప్రపత్తులను ఆస్వాదిస్తూ మందహాసము చేస్తూ మందగమనము సాగించిరి . భక్తులు ఈ రకమైన ఆనందంతో తెలియాడుచుండగా తాతగారు హఠాత్తుగా " టెంకాయలు ( కొబ్బరికాయలు ) వచ్చినవా ?" అని అడిగిరి . తాత ఇలా ఎందుకు అడిగారో ఎవ్వరకూ అర్ధంకాలేదు . అప్పుడు మధుసూదన్ గారికి సప్తాహములో ధునిలో వేయుటకు విజయరాఘవన్ అను భక్తుని ద్వారా కేరళ నుండి తెప్పించుచున్న 500 కొబ్బరికాయలు కూడా ఆ రైలులోనే రావలసి ఉన్నవను సంగతి స్ఫురణకు వచ్చి తాతగారి సర్వాంతర్యా మిత్వమునకు ఆశ్చర్యచకితులైరి . ఆ విధంగా తాత ఢిల్లీలో తన పాదం మోపుతూనే తన భగవత్ తత్త్వమును చాటి చెప్పిరి . స్టేషను వెలుపల మంగళ వాయిద్యములు ,చక్కని తెల్లని గుర్రములచే కట్టబడి పూలచే అలంకరింపబడిన రథము సిద్ధముగా ఉంచి తాతను వేడుకోగా తాత అంగీకరించి రథమును అధిరోహించి ముందు సీటుపై కూర్చుండిరి . వెనుక సీటునందు సాయిబాబా పెద్ద పటము దానిపై ఛత్రము అమర్చబడియున్నవి . మంగళవాయిద్యములు ,బాణాసంచాల హోరుతో రాజధాని నగర వీధుల గుండా జైత్రయాత్ర కదులసాగెను . కొంతసేపటికి తాతగారు " ఇక్కడ బాగాలేదు ,అక్కడ కూర్చుందామా " అంటూ రథము వెనుకసీటు అలంకరించిరి . ముందుగా తాతగారు ,వారి వెనుక బాబాగారి చిత్రపటము ఆ సన్నివేశము కడు మనోహరముగా ఉండి భక్తులంతా తమ కోరిక ,శ్రమకు సంపూర్ణత్వము లభించిందన్న ఆనందంతో తేలియాడుతూ సాయినామమును జపిస్తూ " రామిరెడ్డి తాతకీ జై " అనుచూ ముందుకు సాగుచుండిరి . ఈ విధముగా సాగు యాత్రలో దారి పొడవునా వేలాదిమంది జనులకు తాతగారి దర్శన భాగ్యం కలిగినది . ఈ రకముగా రథము సప్తాహ ప్రాంగణము చేరగానే అక్కడ వాతావరణము కోలాహలముగా మారిపోయినది . పురోహితులు వేదమంత్రోచ్చారణములతో  పూర్ణకుంభములతో స్వాగతించగా తాత సభావేదికను చేరి ఆసనంపై ఆశీనులైరి . ఆ రకంగా తాతగారి సమక్షంలో ఆనందోత్సాహములతో సాయినామ సప్తాహము ప్రారంభమయ్యెను .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
93
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

ఢిల్లీ యాత్ర :

అనేకప్రాంతములలో మన రామావధూత గారిచే వివిధ సంస్థలవారు నిర్వహించిన కార్యక్రంమములు ఇంతకు ముందే తెలుసుకున్నాం .  ఈ విధంగా స్వామీజీ ఇప్పుడు ఢిల్లీలో తాతగారి సమక్షంలో కార్యక్రమం నిర్వహించుటకు సంకల్పించి ఢిల్లీ భక్తులను  సమావేశపరచి వారినీ కార్యక్రమమునకు ఉత్సాహపరచిరి . అఖండ సాయినామ సప్తాహ సమితి ,హైదరాబాదు వారి సహకారంతో ఢిల్లీలో నామసప్తాహము నిర్వహించమని ఢిల్లీలోని ముఖ్యభక్తులైన శ్రీ మధుసూదన్ గారు , శ్రీ వికాస్ మెహతా ,శ్రీమతి వందన మున్నగు ముఖ్య భక్తులకు సూచించగా సెప్టెంబర్ 6 ,1991 సప్తాహ  ముహూర్తము నిర్ణయించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
94
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ విధముగా తాతగారు రాక్షసత్వముగా ప్రవర్తించే కిరాతకుల మనసులలో ప్రేమజ్యోతిని వెలిగించి వారిలో మానవత్వము నింపుట ద్వారా వీరిని మనుషులుగా మార్చడమే కాక వారిలో భక్తి బీజములు ,మూఢభక్తి ,స్థిర నమ్మకములను పెంపొందించి వారిని చక్కని మార్గములో నడిపిస్తున్నారు .

ఆ తరువాత రామిరెడ్డి గారి తండ్రి రామకృష్ణారెడ్డి గారు కలగొట్ల గ్రామ ప్రారంభమున కల తన భూమి 11 సెంట్లను తాత మందిరమునకు ఇచ్చిరి . అప్పుడు ఊరివారందరూ కలిసి గర్భాలయము నిర్మించగా కర్నూలు డా . సత్యనారాయణ రెడ్డిగారు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణము పూర్తిగావించి తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటుగా గణేశుడు ,దత్తాత్రేయులవారి  వారి విగ్రహములను కూడా ప్రతిష్ఠించిరి . ఇప్పుడు అక్కడ ప్రతి గురువారము  భజనలు జరుపుటయే కాక ప్రతిష్ఠాపన కన్నా ముందు వరకు ఈ గ్రామ ప్రజలందరూ తాతగారి ఆరాధన దినోత్సవమునకు కల్లూరు చేరి వారందరూ తాతగారి ఆస్థానమందు అన్నదానము నిర్వహిస్తూ తాతపట్ల తమకు గల ప్రత్యేక ప్రేమను ఆ విధముగా తెలియచేసేవారు . అయితే తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపన  జరిగిన సంవత్సరము నుండి కలగొట్ల గ్రామములోనే  తాతగారి చిత్ర పటమును అందముగా అలంకరించిన రథములో నుంచి గ్రామము మొత్తము ఊరేగించగా ఇంటింటా తాతగారికి నీరాజనాలర్పిస్తూ గ్రామ ప్రజలందరూ తమ ఆరాధనా దైవమును కన్నులారా గాంచి తరిస్తున్నారు . ఈ విధముగా తాతగారికి ఆ గ్రామముతో గల అనుబంధము చిరస్ధాయిలా నిలిచిపోయి వారి మంచి చెడులు ,యోగక్షేమములు ఎప్పటికప్పుడు తాతగారు గమనిస్తూ వారికేలోటు కలుగకుండా కాపాడుతున్నారు .


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 
95
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి వీరు అందరూ కలిసి తాత వద్ద నిద్ర చేయుటకు వెళ్ళినపుడు అప్పుడే షిరిడీ ,పండరి యాత్రలు ముగించుకుని వచ్చిన తాతగారికి నిద్రాభంగము కలుగనీయరాదనీ ,బీడీలు అందివ్వరాదనీ రకరకాల ఆంక్షలు పెట్టి తాతగారి అన్న వెంకటరెడ్డి  గారు వీరిని  తాత వద్ద నుంచి బయటకు తాళము వేసుకుని వెళ్లిపోయిరి . తాతగారి పాత ఇంటిలో తాతగారు ఎప్పుడూ ప్రత్యేకముగా ఒకే స్థలములో నిలబడియుండి ఆ స్థలమునకు శక్తినిస్తున్నట్లుగా ఉండేవారు . అందువలన ఆ స్థలమును ఎవ్వరూ తొక్కకుండా పరిరక్షించుట కొరకు ఆ బండపై తాత పాదరక్షలను  చంద్రారెడ్డి ముద్రించెను . ఆ అన్నదమ్ములలో ఒకరైన  నారాయణ అక్కడ తలపెట్టుకుని పడుకోగా పెద్దమద్దయ్య ఆ పక్కన పడుకొని ఉండగా అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి తాతగారు పెద్ద మద్దయ్య ఒడిలో తలపెట్టుకుని పుల్లన్న అన్న వ్యక్తిపై కాళ్ళు పెట్టుకుని నారాయణ దగ్గరగా పడుకొని ఉండడము చూసి ఆనందముతో వీరి ఒళ్ళు పులకరించగా ఎక్కడ కదిలితే తాతకు నిద్రాభంగము కలుగుతుందోనని కదలకుండా పడుకునే ఉన్నారు . కొంతసేపటికి లేచిన తాతగారు వీరిని బీడీ అడుగగా తాతగారు స్వయంగా అడుగుతుంటే ఎలా కాదనగలమని భావించి అమాయకపు భక్తితో తాత అన్నగారి ఆంక్షలను పక్కనపెట్టి తాతగారికి బీడీలను అందించిరి . ఆ రకముగా తాతగారు ఆ రాత్రంతా వారికి ఏకాంత సేవాభాగ్యము కలిగించి వారిని అన్ని విధాలా దీవించి తృప్తి పరచిరి . రాత్రి అన్నగారి ప్రవర్తన వలన చిన్నబోయిన వీరి మనసులను తాత సంపూర్ణముగా తృప్తిపరచిరి . ఆ మరునాడు ఎవరి శక్తి కొద్దీ తాతగారికి వారు పూలదండలూ అవీ తీసుకువచ్చి తాతను పూజించి తమ కృతజ్ఞతలు తెలుపుకొనిరి . అప్పుడు పెద్ద మద్దయ్య వంగి తాత పాదములకు నమస్కరించేటప్పుడు తాతగారు అతని వీపుపై తన మెడలోని పూలమాల తీసివేసారు . అప్పుడతను లేచి నిలబడితే ఆ దండ పడిపోతుందన్న భయముతో కొంతసేపు అలానే ఉండిపోయి ఆ తరువాత నెమ్మదిగా ఆ దండను చేతులలోకి తీసుకుని పదిలముగా ఇంటికి తీసుకువచ్చి భద్రపరచుకున్నాడు . ఇప్పటికీ ఆ దండ అతని ఇంటిలో అలానే ఉంది . సుమారు పదమూడు సంవత్సరములుగా సురక్షితముగా భద్రపరచుకోవడము అతని స్థిరభక్తిని తెలియచేస్తోంది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

96
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అప్పటినుండి మరింత నమ్మకముతో కృతజ్ఞతతో తాతను పూజించే ఈ నిరుపేదల భక్తిని తాతగారుసదా స్వీకరిస్తూనే ఉండేవారు . ఒకసారి వీరు వెళ్లిన సమయానికి తాతగారికి ఎవరో భక్తులు ఐదు గిన్నెల స్టీలు కారేజి నిండుగా భోజనము ,పిండివంటలు నైవేద్యము రాగా తాతగారు వాటిని తాకనైనా తాకకుండా వీరు తీసుకువెళ్లిన చద్దిమూటలోని అన్నము తినుట ద్వారా వీరి ప్రేమను అంగీకరించిరి . తమపట్ల అంత దారుణంగా ప్రవర్తించిన తమ వాళ్ళ గురించి తాతను అడుగగా తాత " వాడే కాళ్ళ దగ్గరకు వస్తాడు " అన్నారు . ఇది జరిగిన కొంతకాలమునకు వీరు రాళ్ళుకొట్టే పట్టాను పొందడము వలన ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు . బండల కంపెనీకి "రామదాసు స్లాబ్స్ " అనీ " రామదాసు మైనింగు " అనీ అన్నింటికీ తాతగారి పేరు లద్దగిరి రామదాసుస్వామి పేరు కలిసి వచ్చేలా పెట్టుకోవడంతో వీరికి బాగా కలిసొచ్చింది . ఎలక్షన్ల సమయములో పాత యజమాని వీరి వద్దకు వచ్చి క్షమించమని అడిగి పాత కక్షలన్నీ మరచిపోయి తన తరపున ఎలక్షన్లలో నిలబడమని అడగడమే కాక వీరిని ధనసహాయము చేయమని అడుగగా వీరు అందుకు అంగీకరించి డబ్బు ఇవ్వడమే కాక అతని తరపున నిలబడిరి . ఆ తరువాత ఈ యజమాని మరణానంతరము అతని భార్య వాళ్లకున్న కొండను ఈ అన్నదమ్ములకే అమ్మివేయడంతో వారు ఆ కొండను రాళ్లు కొట్టి అమ్ముతూ మంచిస్థితికి చేరుకున్నారు . 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
97
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 

                                                  శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఎప్పుడు తాతవద్దకు వాళ్ళందరూ వెళ్లినా రామానాయుడు తాత ఇంటి గుమ్మము వద్ద పెద్ద కర్రను అడ్డుగా పెట్టి కాపలాగా నిలబడి ఉండేవాడు . ఒకరోజు తాతగారు అతనితో ఆ కర్రను ఇవ్వమని చెప్పి దానిని బాగా ఊపి ఊపి ఇతని చేతిలో వేసి మరల తన చేతిలో వేయించుకుని ఆ విధముగా మూడు నాలుగుసార్లు చేసిన తరువాత " చంపుతా " అని రామానాయుడుతో అనగానే చంపు నాయనా అంటూ తలను తాత ముందు వంచి నిలబడగానే తాతగారు ఆ తలమీద నెమ్మదిగా ఆనీ  ఆననట్లు కర్రను తాకించి తిరిగి ఇచ్చేసారు . అప్పటినుండి వారికి ఈ కొట్లాటలమీద ,సంపాదన మీద మనసు వికలమై ఎప్పుడెప్పుడు తాతను చూడాలనే తహతహ ఎక్కువై వీలైనప్పుడల్లా తాతను దర్శించుకుంటూనే ఉండేవారు . తరువాత కేసు ఆఖరు వాయిదాకు వచ్చేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేరము చేసిన నిరుపేదలమైన తాము పశ్చాత్తాపముతో తమ తప్పులను తాత పాదాల వద్ద నుంచి క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్ధించగా తాత " బయట పడతావులే " అని ఆశీర్వదించి పంపగా వీరిపై కేసు అనూహ్యముగా కొట్టివేయబడింది . అంతే ! మొత్తం అందరూ  పరుగు పరుగున తాతను చేరి తమ శక్తి కొలదీ తాతను పూజించుకుని తమకు పునర్జన్మ నిచ్చిన తాతకు జీవితాంతం ఋణపడి  ఉంటామని మనసులో నిర్ణయించుకొని మరలి వెడలిరి .

 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
98
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ గ్రామంలో దుండగులూ ,దుర్మార్గులూ అయినా రెండు కుటుంబములకు చెందిన ఆరుగురు అన్నదమ్ములను తాతగారు మనుషులుగా మలచి వారికి సంఘములో ఒకస్థానము కల్పించిన తాతగారి దయను ఇప్పుడు తెలుసుకుందాము . ఏ గ్రామములోనైతే వారు దురాగతాలు చేశారో ఆ గ్రామంలోనే వారు వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు దయనీయ స్థితిలో నున్న వీరికి తాతగారు మదిలో మెదలాగా కల్లూరులో ఉండే ఈ స్వామిని దర్శించి తమ కష్టాలు చెప్పుకుని స్వాంతన పొందాలని తహతహ మొదలయ్యింది . అయితే 1985-86 ప్రాంతములలో తాత ఎక్కువగా మాట్లాడరానివారు మౌనముగా ఉంటారనీ వారిని మాట్లాడించడము అంత సులభము కాదనీ తెలిసిన వారంతా చెప్పగా ఆ ఆరుగురు ఎలాగైనా తాతను దర్శించి మాట్లాడించి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్న పట్టుదలతో కల్లూరు పయనమైరి . అక్కడ తాతను దర్శించి దూరముగా కూర్చున్న వీరికి గోడకు తగిలించి ఉన్న మాయమ్మ ఫొటోలోని రూపము సరిగా కనబడడం లేదని మనసులో అనుకోగానే అప్పటివరకు మౌనముగా ఉన్న తాత " ఏం సరిగా కానరాలేదా నాయనా " అని అడగగానే తాతను ఎలాగైనా మాట్లాడించాలనుకున్న వాళ్ళ సంకల్పము అప్రయత్నముగా తీరిపోయింది . అంతే ! హత్యాకేసులో ఇరుక్కున్న వీరు అప్పటినుంచి ఎప్పుడు కోర్టు వాయిదాలున్నా మొదటగా తాతను దర్శించి తమను కాపాడమని వేడుకుని కోర్టుకు హాజరయ్యేవారు . అయితే వీరి ప్రాణాలకు ముప్పు ప్రమాదాలు పొంచే ఉన్నాయి .

అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 
99

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
 
 కలగొట్ల గ్రామముతో తాతగారికున్న అనుబంధము అపురూపమైనది . ఆ గ్రామములో లద్దగిరి చినరామదాసస్వామికి 12 సం . ల పాటు నరవాహనమైన హరిజన సుంకన్న ఆ తరువాతి కాలములో అవధూత అయ్యి ఉల్లందకొండ  సుంకన్న -రామదాసుగా మారారు . ఎక్కువగా సూర్య తపస్సు చేసే ఈ అవధూత కక్షలూ కార్పణ్యాలకు వేదిక అయిన కలగొట్ల గ్రామమును వేదికగా చేసుకుని ఆ గ్రామ సరిహద్దులన్నింటిని తన తపోశక్తితో సరిచేయుటయే కాకా ఊరి వారి మనసులలో పరివర్తన కలిగించిరి . లద్దగిరి రామదాసస్వామి పరంపరలోని  వాడగుటచే ఈయనను ఆ గ్రామములోని చిట్రెడ్డి రామకృష్ణారావు గారి కుమారుడు చిట్రెడ్డి  రామిరెడ్డి గారి కుటుంబము సేవించుకునేవారు . ఆ తరువాత కొంతకాలమునకు ఆ గ్రామములోనే  ఆధ్యాత్మిక చింతన ఉన్న రోజాబీ కల్లూరులో ఒక నిజమైన విత్తనము ఉంది . అది మహాపీఠము కాబోతోంది కాబట్టి వెళ్లి దర్శించుకోమని రామిరెడ్డిగారికి చెప్పడంతో వారు వెంటనే బయలుదేరి కల్లూరు తాతను దర్శించుకోమని రామిరెడ్డి గారికి చెప్పడంతో వారు వెంటనే బయలుదేరి కల్లూరు తాతను దర్శించుకు మరలి వచ్చారు . అయితే అప్పటినుండి వీరి మనస్సు కల్లూరుకు లాగడంతో అప్పుడప్పుడు వెళ్లి తాతగారితో అనుబంధము పెంచుకోవడమే కాకా తాత  తల్లిగారు కూడా వీరు లద్దగిరి రామదాసు భక్తులు కావడంతో వీరిపట్ల ప్రత్యేక ప్రేమను చూపించేది . అప్పటినుండి అవ్వ తాతగారిని తీసుకొని కలగొట్ల వస్తూండటముతో  రెండు కుటుంబముల మధ్య ప్రేమాభిమానములు పెరిగాయి . 1973 వ సం . లో రామిరెడ్డిగారి తల్లి కనుమూసే  సమయమునకు ఆ రాత్రి కల్లూరులో తాతగారు తన దిండును అగ్గిపుల్లతో కాల్చేసారు . అది చూసిన అవ్వకు కలగొట్ల పరిస్థితి అర్ధమయ్యి వీరు కబురు పంపక మునుపే తెల్లవారి మొదటి బస్సుకు బయలుదేరి కలగొట్ల చేరుకుంది . అక్కడున్న వారందరికీ తాత లీల అర్థమయి ఆశ్చర్యపోయిరి . ఆ తరువాత కూడా రామిరెడ్డిగారు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు కల్లూరు వెళ్లిపోయారు . అవ్వ వీరి కోసము ఏ సమయములో వెళ్లినా అన్నము ,రొట్టె ,ఉల్లిగడ్డలు ఉట్టిమీద సిద్ధముగా ఉంచేది . ఇక తాతగారైతే వీరు కలగొట్లలో బయలుదేరిన సమయము నుంచి మేడమీదకు వెళ్లి  వీరి రాకకై ఎదురుచూస్తున్నట్లుగా ఉండేవారు . తిరిగి బయలుదేరడము తాత అనుమతితోనే జరిగేది . అందుకు భిన్నముగా ప్రవర్తిస్తే అనుకోని ఆటంకములు ఎదురయ్యేవి . అప్పటికి రెండు మూడు రోజులా నుండి అన్నం తినని తాతగారికి రామిరెడ్డి గారు బతిమాలి ముద్దలు తినిపిస్తే అప్పుడు తాత తిన్న సందర్భములు లెక్కలేనన్ని కలవు . కల్లూరులో తాతగారు కనిపించలేదంటే కలుగొట్లకు వచ్చారని అందరికీ అర్ధమైపోయేది .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
100
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

అయితే తాతగారు ఆదేశించిన 12 సంవత్సరముల కాలము పూర్తయిన తరువాత కూడా అతని బాహ్య ప్రపంచములోనికి వచ్చుటకు అంగీకరించక పోవడమూ ,అటు పిమ్మట కొంత కాలమునకే  అశ్వస్థతకు గురై మరణించటమూ జరిగినది . ఏది ఏమైనప్పటికీ తాతగారి ఆజ్ఞను జవదాటకుండా అంత్య కాలమువరకూ ఆ గదిలోనే ఉండి  అక్కడనుండే భక్తులకు అనేక విషయములు ,సమస్యలపై సూచనలిస్తూ వారి ఈతిబాధలను తప్పించుటయే కాక ,ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన ధన్యుడు అయోధ్యసామి . ఆ విధముగా తాతగారు ఒక సామాన్యవ్యక్తిని సాధకునిగా మలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి అన్ని విధములుగా బాటలు వేయటమే కాక ,అతని అభివృద్ధికి చేయూత నందించిన ఘనత దత్త వేంకట సాయి సమాజమునకు కలిగించిరి . విగ్రహ ప్రతిష్ఠలు ,శంఖుస్థాపనలు చేసిన మందిరములకన్నా ఈ మందిరమునకే అనేకసార్లు విచ్చేసిన తాత ఈ స్థానము నందు ఆధ్యాత్మికోన్నతికి దారి చూపుటయే కాక అనేకమంది భక్తుల సమస్యలనూ ,కర్మలనూ తొలగించి వారిని కష్టముల నుండి తప్పించిన సంఘటనములు ఈ సంస్థానము నందు కోకొల్లలు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Pages: 1 ... 8 9 [10]