Recent Posts

Pages: 1 [2] 3 4 ... 10
11
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

అయితే తాతగారు ఆదేశించిన 12 సంవత్సరముల కాలము పూర్తయిన తరువాత కూడా అతని బాహ్య ప్రపంచములోనికి వచ్చుటకు అంగీకరించక పోవడమూ ,అటు పిమ్మట కొంత కాలమునకే  అశ్వస్థతకు గురై మరణించటమూ జరిగినది . ఏది ఏమైనప్పటికీ తాతగారి ఆజ్ఞను జవదాటకుండా అంత్య కాలమువరకూ ఆ గదిలోనే ఉండి  అక్కడనుండే భక్తులకు అనేక విషయములు ,సమస్యలపై సూచనలిస్తూ వారి ఈతిబాధలను తప్పించుటయే కాక ,ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన ధన్యుడు అయోధ్యసామి . ఆ విధముగా తాతగారు ఒక సామాన్యవ్యక్తిని సాధకునిగా మలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి అన్ని విధములుగా బాటలు వేయటమే కాక ,అతని అభివృద్ధికి చేయూత నందించిన ఘనత దత్త వేంకట సాయి సమాజమునకు కలిగించిరి . విగ్రహ ప్రతిష్ఠలు ,శంఖుస్థాపనలు చేసిన మందిరములకన్నా ఈ మందిరమునకే అనేకసార్లు విచ్చేసిన తాత ఈ స్థానము నందు ఆధ్యాత్మికోన్నతికి దారి చూపుటయే కాక అనేకమంది భక్తుల సమస్యలనూ ,కర్మలనూ తొలగించి వారిని కష్టముల నుండి తప్పించిన సంఘటనములు ఈ సంస్థానము నందు కోకొల్లలు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


12
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

స్వామీజీ అయోధ్య అను ఒక యువకుని చేరదీసి అనేక సంవత్సరములు అతనికి ఆధ్యాత్మిక పరమైన సూచనలూ ,శిక్షణనూ ఇచ్చి తరువాత అనసూయమాత సంస్థానము నందు ఇతనిని కొంతకాలము సేవ చేసుకొనుటకు ఆదేశించి అటు పిమ్మట అయోధ్యను దత్తగడ కల్లూరు పంపి ,ఇతని బాధ్యతను ప్రభాకర్ మహారాజ్ ను వహించమని తెలిపిరి . ఆ విధముగా కల్లూరు చేరిన అయోధ్య అక్కడనే ఉండి తన సాధనను ప్రారంభించెను . రామిరెడ్డి తాతగారు దత్తగడకు  వచ్చిన ప్రతిసారీ అయోధ్య ఎనలేని సేవ చేయుచుండెను . ఆ విధముగనే ఒకసారి సేవ చేయుచున్న అయోధ్యను తాతగారు హఠాత్తుగా ఒక గదిలోకి పంపించి 12 సంవత్సరములు అక్కడ నుండి బయటకు రావద్దని సుస్పష్టముగా ఆజ్ఞాపించి అతని సాధన పరాపూర్ణత్వము పొందుటకు మార్గము నిర్దేశించిరి . అతను తాతగారి ఆజ్ఞ ప్రకారము ఆ గదిలోనే తన సాధనను కొనసాగించి అయోధ్య స్వామిగా కీర్తి గడించారు .
                                                    ఓం ఆత్మనే నమః


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
13
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ సంస్థానమునకు మరియొక ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమనగా ప్రతి సంవత్సరమూ దత్తజయంతి నాటికి అనసూయమాత అనేక సంవత్సరములుగా ఈ సంస్థానమునకు వచ్చుచుండయే కాక రామిరెడ్డితాత ,సుభాష్ బాబాలు కూడా ఇక ఏ ఇతర సంస్థానములకూ వెళ్ళనన్నిసార్లు ఇక్కడకు రావడమే కాక వచ్చిన ప్రతిసారీ వారము పదిరోజులనుండి  వేలాదిగా భక్తులు తమను దర్శించి సమస్యల నుండీ , కర్మల నుండీ విముక్తులగుటకు ఈ సంస్థానమును వేదికగా చేసుకొనిరి . ఒక అవధూత ఒక్కసారి పాదము మోపుట తోడనే ఏ ప్రాంతమైనా పునీతమగునని మనకు తెలిసిన సంగతే . ఆ విధముగా అనేకసార్లు ముగ్గురు అవధూతల పాదస్పర్శచే పునీతమైన పుణ్యభూమి 'దత్తవేంకట సాయిసమాజము ' .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
14
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అంతేకాక నామ ప్రచారమే జీవిత ధ్యేయము అనునట్లుగా వందల కొలది భజన బృందములను తయారు చేయుటయే కాక ఆ బృందముల వారు దైవ సంకీర్తన చేసినందుకు ఒక్క పైసా కూడా ఏ రూపములోనూ తీసుకోకుండా కేవలము బాబాపై భక్తితో నామము చేసేలా వారికి శిక్షణ నిచ్చి దేశవ్యాప్తముగా కొన్నివేల భజనలు గావించిన కీర్తి గడించారు . అంతేకాక ఆ ప్రాంతములో ఒక నిక్షిప్త ధుని కలదనీ ,అది ఎంతో పవిత్రమైనదనీ దానికై వెదుకుమనీ స్వామీజీ తెలుపగా వారు ఆ గుట్ట అంతటా వెదకి చూడగా కొండా గుహల మధ్య ధుని తాలూకు నిదర్శనములు కనిపించగా అక్కడ ధునిని పునః ప్రతిష్ఠ గావించుట వలన ఇక్కడి ధుని అత్యంత పవిత్రతనూ ,ప్రాధాన్యతనూ సంతరించుకున్నది . అందుకనే భక్తులెవ్వరైనా  ఒక్కసారి ఈ ధుని యందు  వేసుకున్నచో ఎటువంటి కష్టమైనా తీరుతుందనడంలో సందేహములేదు . కేవలము మందిరము మాత్రమే ఆస్తిగా గల దత్త వేంకట సాయి సమాజము వీరి కృషిచే 80 ఎకరముల విస్తీర్ణము వరకు వ్యాపించి ఆ పొలముపై వచ్చు ఆదాయముతో మందిర అభివృద్ధి కార్యక్రమములే  కాకుండా నిత్యాన్నదానమును నిరంతరమును కొనసాగిస్తున్నారు . ఆ విధముగా స్వామీజీ ఆశ్యములైన నామ సంకీర్తన ,నిత్యాన్న దానములను గత 25 సంవత్సరముల నుండి నిరాటంకంగా అమలు పరుస్తూ ప్రభాకర్ మహారాజ్ గా ఆ పరిసర ప్రాంతముల వారికి గురుతుల్యుడిగా ఉండి  అనేక  ఆధ్యాత్మిక పరమైన సలహాలిస్తూ సాయి పథములో అడుగిడి ముందుకు సాగుటకు తగిన సూచనలిస్తూ ఎందరికో మార్గదర్శకులైరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
15
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥         

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                             

దత్త వేంకటసాయి సమాజము :

బొంబాయిలో పనిచేసే ప్రభాకర్ ఒకసారి షిరిడీ వెళ్ళినపుడు పెద్ద గులాబీపూల మాలను తీసుకుని ద్వారకామాయిలో బాబుకు వేస్తుండగా " పెద్ద దండలు వేయగానే సరిపోదు ,మనసులో ప్రేమ ఉండాలి " అని ఒక సాధువుకు మాత్రము ఈయన జాతకము మొత్తము తెలుసు . ఆయనే శివనేశన్ స్వామీజీ . ఆ తరువాత ప్రభాకర్ గారు తరచు షిరిడీ రావడమూ ,స్వామీజీతో బంధం పెంచుకోవడము ప్రారంభమైనది . అటు పిమ్మట స్వామీజీ ఒకానొక సమయములో ప్రభాకర్ గారిని 11 నెలలు ద్వారకామాయిలో తన సాంగత్యములో ఉండనిచ్చి తగిన శిక్షణ నిచ్చిరి . ఆంద్రప్రదేశ్ లోని నిర్మల్ దగ్గర కల కల్లూరు గ్రామమందు ,ఒక ఎత్తైన గట్టుమీద దత్తాత్రేయల వారి ,వెంకటేశ్వరా స్వామి ,సాయిబాబా విగ్రహములు ఒకే వరుసనందుండి ఒకే మందిరంగా అనాదిగా కొలువ బడుతున్నాయి . అందుకే ఆ ప్రాంతమున 'దత్తగడ '  అని అంటారు . ఈ గ్రామస్థులు ఒకసారి షిరిడీ వచ్చినప్పుడు ఆ ప్రాంత విశేషమును స్వామీజీకి తెలుపగా స్వామీజీ ప్రభాకర్ గారిని అక్కడకు వెళ్లి ఉండమని ఆదేశించుట జరిగినది . ఆ విధముగా ప్రభాకర్ గారు కుటుంబ బాధ్యతలను భార్యా పిల్లలకు అప్పగించి స్వామీజీ ఆదేశం మేరకు దత్తగకల్లూరు చేరి సాయి సేవకు ఉపక్రమించిరి . ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే లేక స్వామీజీ ఆశీర్వాద బలముతో స్వామీజీ ఆశయములను యథాతథముగా అమలుపరుస్తూ తిరుమూర్తులుగా ముగ్గురు స్వాములూ కొలువు తీరిన పుణ్యభూమి కావున " దత్త వేంకట సాయి సమాజము " ను స్థాపించి ఈ సమాజ అభివృద్ధికి ఒంటరిగా ఎనలేని కృషిచేసిరి . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
16
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10.  గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ   గురవేనమః ॥

                                   శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
   
                                     లోకకళ్యాణము
                                అధ్యాయము - 18

శ్రీ గణేశాయనమః  శ్రీ సరస్వత్యై నమః   శ్రీ రామవధూతాయనమః

నిర్వికల్పం నిర్మలారూపం నిజభక్తోద్ధారకం
తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం 

శాన్తో మాహాన్తో నివసంతి సంతః వసంతవత్ లోకహితం చరంతః
శాంతులూ ,మహాత్ములూ ,సాధుజనులూ అయినవారు వసంతమువలె లోకహితము కొరకై ఎల్లప్పుడు తిరుగుచునే ఉందురు .

గంగానది వంటి పవిత్ర నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తమ పవిత్ర పాదములతో తన కంటిన మాలిన్యమును తొలగిస్తారా అని ఎదురు చూస్తుంటుంది . అంతటి మహోన్నత శక్తి మాహాత్ముని పాదాలకుంటుంది . కాబట్టే యోగిరాజైన మన రామావధూత మహారాజు లోకకళ్యాణార్ధమూ ,సహజహితము కోసము దేశపర్యటన  గావించిరి . అందులోని కొన్ని ముఖ్య ఘట్టములను ఇప్పుడు తెలుసుకుందాం .
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
17
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తల్లిపక్షి తన పిల్లలకు ఇతరుల నుండి ఏ ఆపదా కలుగకుండా తన రెక్కల కింద భద్రపరచి ఏ విధముగా కాపాడుతుందో అదే విధముగా తాతగారు తన పిల్లలుగా భావించిన వారిని తన గూడు అయినా రామసన్నిధానమునకు చేర్చి తన చల్లని నీడలో ఉంచి వారిని ఆ కష్టముల నుండి గట్టెక్కించిన వారికి శుభము చేకూర్చేవారు . ప్రత్యేకించి తాతగారు శంఖుస్థాపన చేసిన మల్లాపూరు  షిరిడీ సాయి మందిరములో తలెత్తిన సమస్యలు తీవ్రరూపము దాల్చి పరిస్థితులన్నీ రాజుకు వ్యతిరేకముగా మారి సర్వమూ కోల్పోయి ఒంటరి పోరాటం సాగిస్తున్న అతనికి శంకరయ్యగారు తాత సన్నిధియైన రామసన్నిధానమే అతనికి తగిన రక్షణ స్థలమని సూచించగా ఆ రకముగా అతను తాత గూటికి చేరుకున్నాడు . చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడినప్పుడు కంటికి రెప్పలా కాపాడిన తాత ఇతనికి తల్లి తండ్రీ  అన్ని తానే  అయి పూర్తి రక్షణ కల్పించి ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించి  ఇతనికి అన్ని రంగములలోనూ విజయం చేకూర్చిరి . ఇక రామసన్నిధానములో ఉండే శైలజ ,రామారావు గార్లు రాజు విషయముగా ఎవ్వరెంత  వ్యతికేరించినప్పటికీ అందరికీ ఎదురు నిలిచిరి . రాజు చేత అక్కా అని పిలిపించుకున్నప్పటికీ  శైలజ రాజు పట్ల కన్నతల్లి బాధ్యత వహించి ధునిని ఆధారముగా గొని  అతను తన సమస్యల నుంచి పూర్తిగా బయటపడువరకు అన్నివిధములా అతనికి చేయూతనిచ్చి అతని పట్ల మాతృభావనను సంపూర్ణముగా నెరవేర్చిరి . ఈ విధముగా తిరుమల షిరిడీ వంటి శక్తిపీఠము తయారగుటకు రామసన్నిధానము మూలస్థానమయ్యిందంటే  తాతగారు ఇక్కడ ప్రత్యక్షముగా ఉన్నట్లు స్పష్టపరచి ,షిరిడీసాయి సేవా సంస్థ పట్ల సంపూర్ణ బాధ్యత వహించి ఆ సంస్థను సదా కాపాడి రక్షిస్తూనే ఉన్నారు .
ఆ విధంగా ఎందరెందరో భక్తులను వారి వారి జన్మకర్మల ప్రకారం రక్షించి కాపాడి ప్రాణదానం చేసిన తాతగారి కరుణాకటాక్షం గురించి వివరంగా తెలుసుకున్నాం . కర్మ విముక్తులైన ఆ భక్తులందరూ ఈ జీవితం తాత ప్రసాదించిన భిక్షగా భావించి మిగిలిన జీవితాన్ని తాత సేవకు అంకితం చేయడం తాత భక్తులుగా వారి కనీసధర్మం అని గ్రహించాలి .

                   త్వమేవ సర్వం మమ దేవ దేవ
          పదిహేడవ అధ్యాయము సంపూర్ణము
 
 .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
18
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి.  శైలజ )

  రక్షణ :

ఒకసారి శైలజ కన్యాకుమారి మాయమ్మ స్థానమునకు వెళ్లి అక్కడ ఆ సమగ్ర తీరములో ధునిపూజ గావించి పూర్ణాహుతికి ఒక కొబ్బరికాయను ఆ ధునిలో వేయగా ఎక్కడినుండో వచ్చిన ఒక బక్కపలచని ముసలామె విసురుగా  వచ్చి వీరిని నానా దుర్భాషలాడుతూ మండుచున్న ధునిలో కాలుతున్న ఆ కొబ్బారికాయను తీసి గుండ్రముగా తిప్పి ఒక్కసారిగా విసిరేయగా ఎక్కడో దూరముగా ఎత్తైన ప్రదేశము నుండి ఆ కాయ తిన్నగా వెళ్లి సాగరములో పది కొట్టుకుపోయింది . ఈ హఠాత్పరిణామమునకు  బిత్తరపోయిన శైలజ తదితరులు ఒక్కసారిగా ఆవేశపడినప్పటికీ కొంతసేపటికి విచక్షణ నుపయోగించి  అంత ముసలామె ఆ కాయను నేరుగా దూరములో ఉన్న సముద్రములో పడునట్లు వేయడమంటే సామాన్య విషయము కాదనీ దీని వెనుక ఎదో అంతరార్ధము ఉంటుందనీ అనుకొనిరి . తరువాత యాత్ర ముగించుకు వచ్చిన శైలజకు అసలు సంగతి అప్పుడు తెలిసింది . అదేమనగా ఏ రోజైతే కన్యాకుమారిలో ఆ సంఘటన జరిగిందో అదే రోజు అదే సమయమునకు ఆటలాడుకుంటున్న సన్నిధానము పిల్లలలో ఒకరైన 5 సం . ల వాణి  అక్కడ నిర్మాణములో ఉన్న బావిలో కాలుజారి పడిపోయి ఒక రాయి ఆధారము దొరకగా బిగ్గరగా పిలువగా వాళ్ళతోనే ఆడుకుంటున్న సుమారు 8 సం . ల చిన్నారి అనసూయా తేజస్విని తన ప్రాణములను కూడా లెక్కచేయక నడుము వరకు బావి లోపలకు వంగిపోయి చేయి అందించి ఆ పాపను బయటకు లాగింది . ఈ విధముగా ఎన్నో వందల మైళ్ళ దూరములో దేవి మాయమ్మ ఆ రకముగా ఆ అమ్మాయిని కాపాడింది . ఇంకొక సందర్భములో నాంపల్లి బాబా వద్దకు పిల్లలను తీసుకువెళ్ళినప్పుడు  ఇదే పాప ఆకతాయితనంగా అక్కడున్న కరంటు స్తంభమును పట్టుకోగా షాకుకు గురై మొత్తము శరీరములో ఒక చేయి తప్ప అంతా స్తంభమునకు అతుక్కుపోయి ఆ అమ్మాయి బిగ్గరగా అరిచేసరికి ఉలిక్కిపడి చూసిన శైలజ ఆ పాప అందిస్తున్న చేతిని తానందుకుంటే తాను కూడా ఆ షాకుకు గురై మరణించడము ఖాయమని తెలిసినప్పటికీ కళ్ళముందే ప్రాణాలు పోతున్న పిల్లను రక్షించుటకు ముందుకు వచ్చి ఇక మిగిలిన పిల్లల భారము తాతగారిదే  అనుకుంటూ ఆ అమ్మాయికి చేయి అందించగానే వేయి వోల్టుల విద్యుత్తు  ఒక్కసారిగా ప్రసరించినట్లై  చేతిని వదిలేసింది . ఆ రకముగా మూడుసార్లు జరిగాక చుట్టూ గుమిగూడిన జనము ఏం జరుగుతుందోనని ఆతృతగా చూస్తుండగా నాలుగోసారి శైలజ ప్రయత్నం ఫలించి ఊహించని విధముగా ఆ అమ్మాయిని  స్తంభము నుండి బయటకు లాగగలిగినది . వారు వచ్చినది నాంపల్లి బాబా దర్శనమునకు కాగా అనుకోకుండా అప్పుడు శైలజ చేతిలో సన్నిధానములో తాత పాదుకలపై నుంచి తెచ్చిన కొబ్బారికాయ ఉండడము కూడా ఈ ప్రమాదము  నుండి బయట పడుటకు కారణమైనది . ఆ విధముగా ఇద్దరు అవదూతలూ ఈ ఇద్దరినీ ప్రాణములతో బయటపడవేసిరి . దీనిని బట్టి తాతగారి రక్షా కవచము ,ప్రేమాభిమానములు సంపూర్ణములుగా వీరికి కలవని తెలుస్తోంది .
   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
19
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
మెదడువాపు వ్యాధి :

దత్తగడ  కల్లూరు నందు నివసించే జానీమియా ముస్లిము మతస్థుడైనప్పటికీ బాబాకు కూర్చు భక్తుడు . కొన్ని సంవత్సరములుగా ప్రతి గురువారము తప్పనిసరిగా బాబా మందిరమునకు వచ్చి బాబాను దర్శించుకుని వెళ్ళేవాడు . అటువంటి భక్తునకు ఒక రాకూడని కష్టము వచ్చింది . అదేమనగా అతని కొడుకులలో ఒకరికి మెదడువాపు వ్యాధి వచ్చింది . అయితే డాక్టర్లు మాత్రం అతను బ్రతికే అవకాశం ఏ మాత్రమూ లేదనీ ,అతను కేవలము ఆ రోజు కోసం ఎదురు చూడడము తప్ప మార్గమేదీ లేదని తేల్చి చెప్పారు . అది విని గుండెలు బద్దలైన జానీమియా కనీసం ఆ బాబు బాబా సమక్షములోనైనా  చావనీయమని నిర్ణయించుకుని ఆస్పత్రి నుండి తన 15 సంవత్సరముల జబ్బు కొడుకుతో దత్తగడ  కల్లూరు చేరినాడు . అయితే అతని భాగ్యవశమున అక్కడ ఆ సమయమునకు తాత వేంచేసి ఉన్నారు . తాతను దర్శించిన ఆనందమూ ,దుఃఖముల మధ్య అతను ఆ అబ్బాయిని తెచ్చి తాతగారి పాదములపై పడవేసి నీదే భారమని మిన్నకుండిపోయాడు . ఉదయము నుండి కాఫీ ,టిఫిను లేమీ తినకుండా కూర్చుని ఉన్న తాతగారు సాయంత్రం ఈ అబ్బాయిని తీసుకుని వచ్చినప్పటినుండి ఉగ్రరూపం దాల్చి తన పాదముల వద్ద ఉన్న ఆ అబ్బాయిని నానావిధముల దుర్భాష లాడుటయే కాక కాలితో ఒక్క తన్ను తన్ని " వాని ముందు పెట్టు " అని అబ్బాయిని బాబా ఫోటో ముందుంచమని  చెప్పారు . ఒక అరగంట పాటు తాత ఆ స్థితి నుండి బయటకు రాకుండా వెళ్ళేవరికీ  అసలు జరిగినదేమిటో చెప్పే  అవకాశము కూడా ఇవ్వకుండా కేకలేయసాగిరి . " పుండుందా ,చేసేదేముందిలే ,కర్మ అనుభవించాలి " అని అన్నారు . ఆ సమయములో అక్కడున్న భక్తులందరికీ అరుస్తున్న తాత ముఖములో అంతులేని ఆవేదన ,బాధ ప్రస్ఫుటముగా కనిపించాయి . ఆ విధముగా కొంతసేపు గడచిన తరువాత తాతగారు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్లిపొమ్మని గొడవ ప్రారంభించి అరచి ఉమ్మేసారు . తాత ఇచ్చిన సంకేతముతో ఆ అబ్బాయిని ఊరి పొలిమేర వరకు తీసుకువెళ్లి తీసుకువచ్చారు . తరువాత ఆ అబ్బాయి స్థితి మెరుగుపడింది . ఇక్కడ తాత కూడా శాంత స్వరూపం దాల్చిరి . ఆ విధంగా తాతగారు మృత్యుదేవత తో పోరాడి , ఆ మృత్యువును ఊరి పొలిమేర దాటించి ఆ అబ్బాయి ప్రాణములను రక్షించిరి . బాబా సమక్షంలో చావనైనా చస్తే ఆ కర్మ తప్పుతుందని అనారోగ్యముతో ఉన్న ఆ అబ్బాయిని ఇంత దూరం తీసుకు వచ్చాడో ఆ తండ్రి నమ్మకమును స్థిరపరుస్తూ బాబాకూ తనకూ బేధము లేదని అందరూ గ్రహించేలా చేసి ఆ అబ్బాయికి ప్రాణభిక్ష పెట్టారు . ఆ అబ్బాయి సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఇప్పుడు పిల్లా పాపలతో హాయిగా కాలము గడుపుతున్నాడు . 
  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
20
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

పుత్రభిక్ష :

చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉన్న ఒక అబ్బాయి తన స్కూలు చదువు పూర్తయిన తరువాత చెడు  సావాసాలకు  అలవాటు పడ్డాడు . ఇంటిలోని వారందరూ దైవభక్తి కలవారు మాత్రమే నిత్యం తమ ఇంట సాయి భజనలతో కాలం వెళ్లబుచ్చేవారు . అంతేకాక వారు ప్రత్యేకించి తాత భక్తులు అయినప్పటికీ ఈ అబ్బాయి మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఉండి వీధి గొడవలలో  ఇరుక్కుని తాను చేయని తప్పు తనపై మోపబడి మిగిలిన వాళ్ళందరూ ఈ అబ్బాయి మీదకు మూకుమ్మడిగా కత్తులతో దాడికి దిగగా అప్పుడు ఆ అబ్బాయి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకుని ఆ ఇంటికి ఉన్న పెద్దగేటును మూసివేసి లోపలికి  వెళ్లగా బయట ఆ దుండగులు ఎలాగైనా ఆ పెద్దగేటు తెరుచుకుని లోపలకు ప్రవేశించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు . అప్పుడు ఆ అబ్బాయి మరింత ఆందోళనకు గురై తన ఇంట్లోని వారందరూ సాయిబాబా తాత భక్తులవ్వడం వలన మనసులోనే తాతని ఈ ఆపద నుంచి కాపాడమని వేడుకుని మేడమీదకు వెళ్లి దాక్కుండిపోయాడు . ఈలోగా ఇంటివరకు వచ్చిన ఆ రౌడీలు కొంతసేపు వెతికి గొడవ చేసినప్పటికీ మేడమీదకు దారి ఉన్న సంగతిని గమనించక ఇక చేసేదేమిలేక నీ అంతు తరువాత చూస్తాం అని బెదిరించి వెళ్లిపోయారు . ఈ గొడవతో బెంబేలు పడిపోవడమే కాకా ఆ అబ్బాయి మనసు పూర్తిగా చెదిరిపోయింది . తాను  నిత్యం విమర్శించే తాత తన మొర ఆలకించి తన ఉనికిని ఆ రౌడీలకు తెలియకుండా చేసి వాళ్లకు ఆ విపత్కర సమయంలో మనసు మార్చి వెనుకకు పంపడం చూసి ప్రాణాపాయ స్థితిలో ప్రత్యక్షంగా భగవంతుని ప్రేమను ఆస్వాదించినవాడై తన మనస్సును ఇక భగవంతునిపై మళ్లించాలనే నిర్ణయానికి వచ్చాడు . అదే సరియైన సమయమనీ  వేడిమీద ఉన్నప్పుడే బంగారాన్ని కరిగించగలమనీ తెలిసిన కుటుంబ సభ్యులు అదే రోజు ఆ అబ్బాయిని తండ్రితో సహా కల్లూరుకు వెళ్లి తాత పాదాలను ఆశ్రయించి తాత ప్రాణభిక్ష ఒసగే  వరకు తాత  పాదాలు వదిలేది లేదని వేడు కోమని చెప్పగా కల్లూరు చేరి ఆ రాత్రంతా తాత  పాదాల చెంత గడిపి పుత్రభిక్ష కై వేడుకోగా అప్పుడు తాత ఆ అబ్బాయికి అభయమిచ్చి ఆశీర్వదించారు . ఆ రకంగా తాత ఆ సమయానికి ప్రాణభిక్ష నిచ్చి కాపాడడమే కాక అతనిలో నిజమైన పరివర్తనను కలిగించి అతను సత్ప్రవర్తన అలవరచుకొనేలా అతని మనస్సులో  మార్పును కలిగించారు . తనలో కలిగిన ఈ మార్పు అతని జీవితంలో స్థిరపడేలా చేసి నేడు అతను పిల్లాపాపలతో నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు .

                                           ఓం అజ్ఞానంధకార నిర్మూలాయ నమః
 
             
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !
Pages: 1 [2] 3 4 ... 10