Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Topics - VijayaSri

Pages: [1]
1
Request for prayers / జై సాయిమాస్టర్
« on: July 05, 2016, 11:40:10 AM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిమాస్టర్

పూజ్యులు దత్తస్వరూపులు అయిన మాస్టరుగారి మరియు అమ్మగారి పాదపద్మాలను నమస్కరించుకుంటూ సౌజన్య వ్రాయునది .

అమ్మ , మేము  శుక్రవారం 8. 6. 2016 న కెనడా బయలుదేరుతున్నాము, అమ్మ,  ఎక్కడ ఉన్న, ఏ  స్థితిలో ఉన్నా నాకు గురుదేవుల యందు నిజమయిన, అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీ యొక్క కృప వలననే నేను నా యొక్క సమయాన్ని సద్వినియోగ పరచగలను, మీ యొక్క కృపానుగ్రహానికి వేడుకుంటున్నాను.

నా యొక్క పారాయణ, సాధన సక్రమంగా జరగాలని, అందుకు నాకు మీ యొక్క ఆశీర్వచనాలు కావాలని ప్రార్థిస్తున్నాను. గురుదేవుల మనసుకు నచ్చేలా నాలో మార్పు రావాలని, ఈ హృదయం వారి పాదాల వద్ద స్థిరంగా నిలవాలని కోరుకుంటున్నాను.

మీ యొక్క ఆశీర్వచన అనుగ్రహాలకై వేడుకుంటున్నాను.

జై సాయి మాస్టర్.

2
General Discussion / మననం
« on: June 13, 2016, 07:05:49 PM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయిమాస్టర్

మననం అంటే ఏమిటి? దానిని కరెక్ట్ గా  ప్రాక్టీసు చేయడం ఎలా ? దయచేసి వివరించ ప్రార్ధన .
మననం కరెక్ట్ గా జరుగుతున్నదనడానికి గుర్తు ఏమిటి ?

జై సాయిమాస్టర్

3
Request for prayers / amma gaariki
« on: March 20, 2016, 06:06:35 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిరామ్

పరమ పవిత్రమైన అమ్మగారి పాదపద్మాలకు నమస్కారములు. అమ్మ! కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చుండ బెట్టిన దాని బుద్ది పోనట్లు,  నాలోని బయంకరమైన ఆలోచనలు నన్ను విడువటం లేదు. నా పైన దయ వుంచండి. మీ యొక్క కరుణ వలన మాత్రమే  నేను వుద్దరింపబడెదను.

సాయినాథుని దాసుల దాసుడనయ్యే భాగ్యాన్ని మీ యొక్క కరుణా వీక్షణాలు మాత్రమే ప్రసాదించగలవు.నేను తొలగించుకోలేని నాలోని ఈ చెడు ఆలోచనలన్నీ మీ కృప వలన నా నుంచి వేల్లిపోవును గాక. సాయినాథుని సేవకులమయ్యే అర్హతను పొందాలని కోరుకుంటున్నాను . నన్ను కాపాడండి .

మీ యొక్క దర్శనం నాకు కలాగాలని, నా యొక్క సాధన వృద్ది అవ్వాలని కోరుకుంటున్నాను .

జై సాయి మాస్టర్.


నమస్కారాలతో
సౌజన్య

4
Request for prayers / "పెళ్లి రోజు "
« on: March 06, 2016, 06:28:57 AM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయి రామ్

పూజ్యులైన అమ్మగారికి మరియు మాస్టర్ గారికి పాదాబివందనములు. మీకు "పెళ్లి రోజు శుభాకాంక్షలు". మీ యొక్క కృపా ఆశీర్వచనాలు మాకు ఎల్లా వేళల ఉండును గాక.

నమస్కారాలతో సౌజన్య.

జై సాయి మాస్టర్ .

5
Request for prayers / శిరిడి
« on: February 24, 2016, 09:40:48 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయి రామ్
జై సాయి మాస్టర్

పూజ్యులైన అమ్మగారికి మాస్టర్ గారికి  నమస్కారములు,
మొట్ట మొదట సారిగా  కుటుంబం అంతాకలిసి శిరిడికి ఈ నెల 28 వ తారీకున బయలు దేరుతున్నాము . మీ యొక్క ఆశీర్వాదాన్ని మరియు అనుగ్రహాన్ని కోరుకుంటున్నాము. 

జై సాయిమాస్టర్.
                                                     
నమస్కారాలతో సౌజన్య

6
Dates and Events / మాఘ కృష్ణ పాడ్యమి
« on: February 23, 2016, 10:03:08 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయి రామ్
జై సాయి మాస్టర్

మాఘ కృష్ణ పాడ్యమి రోజునే కదా  శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలంలో కృష్ణానదిలో అంతర్హితులైనది.
అది ఈ రోజేనా??

జై సాయి మాస్టర్

7
General Discussion / ఒక విన్నపం
« on: January 25, 2016, 11:25:44 AM »
ఓం శరణం సద్గురు చరణం


జై సాయి రామ్
జై సాయి మాస్టర్
బాబుగారికి మరియు గురు బందువులందరికి నమస్కారములు

కొన్ని సంవత్సరాలుగా ఈ ఫోరం నందు జరుగుతున్న సత్సంగాలు, సంభాషణలు, సందేహ నివృత్తులు మొదలైనవెన్నో మా వంటి క్రొత్తగా వచ్చిన వారందరికీ ఒక చక్కటి మార్గదర్శిలాగ సహాయపడుతున్నది. పాత పోస్ట్లన్ని మావంటి వారికి కలిగే ఎన్నో సందేహాల నివృత్తికి దారిలా వున్నది .

కాని కొన్ని  పోస్ట్స్ లో కొన్ని లింకులు క్లిక్ చేయగానే అవి వేరే ఏదో సైట్స్ చుపిస్త్తున్నాయి . దయచేసి సవరించిన కొత్తగా వచ్చే మాలాంటి అందరికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా యోక్క విన్నపము.

జై సాయి మాస్టర్.

8
ఓం శరణం సద్గురు చరణం
జై సాయి రామ్
జై సాయి మాస్టర్

గురు కుటుంబానికి నమస్కారాలు
గురు బందువులందరికి  నమస్కారాలు



"శ్రీ సాయి సన్నిధి"లో రేగేగారిని శ్రీ సాయి గడ్డం పట్టుకొని బ్రతిమాలి మరి అడుగుతారు, " నీకు ఏమి కావాలని ?", రేగేగారు " ఈ జన్మలో మరియు ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోను  మీరు నన్ను విడువగూడదు " , అని కోరుతారు.

నా సందేహం ఏమిటంటే


శ్రీ సాయి తన ఉచ్చిష్టాన్ని తానే స్వయంగా రేగేగారికి తినిపించారు. అంతటి భాగ్యశీలి శ్రీ రేగేగారు .

ఆయన అందరు కోరే శాశ్వతమైన పరమాత్మస్థానం (మోక్షం ) కావాలని కోరలేదు. వారి భావం ఏమై ఉండవచ్చు అని తెలుసుకోవాలని , అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను . పరమ లక్ష్యమైన మోక్షాన్ని కూడా అయన కోరదలచలేదా ? దానిని కూడా సాయి అంతటగానే ప్రసాదిస్తేనే పొందాలని వారి భావమా ? తానుగా కోరకూడదన వారి భావమా?.

మరి రేగేగారి అంతరార్థ్యం  ఏమిటి ? దయచేసి తెలియపరచగలరు.

జై సాయి మాస్టర్.

9
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిరామ్,
జై సాయిమాస్టర్,

అమ్మ నమస్కారములు,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.  మీ కృపా, ఆశీర్వాదాలతో  గురుదేవుల సేవకులము అయ్యే అర్హతను మరియు శక్తిని పొందాలని కోరుకుంటున్నాను.   
అమ్మ, నేను ఈ రోజు నుండి february  9 వరకు శ్రీ సాయి లీలామృతము , శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి సన్నిధి, శ్రీ సాయి ప్రభోథామృతము మరియు భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంధ పారాయణను చేయాలని  అనుకుంటున్నాను.  అందుకై  మీ యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటున్నాను.

జై సాయిమాస్టర్.

10
ఓం శరణం సద్గురు చరణం

జై సాయిరామ్
జై సాయిమాస్టర్

గురు కుటుంబానికి నా నమస్కారాలు,
గురు బందువులందరికి  నా నమస్కారాలు, మాస్టర్ గారి స్మృతులలో ఒక ఆవిడ తాను దూరంగా ఉన్న (peeriods timelo ), మాస్టర్ గారు ఆవిడకి దర్శనం ఇచ్చారని ఆశీర్వదించారని  చదివాను.

తప్పుగా అనుకోకండి, నా సందేహం ఏమిటంటే గురు చరిత్ర తప్ప మిగతా మహాత్ముల చరిత్రలు ఆ సమయములో చదవవచ్చున ? ఒకవేల  చదవవచ్చు అంటే పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

దయచేసి నా సందేహం తొలగించగలరు.
జై సాయిమాస్టర్.

11
Request for prayers / అమ్మగారికి
« on: December 16, 2015, 06:34:05 PM »
ఓం శరణం సద్గురు చరణం
జై సాయి రామ్
జై అలివేలుమంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై

అమ్మ,
దయగల తల్లి సాయి స్వరూపినివైన  మీకు నా యొక్క నమ్రత  పూర్వక నమస్కారాలు. అమ్మ, మీ కృపవలన నాకు గురుకటాక్షము మరియు అనుగ్రహ ప్రాప్తి కలుగును గాక. మీ యొక్క చల్లని దీవేనలతో మాలోని దుష్ట సంస్కారాలు తొలగిపోవును  గాక.

 అమ్మ, మీ దయవలన నా మనసులోని మాలిన్యం తొలగి, నా యొక్క సాధన సఫలం
మరియు వృద్ది  అవునుగాక . గురు సేవకులమై మెలుగుటకు కావాల్సిన శక్తి, అర్హతలను పొందెదము గాక.

అమ్మ,మీ యొక్క ఆశీర్వాదంతో  మామిడి పూతల మద్యలో రాలిపోకుండా, గురు సేవకులమనే ఉత్తమ ఫలాలుగా ఉన్నతిని పొందాలని ప్రార్థిస్తున్నాను.

జై సాయిమాస్టర్.

12
General Discussion / sri ramadasu keerthanalu
« on: December 13, 2015, 08:01:12 AM »
om saranam sadhguru charanam

jai sairam,
jai saimaster,

గురు బందువులందరికి  నమస్కారం,
ఈ సైటులో వున్నా శ్రీ రాముల వారి పాటలు వలన  ఒకానొక సమయంలో నాకు చాల ఊరట మరియు శాంతిని పొందాను. నేను పొందిన సంతోషాన్ని మీతో పంచుకోవాలనే తలంపుతో పోస్ట్ చేస్తున్నాను .

https://www.youtube.com/watch?v=5Rj2Jg-FcEs

bhaktha ramadasu keerthanalu vol 1 to vol8

jai saimaster.

13
General Discussion / doubt in gurucharithra
« on: December 11, 2015, 08:12:08 PM »

ఓం శరణం సద్గురు చరణం
జై సాయి రామ్,
జై సాయి మాస్టర్,

గురు బందువులకు నా యొక్క  నమస్కారాలు,
గురుచరిత్ర నందు అవథూతోపాక్యానం  నందు  తన 22 వ గురువు సాలీడు అని చెప్పే వివరణలో ," జీవుడు కుడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాదిని పెంచుకొని, మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు."  అని వుంది .

నాకు ఇది అర్థం కాలేదు. దయచేసి వివరించగలరు అని నా ప్రార్థన .

జై సాయి మస్టర్.   

14
General Discussion / "ఒక సందేహం "
« on: November 16, 2015, 07:56:10 PM »
జై సాయిరాం ,జై సాయి మాస్టర్,

గురు బందువులందరికి నమస్కారం ,

చాల గ్రంథాలలో బ్రమర కీటక న్యాయం అని, మార్జాల కిశోర న్యాయం అని కొన్ని చదివాను. అంటే ఏమిటి ?
దయచేసి తెలియపరచగలరు .

జై సాయి మాస్టర్ .

15
జై సాయిరామ్,

అమ్మ,
పరమ పవిత్రమైన మీ పాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తున్నాను . మహాత్ముల చరిత్రలు పారాయణ  చేసినకొలది , ఇంతవరకు నేను చేసినది సాధనే కాదు అనిపిస్తున్నది. మీ దయవలన  నేను చేయు పారాయణ యందు నాకు శ్రద్దా  భక్తులు కలుగుగాక . దృడమైన విశ్వాసం నాకు కలుగును గాక.  సాయి మహారాజు కృపకి కావలసిన అర్హత నాకు కలుగు గాక. మీ దీవెనలను ఎల్లవేళలా నాకు ఉండాలని  కోరుకుంటున్నాను .
జై సాయి మాస్టర్

నమస్కారాలతో
  సౌజన్య

Pages: [1]