Recent Posts

Pages: 1 2 [3] 4 5 ... 10
21
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

భూకంపం :

రక్షణ శాఖలో పనిచేసే ఈమని రామకృష్ణప్రసాద్ గారి అల్లుడు ఉద్యోగరీత్యా గుజరాత్ లో నుండిరి . 2001 వ సంవత్సరము భయంకరమైన భూకంపము గుజరాతు భూమిని అతలాకుతలము చేసినప్పుడు వీరి కూతురు ,అల్లుడు వారి మూడునెలల కుమారుడు అక్కడే ఉండిరి . 14 భాగములుగల వీరి భవనములో ఎదురు ఉన్న 7 భాగములు కూలిపోగా అప్పుడే నిద్రనుంచి మేల్కొన్న వీరు బయటకు వచ్చు మార్గము లేక కిటికీలోంచి జాగ్రత్తగా తప్పించుకుని సురక్షితముగా కర్నూలు చేరిరి . వీరి కంటిముందే వారింటి ముందున్న ఏడూ ఇళ్ళు కూలిపోగా వీరు మాత్రము బ్రతికి బయటపడుటకు కారణము ఇక్కడ తల్లితండ్రులు తాతను స్మరించుకుంటూ తాత సమాధికి నమస్కరించుకుని పిల్లలను క్షేమముగా ఉంచే బాధ్యత తాతపై వేసి వీరు గుజరాత్ బయలుదేరడమే ,అక్కడ గుజరాత్ లో ఆమె పడుకునేముందు సాయిసచ్చరిత్ర పారాయణము చేసుకుని పుస్తకమును తన తలకిందుగనే ఉంచుకుని నిద్రపోయింది . ఈ సంఘటనతో తాతకు బాబాకు బేధము లేదను వారి నమ్మకము మరింతగా స్థిరపడింది . ఈ  రకముగా కుటుంబ సభ్యులందరినీ వేరు వేరు సందర్భములలో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన తాతకు ఏమిచ్చినా తాత ఋణము తీర్చుకోలేమని వారు వినమృలై తెలిపిరి .

                                                             ఓం ఆపద్భాంధవాయనమః

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
22
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
 
సుకృతం :

ఎన్నో అద్భుతములతో దత్తగడ  ప్రజలను అలరించిన తాత హనుమానులు అనే వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టిన విధానము తెలుసుకుందాము . దత్తగడ  కల్లూరునందు చిన్న హోటలు యజమాని కుమారుడు 22 సంవత్సరముల హనుమాన్లు . అతనికి ఏమి జబ్బు చేసిందో ఎవ్వరికీ తెలియదు కానీ మనిషి పూర్తిగా నీరసించిపోయి అతను త్వరలో చనిపోతాడని ఊరి వారందరూ నిర్ణయానికి వచ్చేసారు . ఆ స్థితిలో వారికి తాతగారికి గురించి కానీ ,వారి మహాత్మ్యమును గురించి కానీ ఏ మాత్రమూ తెలియదు . అయితే తాతగారే స్వయముగా ఆ హోటలుకు వెళ్లి "ఎం రోగమైందిరా " అని ఆ అబ్బాయిని పలుకరించి తనకు పంచె కండువా తెమ్మని చెప్పి మరలి వెళ్లిపోయారు . నిత్య దిగంబరియైన తాతకు ఆ పంచె కండువా తెమ్మని చెప్పి మరలి వెళ్లిపోయారు . నిత్య దిగంబరియైన తాతకు ఆ పంచె కండువాలతో పనిలేదు . అయినప్పటికీ అతనిని ఆశీర్వదించ దలచారు కాబట్టే తాతగారు ఆ విధముగా అడిగారు . తాత ఆదేశించినట్లుగనే  ఆ అబ్బాయి పంచె ,కండువా తీసుకుని వచ్చేసరికి తాత ఆ అబ్బాయినే స్వయముగా ఆ పంచె కట్టమని అడిగించుకుని మరీ పంచె కట్టించుకుని ఒక బీడీ తాగించమని  చెప్పగా ఆ అబ్బాయి తాతగారికి బీడీని వెలిగించి ఇవ్వగా తాత కొంత తాను  తాగి  మిగిలినది ఆ అబ్బాయి చేత తాగించారు . అంతే ! ఇక అప్పటితో ఏ రకముగా వచ్చిందో తెలియని రోగము తగినంత తానుగా కరుణించిన తాతగారి జోక్యముతో  మాయమైపోయింది .

                                                             ఓం ఆరోగ్యప్రదాయ నమః

ఆ విధముగా వారి పూర్వజన్మ సుకృతముచే తాతగారే స్వయముగా ఒక బీడీ ద్వారా హనుమాన్ల కర్మను ధ్వంసము చేసి అతనికి ప్రాణభిక్ష నొసంగిరి . అతనిప్పుడు పెళ్ళిచేసుకుని ఇద్దరు పిల్లల్లతో హాయిగా కాలం గడుపుతున్నాడు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
23
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

విషసర్పము :

ఒకసారి దత్తగడ  మందిరములో తాతతో కూర్చొని ఉన్నప్పుడు నరేంద్ర గుప్తాగారు గమనించలేదు కానీ ఒక పాము వీరిని సమీపించింది . అప్పుడు తాతగారు 'ఇక్కడ ఏం చేద్దామని వచ్చావు పో ' అనగానే ఆ పాము నిశ్శబ్దముగా కదిలివెళ్ళిపోయింది . ఆ విధముగా కళ్ళముందే విషసర్పము తాత ఆజ్ఞను పాలించి తోకముడిచి వెనుతిరగడం చూసిన  అక్కడున్న భక్తులందరూ విభ్రాంతి నొందిరి . అంతేకాక మందిరంలో రాత్రిళ్ళు పిట్టలు అరుస్తుంటే " ఏం ఎల్లయ్యా ఇక్కడ కూడానా ,ప్రపంచం మస్తుంది ,వెళ్ళు వెళ్ళు " అని అదిలించేవారు . తాత ఈ విధముగా పలుకరించుట వలన ఆ పిట్టలకు పూర్వజన్మ జ్ఞానం కలిగించి ఇప్పటికైనా మంచితనంతో మెలగమని బోధించినట్లు తెలుస్తోంది . సాయిబాబా కూడా పాము కప్పలుగా  ,జన్మించిన వీరభద్రప్ప ,చెన్నబసప్ప లకు బుద్ధి  సంగతిని మనం సాయి సచ్చరిత్రలో చూస్తాము . ఆ రకముగా నరేంద్రగుప్తాగారి కుటుంబము తమను ప్రాణాపాయం నుండి తప్పించి తమ జాతకమును పూర్తిగా తిరగరాసి తమకు అదృష్టరేఖను ప్రసాదించి తమనీ ఉన్నత స్థితిలో ఉంచిన తాతగారికి ఆజన్మాంతం కృతజ్ఞులై ఉంటామని వినమ్రులై తెలిపిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
24
Dates and Events / Masteru Puttina Roju
« Last post by BSudhakar on October 30, 2017, 10:45:08 AM »
Guru Kutumbamunaku Ee Parva Dinanmuna  saadara pranaamamulu!
Dattavatarulaini Master gariki   puttina rojuna Sahasra Vandanamulu!
Divya Janani Sammukhamuna Saastaanga pranaama mulu!
Talli- Ku Putro jaayetha kwachidapi ku mata na bhaveth!
Babu gariki adarapurvaka abhiVandanamulu!
Vedamma ku veyi namassulu
Guru Bandhuvulaku SubhaabhiVandanalu

Regards
Sudhakar

25
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదు వచ్చిన తరువాత మల్లేష్ ,రాజులు సంగతులన్నీ వివరించి చెప్పగా మిగిలిన సభ్యులు  ఆలోచించి స్వామీజీ సెలవిచ్చిన పనిని ఎవరు పూర్తిచేయగలరని యోచించగా 108 గురుచరిత్ర పారాయణములు చేయుటకు ముందుకు వచ్చిన శైలజ  బాధ్యతను స్వీకరించుటకు సిద్ధపడడమే కాక అతి తక్కువమంది కలిగిన సభ్యులతో సాయినామ ఏకాహములు నెలకొకసారి వహించు బాధ్యతను కూడా చేపట్టింది .  ఆ రకముగా కేవలము పదిమంది కూడా లేని సభ్యులతో రాత్రింబవళ్లు ఏకాహము పూర్తిచేయుట మాటలు కాదు . అయినా ఈ పనిని ఆమె ఎంతో శ్రద్ధగా నిర్వహించింది . నియమ నిష్ఠలతో  కూడుకున్న గురుచరిత్ర పారాయణ బాధ్యత స్వీకరించిన శైలజ కొంత వ్యవధి తీసుకున్నటప్పటికీ కబూతర్ ఖానాలోని తాతగారు ప్రతిష్టాపన చేసిన మందిరములో 1994 సం . లో 49 రోజుల సప్త సప్తాహ కార్యక్రములో ఈ గురుచరిత్ర పారాయణ ప్రారంభించి ప్రతిరోజూ ఒక్కొక్క పారాయణము చొప్పున రోజుకొక పారాయణము ప్రారంభించినది . 49 రోజులనుకున్న భజన కార్యక్రమము 108 రోజులకు పొడిగింపబడడంతో ఈమె పారాయణలకు భంగం కలుగకుండా అఖండముగా 108 పారాయణములు కొనసాగించింది . అయితే ఆఖరి 15 పారాయణములతో 14 పారాయణములను ఏ స్వామీజీ అయితే తనకు ఈ బాధ్యత నిచ్చారో  స్వామీజీ సన్నిధియైన చావడిలో పూర్తిచేసుకుని ఆఖరు పారాయణను తమ మాట మన్నించి ఆమెకు ప్రాణభిక్ష నొసగిన సాక్షాత్ దత్తస్వరూపుడైన తాత సమాధి వద్ద పూర్తిచేయుట ద్వారా  గురుదీక్షను విరమించింది . తాత ప్రసాదించిన ఆ ప్రాణభిక్ష శక్తితో  మందిర శంఖుస్థాపన ,విగ్రహ ప్రతిష్ఠలు ,భజన కార్యక్రమములను  ఎత్తున జయప్రదముగా నిర్వహించ గలుగుతున్నది .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


26
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

అంతేకాక స్వామీజీ వీరితో 108 గురుచరిత్ర పారాయణములను ,సాయినామ ఏకాహములను చేస్తే పరిస్థితి పూర్తిగా అనుకూలిస్తుందని  చెప్పి ,ఊదీ ,తీర్ధముల నిచ్చి ఆమె ప్రాణరక్షణకై వచ్చిన వీరి  రక్షణ బాధ్యత తాను  వహించిన స్వామీజీ బాబ్రీ మసీదు గొడవలతో అల్లకల్లోల్లముగా నున్న దేశ పరిస్థితులను కూడా దృష్టిలో నుంచుకొని తిరుగు ప్రయాణములో వీరికెటువంటి ఇబ్బందులూ ఎదురుకాకూండా తగు జాగ్రత్తలూ ,సూచనలూ ఇచ్చి వీరిని హైదరాబాదు పంపించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
27
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మనము ఇంతకుముందు చూసిన  అనేక సందర్భములలో ఒకరి విషయములో కుటుంబ సభ్యులు తప్ప వేరొకరు కలిగించుకుంటే ఈ కర్మ సిద్ధాంతములో దానిని అంగీకరించని తాత ,ఈ విషయములో మాత్రము  వీరి కోరికను మన్నించారంటే వారు ఆమె పట్ల స్వచ్ఛమైన మనసు ,కలిగి ఉండి త్రికరణ శుద్ధిగా ఆమెను తల్లిగా భావించడమూ ,నేటి ఆమె స్థితికి ఎంతగానో ఆందోళన చెందడమే కారణము . మనచుట్టూ పరిచయస్థులు  ,మనను  ప్రేమించేవారు అనేకమంది ఉండవచ్చు కాక ,కానీ  క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలిచి నేనున్నానని బాధ్యత వహించేవారే నిజమైన అభిమానులు . ఆమెపట్ల ఈ భావన కలిగిన వీరికి ప్రేమను వెల్లడి చేయవలసి వచ్చినపుడు వారు స్వచ్ఛముగా ఈ బాధ్యతను వహించిరి . ఆ విధముగా ఎంతో బాధ్యయుతముగా తాతగారిని హైదరాబాదు ఆమె ఇంటికి తీసుకువచ్చి తాత తప్ప శరణు లేడని ప్రార్ధించగా తాతగారు ఆమెను సమీపించి కేవలము  కరుణాదృక్కులు ఆమెపై కురిపించి వారి ఆతిధ్యమును స్వీకరించి మరలివెళ్లిరి . తాతగారిని తిరిగి కర్నూలుకు తీసుకువెళ్ళినపుడు రాజు ,మల్లేష్ లు ఎంతో ఆతృతగా తాతగారిని ఆమెకిక ఏమీ ఫరవాలేదా అని అడుగగా తాత చిరునవ్వే వారికి సమధానమైనది . తాత చర్యలలోని అంతరార్ధము తెలిసిన వారైనప్పటికీ ,ఆందోళనతో నున్న వీరికి గండము నిజముగనే గడించినదా లేదా అన్న భయము మాత్రము  వీడలేదు . ఇది తాతగారి శక్తిపట్ల ఉన్న అనుమానము కాక ,ఈ విషయములో తాతగారు ఎంతవరకు బాధ్యత స్వీకరించారో నాన్న భయము వారిని వెంటాడసాగినది . అయితే హైదరాబాదు తిరిగి వచ్చిన వీరికి ఆమె పరిస్థితిలో కొట్టొచ్చిన మార్పు కనిపించి కనిపించి  జీవకళ ప్రారంభమైంది  అని అర్ధమయ్యింది . అయితే ఇంకా ఆతృత తగ్గని వీరు ఈ విషయమును స్వామీజీకి తెలిపి వారి ఆశీస్సులు కూడా పొందుటకు రాజు కారులోనే షిరిడీ వీరు స్వామీజీకి సంగతినంతా వివరించగా స్వామీజీ ' తాత వచ్చి వెళ్లారు కదా ఇక భయములేదు ' అని ధైర్యమునిచ్చిరి . అయినప్పటికీ మల్లేష్ కు ఇంకా ఆతృత  తగ్గక వీరికి ధైర్యం చెప్పడానికే స్వామీజీ అలా తెలిపారా  నిజముగా గండము గడిచిందా అను అనుకుంటూ ప్రతినిత్యం చావడిలో భజన చేసే స్వామీజీ ఆనాటి భజనలో ఫలానా పాట  పాడితేనే  ఈ గండం నిజముగా గడిచినట్లు లేనిచో కానట్లు అని తలచి చావడిలో కూర్చుని ఉండగా ఇతని మనసులో ఉన్న భావము గ్రహించినట్లుగనే స్వామీజీ అదే పాటను పాడి అతని మనసుకు ధైర్యమునిచ్చిరి . 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

28
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ప్రాణదానం :

1992 సం . డిసెంబరు మాసములో  సాయినామ సప్తహ సమితిలో ఎవరినైతే మల్లేష్ తల్లిగా భావించాడో ఆమె ఊహించని విధముగా అనారోగ్యము పాలైంది . ఏమి జబ్బో కూడా తెలియని స్థితిలో పరిస్థితి పూర్తిగా విషమించి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది . ఇక భగవంతుని రక్షణ కరుణలు మాత్రమే ఈమె ప్రాణములు కాపాడగలవు తప్ప ఏ మందులు ఏమి చేయలేవని అందరూ ఏకాభిప్రాయమునకు వచ్చిరి . ఒక్క మల్లేష్ కాక ఆమెతో ఇదే అనుబంధమున్న షిరిడీ సాయి సేవా సంస్థ రాజు తీవ్రముగా ఆలోచించి పరిస్థితిని ఏ విధముగా అదుపు చేయాలో అని యోచించి తాత తప్ప ఈ స్థితి నుంచి బయటపడవేయువారు ఇక ఎవ్వరూ లేరని తెలుసుకున్నవారై ఎంతో ఆతృత ,ఆందోళనలతో తాతను చేరి సంగతినంతా విడమరచి చెప్పగా తాతగారు ఎంతకూ అంగీకరించరైరి . అయితే ఇటువంటి విషయములలో ముందునుండీ అవగాహన కలిగిన మల్లేష్ పరిపరి విధముల తాతను ప్రార్ధించగా ఎప్పటికో అంగీకరించిన తాత రాజు కారులో బయలుదేరిరి . తీరా బయలుదేరిన తరువాత కారును హైదరాబాదువైపుకు కాక నంద్యాల మార్గము పట్టించిరి .  క్షణ మొక యుగములా ఉండగా తాతను ప్రసన్నులను చేసుకుని మరల వేడుకోగా అప్పుడు ఇక తాతగారు ఎటువంటి అభ్యంతరమూ తెలుపక తిన్నగా హైదరాబాదు చేరిరి .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
29
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

వెన్నునొప్పి :

ఒకానొక కుటుంబములో భార్య ,భర్త ,ఇద్దరు పిల్లలు కలరు . తండ్రి సంపాదనయే ఆ కుటుంబమునకు ఆధారము . పిల్లలు చిన్నవాళ్లు కావడం వలన ఆ తండ్రి కుటుంబ పోషణకై పార్టు టైం ఉద్యోగంలో టైపిస్టుగా చేరాడు . అటు ఆఫీసు ,,ఇటు ఈ ఉద్యోగమూ కొంతకాలమునకు అతనైకి మోయలేని భారము కాగా తీవ్రమైన వెన్నునొప్పికి గురైనాడు . రానురాను నెప్పి అధికమై వెన్నుముకను  పూర్తిగా లేపి తిన్నగా నిలబడలేని స్థితికి చేరుకున్నాడు . అతనికేమైనా జరగరానిది జరిగితే అన్న ఊహే ఆ కుటుంబము భరించే స్థితిలో లేదు . అతను దైవభక్తి కలవాడైనప్పటికీ అవధూత సాంప్రదాయముపై అవగాహన ఏ మాత్రమూ లేనివాడు . బంధుమిత్రుల ద్వారా తాతగారి మహిమను ,లీలలను వింటాము జరిగినది కానీ అతనికి తాతశక్తిపై గురి కుదరలేదు  కాబట్టి అన్ని రకాల మందులను వాడుతూ ఎక్కడో అక్కడ తన జబ్బుకు సరిపడా మందు దొరకకపోదు అన్న ప్రయత్నములో ఉన్నాడు తప్ప తాతని దర్శించితే తన జబ్బు నయం చేసుకోవచ్చునన్న ఆలోచనే అతనికి రాలేదు .

ఇటువంటి పరిస్థితులలో అనుకోకుండా అతని సోదరునికి సహాయముగా తప్పని పరిస్థితులలో కల్లూరు వెళ్ళవలసి వచ్చింది . అన్నదమ్ములిద్దరూ వెళుతుండగా శ్రీరామనవమినాడు కల్లూరు గురుస్థానమునకు ఊరేగింపుగా తరలివస్తున్న తాత భక్తజన సందోహము మధ్య దర్శనమిచ్చారు . తాతగారిని గాంచిన ఆనందములో సోదరుడు ఆ నడిరోడ్డుమీదనే తాతకు సాష్టాంగ నమస్కారములు గావింపగా ఈ పెద్దమనిషి మాత్రము తనకేమీ పట్టనట్లు నిలబడిపోయాడు . ఊరేగింపు ఆగడంతో భక్తులందరూ తమకు తోచిన విధముగా వారు తాతను సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు . అయితే తనను చుట్టుముట్టిన భక్తబృందముపై నుండి తాత దృష్టి  దూరముగా నిలబడిన ఇతనిపై పడుట  జరిగినది . దృష్టి  మాత్రముచే కర్మలను ధ్వంసము చేయగలిగిన తాతగారి దృష్టి సోకుటచేతనే అతని వెన్నులో కదలిక కలగడమూ ,క్రమముగా మామూలు స్థితికి రావడమూ జరిగినది . చూసారుగా తాత అపార కృపావృష్టి . అటువంటి కృప అనే వర్షములో అందరూ తడిసి ముద్ద కావలసినదే . ఇంత జరిగినప్పటికీ అతనికి తాతగారిపై ప్రత్యేక భక్తి ప్రేమలు కలుగలేదు . కానీ కాలక్రమములో అతని పిల్లలు తాతకీర్తిని గానం చేయడం ద్వారా తమ కుటుంబమునకు తాతగారు చేసిన మేలుకు తమకు తెలియకుండానే తమ కృతజ్ఞతలను ఆ రూపంలో తెలుపుకున్నారు . ఆ రకంగా అవధూతలకు మన పూజ ,ప్రార్థనలతో నిమిత్తము లేకుండా వారు ఎప్పుడు ఎవరిని కరుణించదలచారో  దానికి తగిన రంగం వారే సిద్ధపరచుకుని ఆ కార్యం నెరవేరేలా చేస్తారని అర్ధమవుతోంది .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
30
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.    గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

ఆ తరువాత సత్యనారాయణ రెడ్డిగారు తాత సంస్థానమునకు కృతజ్ఞతా పూర్వకంగా అపూర్వసేవ లందించిరి . గురుస్థాన్ వద్ద గేటును ,మెట్లను నిర్మించుట వలన భక్తులకు అనుకూలముగా ఉండునట్లు చేసిరి . తరువాత విశేషముగా కృషి చేసి తాతగారి సమాధి మందిరమునకు ధనారెడ్డిగారు మరియు అనేకమంది భక్తుల సహాయ సహకారములతో తాతగారి విగ్రహమును చెక్కించి సమాధి మందిరమునందు వీరి చేతుల మీదుగా ప్రతిష్ఠించిరి . ఎంతసేవ చేసుకుంటున్నప్పటికీ తృప్తి ,శాంతి పొందని వీరు అటు పిమ్మట తన ఆలోచనలను విస్తృత పరచి కర్నూలు పట్టణమందు జరుగు సాయి సత్సంగ్ ల యందు తప్పనిసరిగా తాతగారి పటము నుంచుటయే కాక ,ప్రతినిత్యం తాతగారి లీలలను భక్తులకు తెలియపరచుట ద్వారా ఎందరో తాతను దర్శించి తాత ఆశీర్వాదము వారికి సంపూర్ణముగా లభించుట యందు కీలక పాత్ర పోషించిరి . కల్లూరు నందు తాతగారి విగ్రహ ప్రతిష్ఠను గావించిన స్పూర్తితో వీరు గ్రామ గ్రామమునందు తాతగారి మందిరములు నిర్మించుటకు పట్టణములందు తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపనలు తన చేతుల మీదుగా జరిపించుటయే కాకా తన స్వగ్రామమునందు కూడా తాతగారి మందిరమును నిర్మిస్తున్నారు .
 
 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 
Pages: 1 2 [3] 4 5 ... 10