Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Priya

Pages: 1 [2] 3 4 ... 19
16
Matrusri Alivelu Mangamma / కృతజ్ఞతలు
« on: November 20, 2016, 08:35:42 PM »
మాస్టర్ గారికి,అమ్మగారికి కృతజ్ఞతలు.

గత మూడున్నర సంవత్సరాల నుంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాము.బోరు కూడా అప్పుడే ఎండి పొయింది.ఇతరుల అక్రమాల వల్ల చాలా నష్టపోయాము. ఈ రోజు బోరు చూపిస్తే నీళ్ళు ఉన్నాయని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మేము అక్రమమైన పనులు చెయ్యము. డబ్బుపోయినా ఫరవాలేదు అని మాటమీద నిలబడ్డాము. బాబా,మాస్టర్ గారి దయవల్ల బోరులో నీళ్ళు వచ్చాయి.
బాబా,మాస్టర్ గారికి,అమ్మగారికి కృతజ్ఞతలు.

17
General Discussion / Re: Baba avathaaramu- vivarana
« on: November 20, 2016, 12:12:09 PM »
జై సాయి మాస్టర్!

అన్నిదానములలోకి విద్యా దానము గొప్పది. తెలిసి కూడా చెప్పకుండా ఉండకోడదు.

(మీ చిన్నప్పుడు మాస్టర్ గారు భేతాళుడి కధ చెప్పే ఉంటారు :) )

జై సాయి మాస్టర్!

18
General Discussion / Re: Baba avathaaramu- vivarana
« on: November 18, 2016, 12:37:51 PM »
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ బాబుగారు!

Quote
Nampalli Baba is a Great Saint. But He is not said to be 6th Avathara by Master (or any other Mahatma for that matter)

చాలా మంది ఆయన గురించి చెప్పేటప్పుడు 6 వ అవతారమని చెబుతూఉంటారు.
ఆయన దత్తాత్రేయుడు అంతవరకూ correct అవునా/ కాదా?

మీరు నాంపల్లిబాబా great saint అని అన్నారు అంటే యోగి అని అనుకుంటున్నాను.అవధూతకి యోగికి తేడా ఉందా?

నేను ఒకసారి sai baba magazine లో చదివినట్ట్లు గుర్తున్నది. బాబా మళ్ళీ చింకి గుడ్డలతో వస్తారు. మనం గుర్తించలేము.మహల్సాపతి ఆయనని గుర్తించినట్ట్లు మళ్ళీ అలాగే ప్రకటితమవుతారు. అని చదివినట్ట్లు గుర్తు. యే year magazineనో గుర్తులేదు.
లేదా పొరపాటుపడ్డానో తెలియదు. కానీ బాగా చదివినట్లు గుర్తు ఉన్నది.

కానీ ఈరోజు పారాయణ లో కూడా చదివాను బాబా పరిసమాప్తి లేని పూర్ణ దత్తావతారము అని.

దత్తావతారము అంటే చివటంఅమ్మ, వెంకయ్యస్వామి,చీరాలస్వామి లాగానా అంటే నాంపల్లిబాబా కూడా అలాగేనా?? (ఇక్కడ ఎక్కువ తక్కువ అని నా భావం కాదు).

పరిపూర్ణ దత్తావతారము/దత్తావతారము తేడా వివరముగా తెల్పగలరు.

Quote
Also, Master often told that there is no 'coming again' of Baba. Baba 'parisamaapti leni paripoorna Dattavataaramu'.

Lastly, none of us are eligible to speculate on Baba/Dattatreya's next avatarana. Whether we have the eligibility to have His darshan or not is entirely upto Him and upto us individually.

పరిప్రశ్న లో pg 131 (old book) - బాబా కాకాసాహెబ్ తో భవిష్యత్తులో 8 సం||ల బాలుడిగా ప్రకటితమవుతానని చెప్పారు.

రాబోయే దత్తావతార లక్షణాలు మాస్టర్ గారు ఆ page లోనే  వివరించారు.

నాకు కూడా బాబా వస్తారేమో అనిపిస్తోంది( ఇవి చదివాకా ఇంకా ఎక్కువగా అనిపిస్తోంది.) 

జై సాయి మాస్టర్!               

19
General Discussion / Baba avathaaramu- vivarana
« on: November 17, 2016, 10:15:02 PM »
జై సాయి మాస్టర్!

జై సాయి మాస్టర్ బాబుగారు!

నేను అడిగే ప్రశ్న వివాదాస్పదమవుతుందని తెలిసి కూడా అడుగుతున్నాను, క్షమించగలరు.

శ్రీ నాంపల్లిబాబా గారిని దత్తాత్రేయుని 6 వ అవతారం అంటారు కదా. అంటే సాయినాధుని తరువాత అవతారం అని అర్ధం కదా.
శ్రీ మాస్టర్ గారు "బాబా మరలా చింకి గుడ్డలతోనే వస్తారు" అని చెప్పారు కదా. నాకు కొంచం వివరణ ఇవ్వగలరని ప్రార్ధన.

సాయినాధుడు మరలా వస్తారా లేక నాంపల్లిబాబాగారేనా? బాబా మళ్ళీ ఇప్పటిలో రారా (మాకు దర్శించుకునే అదృష్టం లేదా)     
(నాంపల్లి బాబాకు నాకు మధ్య ప్రేమలో మార్పు లేదు ఎన్ని జరిగినా... ఆయన అదే బాబా).

ఈ ప్రశ్న ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించగలరు. బాబాకు మాత్రం కోపం రాదని తెలుసు.అందుకే ధైర్యం చేసి అడుగుతున్నాను.

అమ్మగారికి నమస్కారములు. 

జై సాయి మాస్టర్! 

20
Jai Sai Master
Kittulahri ani unto aadavaalu anukunanu. Eakkuvaga cheppanemo sorry.
Jai Sai master

21
జై సాయి మాస్టర్!

jai sai mastar KittuLahrigaru,
Quote
౨. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నా ముందు వ్యాఖ్య లో రాసినట్టు మనం అందరం ఒకటే హారతి గురించి మాట్లాడుతున్నామా అని నా అనుమానం. నేను చెప్పేది "పార్ధసారధి, S. P . బాల సుబ్రహ్మణ్యం, సుశీల" గారు పాడినవి


మీకు భావం నిలవకపోయినా ఫరవాలేదు వాటికన్నా మీరు మరాఠీ ఆరతులే పాడుకోండి బాబా నిజంగా ఆనందిస్తారు.
ఆయన మీకు భావం నిలచేలా చేస్తారు. క్రమముగా అలవాటవుతుంది. మాస్టర్ గారి శిరిడీ ఆరతులు గ్రంధం చూసి పాడుకోండి.మీరు పైన చెప్పిన వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు కాదు. బాబాకి భక్తి ప్రధానం.

జై సాయి మాస్టర్ ! 

22
జై సాయి మాస్టర్!

సరైన పద్దతిలో ఆరతులు,పారాయణ జరుగుతున్నప్పుడు దానిని మార్చే ప్రయత్నం మనం చెయ్యకోడదు.చాలా చోట్ల మరాఠీ ఆరతులే సమ్మతము.   

(నాకు బాబా గుడి తెలియదు,సాయి దాసుగారు తెలియదు నా అభిప్రాయం చెప్పాను అంతే  :)   )

జై సాయి మాస్టర్!


           

23
జై సాయి మాస్టర్!

మరాఠి ఆరతులు బాబా స్వయంగా ఆయనే వ్రాయించుకున్నవి.పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శ్రీ సాయి లీలామృతము - సాయి - సాంప్రదాయము (అధ్యాయం 13) ఒకసారి చదవండి. తరువాత చెప్పండి. ఎలా బావుంటుందో.
శిరిడీ ఆరతులు అనే చిన్న గ్రంధము అందులో మాస్టర్ గారు ఆరతుల అర్ధం చక్కగా వివరించారు. అది కూడా ఒకసారి చదివి బాగా ఆలోచించండి.  :)

జై సాయి మాస్టర్!

24
Kids - The Future / Re: protection for girls???
« on: November 13, 2016, 05:16:10 AM »
jai sai master!
Quote

1. aarthulu: those who are in distress / pain /affliction and pray with devotion to Him to come out of them.

2. jijnaasuvulu: Those who wants to understand/know and pray to Him for it.

3. ardhaardhi: Those who pray for material wealth

4. jnaanee: Those who know what is what, have all their wishes fulfilled, has no more/need to do anything and have realised self (aatma jnaanamu). Even these pray Him with devotion. We can see this in all the mahatmaas life histories. Thier devotion in unparalleled and can not be matched
.


ఆర్తులు,అర్ధార్తి,జిజ్ఞాసువులు ఈ మూడూ మన జీవితాలలోనే కనబడతాయి. మనం ఈ ముడు రకాలుగా మారుతాము.జ్ఞాని- మనం ఎలాగూ కాదు.


అందరం ఇంకా ఇలా ఉన్నామంటే అది నిజంగా ఈ భూమి మీద మనకోసం అవతరించిన మహాత్ముల అనుగ్రహం మాత్రమే.అందులో సంశయమే లేదు.

ధర్మమనో లేక మంచి అనో అచరించేడప్పుడే సమస్యలు ఎదురవుతాయి. సమాజం,ఇతరులు మనం అనుకున్నట్లుగా ఉండచ్చు ఉండకపోవచ్చు.
ఇది మంచి కాదు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు? అని అదిగితే పెద్ద నీతులు చెప్పొచ్చింది అనే వాళ్ళు ఉన్నారు.

పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కూడా అక్రమంగా నీటిని (water) సంపాదిస్తున్నారు.మేము ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది.
వేలకు వేలు పోసి కొనుక్కోవలసి వచ్చింది.

schoolsలో కూడా చాలా విషయాలలో ఇబ్బందులు వచ్చాయి. ఒక్కొక్కసారి మనం మంచిని ఎంత బోదించినా వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతారు.అది వాళ్ళకు correct అనిపిస్తుంది అనుకుంట.

ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటే చాలా మంచిది మనందరికీ తెలుసు. చదువుతోబాటు రోజు ఒక గంటైనా ఆటలను కూడా ఆడించే schools ఎన్ని ఉన్నాయి.కొన్ని schools కి play gounds లేవు. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఇది వరకు చదువుకున్నవాళ్ళు కూడా engineers/doctors అయ్యారు. ఇలాగే అయ్యారా? ఇప్పటికి అప్పటికి తేడా లేదా ??
protection కూడా కరువయ్యింది.ఎవరు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు.పిల్లలు ఎక్కే బస్సులు దగ్గరనుంచి.(బాబా లేకపోతే ఆయన రక్షణ లేకపొతే మనం ఉండగలమా?).

ప్రతి క్షణం ఆయన రక్షణ ఉండవలసిన పరిస్థితే. మనం పీలుస్తున్న గాలి కూడా కలుషితమే. బాబా అది నేను పీల్చినా రోగం రాకుండా చెయ్యి అని ప్ర్రార్ధించాలి. పిల్లల పుస్తకాల బరువు వాళ్ళు మోస్తున్నా ఆ బరువు వాళ్ళకు తెలియకుండా చెయ్యి అని ప్రార్ధించాలి.

(sorry బాబుగారు నిజంగా ఉన్న పరిస్థితులే ఇవి. నేను బాబాని తక్కువగా మాట్లాడడం కాదు. మీకు అర్ధమయ్యి ఉండవచ్చు).

నేనూ,ఈ సమాజం,మనుషులు ఎలా మారితే బాగుంటుందో అలా ఉండేలా చెయ్యి బాబా!

sudhkar garu ! same topicలో ఉన్ననో లేదో తెలియదు. నాకు అనిపించింది రాశాను.

Jai sai master                 
       
       

25
Kids - The Future / Re: protection for girls???
« on: November 09, 2016, 11:45:00 PM »
Quote
arthO jijnasu arthaarthee jnaani cha bharatharshabha

jai sai master!

దీని అర్ధం ఏమిటి? నేను అన్నిటిలోను poor అందుకనే అడిగాను.

jai sai master!

26
Request for prayers / Prayer
« on: May 25, 2016, 05:58:47 AM »
అమ్మా నమస్కారములు!   
Homeo medicine తెచ్చుకోవడనికి వెళ్ళలేకపోతున్నాను.
క్రితం నెల వచ్చేడప్పుడు ఒక కాలు Auto లో పెట్టగానే start చేసేసాడు.
(వేరే చోటకెళ్ళినప్పుడు కూడా ఒక Auto లో అలాగే జరిగింది.)
మాస్టర్ గారి దయ వల్ల ఏమీ  అవ్వకుండా బయటపడ్డాను.   

మొన్న ఇంటిదగ్గర Auto అతను నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
ఈ పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు.
medicine అయిపోయినా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు.
పరిస్థితి విన్నవించి వెడదామని అనిపించింది.

కృతజ్ఞతలు!                 

27
Master Ekkirala Bharadwaja / Re: Favorite books of Master garu
« on: April 28, 2016, 11:36:12 PM »
జై సాయి మాస్టర్!

పూజ్య శ్రీ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పే విధానం ప్రత్యేకంగా ఉండేది. ఆయన తరగతిలో పుస్తకాలు మాత్రమే గాక జనరల్ బుక్స్ ఎక్కువగా చదివించేవారు .

- ఫిబ్రవరి 2016 , సాయిబాబా మాసపత్రిక.

జనరల్ బుక్స్ అంటే ఎటువంటివి? కొన్ని చెప్పగలరు.

జై సాయి మాస్టర్!

28
జై సాయి మాస్టర్!

దత్త భావ సుధా రస స్తోత్రము చాలా బావుంది. గురుప్రియ గారు! post చేస్తునందుకు కృతజ్ఞతలు.
స్తోత్రము రాకపోయినా భావము చదివిన చాలు తరించుటకు. మనలాంటి సామాన్యులందరి కోసం దత్తప్రభువు అవతరించారని మరొకసారి గుర్తుచేసుకునే అవకాశం కలిగినది.

ఆచార వర్జితాయ నమః !

జై సాయి మాస్టర్!

29
Weekly Discussion / Re: Nava Nathula Charitra
« on: December 11, 2015, 07:57:44 PM »
జై సాయి మాస్టర్!

మధ్యలో కల్పించుకున్నందుకు క్షమించండి.

Quote
ఎందుకంటే మాస్టర్ గారి సాయి లీలామృతాన్ని కాపీ చేసి చాల మంది మార్కెట్ లో బుక్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇటువంటి సమయములోనే మాస్టర్ గారి శ్రీ సాయిలీలామృతము అందరికీ తెలియచేయడం (పరిచయం చేయడం) అవసరం.(నా అభిప్రాయము)
 
అంతే కాదు శ్రీ గురుచరిత్రలో ఒక్క అధ్యాయము తప్ప మిగిలినవి ఆడవాళ్ళు చదవకోడదన్న ప్రచారము కూడా ఉన్నది.( గాణ్గాపురములో ఎవరో పెద్దవాళ్ళు చెప్పారని ఒకరు గురుచరిత్ర ఇస్తే తీసుకోవడానికీ,చదవడానికి ఇష్టపడ లేదు).

జై సాయి మాస్టర్!

30
General Discussion / Re: Few Questions
« on: December 10, 2015, 11:32:58 AM »
జై సాయి మాస్టర్!

మియాపూర్ లో EK gari Homeo clinic  ఉంటే తెలియపరచగలరు. ప్రస్తుతం నేను వెళ్ళే clinic timings కుదరడం లేదు.
మానవ ప్రయత్నంగా post చేస్తున్నాను.

జై సాయి మాస్టర్!

Pages: 1 [2] 3 4 ... 19