Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: 1 ... 143 144 [145] 146 147 ... 149
2161
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 14, 2012, 09:35:40 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ గురు గీత -8 వ శ్లోకం
శ్లో !!శరీర మింద్రియం ప్రాణమర్ధస్వజన బాన్ధవాన్ !
      ఆత్మ దారాధికం  సర్వం సద్గురుభ్యో నివేద యేత్!!
భావము :శరీరమును ,ఇంద్రియములను ,ప్రాణములను ,ధనమును ,భార్యా పుత్రాది  స్వజనమును  సద్గురువుకు  నివేదించ వలెను .
వివరణ :నివేదన  అనగా  గురు సేవ యందు వీనిని  యుపయోగించుట .ఇవన్నియు  ఆయన  రూపముగనే తెలియ పరచు కొనుట .సద్గురువునే  వీటన్నిటిగా  భావించుట .చూచుట  ,వినుట మొ :ఇంద్రియముల న్నింటిని  గురు పరముగ చేయుట .ప్రాణములను  నివేదించుట  అనగా  సృష్టి  స్వరూపముగ ప్రాణ స్పందనము  గురు స్వరూపముగా  నెరిగి  వాటి వలన  జీవించు చున్నామను  కృతజ్ఞతా  భావ యుక్తముగా  ఆయనను  స్మరించుట .శ్వాసా దికములతో  ఆయన  నామమును  సమన్వయ పరచుకొనుట.భార్య చేత  సద్గురు  సేవ  చేయించ వలె .అది  అతని ధర్మం .అంటే  ఆమె అందుకే  వున్నట్లు  ఆమె చేత  తీవ్ర  గురు సేవా రూపమైన   సాధన  చేయించవలెను .సహా ధర్మ చారిణి  గదా  ఆమె !అట్టి విద్య  వచ్చిన  గురువైన  భర్త నామె సేవిస్తే అతని  సద్గురువును సేవించి నట్లే .సాయి  శ్యామాను  తన  ప్రతినిధిగా  భక్తుల  ఇండ్లకు  పంపినట్లు .సద్గురువు తన అర్చనావతారం గా  భర్తను  భార్య కిస్తాడు .భక్తునికి   నామరూప  రహిత  పరబ్రహ్మ  తన లీలా మానుష  విగ్రహాన్ని  గురువు  రూపంగా  ప్రసాదించినట్లు.ఇట్టి  వారే  తల్లి తండ్రులు .
  వారిని  దైవ స్వరూపులుగా  సేవించడం  బిడ్డల ధర్మం అనడంలో   ఆశ్చర్య మేముంది ?ఒక  గురువు  యొక్క  శిష్యుడు  తన  శిష్యునకు  గురువౌతున్నాడు గదా !ఇన్ని రీతులుగా అంతా  విశ్వ చైతన్య రూపుడైన   గురువేనని ,అంతా ఆయనదేనని  గుర్తించ డాన్నే  సాయి  తామెల్లప్పుడూ చేసే  "అల్లా మాలిక్ " అన్న స్మరణ ద్వారా  సూచించారు .దక్షిణ  కూడా  ఇట్టి ఆత్మ  సమర్పణే సూచిస్తుంది .
అలానే  చరమ దశలో  భార్య ,భర్త లిద్దరూ  అబేధ స్ధితికి  రావాలి శక్తి చైతన్యాల్లాగా ,నిప్పు -వేడి లాగ .అది గృహస్త ధర్మం ఇందులో  సుసిక్షితులై  అన్యత్వ  ద్రుష్టి పోయిన  తరువాతనే  లౌకిక  ధర్మాలు  రక్తి కడతాయి .మన పూర్వులు  పురుషుడికి  అన్యత ద్రుష్టి బ్రహ్మ చర్యం లో  పోగొట్టేవారు .భార్యకు  భర్త  సేవలోనే  ప్రౌఢ దశ లోపల  అన్యత్వం  పోయేది .ఆ  లోపున  తప్పని సరైతే కాని  పురుషులను చూడరాదని   మను మహర్షి  చెప్పి యున్నారు .గార్హ్యస్దము  ఒక  తపశ్చర్య .అప్పుడే  వివాహం  లంపటం కాక సత్సాంగత్యం గా   మారుతుంది ."యత్ర నార్యాస్తూ  పూజ్యంతే  రమంతే  తత్ర  దేవతా ".అన్న శ్లోకం  అక్కడ  సార్ధక మౌతుంది .'పూజ్యంతే ' అంటే  ఇట్టి  ఉత్తమ  జీవిత  విధానం  స్త్రీ కిచ్చి  గౌరవిస్తారో ,బానిస  వలె ,వేశ్య వలె ,విలాసిగా  మాత్రమే  చూడరో -అని  భావము .శ్రీ సాయి తమ గురువును  సేవించిన  విధము  ఈ శ్లోకానికి  తార్కాణము .
అలివేలు మంగ పతి నీకిదే వందనము !
జై సాయి మాస్టర్!


జై సాయి మాస్టర్!


2162
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 13, 2012, 11:03:55 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ గురు గీత -7 వ శ్లోకం
శ్లో !!కర్మణా  మనసా వాచా సర్వ దారాధయేద్గురుం !
దీర్ఘ దండం  నమస్కృత్య  నిర్లజ్జో గురు సన్నిధౌ !!
భావము :మనస్సు ,వాక్కు ,కర్మల చేత గురువును ఆరాదించవలసినది .సాష్టాంగముగ లజ్జ విడిచి గురు సన్నిధి యందు  నమస్కరింప వలెను .మనస్సుతో  ఆరాధించుట  అనగా నామ స్మరణ  మొదలుగునవి .వాక్కుచే  ఆరాధించుట  అనగా మాట్లాడ వలసి వచ్చినచో  గురువు తో గాని ,గురువును  గూర్చి గాని మాట్లాడుట .అన్యమును  గూర్చి  సాధ్యమైనంత  వరకు  మాట్లాడ కుండుట .ఆచరణ  రూపమున  సేవించుట  అనగా  ఈ  దేహెంద్రియ ములన్నియు  గురువునకు  శుశ్రూష  చేయుటకు ,గురు ఆజ్ఞా పాలనమునకు ,గురువునకు  ప్రీతి కరమైనవి  ఆచరించుటకు  మాత్రమే  వాడ వలసిన  పవిత్రమైన  పూజా పాత్రలుగా  భావించి ,తుచ్ఛ  విషయముల  నిమిత్తము  వాటిని  వినియోగించి  మాలిన  పరచ కుండుట .ఆ  భావన  చెదర కుండా  సర్వ  జీవులను   గురు రూపములు గనే భావించి  సేవించుట .పూజ  భజనాదికముల యందు  శరీరమును  వినియోగించుట .
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!2163
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 12, 2012, 12:06:56 PM »
జై సాయి మాస్టర్!
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ గురు గీత -6 వ శ్లోకం
శ్లో !!గుకార : ప్రధమో వర్ణః  మాయాది గుణ భాసక: !
రుకారోస్తి పరం బ్రహ్మ  మాయా బ్రాంతి  విమోచకం !!
భావము :-గురు అనెడి పదము నందు గుకారము సృష్టి కాధారమైన  మాయ  ,త్రిగుణ ములను  సూచించును .రుకారము వీటి కాధార మైన  పరబ్రహ్మము .ఇది "నేను దేహమును "మొదలుగా గల మాయా భ్రాంతుల  నుండి  ముక్తి నిచ్చిను .
వివరణ :-గుకారము  గూర్చి  చెప్పిన  శ్లోకాలన్నీ  'గురు ' అన్నపదాన్ని  జప  మంత్రం గా  వాడుకోడానికి  తగిన  రీతిగ విరిస్తాయి .సంకేతా లేవైనా  భావన ప్రధానం కదా  మంత్రంలో !"అ ,ఉ ,మ్ "ల లో  బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు  త్రిగుణాలు  మొదలైన  అర్దా లెక్కడున్నాయ్ ?కానీ అలా లెక్కించుకోవచ్చు .algebra లో (a ప్లస్ b )? అన్నప్పుడు a=1,2,3 అలా  ఎంతైనా  కావచ్చు .equation సరిపోయి  answer వస్తుంది .అలాగే  ఇదీను ,'గురు 'అన్న అక్షర ద్వయంతో  గురు  తత్వాన్ని సంకేతించు కున్నారు .ధ్యాన ,జప ,సౌలభ్యం  కోసం .
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!
2164
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 11, 2012, 09:16:58 AM »
జై సాయి మాస్టర్!
అలివేలు మంగ పతి నీ కిదె వందనం !
శ్రీ గురు గీత :4 శ్లోకము
అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారకం  !
జ్ఞాన  వైరాగ్య సిద్ధ్యర్ధం   గురో: పాదోదకం  పిబేత్ !!
భావము :అజ్ఞానము  యొక్క  మూలమును  నశింప జేయుటకు ,జ్ఞాన  వైరాగ్యములు  సిద్దించుటకు ,జన్మ కర్మ  నివారకములగు  గురు పాదోదకమును  పానము  చేయవలయును .
 వివరణ :సర్వమూ  తానైన  సద్గురువునకు  తన  అంశమైన  లౌకిక  విషయములందు  వైరాగ్య ముండును  ,ఆయన యొక్క  సహజమైన  ఆనందము  ముందు  లౌకిక  సుఖములు  (తుచ్చములగు) అత్యల్పములగును ,ఇట్టి  వైరాగ్య  మునకు  కారణము  తానే  సర్వము  అనెడు  జ్ఞానము  ప్రధానము ,గురువు నందలి  ఈ  గుణమును  సదా  ధ్యానించుట  వలన  భక్తునకు  జ్ఞాన వైరాగ్యములు  సహజముగనే సిద్దించును  ,లౌకిక  సుఖములను  గూర్చి  చింతన  చేయుటయే  వ్యామోహమునకు  కారణము. వైరాగ్యమును  చింతన  చేయుటలో ,ఐహిక  విషయములను  గురించి  చింతన  చేయకుండుట  ఇమిడి యున్నది ,నిప్పులో నుంచ బడిన  ఇనుము  తన  గుణములు  కోల్పోయి  అగ్ని  యొక్క  గుణములను   సంపూర్ణముగా  పొందునట్లు   మనస్సును  యే  భావము  నందుంచిన  దాని  రూపమే  యగును !

శ్రీ గురుగీత . 5 వ శ్లోకం

కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం ।
గురుర్విశ్వేశ్వర సాక్షాత్తారకం బ్రహ్మ నిశ్చయః ॥

భావము :విశ్వమునకంతటికీ ఈశ్వరుడైనవాడే మానవ రూపమున సద్గురువుగా అవతరించును . కనుక అతడెచ్చట నుండిన అది కాశీయే . గంగ ఏ విష్ణు  పాదములయందుదయించునో  అట్టి సర్వవ్యాపియు సద్గురువు కనుక భక్తుని హృదయమున స్మరణ రూపమున ఆయనయే ఉండును . అట్టి స్మరణ చేయు శిష్యుని గృహము కూడా కాశీతో సమానమైనది . అతడు గురుపాదోదకముగ భావించి సేవించెడి  నీటి యందు అట్టి శక్తి మేల్కొనును . అట్టి సద్గురువు సాక్షాత్తు విశ్వేశ్వరుడే . ఆయన వాక్కు తరింప జేయునట్టి ,బ్రహ్మ వాక్కు ! ఇది నిశ్చయము .

వివరణ : " శ్రీ గురుగీత " శివపార్వతుల సంవాదము . దాని ఆరంభములో "యోగురు: సశివః ప్రాక్తో ,యః సగురు: " అనీ " స్వదేశికస్యైవచ నామకీర్తనం భవేదనంత్య శివస్య కీర్తనమ్ " అని అన్నారు . అట్టి శివుడు కాశీలో ఉండి అక్కడ మరణించిన జీవులకు కుడిచెవిలో తారకముపదేశించి ,ఉత్తమ గతినిస్తారని పురాణ కథ . దానిని 'కాశీ క్షేత్రం 'అన్న శ్లోకము సూచించడమే కాక వాస్తవంగా గురు శిష్యుల ఐక్యాన్ని సూచిస్తుంది . మహాత్ములను జంగమ తీర్దాలంటారు . సాయి తన పాదాల నుండి గంగను తెప్పించారు . సకల సృష్టిని నియమించగల సద్గురువున్న చోటు విశ్వేశ్వరక్షేత్రం కాకేమౌతుంది ? శ్రద్ధా భక్తులతో గురువునర్చించిన చోటు కాశీతో సమానము . అదే ' శ్రీ గురుచరిత్ర ' లో దీపకుడు కాశిలో వేదధర్మునకు చేసిన సేవకర్ధము .
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!2165
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 10, 2012, 01:51:55 PM »
జై సాయి మాస్టర్!
అమ్మగారు క్షమించండి
శ్రీ గురు గీత 3 వ   శ్లోకం లో ని వివరణ లో "సర్వ తీర్ధ ముల యందును  స్నానము చేసి మానవుడు  సర్వ పాపముల నుండి  విముక్తుడై  "ముక్తి 'ని  పొందును  ,అట్టి  ఫలమును  సద్గురు  మహిమను  సదా స్మరించుట  అను  గురు చరణ  తీర్ధ పానము  వలన  పొందగలరు .పై వివరణ లో ముక్తి అన్నచోట మూతి అని వచ్చినందుకు  నన్ను "గురు కుటుంబం "క్షమించ వలసినది  గా కోరుతున్నాను

 
 

2166
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 10, 2012, 08:30:35 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ గురు గీత -3 వ పద్యము
సర్వ తీర్ధావ గా హస్య సంప్రాప్నోతి ఫలం  నరః!
గురో : పాదోదకం  పీత్వా  శేషం  శిరశి ధారయన్ !!
భావము :గురువు  యొక్క  పాదోదకము  పానము చేసి ,శేషమును  శిరస్సున  ధరించు  నరుడు  సర్వతీర్ధము లందు  స్నానము  చేసిన  ,లేక  సర్వ స్ధలములను  దర్శించిన  ఫలము  పొందును .
వివరణ :శ్రీ సాయి బాబా  పాదముల  నుండి  గంగా యమునలు  ప్రవహించుట  గమనార్హము ,ఆది చైతన్య మునకు  రెండు  అంశములు  కలవు ,ఒకటి  చైతన్యము ,రెండు  శక్తి ,చైతన్యమును  శివుడు అని  ,శక్తిని  పార్వతి యని ,ఆ రెండింటి  ఏకత్వమును  అర్ధ నారీశ్వరుడని చెప్పుదురు ,ఆ రెండంశములు రెండు  పాదములుగా  కలవాడు  సద్గురువు ,అనంత కోటి  విశ్వములు   ,భూతములు   సద్గురువు  యొక్క  శక్తి  అనేది  ఒక  పాదము  ,ఇందు  సర్వ  తీర్ధములు ,సర్వ  పుణ్య  క్షేత్రములు   ,సర్వ  దేవతలు  ఇమిడి  వున్నారు .
  ఆది శక్తి  ,చైతన్యముల  రూపమే  తానని   గుర్తించిన  సద్గురువు  యొక్క స్ధితిని  ఆయన యొక్క  రెండు  పాదములుగా  వర్ణించుట  ,జరిగినది  .అట్టివారి  పాదోదకమును  సేవించుట   వారి  మహత్తును  ధ్యానించుట కు  సంకేతము !ఆయనతో  తాదాత్మ్యము  చెందుటకు  సంకేతము .ఇట్టి  బాహ్యమైన  చేష్ట  శ్రద్ధను  నిలుపును  ,ఆశ్రద్దను  నివారించును  ,మహాత్ముల  పాదోదకము   ప్రతిభావంత మగుట  భక్తుల  అనుభవము .
 గురు చరణములను  సదా స్మరించుట  అనెడు  తీర్ధమును  త్రాగువాడు  ముక్తిని పొందును ,ఒక్కొక్క  పుణ్య తీర్ధము  కొన్ని  పాపములను  మాత్రమే  తొలగించును ,సర్వ తీర్ధముల యందును  స్నానము  చేసి  మానవుడు  సర్వ  పాపముల  నుండి  విముక్తుడై  ముక్తిని పొందును ,అట్టి ఫలమును  సద్గురువు  మహిమను  సదా  స్మరించుట  అను  గురు చరణ తీర్ధ  పానము  వలన  పొందగలరు ,సర్వ  తీర్ధములందు  స్నాన మాడిననూ, భక్తీ  శ్రద్దలతో  గూడిన  ధ్యానము చేయనివాడు  విఫలుడగు నని  శాస్త్రము ,కనుక  అట్టి  ఫలమును  ముముక్షువు  తప్పక  పొందును

అలివేలు మంగ పతి నీకిదే వనదనం !
జై సాయి మాస్టర్!


 


2167
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 09, 2012, 08:26:05 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"శ్రీ గురు గీత "---2 వ శ్లోకము
యదంఘ్రి  కమల ద్వంద్వం  ద్వంద్వ తాప నివారకం !
తారకం  భవ శిందోశ్చ తం గురుం ప్రణమామ్యహం !!
భావము :ఏ గురువు  యొక్క పాద ద్వయము  రాగ ద్వేష శీతోష్ణాది ద్వంద్వాల  వలన  కలిగిన  తాపమును  నివారించునో  అటువంటి  పాదములు  కలవాడు ,సంసార  సముద్రము  నుండి  తరింప  చేయువాడును  అయినట్టి  గురునకు  నమస్కరించు చున్నాను .
వివరణ ము :శీతోష్ణాది  ద్వంద్వము ల  కాధార మైన  'నేను -జగత్తు ','జగత్తు -దైవము 'అనెడు  ద్వంద్వ  భావములను  నశింప జేసి ,ఈ రెండునూ అద్వితీయు డైనట్టి  తన  పాద ద్వయము  అనెడు  జ్ఞానమును  ప్రసాదించి  పరమ  స్వరూప మగు  ముక్తి నిచ్చు  గురువునకు  నమస్కరించు చున్నాను
'పాదము 'అనగా  అంశము  అని  ఒక అర్ధము ,స్ధితి అని ఒక అర్ధము ,ఒకటే రెండు స్దితులలో  వున్నది అను వివేకమే  జ్ఞానము
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!


2168
Request for prayers / Re: jai sai master!sri gurugeeta
« on: February 08, 2012, 08:51:38 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ గురు గీత :-1 వ  పద్యము
అచింత్యా వ్యక్త  రూపాయ నిర్గుణాయ గుణాత్మనే !
సమస్త జగదా ధార మూర్తయే  బ్రహ్మణే నమః !!
వివరణ :నామ రూప  గుణ రహితు దగుట వలన  చింతింప నలవి కాని వాడు రూపము వ్యక్తము  కాని వాడు నిర్గుణుడయ్యి గుణము లన్నీ  తానే అయినవాడు ,త్రిగుణ ములన్నీ  తానే  అగుట  వలన  త్రిగుణములు చేత  చేయబడిన  సమస్త  జగత్తునకు  ఆధారమైనట్టి  బ్రహ్మకు  నమస్కారము
(అనగా  పరబ్రహ్మ  స్వరూపుడైన  గురునకు  నమస్కారము )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

 


2169
Request for prayers / Re: jai sai master!
« on: February 07, 2012, 08:18:03 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
సాయి మందిరం  శిరిడి సాయి మందిరం
శరణన్న చొ  అభయ మిచ్చు  చరణ మందిరం
సర్వత్ర  నిండి వుంది  సదా నందము
ఎదుటనున్న  సాయి రూపు  చిదానందము
కోరిన  కోర్కెలు  తీర్చే  పెన్నిధానము    !సా !
జగమును  మైమరపించే  చిద్విలాసము
తనువంతా  పులకరించు  పారవశ్యము
నీవూ నేనూ  ఒకటగు  బ్రహ్మ  భావము
నిత్యమై  నిలచు నట్టి దివ్య జ్ఞానము
  సర్వ  సమత్వపు  భావన  కర్మ యోగము
  ప్రేమ భావ  పరాకాష్ట  భక్తీ యోగము
  అద్వైతపు  అనుభవాల  జ్ఞాన యోగము
  సాంప్రదాయ  బద్దమైన  సాయి యోగము          !సా !
చినిగి యున్న  కఫ్నీయే  చీనాంబరము
తల చుట్టూ  రుమాలే  రత్న  కిరీటం
చేత నున్న  సటకాయే  రాజ దండము
 శిధిల మైన  మసీదే  రాజ సౌధము                     !సా !
   ధునిలోగల విభూతి యే  ధనా గారము
  కల దంతా  పంచి ఇచ్చు  త్యాగ  భావము
  బిక్ష చేసి  జీవించే  వైరాగ్యము
 ఒక్కసారి  దర్శించిన  జన్మ  ధాన్యము           !సా !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!
2170
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ బాబా పుత్ర శ్రీ భరద్వాజ భక్తీ గీతాలు :(రచన :-గంధం  వెంకటేశ్వర రావు )
9 వ పాట
పల్లవి :ఊగుచుండెను  స్వామి ఊగుచుండెను
బాబా పుత్రుడా  భరద్వాజ గురుస్వామి
బంగారు ఊయలను  మా గురు స్వామి
చరణం :భక్త సులభుడు  ఆ  బాబా యె ఇలకు
భాను తేజముతో  భరద్వాజనం పై
బాగయిన గ్రంథమ్ము లెన్నిటినో వ్రాయించి
భక్తితో  పటియించి పరమాత్మ  చేరమని   !ఊగు !
చరణం :అవని జనుల బ్రోవ అలసి పోయేను
అలిమేలు మంగతో అలుక బూనేను
సత్పురుషులను గాంచె సత్సంగము లు  చేసే
సాయి మాస్టారుగా  సత్కీర్తి గాంచెను   !ఊగు !
చరణం :పరమ పధముకు త్రోవ  పదిలముగ వేసెను
పారాయణముతో  బయనించ  మనెను
వెన్నెలను మించు  ఆ  చల్లని  చూపులు
 మంచు తేనెను మించు  ఆ మంచి మనసు  !ఊగు !
అలిమేలు మంగ పతి నీకిదే వందనం!
జై సాయి మాస్టర్!


2171
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ బాబా పుత్రశ్రీ భరద్వాజ  భక్తీ గీతాలు (-రచన :-గంధం వెంకటేశ్వర రావు )
8 వ  పాట
పల్లవి :ఎట్టా కొలిసే దయా  భరద్వాజ స్వామి
నీకు సేవ లేమి చేసేది బంగారు స్వామి
విప్ప వేమి  ఆ ముడి  వివరించి చెప్పవేమి
ఏ దరికి చేరేది ఎట్టా నే తరించేది 
చరణం  :పాదుక సేవ చేదమంటే భరతు డంతటోణి గాను
రామ దాసు గారిలా  గుడి కట్టి ద్దామంటే
దెబ్బల  కసలోర్వ లేను తిట్టు లేమి తిట్ట లేను
మంద బుద్ధి గల వాణ్ణి మట్టి కుండ లాంటోణి
చరణం::చక్కని  సంకీర్తనలు  గానం నే  చేద మంటే
నారద తుంబుర లలో  నేనొక ణి  గానయా
కమ్మని  కావ్యాలు  నీపై  వ్రాసేద్దామనుకుంటే
కాళీ మాత ను చుసిన  ఆ  కాళిదాసును  కానయ్య !ఎట్టా !
చరణం :ఫలములు  తినిపిద్దామంటే మాత  శబరినీ   గాను
నేతి మిఠాయి లె డదామంటే కాసు లేమి లేనివాణ్ణి
సాయి నామ సార మంత దెల్పిన  సాయి మాస్టారు వని
దత్త వధూతవని  దండాలు  మాత్ర మెడతాను
చరణం:అర్ధ మాయే  నీ ఘనత  అలిమేలు మంగా పతీ
బాబా ప్రియ సుతుడవని భక్తితో  తలచు కుంటు
పది మందిలో కూకుంటా  పారాయణలు చేస్తా
ఇలపైన  తరియించి  పరమ పదము  పొందుతా
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!
2172
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ బాబా పుత్రా శ్రీ భరద్వాజ భక్త గీతాలు --(రచన :-గంధం వెంకటేశ్వర రావు )
7 వ పాట
పల్లవి :ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిని
భరద్వాజ శరణని  బలుకవే  మనసా
చరణం :సిరుల నొసగేటి  ఆ శ్రీ మహా లక్ష్మియే
అలమేలు మంగగా  అవని పై వెలసె
భక్త జనుల  బ్రోచు భగవాన్  విష్ణువే
భరద్వాజ  నామం తో  భువి పైన  వెలసే    !ఓం సాయి !
చరణం :సర్వ జనులను  కూర్చి  సత్సంగములు
సద్గతిని  బొందుమని సాయి సారము  దెల్పె
ఘన శ్యామ సుందరుని  గ్రంధములు  వ్రాసెను
పారాయణము  చేస్తే  పరమ గతి కలుగునని        !ఓం సాయి !
చరణం :సార మేమియు లేని  సంసారము నబడి
సత్యము  తెలియక  చతికిల పడి పోకు
సాయి నాధుని దలచి  సంతోషమును  బొంది
శరణు కోరే నీవు కైవల్య మందుకో            !ఓం సాయి !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్ !
2173
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ బాబా పుత్రా  శ్రీ భరద్వాజ  భక్తీ గీతాలు )(రచన :-గంధం వెంకటేశ్వర రావు )
6 వ పాట
పల్లవి : అంజలిదే గొనుమయ్య  అలమేలు  మంగపతి
ఆశ్రితులను  బ్రోచు  ఆ  శ్రీహరి  అవతారమా
చరణం :అజ్ఞానమనే  చీకటిలో  అలమటించు చున్నాము
నిజాన గని నీవు  వెలుగు  బాట జూపవయ్య
భాను తేజము తో  వెలిగే  బాబా ప్రియ సుతుడవని
భరద్వాజ  శరణమని  భక్తితో  బిలచే మయ్య        !అంజలి !
చరణం :సత్య మయిన  సంపద  నిత్యమూ  నిలవాలి
నియమము  వీడక  నిన్ను  తలచి నామయ్య
దత్తావ దూత వని  శరణంటి మయ్యా         !అంజలి !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

 2174
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
శ్రీ బాబా పుత్రా శ్రీ భరద్వాజ  భక్తీ గీతాలు -(రచన -గంధం  వెంకటేశ్వర రావు )
5 పాట
పల్లవి :ఎంత చక్క నోడివయ్య మా గురు స్వామి
నువ్వెంత మంచి వాడవయ్య భరద్వాజ స్వామి
చరణం :లీలా మృతము జూపి  సాయి లీలలను  దేలిపావు
గురు చరిత్ర  వ్రాసి నీవు  గురు ఘనతను  చాటావు
మాటలా  కానె కాదు  ముత్యాల  మూటలు
పాటలా  కావవి  బంగారు  బాటలు  !ఎంత !
చరణం :సాధనెంత చేసావో  శ్రమ లెంత చెందావో
సాయి నామ  సార మంత సర్వుల  కందించావు
మల్లె పూవు లాంటి  మనసు  మా దొరా  నీ కుంది
మంగ తాయారమ్మ  తల్లి  మీ సగమై యున్నది  !ఎంత !
అలివేలు మంగ పతి  నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!


2175
Request for prayers / Re: jai sai master!
« on: February 01, 2012, 09:16:12 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి  నీకిదే  వందనం!
4 పాట :
పల్లవి :గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వరా నమో
అన్నియు శ్రీ గురువేనని   ఆయనే భరద్వాజ యని
చరణం :అలమేలు  మంగ పతీ  ఆదరిస్తావని
సాయి మాస్టారు జీ శరణంటి నయ్యా
చేర దీస్తావని  చెంత నుంటావని
సాయి మార్గములో  నడిపి సద్గతినిస్తావని !గురునమో !
చరణం:వేద మూర్తి నీవని  వేనోళ్ళ  కీర్తిస్తా
శ్రీ  గురు మూర్తివని సర్వదా  అర్చిస్తా
సరిరారు  మమ్ము  బ్రోవ  ఇలపై ఇంకెవ్వరు
శ్రీ సాయి పుత్రా  శరణంటి నయ్యా  !గురు నమో !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

 

 
Pages: 1 ... 143 144 [145] 146 147 ... 149