Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: 1 2 [3] 4 5 ... 139
31
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                                    శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

ఎండిన మామిడి చెట్టు చిగురించుట

నిమ్న జాతివాడైన పీతాంబరుడు స్వామిభక్తుడు . షేగాం లో స్వామితోనే ఉండేవాడు . మనస్ఫూర్తిగా సేవచేసేవాడు . అతని సేవ ఫలించింది . ఒకనాడు పీతాంబరుడు చిరిగిన వస్త్రము కట్టుకొని వున్నాడు . పేరు పీతాంబరుడు కట్టింది చినిగిన వస్త్రమా ,పేరు బంగారమ్మ వేసుకొన్నవి మట్టి  గాజులు  అని హేళన చేస్తూ నీ స్థితి కూడా అలానే ఉన్నది అన్నారు స్వామి . ఓ పార్శ్వ భాగము అందరికీ కనిపిస్తూ తిరుగుతున్నావు . ఇదిగో అంగవస్త్రం, ఎవరేమన్నా దీన్ని ధరిస్తూ వుండు అన్నారు స్వామి . దీనిని చూసి ఇతరులు సహించలేకపోయారు . సూటుపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు పీతాంబరుణ్ని . నేను ఈ వస్త్రము ధరించి స్వామిని అగౌరవపరచలేదు . వారిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించాను . వాళ్ళందరి నోళ్లు మూయించడానికి నువ్వు ఎక్కడికైనా దూర ప్రాంతానికి పో . నేనెప్పుడు నీవెంట వుంటాను . నీవు ఇక్కడనుంచి వెళ్లి శక్తి హీనులకు సాయపడు అన్నారు స్వామి పీతాంబరునితో . స్వామి ఆజ్ఞ శిరసావహించి కన్నీళ్లు నిండిన కళ్ళతో సెలవు తీసుకున్నాడు . పీతాంబరుడు నడచి నడచి కండోని అనే గ్రామం చేరుకున్నాడు . అక్కడొక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు .

       
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

32
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                           శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

భక్తరక్షణ

ఆ రోజుల్లో కరువు వచ్చింది . కరువు బాధితులకు నూతులు తవ్వే పని జరుగుతున్నది . ఒకచోట నల్లరాయి పడింది . దానికి కన్నాలు పెట్టి తుపాకీ మందు దట్టంగా పెట్టారు . కానీ ఒత్తికి ముందుకి మధ్యలో ఎదో అడ్డుపడింది . వత్తిని సరిచేయగానే నల్లరాయి పగిలి నీటి బుగ్గ పైకిచిమ్ముతుంది . కానీ దాని    కోసం దిగినవాడు బ్రతికి బయటపడడటం కష్టం .ఈ పనికి ఒక పేదవాడిని వినియోగించారు . బీదవాడుకదా ఏం చేయగలడు . లోపలికి దిగి కదిపినదే తడవుగా అడ్డు తొలగి  బండ పగిలి నీరు వచ్చింది కాని లోపలికి దిగిన వ్యక్తి గజాననస్వామిని ప్రార్ధించగానే ప్రాణాపాయం నుండి రక్షించబడ్డాడు . అతను బయటకి వచ్చి స్వామి పాదాలపైబడి తాను రక్షింపబడినందుకు పరమానంద భరితుడయ్యాడు . ఇక ముందు ఇటువంటి పనులు ఒప్పుకోకు అని స్వామి మందలించారు .   

                                                       
 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

33
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                          శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

కర్మబంధం

ఒకసారి భాస్కర్ కి ఆపద వచ్చింది . చేదు స్వభావం గల గోవును భాస్కర్ యే బంధించి బండిమీద షేగాం కి పంపించాడు . అది స్వార్ధంతో కూడిన పని దాని స్వభావమే ఇప్పుడు పిచ్చికుక్క రూపంలో వచ్చింది . ఒక పిచ్చికుక్క భాస్కర్ ని కరిచింది . దాని చికిత్స కోసం స్వామి దగ్గరకు వచ్చాడు . నాయనా నీ ఆయువు తీరిపోయింది . ఆయుస్సు పెంచమంటే పెంచుతాను . కానీ దాని వల్ల లాభం లేదు . ఈ అశాశ్వత ప్రపంచంలో జనన మరణాలు జరుగుతూనే వుంటాయి . దీనికి భయపడ నవసరంలేదు లేదు . ఈలాంటి మృత్యువులు మానవుడికి ఎన్నిసార్లు గలుగుతాయో చెప్పలేము . నీవు ఇప్పుడు చనిపోతే ముక్తిని ప్రసాదిస్తాను . ఎంతోమందికి  ఎన్నో స్మారక మందిరాలు ఏర్పాటు చేశారు . స్వామి గజాననులకు కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి . ఇప్పుడు సరే అని తరువాత మర్చిపోవద్దు . ఈ రెండు నెలలు బ్రతికించమని కోరాను . అది కూడా పరిసమాప్తమవుతున్నది . మరి కొద్దిరోజులలో భాస్కర్ కి మోక్షాన్ని ప్రసాదించారు స్వామి . పదకొండవనాడు " కాకబలి " అర్పించిన తరువాత ఆ పిండాన్ని ముట్టుకున్న తరువాతే ఆత్మ ముందుకు  వెడుతుంది . తమభాగం తమకు ముట్టనందుకు కాకులకు కోపం వచ్చింది కాబోలు నానా భీభత్సం చేశాయి . రెట్టలు వేయటం విస్తళ్ళని చిందరవందర చేయటం మొదలుపెట్టాయి ,అది చూచి గజాననులు తిన్నగా ముక్తి పొందినవానికి రానవసరంలేదు అని కాకులకు చెప్పారు . ఆ మరుసటి రోజు నుండి కాకులు రావడం  మానివేసినాయి . ఆ చిత్రానికి వాళ్లంతా ఆశ్చర్యపడటమే కాకూండా తమ ఆ విశ్వాస ప్రవృత్తికి సిగ్గుపడ్డారు .

  అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

34
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                                  శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )
దుష్టగోవు

శ్రీ బాలాపూర్ లో సుకలాల్ అగర్ వాల  అనే సజ్జనుండేవాడు . వారికి చెడు స్వభావం కలిగిన ఆవు ఒకటుండేది . పిల్ల ,పెద్ద ,ముసలి అనే విచక్షణ లేకుండా అందరిని పాడితొక్కేది . కొమ్ములతో పొడిచేది . దుకాణాలలోకి వెళ్లి నానా బీభత్సం చేసేది . గ్రామస్తులంతా దానితో విసిగి పోయారు . గొలుసులతో బంధించినా తెంపిపారేసేది . ఊరివారంతా అగర్ వాలాతో నువ్వే దీన్ని తుపాకీతో కాల్చి పారెయ్ లేదా కసాయివాడికి అమ్మేయ్ అన్నారు . మరోరోజు దానిని పక్క వూరిలో విడిచి వచ్చారు . కాని కొద్దిసేపట్లోనే అది బెలాపూర్ తిరిగి వచ్చేసింది . గోవిందాబువాగారి గుర్రాన్ని స్వామి గజాననులు అదుపులో పెట్టారట ,దీన్ని గూడా షేగాం తీసుకు వెళ్లి స్వామికి దానం చెయ్యి . గోవుని స్వామికి దానం చేస్తే  పుణ్యము వస్తుంది ,దీని పీడ విరగడౌతుంది అన్నారు . అది అందరికి నచ్చింది . దానిని తాళ్లతో గొలుసులతో బంధించి ఒక బండి పైకెక్కించి షేగాం కి తీసుకొనిపోయారు . షేగాం దగ్గరౌతున్న కొద్ది దానిలో కొంత మార్పు కనపడుతున్నది . స్వామి చెంతకు తీసుకొని రాగానే దానిని చూచి గోవులాంటి సాధుజంతువునా మీరు బంధించి నానా హింసా పెడుతున్నారు . గోవు ప్రపంచానికే మాత . ఈ విషయం మీకు తెలియదా ?దానిని వెంటనే విడిచిపెట్టండి అని కేక వేశారు . కానీ విడిచిపెట్టడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు . స్వామియే స్వయంగా బంధవిముక్తం గావించారు . అది స్వామికి మూడు ప్రదక్షిణలు చేసి స్వామి పాదాలు నాకింది . ఈ సంఘటనను ప్రజలందరూ చూచారు . స్వామి గోమాతతో ఇక మీదట ఎవరిని సతాయించవద్దు . ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది కలిగించవద్దు  . ఈ మఠం వీడిపోవద్దని చెప్పారు . దానిని తాడుతో కట్టే పనిలేకుండా చేశారు స్వామి . 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

35
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                                      శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

భక్తసులభుడు 

శ్రీస్వామి అమరావతిలోని ఆత్మారాం బికాబీ యింటిలో మకాం పెట్టారు . ఇతడు సదాచార సంపన్నుడు . ఇతడు కాయస్థ జాతికి చెందిన వాడు . అభిమానం ,మర్యాదలు కలవాడు . స్వామికి సకలోపచారములు చేశాడు . రకరకాల నైవేద్యం ముందుంచాడు . అందరికి స్వామికి సేవ చేయాలని కోరిక వున్నా అది కొందరికే సాధ్యము . దర్వాడాలో 'దాదా సాహెబ్ ' అనే అతను ప్రఖ్యాతి  అతను  గడించాడు . ఆ ఊరిలోనే 'గణేష్ అప్పా ' అనే లింగాయతుండేవాడు .  భార్య చంద్రాబాయి . స్వామిని తమ ఇంటికి తీసుకురమ్మని భర్తతో అన్నది . మనలాంటి పేదవారింటికి వారు రావాలంటే సిఫారసు కావాలి . దాదాసాహెబ్ గారి ఇంటికే అతి కష్టం మీద వచ్చారు . కనుక ఆ ఆశ విరమించుకొమ్మని గణేష్ అప్పా తన భార్యతో చెప్పాడు . మీరన్నదానికి నేను అంగీకరించను . నా ఇష్ట దేవత మన యింటికి తప్పక విచ్చేస్తారని తెలియచేస్తోంది . కాని అప్పాజీ పిలవటానికి ధైర్యం చాలటం లేదు . స్వామి అతని మనసులోని మాట తెలుసుకొని చేయి పట్టుకొని అరె అప్పాజీ ఇక్కడికి మీ ఇల్లెంత దూరం .మీ ఇంటికి వచ్చి కొంతసేపు ఉందామని వుంది .  వేరు మాట మాట్లాడక స్వామీజీని తన యింటికి తోడ్కొని వచ్చాడు . సతీసమేతంగా వారి శక్తి కొలది పూజించుకున్నారు . దక్షిణ రూపంలో తనకున్నదంతా ధారపోశాడు . అటువంటి సత్కారాలు అమరావతిలో ఎన్నో జరిగాయి .
 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

36
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                         శ్రీ గజానన్ మహారాజ్  చరిత్ర ( వేము రామ మోహన రావు )

టక్కరి గుర్రం

షేగాం లో మోటేఅను  షావుకారు ఉన్నాడు . అతడు ఆ ఊరిలో గల జీర్ణ శివాలయాన్ని ఉద్దరించాడు . అందుచేత దాని పేరు మోటే మందిరంగా మారిపోయింది . ఆ మందిరంలో హరిదాస్ టాకరీకర్ విడిది చేశాడు . అతని కొక చెడ్డ స్వభావం గల గుర్రం వుండేది . తాడు తెంచుకొని పారిపోవటం ,కుక్కలా కొరకటం చేస్తూ వుండేది . అర్ధరాత్రి రెండు గంటలకు స్వామి ఆ గుర్రం దగ్గరకు వచ్చారు . సాధు పురుషుల వల్ల అల్లరిచేసే జంతువులు గూడ మారిపోతాయి . ఆ గుర్రం కాళ్ళ మధ్య మహదానందంగా నిద్రించారు . 'గణ గణ గణాంతబోతే ' అనే పాటను పాడుతున్నారు . గుర్రం యొక్క ప్రవర్తన తెలిసిన గోవిందబువా మధ్య మధ్యలో లేచి చూస్తున్నారు . గుర్రం చాల ప్రశాంతంగా నిలబడింది . గుర్రానికి ఏమి జబ్బు చేయలేదు గదా అనుకున్నాడు . ఆ గుర్రం దగ్గరకు వచ్చి చుస్తే దాని కాళ్ళ మధ్య ఒక వ్యక్తి పడుకుని వున్నారు . ఇంకొంచెం ముందుకుపోయి చుస్తే కైవల్యాన్ని ప్రసాదించే స్వామియే పడుకొని ఉండటం ఆశ్చర్యం . అప్పటి  నుండి గుర్రం శాంత  స్వభావము కలదైంది . మిత్రమా ! శాంత స్వభావం అవలంభించు ! ఎవరిని బాధించవద్దు అని గుర్రాన్ని నిమిరి స్వామి అచ్చట నుండి వెళ్లిపోయారు . 

 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


37
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥
     
                                 శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

శాస్త్ర జ్ఞానం

వేదపండితులు విద్వాంసులు అయిన  తెలుగు పండితులు ఒక పదిమంది ధనసంపాదనపై ప్రలోభం కలవారు పాటిల్ ఇంటి వద్ద స్వామిని చూడవచ్చారు . స్వామి కంబళి కప్పుకొని పడుకొని వున్నారు . బ్రాహ్మణులు పెద్దగా వేదపఠనం లో తప్పులు దొర్లుతున్నా పట్టించుకోకుండా వారి పని వారు చేయుచున్నారు . వెంటనే స్వామి లేచి కూర్చుని మీరు వైదికు లెందుకయ్యారు . వేదాన్ని తప్పులతో చదివి హాని కలిగించకండి . పొట్టపోసుకొనుట కోసం వేదం విద్యను అపవిత్రం చేయకండి . ఈ కప్పుకున్న శాలువ విలువైనా కాపాడండి  అని హెచ్చరించి ,వేదం ఉచ్చారణ ఎలా చేయాలో తాను  చదివి వినిపించారు . ఆ తెలుగు బ్రాహ్మణులు తలలు వంచుకొని తమ అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా ప్రార్ధించారు . మీరు పిచ్చివారనుకున్నాము ,నిజంగా దైవంశ సంభూతులు . మిమ్ము దర్శించగలగటం  జనం సుకృతం అన్నారు . తరువాత ఖండూపాటిల్ చేత వారందరికి ఒక రూపాయి చొప్పున దక్షిణ ఇప్పించి పంపారు స్వామి .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

38
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ గజానన్ మహారాజ్ దివ్యచరిత్ర ( వేము రామ మోహన రావు )

అన్నదమ్ములంతా కలసి ఈ స్వామిని ఎందుకు పరీక్షించకూడదు అనుకున్నారు . పాటిల్ బంధువులు అరే పిచ్చివాడా చెరకు గడ తినాలని ఉందా అని మేము చెరుకుగడలతో కొడతాం నీవు మహాయోగివైతే మేము కొట్టిన గుర్తులు ఏమీ నీమీద కనబడకూడదు . అప్పుడు నిన్ను యోగిగా గుర్తిస్తాము . మౌనం అంగీకారం అన్నట్లుగా ,చెరకు గడలు తీసుకొని స్వామి మీద విరచ్చుకు పడ్డారు . కొంతసేపు అలా కొట్టి అలసిపోయి ఆపేశారు . ఒంటిమీద కొట్టిన గుర్తు ఒకటి గూడా కనపడలేదు . స్వామి చరణాల ముందు పడి పోయారు . మీరంతా నన్ను కొట్టటం వల్ల అలసిపోయారు . మీకు చెరకు రసం ఇస్తాను రండి అని చెరకు గడలన్నీ కలిపి మెలిపెట్టి ఏ యంత్ర సహాయం లేకుండా చెరకురసం వాళ్లకిచ్చారు . అప్పటికి స్వామి శక్తి ఏమిటో వారికి అర్ధమయింది . ధనగర్వం ,అధికార గర్వం ,బలగర్వం అన్ని తొలగిపోయాయి . అందరు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని సెలవు తీసుకున్నారు . 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

39
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                 శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

అందువల్ల స్వామిని కూడా 'ఒరే పిచ్చివాడా ' మాతో కుస్తీ పడతావా వీళ్లంతా నిన్ను మహా యోగి అంటున్నారే అదేదో మాక్కూడా కాస్త తెలియనివ్వు . లేకపోతే నిన్ను చావగొడతాం జాగ్రత్త అంటున్నా స్వామి నవ్వి వూరుకునేవారు . దీనిని గర్విష్టులైన వారు సహించలేకపోయారు . స్వామి చెయ్యి పట్టుకొని నాతో కుస్తీ పట్టు అన్నారు . స్వామి నువ్వు గొప్ప పహిల్వాను వైతే నా చేయి పట్టుకొని లేపు అన్నారు . స్వామి పెద్ద పర్వతంలాగా వుండి కదలలేదు . హరిపాటిల్ అలసిపోయారు . ఈయన సన్నగా కనిపిస్తున్నాడుగాని ఏనుగంత బలం ఉంది అనుకున్నాడు . హరిపాటిల్ ను రెచ్చగొట్టారు నవ్వుతూ నువ్వు గ్రామాధికారివి . నువ్వు ఒక సన్యాసికి తల ఒగ్గటమా ,నీవంటి వారికి ఒక దిగంబరుని పాదాలు పట్టటమా ! ఇదేమి బాగుండలేదు .....


అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

40

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                             శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

చెరకులతో కొట్టుట

కడతాజీ ,కుకాజీ అనేవారు ఖండురావు పాటిల్ కుమారులు . వీరు పాండురంగని భక్తులు . వీరికి గోమాజీ స్వామి ద్వారా గురూపదేశమయింది . కడతాజీకి ఆరుగురు పుత్రులు ,కుక్కాజీకి సంతానం లేదు . కడతాజీ చనిపోయిన దరిమిలా కుకాజీ వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు . కొంతకాలానికి కుకాజీ స్వర్గస్థుడైనాడు . కుటుంబ భారము పెద్దవాడైన ఖండూపాటిల్ పై పడింది . ఇతడు కోపిష్ఠి , ఎవరిని లెక్క చేసేవాడు గాదు . అతని తమ్ములు గణపతి ,నారాయణ ,మారుతి ,హరి ,కృష్ణాజీలు . అంతా అహంకారులు ,గర్విష్ఠులు ,వీరికి కుస్తీలన్నా ,దెబ్బలాటలన్నా మహా సరదా . ప్రతి సంవత్సరం జరిగే ఆంజనేయ ఉత్సవాలలో వారిదే పైచేయి . వీరి దృష్టిలో బీదా ,బిక్కి ,సంసారులు ,బ్రహ్మచారులు ,సాధువులు ,సన్యాసులు అందరు సమానమే . ......


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

41
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                           శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

తేనెటీగలు ఆజ్ఞాపాలన

షేగాం కి దక్షిణాన ఒక పొలంలో మొక్కజొన్నలు తినటానికై వెళ్లారు . పొలంలో ఒక నుయ్యి ,ఒక చింత చెట్టు ఉన్నాయి . మొక్కజొన్న పొత్తులు కోసి చింతచెట్టువద్ద మంటవేసి జొన్నపొత్తులు కాల్చుకుంటున్నారు . చెట్టుపై తెనెతట్టు ఉన్నది . కింద పొగ చెట్టుపైకి పోగానే దానిమీద ఉన్న తేనెటీగలన్నీ  క్రిందవున్న వారిపై వచ్చి పడ్డాయి . అది చూసి అందరూ అటూ ఇటూ పారిపోయారు . ఎవరి ప్రాణం వారికి తీపికదా ,స్వామి మాత్రం చలించక అక్కడే కూర్చున్నారు . ఈగలు నల్లగొంగళి కప్పుకున్నంత దట్టంగా చుట్టుముట్టాయి . స్వామీజీ ఒళ్ళంతా కుట్టువేశాయి . స్వామి మాత్రం శాంతంగానే వున్నారు . బంకట్ లాల్ స్వామిని ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్లినందుకు బాధపడ్డాడు . తేనె టీగల ముళ్ళనీ తీయటానికి కంసాలి వచ్చాడు . నీ యీ శ్రావణం తేనెటీగల ముళ్ళు తీయటానికి పనికిరాదు . చూడు యీ ముళ్ళను ఎలా తీస్తానో అని శ్వాసను బంధించారు . మరుక్షణం ముళ్ళనీ బయటకు వచ్చేశాయి . ఇదంతా కళ్లారా చూసిన వారికి స్వామి శక్తి ఏ పాటిదో అర్ధమయింది .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!42
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః
 

            శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

బావిని జలపూరితం చేయుట

దర్వాడ ప్రాంతంలో అడ్ గాం అనే ఊరుంది . ఎవరికి చెప్పకుండా వాయువేగంతో మండుటెండలో వెళుతున్నారు స్వామి . ఎండ వేడిమి మిక్కుటముగా ఉన్నందున దాహం ఎక్కువగా ఉంది . భాస్కరు అనే రైతు పొలం దున్నుకుంటున్నాడు . అతను ఒక కుండతో నీళ్లు తెచ్చుకున్నాడు . ఆ నీటి కుండా వద్ద వెళ్లి మంచినీళ్లు అడిగారు స్వామి . స్వామి పిచ్చివాడని నానా దుర్భాషలు ఆది నీరు ఇవ్వ నిరాకరించాడు . అక్కడకు దగ్గరలో ఒక పాడుబడ్డ నుయ్యి వుంది ,అక్కడకు వెళ్లారు స్వామి . ఆ నుయ్యి ఎండిపోయి కొన్ని సంవత్సరాలయింది అన్నాడు . అయినా చూస్తానన్నారు స్వామి . అది చూస్తూనే ఏమీ చేయకుండా వెళ్లి పోతే లోకానికి మేలు చేసేవాణ్ణి ఎలా అవుతాను అని స్వామి నూతిని సమీపించారు . మాధవుణ్ణి ప్రార్ధించారు . కొద్దీ క్షణాల్లో నూతిలో నీళ్లు నిండాయి . ఇదంతా భాస్కరుడు రెప్పవేయక చూస్తున్నాడు . ఈతడు పిచ్చివాడనుకొన్నాను , సాక్షాత్తు భగవంతుడే . ప్రజల కళ్ళు గప్పి వెర్రివాడి లాగా కనిపిస్తున్నాడు అనుకొని భాస్కరుడు సాష్టాంగ దండ ప్రమాణము చేసి తన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు . హే కృపాళు , దీనబాంధవా ! యీ ప్రపంచమంతా మిథ్య అని తెలుసుకున్నాను . ఇక నీవు కుండతో నీరు తెచ్చుకోవలసిన అవసరం లేదు . ఈ నూతిలో ఎప్పడు నీరు ఉండేటట్లు చేశాను ,కాబట్టి నీవా విషయానికి బాధపడవలసిన అవసరం లేదు . ఈ లౌకిక జీవితం పై విరక్తి కలిగింది . చూడండి కొద్దిపాటి స్వామి సాంగత్యం భాస్కరునిలో ఎంత మార్పు తీసుకొనివచ్చింది . నీరు పడటం వినగానే వూరి వారందరు స్వామిని దర్శించుకునే నిమిత్తం వచ్చారు . తరువాత స్వామీజీ అడ్ గాం లో ఉండకుండా భాస్కరునితో సహా షేగాం కి తిరిగి వచ్చేసారు .

 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

43
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                      శ్రీ గజానన్ మహారాజ్ దియా చరిత్ర ( వేము రామ మోహన రావు )

పింపల గ్రామం నుండి షేగాం కి వెళ్లిన కొంతమంది తమ ఊరికి ఒక స్వామి వచ్చారని ఆయన సిద్ధుడిలా ఉన్నారని ఆ నోటా ఈ నోటా షేగాం  అంతా పాకింది . చివరకు బంకట్ లాల్ కూడా తెలిసింది . బంకట్ లాల్ తన భార్యతో పింపలగ్రామం బయలుదేరాడు . స్వామి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లారు ,పదిహేనురోజులైంది . షేగాం లో భక్తులు అన్నపానీయాలు మానేసారు ,మీరు తిరిగి షేగాం రావాలి . అలా రానిచో నేను దేహ త్యాగం చెయ్యటానికి నిర్ణయించుకున్నాను అని వినయపూర్వకముగా ప్రార్ధించాడు బంకట్ లాల్ . ప్రార్ధన విన్న స్వామి షేగాం వెళ్ళుటకు బండి ఎక్కారు . పింపల్ గ్రామస్థులు బంకట్ లాల్ వద్ద అప్పు తీసుకునేవారు . అందుచేత అతని ప్రయత్నాన్ని నివారించలేకపోయారు . వెడుతూ వెడుతూ బండిలో డబ్బున్న షావుకార్ల పద్ధతి నాకేం అర్ధం కావటములేదు . శ్రీ మహాలక్ష్మినే మీ ఇంట బంధించారు . అప్పుడు మహారాజ్ మీముందు నా ఆస్తంతా తృణప్రాయము . మీరే నా సర్వస్వము . షేగాం ను ముఖ్య కేంద్రం గావించు  మీ యిష్ట మొచ్చిన చోటికి సంచారం చేయండి . కళ్యాణం కోసం ,దేశంలో ఏ మూలకైనా వెళ్ళండి అన్నాడు బంకట్ లాల్ . షేగాం లో కొన్నాళ్ళుండి ఎక్కడికో వెళ్లిపోయారు స్వామి . 
             

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

44
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                    శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర ( వేము రామ మోహన రావు )

షేగాం నుండి పింపల గ్రామానికి

పింపల గ్రామ పొలిమేర్లలోని అడవిలో ఒక ప్రాచీన దేవాలయమున్నది . ఆలయంలోకి స్వామి ప్రవేశించి పద్మాసనంలో ధ్యాన నిమగ్నులయ్యారు . ఆలయం దగ్గర చిన్న కాలువ వుంది . గొడ్లకాపరులు పశువులకు నీరు పెట్టి ఆలయంలో గల స్వామిని చూచి ఆశ్చర్యపడ్డారు . అంతకు ముందెన్నడు స్వామిని అక్కడ చూడలేదు . ఈ సంగతి గ్రామ పెద్దలకు విన్నవించారు . వారు స్వామి ఎదుట కూర్చొని సంకీర్తన చేయసాగారు . గ్రామంలోకి తీసుకువెళ్లాలని నిశ్చయించుకొని ,స్వామిని ఎత్తి పల్లకీలో కూర్చుండబెట్టి మేళ తాళలతో  ,తులసీదళాలు గులాల్ మొదలగునవి జల్లుతూ మారుతి మందిరానికి చేర్చారు . ఒక పెద్ద పీట వేసి స్వామిని సుఖాశీనులను చేసారు . అప్పటికి సమాధి స్థితిలోనే వున్నారు గజానులు . ఎవరికీ తోచిన పదార్థాలు వారి వారి శక్త్యానుసారము స్వామికి సమర్పిస్తున్నారు . స్వామి సమాధి స్థితిని వీడి భక్తులు తెచ్చిన పదార్థములను కొద్దిగా స్వీకరించి అందరి యభీష్టాన్ని పూర్తి చేసారు .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

45
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                          శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము  రామ మోహన రావు )

చించాన అనే గ్రామంలో మాధవుడని ఒక నిరుపేద బ్రాహ్మడుండేవాడు . అతని వయస్సు సుమారు 60 సం || లు . ఒంటరివాడు సర్వస్వం పోగొట్టుకున్నాడు. అప్పుడు గాని అతనికి భగవంతుడు జ్ఞప్తికి రాలేదు . షేగాం వచ్చి స్వామి కాళ్ళు పట్టుకొని ఏడ్వసాగాడు. ఇలా ఒకరోజు గడిచింది . అది చూసి స్వామి ప్రాణం పోయేముందు వైద్యుణ్ణి పిలిచి ఏం లాభం . యౌవనంలో బ్రహ్మచారిగా ఉండి  ముసలితనంలో పెళ్లి చేసుకున్నట్లుగా ,అవతల ఇల్లు తగలబడుతూ ఉంటే నుయ్యి త్రవ్వుట ప్రారంభించినట్లుగా ఉన్నది నీ వ్యావహారం . కర్మ అనుభవించవలసినదే . అర్ధరాత్రి దాటిపోయిన తరువాత ఎవరు లేని సమయం చూచి స్వామి యమునిలా భయంకర రూపం దాల్చి ,గర్జిస్తూ మాధవునిపై పడ్డారు . లేచి పారిపోసాగాడు . మహారాజ్ నాకు యమలోకం చూపించారు చాలు . నన్ను ఎలాగైనా వైకుంఠానికి పంపండని చివరిసారిగా అర్ధిస్తున్నాను .అన్నాడు . సిద్ధ యోగులు ,సాధువులే పాపుల్ని పాప విముక్తులను చేసి పావనం చేస్తారని విన్నాను . ఇది మాధవుని ,స్వామి మధ్య జరిగిన విషయము . మాధవుని మృత్యువు స్వామి సన్నిధిలో జరిగింది . బ్రాహ్మణులను పిలచి తదుపరి కార్యక్రమం జరిపించమన్నారు . వేద బ్రాహ్మణుడు లేని ఆ గ్రామంలో వేదం బ్రాహ్మణులను పిలిపించమన్నారు . స్వామి నోటి వెంట ఏమాట వస్తుందో అది జరిగి తీరవలసిందే . అనుకున్నట్లు మధ్యాహ్నాని కల్లా వేద బ్రాహ్మణులు వచ్చారు . వారిని తగిన విధంగా సత్కరించి పంపారు . 

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Pages: 1 2 [3] 4 5 ... 139