Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Topics - Gurupriya

Pages: [1] 2
1
Master Ekkirala Bharadwaja / Re: Sri Saimaster Nitya Satya Vratamu!!
« on: November 20, 2014, 09:16:35 AM »
జై సాయి మాస్టర్ !

గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
             గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                                                              శ్రీ సాయి మాస్టర్ నిత్య సత్య వ్రతము

...... విప్లవ సాహిత్యం ప్రభావితం చేసిన నాటి సమాజంలోని నాస్తిక హేతువాద భావాలు ఎంతటి అశాస్త్రీయ మైనవో  నిరూపిస్తూ 'ఏది నిజం ?' ,'విజ్ఞాన వీచికలు ' మొ ॥ న గ్రంధాలు రచించి సైన్సు ద్వారా ఆధ్యాత్మికతను నిరూపించి నేటి తరానికి  మార్గదర్శకులయ్యారు . నాస్తిక హేతువాద ప్రముఖులతో చర్చలు జరిపి ,వారిని ప్రజలను చైతన్య వంతులను చేశారు........

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

2
General Discussion / SRI RAMAKRISHNULA UPADESA RATNALU
« on: July 25, 2013, 12:02:53 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 1 . అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయగుణాత్మనే |
            సమస్త జగదాధారా మూర్తయే బ్రహ్మణేనమః ||

          గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

1. నిన్ను నువ్వు తెలుసుకో గలిగిన రోజు భగవంతుణ్ణి తెలుసుకోగలవు,నేను అనేది ఏది ? చెయ్యా,కాలా ,మాంసమా,రక్తమా ,లేక శరీరం లోని మరేదైనా భాగమా ?బాగా ఆలోచించండి ; 'నేను 'అనేది ఏదీ లేదని నీకే తెలుస్తుంది ,నీరుల్లి పాయ పొరలను ఒలిచిన కొద్దీ పొరలు వస్తూనే ఉంటాయి . కాని పలుకు అనదగిన దేదీ  కనపడదు ,అలాగే 'అహంకారం యొక్క స్వరూపం ఏమిటి ? పరిశోధించినప్పుడు  అది అదృశ్యమైపోతుంది . చివరకు మిగిలేది ఆత్మే -చిత్స్వరూపమే . అహంకారం నశించగానే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

--
[/size][/size][/size]

3
 జై సాయి మాస్టర్ !
  గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
  అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో ||1 .అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ  గుణాత్మనే |
           సమస్త జగదాధారా  మూర్తయే  బ్రహ్మణే  నమ: ||

       2 .యదంఘ్రి  కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకం |
           తారకం భవసింధోశ్చ  తం గురుం ప్రణమామ్యహం ||
                                          
                             " మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
                                            
                                                    సత్యాన్వేషి ----నిత్యాన్వేషి

                                                         జై సాయి మాస్టర్ !

దేనినైనా తెలుసుకోవడం కోసం ప్రయత్నించేవాడిని ' అన్వేషి ' అంటారు , అందుకు  చేసే  ప్రయత్నాన్ని  'అన్వేషణ ' అంటారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు సత్యాన్వేషి  మాత్రమే  గాదు నిత్యాన్వేషి గూడ, ప్రతి విషయాన్నీ  తెలుసుకోవాలనే  జిజ్ఞాసతో  ఆయన  నిరంతరం  అన్వేషిస్తూ ఉండేవారు , దానిని  తెలుసుకునేవరకూ  వదలి వచ్చేవారుగాదు ,అంతేగాదు  ,ఆయన నిరంతరం   ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేందుకు  అన్వేషణ జరుపుతూనే ఉండేవారు .
                         ఉపనయనం ఎందుకు చేసుకోమని చెప్పారు ?దానిలోని అంతరార్ధమేమిటో తెలుసుకోవాలని ఆయన తాము ఉపనయనం చేసుకోవడానికి అంగీకరించారు ,ఆయన జిజ్ఞాసకు మెచ్చిన భగవంతుడు మొదటిసారిగా ఆయనపై తమ అనుగ్రహాన్ని వర్షింప జేసి సరియైన ఉపదేశాన్ని ప్రసాదించారు .
                          రెండు సంవత్సరాల వయసుగల ఆయన పెద్దన్నగారి  కుమారుడు  సరిగా ఆయన ఉపనయన  క్రతువులో  జరిపే  మంత్రోపదేశ సమయంలో మరణించాడు ,అదే  ఆయనకు మహా మంత్రోపదేశమైంది ,అప్పుడు  పూజ్యశ్రీ  మాస్టర్ గారు  కాలేజీలో  చదువుతూ పెద్దన్నగారైన  శ్రీ కృష్ణమాచారిగారింట్లో  ఉండేవారు ,పసిపిల్ల వాడైన  అన్నగారి  రెండవ  అబ్బాయిని పూజ్యశ్రీ మాస్టర్ గారు  ఎంతగానో  ముద్దు చేసేవారు , ఆడించేవారు ,లాలించేవారు . ఆ పిల్లవాడికి  గూడ  బాబాయి  అంటే ఎంతో ఇష్టం , తమకు అత్యంత ప్రీతి  పాత్రుడైన  ఆ పిల్లవాని మరణంతో  పూజ్యశ్రీ మాస్టర్ గారి  హృదయానికి  తీవ్ర ఘాతం తగిలింది , ఇది ఆయన జీవితంలో  తగిలిన రెండవ దెబ్బ ,పసితనంలోనే  మాతృశ్రీ  మరణంతో  తగిలిన హృదయఘాతాన్ని  తట్టుకోవడానికి  చాలా సం ||లు  పట్టింది . అయినా దానికి తోడూ  అలాంటిదే  మరొక దెబ్బ ,దెబ్బ మీద దెబ్బ  తగలడంతో ఆ వేదనకు  అంతు  లేకుండా పోయింది .అందులోంచే --మానవులను  ఇంత వ్యధను  కలిగించే  ఈ మరణాన్ని  జయించలేమా ? అన్న ప్రశ్న  ఉదయించింది ,అయితే ఈ మృత్యువును  జయించలేక పోతున్న కారణమేమిటి ? తెలుసుకోవాలన్న  జిజ్ఞాస కలిగింది .అంతటితో  అన్వేషణ ప్రారంభమైంది ..........................


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

   [/13size]

4
Request for prayers / jai sai master!
« on: January 04, 2012, 09:03:17 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"నిను  చూచినంత  సర్వ  దోషములు  తొలగు
ఆర్తి  బాపుదువు ఆర్త జనుల  యందు
మంచి ముత్యము  పగిది  చెంత నున్న తల్లి
అందుకో  శత శత  వందనములు "
అలివేలు  మంగ పతి నీకిదే వందనములు !
జై సాయి మాస్టర్!





5
Request for prayers / jai sai master!
« on: January 03, 2012, 08:24:41 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"తాయి తాయి అనుచు  తల్లి నిను  వేడగ
తల్లడిల్లిన  బిడ్డల  చేర బిలిచి
అభీష్టంబుల  నేర వేర్తువు  కదా
వెన్న పూస-తల్లి  నీదు మనసు "
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!



6
Request for prayers / jai sai master!
« on: January 02, 2012, 09:20:41 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబందువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"నిను చూచి మైమరచి  పులకించి  పోతిని
కన్న తల్లిని మరల  చూడ గల్గితిని
హృదయ పూర్వక  వందనం  అందుకో  తాయి
ఆదరముగ మమ్ము  ఆదుకో  తాయి "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన :శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!



7
Request for prayers / jai sai master!
« on: January 01, 2012, 12:02:06 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"ఆది  అంతము  లేని  దివ్య చైత్య మూర్తి
నీ మహిమ లెన్న మా జన్మ తరమె
కన నీదు ప్రాభవం  కన్నులు  చాలవు
మనసున  శాశ్వతముగ కొలువుండు తాయి ."
అలివేలు మంగ  పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!





8
Request for prayers / jai sai master!
« on: December 31, 2011, 09:58:02 AM »
jai sai master!
గురుకుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"ఒకరోజు  మాస్టారు పంచెలను పంచమన
వారు  వీరనక  అందరికీ  పంచితివమ్మ
ఇంటిలో వస్త్రములు  నిండుకొనే దాక
దాన శీల,నిను  స్మరణ  చేసేదమ్మ "
(దివ్యజనని  అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల --రచన -శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి  నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!




9
Request for prayers / jai sai master!
« on: December 30, 2011, 10:00:09 AM »
జై సాయి మాస్టర్!
గురుకుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"ఏ నోము  నోచితినో  ఏ పూజ  చేసితినో
ఏ  వ్రతము  సలిపితినో  ఏమి  చేసితినో
ముక్కోటి  దేవతలు  ప్రత్యక్ష మైనట్టు
తాయి భరద్వాజ  దంపతుల  కనుల కంటిని."
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన -శ్రీమతి మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగ  పతి నీకిదే వందనం!
జై సాయి మాస్టర్!




10
Request for prayers / jai sai master!
« on: December 29, 2011, 11:20:36 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  మా(గురుబంధువు లందరము) నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"అమ్మరో నిను జూచి  ఆనంద పడితిమి
నీ సన్నిధి యె  మాకు పెన్నిధి యైనది
 కోర్కెలు  దీర్చమ్మ కోటి  దండాలు
పుట్టు సార్ధక మైన  లోక మాన్య చరిత "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల :రచన :శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!
!!గురుబంధువులందరము !!                                                                                                                                 


       



11
Request for prayers / jai sai master!
« on: December 28, 2011, 09:54:36 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  నా నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"మాస్టారు  మాటకు మారు మాట్లాడక
చిరునవ్వుతో  సేవలు సలుపు తాయి
పట్టి కొలుతు మమ్మ మీ  పాదములను
నీ బిడ్డలము  మమ్మాదరించు "  (దివ్యజనని  అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల --రచన శ్రీమతి మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!


12
Request for prayers / jai sai master!
« on: December 27, 2011, 09:51:27 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  నా నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
"కడు దీనుల  నైన  కనికరింతువు  నీవు
మా నోముల పంటవు  నీవు తాయి
తలచిన  వారి కొంగు  బంగార మైతివి
నిను  తాకిన పోవు  పాతకములన్ని "
అలివేలు మంగ పతి నీకిదె వందనం

జై సాయి మాస్టర్!

j


13
Request for prayers / jai sai master!
« on: December 26, 2011, 09:36:18 AM »
జై సాయి మాస్టర్!
గురుకుటుంబానికి  నా నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"గురుని అడుగు జాడలె  గురుతుగా  నడిచియు
మమ్ము గూడ  నడిపించి తీవి నీవు
విసుగు పడు పనులెన్ని  ఎదురైన గాని
ఓర్పుతో  చక్క బరచు  శాంత మూర్తివమ్మ "
అలివేలు మంగ పతి నీకిదే వందనం
జై సాయి మాస్టర్!




14
Request for prayers / jaisaimaster!
« on: December 25, 2011, 09:52:55 AM »
జై సాయి మాస్టర్!
గురుకుటుంబానికి  నా నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !
""గురుని చేయందు కొని వచ్చి గురుపత్ని యైనది
ఎల్లప్రజ  ఆనంద మొందు నటుల
ఒక్క ఎక్కిరాల  వంశమును  గాదు
భక్తీ వరుల  గూడ నుద్దరించు  తాయి ""
అలివేలుమంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!




15
Request for prayers / jai sai master!
« on: December 24, 2011, 11:30:47 AM »
జై సాయి మాస్టర్!
గురుకుటుంబానికి  నా నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే  వందనం !
"ఏ నోము నోచితినో  ఏ పూజ  చేసితినో
ఏ వ్రతము సలిపితినో  ఏమి చేసితినో
ముక్కోటి దేవతలు  ప్రత్యక్ష మైనట్టు
తాయి భరద్వాజ  దంపతుల  కనుల కంటిని"
అలివేలుమంగ పతి నీకిదే వందనము !
జై సాయి మాస్టర్!



Pages: [1] 2