Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Priya

Pages: [1] 2 3 ... 19
1
General Discussion / Doubt about sri manikya prabhu charithra
« on: June 15, 2017, 03:35:35 PM »
జై సాయి మాస్టర్ !

జై సాయి మాస్టర్ బాబుగారు !

గురుబంధువులకు జై సాయిమాస్టర్ !

శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్ర గ్రంధం గురించి సందేహం ఉన్నది. చాలాచోట్ల (సత్సంగాలలో కూడా) శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర(రచన -గంటి రెడ్డెయ్య) అనే గ్రంధం పారాయణ చేస్తున్నారు.
 
ఈ మధ్య గురుబంధువు ఒకరు శ్రీ మాణిక్య చరితామ్రుతము (అనువాదము - మమత ఆనందరాజ్ ప్రభు)
(ప్రకాశకులు - శ్రీ మాణిక ప్రభు సంస్థానము). మాణిక్యప్రభువులు చతుర్ధ దత్తావతారులు అని cover page మీద ఉంది . పూజ్య శ్రీ మాస్టర్ గారు వ్రాసిన దాని ప్రకారం మాణిక్య ప్రభువులు మూడవ అవతారము (నేను పొరబడ లేదనుకుంటున్నాను). ఇది సరైన గ్రంధం కాదేమో అని అనుమానం వచ్చింది.

forums లో శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర (గణపతి రావు మాస్టారు) అని ఒక గ్రంధం ఉన్నట్లు చదివాను.
 
అసలు ఈ మూడు గ్రంధాలలో సరైన గ్రంధం ఏది ? దత్తుని చరిత్ర కదా, శ్రద్దగా పారాయణ చెయ్యవలసిన గ్రంధమే కదా. పారాయణకు సరైన గ్రంధమేదో దయచేసి తెలుపగలరు.

జై సాయి మాస్టర్ !

2
Jai Sai Master! 
Thanks jagadish garu.
Panditulu ante ardham kaaledu amduke vivarana adiganu.
Jai Sai Master!

3
General Discussion / Dakshinamurthy Tatvam ?
« on: January 03, 2017, 12:33:26 PM »
జై సాయి మాస్టర్!

శ్రీ సాయి లీలామృతము ఆధ్యాయము-10 (యోగీశ్వరుడు ) Pg 86 :

శ్రీ రాముడు,శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు అధ్యాత్మిక విధ్యనందించి ధర్మాన్ని పోషిస్తారు.

ఆధ్యాయము-17 ఉపదేశాలు- 2 (అనుగ్రహబలము) Pg 141   

నాకు 1914 లో శిరిడీ వెళ్ళినప్పుడు ఆయన "మౌనంగానే, ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని,అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమని అనుభవమిచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో యిలా ఎన్నడూ చెప్పలేదు." అదే దక్షిణామూర్తి తత్త్వమని ఆదిశంకరులు కీర్తించారు.

దక్షిణామూర్తి తత్త్వము అంటే ఏమిటి? శ్రీ దక్షిణామూర్తి అవతారాలు ఎవరు?    

జై సాయి మాస్టర్! 

4
Jai Sai Master!

Sajaathiya bhava parampara _ oke rakamaina bhavamulu
Ani anukuntunnanu. Exact ga theliyadu.

Jai Sai Master!

5
జై సాయి మాస్టర్!

Quote
Quote
గురు నానక్ చెప్పిన దృష్టాంతం ఉండనే ఉంది.
భగవదారాధన వల్ల చిత్త్తం శుద్ధం కాగానే ఆయనే మనకి ఒక గురువుని పంపిస్తాడు. మనామా గురువుని ఎంత వరకూ అవగాహన చేసుకున్నాం అనే దాన్ని బట్టీ మన ఆధ్యాత్మిక జీవితం లో అభివృద్ద్ధి ఉంటుంది.

Quote
భగవదారాధన వల్ల చిత్త్తం శుద్ధం కాగానే ఆయనే మనకి ఒక గురువుని పంపిస్తాడు.

నేను కల్పించుకున్నానని అనుకోకండి.ఎందుకంటే ఈ విషయంలో నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి.
నాకు తెలిసి దీనికి "శ్రీ గురు చరిత్ర" పారాయణ మాత్రమే ప్రమాణము.దత్త స్వామి ఆదేశమే మనము పాటించ వలసినది.

నేను clear గా వ్యక్త పరచలేదు అనుకుంట. పూర్వ పుణ్యం,సత్కర్మలు ఉండాలి కాదనడం లేదు.కానీ ఈ కాలానికి "శ్రీ గురు చరిత్ర" మాత్రమే ప్రమాణము. సాక్షాత్తు శ్రీ సాయి నాధుడు కూడా "శ్రీ గురుచరిత్ర"కే ప్రాధాన్యమిచ్చారు. ఫూజ్య శ్రీ మాస్టర్ గారిని కూడా శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన తరువాత సాయి స్వప్నదర్శనము ఇచ్చి తన శిష్యునిగా చేసుకున్నారు.మనకు ఈ పద్దతి ప్రమాణము.

అంటే ఈ కలి కాలంలో ఎట్టి గురువుని ఆశ్రయించాలో మనకు తెలియదు. అందుకు "శ్రీ గురుచరిత్ర" మాత్రమే ప్రమాణము. గ్రంధంలోనే మాస్టర్ గారు అన్నీ వివరంగా వ్రాశారు. "లేక పోతే ఈ కలి కాలంలో కపట గురువుల బారిన పడడం తధ్యం".ఈ కాలానికి మాస్టర్ గారు చెప్పిన పద్దతిలో గురువుని ఆశ్రయించాలి. నేను ఇది ఎందుకు రాశానో మీకు అర్ఢమయ్యి ఉంటుంది.  :)               
 
జై సాయి మాస్టర్!   

6
జై సాయి మాస్టర్ !

Quote
గురు నానక్ చెప్పిన దృష్టాంతం ఉండనే ఉంది.
భగవదారాధన వల్ల చిత్త్తం శుద్ధం కాగానే ఆయనే మనకి ఒక గురువుని పంపిస్తాడు. మనామా గురువుని ఎంత వరకూ అవగాహన చేసుకున్నాం అనే దాన్ని బట్టీ మన ఆధ్యాత్మిక జీవితం లో అభివృద్ద్ధి ఉంటుంది.

Quote
భగవదారాధన వల్ల చిత్త్తం శుద్ధం కాగానే ఆయనే మనకి ఒక గురువుని పంపిస్తాడు.

నేను కల్పించుకున్నానని అనుకోకండి.ఎందుకంటే ఈ విషయంలో నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి.
నాకు తెలిసి దీనికి "శ్రీ గురు చరిత్ర" పారాయణ మాత్రమే ప్రమాణము.దత్త స్వామి ఆదేశమే మనము పాటించ వలసినది.

Quote
మనామా గురువుని ఎంత వరకూ అవగాహన చేసుకున్నాం అనే దాన్ని బట్టీ మన ఆధ్యాత్మిక జీవితం లో అభివృద్ద్ధి ఉంటుంది.

ఇది నూటికి నూరు శాతం Correct .

జై సాయి మాస్టర్!                                             

7
జై సాయి మాస్టర్!

Quote
శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ చెప్పినట్టు "Love is not an action to have a reaction. Love is a state of mind" . భగవంతుణ్ణి నేను పూజించాను కాబట్టీ నాకు ఫలితం ఇవ్వాలి అంటే నేను చేసిన కర్మకి నాకు రెసుల్త్ కావాలి అడుగుతున్నట్టు అంటే నా సాధన ఇంకా పూర్ణమవలేదని అర్ధం. ఏ రోజైతే నా సాధన పూర్ణమయ్యిందో ఆ రోజు నేను అడిగేది ఏమి లేదు.
 

మనకు ఋషి ప్రోక్తమైనదే ప్రమాణము (అంటే మహాత్ములు చెప్పినవి) వీళ్ళూ వాళ్ళూ చెప్పినవి కావు  :)

జై సాయి మాస్టర్!

8
జై సాయి మాస్టర్! 

Quote
Aa Rushi ey Chaitanya Kakshya lo undi rasaro - aa kakshya lo unna vaaru matrame cheyya galige pani adhi

అందుకే శ్రీ గురుచరిత్రను తెలుగులో అనువదించే సామర్ధ్యము ఫూజ్య శ్రీ మాస్టర్ గారికి మాత్రమే కలిగినది.
ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు మాస్టర్ గారు గుర్తుకొచ్చారు.         
Quote

Manam Peddalu nadachina margam lo vellale gaani Pandithula margam lo vellakudadhu - Master EK
 
కొంచం దీనికి వివరణ చెప్పగలరా? నేను EK గారి గ్రంధాలు చదవ లేదు. Homeo కి వెడతాను.

జై సాయి మాస్టర్!

9
General Discussion / Re: On Pride
« on: December 23, 2016, 11:56:11 AM »
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ అనంత్ గారు!

Quote
This so called friend believes in Dattatreya Swamy. Reads many spiritual books. Loves Sri Gajanan Maharaj and believes that Sri Gajanan Maharaj is the complete incarnation of Sri Datta Swamy. But he does not believe in Sri Sai Baba. He believes that Sri Sai Baba is Muslim (well, no surprise here. We are blinded by our self-taught knowledge). He also hates muslims.

శ్రీ గజానన్ మహరాజ్ కూడా చాలా గొప్పవారు కదా.మీ friend కి బాబా మీద ఉన్న భావాన్ని ఆయన ఎందుకు correct చెయ్య లేదు?

చాలా విషయాల వల్ల ఒకటి అర్ధమయ్యింది. ఏ మహాత్ముల భక్తులైనా మాస్టర్ గారి గ్రంధాలు చదవనిదే బాబా మాత్రమే కాదు ఆ మహాత్ములు కూడా అర్ధం కారు.   
జై సాయి మాస్టర్!   

10
Kids - The Future / Re: protection for girls???
« on: December 19, 2016, 09:16:13 PM »
Jai Sai Master! 
Self defense classes mandatory  kaaledu. Annie kottalo hadavidi chestaru. Nijaaniki aa rakamgaa neggukuraavadam kudaa amtha thelika kaadu. Udaharanaki domgathanam chesevaadu sadhyamainamtha jagrattalu tesukumtaadu.
Evi kuda anthe.
Jai Sai Master!

11
Kids - The Future / Re: protection for girls???
« on: December 18, 2016, 10:34:21 PM »
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ బాబుగారు!

Quote
Ee vyavasthanu maname maarchukovaali. Daanine dharmam annaru.

మనం మార్చాలనుకుంటే వాళ్ళు మారతారా? నా వంతు ప్రయత్నం నేను చేసాను. అది కూడా మాస్టర్ గారి అనుగ్రహమే.
అంటే ఆ ధర్మాన్ని ఆచరింప చెయ్యలన్నా సద్గురు అనుగ్రహముండాలి. ఎలా చూసినా తిరిగి తిరిగి ఆయనే దిక్కు.

జై సాయి మాస్టర్! 

12
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ రవి కృష్ణగారు !

Quote
1.Maastaaru cheppinattu naaku sambandhichina vyavahaaram lo nenu sincere gaa prayathninchaanu. Kaanee result anukunnattu raa ledu. Aithe nenu evarikosamo chesthunnaanu anukondi. Adi jaragakapothe iddari bhaavaalu chedipoye Pramaadam undi. Naadi, nenu evari kosam chesaano vaaLLadi. Naa vyavahaaram lo avakapothe nenu daanni oppukovachchu kaanee vere vaaLLa vishayam lo jaragakapothe oppukoleka povachchu. Idi "Mamakaaram" valla koodaa kaavachchu.

2. Uncertain outcome unde daggara " sincere effort" anedi elaa kuduruthundi? Nenu sincere gaa efforts pettina daggara result raakapothe or vasthundane guarantee lekapothe "Adi naa sreyassuke" ane bhaavam elaa nilusthundi?

దీనికే ఓరిమి అని చెప్పారు అని అనుకుంటున్నాను.  ఏది వచ్చినా,ఏది జరిగినా తమాయించుకునే గుణం ఏర్పరచుకోవాలి.నెమ్మదిగా ఆ భావాన్ని జయిచడం అలవడుతుంది. 

శ్రీ సాయినాధ ప్రబోధామృతము - Pg 50 "సద్గురువుకు పగ్గాలప్పగించిన తరువాత చింతకు తావేలేదు".
ఇది చదివితే మీకు బాగా అర్ధమవ్వవచ్చు.           

Quote
3. OkaveLa "Sarvasya SaraNaagathi" ante inka chesedi emuntindi? 

సర్వస్య శరణాగతి అనేది అంత తెలికైనదికాదు. అందుకే సద్గ్రంధ పఠన, సత్సాంగత్యము,సద్గురు సేవ అన్నీ చేసుకుంటూ ఆయన అనుగ్రహానికి పాటుపడవలసినదే.
నేను అర్ధము చేసుకున్నది చెప్పాను.     

జై సాయి మాస్టర్!             

13
జై సాయి మాస్టర్!

ఒకరికి చిన్న వయస్సులో భర్త మరణించారు. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి బొట్టు తీయడం విషయమై ప్రస్తావించగా, మాస్టర్ గారు అమ్మా! ఆడవాళ్ళకు పుట్టుకతో వచ్చినది ఎందుకు తియ్యాలి అంటారు.
శ్రీ సాయి మాస్టర్ స్మృతులు (రెండవ భాగము)-Pg 191
 
ఇప్పటికి ఈ రోజులలో కూడా ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నాయి.

అలివేలు మంగపతి మీకిదే వందనం!

జై సాయి మాస్టర్!     

14
జై సాయి మాస్టర్ !

Swachamaina nammakam ante Bhakta Kannappa bhakti veru. andulo bhayam kanapadadu. kaani alanti bhaktulu ee rojullo bahu arudu kada. manam ippudunna paristitula drustya maatladukuntunnamu kada. 

"మూఢనమ్మకము" గురించి కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను.
కొంతమంది ఉపవాసం చెయ్యలేరు కానీ భయంతో చేస్తారు.ఇప్పటికీ జరుగుతున్నవే. (బాబా,మాస్టర్ గారు వాటిని ప్రోత్సహించ లేదు).

మరొక విషయం నాకు అర్ధం కాదు. ఒక సారి మేము మెహబూబ్ నగర్ వెళ్ళాము అక్కడ ఎవరో ఇద్దరు ముస్లిం మహనీయుల సమాధులు ఉన్నాయి.
అక్కడ వాళ్ళు చెఫ్ఫారు ఈ పరిసరాలు వాళ్ళ అనుగ్రహముతో ఉన్నాయని. మేము నంస్కరించుకుని వద్దామని వెళ్ళాము.ఎవరో తెలియదు కదా,బాబాని స్మరించి నమస్కరించుకున్నాము. అప్పుడే ఎవరో ముస్లిం మహిళలు అక్కడకు వచ్చి మా వంక చాలా కోపంగా చూసి.వాళ్ళ పిల్లలను ఆ సమాధులు తాకవద్దని కసురుకున్నారు. వాళ్ళు బయటనుంచే నమస్కరించుకుని వెళ్ళిపోయారు.

నాకు విషయం అర్ధం కాక చాలా బాధగా అనిపించింది.తరువాత మా పాప చెప్పింది వాళ్ళలో ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకోడదుట. బయటనుంచే నమస్కరించుకోవాలట. పురుషులు మాత్రమే లోపలికి వెళ్ళవచ్చునట. ఆ సమయంలో నాకు బాబా,మాస్టర్ గారు అంత ఎత్తులో కనిపించారు,వారి గొప్పతనం నా మనస్సులో ఇంకా పెరిగింది.(మనకు ఏ నియమాలు పెట్టకపోయినా మనం ఇలా ఉన్నామే అనిపించింది  :) ).
పాపం వాళ్ళకు ఇలా చాలా ఉన్నాయిట, ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులం. మాస్టర్ గారు మనకు ఎన్ని మార్పులు తెచ్చారో.

సర్వ జీవులను మీ కరుణతో కాపాడుతున్న మీకు మా నమస్కారములు తండ్రి.

జై సాయి మాస్టర్!                     

15

జై సాయి మాస్టర్!

శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు -అధ్యాయము - 12 (లక్ష్యము - అవగాహన)
అర్ధంచేసుకోవడానికి మీకు help అవుతుందేమో.

జై సాయి మాస్టర్! 

Pages: [1] 2 3 ... 19