Author Topic: Daily Inspirational Quotes of Master Garu!!!  (Read 121816 times)

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #30 on: May 11, 2011, 09:45:48 AM »
జై సాయిమాష్టర్!

" సంస్కారానికి, చదువుకు సంబంధంలేదు. సంస్కారం జన్మతఃవచ్చేది, చదువు, వేషమూ అన్నవి మనం మధ్యలో తెచ్చిపెట్టుకునేవి."

source..........ఆచార్య శ్రీ ఎక్కిరాలభరద్వాజ గారి సాయిసన్నిధి, pg 89.

జై సాయిమాష్టర్!
« Last Edit: May 15, 2011, 03:18:42 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #31 on: May 14, 2011, 01:43:18 AM »
Jai Sai Master!

Sadhana or spiritual discipline is the regular means of attaining
the lasting contentment. Contentment is real only when it could
permeate the other aspects and moments of ones's life.
This
becomes possible only when the whole of ones's life is transformed
into Sadhana, i.e. when sadhana is not limited to the hours
of formal meditation or deep reflection. Novices on the spiritual path
fail to realise this. They arduously try to meditate during fixed
hours, but lose sight of it in the hours of their mundane life. The
impact of formal meditation may continue to underline the rest of
their worldly life in the form of subtle peace, but equally well, the
impact of the worldly incidents will also continue and reach hours
of meditation. Therefore true meditation is possible only through
true understanding of things within and without, and their relationships
.

source Acharya Sree Ekkirala Bharadwaja gari  Sai Baba of Shiridi and His Teachings, pg 95.

Jai Sai Master!!
« Last Edit: May 15, 2011, 03:22:03 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

Dwarakanath

 • Administrator
 • Hero Member
 • *****
 • Posts: 2462
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #32 on: May 15, 2011, 12:24:46 AM »
Jai Sai Master!


Quote
Therefore true meditation is possible only through
true understanding of things within and without, and their relationships.

What a statement!

Quote
Sadhana or spiritual discipline is the regular means of attaining
the lasting contentment.

What a statement again!!
Very pertinent to what is being discussed in Vignana Veechikalu thread!!

Yet another gem.
Quote
ముందు మనమేమిటో తెలిస్తే బ్రహ్మమేమిటో తెలుస్తుంది. అందుకని అటువంటి సూక్ష్మాలు మహనీయులు చెప్పాలి. ఆ సూక్ష్మాలు వాళ్ళు చెప్పక ముందు ఆ గ్రంధాలు చదివినా ఏమీ అర్ధం కాదు.
Thanks for posting. I cannot have enough gratitude for the service you are doing. Truly inspirational. Truly educational.

Jai Sai Master!!

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #33 on: May 15, 2011, 02:31:23 AM »
జై సాయిమాష్టర్!

దైవత్య ప్రతిభకంతటికీ ప్రత్యక్షులు పూర్ణజ్ఞానాన్నిపొందిన మహాత్ములే! వారి జీవితాలు పవిత్ర మత గ్రంధాలలో చెప్పబడిన ధార్మిక జీవనాన్ని ప్రతిబింబించేట్లు వుంటాయి. మానవ స్వభావాలలో గల సహజమైన వక్రతవలన మనుషులంతా అతి తేలికగా అర్ధమయ్యే ఆధ్యాత్మిక బోధనలను కూడా అపార్ధం చేసుకుని, మొండి వైఖరితో వాటిపైననే అధారపడి ఆచరణలో కూడా చెడ్డమార్గం పడుతున్నారు. సత్యస్వరూపమైన దైవత్వం పొందడానికి దేవునిపట్ల సంపూర్ణశరణాగతి మరియు ఆయన స్వరూపమే అయిన సమస్త జీవరాశిపట్ల నిర్మలమైన ప్రేమ, స్వచ్చమైన ధార్మిక జీవనాన్ని గడపటమూ ఆచరించక తప్పదని అన్ని మతాలూ బోధించి వున్నాయి. అయితే దైవం యందు కపటమైన ప్రేమను కనపర్చటము, తోటిజీవులపైన కక్షలు పూనడమూ, పతితమైన జీవితాన్ని గడపడమూ వంటి హీనస్థితికి దిగజారకుండా వున్న మతాలు చాలా అరుదు. మతాలు అలా కలుషితమైనప్పుడు ప్రజల అభిప్రాయాలను సవరించి వీలైనంత ఎక్కువ మంది ప్రజలను మళ్ళీ సన్మార్గానికి మళ్ళించడానికి మహాత్ములు మన మధ్య వుండడం ఎంతైనా అవసరం. మతం అటువంటి మహాత్ములయందే నివసిస్తుంది. వారి భుజస్కందాలమీదే నిలబడుతుంది.

తాజుద్ధీన్ సర్కార్ ఇస్లాం మతంలోని ప్రధమశ్రేణిలోని మహాత్ములలో ఒకరు. ఆయన లక్షా ఇరవై అయిదువేల(1,25,000)మందిని తనంతటి మాహత్ములుగా చేశాకనే జగత్తుతో తనకు గల సంబంధాన్ని తెంచుకుంటానని ప్రకటించి, తాము దయాగుణానికే మూలస్తంభమువంటివాడు అని నిరూపించుకున్నారు. మహాత్ములకు మృత్యువులేనేలేదని, వారు చిరంజీవులని మనకందరకూ తెలుసు. వారి సమాధులలోని మట్టి సహితమూ  సత్యాన్వేషకులకు ఉపదేశాలనూ,ప్రొత్సాహాన్ని ఇవ్వగలిగినంతటి ఆధ్యాత్మికశక్తి కల్గివుంటుంది. దీనివలన 1,25,000 మంది మహాత్ములు తయారయ్యేవరకూ తాజుద్ధీన్ సమాధి అటువంటి అధ్యాత్మిక శక్తి కలిగి వుంటుందని మనం గుర్తించాలి.

ఒక మనిషిని మహాత్ముడుగా తీర్చిదిద్ధడం అంటే మాటలుకాదు. సామాన్యమైన ఆధ్యాత్మిక ప్రబోధనల ద్వారా వారిలో దైవంపట్ల విశ్వాసాన్ని కలుగజేయవచ్చు. అయితే లౌకిక కట్టుబాట్లను అధిగమించి జీవితాలను సత్యాన్వేషణకు అంకితం చేయడానికి సద్గురువు యొక్క పూర్తి రక్షణ అవసరం! అటువంటి సద్గురువే తాజుద్ధీన్ బాబాకూడా. అటువంటి రక్షణను తన భక్తులకు, మానవ సంఘానికి ఆయన ఎలా కల్గించారో చదవడం కుతూహలంగా వుంటుంది.


source......ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ హజరత్ తాజుద్ధీన్ బాబా దివ్యచరిత్ర, pg# 78,79.

జై సాయిమాష్టర్!!
« Last Edit: December 22, 2011, 01:53:30 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #34 on: May 16, 2011, 02:58:24 AM »
జై సాయి మాష్టర్!!!

.....అన్నింటికంటె సులభమైన ముక్తిసాధనం భాగవతశ్రవణమే....అంటే దేవర్షియైన నారదుని అభిప్రాయాన్నీ, వ్యాసుని అనుభవాన్నీ గూడా శుకుని అభిప్రాయము, పరీక్షిత్తు యొక్క అనుభవము ధృవపరుస్తున్నాయి. "భాగవతము" అంటే మహాత్ములైన భక్తుల("భాగవతుల") చరిత్రలు, బోధల గురించి చెప్పేది. నిజానికి అటువంటి శ్రీరాముని చరిత్రయైన రామాయణము, పాండవుల చరిత్రయైన భారతము మరియు భాగవతాల వలన ఉత్తమమైన నైతిక దృష్టి, అధ్యాత్మభావము మన దేశ సంస్కృతికి వెన్నెముకలా యిన్నివేల సంవత్సరాలు నిలవడానికి కారణమైనాయి. అంతటి మేలు మరే సాధనము చేయలేదని చెప్పవచ్చు. ఆ సాంప్రదాయాన్ననుసరించే మనందరము "శ్రీ గురుచరిత్ర"  "శ్రీ సాయిబాబా జీవితచరిత్ర" మొదలైనవి పారాయణ చేసుకుంటున్నాము.

అయినప్పటికీ నేటి దేశకాల పరిస్థితులకు, సనాతనమైన ఆధ్యాత్మజీవితానికీ అన్ని జీవితరంగాలలోనూ అనుక్షణము సంఘర్షణ ఏర్పడుతోంది. అందువలన ఈ గ్రంధాల పారాయణ వలన కలిగే మేలు మన హృదయాలను చాలినంతగా పరివర్తన చెందించలేకపోతున్నది. ఈ సమస్యల పరిష్కారం సమర్ధ సద్గురుని సాన్నిధ్యమే. అట్టిది ఈ కలికాలంలో మనకు లభించడం చాలా కష్టం. మనలో చాలినంత పరిణితి కలిగేలోపల అది లభించినా దానిని చాలినంతగా వినియోగించలేకపోతాము. కాని శ్రీ సాయిభక్తులమైన మనకు యిట్టి సమస్య లేదు. ఆ సద్గురుడు తమ మహాసమాధి తర్వాత గూడా స్థూలంగానో లేక సూక్ష్మంగానో భక్తులకు తమ సన్నిధి, రక్షణ ప్రసాదిస్తూనే వున్నారు. అయినప్పటికీ స్థూలమైన దాని ఫలితానికి మించి దానిని మనం చాలినంతగా  గుర్తించలేము. దానిని గుర్తించి, గుర్తించుకొనడం మీదనే ఉత్తమ ఫలితం అధారపడుతుంది. దానిని గుర్తించడానికి సాటిలేని సాధనం ఈ గ్రంధం "సాయి సన్నిధి"...."నీవునన్ను ఎక్కడ, ఎప్పుడు స్మరిస్తే ఆ క్షణమే నీ చెంతనుంటాను";నాపై నీ దృష్టి నిలికిపితే నీపై నా(కృపా) ధృష్టి నిలుపుతాను" అని అభయమిచ్చారు సాయి. నిరంతరము వారిని గురించి చింతన చేస్తుండడం గూడా ఉత్తమమైన ధ్యానమని ఆయన స్పష్టంగా గూడా చెప్పారు. వారి లీలలు పారాయణచేసి, సాటిలేని వారి దివ్యత్వాన్ని గుర్తించి, పులకించిన మనం వారి సన్నిధిలో మన హృదయాలను సాధ్యమైనంత యెక్కువసేపు నిలుపుకొనడానికి సాధన మీ గ్రంధం(సాయి సన్నిధి). యిది చదువుతున్నంత సేపూ మనం గూడా మానసికంగా అలనాటి వారి సన్నిధిలో, అలనాటి వారి భక్తులలో మనమూ ఒకరమై నివసించగలుగుతాము. మన హృదయం అలనాటి శిరిడీలోనూ, అట్టివారి సన్నిధి మనమున్నచోట మనకు మానసికంగా అనుభవమవుతాయి. 


source..........ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "సాయి సన్నిధి" pg# iv v

జై సాయిమాష్టర్!
« Last Edit: May 17, 2011, 06:26:36 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #35 on: May 17, 2011, 12:26:48 AM »
Jai Sai Master!

"" For as the Christ said, "It is not that which we take in that pollutes us. It is that which comes out of us that does so." If a little rubbish falls into a fresh water well, it is enough if it is removed. But if the very springs if water are brackish nothing can be done about it. So too, when the heart is unclean, and the feelings,thoughts, words and deeds which emanate from there are unholy, nothing can purify such a man. Fortunately, unlike the well, man has the opportunity of changing his way of thinking and thereby purifying his own heart and that  is the business of life.""

source......Acharya Sree Ekkirala Bharadwaja gari 'Sai Baba of Shirdi and His Teachings', pg 41.

Jai Sai Master!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #36 on: May 18, 2011, 12:38:17 AM »
Jai Sai Master!

As in all things in nature, in sadhana too the most important ones appear like the least important and viceversa.

source......Acharya Sree Ekkirala Bharadwaja gari 'Sai Baba of Shirdi and His Teachings', pg 68.


Jai Sai Master!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #37 on: May 19, 2011, 03:53:36 AM »
జై సాయి మాష్టర్!!

సద్గురువుయొక్క స్పర్శ కలిగేలోపల అన్నీ అర్ధమైనట్లు కనబడతాయేగాని, ఏదీ అర్ధమవదు అన్న సంగతి తెలుస్తుంది.సద్గురువు సన్నిధికి వచ్చిన తర్వాత ఆయనను స్మరించుకుంటుంటే వారి అనుగ్రహం సంపూర్ణంగా వుంటుంది.

source.........ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "సాయిమాష్టర్ ప్రవచనములు" pg# 154.

జై సాయి మాష్టర్!!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #38 on: May 19, 2011, 11:28:13 PM »
జై సాయి మాష్టర్!!

అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని, ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా యేర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు. కాని సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకూ రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి, తన లీలలద్వారా సాధ్యమైనంతమందికి మోక్షేచ్చ,ధర్మనిష్ట కలిగేలా చేస్తూ వుంటాడు. ఇలా యెల్లప్పుడూ భూమిమీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత్తత్త్వాన్నే "దత్తాత్రేయుడు" అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా వున్నా, ప్రపంచంలోని అన్ని మత గ్రంధాలలోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.

అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకూ తండ్రి; తననుండి యేర్పడిన పధార్ధాలతోనే మనను పోషిస్తుండడం వలన ఆయనయే జగన్మాత. శాస్త్రాల ద్వారా మనకు హితం చెబుతున్నాడు గనుక ఆయనయే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు గనుక ఆయనయే ప్రభువు. సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు గనుక ఆయనయే గురువు. ఇలా అలోచిస్తే భగవంతుడే, తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు! చివరకు సద్గురువుగా మనకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాడు; దత్తం చేసుకుంటున్నాడు!!! అందుకే "దత్తుడు" అనే పేరు అనుగ్రహమూర్తియైన భగవంతునికి అన్నింటికంటే చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన - శక్తిహీనులము, అల్పజ్ఞులము అయిన మనకు సర్వమూ ప్రసాదించడమే గాక, ఆత్మసమర్పణం గూడా చేసికొనడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్ధం చేసికొని ఎల్లప్పుడూ గుర్తించుకొని, అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగల్గడమే మన పరమ కర్తవ్యము. ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కల్గుతుందో అలనాటి పురాణకధల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకూ అన్నీ మనకు తెల్పుతాయి. 


source.........ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "శ్రీ గురుచరిత్ర" pg 12,13.

జై సాయి మాష్టర్!!
« Last Edit: May 19, 2011, 11:31:06 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #39 on: May 21, 2011, 12:13:23 AM »
జై సాయి మాష్టర్!!

మహాత్ముల సన్నిధికి వెళుతుండడం అంతగొప్పదన్నమాట. వాళ్ళ సన్నిధి అంటే physical presence మాత్రమే కాదు. ఎట్లాగంటే bulb అంటే light కాదు. ఎందుకంటే ఫిలమెంట్ లేకపోయినా బల్బే, కరెంట్ కనెక్షన్ లేకపోయినా బల్బే. కాబట్టి బల్బ్ అంటే లైటు కాదు. కాని బల్బ్ ద్వారా గాని లైట్ రాదు. కాబట్టి వాళ్ళ physical presence, physical presence మాత్రమే కాదు. అలాగే వాళ్ళ శక్తి physical presence ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి ఆరంభములో వాళ్ళ physical presence మనకు పెద్ద asset అన్నమాట. ఎందుకంటే mind concious గా వారి presenceలో వుండడంవల్ల spiritual presence గుర్తుపట్ట గలిగిన దానిని విద్యుద్దీకరిస్తుంది. అట్లా వుండి charge అయినపుడు తర్వాత మనం ఎక్కడున్నా, తలుచుకున్నప్పుడల్లా charge అవుతూవుంటుంది మనస్సు. అప్పుడు you have make use the right అన్నమాట. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నాసరే continuous గా వున్నట్లుంటుంది.

ఉదాహరణకు సినిమాహాలులో కూర్చున్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో గుర్తుంటుందా? ఇది ధియేటర్ అని గుర్తుంటుందా? అదెట్లా గుర్తు లేకుండా పోతుందో, అట్లాగే వారి(మహాత్ముల) సన్నిధిలో ప్రాపంచిక విషయాలు గుర్తుండకుండా పోతాయి. ఎక్కడవున్నా ఆ సన్నిధి ఫీలింగ్ వుంటుందన్నమాట. ఊదాహరణకు రైల్లో నాలుగురోజులు ప్రయాణం చేసిన తత్వాత మీరెక్కడ వున్నా రైల్లో ప్రయాణం చేస్తున్నట్లు వుంటుంది. దానికి physical presence కొంత సహకారి. అయితే ఈ physical presence అందరికీ దొరుకుతుందా? అంటే అందరికీ అవకాశాలు రావు. మహాత్ములుండే చోటుకు వెళ్ళడం కష్టం కావచ్చు. వారి దగ్గర వుండడం కష్టం కావచ్చు. అన్ని అవకాశాలు అందరికీ రావు. కాబట్టీ దీని పరిస్థితి ఏమిటి? సృష్టిలో వుండే తత్త్వాన్ని గుర్తించి తాము వేరుగా లేకుండా పోయినవాళ్ళే మహాత్ములు. అయినప్పుడు ఆ తత్త్వం అక్కడా వున్నది. ఇక్కడా వున్నది. కాని  మనకు అనుభవం కావడం లేదు. అందుకు నేను వేరుగా వున్నాననేది అడ్డుపడుతున్నది. సృష్టి అంతటా వున్నది అనుభవం కాకపోడానికిగాని, దానిని గుర్తుపట్టకుండా పోవడానికిగాని - ఈ జగత్తు వేరు, నేనువేరు అనే ఒక్క పొర చాలు. అందుకని ఆ పొరను తొలగించి ఆ సన్నిధిలొ వుండకపోయినా ఆ స్థితికి తీసుకుపోయేందుకు దోహదపడేది చరిత్ర పఠన మాత్రమే. అందుకని పారాయణ అంత గొప్పది. అందుకని గ్రంధ పారాయణ అనే సాంప్రదాయం వచ్చింది.     


source.........ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "సాయిమాష్టర్ ప్రవచనములు" pg# 264,265.

జై సాయి మాష్టర్!!
« Last Edit: May 21, 2011, 12:15:52 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #40 on: May 21, 2011, 09:35:07 PM »
Jai Sai Master!

" Fire cannot help to burn and light cannot help to illumine, Sai Baba the Master, cannot help to discharge the function of a Teacher to anyone who contacts him at any level and in any form; to hear to him, to think of him and even to casually look at his picture is to be swallowed up in the teaming-army of his beloved children.  Thus we see when a visitor arrived from Bombay for the first time at Shirdi and bowed to him, the Master said, " I know this fellow since four years." "The man at first marveled, but later remembered that precisely four years earlier he heard of Sai Baba's glory and bowed to his picture in Bombay and even at that moment, the man discovered that he was accepted.  No one need ask God for air to breath or water to drink."

source.......Acharya Sree Ekkirala Bharadwaja gari " Sai Baba of Shirdi and His Teachings" pg#11.

Jai Sai Master!
« Last Edit: May 23, 2011, 01:22:10 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #41 on: May 23, 2011, 01:16:17 AM »
జై సాయి మాష్టర్!!

"ఇతరులను గూర్చి జాలిపడడం మంచి లక్షణం. అయితే ఇతరుల కంటే తామెంతో గొప్ప స్థితిలో వున్నామనే అహంకారంతో కూడిన జాలి మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఈ రెండు భావాలూ పరస్పరం విరుద్ధం కనుక"....  

source............ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "టిబెట్ యోగి మిలారేపా చరిత్ర " pg#116


జై సాయి మాష్టర్!!


« Last Edit: May 23, 2011, 01:20:22 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #42 on: May 24, 2011, 12:21:24 AM »
జై సాయి మాష్టర్!!

మొదటి సాయి చరిత్రకారుడైన హేమాడ్పంతుకు అల్లుడు యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్.....మొదటి కొద్దిసార్లూ సాయిని దర్శించినా గల్వంకర్ కు మాత్రం ఆయనపట్ల భక్తిశ్రద్ధలంతగా కల్గలేదు. కాని తమ పిలుపు, భగ్వంతుని ఆజ్ఞ లేక ఎవరూ శిరిడీకి రాలేరని సాయి అన్నారుగదా! అందువలన ఆయనే అతని అంతరంగంలో క్రమంగా పరిణితి తీసుకొచ్చారు(అలా అతనిపట్ల సాయి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణమేమో అతనికి తెలియకపోయినా, సాయికి తెలుసు. ఆ విషయం ఆయన చెప్పారు గూడా)

ఒకసారి ఆయన(బాబా) అతనికి స్వప్నంలో కనిపించి అతనిని రూ 2/-లు దక్షిణకోరారు. మరొకసారి గూడా ఆయన కలలో కనిపించి అతనికి రెండు ఆదేశాలిచ్చారు. " నీవు నీతి, నిజాయితీతో(ఉద్యోగంలో) వ్యవహరించాలి." అన్నది ఒకటి; మంచి శీలం, ధర్మబద్ధమైన దాంపత్యమూ పాటించాలన్నది రెండవది. నిజానికి ఆరెండు స్వప్నాదేశాలకూ అర్ధం-అతడు నిష్ట ఓరిమిలతో యీ రెండు నియమాలూ పాటించమనే. అతడు చిత్తశుద్ధితో అలాగే చేయగలిగాడు గూడా. ఇంతకంటే ఏ సద్గురువైనా చేయగల మేలింకొకటి ఏముంటుంది? లౌకికమైన కష్టాలూ, కోర్కెలూ ఎన్ని తొలగించినా యిలాంటి నైతిక పరివర్తన రాకుంటే మనం పొందేదేదీ వుండదు. మనలోని నైతిక బలహీనతలవలన మరలా అంత దుఃఖమూ,కష్టమూ కల్గించగల పాపాలు చేస్తూనే వుంటాము. ముందు జన్మలలో వాటిని విధిగా అనుభవించవలసి వచ్చినపుడు - అవి యిప్పుడెంత కష్టంగా వున్నాయో అంత కష్టంగానూ అప్పుడు వుంటాయి. ఇప్పుడు ప్రత్యేకమైన యత్నంతో, వివేకంతో గూడిన యోచనతో మన బలహీనతలు తొలగించుకొనే యత్నం మనమీ జన్మలో చేయకుంటే అలా చేసే సంస్కారం(మానసికమైన అలవాటు) మరుజన్మలలో గూడా మనకు కల్గదు. ఆ ప్రయత్నం యిప్పుడెంతకష్టంగా వుంటుందో, ముందు జన్మలలో గూడా అంత కష్టంగానూ వుంటుంది. అలాగాక యీ జన్మలో శక్తివంచన లేకుండా మన బలహీనతలను తొలగించుకొనే యత్నం చేస్తే - అలా యత్నం చేసే సంస్కారం మరుజన్మలో మనతో కూడా వచ్చి, అపుడా ప్రయత్నం యిప్పటికంటే సులభమవుతుంది.జనార్ధన్ గల్వంకర్ అలాటివాడు గనుకనే సాయి యీ జన్మలో ఒక్కసారి హెచ్చరించగానే చిత్తశుద్ధితో అట్టి ప్రయత్నం చేసి సఫలుడయ్యాడని మనం తలచవచ్చు.

అందుకొక ఆధారం గూడా వున్నది.

ఒకసారి సాయియే యితర భక్తులతో-గల్వంకర్ గత జన్మలనుండే నిజాయితీ, పవిత్రత గలవాడని చెప్పారు. తర్వాత ఆ భక్తులే ఆ విషయం అతడితో చెప్పారు. అలా అయితే బాబా అతనినీ జన్మలో అలా మరలా హెచ్చరించవలసిన అవసరమేమిటన్న ప్రశ్న రావచ్చు. ఒక్కొక్క సద్గుణంగాని, దుర్గుణం గాని స్థిరపడటానికి కొన్ని జన్మలు పడుతుంది. ఒక సద్గుణం అప్పుడప్పుడే మనలో ఏర్పడుతున్న దశలో, జన్మించిన ప్రతిసారీ సుఖాలను కోరే స్వభావం గల యింద్రియాలు, మనస్సులప్రభావం వలన మరలా మనం బాహ్య ప్రభావలకు లోనై మనలో బలహీనతలు ఏర్పడి బలపడే ప్రమాదముంటుంది.అపుడు సద్గురువు మనలను హెచ్చరిస్తారు.దానిని అమలు పెట్టే మన ప్రయత్నానికి  వారి అండ వుంటుంది. వారిపై మనకు గల భక్తిశ్రద్ధలు తోడై బలపరుస్తాయి. ఇలా అటే సాయి స్వప్నంలో కనిపించి యిలా అదేశించనివరమంతా ఆ సధుణాలను ఇదివరకే సాధించుకున్నవారమని భ్రమపడకూడదు. అదే నిజమైతే యీ జన్మలో మరలా సద్గురుసేవ- మహల్సాపతి, పురందరే, రేగే వంటివారికి లభించినట్లే మనకూ లభిస్తుంది. మన నడవడియెవరూ మన ఎదుటకువచ్చి విమర్శించలేనిదిగా వుంటుంది-పరోక్షంగా అసూయతో వారెన్ని అనుకున్నా. సాయి మనకీ జన్మలో యిలా దర్శనమిచ్చి హెచ్చరించక పొవడానికి ప్రధాన కారణం-మనలో అట్టి ప్రయత్నం గూడా గత జన్మలలో ఆరంభం కాలేదన్నమాట. ఆయన హెచ్చరిక చేసినా దానిని విశ్వాసంతో ఆచరించే దశలో మనం లేనట్లే. అందుకొక్కటే గుర్తు. ఈనాడు సాయిచరిత్రబోధ చదువుకొంటుంటే ప్రత్యక్ష భక్తులందరికీ ఆయన ఎలాంటి హెచ్చరికలు చేసారో తెలుస్తుంది. వాటినివెంటనే వారి ఆదేశంగా తలచి మనం వాటిని పాటించే తీవ్రయత్నం చేయలేకపోతాము. అలాంటప్పుడు ఆయన మనకేమీఅదేశించినా ప్రయోజనమేమున్నది?  వారి ఆజ్ఞ ఉల్లంఘించిన దోషులవడంతప్ప? అందుకే ఆయనేమీ చెప్పరు. ]ఈలోగా ఆయన తమ లీలలతో మనలో విశ్వాసం కల్గించి, అట్టి కృతజ్ఞత-విశ్వాసాలతో వారి ఆదేశం పాటించే యత్నం మనలో ఆరంభమయ్యేలా చేస్తారు. కాని మనం ఒక పట్టాన ఆ మర్గంలోకి రాము. మన పిల్లల మేలుకోరి వారిని బడికి పంపాలని మనం చూస్తుంటే మన పిల్లలు బడికెల్తామనే ఆశజూపి మననుండి తాము కోరినవన్నీ పొందచూచి, విద్యాభ్యాసం మాత్రం ఎగ్గొట్టచూచినట్లే, మనమూ చేస్తాము.మనం కోరినదెల్లా ఆయన నెరవేర్చకుంటే ఆయనపై నమ్మకం విడుస్తాము. ఆయనను బెదిరిస్తుంటాము; అక్కసుతో అలా చేస్తుంటాము గూడా,ఇదంతా నేటిమానవుల గురించి సాయి ఎంతో బాధతో అనుకున్న మాటాలలో - ఖాపర్ధే డైరీలోనివి నిరూపణవుతాయి.

source.............ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "సాయి సన్నిధి" pg#292,293,294.

జై సాయి మాష్టర్!!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #43 on: May 24, 2011, 12:40:49 PM »
Jai SaiMaster,

Another drop of Amrutam from Mastergari kamandalam.Not getting proper words to describe the feeling I get after reading the above quote.Laitha garu, I bow to the SaiMaster in you.
Dont know with that words I should thank you for sharing these wonderful quotes.Long live this Satsangam. Thanks to everyone.

Jai SaiMaster
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #44 on: May 25, 2011, 12:13:03 AM »
జై సాయి మాష్టర్!!

.........మనలో మంచిని, ప్రక్కవారి చెడునూ గుర్తుంచుకొని మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగల మనకు, మనలో చెడునూ, సాటివారిలోని మంచినీ మాత్రమే గుర్తిస్తూ జీవించడమెంత కంటకమో! సాధనంతా కత్తి అంచుమీద నడవడం వంటిదేనని వేదాలు చెప్పాయి. " ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతోకష్టం; మన శక్తినంతటినీ ఉపయోగించి పాటుపడితే గాని ఫలితం దక్కదు. దున్నపోతునెక్కి 'నాన్హేఘాట్'దాటడం కంటె గూడా కష్టం" అన్నారు సాయి. కాని ఏదైనా, ఇష్టముంటే కష్టము ఉండదు! లాభనష్టాల చింతా వుండదు. ప్రేయసి పై వ్యామోహంతో ఎందరెన్ని కష్టాలకోర్చలేదు? ఎవరెన్ని కష్టాలు కొని తెచ్చుకోలేదు? త్రాగుడు, జూదము అలవాటయ్యాక వాటికోసం పెళ్ళాము, పిల్లలు, ఆస్థి, తిండి, ఆత్మగౌరవము, చివరికి ప్రాణము గూడా పణంగా పెట్టడంలేదా? పరువు, పలుకుబడులపై వ్యామోహంతో మన భావి జన్మపరంపరలను గూడా బుగ్గిపాలు చేసుకోడం లేదా?

"అదెవరికి తెలుసు?" అని తప్పుకుంటే వీలుగాదు. మనలో ఎక్కువమంది ఎంతటి దైన్యంలో, సాయినెంత ఆర్తితో ఆశ్రయించామో! వేరుగతిలేక "నీవే దిక్కు!" అన్నాము. ఆ కష్టమో, కోరికో తీరిన కొద్దికాలంవరకూ ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాము.కాని అవి తీరాక కొంత కాలానికి మన ఉత్సాహము, కృతజ్ఞత, విశ్వాసము చల్లబడతాయి. లేకుంటే ఆయన దయవల్ల జీవితంలో స్థిమితం చిక్కాక, ఆయన చెప్పేది అనుసరించడం కష్టమనిపించి ఒక దణ్ణం పెట్టి, ఆయన ముఖానే తలుపులెలా మూసుకుంటాము? అటుతర్వాత వారి చిత్ర పటం మాత్రమే మనిట్లో మిగిలుతుంది. అది గూడా నలుగురి దృష్టినుండీ మనకు ప్రీతిపాత్రమైన మన దౌష్టాన్ని దాచే ముసుగుగా మాత్రమే మిగులుతుంది. త్రాగుబోతు, జూదరీ అయినవాడు, సాటివారిని తన మార్గంలోకి లాగేదాకా హాయిగా నిద్రపోలేడు. మనమూ అంతే!

ఆపత్సమయంలో హృదయపూర్వకంగా మనము సాయి కిచ్చిన మాట ఇంత హృదయరహితంగా వమ్ము చేస్తాము గనుకనే, మళ్ళీ ఎన్నో జన్మలదాకా అలాటి మహనీయుల గాలి కూడా మనకు సోకదు. సాయిని గూడా 'చెన్నబసప్ప-వీరభద్రప్ప' అనే పాము కప్పలు ఎంత గుర్తించగలిగాయి? దైవాన్నెంత ప్రార్ధించినా కష్టాలు తీరని వారంతా ఇలా తామిచ్చిన వాగ్ధానాన్ని వమ్ము చేసినవారే! సృష్టికర్త మొదట జీవులను సృష్టించాక, "మీరందరూ ఒకరినొకరు సుఖపెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి " అని అదేశించారని శృతులు చెబుతున్నాయి. వాటి ప్రత్యక్ష వాఖ్యానమే బాబుగారు నివశించిన కొండలు, అరణ్యాలు. అవి మహాభారతంలా ఒక పురాణమైతే, దానిలో నివసించిన బాబుగారు భగవద్గీతలా, భగవంతునిలా నిలచారు. తమలో ఇముడ్చుకున్న ఈ తత్త్వమే బాహ్యంగా అరణ్యమంతటా వున్నదని సూచించారు. అలా తమ విశ్వరూపం దర్శనమిస్తున్నారు. ఆ భగవద్గీత ఎంత గొప్పదైనా మన నొసటిగీత మారాలంటే వారే గతి!     


source.....ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి "నేను దర్శించిన మహాత్ములు-1(పాకలపాటి గురువుగారు)" pg# 104,105.

జై సాయి మాష్టర్!!
« Last Edit: May 25, 2011, 12:15:12 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra