Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: [1] 2 3 ... 153
1

 


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥


శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ  అమ్మవారి దేవాలయములో 13 రోజులూ  పూజా ,సాంస్కృతిక కార్యక్రమాలచే  ,అనేక సత్సాంగత్యములచే ఆరాధనా మహోత్సవములు జరుపుకుని మాఘశుద్ధ పొర్ణమినాడు బందరు పురవీధుల గుండా ఆశ్చర్యాన్ని గొలిపే విధముగా కళాకారులచే తమ స్వరరస మాధుర్యములచే ప్రజలను భక్తిరస వాహినిలో ఓలలాడించే విధముగా అమ్మవారి రధోత్సవము జరుగును . భక్తులు నిండు మనస్సుతోనూ ,భక్తితోనూ ,మాటలతోనూ ,చేతులతోనూ అమ్మవారిని స్మరించి సర్వమానవ హృదయాలలో గూడుకట్టుకున్న అంధకారాన్ని తొలగించే ఆ ఆదిపరాశక్తి మా ముంగిట వచ్చింది ,మాలో దాగివున్న జ్ఞానాంధకారములను పారద్రోలి పరలోక ప్రాప్తిని మోక్షాన్ని ఇవ్వడానికే ఆ జగత్ జనని రూపములో శ్రీ దొంతులమ్మ  అమ్మవారు విచ్చేసారు అన్న ఆనందము ,అపూర్వము ,బ్రహ్మానందము ,అలాగే దేవాలయ మూలస్థానము నుండి వచ్చే ఆ దివ్య తేజస్సు వర్ణనాతీతము ,అపూర్వము ,మాటలకందని మహాదానందం . మనః ప్రాణః దేహః కర్మలన్నీ ఆగి ధ్యానంలో నిర్విచార నిర్వికల్ప నిరానంద మసమాధిస్థితి కలగజేసేటి ఆహ్లాదకర ఆనంద వాతావరణం దేవాలయ ప్రాంగణం .
 
   
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!2

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

  ప్రతినిత్యమూ అనేకమైన కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమము ,చండీ హోమములు ,రుద్ర హోమములు , లక్ష్మి  నరసింహ స్వామి సహిత సుదర్శన హోమములు మరియు అమ్మవారి ఆలయ మూలవిరాట్ నకు మరియు అమ్మవారి పంచలోహ విగ్రహమునకు శాస్త్రోక్తముగా పంచామృతమలచే అభిషేకములు ,చందన   ,కుంకుమ ,చందనపుష్ప అక్షింతలచే అనేక విధములుగా షోడశోపచార పూజలచే విరాజిల్లుచున్నది .   

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

3

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ అమ్మవారు 1862 లో కనిగిరి నుండి బయలుదేరి ఎన్నో గ్రామాలు సందర్శించి అనేక మందిని తన శిష్య బృందములుగా చేసినవారిని చరిత్ర ద్వారా తెలియుచున్నది . ఇప్పటికీ గుంటూరు జిల్లా ,నెల్లూరు జిల్లాలో దొంతులమ్మ అని ,దొంతులరావు అని పేర్లు పెట్టుకొనుట గమనించగలము . అలాగే అమ్మవారికి అనేక మందిరములు ఆశ్రమాలు నిర్మించి ,శిష్యబృందముచే నిర్వహించుచున్నారు . సత్ సాంగత్యము సాధనలు శిష్య పరంపరలచే జరుగుచున్నవి . తుదకు బందరు చేరి సుమారు 60 సంవత్సరములు జీవన ప్రస్థానము గావించినారు . ప్రత్సతి  నామ సంవత్సరము మాఘశుద్ధి తదియ మంగళవారము ది 9-2- 1932 శ్రీ దొంతులమ్మవారు బ్రహ్మ  ఐక్య సిద్ధి పొందుటకై సజీవ సమాధి నొందియున్నారు . ప్రతి సంవత్సరము మాఘశుద్ధ తదియ రోజు నుండి అమ్మవారి ఆరాధనా మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి .   

     
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

4

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ అమ్మవారు (1805 నుండి 1862) వరకు కనిగిరి దుర్గమందు గార్లపేట ఆశ్రమము నందు అష్టాంగ యోగాలచే మరియు తన తపోశక్తిచేత ఎందరికో ఆత్మసాక్షాత్కారము లభించేలా చేసి ముక్తి మార్గాన్ని బోధించినారు . శిరివబ్రహ్మవిష్ణు స్వరూపములను ఒకటి చేసి సృష్టి మూలవిరాట్ ని దర్శించేలా చేసి ,పరమచైతన్యములో ఐక్యమయ్యేలా ,దాని యందే ఎప్పుడూ నిలిచి వుండేలా యోగమును కల్పించిన సత్ గురుః .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


5
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ద్వాదశ సూక్తులు

6. నిజభక్త హృదయాంతరాళమందు నిలచేను .

7. పుణ్యపురుషులను గురువు చెంతకు చేర్చేము .

8. ధర్మము చేసినవారు ,ఒకరిని దూషించనివారు ,ఒకరి సొమ్ముకు ఆశపడనివారు నాకత్యంత ప్రీతిపాత్రులు .

9. తోడేకొలది బావిలోనీరు ,దానధర్మాలు చేసేకొలది సంపదలు వృద్ధి చెందుతాయి .

10. నీగత జన్మ కర్మలే నిన్ను వేధిస్తుంటాయి . నాన్నాశ్రయిస్తే అవి మెల్లగా వెనుదిరుగుతాయి .

11. నీ మనసును నావైపు మరలిస్తే జ్ఞానప్రదమౌతుంది . లేకుంటే అది అజ్ఞానం పాలౌతుంది .

12. నాన్నాశ్రయించినవారి సకల బాధ్యతలను నేనే నిర్వహింతును .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


6
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ద్వాదశ సూక్తులు

 1. నా భక్తులకు యే ప్రళయములు రావు .

2. అస్మద్దివ్యనామ పఠనాసక్తులై ఆనందాన యుండేరు .

3. పోతులూరి వారి భక్తులు జ్యోతిస్వరూపులై యుండేరు .

4. మమ్ములను దూషించినందుకైనా సహించేము .

5. నన్ను పూజించి ,నా కాలజ్ఞానమును పారాయణము చేసిన వారికి ఒక పుష్పమిచ్చిన జోడు పుష్పములు అగును . 
         

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

7
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

            శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు
 
103. ...  నందిపల్లెలోను బసవన్న కడుపులో
            నరుల పేరిటకమ్మ లుండేనయ
           ముందాటి కమ్మలోను వార్తలు విని
           మూర్ఛబోయి నరులు మడసేరయ .

104. ఇంతింత పిల్లలు వివరాలు చెప్పంగ
        జ్ఞానం తెలిసిన పెద్దలింటారయ
         వరికూడు తినంగ వరసాలు తప్పంగ
       పెనిమిటిని పేరొత్తి పిలిచేరయ .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

8


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

                 శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు
 
101. గుర్రాల జంపిన ఖర్మాలు దప్పావు
        గురికి దృష్టాంతర మయ్యేనయ
        పెంపు లేకుండాను కందునూరు సీమయ్యే నుమా
       తత్త్వములయ్యి బొయ్యేనయా .

102. కందునూరులో ఏడేనుగల ధ్వని
        గలిగిబల్ గలిబిలి అయ్యేనయ
        కుందేనలు వేసి ఆత్మకూరు వచ్చి
        కందనూరు సీమగట్టేరయా .
       
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

9

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

      శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

 99. ఆదవేణిలోను ఆశ్చర్య ధ్వని బుట్టి
       అతలాకుతలాము అయ్యేనయ
       వాదాముతో పగళ్లు గట్టిమీదట
      వడంబికా పురిగట్టు కొనియేరయా .

100. అదవేణి  నుండి తల్లి రచ్చినదండు
        ఆలగొండ  తూర్పున మడిసేనయ
        అదవేణి సీమచట పేటయ్యీని
        అలాగె కార్టనూరు అయ్యేనయా 
       
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

10
 
 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

               శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

 97. బిజనూరు కోటలో ద్రవ్యాము దీసేరు
       బెజవాడ కంబోయ్యేరయ
       బిజనూరు సీమంత బ్రాహ్మణులు కిచ్చేరు
       బెజవాడ ఆర్థితో యిచ్చేరయా .

98. ఆనందగురువుల వెంటబెట్టుకుని
      అహోబిలము జేర వచ్చేనయ
      ఆనందగురువుల అనుమతి చేతాను
      అన్నసత్రము లచట గట్టేరయా . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


11


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                  శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

95. గోదావరీ తీరవాసులా బిలిపించి
       గోదానములు బహు ఇచ్చేనయ
       ఆదరించి బ్రాహ్మలకు యనేక
       అగ్రహారముల్ ఆర్దిముచ్చేరయా .

96. ఆకాశవీధినా రాకాసిపంపులు
      కేకాలు వేయుచు వచ్చేరయ
      చీకాకు పరచుచు ద్రావీదులందారు
      లోకేశ్వరుడు వచ్చి బుట్టేనయ . 

 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

12

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

 శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

 93.  గోల్కొండ వద్దాను గోవిందపురములో
       గోగర్భమున నరుడు బుట్టేనయ
       గోవులన్నీ గూడి కలిభారతమంతాను
       గొల్లవాండ్లకు శివాలెక్కేనయా .

94. గంగలో ఆస్తులు గాయలోను పిండాము
      సాంగముగా దెచ్చి పెట్టేరయ
       శ్రింగేరిలో యున్న శ్రీభారతీ లేచి
      శ్రీహరి వెంబడి వచ్చేనయా .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

13

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

   శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేద వాక్యములు


91. చంద్రగుప్తరాజు శాపవిముక్తుడై
      జయహరుని జూచియు బోగడేనయ
      ఇంద్రాది సురులాకు వందానములు జేసి
     ఇందిరేసుని కృప బొందేనయా .

92. గోల్కొండ మీదాసు బంగారు కోమలీ
      కొండెక్కి కూతలు బెట్టేనయ
     మాలబోయలుగూడి ముష్టియుద్ధము చేత
     మహానంది పంపూన మడసేరయా .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

14

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

    శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు   

89.  బాటల మల్లికార్జునస్వామి సన్నిధిలో
        బంగారు పరిగెలు బోసేరయ
        ఆడనుండి బెల్లంకొండాకు వచ్చియు
        అరవైకోట్ల ద్రవ్యము తీసేరయా .

90. అంబ భ్రమరాంబ ఆకురాలీదీరగ
     ఆవుపాలారగించేనయ
     అంబాపురముల జూచి ఆవులు అరచీని
    ఆకాశమున గుబులు బుట్టేనయా .

   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!15


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

            శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

 87. పద్మపురాణములో యుండేనయ
       పద్మసంభవుడు బల్కిన భవిష్యాము
      పద్మనాభునిరావె పద్మసంభవు వల్ల
     పద్మనాభుని మహిమ లుండేనయా .

88. మధుర మీనాక్షమ్మ మాట్లాడుచుండీని
      మహిని యద్భుతాలు బుట్టేనయ
      మధుసూదనస్వామి మహిమ చేత భువిలో
      మాయవాదు లణగి పొయ్యేరయా .
     
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Pages: [1] 2 3 ... 153