Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Topics - Jagadish

Pages: [1]
1
PS: ఈ కింది వ్యాసం మాస్టర్ గారు - మన్నవ సత్యం గారికి వ్రాసి ఇచ్చినదిట. ఈ ఫోరమ్ లో నే మన్నవ సత్యం గారు పోస్ట్ చేసినవన్నీ కలిపి ఒక చోటికి చేర్చి పోస్ట్ చేస్తున్నాను. I didn't even tried to correct the spelling mistakes if any.

ఆత్మ పరిశీలన
- పూజ్య శ్రీ మాస్టర్ గారు

1.   మనస్సు ను మొదటి గతి లో నుండి కొంచెం నిరోధించు కుని  పూర్తి గా  రెండవ  దశ లోనికి రాని దశలో ఇంద్రియవిషయాలు తారసిల్లితే అనుభవించకుండా ఉండలేదు; లభించక పొతే క్రుంగి పోదు, లభిస్తే బాగుండునన్న అతి సూక్ష్మమైన వాసన ఉంటుంది.  దీనికి గుర్తు  ఈ రెండు స్తితులలో నూ  ఉండడానికి అవకాసముండే ప్రాంతములో ఉన్నప్పుడు రెండవ దానికే అంటిపెట్టుకుని ఉండదు. ఎంత స్వల్పముగా నైనా  మొదటి గతి చిహ్నాలను నిలుపుకుంటుంది . పూర్తిగా  నివారించుకోలేక పోతుంది.
2.   ఐతే  అంతవరకూ నివారించుకోడానికి కూడా కారణము ఆత్మాభిమానము; ముముక్షత్వము కాదు! ముముక్షత్వము విషయానుభూతుల యందు  దోష ద్రుష్టి చేత మాత్రమె కలుగుతుంది గనుక స్వల్పముగా కూడా మొదటి గతి నుండనివ్వదు; దాని లేశాలద్రు స్యమయ్యే  దాకా తనకు తానె శత్రువై కటినంగా శాసించు కుంటుంది. అట్లా శాసించుకోకపోతే నిజమైన ముముక్షత్వము లేదనే. ఉన్న కొద్ది మనోనిగ్రహము  ఆత్మాభిమానం,  సంఘ భీతి,  సాంఘిక పర్యావసాన భయము లే  కారణాలనాలి.  అందుకే విషయానుభుతి  సాంఘిక మైన   దెబ్బ రాకుండా ఉండేలా అనుభవిన్చాలనుకుంటుంది. ఇది  జనులలో  ఇతరులు  తమను  చూడనట్లుగా  వారిని  చూడాలని  వారిచేత  చూడబడాలని  ఉంటుంది.
3.   ఈ  రెండు  గతులలోనూ  ఉన్న  మనస్సు  గల  వారిలో  రెండు  వ్యక్తిత్వాలుంటాయి. విషయాలు చుట్టూ వున్నప్పుడోకటి,  లేనప్పుడు డొకటి.లేనప్పుడు  అసలైన  ముముక్షువు లా  ఉంటుంది. ఉన్నప్పుడు పామరంగా   ఉండి  ఆత్మ వంచనతో  తన  బలహీనతనుపెక్షిస్తుంది. ఆత్మ  వాస్తవానికి  శుద్ధ  స్వరూపం  గనుక ,  మనం  ఆత్మ  స్వరూపం  గనుక,  రెండవ గతే  తమ  నైజమనీ,  మొదటిది   కాక తాళీయం గా  మాత్రమే  ఉన్న  స్వల్ప లక్షణమనీ,  అది సహజమేననీ,  తమలోని  బలహీనతకాదనీ  ఉపేక్షించే  మిషతో  దాన్ని వదులుకోలేక  ఉపెక్షిస్తుంది. 
4.   ఆత్మ  వాస్తవానికి  శుద్ధ  స్వరూపం  గనుక ,  మనం  ఆత్మ  స్వరూపం  గనుక,  రెండవ గతే  తమ  నైజమనీ,  మొదటిది   కాక తాళీయం గా  మాత్రమే  ఉన్న  స్వల్ప లక్షణమనీ,  అది సహజమేననీ,  తమలోని  బలహీనతకాదనీ  ఉపేక్షించే  మిషతో  దాన్ని  వదులుకోలేక  ఉపెక్షిస్తుంది. ఇట్టి  వారు  గురువుల చెంత  నుంటే  ఈ  రెండు  గతులు  కూడా  పనిచేస్తాయి. అందువల్ల  ఒక  వంక  గురువుల యందు   భక్తి  విశ్వాసాలు  ఉన్నట్లూ  ఉంటుంది. కానీ  వారి  నిశిత  నియమాలను  ఆమూలాగ్రం  పాటించ లేకనూ  పోతుంది. తమ కంతకు ముందు కల  సంఘ భీతి,  అభిమానం  కారణంగా  కృత్రిమంగా  మనో నియమం వల్ల  ఆచరణలోకి  వాటంతట అవే  వచ్చే  నియమ  బాహుళ్యాన్ని  తామే  బుద్ధి   పూర్వకముగా  ఆచరించామనీ,  అవి  తమలోని సహజ గుణాలనీ  భ్రమిస్తారు.  దానికి  ఆత్మాభిమానం  దోహదం  చేస్తుంది. వీరి  పాక్షికము,  బాహ్యము  అయిన  మనో నిగ్రహాన్ని చూసి   అందరూ  మెచ్చుకునేలా  చేస్తుంది. ఈ  మెప్పు  వారి  ఆత్మ  వంచనకు  దారి తీయటమే  గాక  వారి  మొదటి  గతిక  చక్కని  రక్షణ  నిస్తుంది. ఇతరులు మొదటి  గతిని  ప్రవర్తించినప్పుడు  వారిని  తేలికగా  గుర్తించి  నిందించే  ప్రపంచం  వీరి  పాక్షిక   రెండవగతి,  పూర్ణమని నమ్మి  గౌరవించి  వీరిలో  మెలకువతో  తొణికే  మొదటి  గతిని  గుర్తించ లేదు . కనుక  వీరికి  మొదటి గతిని  మెలకువతో  నిర్వహించే  దక్షత  ఉంటుంది.  దీనికుదాహరణ  వీరికి  కూడా  ఒకరియందు  ఆకర్షణ   కలగడం,  కలిగినపుడు  వారిని  గుప్తరీతిన  తమకు  సుముఖులుగా  చేసుకునే   రీతి,  లోపలకల  మమతను  బాహ్యముగా  వ్యక్తం చేయని  అభిమానము  ఉంటాయి.వీరికి  మొదటి  గతి  నశించినది  నిజమైతే  ఇలా సంభవించదు;  రెండవగతి  ( సాధన)  తీవ్రతరము  కాకుండా  ఉండదు.
5.   ఈ  కారణంగా గురువు  కూడా ( సద్గురువు  కాకుంటే )  వీరితో   రెండు   రీతులలో  వ్యవహరిస్తారు.  సద్గురువులుపేక్షిస్తారు. పట్టించుకోరు.    వీరి డంబారాన్నంగీకరించినట్లే ప్రవర్తించి వీరి కర్మకు  వీరిని విడుస్తారు. విశేషించి క్రుప  వర్షించదు.అదే  గుర్తు.వీరికంటే నైతికంగా నిగ్రహం కల  వారిలా కంపించిన వారితో కూడా ఇంతకంటే ఎక్కువ క్రుప చుపుతారు గురువులు.ఇది మామూలు వారికి విడ్డూరంగా కూడా ఉంటుంది.
6.   బోధక గురువులు వీరి మనసు యొక్క రెండు గతుల ననుసరించి పరస్పర విరుద్ధమైన  రీతులలో వ్యవహరించడముతో వీరిలో అత్మవంచనవల్ల తమలోని మొదటి గతిని గుర్తించని వారికి గురువుల ప్రవర్తన పరస్పర విరుధ్ధంగా, తిక్కగా, నటనగా కనిపించవచ్చు.
7.   విషయాలపట్ల దోష ద్రుష్టి వహించి మొదటి గతిని నిర్మూలించుకుంటేనే వీరికేనాటికైనా గతి. కానీ మెలకువతో దొరకని విధంగా దానిని నిర్వహించుకోగల్గడం చేత వీరు ఉభయ ప్రయోజనాలనూ సమాజం నుడి పొందగలగడంవల్ల త్వరగా అలా చెయాలనిపించదు.అందుకని వీరంత నష్టపోయేవారుండరనే చెప్పాలి.ఇహ పరాలు రెండూ చివరికి వీరు కోల్పోవలసి వస్తుంది.
8.   వీరికి జీవితములో కూడా నష్టముంటుంది.మొదటిగతి వల్ల సామాన్య కోరికలు నశించవు.  రూపమాకర్షిస్తుంది.దాని ప్రాబల్యం వలన,  రెందవగతి కొంత క్రుత్రిమంగానైనా ఉండడంవలన, వీరికి నచ్చిన రూపం కల వారికి మంచి గుణాలనాపాదించుకుని ఆ గుణాలవల్ల ప్రేమించినట్లు ఆత్మవంచన చేసుకుంతారు.గుణాల వల్ల తామెంతటి త్యాగాన్నైనా ప్రేమకోసం చేయగలమనుకుంటారు.    కానీ వాస్తవానికి రూపం కొసమే వీరి కాంక్ష. వీరికి సహజమైన వంచన ఆ వంచనను గుర్తించని తనాన్ని- అంటే ఇటువంటి రెండు గతులు లేని తనాన్ని-మంచి కింద లెక్కిస్తుంది. కాని తమలో ఉన్న ద్వయీ భావం అవతలివారిలో గుర్తించగానే  వారి మీద. ప్రేమ తొలగి అయిస్టం గా మారుతుంది.  వీరు ' ప్రేమ ' అనేది చాల తుచ్చమన్నమాట - తమ వంచనకు తావుండాలి, తమకు వంచన జరుగకూడదు - ఇదీ మంచికి వీరి కొలత.     
9.   ఈ ద్వయీ భావంతో వారి సాధించి (వారు సాధించిన) ఉభయ లాభం వీరిని కడు స్వార్ధ పరులను చేస్తుంది.   అయితే తెలివి చేత, ఆత్మ వంచన చేతా అది సూక్ష్మమై ఉంటుంది. ఆత్మవంచన, అత్మాభిమానాల వలన అది వారి చేత అంగీకరించబదదు. తాము చాలా నిస్వార్ధులమని భ్రమిస్తారు. తమ ప్రేమను శంకిస్తే నిజమైన ప్రేమ అన్యాయంగా శంకించబడ్డట్లు ప్రవర్తించగలరు.   
10.   ఈ స్వార్ధమేం చేస్తుందంటే, రూపం కలిసివచ్చే చోట కూడా వీరి ' ప్రేమ ' వీరిని ఏ సాహసమైన పనీ చేయనీయదు. ఎట్టి పరిస్తితులలో తాము నిరాధారులు కాకుందా చూచుకుంటారు.   కేవలం రూపం చేత వ్యామోహితులైన వారు ఆ వ్యామోహం తో ఎంత త్యాగానికైనా వెనుదియ్యకపొవడౌ చూస్తాము. గుణం కోసం చెసే వారినీ చూస్తాము.కానీ వీరు  త్యాగానికి సంసిద్ధు లైనట్లు నటిస్తూ ఏ  త్యాగనికీ సంసిద్ధులు కారు.
11.   రూపంకోసం వ్యామోహితులైన కేవల మొదటి గతి వారు గుణాలను కూడా త్యాగం చేసి మార్చుకో గలుగుతారు.గుణం కోసం ప్రాకులాడే వారు రూపాన్ని, తమ గుణాలను ప్రేమకోసం మలచుకో గలరు. కానీ ఉభయ గతులైన వీరు తమ ఉభయ గతి సాధ్యమయ్యె పరిస్తితులనే కోరుతారు. గుణం లభించింపుడు దానికోసం కూడా తమలోని మొదటి గతిని వదులుకో నిచ్చగించరు. రూపం కోసమూ మార్చుకోరు. 
12.   రూపమూ గుణాలు కలవారు వీరికి లభించినప్పుడు తోటి వారి గుణాలను ఇతరుల రూపాలనూ -- రెండింటినీ ఆస్వాదించ చూస్తారు. ప్రత్యక్షముగా వారితో రెండవ గతినీ పరోక్షంగా మొదతి గతినీ ప్రదర్సిస్తూ గడుపుతారు.   వీరి ఈ సామర్ధ్యం వలన సాటి జనుల అండను వీరు పొంది వీరికి తగిన మందలింపు వచ్చినపుడు కూడా వారు ' ఇంత మంచి వారిని కూడా అవతలివారిలా కఠినంగా చూస్తారే!  ఎంత అన్యాయం!' అనిపించే స్తితిలూ నిలుపుతారు. వీరెంతటి ప్రేమకోసమైనా తపించరు.సహజ నటనా శీలత వలన సాటివారికి తమ ఆటలు చెల్లలెదన్న బాధను ప్రేమకోసం పదే దుఃఖంగా ప్రదర్సించి, సాటివారి సానుభూతి పొందుతారు. 
13.   వీరిలోని యుక్తిని కనిపెట్టిన బోధక గురువులకు వీరి దుర్గుణాల పట్ల జాలి ఉన్నా అదంతా నసించేలా చేసుకుంటారు. తమయుక్తిని గుర్తించిన ప్రియుల ప్రేమనూ కొల్పోతారు.
14.   దీనికి గుర్తొక్కటే - వీరెంత భక్తి భావాన్ని మామూలుగా ప్రకటించినా విపరీతమైన అశ్రద్ధ మాటలలొనూ చేతలలోనూ వ్యక్తమవుతూనే ఉంటుంది - బోధక గురువుల ఆదేశాల పట్లకూదా.   ఒక రకంగా చెప్పాలంటే తమ ఉభయ గతి కౌశలముతో బోధకగురువును లోక ప్రఖ్యాతి కోసం ఆకట్టుకో గలిగామని నమ్ముతారు. 
15.   చివరికీరీతిన ప్రేమ , భక్తి లను నిజంగా వీరు కోల్పోడానికి క్కూడా వెనుకాడరు.  ఆ ఇద్దరూ వీరిని పరిత్యజించినా వీరమాయక (పేజీ : 7) ప్రపంచాన్నించి ఉభయ ప్రయోజనాలు పొంద సమర్ధులు. కనుక అట్టి దుఃఖం పొందరు. పొందినట్లు లోకుల సానుభూతిని పొందేందుకు ప్రదర్సించగల కౌశలం వీరిలో ఉంటుంది. అలా ప్రేమికులన్, గురువులను కోల్పోవడమువల్ల వీరి రహశ్యాశయం దెబ్బతినటం, వీరి ఆత్మాభిమానం దెబ్బతింటాయి. ఆ దుఃఖాన్ని వీరు పవిత్రమైన దుఃఖం గా ప్రదర్సించగలరు.
16.   వీరు సాటివారిలో మొదటి గతి వారినో  లేక  ఉభయ గతులలో ఉన్నవారి సాంగత్యన్ని ఇస్టపడతారు.    రెండవ గతి వారి మీద తక్కువ భావాన్ని అతి మెలుకువతో కల్పించి తమకడ్డుకాకుండా చేస్తారు. ఉభయ గతులలో ఉండే తోటివారితో వీరు లాలూచికి దిగి ఉభయుల యుక్తులూ కొనసాగేల చూస్తారు.  మొదటి గతి వారికి నటన నేర్పి , తమ ప్రవర్తనలో సహకారాన్ని పొందుతారు.-- తమ ప్రేమికులనూ, బోధ గురువులనూ వంచించడం లో.
17.   వీరి జీవితం లో ఏం జరుగుతుందో వీరి ఈ ప్రవర్తన శిలాశాసనంగా చెక్కబడి యుంటుంది.వివేక వంతులైన ప్రేమికులు, గురువులు, వీరిని పరిత్యజించక తప్పనట్లు చేస్తారు.కారణం లోక గౌరవం కొసం వారి చెంత చేరినా వీరికి హ్రుదయంలో ప్రేమికులు, గురువులూ పెట్టే నియమాలు చాల ప్రతిబంధకాలుగా ఉంటాయి.తమ ఉభయ గతి నిరోధింపబడడం ఇష్టముండదు.ఇక సాగదని తేలినప్పుడు తనను ప్రేమించిన వివేకులు, గురువులు తమను పరిత్యజించక తప్పనిసరి చేసి, ఆ ప్రతిబంధకాన్నుండి తప్పుకుంటారు.వీరి ఈ విజయమే వీరి ఓటమి.పర్యవసాన మాలొచిస్తే వీరు ప్రేమ, అండ లకు అర్హులు కారు.విశ్వాసానికి పాత్రులు కారు.కనుక అవి లభించినా కాలదన్నుకుంటారు.అయినా తమ యుక్తితో లోకుల ఎదుట కపట దఃఖాన్ని ప్రకటించి తమకన్యాయం జరిగిందనీ, దానిని తామెంతో మంచితనంతో సహించామనీ నిరూపించు కుంటారు.వీరిని కర్మ ఫలమే కాలాంతరాన సంస్కరించగలదు. అందుకే ఆత్మపరిశీలన, విమర్శ, సంస్కరణ అందరికంటే వీరికే ఎక్కువ ఆవస్యకం. కానీ అందరికంటే తక్కువగా వాటిని పాటించేది వీరే!

2
Master Ekkirala Bharadwaja / Favorite books of Master garu
« on: February 15, 2016, 09:12:33 PM »
Jai Sai Master!!

Babu garu,

Can you please list some favorite books of Master garu which he often suggests us to read apart from his writings.

This list may be books regarding to Scriptures, Theosophy, Science, Books written by/on Saints, social, history etc.,

3
Jai Sai Master!!!

From lot of days I was searching and praying for the glorious book The Vision of Aryan Glory written by the seer and rishi Sri Ekkirala Ananthacharya.

And finally the day has come, on which I got this book, by the divine grace of the Master.

You can download this in the below link of TTD devasthanams.
http://ebooks.tirumala.org/Product/?ID=1855

By the way, if anyone has his other books such as Veda and Ayur-Veda, Rasayana treatment, Suparna etc.,

Please help me in getting those precious books.

4
Weekly Discussion / Nava Nathula Charitra
« on: December 10, 2015, 07:41:14 PM »
జై సాయి మాస్టర్!!!

బాబు గారూ,

నాకు ఎప్పటి నుంచో నవనాధుల చరిత్ర చదవాలని, వారి గురించి తెలుసుకోవాలని ఉంది. వారు అసలు ఏ శతాబ్దానికి/యుగానికి చెందిన వారు ? వారి ప్రాశస్త్యం ఏంటి. వారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు?

"శ్రీ గురు చరిత్ర", "శ్రీ సాయి లీలామృతం", భజన ఇంకా చాలా వాట్లలో వీరి ప్రస్తావన వస్తుంది. నాథ సాంప్రదాయం గురించి మాస్టర్ గారు "సాయి మాస్టర్ ప్రవచనాలు" లో కూడా ప్రస్తావిస్తారు.

కొన్ని చోట్ల ఈ "నవనాదుల చరిత్ర" పారాయణ గ్రంధములు చూసాను కానీ అది సాధికారమైన గ్రంధం అవునో కాదో ఎలా నిర్ణయించేది??

ఎందుకంటే మాస్టర్ గారి సాయి లీలామృతాన్ని కాపీ చేసి చాల మంది మార్కెట్ లో బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయం లో ఏది సాధికారమైన గ్రంధామో మీరు తెలియచెస్తే చదువుదాం అని అడుగుతున్నాను.

దయ చేసి తెలుపగలరు!!


శ్రీ సచ్చిదానంద సద్గురు అలిమేలుమంగ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై!!!


5
Matrusri Alivelu Mangamma / Amma gari darsanam
« on: October 09, 2015, 04:01:21 PM »
Jai Sai Master!!

Eppati nuncho Amma gari darsanam chesukovalani anukuntunnam andi memu.

Repu vaddamanukuntunnam, Amma garu darsanam isthunnaremo kanukkundamani ee post chesthunnanandi. Daya chesi thelupa galaru.

Jai Sai Master!!

6
General Discussion / Any other Sai Master Speeches
« on: September 10, 2015, 04:39:57 PM »
Jai Sai Master!!!

I frequently listen to Sai Master's speeches. I like them so much. It was written in Sai Master Pravachanalu that the whole book was written on Master gari pravachanalu/speeches. So, there should be many recordings of Sai Master speeches other than the speeches available in the website.
http://www.saibharadwaja.org/pages/speeches.aspx

I recently saw the thread of recording of conversation between Sai Master and Jillelamudi Amma garu. Though it is not available now, I thought that like this there must be other recordings of Sai Master speeches or words.

I would be obliged if those speeches could be made available for us.

My heart full pranams to Amma garu and Babu garu  

Jai Sai Master!!!

7
Request for prayers / Please Bless My Brother!!
« on: February 16, 2014, 08:56:58 AM »
Jai Sai Master!!

Mathru Sri Alivelu Mangamma Gariki Namaskaaramulu....

Amma,

Maa Annayya marriage vishayam lo mee Aseessulu kavali thalli.

Annayya marriage vihayam lo maa Amma gaaru kuda kangaaru padi arogyam paadu chesukuntunnaru.

Prasthutham Amma Sri Guru Charithra Saptha Sapthahalu Chesthunnaru ee vishayamai....

Meeru maa meeda daya tho maa gurchi Baba garini Prardhincha galaru...

Itlu,
Thama Vidheyudu,
Jagadish
+91-8978970786.

8
జై సాయి మాస్టర్!!!

గురు బంధువులారా,

మాస్టర్ గారు చెప్పినట్టు మనము రొజుకొక లెక వారానికి ఒక ఆచారమూ, దాని అర్దమూ, దాన్ని ఆచరిన్చ వలసిన పద్ధతి, దాని వెనుక ఉన్న అంతరార్ధమూ ఇలా తెలుసు కుంటే చాలా బాగుంటుంది అని మీ అందరికీ విఙ్ఞాపన చేసుకుంటున్నను.

9
Hearts Out / "Swaadhyaaya Pravachanaabhayaam"
« on: May 17, 2011, 09:09:53 PM »

               జై సాయిమాస్టర్!!!గురు బంధువులారా,

నాకు ఎప్పటి నుంచో రెండు సందేహలు ఉన్నాయి.

 1) సాయి మాస్టర్ ప్రవచనాలు లో మాస్టర్ గారు చెబుతారు, మన ఋషులు "స్వాద్యాయ ప్రవచనాభ్యామ్ న ప్రదితవ్యమ్ " అని.

మరి సాయి ప్రభోధామ్రుతమ్ లొ జీసస్ చెబుతారు, పందుల దగ్గర రత్నాలు వెయ్య వద్దని.

మరి ఈ రెండింటికీ ఎల కుదురుతుంది??

అంటె శ్రద్ధ ఉన్నవారి తోనే సత్సంగం చెయ్య మనీను, లేని వారి దగ్గర వద్దనీనూ అర్ధమా??


2) స్వామి వివేకానంద గారు, భగవంతుడిని చూసిన వారు మాత్రమె ఆయన గురించి మాట్లాడాలని చెబుతారు. మరి సత్సంగమ్ చేసే వారిలో ఎంతమంది సాక్షాత్కారం పొంది చేస్తున్నారు???
మరి ఇంతకీ మనకి కర్తవ్యమ్ ఏంటి??

10
Weekly Discussion / Baba image I like most
« on: April 21, 2011, 05:50:59 PM »
Jai Sai Master!!!!

Dear Sai Bandhus,

This is the Baba image that I like most. Right from the kinder garden this photo is with me but I dont know when this photo was lost. After a long time my friend gave me this photo which he was snap shoted some where in his relatives house.

I plead you all that if you have the soft copy of this photo, then please send me at jagadish.kopparti@gmail.com or host the photo in any of the sites and reply to this post.

Thank you.

Jai Sai Master!!!

The photo is at http://bayimg.com/kAhacaaDL

Pages: [1]