Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Topics - kittulahri

Pages: [1]
1
జై సాయి మాస్టర్ !!!!

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనానికి వెళ్లిన నాకు తెలిసిన విషయమేంటంటే పూజ్య మాస్టారితో సాన్నిహిత్యం కలిగిన "పెసల సుబ్బా రామయ్య" మాస్టారు తమ దేహాన్ని త్యజించారు. తన ఇంటిని "సాయి మాస్టారి నిలయంగా" మార్చి స్వామి దర్శనానికి వచ్ఛే భక్తులకి ఆశ్రయం కల్పించే వారు ఇక లేరు .

ఆయనకీ మాస్టారి మీద ఎంత అభిమానమంటే "కర్మ బంధాలు అన్నీ కలిసి ఒక తాడుగా కట్టబడినప్పుడు మదపుటేనుగునైనా కట్టెయ్యగలవు" మొదలైన సూక్తులు ఆయన ఇంటి మీద రాసి ఉండేవి. అలాగే భరద్వాజ మాస్టారిని దత్త స్వామి రూపంలో ఉన్న ఫోటో చూడండి.

నేను ఆయన్ని మునుపు కలిసినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సారి నా దురదృష్టం. ఏమైనా మనస్సే కాదు, వాక్కే కాదు కర్మా చరణలో గురువుని ఎలా చూడాలో ఆయన జీవితం నుంచి నేర్చుకోవాలి.

అలాగే అక్కడ గోడ మీద చదివిన ఒక విషయం చెప్తాను:
"తూర్పు గోదావరి జిల్లా నుంచి వఛ్చిన ఇద్దరికీ మాస్టారి ఫోటో మధ్యలో ఉండి వెంకయ్య స్వామి వారి ఫోటో చివర్లో ఉండడం ఏమిటి అన్న సందేహం వస్తే సాయి నుంచీ, వెంకయ్య స్వామి నుంచీ దీపాలు పూజ్య మాస్టారి లోకి వచ్చి  ఆయన ఎంత గొప్ప వారో వారికి అనుభవం అయిందట (ఆర్డర్ గుర్తు లేని నా బుద్ధి హీనతని మన్నించండి).

"మీరు కోరుకున్నవి గాక మీకు శ్రేయస్కరమైనవి నేను చేస్తాను" - ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

అని రాసి వుంది.

జై సాయి మాస్టర్ !!!!

2
జై సాయి మాస్టర్  !!!!

దయ చేసి ఈ కింది సందేహాలు తీర్చగలరు.

౧. బ్రహ్మానికి, పరబ్రహ్మానికి తేడా ఏంటి?

ఉన్నదంతా బ్రహ్మమే అంటే మరి "పరబ్రహ్మం" అనేది ఎక్కడ నుంచి వచ్చింది?

అలాగే

౨. గురువుకి, సద్గురువు కి తేడా ఏంటి?

"Ultimate" అనే వాటికే (ఉ.దా. బ్రహ్మం, గురువు) అనే వాటికి prefixes ఉండడం నాకు అర్ధం కాలేదు

3
౧. మనసు అంతర్ముఖమైతే ఆత్మ అని అదే బాహ్యాన్ని చూస్తే జగత్తు అనీ అంటాం కదా. అంటే మనసు ఉంటే తప్ప అంటే ఆలోచించగలిగే వాటికి తప్ప మిగిలిన ఏ ప్రాణికీ ఆత్మని తెలుసుకునే అధికారం లేదా? అంటే వాటికి మోక్షార్హత లేదా? మరి అప్పుడు వాటికి ఆలోచించగలిగే ఒక ప్రాణి శరీరం దేని వల్ల వస్తుంది?

౨. మనస్సు అణిగితేనే అంటే "నేను" అనే భావన (అహం వృత్త్తి) నాశనమైతే అసలైన "నేను" ఉనికిగా ఉంటుందని అంటారు కదా. అయితే ఇంకొక చోట నీ అనుభవానికి అందనిది నీకు లేదు అంటారు. ఈ రెండిటికీ సమన్వయము ఎలా కుదురుతుంది? అంటే శరీరం లేకపోతే అలాగే మనస్సు అణగిపోతే అసలైన "నేను" ఉనికిగా ఉంటుందని ఎలా నిరూపించగలం?

4
తెలుగు లో బాబా హారతులు
-----------------------------
కొంత కాలం  బట్టీ నేను షిర్డీ హారతులు తెలుగు లో తర్జుమా చేసినవి వింటున్నాను. భావం చెడిపోకుండా (నాకు అర్ధం అయినంత మట్టుకూ) ఎంతో బావున్నాయి. అన్ని హారతులూ.
మనం ఇంకా మరాఠీ హారతులు ఎందుకు పాడుతున్నాం? ఎందుకంటున్నానంటే హారతిలో లీనమవ్వడం అనేది ఆ భావం మనం అందుకుంటేనే వస్తుంది. మరి మనకి అర్ధం కానీ భాషలో హారతి పాడితే అది ఎదో మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్నట్టుంటోంది అని నా అభిప్రాయం. వాటి కాపీ రైట్స్ గట్రా నాకు  తెలీవు కానీ తెలుగు లో అద్భుతంగా ఉన్నాయి.
మా ఇంటి దగ్గర బాబా గుడిలో చెపుదామని నా కోరిక. అయితే అదేదో నా ఒక్కడి కోరిక కాదు ఇంకా దాని మీద ఏమి వివాదం లేదు అంటే చెబుదామని.

మీ అభిప్రాయాలు చెప్పండి

5
1. "ప్రయత్నం" అనే దాన్ని గురించి కొన్ని సందేహాలున్నాయి. ఉదాహరణకి బాబా "ఒక మంచి పొగరుమోతు గుర్రం ఉందనుకో. దాన్ని నాకు అప్పగిస్తే సరిపోతుంది కదా" అన్నారు కదా. దీన్ని నిత్య జీవితానికి అన్వయించుకుందాం. నాకు ఒక సమస్య ఉంది. దాన్ని బాబా కి వదిలేసి నేను నిశ్చింతగా ఉండచ్చా? మరి ఇంకా నా "ప్రయత్నం" అక్కరలేదా? నా "ప్రయత్నం" నేను చేస్తూ ఉంటే ఇంక నేను ఆయనకి వదిలేది ఏమి ఉంటుంది?
2. పై ప్రశ్న నుంచి వచ్చింది, ఇంకా నన్ను ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న "నమ్మకానికి", "మూఢ నమ్మకానికి" తేడా ఏంటి? నేను ఒకవేళ భగవంతుడు ఏమైనా నా మంచికే చేస్తాడు  అనుకుంటే ఇంక "ప్రయత్నం" అనే దానికి అర్ధం లేదు. అలాగే నేను "ప్రయత్నం" చేస్తే ఇంక భగవంతుడి లో నాకు "నమ్మకం" అనేది ఏమున్నట్టు? "అవధూత లీల" లో ఒకాయన తన కూతురికి కాలు విరిగితే "స్వామి! నేను నిమిత్థ మాత్రం గా కట్టు కట్టిస్తాను. కాలు బాగు చేసే పూచి తమదే" అంటారు. అలాగే ఆ పాప కాలు బాగవుతుంది. ఇంకా అన్నం సహించని ఒకామె కూతురికి ఇంటామె "భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి" వారిని గురించి చెప్తే ఆ కూతురు "స్వామి ! నేను ఇప్పుడు మా అమ్మని మద్రాస్ తీసుకు పోకపోతే అందరూ నేను డబ్బు కోసం తీసుకు పోలేదు అనుకుంటారు. నేను మద్రాసు వెళ్తాను. అయితే ఆమె ఆరోగ్యం బాగు చెయ్యమని" పార్ధిస్తుంది. స్వామి నయం చేస్తారు.

దయచేసి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు

6
పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారికి సాష్టాంగ ప్రణామాలు.

"త్రిపుర రహస్య జ్ఞాన ఖండ సారం" అని శ్రీ రమణాశ్రమం వారిచే అచ్చు వేయబడిన పుస్తకంలో ఉన్న దాన్ని అర్ధం చేసుకోవడానికి నేను "ధ్యాన యోగ సర్వస్వం" చదువుతూంటాను. మాస్టారు అద్వైతానికి వ్యాఖ్య రాశారా అనిపిస్తూంటుంది.

ఒక చిత్రమైన ప్రశ్న ఈ సందర్భంగా నా మనసులోకి వచ్చింది.

"ఈ జగత్తంతా చిత్తు యొక్క విలాసమే అయితే లేదా "బ్రహ్మ" కి వచ్చిన కలలో మనమంతా పాత్రధారులమే అయితే ఆ కల ముగియగానే జగత్తు అంతరిస్తుంది కదా. ఇంకా జీవుడు ముక్తికి ఎందుకు ప్రయత్నించాలి?

నీ స్వరూపం ఎప్పుడూ "ఆత్మ". ఈ "ఆత్మ" తనకి ఉన్న స్వేచ్చ చేత ఈ జగత్తుని తనలోనే ప్రకాశింప చేస్తూంటే ఆ ఆత్మ మళ్ళీ తనకుండే అపరిమితమైన స్వేచ్చ వల్ల ఆ జగత్తుని తనలో లయం చేసుకుంటూంటే నేను ప్రత్యేక ప్రయత్నం ద్వారా నా స్వరూపాన్ని ("ఆత్మ"ని) ఎందుకు తెలుసుకోవాలి?
దయచేసి తెలియ చెయ్యగలరు. ఒక వేళ నేను అర్ధం చేసుకోవడం లో లోపం ఉంటె వివరించగలరు.

ధ్యాన యోగ సర్వస్వం లో పేజెస్ 35-36 నుంచి వచ్చిన ప్రశ్న ఇది

Pages: [1]