Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - kittulahri

Pages: [1] 2
1
Jai Sai Master !!!!

Ee sandehaalaki dayachesi samaadhaanaalu cheppagalaru !!!!

Jai Sai Master

Ravi Krishna P

2
జై సాయి మాస్టర్ !!!!

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనానికి వెళ్లిన నాకు తెలిసిన విషయమేంటంటే పూజ్య మాస్టారితో సాన్నిహిత్యం కలిగిన "పెసల సుబ్బా రామయ్య" మాస్టారు తమ దేహాన్ని త్యజించారు. తన ఇంటిని "సాయి మాస్టారి నిలయంగా" మార్చి స్వామి దర్శనానికి వచ్ఛే భక్తులకి ఆశ్రయం కల్పించే వారు ఇక లేరు .

ఆయనకీ మాస్టారి మీద ఎంత అభిమానమంటే "కర్మ బంధాలు అన్నీ కలిసి ఒక తాడుగా కట్టబడినప్పుడు మదపుటేనుగునైనా కట్టెయ్యగలవు" మొదలైన సూక్తులు ఆయన ఇంటి మీద రాసి ఉండేవి. అలాగే భరద్వాజ మాస్టారిని దత్త స్వామి రూపంలో ఉన్న ఫోటో చూడండి.

నేను ఆయన్ని మునుపు కలిసినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సారి నా దురదృష్టం. ఏమైనా మనస్సే కాదు, వాక్కే కాదు కర్మా చరణలో గురువుని ఎలా చూడాలో ఆయన జీవితం నుంచి నేర్చుకోవాలి.

అలాగే అక్కడ గోడ మీద చదివిన ఒక విషయం చెప్తాను:
"తూర్పు గోదావరి జిల్లా నుంచి వఛ్చిన ఇద్దరికీ మాస్టారి ఫోటో మధ్యలో ఉండి వెంకయ్య స్వామి వారి ఫోటో చివర్లో ఉండడం ఏమిటి అన్న సందేహం వస్తే సాయి నుంచీ, వెంకయ్య స్వామి నుంచీ దీపాలు పూజ్య మాస్టారి లోకి వచ్చి  ఆయన ఎంత గొప్ప వారో వారికి అనుభవం అయిందట (ఆర్డర్ గుర్తు లేని నా బుద్ధి హీనతని మన్నించండి).

"మీరు కోరుకున్నవి గాక మీకు శ్రేయస్కరమైనవి నేను చేస్తాను" - ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

అని రాసి వుంది.

జై సాయి మాస్టర్ !!!!

3
జై సాయి మాస్టర్ !!!!

నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవే అని అనుకుంటున్నాను.

ఉనికిగా ఉన్న "నేను" తనని తాను తెలుసుకుంటూంటుంది. అయితే ఈ తెలుసుకోవడం "Objective experience" కాదు. అంటే ఉదాహరణకి మనం ఒక వస్తువుని చూసినప్పుడు "ఈ వస్తువు ఇది" అని చెప్తాము అంటే మనస్సు అనే సాధనం ద్వారా "నేను" తెలుసుకుంటోంది. ఉదాహరణకి "నేను ఒక పండుని చూసాను". ఇందులో పండు "object". Subject  "నేను". అంటే ఇది an experience of an object.

అయితే "నేను" ఉనికిగా ఉంది తనను తాను అనుభవిస్తూ  ఉంటుంది. ఎలా అంటే, మనం "నేను" అనే వాణ్ని ఉన్నానా అని ప్రశ్నించుకుంటే ఆ "నేను" అనేది ఉనికి (Awareness) అనేది మనకి తెలుస్తోంది. ఉదాహరణకి ఒక ఉపమానంగా తీసుకుంటే "ఏం చేస్తే సూర్యుడు తనని తాను తెలుసుకుంటాడు?" అంటే నిజానికి ఏమి చేయనక్కరలేదు. అలాగే మనలో ప్రకాశించే ఆత్మ అనగా "నేను" భాసిస్తోంది. ఇక్కడ Illuminator, that which is illuminated అంతా ఒకటే.

అయితే అసలు ఆత్మ ఉందని ఎందుకు ఒప్పుకోవాలి అంటే "ఏదైనా కర్మ జరగాలంటే అది చేతనుడైన వ్యక్తి ద్వారానే జరగాలి" అనే సిధ్ధాంతాన్ని అనుసరించి.

నిద్ర లో మరి ఈ ఆత్మ ఎక్కడ ఉంది అంటే నిద్ర లో "మనస్సు నిద్రా ప్రకాశం నిబిడమై ఉంది" దీనికి ఉపమానంగా అద్దానికి రాసిన మాసిని గురించి చెప్పారు. అద్దానికి మసి రాసేస్తే ఆ అద్దం ప్రతిబింబాలని చూపించలేదు. అంతే మాత్రాన ఆ అద్దానికి ప్రతిబింబించే శక్తీ పోయింది అని కాదు. ఈ నిద్ర అనేది మనస్సుకి అత్యంత సమీపంగా ఉండడం తో "విమర్శ" కలగడం లేదు.

మనసుకి ముఖ్యంగా రెండు దశలు చెప్పారు "ప్రకాశము", "విమర్శ". ఒక పండుని చూసినప్పుడు అది మనలో recognize కావడం ప్రకాశం. ఇది ఇట్టిది అనేది "విమర్శ". నిద్ర లేచాకా ఏమి తెలియక ఉన్నాను అనే నిద్ర స్థితి ఏదైతే ఉందొ ఆ స్థితిని కూడా "ఆత్మ అనుభవిస్తోంది".

సవికల్ప జ్ఞానం అలాగే యోగ్యత ఉంటేనే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.

References:
1. ధ్యాన యోగ సర్వస్వం
2. త్రిపురా రహస్య జ్ఞాన ఖండ సారం
3 ఉపదేశ సారం
4 https://www.youtube.com/watch?v=f95XorCcgrM

రవి కృష్ణ పి

4
Saimaster Books / Re: Purpose of Human Life ?
« on: May 12, 2017, 07:06:10 PM »
జై సాయి మాస్టర్ !!!!

The purpose of Human life is to realize the self.
ఆత్మా విచారణ ద్వారా "నేను ఎవరో" తెలుసుకో.

5
జై సాయి మాస్టర్  !!!!

దయ చేసి ఈ కింది సందేహాలు తీర్చగలరు.

౧. బ్రహ్మానికి, పరబ్రహ్మానికి తేడా ఏంటి?

ఉన్నదంతా బ్రహ్మమే అంటే మరి "పరబ్రహ్మం" అనేది ఎక్కడ నుంచి వచ్చింది?

అలాగే

౨. గురువుకి, సద్గురువు కి తేడా ఏంటి?

"Ultimate" అనే వాటికే (ఉ.దా. బ్రహ్మం, గురువు) అనే వాటికి prefixes ఉండడం నాకు అర్ధం కాలేదు

6
Jai Saimaster !!!!

SasiArun garu..Meerichchina audio link vinnaanu.Alaage "Edi Nijam" koodaa chadivaanu. Aithe naa prasnalaki samaadhaanalu dorakaledu (rather nenu interpret cheyyaleka poyaanemo ).

Aatma anthaa undi and Chaitanyam daani swabhaavam annaaru Poojya Maastaaru garu. Naaku manasu unnantha sepu inkaa maatlaadithe Sareeram lo praaNam unnappudu alaage jaagruthi lo Swapnam lo manasu anubhavisthundi. Aithe suShupthi lo maatram manam unnaamu ane uniki elaa untundi? Kevalam lechaake kadaa adi telusthondi?

Sareeram lo praaNam undi koodaa nidra lo anubhavam loki raani Chaitanyam manasu leni ledaa Oka manishi jeevinchi lenappudu untundani elaa cheppagalam?

7
౧. మనసు అంతర్ముఖమైతే ఆత్మ అని అదే బాహ్యాన్ని చూస్తే జగత్తు అనీ అంటాం కదా. అంటే మనసు ఉంటే తప్ప అంటే ఆలోచించగలిగే వాటికి తప్ప మిగిలిన ఏ ప్రాణికీ ఆత్మని తెలుసుకునే అధికారం లేదా? అంటే వాటికి మోక్షార్హత లేదా? మరి అప్పుడు వాటికి ఆలోచించగలిగే ఒక ప్రాణి శరీరం దేని వల్ల వస్తుంది?

౨. మనస్సు అణిగితేనే అంటే "నేను" అనే భావన (అహం వృత్త్తి) నాశనమైతే అసలైన "నేను" ఉనికిగా ఉంటుందని అంటారు కదా. అయితే ఇంకొక చోట నీ అనుభవానికి అందనిది నీకు లేదు అంటారు. ఈ రెండిటికీ సమన్వయము ఎలా కుదురుతుంది? అంటే శరీరం లేకపోతే అలాగే మనస్సు అణగిపోతే అసలైన "నేను" ఉనికిగా ఉంటుందని ఎలా నిరూపించగలం?

8
జై సాయి మాస్టర్ !!!!

నాకు తెలిసి, ఇంకా నేను చదివిన దాని ప్రకారం భగవానుని అనుగ్రహం ఉంటె ఆయనే గురు రూపం లో వస్తారు .

గురు చరిత్రలో ఒక వేళ భిన్నంగా ఉంటె ఎక్కడ ఉందొ చెప్పండి ఎందుకంటే నేను కూడా శ్రీ గురు చరిత్ర చదివాను

గురువు అనగానే గురి అని అర్ధం కదా. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. గురు చరిత్ర ప్రారంభంలోనే "నిన్ను నేను ఇలా ఆరాధించాను. అలా ఆరాధించాను. నా పూర్వీకులు ఇన్ని సత్కర్మలు చేశారు" అని చెప్పినప్పుడు సిద్ధుడు ఆయనకి సాక్షాత్కరిస్తాడు. అంటే సత్కర్మల ఫలితమే గురు దర్శనం.

అలాగే "రేగే సాహెబ్" అనే ఆయనకి బాబా ౬ రోజుల వయసు ఉండగా అతని మంచం వద్ద అతని తల్లికి కనిపించారు. తరువాత కాలం లో రేగే బాబా ని ఆశ్రయించాకా బాబా చిత్రం చూసి తల్లి చెప్తుంది "చిన్నప్పుడు ఈ ఫకీర్ నే నేను చూసింది నీ దగ్గర" అని. అంటే అతని పూర్వ పుణ్యం మాత్రమే అతణ్ణి గురువు దగ్గరకి చేర్చింది.

శ్రీపాద వల్లభుణ్ణి ఆశ్రయించిన "శంకర భట్టు" పూర్వం దత్త గుడిలో ఒక పూజారి.

నేను చదివిన వాటి ప్రకారం భగవానుని అనుగ్రహం ఎవరికీ ఉంటె వారికి గురు దర్శనం కలుగుతుంది. ఏ పూర్వ పుణ్యం లేకుండా గురువు ని ఆశ్రయించడం అలాగే గురు దర్శనం జరగదు. ఇది నా అభిప్రాయం.

రవి కృష్ణ పి

9
జై సాయి మాస్టర్ !!!!
అలమేలు మంగ సమేత భరద్వాజ మాస్టారికి వందనం !!!!

Just to quickly summarize:

"ప్రయత్నం" యొక్క రూపమే కర్మ. "ప్రయత్నం" అనేది ఖఛ్చితంగా చెయ్యాలి. ఇంకా ఎలా అంటే మాస్టారు రాసినట్టు "కాపీర్ణం" ఉన్నట్టు. అయితే ఈ "ప్రయత్నం" అనే దానికి ఆధారం "నమ్మకం".
జరుగుతుంది అనే నమ్మకం లేకపోతే "ప్రయత్నం" అనే దానికి అర్ధం లేదు కదా (Correct me if I am wrong here). ఇక్కడ "ప్రయత్నం" శాస్త్రో చితంగా చెయ్యాలి. కర్మల యొక్క ఫలితాలతో నిమిత్థం లేకుండా చెయ్యాలి.

అయితే మన పూర్వ కర్మల (ప్రాక్తన కర్మల) బలం ఎక్కువ ఉంటె అప్పుడు మనం "ప్రయత్నం" (వర్తమాన కర్మలలో)  విఫలం అవ్వచ్చు. ఇలాంటి సందర్భం లో  మనలో పుట్టాల్సింది "విమర్శ". నేను వెళ్తున్న మార్గం సరైనదేనా అని అనుక్షణం చూస్కోవాలి.

అలాంటి "ఆత్మ విమర్శ" పుట్టాకా చెయ్యాల్సింది "భగవదారాధన". ఎందుకంటే చిత్త శుద్ధి కోసం. నిరంతర భగవదారాధన వల్ల  కర్మలు జయించబడతాయి. ఒకవేళ జయించ బడకపోయినా వాటిని ఎదుర్కొనే సత్త్త వస్తుంది.

"అవధూత లీల" లో మాష్టారు చెప్పినట్టు :

వల్లపు రెడ్డి ఆది నారాయణ  రెడ్డి  గారికి ఒకసారి మనసు చాలా చికాగ్గా ఉంటుంది. ఎన్నో సమస్యలు ఒకేసారి వఛ్చి పడతాయి. అప్పుడు ఆయనకి "భగవాన్ శ్రీ అవధూత వెంకయ్య స్వామి" ఒక కల చూపిస్తారు.

రెడ్డి గారు, ఇంకొక ఇద్దరు ఒక ప్రవాహం ముందు నిలబడి ఉంటారు. అప్పుడు ఒకాయన దిగి ప్రవాహ వేగం లో కొట్టుకుపోతుంటే ఇంకొకాయన దిగి ఆయన కూడా కొట్టుకు పోతుంటారు. రెడ్డి గారు గట్టు మీద ఉంది గమనిస్తారు.

దానికి మాస్టారి వ్యాఖ్య ఏంటంటే "కర్మ ఫలం అనేది బలంగా ప్రవహించే నది లాంటిది. ఆ మనుషుల్లా తొందరపడి దిగితే ప్రవాహం లో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. ఓర్పు తో వేచి ఉంది చెడ్డ కర్మ యొక్క ప్రవాహ వేగం తగ్గే వరకూ నామస్మరణ చేసుకుంటే ఆ చెడు కర్మ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు సంసారం అనే సముద్రాన్ని సులభంగా దాటవచ్చు" అని.

గురు నానక్ చెప్పిన దృష్టాంతం ఉండనే ఉంది.

భగవదారాధన వల్ల చిత్త్తం శుద్ధం కాగానే ఆయనే మనకి ఒక గురువుని పంపిస్తాడు. మనామా గురువుని ఎంత వరకూ అవగాహన చేసుకున్నాం అనే దాన్ని బట్టీ మన ఆధ్యాత్మిక జీవితం లో అభివృద్ద్ధి ఉంటుంది

నాకు అర్ధమయినది ఇది.

వివరణలు లేదా ఎక్కడైనా తప్పులు ఉంటె ఇవ్వవలసింది / సరిదిద్ద వలసింది.

రవి కృష్ణ పి

10
జై సాయి మాస్టర్ !!!!

ఉత్తమ్ గారు, ద్వారకా నాధ్ గారు.. అనంత్ గారు..మీ అందరికీ నా sincere Thanks అండి..ఎందుకంటే నేను మీరందరూ ఇఛ్చిన లింక్స్ అన్నీ చూస్తున్నాను..అలాగే parallel గా కొన్ని పుస్తకాలు, భగవద్గీత చదువుతున్నాను..

అనంత్ గారు !!! మీరు చెప్పిన కొన్నిటి మీద నేను clarity ఇవ్వదలచుకున్నాను.. ఇది  నా ఆలోచన, ఇంకా నా  thought process ని చెప్తుంది

౧. breath అనేది అసంకల్పితంగా జరుగుతుంది. ఎందుకంటే నిద్ర లో కూడా మనం ఊపిరి తీసుకుంటాం అదీ తెలీకుండా. అలాగే ప్రాణాయామం లాంటివి చేసినప్పుడు మనం ఊపిరిని నియమిస్తాం ఇంకా ఊపిరి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే linkage. నేను చేసే ఒక పని తాలూకు outcome రానప్పుడు ఆ పని మానేస్తాం కానీ మనని మనం punish చేసుకోము కదా. I know this is debatable.

౨. ఉపదేశ సారం భగవాన్ శ్రీ రమణుల రచన నుంచి ఒక శ్లోకం quote చేస్తున్నాను

"కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిమ్ పరం కర్మ తజ్జడం
కృతి మహోదధౌ పథాన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం "

అంటే జడమైన కర్మ కి ఫలితం ఇచ్ఛే శక్తీ లేదు. ఈశ్వరుడే కర్మ ఫలాలని అందిస్తాడు. కర్త + క్రియ = కర్మ. అంటే నేను చేసే కర్మలకి ఫలితం ఇచ్ఛే వాడు ఈశ్వరుడు. మరి నేను చేసే కర్మలకి ఫలితం రానప్పుడు అది నా శ్రేయస్సుకే అనేది ఎలా కుదురుతుంది?

త్రీ. "సర్వస్య శరణాగతి " గురించి నా ఉద్దేశం ఏంటంటే ఇంక ఆ stage లో ఉన్నప్పుడు మనం కోరేది, ఆయన తీర్చేది ఏమి ఉండదు.

ఇంక నాకు అర్ధమయింది (solution దిశగా ఆలోచిస్తే ) ఏంటంటే

మాస్టారు రాసిన దాని ప్రకారం భగవంతుణ్ణి ఆరాధిస్తే చిత్థ శుద్ధి కలుగుతుంది. అప్పుడు మనం ఏమి ఆశించాము అనే దానికంటే మనకి లభించినది భగవద్ ప్రసాదం కింద స్వీకరిస్తాం. అయితే ఈ చిత్థ శుద్ధి ఒక రోజులో కలిగేది కాదు. Over a period of time శ్రద్ధ తో, ఓరిమితో కూడిన నిష్ఠతో పూజిస్తే కలుగుతుంది. అంత వరకూ ప్రయత్నం ఆపకూడదు.

అలాగే భగవాన్ శ్రీ రమణులు  చెప్పినట్టు "దేహాభిమానం విడవని వాడికి కర్మ ఒక్కడే దేవుడు". ఎప్పుడైతే అసలైన నేను ఎవరో తెలుసుకుంటావో , ఈ అసత్యమైన నేను  అనేది పోతుందో అలాంటి వాడు మాయని దాటి భగవంతుణ్ణి చేరుకుంటాడు.అంత వరకూ ఏంటంటే మన స్థితి ని గమనించుకుంటూ ఉండాలి.

ఇంకా కర్మలకి ౨ outcomes ఉంటాయి. ఒకటి ఆ కర్మ యొక్క ఫలితం ఇంకొకటి ఆ కర్మ యొక్క కంటికి కనిపించని రూపం. ఇది మళ్ళీ మళ్ళీ మనని కర్మ చక్రం లోకి తోసేస్తుంది. అందుకే కర్మ ఎలా చెయ్యాలో తెలియాలి. భగవంతుడు నా కోరికలు తీరుస్తున్నాడు కాబట్టీ వరుసగా అడిగేద్దాం అనే భావం ఉన్నంత సేపు ఫలితం మీద ఆశ ఉంటుంది. అయితే కర్మల చక్రం నుంచి బయట పడలేం. నా కోరిక ఎంత గొప్పదైనా సరే "కర్మ చేసే విధానం తెలీకుండా చేసేవి సత్కర్మలైనా అవి మోక్షాన్ని ఇవ్వలేవు".

అయితే ఎప్పుడైతే ఒక సందర్భం లో కోరిక తీరలేదు అనుకుంటే మన భావం మొత్త్తం పోతుంది. మాస్టారు చెప్పినట్టు అప్పు ఇచ్చే అతని దగ్గరకి మూడవసారి వెళ్లే టప్పుడు ఎలా వెళ్తామో అలాంటి భావన రాకుండా చేసుకోవాలి. నిజంగా చిత్త శుద్ధి ఉన్నవాడికైతే అప్పుడు ఆత్మా విమర్శ పుడుతుంది.  బాబా చెప్పినవి విన్నాను:

౧. ఒకామె బాబా ని అలా కోరికలు కోరుతూనే ఉండేది. ఇంకొకసారి కోరిక కోరిన ఆమెతో ఆయన ఒక సారి అన్నారట "అమ్మా!!!! నీకింత వరకూ ఇఛ్చిన దేన్నైనా నాకిచ్ఛేయ్య గలవా? అప్పుడు నీ కోరిక తీరుస్తాను" అని.

శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ చెప్పినట్టు "Love is not an action to have a reaction. Love is a state of mind". భగవంతుణ్ణి నేను పూజించాను కాబట్టీ నాకు ఫలితం ఇవ్వాలి అంటే నేను చేసిన కర్మకి నాకు result కావాలి అడుగుతున్నట్టు అంటే నా సాధన ఇంకా పూర్ణమవలేదని అర్ధం. ఏ రోజైతే నా సాధన పూర్ణమయ్యిందో ఆ రోజు నేను అడిగేది ఏమి లేదు. "అవధూత లీల" లో చెప్పినట్టు "ఏమి కోరని సేవే భక్తి"

అలాగే "దత్త మాట" అని face book నుంచి తీసుకున్న దాని ప్రకారం గురు నానక్ కి ఇద్దరు శిష్యులుంటే వారట. అందులో ఒకడు సాదు జీవనం గడిపితే ఒకడు స్త్రీ లోలుడు. ఒక సారి ఆయన దర్శనానికి వస్తూంటే ఒకతన్ని గాజు పెంకు గుచ్ఛుకుంది అలాగే ఆ రెండో కోరికల లోలుడికి ఒక బొగ్గుల కుండా లో ఒక బంగారు నాణెం దొరికింది. వాళ్ళ అనుభవాలు గురు నానక్ కి చెప్పగా ఆయన అన్నారు "ఆ సాదు జీవితం గడిపే వాడికి ఆ రోజు గునపం దిగవలసిన రోజు గాజు పెంకుతో పోయింది అలాగే ఆ రెండో వాడికి ౧౦౦ బంగారు నాణేలు దొరక వలసిన రోజు కేవలం ఒకటే దొరికింది".
"అవధూత లీల" లో చెప్పినట్టు "నాగటి చాలంతా గాయం తగలాల్సిన చోట సూదితో గీసినంత స్వల్పంగా తగ్గించబడేందుకు కారణం" నామస్మరణ అలాగే భగవంతుడి ఆరాధన.

వసిష్ఠ రామ సంవాదం లో అయితే (slightly out of context)

"ప్రయత్నాన్ని మించినది ఏది లేదు. దైవం లేదా అదృష్టం అనేది ఏదైతే ఉందొ అది లేనే లేదు. కేవలం ప్రయత్నం మాత్రమే ఉంది" అని వసిష్ఠుడు చెప్తాడు. ఉదాహరణలుగా ఇంద్రుడు పొందిన ఇంద్ర పదవి, విష్ణువు పొందిన సృష్టి పాలన ని కూడా ప్రయత్నం ద్వారా తెచ్చుకున్నదే అలాగే "ప్రాక్తన కర్మ", "వర్థమా కర్మ" గురించి కూడా చెప్పారు. ఇది సమన్వయం చెయ్యమని మిమ్మల్ని మళ్ళీ request చేస్తాను.

భగవద్గీత లో  చెప్పినట్టు భగవంతుణ్ణి పూజించే వాళ్ళు నాలుగు రకాలు

౧. ఆపత్కాలం లో ఆశ్రయించే వాళ్ళు
౨. జిజ్ఞాసువులు
త్రీ.  ముముక్షువులు (uncertain of the term)
౪. జ్ఞానులు

అయితే వీళ్లల్లో నాకు నాలుగవ వాడైనా జ్ఞాని అంటే ఇష్టం అంటాడు. అయితే ఇవి ఒక దానిలోంచి ఇంకొక దానిలోకి వెళ్లే stages గా చూస్తే ఎప్పటికో తరిస్తాం.

రవి కృష్ణ పి

11
Jai Sai Master!!!!

Uttam garu,

Meeru pampina links choosthunnaanu. Avi choosthoonte naaku oka sandeham vachchindi.

1.Maastaaru cheppinattu naaku sambandhichina vyavahaaram lo nenu sincere gaa prayathninchaanu. Kaanee result anukunnattu raa ledu. Aithe nenu evarikosamo chesthunnaanu anukondi. Adi jaragakapothe iddari bhaavaalu chedipoye Pramaadam undi. Naadi, nenu evari kosam chesaano vaaLLadi. Naa vyavahaaram lo avakapothe nenu daanni oppukovachchu kaanee vere vaaLLa vishayam lo jaragakapothe oppukoleka povachchu. Idi "Mamakaaram" valla koodaa kaavachchu. Venkayya Swamy charithra nunchi nenu quote chesindi ee second case.
2. Uncertain outcome unde daggara " sincere effort" anedi elaa kuduruthundi? Nenu sincere gaa efforts pettina daggara result raakapothe or vasthundane guarantee lekapothe "Adi naa sreyassuke" ane bhaavam elaa nilusthundi?
3. OkaveLa "Sarvasya SaraNaagathi" ante inka chesedi emuntindi?

Ekkado naaku ardham kaaledandi. OkaveLa vidi gaa chaavadam valla aithe meeru share chesina pusthakam moththam chaduvuthaanu.

Ravi Krishna P

12
Jai Sai Master !!!!

Priya garu..meeru ichchina chapter correctgaa naakochchina sandehaanni answer chese prayathnam chesindi.

Aithe naaku kontha ardham kaaledu..

"Avagaahanatho" ante elaa cheyyaalo telusukuni chese Pooja, dhyaanam Chiththa sudhdhini kaligisthaayi tadwaaraa manam raagaa dweShaalani jayinchi karma chakram lo padakundaa undachchu annaaru. Ee avagaahana naaku "Sadguruvu" dwaaraa ledaa "Sadgrandha PaThanam" dwaaraa kaluguthunnappudu inkaa Pooja, dhyaanam enduku cheyyaali?

Daya chesi nenu naasthikuNNi kaanu ani gamaninchagalaru. Kevalam nenu chadivina vaaTini consolidate chesthunnaanu.

Ravi Krishna P

13
జై సాయి మాస్టర్..

ఉత్తమ్ గారు,

మీరు పంపించిన links  చూశాను. "ప్రయత్నం" గురించి అర్ధమయ్యిందనే అనుకుంటున్నాను. దేనికైనా "ప్రయత్నం" అయితే తప్పదు. ప్రయత్నం అయితే చాలా sincere గా చెయ్యాలి మాస్టారు చెప్పినట్టు. చెయ్యగా చెయ్యగా ఫలితం వస్తుంది లేతే రాదు. ప్రయత్నం అయితే మాన కూడదు. అయితే శారీరక "ప్రయత్నం" చెయ్యడం అనే పరిస్థితి లేనప్పుడు కనీసం "నామ స్మరణ" అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది సత్కర్మ పైగా ఆ సమయం లో నేను చేసేదేమి లేదు.

నమ్మకం ఎందుకుండాలి అంటే నాకొక లక్ష్యం ఉండాలి కాబట్టీ. ఇంకా, అప్పుడే నేను నా శక్తీ అంతా పెట్టి ప్రయత్నం చేయగలుగుతాను. "నమ్మకం" అనేది లేకపోతే "నైరాశ్యం" వస్తుంది. దాని వలన నేను చేసే పనిలో శ్రధ్ధ పెట్టలేను. దాంతో "ప్రయత్నం" సరిగ్గా చెయ్యలేం.

ఇప్పుడు నా రెండు ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు "నమ్మకానికి", "మూఢ నమ్మకానికి" తేడా చెప్పగలరు.

ఇదే సందర్భం లో ఇంకొన్ని ప్రశ్నలు వచ్చ్చాయి. ఆలోచిస్తే సమాధానాలు అర్ధం అవుతున్నట్టే ఉన్నాయి కానీ పూర్తి స్పష్టత లేదు. మాస్టారు చెప్పిన దాని ప్రకారం "కర్మ మార్గం లేదా భక్తి మార్గం" తీసుకోవచ్చుఁ అనుకుంటే అలాగే "ప్రయత్నం" ఇంకా "నేను చేసిన కర్మలు" సవ్యంగా ఉంటె:
౧  ఇంకా భగవంతుడు దేనికి? కేవలం నా "ప్రయత్నం" చెయ్యలేని చోట నియతి తప్పించడానికేనా లేక ఇంకేమైనా కారణం ఉందా?
౨ నామ స్మరణ వల్ల "నాగటి చాలంతా గాయం తగలాల్సిన చోట సూది గీసినంత స్వల్పంగా తగ్గించ బడుతుంది" అని "అవధూత లీల" లో చెప్పినది ఒక్కటే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

రవి కృష్ణ పి

14
జై సాయి మాస్టర్ !!!!

సుధాకర్ గారు..మీరిచ్చిన సమాధానం చూసాను.

నిష్కామ కర్మ గురించి చెప్పారు. అయితే నిజ జీవితం లో ఇది ఎలా కుదురుతుంది? ఇందుకు ఉదాహరణ ఒకటి చెబుతాను. భగవాన్ శ్రీ రమణులు అంటారు కదా.."సరే కర్మ విడిచి పెట్టి సర్వం భగవంతుడి మీద వదిలిపెట్టేద్దాం అనుకుందాం. ఉదాహరణకి ఆహారం భగవంతుడు ఇచ్చ్చాడు. అయితే తినాల్సిన పనైనా మనం చెయ్యాలి కదా."

ఇదే బాబా కి లేదా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి అన్వయిద్దాం. ఒకరి అనుభవంలో ఒక విధంగా ఉంటుంది. వేరే వాళ్లకి వేరేలాగా అనుభవం ఉంటుంది. పైగా "వాళ్ళుండే దాన్ని బట్టీ కాదయ్యా మనముండేది" అన్నారు స్వామి. ఇక్కడే నాకు సందేహం ఉంది. నా "ప్రయత్నం" ఎక్కడ ఆగాలి? ఎక్కడ భగవంతుడు అందుకుంటాడు?

నా చిన్నప్పుడు ఒక వార్త చదివాను. ఒక అమ్మాయి తనని ఆంజనేయ స్వామి రక్షిస్తాడని పై నుంచి దూకి కింద పడి న ఒక ఉదాహరణ లో దాన్ని "మూఢ నమ్మకం" అంటాం. మళ్ళీ "అన్నీ ఆయనే చేస్తాడు" అంటాం. "అన్నీ ఆయనే చేస్తే" ఇంకా నేను ప్రయత్నం ఎందుకు చెయ్యాలి? సరే చెయ్యలేదు అప్పుడు దాన్ని మూఢ నమ్మకం గా జమ కట్టేస్తున్నారు. మళ్ళీ స్వామి చరిత్రలో ఒకాయనకి తేలు కుడితే "స్వామి" అంటే తగ్గుతుంది. ఇంకొకాయనకి స్వామిని చూస్తే ఇంకొకరికి చెప్తే తగ్గుతుంది. ఇంకొకరికి ప్రదక్షిణాలు చేస్తే అవుతుంది. ఏమిటి స్వామి అంటే "వాళ్ళుండే దాని బట్టీ కాదయ్యా మనం ఉండేది" అంటారు.
వెంకయ్య స్వామితో నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. అయితే భక్తి నిష్కల్మషంగా ఉండాలంటే ఆ సన్నటి పోరా ఎదో అడ్డు వస్తోంది.

వివరించగలరు.
రవి కృష్ణ పి

15
జై సాయి మాస్టర్ !!!!

ద్వారకానాధ్ గారు..

౧. నేను మాష్టారు గారు రాసిన హారతుల అర్ధం చదవలేదు. అవి చదివాకా ఆ భావం నిలుపుకుంటూ వింటాను. మరాఠీ లో భావం లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే ఎంత మంది హారతి భావాలు తెలిసి పాడుతున్నారు అనేదే ప్రశ్న. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆ భావాన్ని పొందాలని (అది క్షణ కాలమైనా) నా కోరిక. ఎందుకంటే నేను వెళ్లిన చాలా హారతుల్లో నాతో సహా చాలా మందికి ఏం పాడుతున్నామో తెలీదు.

౨. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నా ముందు వ్యాఖ్య లో రాసినట్టు మనం అందరం ఒకటే హారతి గురించి మాట్లాడుతున్నామా అని నా అనుమానం. నేను చెప్పేది "పార్ధసారధి, S . P . బాల సుబ్రహ్మణ్యం, సుశీల" గారు పాడినవి

త్రీ. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మాస్టారి భావాలని మీ కంటే చెప్పా గలవారు లేరు

౪. నాకు ఇది ఎక్కడ మొదలయిందంటే భగవాన్ శ్రీ రమణ మహర్హి ని  సంస్కృతం లో ఉన్న ఉపదేశ సారాన్ని ఆంధ్ర భాషలో రాయమని అడిగితే ఆయన ఆంద్ర భాషలో "ఉపదేశ సారం" రాశారు. నేను మొదటి సారి ఉపదేశ సారం విన్నప్పుడు (సంస్కృతం లో) కింద ఇంగ్లీష్ లో ఉండే భావాన్ని చదివాను ఎందుకంటే నాకేమి అర్ధం కాలేదు. తరువాత పుస్తకం ఇంకా అందులో ఇఛ్చిన వివరణ తో ఇప్పుడు భావాన్ని తెచ్చుకుంటున్నాను. అయితే ఎంత మంది సంస్కృతం లో కానీ ఇతర భాషలో ఉన్న వాటి భావాలని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు అనేది ప్రశ్న. అదే నా ప్రశ్నకి మూలం.

మీ కాలం వెచ్చించి వివరంగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు

అలాగే చాలా కాలం బట్టీ నా మనసులో ఉండే ఇంకొన్ని ప్రశ్నలు వేసాను "ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం" లో. దయ చేసి వాటికి కూడా సమాధానం చెప్పగలరు. మీరు ఇది వరలో చెప్పి ఉన్నా కూడా మళ్ళీ వివరించ వలసింది ఎందుకంటే నా ఆలోచన కి అందడం లేదు అది.

రవి కృష్ణ .పీ.

Pages: [1] 2