Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: [1] 2 3 ... 139
1
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

మహాత్ముల చరిత్ర ఏ కొంచెం రాయాలన్నా వారి యొక్క కరుణ ఆశీర్వాదం ఉంటేనే గాని  సానుకూలపడదు . రాసేది మనమే అయినా వ్రాయించేది ఆ సమర్థ సద్గురువే అన్న విషయం గుర్తుంచుకుంటే ఆయనకు కావలసిన విధంగా రాయించుకుంటారు . వారి యొక్క దివ్యమైన ,అమూల్యమైన వాక్కు ,మనన ,శ్రవణాలు ముక్తికి సోపానాలు కాగలవు . నాబోటి అనామకుడికి ఈపాటి సంక్షిప్త చరిత్ర వ్రాయటం దుస్సాధ్యమే . కొన్ని ముఖ్యమని తోచిన లీలలను మాత్రమే తీసుకొని వాటిని మీ ముందుంచుట జరిగినది .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

2
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                      శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము  రామమోహన రావు )

శ్రీ గజాననుల యందు ఎవరికి దృఢ విశ్వాసముంటుందో వారి ఆటంకములు పటాపంచలైపోతాయి . మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతూవుంది . పనిచేస్తూ చేస్తూ ఒక కూలివాడు శిఖరం మీదకు వెళ్ళాడు .  అతడు మేస్త్రికి రాళ్లు అందిస్తున్నాడు . ఒకసారి రాయి అందిస్తు కాలు జారి ముప్పై అడుగుల ఎత్తునుండి కిందపడ్డాడు . అందరు అతను మరణించాడని భావించారు . అంతా అతని వద్దకు చుస్తే అతనికి ఒక దెబ్బ కూడా తగలలేదు , విషయం అడిగితే తన కాలు జారినప్పుడు తనను ఎవరో పట్టుకొని దింపారు అన్నాడు . ఆ కూలివాడు గజాననుల మందిర నిర్మాణం జరుగుతూండగా చనిపోయాడు అన్న నింద స్వామి తనపై వేసుకొనలేదు . అతన్ని రక్షించటానికే కంకణం కట్టుకున్నారు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


3
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                     శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామమోహన్ రావు )

శ్రీ లక్ష్మణ్ హరి రంజల్ కి కూడా ఇలాంటి అనుభవమే కలిగింది . పనిమీద బొంబాయి వెళ్లి వున్నాడు . పని ముగించుకుని బోరుబందర్ కి వచ్చాడు . అప్పుడతనికి ఒక పరమహంస కనుపించారు . ఆజానుబాహుడు ,పొడవైనవాడు ఆయన 'నీవు గజాననుల శిష్యుడవు గదా ,,మరి ఎందుకు ,వ్యాకుల మనస్సుతో ఉన్నావు . నీ ఇంటి వద్ద పుణ్యతిథి రోజున 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశావు . బాపుట్ జీ పుత్ర శోకంతో ఉన్నా భోజనానికి వచ్చాడు . షేర్ కర్ జీ భోజనం చేయలేకపోయాడు ' ఆ విషయం నీకు తెలుసు గదా ! అన్నాడు . ఇవి ఈయనకు ఎలా తెలుసు అనుకొని సంఘటన నుండి తేరుకొని నమస్కరించాడు . వెంటనే స్వామి అదృశ్యమయ్యారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

4
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                                       శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

సమాధి అనంతరం దర్శనం -లీలలు

శ్రీ గజాననులు సమాధి అయిన తరువాత భక్తులు ఇంకా షేగాం లో ఏమి మిగిలింది అనుకున్నారు .మందిరంలో దేవుడు లేనప్పుడు మందిర ద్వారాలకు పూలతో ఏమి పని . ఈ సందేహాలన్ని నిరర్ధకాలని నిర్ధారణ కాబడినవి . ఇంద్రాణి నది ఒడ్డున జ్ఞానేశ్వరులు జీవ సమాధి కాబడ్డారు . అయినా భక్తులు వెళ్ళటం మానేశారా ? గణపతి బోడే అను భక్తుడు ఒకడుండేవాడు . శ్రీ స్వామి సమాధిని ( గజాననులు ) నిత్యం దర్శించేవాడు . కొంత సమయం ఆనందంగా గడిపేవాడు . ఒక రోజు ఒక ఆలోచన వచ్చి రేపు విజయదశమి గదా ! స్వామి సమాధి అభిషేకం చేయించి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం ఏర్పాటు చేశాడు . అది చూసి అతని భార్య ఇదంతా ఏమిటి ? ఇంత డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారు . రేపు విజయదశమి పండుగ పెట్టుకుని పిల్లలకు బట్టలు ,నగలు వగైరా తెండి అంది . తన భార్య వ్యవహారం అతనికేమి నచ్చలేదు . ప్రపంచాన్ని కన్నా పరమార్ధాన్నే ఎక్కువగా మిన్నగా ఎంచేవాడు . అతని భార్యకు స్వామి కలలో  కనిపించి " నీ పతిని ఇబ్బంది పెట్టకు ,నీ పతి శాశ్వతమైన దానిని పొందుట కొరకు ప్రయత్నించు చున్నాడు . నీవో అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నావు . నీ వస్తువులు ,ధనము ,ఇల్లు ,చుట్టాలు ,స్నేహితులు ,ఎవరు నీతో రారు . అన్నింటినీ విడచి పరలోకానికి రావలసినదే . ఇప్పుడతను చేసే పని వ్యర్ధంకాదు ' అని చెపారు . తెల్లవారి స్వామి కలలో కనపడినదంతా పూసగుచ్చినట్లు తన భర్తకు వివరించినది . చూశావా స్వామి యొక్క కృప , కాబట్టి నేటి నుంచి అశాశ్వతాలయిన  వాటిని గురించి ఆలోచించకు అన్నాడు . గణపతిరావు భక్తితో పూజించాడు ,అనుకున్న విధంగా సంతర్పణ చేశాడు . వీటికి చాలా ఖర్చు చేశాడు .

                                       
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

5
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                                  శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

తదనంతరం ఈ విధంగా బోధించారు . నేను వెళ్లిపోయాయని ఎప్పుడు అనుకోవద్దు . భక్తిలో ఏ మాత్రం కోపం రాకుండా చూచుకోండి . నన్నెప్పుడూ మరువద్దు ,నేనెప్పుడూ ఇక్కడే వుంటాను . అంటూనే శ్వాసను యోగంతో బంధించి ప్రాణ జ్యోతిని మస్తికంలో కేంద్రీకరించారు . శాఖ సంవత్సరం పదునెనిమిది వందల ముప్పై రెండు ,సాధారణ నామ సంవత్సర శుద్ధ పంచమీ గురువారం మొదటి జాములో ప్రాణాన్ని నిలువరించే కాలములో 'జయ గజాసన ' అనే పదాలు వెలువడ్డాయట . శరీర చలనం ఆగిపోయింది . భక్తులు శోకిస్తున్నారు . ఈ విషయం నాలుగు దిక్కులా వ్యాపించింది . భక్తులు దర్శనార్ధం ఆ రోజు సాయంత్రం వరకు ఉంచారు . స్వామి అంతిమయాత్ర బ్రహ్మాండంగా మేళతాళాలతో  ,మామిడి తోరణాలతో ,పూలతో రథం అలంకరించబడింది . గులాబీ పూలు ,డబ్బులు ,తులసి దళాలు చల్లి ,షేగాం అంతా ఊరేగించారు . ఆ అంతిమయాత్ర మాటలతో వ్రాయుటకు వీలులేనంతగా వుంది . ఉత్తరాభి ముఖంగా ఉంచి శాస్త్ర సమ్మతంగా సమాధి చేశారు . పదిరోజులవరకు సమారాధన జరుగుతూనే వున్నది  . ఎందరు ప్రసాదం పొందారో చెప్పనలవి గాదు .
         
 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

6
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
                 గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                              శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

అంతట సిద్ధయోగులకూ హరవిరహం సహించరానిదయింది . అది చుసిన హరిపాటిల్ మీ కంటి వెంట నీళ్లకు కారణమేమి స్వామి ,నేనేమైన అపరాధం చేసానా ? కారణమేమిటో సెలవివ్వండి స్వామి ,అని అడిగిన హరిపాటిల్ తో దీని కారణాన్ని నువ్వు తెలుసుకోలేవు . మన షేగాం వెళ్లిపోదాము ,నీ పాటిల్ వంశానికి ఏ లోటూ ఉండదు . షేగాం తిరిగి రాగానే సమారాధన చేసారు . స్వామి పండరీపూర్ లో చేసిన సూచనలవల్ల కలత చెంది తనతోటి భక్తులతో ,పండరీపురంలో స్వామి ఇక కొద్దీ రోజులు సహవాసమని చెప్పారు . శ్రావణమాసం గడిచింది . స్వామి శరీరం క్రమక్రమంగా క్షీణించసాగింది . భాద్రపదమాసం ప్రవేశించింది . గణేశచతుర్ధశికి స్వామి భక్తులతో అందరు మఠానికి రండి అని చెప్పారు . భక్తులు స్వామి ఆజ్ఞను శిరసావహించిరి . తరువాత స్వామి మట్టితో గణపతిని తయారుచేసి దాన్ని పూజించాలి . నైవేద్యం మొదలైనవి సమర్పించాలి . రెండవరోజు అనగా పంచమినాడు దానిని నిమజ్జనం చేయాలి . చతుర్దశి రోజున స్వామి ఎంతో ఆనందంగా  ఉన్నారు . బాలాభువా స్వామిని చెయ్యిపట్టుకొని ఆసనంపై కూర్చో పెట్టారు . ....

                                 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

7
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                                    శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

ఆషాడ మాసంలో స్వామి విఠలుని దర్శనార్థం హరిపాటిల్ తో కలిసి పండరీపూర్ బయలుదేరాడు . భక్తుల కల్పతరువు సర్వేశ్వరుడు జగన్నియామకుడు ఆయన . పండరీపురం రాగానే చంద్ర బాగా నదిలో స్నానమాచరించి పాండురంగని దర్శించేందుకు మందిరానికి వెళ్లారు  అలా దర్శించుకొన్న స్వామి ,హే పాండురంగా ,హే పండరినాథా ,హే రుక్మిణి కాంతా అని పరిపరి విధముల ప్రార్ధించి నీ ఆనతితో యీ భూమిపై సంచరించి శ్రద్ధ ,భక్తి కలవారి మనోరథాలన్నింటిని పూరిచేసాను . నా అవతార కార్యం పూర్తి అయినదని నీకు తెలుసుకదా స్వామి !  నిజాధామాన్ని చేరుటకు అనుజ్ఞ యివ్వండి . నేను భాద్రపద మాసంలో నిరంతరం వైకుంఠంలోనే ఉండాలని మీ చరణ సన్నిధికి చేరుకోవాలని వాంఛిస్తున్నాను ,అని ప్రార్ధించి శ్రీ విఠలుడికి స్వామి చేతులు జోడించారు . నేత్రాలు అశ్రుపూరితము లయ్యెను .
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

8
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                                       శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

ఏనుగునుండి వెడలిన దంతమును ,సముద్రము నదీ జలములను త్రిప్పి పంపుట ఎంత నిజమో ,గురువునుంచి వెడలిన వాక్కు ఉపసంహరించుట అంత నిజము . భగవంతుడు కొన్ని కార్యక్రమములను నిర్వర్తించ వలసినదిగా యోగులను సృష్టిస్తాడు . అందుచే వారి యొక్క జననం గోప్యం . అంతను తెలియచేయుచు కొన్ని సూచనలు మాత్రము తెలియజేయుట కద్దు . అలాగే గజాననుల విషయంలో గూడా అదే జరిగినది . జీర్వవస్త్రాన్ని విడచి కొత్త వస్త్రాన్ని మార్చిన్నట్లుగా ఈ శరీరాన్ని మార్చవలసి ఉంటుంది . దానిని తప్పించడం అనే పని జరుగదు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

9
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                         శ్రీ గజానన్ మహారాజ్  చరిత్ర ( వేము రామ మోహన రావు )

స్వామి సమాధి

సిద్ధయోగుల మాట జరిగి తీరవలసినదే . దానికి తిరుగులేదు . అలాగే భక్తులు వారికిచ్చిన మాటను కూడ తు .చ . తప్పకుండా ఆచరించవలసినదే . సిద్ధ యోగుల కథలు ,వారి చరిత్రలు ,వారి యొక్క దినచర్యలు వింతగా ,చూచేవారికి విడ్డూరంగా కనబడతాయి . అందువల్ల సామాన్య మానవులమైన మనము వారిని గుర్తించుట కష్టము . అందువల్ల యోగిని యోగియే గుర్తించవలయును . మనం చేసుకున్న పూర్వ పుణ్యం వల్ల వారు మనకు తారసపడి మనలను భక్తి ప్రపత్తులవైపు మరల్చుతూ వారికి ఏది అవసరమో అంతవరకు నెరవేర్చి వారిని పునీతులను చేస్తారు . భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు తనను అనన్య భక్తితో ప్రార్ధించే వారి యొక్క యోగక్షేమములను తానేచూచెదను అని నొక్కి వక్కాణించారు .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


10
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥
     
                                 శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

1. కర్మ మార్గం :అంటు ,ముట్టూ ,సంధ్యానుష్టానాలు ,వ్రతాలు ,ఉపవాసాలు ,వీటిని జాగ్రత్తగా ఆచరించేవారిని బ్రహ్మవేత్త అంటారు . ఈ మార్గాన్ని జాగ్రత్తగా ఆచరించేవారిని బ్రహ్మవేత్త అంటారు . ఈ మార్గాన్ని ఎన్నుకునేటప్పుడు చాల జాగ్రత్త వహించాలి . ఈ మార్గంలో నడిచేవారు అసభ్య ప్రవర్తన ,కఠోర వచనాలు పలుకరాదు . ఆచి చూచి అడుగువేయాలి . ఏ మాత్రం కోపం గలిగినా సాధన వ్యర్ధమవుతుంది .

2. భక్తిమార్గం : పవిత్రమైన మనస్సు ,అంతః కరుణా ,దయ ,ప్రేమ ,తెలుసుకోవాలనే కోరిక ,పూజ చేయటం ,భక్తి శ్రద్ధలు కలిగి ఉండుట ఇవన్నీ సాధకుని లక్షణాలు . భక్తి మార్గం చూడటానికి చాలా సులభంగా కనిపిస్తుంది . దీని సాధన ఏం కష్టం కాదు ,కానీ కర్మమార్గం కంటెకష్టమైనది .

3. యోగమార్గం : పై రెండు మార్గాలకంటె భిన్నమైనది . దీని మార్గం గూడా చాల పెద్దది . ఈ మార్గంలో బయటవస్తువులతో  పనిలేదు . బ్రహ్మాండంలో ఉన్నదే యీ పిండంలో ఉన్నది . యోగ మార్గానికి ఆసనం ,రేచకం ,ఇడ ,పింగళ ,దేవిముద్ర ,త్రాటక కుండలిని ,సుషుమ్నా యివన్నీ పరిచయమున్నవారే యోగమార్గాన్ని ఎన్నుకోవాలి .

ఈ మూడు మార్గాలవల్ల కలిగే ఫలితం ఒక్కటే . కాని ఆ ఈశ్వరునిపై ప్రగాఢ విశ్వాసం ప్రేమఉండాలి . అవి లేని ఏ సాధనైనా వ్యర్ధమే . శ్రద్ధ అత్యంత అవసరం . శ్రద్ధ నిష్ఠ కలవారికే ఫలితం దక్కుతుంది . అది కూడ దూషణ ,భూషణ ,తిరస్కారాలను సమానంగా భావించిన వారికి మాత్రమే ,ఏమైన శక్తులు లభించి వాటిని వక్రమార్గానికి ఉపయోగించినా ,చేసిన ప్రయత్నం అంతా వ్యర్థం .


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

11
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ గజానన్ మహారాజ్ దివ్యచరిత్ర ( వేము రామ మోహన రావు )

యోగుల కలయిక, సాధన మార్గాలు

శ్రీ వాసుదేవానంద సరస్వతి అనే నా గురు బాంధవు మహా కర్మిష్ఠుడు ,రేపు నన్ను చూడటానికి వేంచేయుచున్నారు . అతను వచ్చే దారిలో ఎలా గుడ్డపీలికలు లేకుండా చూడాలి అలా కనపడిందో అతడు మండిపడతాడు . అతను వచ్చినప్పుడు పాటించవలసిన పద్దతులను ముందుగానే స్వామి వివరించారు . రెండవరోజు మొదటి జామునే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములు మఠానికి వచ్చారు . ఒకరినొకరు చూచుకున్నారు . మందహాసం చేశారు . ఇద్దరు కలియటం వల్ల మహదానందాన్ని పొందారు . ఒకరు పశుపతి అయితే రెండవవారు  శేషసాయి . వాసుదేవానంద సరస్వతి మందిరంలో ప్రవేశించినప్పుడు శ్రీ గజానన స్వామి మంచం మీద కూర్చొని చిటికలు వేస్తున్నారు . స్వామిని శ్రీ వాసుదేవానంద సరస్వతి చూడగానే చిటికలు ఆపేశారు . ఒకరివైపు ఒకరు చూచుకున్నారు . ఓ క్షణం చూసి వాసుదేవానంద సరస్వతి కళ్ళతో నే వెళ్తున్నట్లుగా తెలియచేశారు . మంచిది అన్నట్లుగా శ్రీ గజాననులు తల ఆడించారు . వీరిద్దరు స్వాముల మౌనసంభాషణలను చూచి బాలాబువా చలించిపోయాడు . వీరిద్దరి  మార్గాలు వేరు . అది గ్రహించిన స్వామి నీ సందేహం నాకర్ధమయింది . సాధనలో మూడు రకాలయినవి ముఖ్యంగా కనిపిస్తాయి . (1) కర్మ మార్గము (2) భక్తిమార్గం (3) యోగమార్గం .
 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

12
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                 శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )
మానవత్వం

'భీష్మ ఏకాదశి ' పండరీపురంలో విఠల్ ను దర్శించడానికి భక్తులు విపరీతంగా వస్తుంటారు . అంటువ్యాధులు కూడా సోకడం కద్దు . ఈ  ఉత్సవానికి షేగాం నివాసులు కూడా కొందరు వచ్చారు . కొందరు భక్తులకు కలరా సోకడంలో జనాన్ని పండరీపురం నుంచి బయటకు పంపి వేస్తున్నారు . చంద్ర భాగానది అవతలి ఒడ్డున కురుద్వాడి స్టేషను వైపు నుంచి భక్తులు వెళ్లడం ప్రారంభించారు . షేగాం నివాసియైన 'కవరై ' కి కూడా కలరా వ్యాధి సోకింది . వాంతులు ప్రారంభమయ్యాయి . కాళ్ళూ ,చేతులు బరువనిపించసాగాయి . ఎవరూ చేయడానికి దగ్గరకు వచ్చే వారు కాదు . కలరా భయం వల్ల ,పోలీసులకు భయపడి ఈ విషయం బయటకు తెలియనివ్వక ఆ రోగిని అక్కడే  వదిలి షేగాం  నివాసులు వెళ్ళిపోసాగారు . ఆపదలో ఆదుకునేవారు  ఎవరుంటారు ? సంపదలు ఉన్నపుడు అంతాదరి చేరుతారు . చెరువులో నీళ్లుంటేనేగా చేపలుండేది . ఇది లోక సహజం . కానీ ఇలాంటి సమయాల్లోనే ఏ భగవంతుడో వారికి దారి చూపి సాయం చేయడానికి వస్తారు అను తెలుసుకున్న కవరె  కూడా స్వామీజీని ప్రార్ధించాడు . అప్పుడు స్వామీజీ ఇతనిని కూడా మనతో తీసుకువెళదాం అన్నారు . ఒకడేమో ఇతడు చనిపోయాడేమో అన్నాడు . ఇతనిని తీసుకెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది . అందుచేత  చంద్రభాగానది దాటి వెళ్లడం మంచిది అన్నారు . దానికి స్వామీజీ కోపంగా నువ్వేమి మాట్లాడుతున్నావు ? మన గ్రామస్తుడు  క్లిష్ట పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నపుడు అతనిని వదలి వెళ్లడం మంచిదా ? న్యాయమా ? మానవత్వం గల మనిషికి ఇది సిగ్గుచేటు అని స్వామి ఆ రోగి వద్దకు వెళ్లి చేయి అందించి లే !లే ! మన ప్రాంతానికి పోదాం అన్నారు . నీవు భయపడాల్సిన అవసరంలేదు ,నీకు గండం గడచిపోయింది అని అతని శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించారు . క్షణంలో స్వామి కృపవల్ల విరేచనాలు ,వాంతులు తగ్గిపోయాయి . యోగులను ఆశ్రయిస్తే యముడు కూడా దగ్గరకు రాడు . స్వామీజీ ఆశీర్వాదం పొందిన అతడెంతో ధన్యజీవి .

 
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

13

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                             శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

దయ్యం పీడ

బాపురావు భార్యను దయ్యం పట్టి పీడించసాగింది . దాని ప్రభావం వల్ల నుదిటిమీద సింధూరం ,కంఠం బిగుసుపోవడం ,వంటిమీద వస్త్రాలు కాలిపోయేవి . మరొకప్పుడు జీడీల తో కాల్చిన బొబ్బలు కన్పించేవి . ఈ దయ్యం పీడించడం వల్ల బాపూరావు భార్య చిక్కి శల్యమైంది . అన్న పానాదులు ,నిద్రాహారాలు కరువయ్యాయి . అకోలా నుంచి ఒక మాంత్రికుణ్ణి  పిలిపించారు కాని ఆ ప్రయత్నం కూడా వ్యర్థమైంది . మందులు వాడారు . అంత్రాలు కట్టించారు -తంత్రాలు చేయించారు . అన్నీ నిష్ఫలమయ్యాయి . చిట్టచివరకు స్వామి వద్దకు తీసుకువచ్చారు . సింహం ఉన్నచోట నక్క తెలివి ఏం ఉపయోగిస్తుంది ? కస్తూరీ గంధం ఉన్నచోట దయ్యం దుర్గంధం దరి చేరగలదా ! అని  బాపూరావు స్వామీజీని ప్రార్ధించాడు . స్వామీజీ కృపా దృష్టిని ఆమెపై సారించారు - క్షణంలో దయ్యం పీడ విరగడైంది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

14
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                           శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

మందిరం దగ్గిరలోని హాలులో ముస్లిం సాధువును ,రామమందిరంలో స్వామీజీ ఉండే విధంగా ఏర్పాటు చేశారు . కానీ స్వామీజీ రామందిరంలో ఉండక ఆ హాలుకే వెళ్లారు . అంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు . ముస్లిం సాధువు పంజాబ్ వెళ్ళడానికి టికెట్టు కొనిపెట్టండన్నారు . స్వామి 'కురుకు ' లోని మసీదు పని ప్రారంభించి సగంలో వెళ్ళవద్దు . మసీదు పని పూర్తయ్యాక వెళ్ళవచ్చు అని పలికారు . స్వామి కృపవల్ల మసీదు పని పూర్తవుతుంది . ఈనా మాటలు వ్యర్ధంగావు సిద్ధయోగులు  అన్ని మతాలను ఒకటిగానే తలుస్తారు . మసీదు విషయంలో నన్ను ఇక్కడ వుంచే ప్రయత్నం చేయకండి . మసీదుకైనా ,మందిరానికైనా ఒకే సామాన్లు పనికి వస్తాయి . కానీ నిర్మాణంలోనే తేడా . ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వారు కట్టుకుంటారు . హిందువులు ,ముస్లింలు ,అందరూ భగవంతునికి చెందినవారే . అందువల్ల అన్ని మతాలలో ప్రేమను పెంచుకుని సుఖ శాంతులు పొందాలి . ఈ సత్యాన్ని మర్చిపోకూడదని మెహాతాబ్ షా చెప్పి తనదారిన పంజాబు వెళ్లపోయెను . మళ్ళీ తిరిగి రాలేదు .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!15
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః
 

            శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

ఇదిలా ఉండగా బచ్చులాల్ వినమ్రుడై స్వామితో మీరు రేపు మా యింట ఆతిథ్యం స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయాల్సిందిగా ప్రార్ధించెను . ప్రార్ధనను మన్నించిన స్వామిని టాంగాలో కూర్చోబెట్టి అతి వైభవంగా మేళతాళాలతో భక్తులు వెంటరాగా బచ్చులాల్ ఇంటికి గైకొనివచ్చెను . కానీ స్వామి టాంగాలో నుంచి కిందకు దిగటానికి అంగీకరించలేదు . దీనికి కారణమేమిటో తెలియదు స్వామి నిన్నటి రోజున ఆహ్వానానికి సమ్మతించి ఈనాడు ఇంటికి రావడానికి ఎందుకు ఇష్టపడలేదో అర్ధం గాక బాపూరావు వ్యధ చెందారు . అక్కడున్న వారిలో ఒకడు నా దృష్టిలో ముస్లిం సాధువైన మెహతాబ్ షా ను ఆహ్వానించకపోవడమే కారణమై ఉండవచ్చనీ ,అందువల్ల స్వామీజీ బండి దిగలేదనీ అన్నాడు . చివరకు ఆ ఆమాటే నిజమైంది తరువాత వారిద్దరినీ ఒకే బండిలో ఆహ్వానించి తీసుకువచ్చిరి .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Pages: [1] 2 3 ... 139