Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: 1 [2] 3 4 ... 134
16
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదులో నివసించే సత్యవాణి గారికి తాత సమాధికి అయిదారు రోజుల ముందు సాయిబాబా కలలో కనిపించి " ఎవ్వరూ నా మాట వినట్లేదు ,నాకు బాగోలేదు ,అందుకే నేను వెళ్ళిపోతాను " అనిరి . అది విన్న సత్యవాణిగారు బాబాను ఎంతగా వెళ్లవద్దని ప్రాధేయపడినప్పటికీ బాబా అందుకు అంగీకరించలేదని కల వచ్చేసరికి ఆవిడ ఎవరికీ ఏ ఆపద రానున్నదో అని భయపడిపోయింది . ఆ తరువాత ఆ కల తాత అవతార సమాప్తిని సూచించినదని తెలిసింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

17
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ సంఘటనములన్నియు తాతగారు సమాధి చెందుటకు పదిహేను రోజులముందే తాతగారు అందించిన సూచనలు . కానీ ఏ ఒక్కరికి కూడా తాతగారి అవతార సమాప్తి గురించిన తలంపే మదిలో మెదలలేదు . ఇక తాత సమాధియైన రోజున కూడా స్పష్టముగా అనేకమంది దూర ప్రాంతముల భక్తులకు సందేశములిచ్చిరి . ఈ సంఘటలన్నియు తాతగారి మహాప్రస్థానమును గురించి తెలియబరచినవే . ఇప్పుడు మాత్రం భక్తులందరకూ ఈ సందేశములు అర్ధమయ్యి వాటి గురించి వారు ఆందోళన చెందుతుండగనే  తాతగారిని గురించిన వార్త అందరినీ శోకసముద్రములో ముంచి అందరూ పరుగు పరుగున కల్లూరు చేరిరి . అందులో కొన్ని సందేశములను ఇప్పుడు చూద్దాం .

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

18
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి.  శైలజ )

ఇక మల్లేష్ విషయమునకు వస్తే తాతగారికి ఎంత ప్రీతిపాత్రుడో నిరంతరమూ నిశ్శబ్దముగా తాత  సేవను ఏ విధముగా చేసుకున్నాడో మనము ఇంతకు మునుపే తెలుసుకున్నాము . అటువంటి అతనికి నూతన సంవత్సర ప్రారంభ వేళ తాత సన్నిధిలో గడపవలెనని చిరకాల కోరిక . అయితే అనేక ఆవాంతరముల వలన ఆ కోరిక నెరవేరలేదు . కానీ 31-12- 92 న అతను ఎట్టి పరిస్థితులలోనైనా తాతను దర్శించి తీరవరలసిందే నన్న పట్టుదలతో ఆటంకములన్నీ అధిగమించి 31-12- 92 రాత్రి సుమారు 11 గంటల ప్రాంతములో కల్లూరు చేరి 12 గంటలకు తాతకు పుష్పాభిషేకమును కరువు తీరేలా చేసుకుని అన్ని సంవత్సరముల తన కోరిక నాటికి ఫలించినందుకు మైమరచిపోయి తాత పాదములను కన్నీటితో అభిషేకించాడు . ఆ విధముగా తాత ఆ రోజు తనను ప్రత్యేకముగా దర్శించి పూజించు భాగ్యము ఇక ఎప్పటికీ లభించదు కావున అతనికి ఆ ఆఖరి సంవత్సరమునందు కలిగించి ,అతని చిరకాల కోరికను నెరవేర్చి అతనిని సంతోష పరచినారు . ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరమూ అతను క్రమము తప్పక ఆ సమయమునకు కల్లూరు చేరి తాతను పూజించుకుంటున్నాడు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

19
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇంకొక సంఘటన ద్వారా అదే నూతన సంవత్సరము నాడు తాతగారు ఇంకొక సూచనను కూడా చేసిరి . అదేమనగా నారాయణరెడ్డిగారు 31-12-92 సాయంత్రము నాటికి కల్లూరు చేరి తాతగారిని మనసారా ధ్యానిస్తూ మందిరాములో ఒక ప్రక్కగా కూర్చొనియుండిరి . కొత్త సంవత్సర వేడుకలకై తాతగారి నూతన గృహమును చంద్రారెడ్డి ,రమేష్ రెడ్డి ,మద్దులేటి కలిసి ఎంతో శ్రమ కోర్చి సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దిరి . ఆ రోజంతయూ తాతగారు ఆహారముకానీ ,నీరు కానీ తీసుకోలేదు . ఎవరేమి ఇవ్వబోయినా వద్దు వద్దంటూనే ఉన్నారు . లోపలకు ,బయటకు అనేకసార్లు పచార్లు చేయుచుండిరి . అలా చేస్తూ చేస్తూ హఠాత్తుగా హాలు మధ్యలో నిలబడి "యువర్ గాడ్ ఈజ్ గోయింగ్ బ్యాక్ -నో సిస్టమ్ " ( Your God is going back -No System ) అని బిగ్గరగా అరచిరి . అంత స్పష్టముగా వారు తమ అవతార సమాప్తి గురించి వెల్లడించి నప్పటికీ ఎవ్వరునూ ఆ సంగతిని గ్రహించలేకపోయిరి . ఎందుకనగా ఆ రోజంతా తాతగారు విరివిగా ఇంగ్లీషు పదములు ఉపయోగించిరి . అంతకు ముందు సంవత్సరము ఇదే రోజున తాతగారు ఇంగ్లీషులోనే మాట్లాడుటచే ఆంగ్ల సంవత్సర ప్రారంభము కాబట్టి తాత కూడా ఆంగ్లము మాట్లాడుతున్నారని అనుకున్నారే తప్ప తన గురించి చెప్పుతున్నారనే ఆలోచన ఎవ్వరకూ రాలేదు . రాలేదు అనేకన్నా తాత రానీయలేదు అనడం సమంజసముగా ఉంటుంది . ఎందుకనగా సమాధి తరువాత అందరూ ఈ విషయములన్నీ అన్వయించుకొనుటకు వారా విధముగా సూచిస్తారు తప్ప తమ గురించి తానెన్నడూ ప్రకటించుకోరు . నారాయణరెడ్డి గారు కూడా అదే విధముగా గ్రహించలేకపోయిరి . జనవరి ఒకటవ తారీఖున నారాయణరెడ్డి గారు హైదరాబాదు వెళ్ళుటకు తాత  అనుమతి కోరగా తాతగారు చిరునవ్వుతో చూచుచుండిరే తప్ప ఎంతకూ అనుమతినివ్వలేదు . తాతగారు ఎందుకిలాగ ప్రవర్తిస్తున్నారో నారాయణరెడ్డి గారికి  అర్ధము కాలేదు . ఎందుకనగా ఎప్పుడూ వారు తాతగారి అనుమతి పొందిన తరువాతే తిరుగు ప్రయాణమవుతారు . తాతగారు కూడా ఎప్పుడూ అభ్యంతరము తెలుపక చిరునవ్వుతో అనుమతి నిచ్చెదరు . ఈ సారి మాత్రం తాతగారు మూడు ,నాలుగు గంటలు కాలయాపన చేసి ఆ తరువాత అనుమతినిచ్చి ఆశీర్వదించిరి . అదే తన చివరి దర్శనమోతుందని నారాయణరెడ్డిగారు కలలో కూడా ఊహించలేదు . రెండు మూడు సార్లు తాతను అడిగి తాతచే అనుమతిని ఇప్పించుకుని మరీ తిరిగి వచ్చేసారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

20

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 ఆ తరువాత నూతన సంవత్సరమునకు వీడ్కోలిచ్చిరి కానీ నూతన సంవత్సరమును స్వాగతించలేదని అర్ధమయ్యింది . అంతేకాక తానూ మూర్ఖత్వముతో తాత ఇంటిని ఇష్టము వచ్చినట్లు మార్చివేసిరని బాధపడింది కానీ అది పూర్తిగా తాతగారి సమ్మతితోనే జరిగిందని ,లేకపోయినట్లైతే అసలా ఆలోచనే కార్యరూపం దాల్చేది కాదనీ ఆమె తెలుసుకుంది . తాతగారు కూడా ప్రత్యేకంగా ఆ మందిరంలోకి ఆమెను పంపించుట వలన తాత పూర్తి ఆశీస్సులు ,సమ్మతి ఆ మందిరమునకు కలవని ఆమె గ్రహించింది . 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


21
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
ఆ సంవత్సరము కూడా తాతగారు బయట కుర్చీలో కూర్చుని ఉండగా భక్తులందరూ తాత చుట్టూరా చేరి భక్తిగా నిలబడియుండిరి . అప్పుడు గురుచరిత్రను పారాయణ చేస్తున్న శైలజకు ప్రతి సంవత్సరము నూతన సంవత్సర ప్రారంభములో మ్రోగించే సైరను చప్పుడు వినిపించడమూ అప్పుడే కుర్చీలో కూర్చుని ఉన్న తాత లేవడమూ చూసి నూతన సంవత్సరము ప్రారంభమైనదని  భావించి తాత పాదములకు నమస్కరించుకున్నది . అయితే మిగిలిన భక్తులెవ్వరూ పాదనమస్కారము చేసుకోలేదు . ఎందుకనగా అప్పుడు సమయం రాత్రి 12 గంటలకు ఇంకా రెండు మూడు నిమిషముల వ్యవధి ఉన్నది . అప్పటి వరకు తాతగారితో ఉన్న అనుబంధము వలన తాత లేచి నిలబడేసరికి నూతన సంవత్సరము ప్రవేశించినదని ఆమె భావించినది . ఆ తరువాత రెండు నిమిషములకు భక్తులందరూ జయజయ ధ్వానములతో ఆ ఆరుబయటనే తాతగారికి పాదపూజలు హారతులు ఇచ్చి సంబరములు జరుపుకొనిరి . అయితే  ముందుగనే తాత ఎందుకని ఈ విధముగా ప్రవర్తించారో ఆమెకు అర్ధం కాలేదు . పూజలు ,హారతులు పూర్తి అయిన పిదప కూడా తాతగారు లోపలకు వెళ్ళలేదు . ఇక శైలజ తిరుగు ప్రయాణమునకు సిద్ధముకాగా తాతగారు ఆమెతో ప్రత్యేకముగా "లోపలకు వెళ్ళమ్మా " అని చెప్పిరి . తాతగారి భావము అర్ధమయినప్పటికీ ఆ మాటను ఉపేక్షించి కొంతసేపటికి తరువాత తాతగారికి నమస్కారము చేసుకుని బయలుదేరబోగా తాత 'లోపలికి వెళ్లి వెళ్ళమ్మా ' అని మళ్ళీ స్పష్టముగా చెప్పిరి . ఇక అప్పుడామె మందిరంలోకి ప్రవేశించి చూసేసరికి మొత్తం ఒకటే పెద్ద హాలు ,రంగు రంగుల తోరణములతో దేదీప్యమానముగా వెలుగుతోంది . అది చూసి బయటకు వచ్చిన తరువాత తాత " చూసావా అమ్మా - బాగుందా -ఇక వెళ్ళిరా - సాయిరాం " అని లోపలికి ఆమెతో పాటు నాలుగడుగులు ముందుకు నడిచి వచ్చిరి . అదే తాత ఆమెతో మాట్లాడిన ఆఖరు మాట .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

22
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
   ప్రతి నూతన సంవత్సర ప్రారంభమగు శుభ సమయమున కల్లూరులో నుండుట ఆమె కలవాటు . అదే విధముగా ఆ సంవత్సరము పూర్తి మార్పులతో ఉన్న తనకు ఇష్టములేని ఆ ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ రాత్రి సమయానికి కల్లూరు చేరి తాతగారి ఆశ్రమమును సమీపించుసరికి డిసెంబరు నెల చలిగాలిలో తాత దిగంబరముగా ఆ రాత్రి సమయములో ఇంటిలోపల కాక వెలుపలనే నిలిచియుండుట చూసి తన మనసుకు తగినట్లు తాత బయటనే ఉన్నారని తెలుసుకుని గురుచరిత్ర పారాయణము మొదలు పెట్టింది . మనము ఇంతకుమునుపే తాతగారు నూతన సంవత్సరము ప్రవేశించు సమయములో ప్రత్యేకముగా ప్రవర్తించి భక్తులకు తమ ఆశీస్సులందించెదరని తెలుసుకున్నాము .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

23
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అయితే పైన చెప్పిన ఈ మార్పులు హైదరాబాదులో ఉండే శైలజకు ఇష్టము  ఎందుకనగా షిరిడీలో బాబా 60 సం . లు శరీరముతో నున్న ద్వారకామాయిలోకి ఒక్కసారి ప్రవేశిస్తే బాబా అక్కడ చూపించిన లీలలు ,అనుభూతులన్నీ మదిలో మెదలడమే  కాక  బాబా ప్రతి కదలిక ,చర్యలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి . ఎందుకనంటే షిరిడీ సంస్థానము వారు ఇన్ని సంవత్సరములుగా ద్వారకామాయి సహజత్వమును కాపాడుతూ వస్తున్నారు . ఆ విధముగానే కల్లూరులో కూడా ఆ సహజత్వమును అదే విధముగా ఉంచినట్లయితే ఎన్ని సంవత్సరాల తరువాత ఎన్నివేల మంది తాత మందిరమును దర్శించుకున్నా  తాత కూర్చునే గట్టు ,మంచము తరచుగా నిలుచుని ఉండే స్థలము ఇలా రకరకాల తీపి గుర్తులు మదిలో మెదలుతుంటే తాతను దర్శించిన ప్రత్యక్షానుభూతి ప్రతి ఒక్కరికీ కలుగుతుందని ఆమె ఆలోచన .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

24
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారు తాను  సమాధి చెందెదనను విషయమును అనేక విధములుగా సూచించిరి . అంతేకాక సమాధి చెందిన రోజు వివిధ ప్రాంతములలోని భక్తులకు అనేక రకములుగ తను  సమాధి చెందబోవుటను గురించి నిదర్శనములు చూపించిరి . అందరూ ఈ సూచనలను ఒక్కొక్క విధముగా అర్థము చేసుకొనిరి . చాలా వరకు భక్తులకు తాత సూచనల ననుసరించి వారు అవతారము చాలించునట్లు ఆందోళన నొందిరి. తెల్లవారుసరికి అందరకూ ఈ వార్త పిడుగుపాటులా తగిలెను . అసలు తాత తన ఇంటిని సమాధి మందిరమునకు తగినట్లు మార్పులు చేయించుటయే ఒక పెద్ద సూచన . కానీ ఆ సమయమునకు తాతగారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయగలుగుతున్నామనే సంతోషము ,తృప్తితో ఇంతకుముందు చెప్పిన భక్తులందరూ ఈ నిర్మాణములో పాలుపంచుకొనిరి . అదే నేటి సమాధి మందిరమంటే తాతగారు ఆ భక్తుల సేవను ఆ విధముగా గ్రహించి వారిని అనుగ్రహించిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!25
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

షిరిడీలో సాయిబాబా కూడా భక్తులకు ఇదే విధముగా ప్రేరణ నిచ్చి సమాధి మందిరమును నిర్మింప చేసుకుని అది పూర్తయిన వెంటనే సమాధి చెంది తమ భౌతిక కాయమును ఆ మందిరములో ఉంచుమని సూచన లిచ్చిరి . ఆ విధముగనే తాత తన సమాధి మందిరమును తానె దగ్గరుండి కట్టించుకుని అది పూర్తయిన వెంటనే 37 రోజులు కూడా కాకమునుపే సమాధి చెందడం గమనిస్తే అవధూతలు ఎక్కడ ఉన్నప్పటికీ వారి నైజము ,ప్రవర్తన అంతా ఒకే రకముగా ఉంటుందనడంలో సందేహము లేదు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

26
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )


యోగులు ,అవధూతలు తాము శరీరముతో ఉండి  తాము చేయదలచుకున్న కార్యములను నెరవేర్చి వారు ఎప్పుడైతే కనుమరుగు కాదలుస్తారో అప్పుడు అంత నిశ్శబ్దముగానూ నిష్క్రమించెదరు . ఈ శరీరమును వదులుటకు వారు ఎదో ఒక కారణమును చూపించి దానివలన వారు కాయం వదిలినట్లు భ్రమ కలిగించెదరు . అదే విధముగా ఇప్పుడు తాతగారు కూడా తతాను  ఆయాసముతో బాధపడినట్లు కనిపించి ఆ మిషతో ఈ శరీరమును వదిలినారన్నది సుస్పష్టము . అంతేకానీ వారి శక్తికి మరణము లేదు . ఈ విషయములో ఎవ్వరికీ ఏ సందేహమూ అక్కరలేదనుటకు తాతగారితో భక్తులకున్న అనుబంధమూ ,నేటికీ కూడా తాతగారి లీలలను అనుభవించి రక్షణను పొందుటయే ఇందుకు  నిదర్శనము .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


27
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ విధముగా మందిరమును తమకు తోచిన విధముగా నిర్మించి తాతకు సకల వసతులు కలిగించ గలిగామని అందరూ సంతోషించుచుండిరి . కానీ కొత్త ఇల్లు గృహప్రవేశము జరిగిన తరువాత తాతగారు ఆ ఇంటిలో ఎక్కువ సమయము గడుపక అందరి ఇళ్లకూ తిరుగుతుండటం చూసి ఆందోళన చెందసాగిరి . ఆఖరుకు వాస్తు సరిగా లేదేమో అన్న అనుమానమూ వారికి కలిగినది . కానీ స్వయం దత్త స్వరూపుడైన తాతకు ఈ వాస్తులతోనూ ,శకునములతోనూ పనిలేదని తెలియనిది కాదు . అయినప్పటికీ తాత  ప్రవర్తనలోని మార్పుకు అందరూ ఆత్రుత చెందసాగిరి . ఈ విధముగా నెల రోజులు గడిచాయి . సంక్రాంతి పర్వదినాన కూడా తాత అందరితోనూ ఉల్లాసముగనూ  ,ఉత్సాహముగనూ గడిపిరి . మర్నాడు కనుమరోజు సాయంత్రమునకు తాతగారికి తాతగారికి విపరీతమైన దగ్గు ఆయాసము వచ్చాయి . చుస్తూండగనే   ఆయాసము ఎక్కువగుట చూసి మదిలేటి ,చంద్రారెడ్డి భయపడిపోయి ధనారెడ్డి గారి ఇంటికి కబురు పంపగా అందరూ వచ్చి పరిస్థితి చేయిదాటుచున్నట్లు  గమనించి ఏమిచేయుటకు పాలుపోక చూస్తుండగా తాతగారు ఆయాసముతో ఉక్కిరి బిక్కిరి అవడం చూసి ఇక లాభము లేదనుకొని డాక్టరుకై కబురు చేసిరి . ఇంతకుముందు ఎన్నోసార్లు ఎందరెందరో భక్తుల పాపకర్మలను తాననుభవించునప్పుడు  ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తగా ప్రతిసారీ చంద్రారెడ్డి వాళ్ళు డాక్టరుని తీసుకువచ్చుటకు ప్రయత్నించగా తాత అందుకు ఏనాడూ అంగీకరించలేదు . ఒకే ఒక్కసారి తాతగారిని బలవంతముగా డాక్టరు వద్దకు తీసుకుని వెళ్లిరి . కానీ జబ్బేమి లేదని తేలింది . కానీ ఇప్పుడు డాక్టరును పిలిపించుకు తాత అభ్యంతరమేమి పెట్టలేదు . కాబట్టి ధనారెడ్డి గారు డాక్టరును పిలిపించగా డాక్టరు వచ్చి పరీక్షించి ఇంజక్షను చేసి కొంతసేపు వేచి చూడవలెనని చెప్పారు . కానీ  కొంతసేపటికి పరిస్థితి మెరుగుపడకపోగా తాత  ఒక పక్కకు ఒరిగిపోతూ ఉండగా ధనారెడ్డి భార్య తాతను పట్టుకున్నారు . తాత పరిస్థితి విషమించుచున్నట్లు అందరకూ అర్ధమవ్వసాగింది . తాత లేకపోతే తమకు దిక్కెవ్వరన్న దిగులు ,ఆందోళన అక్కడున్న ప్రతివారిలోనూ స్పష్టంగా నెలకొని యున్నవి . అప్పుడు తాతగారు ఒక్కసారి కళ్ళు తెరచి అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా కన్నులతోనే సైగచేసి రాత్రి 7-45 ని . లకు తమ అవతారమును సమాప్తము గావించిరి .
 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

28
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారి మహత్యము లోకమున ప్రకటితమవ్వగానే తాతగారి సందర్శనమునకై వచ్చు భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోవుటచే అనేక విధముల మార్పులు తాతగారి ఇంటికి చేయుటకు ఎందరెందరో ముందుకు వచ్చి ప్రయత్నించిరి  కానీ ఎవ్వరికీ తాత ఆ అవకాశము ఇవ్వలేదు . అయితే తాత సమాధి చెందుటకు ఏడు ,ఎనిమిది నెలలముందు ధనారెడ్డి గారికి ప్రేరణ కలిగి తాతగారి పాత ఇంటిని సమూలముగా తీసివేసి పూర్తిగా కొత్త రూపముతో నిర్మించుటకు పథకము తయారుచేసి వెంటనే దానిని అమలు పరచిరి . అనుకున్న దానికన్నా ధనము అధికముగా వ్యయమాయెను . ధనము కొరకై ఆలోచించుచూ కొంత కాలయాపన జరుగగా హైదరాబాదు నివాసులైన చంద్రశేఖర రెడ్డిగారు ,సత్యనారాయణగారు ,రాజారావుగార్లు వారికి తోచిన ధన సహాయము వారు చేసి పూర్తియగుటకు కావలసిన ఖర్చు నంతటినీ భరించిరి . ఆ విధముగా మందిర నిర్మాణము అనూహ్య రీతిలో సకాలములో పూర్తి అయ్యెను . 9-12- 92 దత్తజయంతి నాటికి గృహప్రవేశమును అంగరంగ వైభవముగా చేయ నిశ్చయించిరి . కానీ ఆడంబరములకు అతీతుడైన తాత ఆ కార్యక్రమమును ఎంత నిరాడంబరముగా జరిపించుకున్నారో మనము ఇంతకుముందు తెలుసుకున్నాము .అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

29
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

                                                                                     అధ్యాయము -20
                                                    శ్రీ గణేశాయ నమః     శ్రీ సరస్వత్యై నమః   శ్రీ రామవధూతాయ నమః
                                                              తరుణోపాయం తారకమంత్రం తాత ఇతి శబ్దం
                                                              తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

మహాసమాధి -సూచన :

తాతగారు లోకమునకు ప్రకటితమై అనేకానేక లీలలను ,మహిమలను ,మధురానుభవములను అందించుటయే కాక అనేక సాయి మందిర విగ్రహ ప్రతిష్టాపనలు ,శంకుస్థాపనలు గావించిరి . అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ,రాజాధిరాజు ,యోగిరాజు పరబ్రహ్మయైన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజు మందిరములు అవధూతయైన  శ్రీ రామిరెడ్డి తాత చేతులమీదుగా జరుగుటచే ఆ మందిరముల యొక్క శక్తి మరింతగా పెరిగి ఎవ్వరైతే ఒక్కసారి ఏ మందిరములలో ప్రవేశించిరో వారికిక తీరని కోరిక ,సమస్యలంటూ ఏమీ ఉండవు . తాతగారి చేతులమీదుగా వెలసిన మందిరములు భక్తుల కోరికలను కర్మలను ధ్వంసము చేయుటలో అగ్రగామిగా నిలిచాయి .


అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

30
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
                  గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
తరువాత భక్తులందరూ తాతగారిని మల్లికార్జున స్వామి గర్భగుడిలోనికి ఆహ్వానించగా తాతగారు వెంటనే లేచి బయలుదేరిరి . అప్పుడు తాత పాదములకు పాదరక్షలుండెను . పాదరక్షలతో ఆలయ ప్రవేశం  చేయరాదు . కానీ ఆ సంగతిని తాతగారికి చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది ? కావున భక్తులందరూ తాత ఏం చేస్తారో అన్న ఆతృతతో ఎదురుచూస్తుండగా ఎవ్వరూ ఏమీ చెప్పకుండగానే  వారి ఆందోళనను రూపుమాపుతూ తాత తనకు తానుగా పాదరక్షలను వదిలి ఆలయ సాంప్రదాయమును గౌరవించిరి . తరువాత భక్తులందరూ పరివేష్ఠింపగా తాత గర్భగుడిలోనికి ప్రవేశించి తన భక్తులందరికీ తనలో శ్రీశైల మల్లికార్జునుని దర్శించు భాగ్యమును కలిగించిరి . ఆ అద్భుత దర్శనంతో భక్తులందరూ పులకించిపోయిరి . ఈ దృశ్యమును కెమెరాలో బంధించి ఒక తీపి గుర్తుగా ఉంచుకొను ఉద్దేశ్యముతో తీసిన ఫోటోలు ఏవీ రాలేదు . ఆ ముందు ,తర్వాత తీసిన ఫొటోలన్నీ యథాతథంగా వచ్చినవి . ఇది తాతగారి లీల కాక మరేమిటి ? అక్కడ నుండి బయటకు వచ్చిన తాత శ్రీశైల క్షేత్రమున కలియతిరిగి ఆ క్షేత్రముతో తనకున్న అవినాభావ సంబంధమును లోకమునకు చాటి చెప్పిరి .

                                                        త్వమేవ సర్వం మమ దేవ దేవ
                                                  పందొమ్మిదవ అధ్యయము సంపూర్ణము

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Pages: 1 [2] 3 4 ... 134