Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - SaimasterDevotee

Pages: [1] 2 3 ... 222
1
In one of his letter to his student M.M.Chandrababu, Pujya Sree Mastar quoted the below lines.......

జై సాయిమాస్టర్!

....నాన్నగారు పరమపదించారని తెలిసి బాధ వేసింది. కాని ఆ బాధ తప్పినదెవరికి? ప్రతివారికీ తప్పదు. అసలు అది బాధ అని ఎవరు చెప్పారు? భయంతో మనము అలా ఊహించుకొంటాము. భరించరాని బరువును కొంతకాలము మరిచి  సుఖంగా సుఖంగా విశ్రమించి మరలా పునరావృతమయ్యేది కదా! ఎవరూ ఎక్కడికీపోరు. ఆత్మసాక్షాత్కారమయ్యేదాకా ఎవరికీ యిది తప్పదు. అటువంటి మహోపదేశమిది.  కనుక కొంతబాధ సహజమే అయినా యీరీతిన అలోచించి ధైర్యంగా ఉండాలి. అలోచనే 'ధీ' అంటే. ఆలోచనా శక్తే ధైర్యమంటే. నిత్యము భగవద్గీత శ్లోకాలు అర్ధంతో చదువుతూ ఉండు. మనందరికీ సాయి ఉన్నారు. మనమే భయము, దిగులుపడితే యిక సాయి అండలేని వారి సంగతేమనుకోవాలో అలోచించు. దిగులు పడడమే వస్తే నాకంటే ఎక్కువ  కారణాలు మీకెవ్వరికీ లేవు. అలోచనా శక్తితో చూస్తే దిగులుకు అర్ధము, అవకాశము లేవు. కర్తవ్యమొక్కటే సత్యం. ఎన్నటికైనా కాలాన్ని, మరణాన్ని జయించేది నిష్ట, సబూరీలతో కూడిన కర్తవ్యము. సాయి నీకు ధైర్యోత్సాహాలను అనుగ్రహించగాక!

ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ

జైసాయిమాస్టర్!

2
Jai Sai Master!

After many many days very happy to see the activity on our beloved saimasterforums.

Happy VijayaDasami everyone. :)

Jai Sai Master!

3
జై సాయిమాస్టర్!
గురుబంధువులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
17 వ శతాబ్దం నుండి మహరాష్ట్రలో శ్రీగురుచరిత్ర" పారాయణ చేసి, అటువంటి మహాత్ములను సేవించాలన్న తీవ్రమైన ఆకాంక్షను అచ్చటి ప్రజలు పొందడంచేత 1850-1950 మధ్యలో ఉద్దండులైన దత్తవతారాలు-శ్రీ అక్కల్కోట స్వామి, శిరిడీ సాయిబాబా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహరాజ్, ధునీవాలాదాదా, నారాయణమహరాజ్(ఖేడ్గావ్) ఆ రాష్రంలోనే చేరడం జరిగింది. మనముగూడా ఆ పద్దతిలో వారి చరిత్రలు పారాయణ శ్రవణము చేయించి, అటువంటి మహనీయుల్ని సేవించాలన్న తపన మన ప్రజలలో కొద్ది దశాబ్దాలు కల్గిస్తే యిక్కడగూడా అలాంటి మహనీయుల్ని సేవించాలన్న తపన మన ప్రజలలో కొద్ది దశాబ్దాలు కల్గిస్తే యిక్కడగూడా అలాంటి మహనీయులే అవతరించి యీదేశం భవితవ్యమే మారిపోగలదు. ఇది యీ సాంప్రదాయం వారి మహిమ చవిచూసిన మన  ప్రధాన కర్తవ్యం. యీ రుపాలలోని గురువును సేవించే మనమందరమూ "గురుబంధువులము"

ఈ బాంధవ్యం అన్నింటికంటే సన్నిహితమైనది, పవిత్రమైనదీ కనుక ఎటువంటి వికారాలు, అధిక నూన్యతలు మన మధ్య రాకూడదు. సాటివారు తెలియక వాటికి తావిచ్చినా మనము అవగాహనతో, సోదరీభావంతో నెమ్మదిగా యుక్తితో వారిని వాటిబారినుండి విడుదల చేయాలిగాని పట్టుదలకుదిగి సాధించుకొనడం తగదు. మనమధ్యవుండే ప్రేమాభిమానాలు మన గురుమూర్తిపై మనకున్న భక్తిలో భాగము. మధ్యవర్తులైన గురుత్వాలనంగీకరించక ముక్కుసూటిగా ఈ బాటన నడవడము, సాటివారికీ తెల్పి నడిపించడమూ మన కర్తవ్యం. ఇందుకు తగిన శిక్షణను ప్రజల కందింపజేసే కేంద్రంగా మందిరాన్ని నిర్మాణం కాకముందునుండే రూపొందించుకోవాలి. ఇలా మనచేత ఆ హితమూ, జగద్విహితమూ అయిన యీ కార్యక్రమము నిర్ధుష్టంగ జరిపించుకొనమని సాయినాధుని ప్రార్దిస్తూ సాయిసేవలో భరద్వాజ
జై సాయిమాస్టర్!

4

జై సాయిమాస్టర్!

ఒక సారి శ్రద్ధా భక్తులతో నమస్కరించినా, దక్షిణ సమర్పించినా, నీవే దిక్కని మనస్పూర్తిగా శరణు పొందినా, మనం ఆయనకు దక్షిణ సమర్పించామని అర్ధం. ఇకమనం ఆయన సొత్తు అన్నమాట. ఆ దక్షిణ యివ్వడం అంటే తిరిగి తీసుకోకపోవడం అన్నమాట. అందువల్ల క్రమంగా మన జీవితంలో ఒక గంటో, రెండు గంటలో మనం సాధనకు దగ్గరవడమనేది క్రమంగా మనలను అల్లుకుంటూ ఆక్రమించివేస్తుంది. తర్వాత మన ప్రతి అలోచనలోనూ, చర్యలలోనూ సదా అన్నింటిలోనూ ఆయనే వున్నాడనే భావం నిలిచిపోతుంది. వామనుడికి మూడడుగుల స్థలం ఇస్తే అంతటా ఆక్రమించినట్లు రోజులో మనం ధ్యానం చేసుకొని, చరిత్ర చదువుకొనేందుకు ఒక గంటో, రెండు గంటలో పెట్టుకున్నందుకుగాను, ఆయన మన జీవితమంతా ఆక్రమించేస్తాడు. చివరికి మన జీవితమంతా నిష్ట నిలుపుకొనే ప్రయత్నంగా మారుతుంది. సాయి, "నీకు వున్న లౌకిక ధర్మాలనన్నింటినీ నిర్వర్తించుకో, నీ కర్తవ్యాలను నిర్వర్తించుకో, యిన్నింటిలోనుంచి స్మరణను మాత్రం గుర్తుపెట్టుకుంటూ వుండు, స్మరణను తొలగించేటటువంటి రజో, తమో గుణాలవంటి యితర వికారాలను గుర్తించేటటువంటి ఈ వాడాలోని దొంగలను గుర్తుపట్టు. అ విధంగా నీవు జాగురూకుడవై వుండగలిగితే నామీద నీ దృష్టి నిలపగలుగుతావు. అలా నిలుపగలిగితే నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను; మద్యలో విడువను" అన్నారు. "అయితే ఒక్క షరతు, నీవు నాపై దృష్టి నిలిపితే, నా దృష్టి నీపై నిలుపుతా, నీ దృష్టి ప్రక్కకు తొలగించే 'వాడాలో దొంగలున్నారు జాగ్రత్త' అని హెచ్చరిక చేస్తున్నా" అన్నారు. అంటే Total teaching యిచ్చారన్నమాట.
 
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "శ్రీ సాయిమాష్టర్ ప్రవచనములు" pg.83-84
జై సాయిమాస్టర్!


http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=83


5

జై సాయిమాస్టర్!

"జీవులను జన్మ చక్రానికి బంధించేది అట్టి కృతఘ్నతే."

ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి అవధూత చీరాలస్వామి 57

జై సాయిమాస్టర్!


http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Avadhuta-Sri-Chirala-Swamy-Charitra&page=57

6

జై సాయిమాస్టర్!

మనస్సులో ఆ తలంపు రావటం ఒక్కటీ, ఆ పని చెయ్యటం వేరుకాదు. వస్తే చేసెయ్యటమే మంచిది.

ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ పాకలపాటి గురువుగారు,pg. 13

జై సాయిమాస్టర్!


http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Pakalapati-Guruvugari-Charitra&page=13

7
జై సాయిమాస్టర్!
ఆకాశం నుండి పడే వర్షపునీరు నదులు, బావులలోని నీరు భగవంతుడిచ్చినదే గదా! అది దివ్యమైనదన్న గుర్తు మనకు లేకపోవడం వల్లనే అది సామన్యమైన నీరులా ప్రవర్తిస్తుంది. అది దివ్యమైనదని గుర్తుంచుకొనడమే సాధనంతా. అపుడు మన అజ్ఞానమనే పొర మన కండ్లపై నుండి తొలగి మనకు వాటి దివ్యత్వమనుభవమవుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మికత.
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పరిప్రశ్న, 136
జై సాయిమాస్టర్!

http://saibharadwaja.org/books/readbook.aspx?book=Pariprasna&page=136

8
జై సాయిమాస్టర్!

"కష్టసుఖాలకు-ప్రేమకు ఎట్టి సంబంధమూ లేదు.ప్రేమదేబిరించదు, ప్రేమ అడగదు."

శ్రీ సాయిమాస్టర్ ప్రవచనములు, pg.42

జై సాయిమాస్టర్!

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=42


9
In the matters of Spirit it is an iron rule that the most valuable goods are the least advertised. They have no sophisticated jargon of philosophical word-play, no taped voices and not many picture albums of photogenic poses, in some looking like Jesus Christ and in some like every conceivable Master.
Acharya Sree Ekkiraala Bharadwaja 'Sai Baba and His Teachings'


http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sai-Baba-of-Shirdi-and-His-Teachings&page=27

10
జై సాయిమాస్టర్!

"మానవుడు తనయొక్క నిజతత్త్వాన్ని గుర్తించి తదనుసారంగా జీవించగల్గినప్పుడే శాంతి ఆనందాలు కలుగుతాయి,
అంటే తన తత్త్వం తనకవగతం కావాలి."

పరమపూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారి 'మతం ఎందుకు?', pg. 29

జై సాయిమాస్టర్!
 

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Matam-Enduku&page=29

11

జై సాయిమాస్టర్!

ఆధ్యాత్మికవిషయాలు ఎంతసేపైనా వినగలగడమే శ్రద్ధ అని ఒకరు అనుకున్నారనుకోండి. వాడికి ఆధ్యాత్మికతను గూర్చి ఎంతవరకూ అవగాహన వున్నట్లు? అలాగైతే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గంటలతరబడి చెప్పేవారూ ఉన్నారు వినేవారు కూడా వేలమంది వుంటున్నారు. వారిలో ఎంతమందికి ఆంతరంగిక మార్పు వస్తోంది? విన్నదానిని ఏ కొద్దిగానైనా, కొద్దిగా విన్నప్పటికీ దానిని ఆచరించడానికి ప్రయత్నిస్తే దానివల్లఫలితం వుంటుంది గానీ వూరికే 24 గంటలూ ఆ ఆధ్యాత్మికత గురించివిని, 'ఆహా!ఆయన ఎంతబాగా చెప్పాడు!' అనుకుంటే ఏమీ లాభము వుండదు.
 
శ్రీ సాయిమాస్టర్ ప్రవచనములు, pg. 91

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=91

జై సాయిమాస్టర్!12
జై సాయిమాస్టర్!

అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః

భావము: నామరూప గుణరహితుడగుట వలన చింతించనలవికానివాడు రూపము వ్యక్తముకానివాడు, నిర్గుణుడయ్యి గుణములన్నీ తానే అయినవాడు, త్రిగుణములు తానే అగుట వలన త్రిగుణముల చేత చేయబడిన సమస్త జగత్తునకు ఆధారమైనట్టి బ్రహ్మకు నమస్కారము(అనగా పరబ్రహ్మ స్వరూపుడైన గురువునకు నమస్కారము.)

ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ గురుగీత

జై సాయిమాస్టర్!

13
జై సాయిమాస్టర్!
గురుబంధువులకు సాయిమాస్టర్ జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు!!!
పూజ్య శ్రీ మాస్టర్ గారు శ్రితజన వత్సలుడు. ఆయన తమను ఆశ్రయించినవారికి ఎన్నోవిధాలుగా శ్రేయస్సు చేకూర్చారు. కొందరికి ఆయన అభయమిచ్చి రక్షించారు. కనుక ఆయన అభయప్రదాత. కొందరి వ్యాధులను ఆయన నివారించారు కనుక ఆయన బిషగ్వరేణ్యులు. మరికొందరికి ఆయన ప్రాణదానమే చేసారు గనుక ఆయన ప్రాణప్రధాత. ఇంకా ఎన్నో విధాలుగా ఆయన ఎందరి సమస్యలనో పరిష్కరించారు.
గురుపత్ని అలివేలు మంగతాయారు, మహాపురుషుడు, 89.
http://www.mahapurushudu.net/maha-purushudu.php?page=089
జై సాయిమాస్టర్!

14
జై సాయిమాస్టర్!
సద్గురువుయొక్క సాంగత్యము, సాన్నిధ్యము, అనుగ్రహమూ లేకుండా ధర్మం యొక్క స్వరూపం తెలియడానికిగాని ఆచరణలోకి రావడానికి గాని అవకాశమే లేదు.
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "శ్రీ సాయిమాస్టర్ ప్రవచనములు"  51.

జై సాయిమాస్టర్!

15
జై సాయిమాస్టర్!

సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలూ పెట్టక, దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు.
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతము 34
http://saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?chapter=4
జై సాయిమాస్టర్!

Pages: [1] 2 3 ... 222