Author Topic: Daily Inspirational Quotes of Master Garu!!!  (Read 121817 times)

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #15 on: April 26, 2011, 10:27:10 PM »
Jai Sai Master!

కొన్ని సమయాలలో మనస్సు ఎట్టి వికారమూ చెందకుండా వుంటుంది. ఒక్కక్కప్పుడు పరిస్థితుల ప్రభావానికి లొంగి తప్పుభావం కలిగి తరువాత అలోచిస్తే తొలగిపోతుంది. అలా గాక స్థిమితంగా మనస్సు సరియైన స్థితిలో వుండాలంటే ఏమి చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ మాష్టర్ ఇలా అన్నారు.

యుక్త వయస్సు వచ్చాక ప్రకృతి సిద్ధంగా శారీరక ధర్మాన్ని అనుసరించి మనస్సు కొన్ని భావాలను కోరికలను పొదడం సహజమే. కాని అట్టివి ప్రకృతిసిద్ధం కాక, కృత్రిమ నాగరికతలోని అంశాలైన అశ్లీల సాహిత్యము, చలనచిత్రాల ప్రభావంవల్లకాని, ఫ్యాషన్ ప్రభావంవల్ల గాని అటువంటి భావాలు కోరికలు తీవ్రతరమైతే అవి దోషాలనబడతాయి. దేహారోగ్యానికి అవసరమైన ఆహారాన్ని కోరడంలో తప్పులేదు. తిండిపోతుతనం శరీరానికి అనారోగ్యకరమేగాక, ఒకవిధమైన మానసిక జాడ్యం అనిచెప్పాలి. వాని ప్రభావంచేత మనిషి యొక్క చేతలు హద్దుమీరి ధర్మాన్ని, మానవతను ఉల్లంఘించే అవకాశమున్నది. అన్ని కోరికల విషయము అలాంటిదే! తన కోర్కెలను తీర్చుకోవడంతొపాటు, అందులోని బాధ్యతను గూడా భరించగల సంసిద్ధతను కలిగి వుండడమే మానవత్వము, సంస్కారము. మితిమీరిన వాంచలను హృదయంలో వహించి బాహ్యంగా సమాజానికి వెరచి శారీరక నిగ్రహాన్ని పాటిస్తే అటు శరీరం ఇటు మనస్సు కూడా క్రమంగా అవాంచనీయమైన పరిణామాలకు దారితీయవచ్చు.
 
చక్కటి యోచనతో మనస్సును దుష్ప్రభావలనుండి తొలగించుకోవచ్చు. విపరీతమైన వాంచలకు గురి అయినవాడు సాటి మనుషులను తన కోర్కెలను నెరవేర్చుకొనేందుకు అనువైన పని ముట్లగానే చూడగలడు. అతని చర్యలు సాటివారి మానవత్వాన్ని దెబ్బతెసి వారిలో హృదయవేదనను మానవజాతిపై జుగుప్స, అవిశ్వాసములను కలిగించగలవు. లేదా  వారు కూడా తిరిగి సాటివారిపట్ల అలానే ప్రవర్తించడం నేర్చుకుంటారు.

అంతేకాదు మనిషికి సాటివారిపై ఎట్లాంటి భావముంటుందో అట్టి భావానే గుప్తంగా తనపట్ల కూడా కలిగి వుంటాడు కనుక దేహ స్వస్థతనుకూడా పట్టించుకోకుండా వాటిని విలాస వస్తువులుగా మాత్రమే వాడుకొని దెబ్బతినే ప్రమాదము వున్నది. సాటివారిని ప్రేమించలేనివాడు తనను తాను కూడా ప్రేమించుకోలేడు. దీని విపర్యము కూడా అంతే వాస్తవము. బాధ్యతాయుతమైన మానవత్వము; తనపట్ల తనకుగాని, యితరులపట్లగాని, తనకుగల ప్రేమకు గీటురాళ్ళు. కనుక సరియైన యోచనతో హృదయాన్ని అనుక్షణమూ పరిశుద్ధము చేసుకుంటూ ఉండడము అవసరము. అభ్యాసముతో యిది సహజస్థితిగా మారుతుంది.

సరియైన యోచనలో ముఖ్య అంశము;  జీవిత లక్ష్యాన్ని అవగాహన చేసికొనడము శారీరము, వాక్కు, క్రియ మనస్సులయొక్క సర్వ సామర్ధ్యాలను వికసింపచేసికోగల్గడమే. జీవిత లక్ష్యము తమకు
తెలిసినా తెలియకున్నా ప్రతివారూ జీవించాలనుకొనేది ఇందుకే. దీనికి ఒక్కటే ఋజువు. ఇలా మనలోని అంశాలను పటిష్టం చేసే ఆటలు, వినోద కాలక్షేపాలు వేరొక లౌకిక ప్రయోజనాలను మనకు సంపాదించలేకపోయినా, అంత ఆసక్తికరంగా వుంటాయి. అందరకు ఇలాంటి వికాసాన్ని, పాటవాన్ని ప్రసాదించలేని విద్య, వృత్తి మొదలైన వాటిని మనం జీవికకోసం అనుసరించినా నిజానికి వాటిపట్ల ప్రతివారిలోను విముఖతే వుంటుంది. అలాగాక కొందరిలో లౌకిక ప్రయోజనాలే జీవిత లక్ష్యమన్న భ్రమ లోతుగా నాటుకొని వుండవచ్చు కాని వారి ఆచరణ సుఖ శ్రేయస్సులనేగాక  తమ వారియొక్క, తమయొక్క సహజ సామర్ధ్యాలను వికసింపజేసికోలేనివిగా వుండడమే గుర్తు. వారిలోని లోపానికి సామాన్యంగా అసహ్యకరముగా తోచే వస్తువుల పట్ల కొంతమందికి అమితమైన ప్రీతి కలిగివుండడంలాగానే ఇది గూడా అనారోగ్యస్థితికి చిహ్నం. 

శరీరానికి చక్కటి వ్యాయామం మనస్సుకు చక్కటి యోచనను కల్గించే గ్రంధపఠనము, యోచన, చర్చ యిలా సంపాదించబడిన చక్కటి యోచన విధానాన్ని సాటివారితో చక్కగా పంచుకోగల వాక్పటిమ మనలోని పై మూడు అంశాలను తనలో యిముడ్చుకొన్న "నేను" అనబడు ఆత్మచైతన్యము యొక్క తత్త్వాన్ని వివేకంతో పరిశోధించగల జిజ్ఞాస - యివి మన కర్తవ్యాలు. వీటిని పొందటానికి యత్నించడంలో అవసరమైన స్థాయిల బలాన్ని మనం ప్రకృతినుండి తిండి, నీరు, గాలి, వెలుగు, ఇంద్రియానుభవాల ద్వారా పొందుతూనే వుంటాము. కాని యిన్ని రీతుల నిర్ధుష్టంగా యత్నించాలని మనలొ చాలా మందికి తెలియదు. అట్టివారిలో జీవించడానికి అవసరమైనంతకంటె అదనంగా మనస్సు, వాక్కు, ఆత్మల వికాసానికి కృషిచేయడంలో వినియోగపడవలసిన శక్తి మనలో యిమడక, విపరీతమైన మనోవికారాల రూపంలో, విశృంఖలమైన ప్రవర్తనలో ఖర్చు అవ్వాలని యత్నిస్తుంది. అందుకే పరివర్తన చెందని మానవాళి తరచు వినాశాత్మకమైన కార్యకలాపాలకు యిట్టే సంసిద్ధం కావడం చూస్తాము కుల-మత-జాతి-ప్రాంతీయ-రాజెకీయ-కలహాలలో. కనుక సరియైన యోచనను ప్రజలకందించడానికి మన సాయిబాబా పత్రిక, ప్రచురణలు ఎంతగానో కృషిచేస్తున్నాయి.     


source........Acharya Ekkirala Bharadwaja gari "పరిప్రశ్న?" (pg 4,5,6)


Jai Sai Master!!!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #16 on: April 27, 2011, 07:23:13 PM »
Jai Sai Master!

మన ఆంధ్రదేశంలో యీనాడు శిరిడీ సాయి ప్రచారమెంతో విస్తారంగా జరుగుతున్నది. ఎందరెందరో ఆయన లీలలవలన ఆకర్షించబడి శిరిడీ వెళుతున్నారు. అయినప్పటికీ మహారాష్ట్ర దేశంలోని భక్తులు శ్రీ సాయిని ఆరాధించటానికీ, మనలో ఎక్కువమంది ఆరాధించటానికీ ఎంతో వ్యత్యాసమున్నది. యిచటి విధానం, మన జీవితాలనే పాత యిళ్ళకు పైపైన సున్నం కొట్టడం లాంటిది; మహరాష్ట్ర దేశం లోనిది - ఇల్లంతటినీ పునాదులదగ్గరనుంచీ తిరిగి నిర్మించడం లాటిది. నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో అడుగు బెట్టడమంటే మన పాత జీవితము, మనస్తత్త్వమూ మొత్తంగా తిరిగి నిర్మించుకొనడం వంటిదేనని, మరలా జన్మించడంలాంటిదేననీ ఋషులందరూ చెప్పారు.

ఏసుక్రీస్తు గూడా అలానే చెప్పారు. అందుకే సనాతన దర్మంలో అధ్యాత్మిక జీవితానికి నాందియైన ఉపనయనాన్ని రెండవ జన్మ అనీ, ఉపనీతుణ్ణి 'ద్విజుడు'(రెండవసారి జన్మించినవాడు) అనీ అన్నారు. కనుక మన దేశంలో గూడా సాయి భక్తి దృఢతరమై, యిచటి ప్రజల జీవితాలను లోతుగా ప్రభావితం చెయగల్గాలంటే మనం గూడా మహారాష్ట్ర పద్ధతి నెరిగి ఆరాధించాలి. అప్పుడే ఆ దేశం పొందినంతగా మనము శ్రీ సాయీశుని అనుగ్రహం పొందగల్గుతాము.

మహరాష్ట్రుల దృష్టిలో శ్రీ సాయీశుడు అనాదిగా వస్తున్న దత్తావతారపరంపరలో చివరివారు. ఆ సాంప్రదాయంలో "శ్రీ గురుచరిత్ర" పారాయణ చెయడమొక్కటే మహాత్ములందరి రూపంలోనూ భూమిపై అవతరించే దత్తస్వామి అనుగ్రహం పొందే మార్గం. అది తెల్పడానికే షిరిడి సాయి సంస్థానం వారు గూడా తాము ప్రచురిస్తున్న "శ్రీ సాయిసచ్చరిత్ర" గ్రంధానికి ముందుమాటలో - అది ఆధునిక "గురుచరిత్ర" అని, శ్రీ సాయీశుడు నేటి దత్తావతారమనీ స్పష్టంగా వ్రాసారు. ఆ గ్రంధ రచయిత గూడా రచనా విధానమంతటిలో 'శ్రీ గురుచరిత్ర' నే అనుసరించారు. ఎందరికో సాయి అనుగ్రహం విశేషంగా లబించడం కూడా 'శ్రీగురుచరిత్ర' పారాయణ ఫలితమేనని "శ్రీ సాయి లీలామృతం"  "శ్రీ సాయిప్రబోధామృతము" చూస్తే  స్పష్టమవుతుంది. ఈ సంగతి యిప్పుడిప్పుడే సత్సంగాల ద్వారా మన సాయి భక్తసోదరీ సొదరులెందరో గుర్తించి " శ్రీ గురుచరిత్ర" గూడా శ్రద్ధగా పారాయణ చేస్తున్నారు. అంతేకాదు; బస్సులలో శిరిడీ యాత్రచేసేటప్పుడు దారిలో యీ దత్తావతారాల క్షేత్రాలు గూడా దర్శిస్తున్నారు.......

.....ఆయా క్షేత్రాలలో దర్శనము, పూజ అయాక మిగిలిన సమయం ఏమి చేయాలో భక్తులకు తెలియక వ్యర్ధ ప్రసంగాలలోనూ, నిద్రలోనూ కాలము సదవకాశము వృధా చేసుకొంటారు. కనుక వారక్కడ ఆ కొద్ది సమయంలో చదువుకోవలసిన లీలలు వివిధ ప్రదేశాలలో చదువుకోవలసిన శ్లోకాలూ యిందులో పొందుపరుస్తున్నాను. యిందులోని స్తోత్రాలన్నీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీ దత్తావతారమూ అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు వ్రాసినవే.

     

source.......Acharya Ekkirala Bharadwaja gari  "Dattavatara Mahatyam" (mundumaata)

Jai Sai Master!
« Last Edit: April 27, 2011, 07:25:30 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #17 on: April 28, 2011, 07:41:05 PM »
జై సాయి మాష్టర్!

"స్వామి సన్నిధిలో నాకు కలిగే చిత్తశాంతి చాలా ఘాడమై నన్ను తీవ్రంగా వారివైపుకు ఆకర్షించేది. నేను జిళ్ళెళ్ళమూడి అమ్మ ఆజ్ఞపై బాపట్ల కాలేజీలో రాజీనామా యిచ్చి జెళ్ళెళ్ళమూడిలో వుంటూవుండేవాణ్ణి. కాని నేను జిళ్ళెళ్ళమూడి నుంచి ప్రెస్ పని మీద బాపట్ల ఎప్పుడు వచ్చినా చీరాల వెళ్ళి ఆయనను తప్పక దర్శించుకునేవాణ్ణి. వెళ్ళినప్పుడల్లా ఆయన నా చేత టిఫిను,కాఫీ, సిగరెట్టూ సేవింపజేసేవారు. ఆయనను దర్శించినప్పుడల్లా నాకు కలిగే చిత్తశాంతి ఆ తర్వాత సుమారు నెలరోజులవరకూ వుండి  నేను నిత్యమూ చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్ఠంచేసేది. ఆయన దగ్గరకు వెళ్తుంటే నా తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నట్లనిపించేది. ఈ అఖిల జగత్తూ ఒక యెత్తు, ఆయనొక్కరూ ఒక యెత్తు అనిపించేది. ఆయన ఈ చరాచర జగత్తులోని ప్రతి అణువులోనూ ఒకే బ్రహ్మం నిండివున్నట్లు అనుక్షణం దర్శిస్తూంటారని అనిపించేది. ఆయన మౌనముద్ర ఈ జగత్తులోని శబ్దానికి, నిశ్శబ్దానికి ఆధారమైనట్లు తోచేది. ఆయన తలనుండి వ్రేలాడే జడలు సృష్టి అనే మఱ్ఱి చెట్టు ఊడల్లాగా - నిత్య పరిణామంద్వారా నిత్య నూతనత్వాన్ని చెందుతూవుండే సృష్టి అనే మఱ్ఱిచెట్టంతటా వ్యాపించివున్న బ్రహ్మ చైతన్యం, భక్తులమీది కృపచేత వారిని ఉద్ధరించడానికి సృష్టినుండి ఆవిర్భవించే పరిపూర్ణ మహాత్ముల రూపాలలాగా కనిపించేవి. ఆయన తన ఒక చేతివ్రేళ్ళను మరొక చేతివ్రేళ్ళ కణుపులతో నొక్కుతుంటేను, అప్పుడప్పుడు పళ్ళు గట్టిగా బిగిస్తుంటేనూ ఆ చేష్టలు నిగూఢ యోగ ప్రక్రియలుగా నాకు తోచేవి. కాని వాటి ప్రయోజనమేమో నాకు అవగతమయ్యేది గాదు. దీనికి ఉపనిషత్తుప్రమాణం వున్నది. సహజాతిసహజము, నిరాడంబరమూ అయిన ఆయన రూపాన్ని చూస్తుంటే మనకవగతమయ్యే సహజమైన ప్రకృతి రూపాల వెనుక, సూక్షంగా, నిగూఢంగా వ్యాపించివున్న బ్రహ్మ చైతన్యమే ఆయన రూపంలో అవతరించిందా అన్నట్లుండేది. నిర్లిప్తమైన ఆయన దృష్టి నాకు నిశ్చేష్టతగా తోచేది. పోనుపోనూ ఆయన దృక్కులు ఎంతో నిశితము,  సూక్షము, బలవత్తరమూ అయిన అపార ప్రేమలో నన్ను ముంచెత్తుతున్నట్లు వుండేవి. అసంఖ్యాకులైన ప్రజలు నిర్విరామంగా అనుక్షణం  కొనసాగించే పాపక్రియాకలాపంవల్ల ఆ జనులను, సృష్టినీ అంతరింపజేయకుండా తన కరుణతో ఆ పాపాన్ని తమ దృష్టి, ఉనికి, సంచారములచేత అగ్ని ఆజ్యాన్ని దహించినట్లు దహించి లోకాన్ని కాపాడుతున్న పరమ కరుణామూర్తిగా నాకాయన గోచరించేవారు. సృష్టికి అనుక్షణమూ అంతటి మహత్తరమైన శ్రేయస్సు చేకూరుస్తూ గూడా అందులోని జీవులచేత గుర్తించబడక, అట్టి ఆశగూడా  లేక, గుర్తించని వారి ఏవగింపులనూ, దూషణలనూ అసమాన ప్రేమతో స్వీకరిస్తూ వీధులయందు తిరిగే ఆ స్వామిని చూస్తుంటే కృతజ్ఞతతో నా హృదయం కృంగి, నాకు నేనే సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక దూళిరేణువులా గోచరించేవాణ్ణి. అంతటి మహాత్ముని కృపను ఎలా కోరాలి? ఎలా పొందాలి? ఒక వేళ ఆయన ప్రసాదించినా తట్టుకోగల శక్తి నాకున్నదా? ఇలా ఎన్నెన్నో అర్ధంలేనట్టి భావాలతో నా హృదయం నిండిపోయేది."     

source.....ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి  "నేనుదర్శించిన మహాత్ములు" - అవధూత చీరాలస్వామి (pg 12,13,14)

 జై సాయి మాష్టర్!
« Last Edit: April 28, 2011, 07:43:07 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #18 on: April 29, 2011, 11:10:36 PM »
జై సాయి మాష్టర్!!!

అద్వయుడు, రూప-గుణరహితుడూ అయిన పరమాత్మ తన సంకల్పం వలన అనేకమైన ఈ అనంతమైన విశ్వరూపం ధరించాడు. ఇలా రూపాలను సృష్టించిన ఆయన శక్తిని బ్రహ్మయని, వాటిని పోషించే దానిని విష్ణువనీ, వాటిని సకాలంలో లయింపచేస్తూ ఉండే శక్తిని శివుడనీ అన్నారు. ఈ మూడు శక్తులూ దేనివో దేనియందు పనిచేస్తాయో దానిని పరబ్రహ్మమంటారు. పైమూడు తత్త్వాలూ కలసి పనిచేయడం వలన వివిధ ప్రకృతి శక్తులైన దేవతలు, వారి సమిష్టిక్రియయైన "యజ్ఞం" వలన వస్తుజాలమూ ఏర్పడతాయి. అయితే ఒకానొక శక్తి నీటిలో పనిచేసి తరంగాన్ని లేపినా, మరొక శక్తి ఆ తరంగాన్ని కొంత సేపు నిలిపినా, మరలా మరొక శక్తి పనిచేయడం వలన ఆ తరంగం లయించినా, యీ శక్తులన్నీ ఏ నీటియందు పనిచేస్తాయో ఆ నీరు ఆ తరంగాలన్నింటి రూపాలలోనూ ఉన్నట్లు, పరబ్రహ్మం గూడా విశ్వగతము, శాశ్వతమూ.

అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనబడు సృష్టి, స్థితి, లయకారకులైన శక్తుల సమిష్టి క్రియలో ఒక్కక్కప్పుడు పరమాత్మ సంకల్పానుసారం జరిగే సృష్టిలో అస్తవ్యస్తమేర్పడుతుంది. అంటే సృష్టి వికాసాన్ని ప్రతిఘటించే పరిస్థితి, లేక శక్తి ఏర్పడుతూంటుంది. అటువంటప్పుడు సమిష్టియైన పర బ్రహ్మము నుండి అట్టి అస్తవ్యస్తాన్ని 'సవరించే' ప్రక్రియ జరుగుతుంది. ఇట్టి అస్తవ్యస్తాన్ని 'ధర్మగ్లాని ' యని, దానిని నివారించే ప్రక్రియను 'భగవదవతారమనీ' ఋషులు వర్ణించారు.

దీనికొక సారూప్యం: మన దేహం జీవించడానికి ఆకలితో అన్నం తింటుంటే ఒక్కక్కసారి ముద్ద గొంతుకడ్డం పడి ప్రాణాపాయమేర్పడుతుంది. అప్పుడు శరీరగతమైన ప్రాణశక్తే ఆ వ్యక్తి నీరు త్రాగేలా ప్రేరేపిస్తుంది అలానే యిదిగూడా. లేక అన్నపుమెతుకు పొరపాటున శ్వాసకోశంలో ప్రవేశించబోతే పొరబోయి ఆ మెతుకును బయటకు వెడలగొట్టి, ప్రాణాణ్ణి కాపాడుతుంది. యిలా సృష్టియొక్క సమిష్టి వికాసానికేర్పడే అవరోధాలే ధర్మగ్లాని. దానినివారణమే భగవదవతారం. ఆ ప్రయోజనం నెరవేరగానే అవతారమంతమొందుతుంది. యిట్టివే మత్స్య,కూర్మ, రామ, కృష్ణాద్యవతారాలు.

యిలాగాక అనుక్షణమూ శరీరంలో శ్వాస, హృదయస్పందన నిత్యప్రక్రియలు ఆ దేహమున్నంతవరకూ జరగవలసినదే. ఆ దేహం జీవించడానికి నిజానికి అన్నపానీయాలకంటే గూడా ఈ క్రియలే ఎక్కువ అవసరము. నిజానికి యీ క్రియలు జరుగుతూవుంటేనే  అన్న పానీయాల సేవనం సాధ్యం. అంటే శ్వాస, హృదయస్పందనాలను నిర్వహించే ప్రాణశక్తి ప్రాధమికము. అన్నపానాది సేవనం చేసే సామర్ధ్యాలు దానికి సహకారులు మాత్రమే. అలానే భగవంతుని వ్యక్త రూపము, లేక దేహము అయిన యీ విశాల విశ్వం ('విశ్వరూపం') నిరంతరమూ చక్కగా కొనసాగడానికవసరమైన మరొక దైవశక్తి ప్రత్యేకంగా ధర్మగ్లానిని బాపడానికేగాక, సక్రమ నిర్వహణకోసం గూడా పనిచేస్తుండాలి.

ఈ నిత్య సంరక్షక శక్తి యొక్క లక్ష్యమొక్కటున్నది. జీవకోటియంతా జీవించయత్నిస్తుంది. జీవితమంతా నిత్యనూత్నానుభూతుల వలన మరింత వికాసం కల్గి జ్ఞానాన్నిసంపాదిస్తున్నది. తద్వారా మరింత ఉత్తమంగాను, సుఖశాంతులతోనూ జీవించడం నేర్చుకోజూస్తున్నది. ఇదే ధర్మ జిజ్ఞాస కల్గి, ధర్మాన్ని తెలిసి, ఆచరించడంగా మానవులలో  ప్రకటమవుతుంది. ఈ జిజ్ఞాస ఆత్మజ్ఞానంతోగాని పూర్తిగాదు. అంతవరకూ జీవికి స్థిరమైన తృప్తి, శాంతి లభించవు. తనలోని "నేను" అన్న ప్రజ్ఞ వాస్తవానికి జననమరణ రహితమని తెలిసేదాకా మృత్యుభీతి వీడదు. అంతవరకూ జీవికి స్థిరసుఖరూపమైన శాంతి కల్గదు.

అంటే అన్నపానాది నైమిత్తికావసరాలను నేరవేర్చే శక్తులు దేహంలో సకాలంలో ప్రకటమై, అవసరం తీరగానే ఉపశమించినట్లు  రామ కృష్ణాది అవతారములు సృష్టియనే ఈ పరమేశ్వర దేహంలో అవతరించి, కాలబద్ధమైన అవసరాలను నెరవేర్చి నిర్యాణం చెందుతూంటుంది. మరొకవంక ఈ విశ్వాన్ని ధర్మాచరణద్వారా అనుక్షణమూ మనేలా చూస్తూ, జీవులను ఆత్మజ్ఞానోన్ముఖులను చేస్తూ, జీవిత పరమార్ధం వైపుకు కృషి చేసేలా  ప్రేరేపించి, సహకరించి కృతార్ధతనిచ్చే భగవత్తతత్త్వమెల్లప్పుడూ సృష్టిలో పనిచేస్తూండాలన్నమాట. ఇట్టి శక్తియే దత్తత్రేయస్వామి అవతారంగా ఎల్లపుడూ భూమిమీద విజయం చేస్తూంటారని, తమ మహిమచేత జీవులను ధర్మాచరణకు, ముముక్షుత్వానికి కృషిచేసేలా ప్రోత్సహిస్తారనీ పురాణాలలో చెప్పబడింది. ఈ సత్యాన్నే భాగవతమిలా చెప్పింది: భగవంతుడు మహర్షులకు ధ్యానబలంవలన వారి హృదయాలకు మాత్రమే గోచరుడు. అట్టి తపోనిష్ట సర్వులకూ సాధ్యంకాదు. కనుక అపారకరుణచేత జీవులందరికీ తాను  లభ్యమయ్యేందుకు పరిపూర్ణులైన మహనీయుల రూపంలో శాశ్వతంగా భూమిపైన సంచరిస్తూ ఉంటాడు. వీరందరి రూపాలతో  ప్రకటమయ్యే భగవతత్త్వమే దత్తాత్రేయుడు. అందుకే సాధకులందరూ విధిగా నిత్యమూ పటించే గురుధ్యానశ్లోకం "గురుబ్రహ్మ" అనేది త్రిమూర్తి, పరబ్రహ్మల రూపమైన ఈయననే స్తుతిస్తుంది. అంటే జీవులందరూ శ్రేయస్కరమైన ధర్మాన్ని, అర్ధకామాలను, మోక్షాన్నీ పొందడానికి పరమ గురుడైన దాతాత్రేయుడినే ఆశ్రయించాలి. ఆయన పూర్ణులైన మహనీయుల రూపాలో ఎల్లప్పుడూ  మానవాళికి లభిస్తారు. ఈయుగంలో వీరి ప్రధానమైన అవతారాలు శ్రీ శ్రీపాదవల్లభుడు, నరసింహసరస్వతి, మాణిక్యప్రభు, అక్కల్కోటస్వామి,  షిరిడి సాయిబాబా.   source....ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి.....గురుచరిత్ర(సంహితాయన గురుద్విసాహస్రి) pg i ii iii iv.


జై సాయి మాష్టర్!!!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #19 on: May 01, 2011, 12:10:40 AM »
జై సాయిమాష్టర్!


నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇలాంటి ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభంకావాలి. రోగి తనకు రోగమెంత ముదిరిందో గుర్తిస్తేనే, వైద్యుణ్ణి విశ్వాసంతో ఆశ్రయించగలడు. భూమియొక్క నిజస్థితి తెలిస్తేనే, అది సస్యశ్యామలమవాలంటే ఏమిచేయాలో సరిగా తెలిసేది. అందుకే వేదకాలం నుండీ అన్ని సత్కర్మలకూ ఆరంభంలో ప్రాయశ్చిత్తమనే క్రతువు చేయడం ఆచారమైంది. మనము తెలిసి చేసిన పాపాలను గురించి ఆత్మ విమర్శ చేసుకొని నిజమైన పరితాపం చెందాలి. పాపాలు చేసేలా మనసునుప్రేరేపించే మనలోని దుర్గుణాలను-ప్రక్కవారి తప్పులెన్నినంత నిష్కర్షగా గుర్తించి, మన దుష్టస్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. అప్పుడే అంతటి దుస్థితి నుంచి మనలను ఉద్ధరించుకోవాలన్న నిజమైన తపన ప్రారంభమవుతుంది; మనలనుద్ధరించమని భగవంతుని నిజంగా  ప్రార్థించగలుగుతాం. క్రైస్తవమతంలో గూడా పశ్చాత్తాపం తర్వాతనే ప్రార్ధనచేయాలి. అలాభగవంతుని శరణుపొందడమే ఇస్లాం యొక్క హృదయం. మనమెవరికైనా అన్యాయం చేసివుంటే మొదటదానికి ప్రతిక్రియచేసి, వారిక్షమాపణకోరి, వారి మనసును సమాధానపరచాకనే భగవంతునికి నైవేధ్యమివ్వాలని ఏసుక్రీస్తు చెప్పారు. అజ్ఞానం వలన సాటివారు మనపట్ల అలా వ్యవహరించకున్న, మనతరింపుకోసమై మనమలానే చేయాలని, "నీ శతృవును గూడ ప్రేమించు; వారి శ్రేయస్సుకోసం భగవంతుని ప్రార్ధించు" అని చెప్పాడు క్రీస్తు. అలానే బాబుగారు చూసే కొండలు, అడవి కొలతబద్దలవంటివి-వాటిసహాయంతో మనం ప్రకృతి విడిచి, అపవిత్రమైన వికృతిలోఎంత లోతుగా దిగిపోయామన్నది తెలుసుకోవచ్చు. మళ్ళీ ఆ కొండకోనకు పోయే అడవిబాటన నడచి బాబుగారున్నచోటుకు చేరవచ్చు. నిరంతరము ఏమారక మనమా ప్రయత్నంలోనే వుంటే బాబుగారెప్పుడూ మన చెంతనే వుంటారు. "నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ శ్రేయస్సుకు హామీ నేను!" అన్నారుకదా! సమయమొచ్చినప్పుడు ఆయనే మనచెంత నుండి శ్రీశైలపు అడవులు గూడా చూపిస్తారు.

కాని ఇదెంతో బాధాకరమైన బాట. నిజంగా కొండకోనకు వెళ్ళే అడవి బాటే! సాయిబాబాతో వారి గురువు చెప్పినట్లు, దారితెలిసిన వారితోడు లేక ఈ అడవిలోంచి సరిగా గమ్యం చేరలేము. కేవలం పూర్వపుణ్యం వల్లగాని సాయిబాబా, బాబుగారువంటి సమర్ధులైన ఆప్తులు తారసిల్లరు. ఇంకెంతో పుణ్యముంటే గాని- అడవిలోకెళ్ళిన నల్గురిలో సాయి ఒక్కరే ఆ గురువును గుర్తించి ఆశ్రయించగలిగినట్లు-మనమూ ఆశ్రయించలేము. అపుడు వారు మొదట మన ఆకలిదప్పులు తీరుస్తారు. అంటే తగిన బోధచేసి సందేహమనే దాహం తీరుస్తారు; జిజ్ఞాసయనే ఆకలి తీరుస్తారు. అటు తర్వాతనైనా నిష్ఠ-సబూరీలతో వారిని అంటిపెట్టుకుంటేనే, వారు మనను బావిలో తలక్రిందులుగా వ్రేలాడదీసినా, ఆనందంతో అంగీకరించలేము. సాయిబాబా,బాబుగారు వంటివారు చెప్పిన బోధనాచరించడమంటే ప్రపంచరీతులకు విరుద్ధంగా వుండడమే.


"ఇతరులు పరుషంగా మాట్లాడినా, కష్టపెట్టినా దెబ్బకుదెబ్బ తీయవద్దు. భగవంతుని స్మరించి ప్రక్కకు తొలిగిపో!" అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికెంత విరుద్ధం.!అవతలవారేమీ అనకముందే వారిలో తప్పులెంచి, వేయిమాటలనే మనకు, అవతలవారొక్కమాటంటే తిరిగి లక్షనకుండా వుండడం సాధ్యమేనా?మంచితనం మన దృష్టికి చేతగానితనంగా కనిపించకుంటే,ఎన్నికల్పాలనుండో భగవంతుడెన్నిసార్లవతరించినా వీసమెత్తుగూడా మారకుండా ఇలా వుండగలమా? కాని, "నేను చెప్పింది పూర్తిగా విశ్వసించినవాడే సఫలుడౌతాడు" అని సాయికి వారి గురువు చెప్పారు. నేడు బాబుగారు మనకొక్క నోటితో, ఒక్కమాటతో చెబితే అచటి మహారణ్యము, కొండకోనలూ వేయి నోళ్ళతో నిరంతరమూ చెబుతున్నాయి. కొండకోనకు పోయే అడవిబాట-జీవితగమ్యం చేరాలంటే ఇదొక్కటే మార్గమని చెబుతోంది. మనము భగవంతుని స్మరించిన ప్రతిసారీ, సాయినాధుడు, బాబుగారూ చిరునవ్వుతో మన కళ్ళలోకి చూస్తారు.'నేను చెప్పింది చేస్తావా?' అంటారు బాబుగారు. "దక్షిణా,కుక్షిణా ఏమైనా యిస్తావా?" అనిచేయిచాపుతారు బాబా. ఇట్టి ఆచరణే, సాధనే(అత్మవిమర్శ-పశ్చాత్తాపము-ప్రార్ధనలతో) గూడిన జీవితమే మన నుండి వారు కోరే దక్షిణ


source............ ఆచార్య శ్రీ ఎక్కిరాలభరద్వాజ గారి నేనుదర్శించినమహాత్ములు శ్రీపాకలపాటి గురువుగారు (pg 102,103,104)


జై సాయిమాష్టర్!
« Last Edit: May 02, 2011, 06:31:50 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #20 on: May 02, 2011, 02:26:05 AM »
Jai Sai Master!

..........in the story of the 'Ten wise men'...Ten fools were travelling together and they had to swim across a deep and swelling river. Everyone of them was concerned about the safety of everyone else in the whole group. So after crossing the river, the first one counted the group and found it consisting of only nine. One was missing! Everyone took a turn and arrived at the same conclusion. A shepherd enquired from them why they were so perturbed. When told about the missing man, he had a hearty laugh; for every fool in the group counted only the rest, and forgot to count himself! As long as we are Ignorant, we 'count for nothing' and that is the bitter tragedy of life. In the loving regard which we hope to gain from everyone around us, we find an attempt to drown this bitter awareness.

source.....From Acharya Ekkirala Bharadwaja gari "Sai Baba of Shiridi and His Teachings" pg 4.


Jai Sai Master!
« Last Edit: May 15, 2011, 03:13:26 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #21 on: May 02, 2011, 08:02:36 PM »
Jai Sai Master!

When Jesus Christ appeared to save mankind from sin and its wages of death, when the Buddha vowed to find a way out of death, disease and oldage, the common man might ask how is it that they too died like common folk, and wherein lies their success. And when the latter are answered that prophets and saints had been quite different in their life from the common people, and that they do not 'die' away but remain immortal spiritually, the commoners do not find it easy to believe. At least, the modernists often laugh away such a faith. Fortunately no amount of laughter can annual a truth. It betrays their ignorance.

The Prophets and Godmen have, however, prescribed for their followers a code of 'spiritual discipline' which, if practiced under the eternal 'Divine law', shall raise them also to the same heights and perfection, which they embodied in themselves. The various 'forms' of Yoga of the Hindus(enumerated elaborately by the Rishis in the Holy Scriptures); the noble eight-fold path of the Buddha; the "Sermon on the Mount" of Jesus Christ and the illuminating tenets of Islam are such forms. These Prophets and Saints were born among the common mortals but had, through the grace of God and their own vigorous self-discipline and unbounded peity, raised themselves to their supreme statures. They are the witnesses of the veracity of their teachings and evidence of the infinite potencialities of man.When Jesus said: "The Kingdom of Heaven is within"- " Seek ye the Kingdom of Heaven" - "Be ye perfect even as the Father in Heaven is perfect", he did indeed imply that even common mortals like us, through perseverance and staunch and faithful devotion, can become like Him and hence his teaching. The common man finds convenient excuse to evade his duty by brushing aside the whole thing with the notion that none can become like Christ or the Buddha. Lest mankind should thus lose a most precious gift of the 'spirit' through ignorance and blindness, saints appear from time to time to guide them. They successfully accomplish discipline and become truly like the great prophets in all respect and thus inspire humanity to do likewise by following their example.


source.....From Acharya Ekkirala Bharadwaja gari  " The Life and Teachings of Tajuddhin Baba of Nagpur " pg# 87,88.

Jai Sai Master!

« Last Edit: May 14, 2011, 10:10:36 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #22 on: May 03, 2011, 11:28:24 PM »
Jai Sai Master!

hearty offerings and worship rendered even to an 'inanimate idol' in a true spirit of devotion and faith are sure to rearch the Spirit which prevades all - Saints, animals, and even idols. It is the spirit behind the worship that is of prime importance. Hence Baba did not condemn idol worship. It is a valid form of spiritual practice for those who are by nature made for it.

From Acharya Ekkirala Bharadwaja gari "SAI BABA THE MASTER", pg 103.


Jai Sai Master!
« Last Edit: May 15, 2011, 03:14:11 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

mannava satyam

 • Sr. Member
 • ****
 • Posts: 353
  • View Profile
  • MANNAVA SATYAM AND SM
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #23 on: May 04, 2011, 12:35:30 AM »
Quote
Lest mankind should thus lose a most precious gift of the 'spirit' through ignorance and blindness, saints appear from time to time to guide them.


ఓం సాయి మాస్టర్ !అందరికి ప్రేమ పూర్వక నమస్కారములు !


నిజంగా మహాత్ములు ఎంత దయగల వారండి.
బాబా కు సమ కాలికులైన  గొప్ప సూఫీ మహాత్ములు హజ్రత్ తాజుద్దీన్ బాబా గారికి
మానవాళి పైన ఉన్న ప్రేమ నిజంగా పరిపూర్ణ మైన ప్రేమ అండి

ఆయన ఒకసారి ఒక తివాచి నెల మీద పరుస్తూ ఇలా ఒక కవిత చెప్పారు :

" ఈ దివ్య జ్ఞానపు అంగడి
   నా చేతే తెరువ బడింది
   తీసు కెళితే  ఏంటో కొంత
   చేర గలరు దైవం చెంత "

అంటారు.

సాయి మాస్టర్ సంప్రదాయములో గల మనము తప్పక దైవాన్ని చేరగలము .
ఎందు కంటే  మనము ఈ సద్గురు మూర్తుల
దివ్య జ్ఞానపు అంగడి నుండి
ఏంటో కొంత తీసు కేలుతూనే ఉన్నాము కదండీ!

సాయి మాస్టర్ స్మరణ లో

Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #24 on: May 05, 2011, 03:35:54 AM »
Jai Sai Master!

" తనలోని తప్పులెన్నడం ప్రారంభించగానే యితరులలోని తప్పులెన్నడం అనే గుణం తనలోని మొదటి తప్పుగా అర్ధమవుతుంది. అందుకని మొదటగా దానిని తనలోనుండి తీసివేయాలి. "


Source.........Acharya Sree Ekkirala Bharadwaja gari Sai Master Pravachanamulu, pg 77.


Jai Sai Master!

« Last Edit: May 15, 2011, 03:24:02 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #25 on: May 05, 2011, 11:40:58 PM »
జై సాయి మాష్టర్!!!

మన నుండి ఆత్మశక్తిని మరుగుపరచే దోషాలలో మొదటిది మలదోషమనీ అంటే రాగ, ద్వేష, స్వార్ధాది మలాలేననీ అవి నిష్కామకర్మ ద్వారా తప్ప తొలగవని, అటితర్వాతగాని సాధకుడు మనోచాంచల్యరూపమైన విక్షేప దోష నివారకమైన ఉపాసన (నిశ్చలదేవతా ధ్యానము)చేయజాలరనీ మన ఋషులు చెప్పారు. పై మహనీయులందరూ గత జన్మలలో అలా చేసి అట్టి మలవిక్షేప దోషాలను అంతమొందించిన వారే గనుక యీ జన్మలో అంతటి ధ్యానాదుల నభ్యసించి కృతకృత్యులయ్యారని అర్ధం చేసుకోవాలి. అలా చేయనందువల్లనే ఎన్ని లక్షలమంది వారిని దర్శించి వారి బోధలు విన్నా ఏ కొద్దిమందో తప్ప ఎట్టి ఉత్తమ స్థితులనూ సాధించలేకున్నారు. అందుకే సాయి తాము ఒక జన్మలో రగ్గులు నేసాననీ, మరొక జన్మలో సిపాయిననీ చెప్పారు.

source......ఆచార్య శ్రీ ఎక్కిరాలభరద్వాజ గారి సాయినాధ ప్రబోధామృతము, pg 39.


జై సాయి మాష్టర్!!!
« Last Edit: May 15, 2011, 03:15:12 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #26 on: May 07, 2011, 01:08:31 AM »
జై సాయి మాష్టర్!

" ఈ పాంచభౌతికమైన ఈ శరీరం మహా దొంగ.దీనిని నమ్మవద్దు.జాగ్రత్తగా వుండు, నిరంతరం ఆహారం కోసం, గుడ్డలకోసం అది తపించడంతో ప్రాపంచికమైన వాటిని చింతిస్తూ కాసేపుకూడా విరామం దొరకనీయదు. అలాగే మానసిక స్థాయిలో కూడా ఈ నామరూపాత్మకమైన వస్తువులను గుర్తిస్తుండే మనస్సు మహా దొంగ.ఇది శరీరానికి మాత్రమే ఎప్పుడూ బానిసయై వుండడం చేత, ఎప్పుడూ దీని అవసరాలను గూర్చి ఆలోచిస్తూ వుండడం చేత, చైతన్య తత్త్వంలోని సత్యాన్ని గురించి చింతించడానికి దానికి విరామమెన్నడూ దొరకదు. అలాగే గుర్తించే స్థాయిలోగాని, భౌతికస్థాయిలోగాని చూచినట్లయితే ఇంద్రియ జన్యు అనుభూతికి చెందిన అన్యత్వం గురించిన అజ్ఞానమనే దొంగ, వీడికి వివేకం కలిగితే తననెక్కడ నాశనం చేస్తాడోనని వీడికెప్పుడూ  తాను లొంగకుండా చూచుకుంటూ వుంటుంది. అది కుడా సత్యమైన జ్ఞానాన్ని పొందడానికి తీరిక లేకుండా ఏవో పనులు కల్పించుకుంటుంది, కాబట్టి ఓ రేచుంగ్, అద్యంతాలు లేని నిజమైన జ్ఞానాన్ని అంటిపెట్టుకుని వుండు. ఈ నిజమైన జ్ఞానానికి, రాబోవు జన్మకూ మధ్య స్థాయిలో మనలను మోసం చేసే దొంగ, చైతన్యము. ఆ చైతన్యము ఎలా దొంగంటే తన నిజతత్త్వమును వునదున్నట్లు కాకుండా మరొకరకంగా వున్నట్లు భ్రమ కలిగిస్తుంది. అనంతమైన ఆత్మతత్త్వమును పరిమితుడైన మానవునిగా భ్రమింపచేస్తూ వుంటుంది. అనాత్మను ఆత్మగా తలచడమంటే అదే. అది తానున్న స్థితికంటే గొప్ప స్థితిలో వున్నట్లు అనుకుంటూ వుంటుంది. అట్లా అనుకోవడంలో నిజాన్ని గ్రహించడానికి తీరిక లేకుండా వుంది. వీటికి వేటికీ లొంగక శాశ్వతమైన సత్యాన్ని నువ్వు తెలుసుకో కర్మకు కారణమైన పాపకృత్యాచరణ, మాయామయమైన జగత్తులో వుండే దొంగ. ఆ పాపకార్యమూలమే కోరిక, మమకారాలనేవి కనుక ఓ రేచుంగ్! ఇష్టాఇష్టాలను పరిత్యజించు.  ఆధ్యాత్మికతలో సూక్ష్మంగా కనిపించేవి, సత్యాల్లాగా కనిపించేవీ  ఎన్నో వున్నాయి. వాటిని గురించి తెలిసికోవడంలో నిజమైన జ్ఞానాన్ని పొందకుండానే వుండిపొయేలా చేస్తాయి, అలాంటి(సిద్ధులు)వారి బారిలో చిక్కుకోకు, అవతలవారిని గెలవాలని సూక్ష్మమైన యుక్తితో వాదించవద్దు. ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ కూడా పరమగురువులూ, అతీతులైన దేవతలూ ఒకటిగా చేసి ఆత్మతత్త్వంగా దానిని ధ్యానించి పూజిస్తారు. నీ ఆశయాన్ని, ధ్యానాన్ని, నీ సాధననూ - ఈ మూడింటినీ ఒక నిజమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే కలిపి వాడుకో.

భూత భవిష్యత్ వర్తమానం అంతా ఒకటని గుర్తించి ఆ భావాన్ని నీకు సహజంగా అలవాటయ్యేటట్లు చూసుకో ఇదే మీకు చివరిసారిగా ఇచ్చిన ఉపదేశం, నీకునేనిచ్చేది ఇదే నాయినా! ఇంతకంటే అతీతసత్యం మరొకటి లేదు. కాబట్టి దీనినే నీవు తెలిసికో!"source............ఆచార్య శ్రీ ఎక్కిరాలభరద్వాజ గారి టిబెట్ యోగి మిలారేపా చరిత్ర, pg 173,174.

జై సాయి మాష్టర్!!!
« Last Edit: May 15, 2011, 03:15:53 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #27 on: May 07, 2011, 11:41:29 PM »
Jai Sai Master!

సాయి పూజావిధానం శ్రీ సాయిపట్ల మనకు గల ప్రేమ, గౌరవాలను వ్యక్తం చేయడమే. అంటే మనలో నిజమైన ప్రేమ,గౌరవమ, శ్రద్ధ ఆయనపై ఎంతగా వుంటాయో అంతగా మన పూజ సార్ధకం అవుతుంది. కనుక సాయిలీలలను పారాయణ చేసి మన హృదయంలో సాయియొక్క అధ్బుత శక్తిపట్ల భక్తి శ్రద్ధలను పొందితే మనం సరిగా ఆయనను పూజించగలుగుతాము. అలా చేసే వారికి ధ్యానశ్లోకాలలో గాని, నామాలలోగాని బాబాలీలలు స్పురించి నిరంతరం వాటి స్మరణే జరుగుతుంది. 

ఇక సంకల్పంతో ఆరంభించి వివిధ ఉపచారాలలో వ్యక్తం కావలసిన భావాన్ని, అన్ని ఉపచారాలతో కూడిన పూజ చేస్తున్నంత సేపూ నేపధ్య సంగీతంలాగ హృదయంలో వుండవలసిన భావాన్ని వివరిస్తాను.

సాధనలోని రహస్యము సర్వకాల సర్వావస్థల యందు మనస్సు ధ్యేయరూపమై వుండడమే. అదే మొదట సగుణ సాక్షాత్కారానికి తర్వాత నిర్గుణ నిరాకార అత్మానుభూతికి దారితీయగలవని శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర ఋజువు చేస్తుంది. సాయికూడా తమ సాధన గురించి అదే చెప్పారు. మొదటనే నిర్గుణసాధన చాలా కష్టతరమనీ, భక్తి చాలా సులభమనీ గీత కూడా చెబుతుంది.

సాయిబాబాను సాదా మనస్సునందుంచుకొని, ఆయన సాన్నిధ్యాన్ని భావన చేయడమే సాధన. ఇది సర్వకాల సర్వావస్థలయందు జరిగేలా ముముషువులు చూచుకోవాలి.ముముక్షువంటే మోక్షం కోరేవాడు. మోక్షమంటే అజానజన్యమైన, దుఃఖదాయకములైన బంధాలనుండి ముకి. "నేను దేహపరిమితుడైన మానవుణ్ణి" అన్న భావననుండి ముక్తి; "నేను ఆ పరమాత్మ ఒక్కటే" అనే జ్ఞానాన్ని పొందడమే)

శ్రీ సాయి తన భక్తులు తనను భక్తిశ్రద్ధలతో స్మరించిన క్షణంలో వారి చేనతనే వుంటానని వాగ్ధానం చేసారు. అది నిజం. కారణం వారు సర్వవ్యాపియై, సర్వరూపాలలోనూ సర్వదా వున్నారని వారి లీలలు నిరూపిస్తున్నాయి. ఈ విషయం వారి సమాధి అనంతరముగూడా యధార్ధమని నిరూపించే లీలలు అసంఖ్యాకం గా  వున్నాయి. అయితే తన భక్తుల సాధన  సౌలభ్యము కోసం తనకూ తన చిత్రానికీ భేధం లేదని  బాబా నిరూపించారు.కనుక  ఆయన చిత్రపటాన్ని ఇంట్లో వుంచడం ,ఈ సత్యాలు అవగతం కావడం కోసం  " శ్రీ సాయిలీలమృతము " పారాయణ చేయడమూ మొదటి మెట్టు. తర్వాత ఆ రూపంలో ఆయనే వున్నారన్న గుర్తింపుతో సదా వర్తించుకోడం ముఖ్యం. మన జీవితంలో దేనిని పొంద నిశ్చయించుకున్నామో ఆ లక్ష్యం ఆయనేనని హృదయానికి అనుక్షణం గుర్తుచేసేందుకది ఉపకరిస్తుంది. ఆయన ఉనికిని మనమిలా గుర్తిస్తుంటే ఆ యిల్లు ఆయన సాన్నిధ్యంవల్ల ఆధ్యాత్మిక శక్తిని పుంజుకుంటుంది.

ఇక ఈ భావన సదా మనస్సులో నిలవడానికి, లౌకిక క్రియాకలాపాలలో, భావనలో యిది మరుగూడకుండా వుండడానికి నిత్యం నిద్రలేవగానే ప్రాతఃస్మరణ చేయడం ఆవశ్యకం. అది ఆనాడు మన మనస్సునెలా వుంచుకోవాలోనన్న విషయాన్ని గుర్తు చేసి మన పట్టూదలను పెంచుతుంది. అందుకే ముందర 'ప్రాతఃస్మరణ లేక ఉదయ ప్రార్ధన పొందుపరచడం జరిగినది.


source......Acharya Sree Ekkirala Bharadwaja gari "Sainadha pooja", pg i  ii.

Jai Sai Master!!
« Last Edit: May 15, 2011, 03:17:18 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #28 on: May 09, 2011, 09:02:58 AM »
Jai Sai Master!

" మనస్సుకొక లక్షణమున్నది. అది దేనిని భావిస్తే ఆ రూపాన్ని అల్పంగానో, అధికంగానో అభ్యాసాన్ని బట్టి పొందుతుంది. సద్గురుగుణ చింతనాత్మకమైన నామ పఠన సద్గురుని తత్త్వంతో మన మనస్సును తాదాత్మ్యాన్ని చెందేలా చేస్తుంది."

source......Acharya Sree Ekkirala Bharadwaja gari "Sainadha pooja", pg v.

Jai Sai Master!

« Last Edit: May 15, 2011, 03:18:03 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Inspirational quotes of Master Garu!!!
« Reply #29 on: May 10, 2011, 09:51:44 AM »
Jai Sai Master!

శ్రీరామచంద్రునిలా, సత్యహరిచ్చంద్రునిలా వుండాలని అందరమూ అనుకుంటాము. కాని వుండగలుగుతున్నామా? అలాగే సత్వగుణం కలిగి వుండాలి అనుకున్నంతమాత్రాన వుండలేము. దైవీసంపద రమ్మన్నంతమాత్రాన రాదు. దైవీసంపద అంటే ఏమిటో, సత్వగుణమంటే ఏమిటో తెలిసినంతమాత్రాన ఏమీకాదు. ఒకసారి రమణమహర్షి వద్దకు 'అహంబ్రహ్మస్మి 'అని జపం చేసేవాడు ఒకడు వస్తే అలా ఎప్పుడూ చేయవద్దు అని ఆయన చెప్పారు. మనం నిజంగా ఏది అయివున్నామో అది నేను, నేను అని అప్పుడు అనుకోముగదా! అనుకొవడానికి ప్రయత్నం చేసామంటే అది కాము అని మన అభిప్రాయమన్నమాట. నేను భరద్వాజ అని తెలిసినప్పుడు నాపేరు జపం చేయవలసిన అవసరం లేదుకదా! నేను ఏ అక్కినేని నాగేశ్వరరావులాగానో వుండాలని ప్రయత్నం చేస్తున్నాంటే నేనలా లేనుగనుక. అలాగే 'నేనుబ్రహ్మాన్ని, నేనుబ్రహ్మాన్ని ' అని ఎందుకనుకోడానికి ప్రయత్నం చేస్తున్నామంటే  మనం నేను బ్రహ్మం కాదని తెలుసు కనుక. కాని నోటితో నేను బ్రహ్మాన్ని అంటుంటే చాలదు. ముందు మనమేమిటో తెలిస్తే బ్రహ్మమేమిటో తెలుస్తుంది. అందుకని అటువంటి సూక్ష్మాలు మహనీయులు చెప్పాలి. ఆ సూక్ష్మాలు వాళ్ళు చెప్పక ముందు ఆ గ్రంధాలు చదివినా ఏమీ అర్ధం కాదు.

source.....Acharya Sree Ekkirala Bharadwaja gari  'Saimaster Pravachanamulu' pg# 301.

Jai Sai Master!
« Last Edit: May 14, 2011, 10:06:36 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra