Recent Posts

Pages: [1] 2 3 ... 10
1
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥ 


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము  (షేక్ అలీ )

భారతదేశంలో సూఫీ ధర్మ ప్రచారకుల్లో ప్రధములైన హాజరత్ క్వాజా గరీబున్నవాజ్ 'అజ్మీర్ ' లో నివసించేవారు . వీరిది 'చిస్తియా ' గురు పరంపర . ఈ పరంపరలోని వారు నాగపూర్ నివాసి బాబా తాజుద్దీన్ ,వారి శిష్య శేఖరులు విజయనగరం బాబాగా ప్రసిద్ధి చెందిన హజరత్ కాదర్ బాబావారు .
బాబాజీ కృపకు పాత్రులు కావాలంటే ముఖ్యంగా మూడు నియమాలు పాటించాలి : 1. ఎవరి మనసును కష్టపెట్టరాదు ,2. ఎల్లవేళల భగవంతుని పేరే స్మరిస్తూండాలి ,3. కష్టాల్లో నున్నవారికి చైతనైనంత సహాయం చేయాలి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
2
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

ఇస్లాం లో పుట్టిన సాంప్రదాయంలో సూఫీ సాంప్రదాయం ఒకటి . భక్తి ,జ్ఞాన ,యోగాల సమ్మేళనమే ఈ సూఫీ చూపించే దివ్యమార్గం ,నీతి ,శీలం అనే ఉత్తమ గుణాలతో తన్ను తాను  పరిశుద్ధ మొనర్చుకొని ,బాహ్యాంతర సమన్వయంతో శాశ్వతానందంతో పరవశమొందిన వాడే నిజమైన సూఫీ . సూఫీ సాంప్రదాయం ప్రకారం జీవనం నాలుగు విధాలు : 'ధర్మశాస్త్రం ,ఆధ్యాత్మిక మార్గం ,సాయుజ్యం , సానుభవం . పూర్ణ జ్ఞానంతో ప్రపంచవ్యాప్తమైన భగవంతుని మధించి ఆనందించువాడే అసలు సిసలైన సూఫీ !'


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
3
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

                             శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర (వేము రామ మోహన రావు )

సమర్ధ సద్గురువు నమ్ముకొని సర్వస్య శరణాగతి చేసి వారికి ముక్తి కరతలామలకలము కాగలదు . విశ్వాసంతో కూడిన ఏ పనైనా ఫలితం ఇస్తుంది . అందువల్ల ఆ గజానన మహారాజ్ ఆశీస్సులు పాఠకులకు లభించ గలవనే దృఢ సంకల్పంతో ఈ చిన్ని గ్రంధమును మీముందుంచుతున్నాను . ఇందు ఏ విధమైన తప్పులు ఉన్నయడల శ్రీ గజానన మహారాజ్ ప్రసన్న వదనంతో నన్ను క్షమించి రక్షించవలసి నదిగా ప్రార్ధిస్తూ ,పాఠకుల సమస్యలు పరిష్కరించి వారిని సన్మార్గములో నడిపించి కరుణించవలసినదిగా శత సహస్ర నమస్సుమాంజలు అర్పిస్తున్నాను . పారాయణ చేయు సంకల్పించిన  వారు ఈ చివరి అధ్యాయాన్ని గూడా మరువక ,తప్పక పఠించవలసినదిగా మనవి .

                                  ఓం శాంతి : శాంతి : శాంతి :

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
4
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  2.  యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

                       శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

పుణ్యక్షేత్రాలలో గాని ,మందిరాలలోగాని ,ఇళ్ళల్లోగాని పెద్ద గ్రంధం పారాయణ చేయుటకు అవకాశం లేని వారికి ఈ సంక్షిప్త చరిత్ర కొంత వరకు దోహదపడగలదు . అది నా విశ్వాసం . ఏదైనా ఒక విషయంలో సత్ఫలితం పొందాలంటే తగిన కృషి అవసరం . 'కృషితో నాస్తి దుర్భిక్షం ' అని గదా పెద్దలు చెప్పారు .

సమర్ధ సద్గురువుకు మించిన దైవం లేడని వేదాలు ఘోషిస్తున్నాయి . దేవతలు చేయలేని పని సద్గురువులు చేసిన సంఘటనలు ఎన్నో  . దేవతలకు కోపం వస్తే అది సమర్ధ సద్గురువు నివారించగలరు . కానీ సమర్ధ సద్గురువుకు కోపం వస్తే దానిని నివారించగలవారు లేరు . అందువల్ల దేవతలకన్న గురువు చాలా గొప్పవారు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


5
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

మహాత్ముల చరిత్ర ఏ కొంచెం రాయాలన్నా వారి యొక్క కరుణ ఆశీర్వాదం ఉంటేనే గాని  సానుకూలపడదు . రాసేది మనమే అయినా వ్రాయించేది ఆ సమర్థ సద్గురువే అన్న విషయం గుర్తుంచుకుంటే ఆయనకు కావలసిన విధంగా రాయించుకుంటారు . వారి యొక్క దివ్యమైన ,అమూల్యమైన వాక్కు ,మనన ,శ్రవణాలు ముక్తికి సోపానాలు కాగలవు . నాబోటి అనామకుడికి ఈపాటి సంక్షిప్త చరిత్ర వ్రాయటం దుస్సాధ్యమే . కొన్ని ముఖ్యమని తోచిన లీలలను మాత్రమే తీసుకొని వాటిని మీ ముందుంచుట జరిగినది .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
6
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                      శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము  రామమోహన రావు )

శ్రీ గజాననుల యందు ఎవరికి దృఢ విశ్వాసముంటుందో వారి ఆటంకములు పటాపంచలైపోతాయి . మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతూవుంది . పనిచేస్తూ చేస్తూ ఒక కూలివాడు శిఖరం మీదకు వెళ్ళాడు .  అతడు మేస్త్రికి రాళ్లు అందిస్తున్నాడు . ఒకసారి రాయి అందిస్తు కాలు జారి ముప్పై అడుగుల ఎత్తునుండి కిందపడ్డాడు . అందరు అతను మరణించాడని భావించారు . అంతా అతని వద్దకు చుస్తే అతనికి ఒక దెబ్బ కూడా తగలలేదు , విషయం అడిగితే తన కాలు జారినప్పుడు తనను ఎవరో పట్టుకొని దింపారు అన్నాడు . ఆ కూలివాడు గజాననుల మందిర నిర్మాణం జరుగుతూండగా చనిపోయాడు అన్న నింద స్వామి తనపై వేసుకొనలేదు . అతన్ని రక్షించటానికే కంకణం కట్టుకున్నారు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

7
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                     శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామమోహన్ రావు )

శ్రీ లక్ష్మణ్ హరి రంజల్ కి కూడా ఇలాంటి అనుభవమే కలిగింది . పనిమీద బొంబాయి వెళ్లి వున్నాడు . పని ముగించుకుని బోరుబందర్ కి వచ్చాడు . అప్పుడతనికి ఒక పరమహంస కనుపించారు . ఆజానుబాహుడు ,పొడవైనవాడు ఆయన 'నీవు గజాననుల శిష్యుడవు గదా ,,మరి ఎందుకు ,వ్యాకుల మనస్సుతో ఉన్నావు . నీ ఇంటి వద్ద పుణ్యతిథి రోజున 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశావు . బాపుట్ జీ పుత్ర శోకంతో ఉన్నా భోజనానికి వచ్చాడు . షేర్ కర్ జీ భోజనం చేయలేకపోయాడు ' ఆ విషయం నీకు తెలుసు గదా ! అన్నాడు . ఇవి ఈయనకు ఎలా తెలుసు అనుకొని సంఘటన నుండి తేరుకొని నమస్కరించాడు . వెంటనే స్వామి అదృశ్యమయ్యారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
8
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                                       శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

సమాధి అనంతరం దర్శనం -లీలలు

శ్రీ గజాననులు సమాధి అయిన తరువాత భక్తులు ఇంకా షేగాం లో ఏమి మిగిలింది అనుకున్నారు .మందిరంలో దేవుడు లేనప్పుడు మందిర ద్వారాలకు పూలతో ఏమి పని . ఈ సందేహాలన్ని నిరర్ధకాలని నిర్ధారణ కాబడినవి . ఇంద్రాణి నది ఒడ్డున జ్ఞానేశ్వరులు జీవ సమాధి కాబడ్డారు . అయినా భక్తులు వెళ్ళటం మానేశారా ? గణపతి బోడే అను భక్తుడు ఒకడుండేవాడు . శ్రీ స్వామి సమాధిని ( గజాననులు ) నిత్యం దర్శించేవాడు . కొంత సమయం ఆనందంగా గడిపేవాడు . ఒక రోజు ఒక ఆలోచన వచ్చి రేపు విజయదశమి గదా ! స్వామి సమాధి అభిషేకం చేయించి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం ఏర్పాటు చేశాడు . అది చూసి అతని భార్య ఇదంతా ఏమిటి ? ఇంత డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారు . రేపు విజయదశమి పండుగ పెట్టుకుని పిల్లలకు బట్టలు ,నగలు వగైరా తెండి అంది . తన భార్య వ్యవహారం అతనికేమి నచ్చలేదు . ప్రపంచాన్ని కన్నా పరమార్ధాన్నే ఎక్కువగా మిన్నగా ఎంచేవాడు . అతని భార్యకు స్వామి కలలో  కనిపించి " నీ పతిని ఇబ్బంది పెట్టకు ,నీ పతి శాశ్వతమైన దానిని పొందుట కొరకు ప్రయత్నించు చున్నాడు . నీవో అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావు . నీ వస్తువులు ,ధనము ,ఇల్లు ,చుట్టాలు ,స్నేహితులు ,ఎవరు నీతో రారు . అన్నింటినీ విడచి పరలోకానికి రావలసినదే . ఇప్పుడతను చేసే పని వ్యర్ధంకాదు ' అని చెపారు . తెల్లవారి స్వామి కలలో కనపడినదంతా పూసగుచ్చినట్లు తన భర్తకు వివరించినది . చూశావా స్వామి యొక్క కృప , కాబట్టి నేటి నుంచి అశాశ్వతాలయిన  వాటిని గురించి ఆలోచించకు అన్నాడు . గణపతిరావు భక్తితో పూజించాడు ,అనుకున్న విధంగా సంతర్పణ చేశాడు . వీటికి చాలా ఖర్చు చేశాడు .

                                       
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         
9
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                                  శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

తదనంతరం ఈ విధంగా బోధించారు . నేను వెళ్లిపోయాయని ఎప్పుడు అనుకోవద్దు . భక్తిలో ఏ మాత్రం కోపం రాకుండా చూచుకోండి . నన్నెప్పుడూ మరువద్దు ,నేనెప్పుడూ ఇక్కడే వుంటాను . అంటూనే శ్వాసను యోగంతో బంధించి ప్రాణ జ్యోతిని మస్తికంలో కేంద్రీకరించారు . శాఖ సంవత్సరం పదునెనిమిది వందల ముప్పై రెండు ,సాధారణ నామ సంవత్సర శుద్ధ పంచమీ గురువారం మొదటి జాములో ప్రాణాన్ని నిలువరించే కాలములో 'జయ గజాసన ' అనే పదాలు వెలువడ్డాయట . శరీర చలనం ఆగిపోయింది . భక్తులు శోకిస్తున్నారు . ఈ విషయం నాలుగు దిక్కులా వ్యాపించింది . భక్తులు దర్శనార్ధం ఆ రోజు సాయంత్రం వరకు ఉంచారు . స్వామి అంతిమయాత్ర బ్రహ్మాండంగా మేళతాళాలతో  ,మామిడి తోరణాలతో ,పూలతో రథం అలంకరించబడింది . గులాబీ పూలు ,డబ్బులు ,తులసి దళాలు చల్లి ,షేగాం అంతా ఊరేగించారు . ఆ అంతిమయాత్ర మాటలతో వ్రాయుటకు వీలులేనంతగా వుంది . ఉత్తరాభి ముఖంగా ఉంచి శాస్త్ర సమ్మతంగా సమాధి చేశారు . పదిరోజులవరకు సమారాధన జరుగుతూనే వున్నది  . ఎందరు ప్రసాదం పొందారో చెప్పనలవి గాదు .
         
 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 
10
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
                 గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                              శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

అంతట సిద్ధయోగులకూ హరవిరహం సహించరానిదయింది . అది చుసిన హరిపాటిల్ మీ కంటి వెంట నీళ్లకు కారణమేమి స్వామి ,నేనేమైన అపరాధం చేసానా ? కారణమేమిటో సెలవివ్వండి స్వామి ,అని అడిగిన హరిపాటిల్ తో దీని కారణాన్ని నువ్వు తెలుసుకోలేవు . మన షేగాం వెళ్లిపోదాము ,నీ పాటిల్ వంశానికి ఏ లోటూ ఉండదు . షేగాం తిరిగి రాగానే సమారాధన చేసారు . స్వామి పండరీపూర్ లో చేసిన సూచనలవల్ల కలత చెంది తనతోటి భక్తులతో ,పండరీపురంలో స్వామి ఇక కొద్దీ రోజులు సహవాసమని చెప్పారు . శ్రావణమాసం గడిచింది . స్వామి శరీరం క్రమక్రమంగా క్షీణించసాగింది . భాద్రపదమాసం ప్రవేశించింది . గణేశచతుర్ధశికి స్వామి భక్తులతో అందరు మఠానికి రండి అని చెప్పారు . భక్తులు స్వామి ఆజ్ఞను శిరసావహించిరి . తరువాత స్వామి మట్టితో గణపతిని తయారుచేసి దాన్ని పూజించాలి . నైవేద్యం మొదలైనవి సమర్పించాలి . రెండవరోజు అనగా పంచమినాడు దానిని నిమజ్జనం చేయాలి . చతుర్దశి రోజున స్వామి ఎంతో ఆనందంగా  ఉన్నారు . బాలాభువా స్వామిని చెయ్యిపట్టుకొని ఆసనంపై కూర్చో పెట్టారు . ....

                                 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
Pages: [1] 2 3 ... 10