Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - VijayaSri

Pages: [1] 2
1
ఓం శరణం సద్గురు చరణం
జై సాయిమాస్టర్,

శ్రీ స్వామి సన్నిధి " భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి " వారితో వారి సేవకుల అనుభవాలు - రచన  శ్రీ పెసలు సుబ్బరామయ్య గారు  పుస్తకం నుండి

భగవద్భక్తుడైన శ్రీ అన్నమాచార్యగారంటారు  :


ఓ దేవాదిదేవ ! నీ కొలువున నర్తకులమైన మేము ఆడి , పాడి, మీకు వినోదము కల్గించవలెనుకాని, మోక్షమిమ్మని మిమ్మడుగ తగునా? మాకు అర్హతగలదని మీకు తోచినప్పుడు అది మీరు మాకు అనుగ్రహించవలసినదేకదా!

అంటే ఆట పాటలుగా సాగుతున్న మన జీవిత విధానం ద్వారా ధర్మమాచరించి  భగవంతునకు ప్రీతి కల్గించి, మోక్షమునకు అర్హత సంపాదించాలని శ్రీ అన్నమాచార్యగారు పై చరణము ద్వారా మనకు బోధిస్తున్నారన్నమాట . ఆచార్య శ్రీ భరద్వాజ మాష్టరుగారు 01-11-95 ' సాయిబాబా ' అనే పత్రికలో వ్రాస్తారు:- ' నోటిమాటలతో ముక్తిని గూర్చి వాపోయి ప్రయోజనమేముంది. అర్హత సంపాదించుటకు , సాధన దీక్షతో చెయ్యాలి. అర్హత గల్గినప్పుడు మనము దానిని వద్దన్నా భగవంతుడు అనుగ్రహించి తీరుతాడు. గనుక సాధన ద్వారా అర్హత సంపాదించుటయే మన ధ్యేయం కావాలి '.

జై సాయిమాస్టర్.

2
Request for prayers / జై సాయిమాస్టర్
« on: July 05, 2016, 11:40:10 AM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిమాస్టర్

పూజ్యులు దత్తస్వరూపులు అయిన మాస్టరుగారి మరియు అమ్మగారి పాదపద్మాలను నమస్కరించుకుంటూ సౌజన్య వ్రాయునది .

అమ్మ , మేము  శుక్రవారం 8. 6. 2016 న కెనడా బయలుదేరుతున్నాము, అమ్మ,  ఎక్కడ ఉన్న, ఏ  స్థితిలో ఉన్నా నాకు గురుదేవుల యందు నిజమయిన, అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీ యొక్క కృప వలననే నేను నా యొక్క సమయాన్ని సద్వినియోగ పరచగలను, మీ యొక్క కృపానుగ్రహానికి వేడుకుంటున్నాను.

నా యొక్క పారాయణ, సాధన సక్రమంగా జరగాలని, అందుకు నాకు మీ యొక్క ఆశీర్వచనాలు కావాలని ప్రార్థిస్తున్నాను. గురుదేవుల మనసుకు నచ్చేలా నాలో మార్పు రావాలని, ఈ హృదయం వారి పాదాల వద్ద స్థిరంగా నిలవాలని కోరుకుంటున్నాను.

మీ యొక్క ఆశీర్వచన అనుగ్రహాలకై వేడుకుంటున్నాను.

జై సాయి మాస్టర్.

3
General Discussion / మననం
« on: June 13, 2016, 07:05:49 PM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయిమాస్టర్

మననం అంటే ఏమిటి? దానిని కరెక్ట్ గా  ప్రాక్టీసు చేయడం ఎలా ? దయచేసి వివరించ ప్రార్ధన .
మననం కరెక్ట్ గా జరుగుతున్నదనడానికి గుర్తు ఏమిటి ?

జై సాయిమాస్టర్

4
Request for prayers / amma gaariki
« on: March 20, 2016, 06:06:35 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిరామ్

పరమ పవిత్రమైన అమ్మగారి పాదపద్మాలకు నమస్కారములు. అమ్మ! కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చుండ బెట్టిన దాని బుద్ది పోనట్లు,  నాలోని బయంకరమైన ఆలోచనలు నన్ను విడువటం లేదు. నా పైన దయ వుంచండి. మీ యొక్క కరుణ వలన మాత్రమే  నేను వుద్దరింపబడెదను.

సాయినాథుని దాసుల దాసుడనయ్యే భాగ్యాన్ని మీ యొక్క కరుణా వీక్షణాలు మాత్రమే ప్రసాదించగలవు.నేను తొలగించుకోలేని నాలోని ఈ చెడు ఆలోచనలన్నీ మీ కృప వలన నా నుంచి వేల్లిపోవును గాక. సాయినాథుని సేవకులమయ్యే అర్హతను పొందాలని కోరుకుంటున్నాను . నన్ను కాపాడండి .

మీ యొక్క దర్శనం నాకు కలాగాలని, నా యొక్క సాధన వృద్ది అవ్వాలని కోరుకుంటున్నాను .

జై సాయి మాస్టర్.


నమస్కారాలతో
సౌజన్య

5
ఓం శరణం సద్గురు చరణం


జై సాయిరామ్

మాస్టర్ గారి మరియు అమ్మగారి కృప వలన గతవారం శిరిడి యాత్ర చక్కగా జరిగింది.సాయి కృప వలన  29. 02. 2016 న శేజ్ హారతి  తర్వాత ద్వారకామాయి నందు వుండే అవకాశం లబించింది . అక్కడ నాకు ఒక అమ్మాయితో పరిచయం కలిగి కొంత సత్సంగం చేసుకొనే అవకాశం లబించింది. సాయి సన్నిదిలోని కాక సాహెబ్ దీక్షిత్ గారి గురుంచి తను ఒక సందేహం అడిగింది,

"దీక్షిత్ గారు తన బిడ్డ చనిపోయిన చలించలేదు కానీ ఒక పేదరాలు తన బిడ్డని పోగొట్టుకొని బాదపడుతుంటే ఆమె బిడ్డని బ్రతికించమని బాబాని కోరుతారు "  అది కర్రెక్టా అని అడిగింది . నేను అప్పుడు సమాధానం చెప్పలేక పోయాను, హైదరాబాద్ కి వచ్చాకఆలోచిస్తే నాకు ఈ విదంగా తోచింది "  దీక్షిత్ గారికి, మొదట ఆ పేదరాలు సంఘటన జరిగి వుండాలి , అప్పుడు బాబా గారు చెప్పిన మాటల వలననే తన బిడ్డ మరణ విషయంలో ఏవిధమైన భావనకు లోను కాకుండా వుండగాలిగారని"

ఈ ఆలోచన కరక్టేనా లేక వేరే ఎమైననా . దయచేసి వివరించండి

ఆ అమ్మాయి తనది బెంగుళూరు అని మాస్టర్ గారి గురించి కొచెం విన్నానని (తెలుసనీ ) అన్నది .
తను నాతో మాటల సందర్భంలో ఇక్కడ చాలా ఎక్కువ తక్కువలు వున్నాయి, ఇది అంతా కరెక్ట్ కాదు, నీను ఈ సంస్తానంలో పెద్దవాళ్ళని (ఆఫీసర్స్ ) కలసి మాట్లాడాలని చూస్తున్నాను, కుదర్నీయడం లేదు అని, మీ భరద్వాజకు ఇవన్నీ నచ్చవు అన్నది. నేను ఏమి సమాధానం చెప్పలేదు

మాస్టర్ గారి సమక్షంలోనే ఒక అతను సాయి పటాన్ని తన్నాడని (క్షమించండి ) చదివాను, ఆ ఆలోచన రాగానే నేను తనకి ఏ విధమైన సమాధానం చెప్పలేక పోయాను.

ఇటువంటి సందర్భంలో ఏమని చెప్పాలి ?

ఇక్కడ వున్నటు వంటి పెద్దల అనుభవం అంతలేదు మా వయస్సు.  తెలుసుకోవాలని తపనతో పోస్ట్ చేస్తున్నాను, దయచేసి వివరించండి.

జై సాయిమాస్టర్.

6
Request for prayers / "పెళ్లి రోజు "
« on: March 06, 2016, 06:28:57 AM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయి రామ్

పూజ్యులైన అమ్మగారికి మరియు మాస్టర్ గారికి పాదాబివందనములు. మీకు "పెళ్లి రోజు శుభాకాంక్షలు". మీ యొక్క కృపా ఆశీర్వచనాలు మాకు ఎల్లా వేళల ఉండును గాక.

నమస్కారాలతో సౌజన్య.

జై సాయి మాస్టర్ .

7
Request for prayers / శిరిడి
« on: February 24, 2016, 09:40:48 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయి రామ్
జై సాయి మాస్టర్

పూజ్యులైన అమ్మగారికి మాస్టర్ గారికి  నమస్కారములు,
మొట్ట మొదట సారిగా  కుటుంబం అంతాకలిసి శిరిడికి ఈ నెల 28 వ తారీకున బయలు దేరుతున్నాము . మీ యొక్క ఆశీర్వాదాన్ని మరియు అనుగ్రహాన్ని కోరుకుంటున్నాము. 

జై సాయిమాస్టర్.
                                                     
నమస్కారాలతో సౌజన్య

8
Dates and Events / మాఘ కృష్ణ పాడ్యమి
« on: February 23, 2016, 10:03:08 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయి రామ్
జై సాయి మాస్టర్

మాఘ కృష్ణ పాడ్యమి రోజునే కదా  శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలంలో కృష్ణానదిలో అంతర్హితులైనది.
అది ఈ రోజేనా??

జై సాయి మాస్టర్

9
Saimaster Books / Re: words list
« on: February 08, 2016, 05:56:10 PM »
jai sai master

10
General Discussion / ఒక విన్నపం
« on: January 25, 2016, 11:25:44 AM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయి రామ్
జై సాయి మాస్టర్
బాబుగారికి మరియు గురు బందువులందరికి నమస్కారములు

కొన్ని సంవత్సరాలుగా ఈ ఫోరం నందు జరుగుతున్న సత్సంగాలు, సంభాషణలు, సందేహ నివృత్తులు మొదలైనవెన్నో మా వంటి క్రొత్తగా వచ్చిన వారందరికీ ఒక చక్కటి మార్గదర్శిలాగ సహాయపడుతున్నది. పాత పోస్ట్లన్ని మావంటి వారికి కలిగే ఎన్నో సందేహాల నివృత్తికి దారిలా వున్నది .

కాని కొన్ని  పోస్ట్స్ లో కొన్ని లింకులు క్లిక్ చేయగానే అవి వేరే ఏదో సైట్స్ చుపిస్త్తున్నాయి . దయచేసి సవరించిన కొత్తగా వచ్చే మాలాంటి అందరికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా యోక్క విన్నపము.

జై సాయి మాస్టర్.

11
ఓం శరణం సద్గురు చరణం
జై సాయి రామ్
జై సాయి మాస్టర్

గురు కుటుంబానికి నమస్కారాలు
గురు బందువులందరికి  నమస్కారాలు"శ్రీ సాయి సన్నిధి"లో రేగేగారిని శ్రీ సాయి గడ్డం పట్టుకొని బ్రతిమాలి మరి అడుగుతారు, " నీకు ఏమి కావాలని ?", రేగేగారు " ఈ జన్మలో మరియు ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోను  మీరు నన్ను విడువగూడదు " , అని కోరుతారు.

నా సందేహం ఏమిటంటే


శ్రీ సాయి తన ఉచ్చిష్టాన్ని తానే స్వయంగా రేగేగారికి తినిపించారు. అంతటి భాగ్యశీలి శ్రీ రేగేగారు .

ఆయన అందరు కోరే శాశ్వతమైన పరమాత్మస్థానం (మోక్షం ) కావాలని కోరలేదు. వారి భావం ఏమై ఉండవచ్చు అని తెలుసుకోవాలని , అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను . పరమ లక్ష్యమైన మోక్షాన్ని కూడా అయన కోరదలచలేదా ? దానిని కూడా సాయి అంతటగానే ప్రసాదిస్తేనే పొందాలని వారి భావమా ? తానుగా కోరకూడదన వారి భావమా?.

మరి రేగేగారి అంతరార్థ్యం  ఏమిటి ? దయచేసి తెలియపరచగలరు.

జై సాయి మాస్టర్.

12
General Discussion / Re: doubt in gurucharithra
« on: January 06, 2016, 01:37:47 PM »
ఓం శరణం సద్గురు చరణం
జై  సాయిరామ్
జై  సాయిమాస్టర్
పూజ్య గురు కుటుంబానికి నమస్కారాలు ,
గురు బందువులందరికి  నమస్కారాలు,

 దిలీప్ గారు కృతఙ్ఞతలు. మీ వివరణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన మంచి సంస్కారం వృద్ది అగుటకు గాని, మనలోని చెడు సంస్కారం నశించుటకుగాని పారాయణ మొక్కటే  మార్గంగా కనిపిస్తున్నది, మన అందరికి మాస్టర్ గారి కృపా ఆశీర్వచానాలు లభించునుగాక. 

జై సాయిమాస్టర్. 

13
ఓం శరణం సద్గురు చరణం

జై  సాయిరామ్
జై  సాయిమాస్టర్
పూజ్య గురు కుటుంబానికి నమస్కారాలు ,
గురు బందువులందరికి  నమస్కారాలు

 దిలీప్ గారు కృతఙ్ఞతలు.

జై సాయిమాస్టర్. 

14
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిరామ్,
జై సాయిమాస్టర్,

అమ్మ నమస్కారములు,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.  మీ కృపా, ఆశీర్వాదాలతో  గురుదేవుల సేవకులము అయ్యే అర్హతను మరియు శక్తిని పొందాలని కోరుకుంటున్నాను.   
అమ్మ, నేను ఈ రోజు నుండి february  9 వరకు శ్రీ సాయి లీలామృతము , శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి సన్నిధి, శ్రీ సాయి ప్రభోథామృతము మరియు భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంధ పారాయణను చేయాలని  అనుకుంటున్నాను.  అందుకై  మీ యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటున్నాను.

జై సాయిమాస్టర్.

15
Dates and Events / Re: Bhagawan Sri Ramana Maharshi Jayanti
« on: December 31, 2015, 02:40:58 PM »
om sarnam sadhguru charanam

jai sairam
jai saimaster

saiutthampallavi garu,
thanx for sharing this valuable information.

jai sai master.

Pages: [1] 2