Author Topic: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru  (Read 3802 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #30 on: March 18, 2013, 01:22:21 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో 15 . సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా |
           సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ||

                                       "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు

 " ఆయన గురించి నీ అభిప్రాయం మేమిటి ? ఆయన అన్నీ తెలిసిన వాడనే గదా !"
  "అవును "
 "నువ్వెందుకు ఆయనను పూజిస్తున్నావు ?నీకేమి తెలియదనే గదా !"
   "అవును "
 " అంటే  ఆయనకన్నీ తెలుసని నీకు తెలుసు ,నీకేమీ తెలియదని గూడా నీకు తెలుసు ,అవునా ?"
 "అవును "
"మరి మన సంగతి అన్నీ తెలిసినాయన చేసినది సరియైనదా ?లేక మనమనుకున్నదా ?"
   "ఆయన చేసినదే !"
"ఒక డాక్టరు ఉన్నాడనుకో ,ఆయనకు మన వ్యాధి ఏమిటో ,దాని నివారణకు ఏమి ముందు ఇవ్వాలో తెలుసు ,అందుకని డాక్టరు ఏమి చేసినా ,అంటే ఆపరేషను  చేసినా మనమేమీ మాట్లాడము ,ఆయన మన మంచికే చేస్తున్నాడని  అనుకుంటాము ,అలాగే బాబాకు మన జన్మలు ,కర్మలు తెలుసు ,మన కోరికలు ఎప్పుడు ఎలా తీర్చాలో తెలుసు ,అందుకని  ఆయన మనకు శ్రేయస్కర మైనదే  చేస్తాడని ఓర్పు వహించాలి ,అంతే గాదు ,ఆయన సర్వ సమర్ధుడు ,అవసరమైన  రీతిన మన కర్మలను మార్చగలడు ,తీసివేయగలడు ,నువ్వు ఆయనను  సేవించలేదనుకో ,నీ పూర్వ కర్మ ప్రకారమే నీకు జరుగుతుంది ,సేవించావనుకో  ,ఆయనకు నీ సమస్య తీర్చడానికి  అవకాశముంటుంది ,నువ్వు పారాయణ చేయకపోతే  ఆయనకు  పోయేదేమిలేదు ,చేసినందువలన  ఆయనకు ఒరిగేదేమీ లేదు ,కానీ చేస్తే నీకే మంచిది ,ఆలోచించు !"

అలివేలు మంగ పతి  నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

« Last Edit: March 21, 2013, 10:02:40 AM by Admin_smf »

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #31 on: March 19, 2013, 10:14:56 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ||16 . యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ |
             యదానందేన నందంతి  తస్మైశ్రీ గురవేనమః ||

                                   "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "


"పారాయణ చేస్తాను మాస్టారూ !"
"ఆయన తల్లి వంటి వారు ,మనం ఆయన బిడ్డలం ,ఆయన ఎప్పుడూ మనకు శ్రేయస్కరమైనదే  చేస్తారు ,పారాయణ తప్పక చేస్తూండు ,ఆయన లీల చూద్దువుగాని "
పూజ్యశ్రీ  మాస్టర్ గారి మాట పొల్లుపోలేదు ,ఆ అమ్మాయి పారాయణ చేసింది ,మంచి సంబంధం కుదిరి పెళ్లి జరిగింది ,అంతే  గాక అంతకు ముందు ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలన్నీ ఏదో  ఒక రకంగా  మంచివి కాదని తెలిసింది ,వాటిలో ఎవరితో వివాహం జరిగినా కష్టమయ్యేదే !బాబా చేసిన మేలుకు కుటుంబమంతా కృతజ్ఞతతో ,భక్తితో ఆయనను సేవించారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చి చెప్పి ఎంతో ఆనందించారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల  వారికి భక్తి  భావం దృఢతరమైంది .
పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా ఎందరికో బాబా పట్ల సరియైన అవగాహనను కలిగించారు ,ఆయన చేసిన ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయి .

                                                    జై సాయి మాస్టర్ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]
« Last Edit: March 21, 2013, 10:01:23 AM by Admin_smf »

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #32 on: March 20, 2013, 09:32:30 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||17 . యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః |
             యత్ప్రీత్యాప్రియం  పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

                                     "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

                                                        శ్రిత జన వత్సలుడు
పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రితజన వత్సలుడు ,ఆయన తమను ఆశ్రయించిన వారికి ఎన్నో విధాలుగా శ్రేయస్సు చేకూర్చారు ,కొందరికి ఆయన అభయమిచ్చి రక్షించారు ,కనుక ఆయన అభయ ప్రదాత, కొందరి వ్యాధులను ఆయన నివారించారు గనుక ఆయన భిషగ్వరేణ్యులు ,మరికొందరికి ఆయన ప్రాణ దానమే చేశారు గనుక  ఆయన ప్రాణ ప్రదాత ,ఇంకా ఎన్నో విధాలుగా  ఎందరి సమస్యలనో పరిష్కరించారాయన ,వాటిలో మచ్చుకు కొన్నింటిని చెప్పుకుందాము ,
      హిందీ పండితుడైన అర్ . రామ చంద్రా రెడ్డి ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించి తన నిరుద్యోగ సమస్య గురించి చెప్పుకున్నాడు ,అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనితో ,"మీకు తప్పక ఉద్యోగం వస్తుంది ,వచ్చాక నాకు తెలియ పరచండి "అన్నారు , అంతకు ముందే  అతని మిత్రులొకరు  పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గర కెళ్ళి  ఒక బాబా ఫోటోను ఆయన ఆశీస్సులతో తీసుకుంటే మీకు బాగుంటుంది  అని ఆయనకు సలహా ఇచ్చారు ,కానీ అతడు తనకు ఆయన తాను  అడగకుండానే  బాబా ఫోటోను ఇవ్వాలని తలచాడు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనికి ఉద్యోగం వస్తుందని  చెప్పి ,"మీ దగ్గర బాబా ఫోటో ఉన్నదా ?"అని అడిగారు ,,అతడు లేదని చెప్పగానే ఆయన ఒక ఫోటో ఇచ్చి పూజలో పెట్టుకోమన్నారు  ,ఆయన తన మనస్సులోని కోరిక తీర్చినందుకు అతడు ఎంతో సంతోషించాడు ,ఆ తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే  ఉద్యోగం వచ్చింది !
  ఒక సాయి భక్తునికి ఒక క్లిష్ట సమస్య వచ్చింది ,ఆతడు  పరిష్కారం  కోసం పై అధికార్లను ఆశ్రయించాడు ,వారు సహాయం చేయకపోగా దుర్భాషలాడి పంపారు, అతడా విషయం  పూజ్యశ్రీ మాస్టర్ గారితో  విన్నవించుకొని బాధ పడ్డాడు , అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు "ఏమీ భయంలేదు ,రేపు అధికారుల వద్దకు వెళ్ళు "అని ఆశీర్వదించారు .అతడు  అలాగే వెళ్ళాడు ,ముందు రోజే  అతనిని తిరస్కరించిన  అధికారులు ఆ రోజు ఎంతో ప్రేమగా  అతనితో మాట్లాడడమే గాక  అతని పని వెంటనే చేసి పెట్టారు గూడ, పూజ్యశ్రీ మాస్టర్ గారి వాక్కు ఎంత అమోఘంగా ఈ సంఘటనల వల్ల తెలుస్తుంది ,ఆయన ఇచ్చిన అభయం ఎంతటి ప్రభావం కలదో అర్ధమౌతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!  
[/13size]
« Last Edit: March 21, 2013, 12:19:23 AM by Admin_smf »

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #33 on: March 21, 2013, 09:24:59 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో||18 . ఏ నేదం దర్శితం మిదం విశ్వం సదృశ్యంభిన్నభేదతః |
            సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ||

                                         "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

అలాగే యస్ . పర్వతరావుకు మొదటి సంతానం ఆడపిల్ల తర్వాత అతని భార్య గర్భం ధరించింది ,కానీ జ్యోతిష్కుడు  అతనికి మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని చెప్పారు ,అప్పటికి అతని భార్య ఐదవ మాసం గర్భవతి ,అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారిని  దర్శించి , విషయం వివరించి ,తనకు మగ సంతానం కావాలని ప్రార్ధించాడు ,అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ,"ఏమీ కంగారు పడవద్దు ,శ్రీ సాయి బాబా జాతకాలను మార్చగల సమర్ధుడు !" అని వారికి అభయమిచ్చి  వారిని  కొన్ని పారాయణ చేసుకోమని చెప్పారు ,వారలాగే చేసారు ,వారికి మగబిడ్డ జన్మించాడు ?
  పూజ్యశ్రీ మాస్టర్ గారు బిషగ్వరుడు ,ఆయన చేసిన  కొన్ని లీలలను ఇక్కడ చెప్పుకుందాము .
     చోడయ్య  అనునతడు చాలా కాలంగా రక్త విరోచనాలతో బాధ పడుతున్నాడు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకసారి  అతనున్న ఊరికి సత్సంగానికి వెళ్ళారు ,అతడాయనను  దర్శించి తన బాధ చెప్పుకున్నాడు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనికొక  పదార్ధం చెప్పి దానిని తినమన్నారు ,అలా చేయగానే అతని విరోచనాలు తగ్గిపోయాయి .
    పూజ్యశ్రీ మాస్టర్ గారు విద్యానగర్ లో ఉండగా తేలుకుట్టిన వాళ్ళు ఎందఱో వస్తుండేవాళ్ళు ,ఆయన ఊదీ తీసుకుని తెలు కుట్టిన  చోట స్వహస్తాలతో  రాసి ,చేతితో  నిమిరేవారు ,5 ని ||ల లోపలే నొప్పి  తగ్గి సంతోషంగా తిరిగి  వెళ్ళేవారు .
  రామిరెడ్డి గోపాలరెడ్డి  గారి పాప చిన్నప్పుడు చేతి నుండి జారి పడిపోవడం వల్ల  తలకు దెబ్బ తగిలింది ,5 సం ||వచ్చినా నడక  రాలేదు ,ఒకరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు వారింటికి  సత్సంగానికి  వచ్చారు ,అప్పుడా పాప పారాడుతూ పూజ్యశ్రీ మాస్టర్ గారి  దగ్గరకు వచ్చింది ,వాళ్ళు  ఆ పాప విషయం  ఆయనకు వివరించారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు తాను  తీసుకుంటున్న పాయసం లోంచి  కొద్దిగా ఆ పాప చేత త్రాగించారు ,ఆ ప్రసాదం  తీసుకున్న ఆ పాప మరునాటి నుంచే నడవసాగింది ,పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన అద్భుత లీలకు  అందరూ ఆశర్యపోయారు .
అంతేగాదు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు  మరణించిన ఒక కుక్క పిల్లను బ్రతికించారు ,ఆయన ప్రాణ ప్రదాత గూడ .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/13size]
« Last Edit: March 21, 2013, 10:00:37 AM by Admin_smf »

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #34 on: March 22, 2013, 09:28:53 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||19 . యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః |
            సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ||

                                         "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

ఒకసారి నెల్లూరు నుండి కొందరు సాయి భక్తులు యాత్రకు  బయలుదేరి పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రధమంగా దర్శించుకుని ,వారి ఆశీస్సులు తీసుకుని వెళ్దామని విద్యానగర్ వచ్చారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు సమయానికి సత్సంగ హాలులో కూర్చుని ఉన్నారు ,ఆ సంగతి  తెలిసి పూజ్యశ్రీ మాస్టర్ గారి  దర్శనం చేసుకోవాలనే ఆతురతతో  ఒకరినొకరు  తోసుకుంటూ పరుగు పరుగున  మాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నారు ,ఆ హడావుడిలో ఒక భక్తుని కాలు  ఆ ఇంటి ముంగిట పడుకుని ఉన్న చిన్న కుక్క పిల్ల మీద పడింది ,వెంటనే అది గిలగిలా తన్నుకుని చనిపోయింది ,ఆ హటాత్సంఘటనకు  ఆ భక్తుడు ,మిగతా వాళ్ళు  చాలా బాధ పడిపోయారు , పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఆ సంగతి విన్నవించుకున్నారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు వెంటనే ఆ చనిపోయిన  కుక్క పిల్లను తమ దగ్గరకు తెమ్మన్నారు ,దానిని తీసుకుని తమ ఒడిలో ఉంచుకుని  దానిమీద కొంచెం ఊదీ చల్లారు ,వచ్చిన వాళ్లకు ఊదీ ఇస్తూ ,వాళ్ళతో  మాట్లాడుతూనే దాని శరీరం తమ చేతితో  నిమురుతున్నారు ,కొద్ది నిమిషాలలోనే  ఆ కుక్క పిల్ల మెల్లగా కళ్ళు తెరిచింది ,తర్వాత లేచి నుంచుని బయటకు మామూలుగా నడుస్తూ వెళ్లి పోయింది ,,ఈ అద్భుత సంఘటన చూసిన సభ్యులందరూ ఆశ్చర్యానందాలతో  మునిగిపోయారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి మహాత్ములో మరొక్కసారి ఋజువైంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #35 on: March 23, 2013, 09:28:16 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు!
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||20 . అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే |
             జ్ఞాననల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ||

                                         "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

ఇలా ఆయన వద్ద జరిగిన లీలలు ఎన్నో !ఎందరెందరో కేవలం లౌకికమైన రక్షణను ప్రసాదించడమే కాక అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతులను  ప్రసాదించారు కూడా ! ఆయన వద్ద ఇన్ని లీలలు జరుగుతున్నా ఆయన మాత్రం ఎంతో వినమ్రంగా ఉండేవారు ,సర్వం తన గురువైన శ్రీ సాయి నాధుని లీల అనేవారు ,అలానే మెలిగేవారు ,శ్రీ సాయి తమ వద్ద జరిగే లీలలన్నీ తమ గురు కృపేననేవారు కదా !
      ఉత్తమ శిష్యునికి గురువు యందు ద్వైత భావమే ఉండాలని పెద్దలు చెప్పారు ,శ్రీ సాయి తామే పరమాత్మ అయినప్పటికీ తాము ,"భగవంతుని బానిసను మాత్రమే  "అనేవారు ,"అల్లా మాలిక్ !"అనేవారు ,అలానే పూజ్య మాస్టర్ గారు సమర్ధ సద్గురువైనప్పటికీ  తాము కేవలం సాయి భక్తునిగానే మెలిగేవారు ,సర్వం శ్రీ సాయి దయ వలననే జరుగుతున్నాయి అనేవారు ,ఆయన వినమ్రత  మాయ చేసేది ,ఆయన సామాన్యుడనే భావము కలిగేది ,పూజ్య శ్రీ మాస్టర్ గారి  గురించి  ఎందఱో మహనీయులు చెప్పిన విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే కాని వారెంతటి వారో బోధ పడదు .

                                         జై సాయి మాస్టర్ !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


 
[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #36 on: March 24, 2013, 11:00:10 AM »
శ్రీ గురు గీత
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
 
శ్లో ||21 .    శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం !
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ||

                                           "మహాపురుషుడు --పూజ్య గురుపత్నిశ్రీమతి అలివేలు మంగతాయారు "                                                                                                                                                                                        అమరబోధ
                                                              జై సాయి మాస్టర్ !
విశాల విశ్వం !అందులో కోటానుకోట్ల  నక్షత్ర గ్రహ గోళాలు !ఎంత పరిశోధించినా ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉన్న చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు !!ఈ విశ్వం ఒక అక్షయ ,అనంత ,అద్భత ,విజ్ఞాన భాండాగారం !ఎవరు ఏ కోణంలో  పరిశోధిస్తే ఆ  కోణంలో కనిపించే గారడీ ప్రదర్శన (మ్యాజిక్ షో )!!
     అందులో అనంత కోటి జీవ రాశి !అనుక్షణం గణాంకాలకు అలవిగానన్ని జీవుల జనన మరణాలు !!ప్రతి జీవికి 'నేను ' అనే స్పురణ ఉన్న భావన !ఆ భావనల వలన సృష్టిలో నిరంతరమూ జరిపే స్పందనలు -ప్రతి స్పందనలు!!
    రోజులు ,మాసాలు ,సంవత్సరాలు ,శతాబ్దాలు ,యుగాలు ,కల్పాలు --ఇలాగే కొనసాగుతున్న  సృష్టి క్రమం !
   అలాగే కొనసాగుతున్నా నిన్నటి రోజు ఈ రోజు  ఎప్పటికీ కాదు ,ఈ రోజు రేపెన్నటికీ  కాలేదు ,ఇలా గతాన్ని తిరిగి ఇవ్వలేని కాలగతి !
 ఇంతటి విశ్వంలోనూ అతి చిన్నది అయిన భూమి మీద ఎన్నో కోట్ల కోట్ల ,కోట్ల కోట్ల -ఇలా అంతులేని కోటానుకోట్ల భాగమైన  అతి చిన్న చలన జీవి మానవుడు !
  కానీ ఈ సృష్టిలోని ఏ జీవికి లేని -మానవునికి మాత్రమే  ఉన్న విశిష్టత -మనస్సు !
  ఈ మనసున్న మనిషికి ఎన్నో ఆలోచనలు !ఎన్నో బంధాలు !ఎన్నెన్నో సంబంధాలు !!వాటి వల్ల కలిగే రాగ ద్వేష కామ క్రోధ  ద్వేష అసూయాది భావాలు !వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు !   వాటితో అతలాకుతలమయ్యే మానవ జీవితాలు !!
ప్రతి మానవునికీ ఏదో పొందాలన్న తపన !పొందలేక పోతున్నామన్న ఆవేదన !అందువలన కలిగే అశాంతి !ఏమిటి ఈ మానవ జీవితం ?ఈ జీవితాలు ఇలా గడపవలసినదేనా ?దీనికి అంతమెక్కడ ?
  ఈ రహస్యాన్ని ఛేదించాలనుకునేవారు  కొందరు  సాధించి మహాత్ములుగా రూపొందినవారు ఏ కొద్దిమందో !అట్టివారే  పూజ్యశ్రీ మాస్టర్ గారు .
 అంతా నశించి పోయేదే అయినప్పుడు  ఈ తాపత్రయమేమిటి ?మరణించిన తర్వాతది తెలియనప్పుడు మమకారాలేందుకు ?అసలీ సృష్టి రహస్యమేమిటి ? దీనికొక అర్ధము ,లక్ష్యము ఉన్నాయా ?

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #37 on: March 25, 2013, 09:43:43 AM »
జై సాయి మాస్టర్!
 గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ||22 . మన్నాధః శ్రీ జగన్నాధో  మద్గురు: శ్రీ జగద్గురు:
             మమాత్మా సర్వ భూతాత్మా  తస్మైశ్రీ గురవేనమః ||

                                           "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "ఇలాంటి ప్రశ్నలతో  పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాధానాల కోసం అన్వేషించారు ,సాధించారు ,పరిష్కార మార్గాలు గూడ తెలుసుకున్నారు ,పరమశాంతిని పొందారు .
 అంతటితో ఆగక తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడ్డారు ,వారు ఆ మార్గాల గురించి ,కర్తవ్యాల గురించి అనేక విధాలుగా బోధిస్తూ ఉండేవారు .
   అలా పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించిన ప్రవచనాలతో కొన్నింటిని గూర్చి క్లుప్తంగా స్మరించుకుందాము .
"పరిశోధించు ;సాధించు "
"విశ్లేషించు  ;వివేచించు "
"పరిశీలించు ;విశ్వసించు "
"శరణ పొందు ;సేవించు "
"శ్రమించు ;పంచు "
"ఆచరించు ;బోధించు "
"ప్రేమించు ;క్షమించు "
వీటిని గురించి పూజ్యశ్రీ మాస్టర్  గారు ఇలా వివరిస్తూ ఉండేవారు .
"పరిశోధించు ;సాధించు "
దేనిని గురించియైనా నిశితంగా నిష్కర్షగా పరిశోధించు ,దాని తత్త్వాన్ని  గురించి లోతుగా ఆలోచించు ,అప్పుడు దాని తత్త్వం  అవగతమవుతుంది ,అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పట్టు విడవకుండా ప్రయత్నించాలి ,
మూలాన్ని తెలుసుకోవాలి ,మూలాన్ని తెలుసుకున్నట్లు గుర్తు ఏమిటంటే ఆ విషయంలో ఇక సందేహముండదు ,మనస్సు శాంతిని పొందుతుంది .

"విశ్లేషించు ;వివేచించు "
జీవితంలో జరిగే సంఘటనల గూర్చి విశ్లేషించు ,అంటే సంఘటనలోని ,పరిస్ధితుల లోని మంచి చెడులు ,పూర్వాపరాలు క్షుణ్ణంగా  తెలుసుకోవాలి . తర్వాత వివేకంతో ఆలోచించాలి అంటే వాటిలోని సత్యాసత్యాలను గూర్చి నిష్కర్షగా ;స్వార్ధ రహితంగా  ఆలోచించాలి ,అప్పుడే సరియైన అవగాహన కలుగుతుంది . సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము గూడ . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!




[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #38 on: March 26, 2013, 12:59:17 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత ;

శ్లో ||23 . ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే  |
              గురు స్సకల ధర్మాత్మా  తస్మైశ్రీ గురవేనమః ||

                                           "మహాపురుషుడు --పూజ్య గురు పత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
"పరిశీలించు ;విశ్వసించు "
ఈ విషయమై ఆయన ఒకసారి ఇలా చెప్పారు ,"జన్మ నెత్తినందుకు గురువును తెలుసుకోవాలి ,లేకపోతె ఎందుకు వచ్చినట్లు ?పిడకలు ఎరుకోడానికా ? అని బాబా చెప్పారు ,కనుక మానవ జన్మ నెత్తి నందుకు  తప్పకుండా గురువును తెలుసుకోవాలన్నమాట .
   అయితే గురువును తెలుసు కునేదెలా ? అందుకు మొదట సద్గురువులు  ఎలా ఉంటారో వారి లక్షణాలేమిటో  సంపూర్ణంగా తెలుసుకోవాలి . అట్టి లక్షణాలు అవతలి వ్యక్తిలో  అంటే  గురువుగా పెట్టుకోవాలి అనుకునేవారిలో  ఉన్నాయో లేదో  నిశితంగా పరిశీలించాలి ,ఎన్ని విధాలుగా నైనా  అట్టివారిని పరీక్ష చేసుకోవచ్చు ,అందుకు ఎంత కాలమైనా తీసుకోవచ్చు ,మనం దేనినైనా -అంటే కూరగాయలైనా సరే కొనడానికి వెళ్ళినప్పుడు అవి సరియైనవి అవునో కాదోనని  ఎంతగానో పరీక్షిస్తాము గదా !అలాగే  ఒక పెళ్లి సంబంధం  చూడాలంటే ఎంతగానో అవతలి  వారి వివరాలు  గూర్చి విచారిస్తాము గదా  !అలాంటప్పుడు  మన జీవితాన్నే  సద్గురువుకు అప్పగించాలని  తలచినప్పుడు  ఎంతగానో పరిశీలించ వలసిన అవసరమున్నది . అందుకని అప్రమత్తత లేకుండా ,క్షుణ్ణంగా అనుమానం లేని విధంగా  పరీక్షించిన  తర్వాతనే  ఎవరినైనా గురువుగా  ఎన్నుకోవాలి .
 అయితే సరియైన గురువును ఎన్ను కోవడానికి మన పరిజ్ఞానం చాలదు గనుక సద్గురువు లభించాలని 'శ్రీ గురు చరిత్ర 'శ్రద్దగా పారాయణ చేస్తే  శ్రీ దత్తాత్రేయుడు  స్వప్న దర్శన మిచ్చి నిజమైన సద్గురువును  మనకు తెలుపుతారు ,అప్పుడు అట్టి గురువును ఆశ్రయించడం  సరియైన పద్ధతి .
  సద్గురువును తెలుసుకున్న తరువాత  వారిని తన గురువుగా భావించిన తర్వాత ఆయనను సంపూర్ణంగా విశ్వసించాలి ,కానీ  పరిపాకం లేకపోవడం వల్ల  గురువును సంపూర్ణంగా విశ్వసించ లేకపోతాము ,అందుకని గురువును  ఎంతటివాడో  గుర్తు పెట్టుకుని మనస్సును  సడలకుండా జాగ్రత్త వహించాలి . ఆయన సర్వజ్ఞుడని  ,సర్వ సమర్ధుడనీ  ,మన ఐహిక  ఆధ్యాత్మిక  శ్రేయస్సు చేకూర్చేవారిని  సంపూర్ణంగా విశ్వసించాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #39 on: March 27, 2013, 09:22:30 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||24 . గురు మధ్యే స్ధితం విశ్వం విశ్వమధ్యే స్దితో గురు:|
            గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ||

                                          "మహాపురుషుడు --పూజ్య గురు పత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు ""శరణు పొందు; సేవించు "
గురువును ఎన్నుకున్న తర్వాత వారి శరణు పొందాలి ,ఆయనే సర్వస్వము అనే భావనలో ఆయనకు సేవ చేసుకోవాలి ,ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు తమ బాధ్యతలను గురుసేవగా భావించాలి ,ఆయన వాటిని తమకే అప్పగించిన బాధ్యతలుగా ,ఆయన ఆజ్ఞగా భావించి కర్తవ్యాలను నిర్వర్తించాలి ,అప్పుడు గురు సన్నిధిలో సేవచేసినట్లే ,కారణం ఆయన ఎక్కడ లేరు గనుక ?అదే సేవ చేయడమంటే ,నిష్ఠ సబూరీలనే దక్షిణ లను ఆయనకు సమర్పించి దక్షతతో సేవ చేసుకోవాలి .
"శ్రమించు ;పంచు "
"కష్టపడి పని చెయ్యి ,దేవుని నామముచ్చరించు "
అన్నారు బాబా ,అందుకని ప్రధమ కర్తవ్యంగా ప్రతి మానవుడూ కష్టపడి పని చెయ్యాలి ,బాబా చెప్పిన ఈ సూక్తిలో ఎంతో అర్ధమున్నది  కష్టపడి  పని చేయడం వల్ల  కర్మ నశిస్తుంది ,పుణ్యం లభిస్తుంది ,ఋణ విముక్తి కలుగుతుంది ,
  ఈ పనిచేయడం తన కోసం మాత్రమే  గాక ఇతరుల కోసం గూడా చేయాలి ,అంతేగాక తాను  సంపాదించిన దానిలో ఇతరులకు  గూడా వినియోగిస్తూ ఉండాలి .
భగవంతుడు మనకు సర్వాన్నీ ప్రసాదిస్తున్నాడు ,ప్రకృతి తన సర్వస్వాన్నీ మనకు ఇస్తున్నది ,అలాగే సూర్య చంద్రాదులు ,పశు పక్ష్యాదులు ,వృక్షాలు ,నదులు -అన్నీ మనకు తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానం చేస్తున్నాయి ,అలాగే మానవుడు గూడ ఇతరులకు సాధ్యమైనంతగా  ఇవ్వడం నేర్చుకోవాలి ,ఇది మానవుని కనీస కర్తవ్యం . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



[/13size]

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: ''Mahapurushudu''---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #40 on: March 28, 2013, 10:10:26 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 25 . మధులుబ్ధో యధాభ్రుంగో  పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ |
              జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ||

                                      "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
"ఆచరించు ;బోధించు "
 ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలి ,ప్రాపంచిక విషయంలో గాని ,పారమార్ధిక విషయంలో గానీ  ధర్మా చరణ  అత్యంత  ప్రధానమైనది ,ధర్మం తానూ ఆచరిస్తూనే  ఇతరులకు  బోధించాలి ,తానూ ఆచరించకుండా  బోధిస్తే అది 'దంత వేదాంతము ' అవుతుంది .
 ధర్మం మీదనే శాంతి భద్రతలు  ఆధారపడి ఉన్నాయి ,ఈనాడు ఇంతగా విజ్ఞానం  పెంపొందినా ,దాని ద్వారా ఎన్నెన్నో సౌకర్యాలు ,సౌలభ్యాలు లభించినా ధర్మాచరణ  లోపం వల్ల  ఇంకా ఇంకా మానవులు అశాంతికి గురి అవుతున్నారు .
 ఒకనాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే పాదచారులుగానే వెళ్ళ  వలసి ఉండేది ,తర్వాత క్రమంగా సౌకర్యాలు వచ్చి దేశ విదేశాలకు గూడా త్వరగా వెళ్ళ గలుగుతున్నాము ,ఆనాడు వార్తలు చేర వేయడానికి మనుషులు కాలి నడకన ,లేక గుఱ్ఱాల  మీద వెల్ల వలసి  ఉండేది ,ఈ రోజు ఫోను సౌకర్యంతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా  మాట్లాడుకోవచ్చు ,ఇలా ఈనాడు సాంకేతిక  పరిజ్ఞానం పెరిగిపోయి  అన్ని విషయాలలోనూ అతి సులభమైన మార్గాలు కనుగొనడం జరుగుతున్నది ,అందువలన మానవులకు  ఎంతో శ్రమ తగ్గుతున్నది ,సమయము  కలిసి వస్తున్నది ,అయినా నేడు శాంతిగా  ఉండలేకపోతున్నాము ,అనుక్షణము అభద్రతా భావం పెరిగి పోతున్నది ,ఈ విషయం గూర్చి నిశితంగా ఆలోచించ వలసిన  అవసరమున్నది ,దానికి కారణం ధర్మా చరణ  లోపమేనని  చెప్పక తప్పదు .
 నేడు చాలా మందిలో భక్తి మేల్కొంటున్నది ,చాలా మంది ఏదో ఒక దైవాన్నో లేక గురువులనో సేవిస్తున్నారు ,కానీ ఎక్కువ మందిలో ధర్మాచరణ  స్పష్టంగా కనిపిస్తున్నది  .
చివరకు 'వంతులకు ,కీచు లాటలకూ  పోవద్దు ' అని చెప్పిన బాబాను  సేవించేవారిలో  ఎంతో మందిలో గూడ  ఈ లోపం వల్ల  వంతులు ,కీచు లాటలు ,విభే దాలూ  చోటు చేసు కుంటున్నాయి ,చాలా చోట్ల రాజకీయం తాండవిస్తున్నది ,బాబా భక్తులలో  గూడా స్వార్ధం  కనిపిస్తున్నది ,అందువలన అవతలివాడికి అపకారం చేయాలనే దుష్ట తలంపులు  చోటు చేసుకుంటున్నాయి .
   వారు బాబా భక్తులే ,బాబా ధ్యానము ,పూజ జపము ,సేవలు బాగా చేస్తారు ,తమకున్న వాటిని బాబాకు సమర్పించడానికి  వెనుకాడరు ,కానీ సాటి వారి పట్ల  వారి ప్రవర్తనలో  మార్పు ఉండదు ,భేద భావము ,స్వార్ధము ప్రతి స్పందిస్తుంటుంది ,ఉదాహరణకు  ఒకడు మందిరాలలో జరిగే అన్నదానాలకు  ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాడు ,కానీ బిచ్చ గత్తెకు  భిక్ష మెయ్యడు ,పేదవారికి సహాయం  చేయడు , దీనిని బాబా హర్షించరు ,హీనుల ,దీనుల సేవ ఆయన స్వయంగా చేసి చూపించారు ,పేద సాదలకు  దానం ఇవ్వడం చేసి చూపించారు ,ఇలాంటి ఎన్నో లోపాలు బాబా భక్తులలో గూడ  కొందరికి ఉండడం విచారకరమైన  విషయం ,అందుకనే ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది ,ప్రతి మానవుడూ ధర్మమాచరిస్తూ   ఇతరులకు  బోధిస్తూ ఉండాలి ,అప్పుడే మనం సుఖ శాంతులతో ఉండగలము .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]
« Last Edit: March 30, 2013, 12:19:35 AM by Admin_smf »

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #41 on: March 29, 2013, 09:27:36 AM »
జై సాయి మాస్టర్ !

గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||26 . అత్రి నేత్ర శ్శివ స్సాక్షాద్ద్వి భాహుశ్చ హరి: స్మృతః |
            యో చతుర్వదనో బ్రహ్మశ్రీ  గురు: కధితః ప్రియే ||
    27 . దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ |
           తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణ: ||

                                         "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
ప్రేమించు ;క్షమించు

  సకల జీవులలోనూ ఆత్మయే ఉన్నాడని గాని ,భగవంతుడే ఉన్నాడనిగానీ ,భావించినప్పుడు అందరినీ ప్రేమించ గలుగుతాము ,అలాగాక  సకల జీవులూ తన వంటి ప్రాణులే అనుకున్నప్పుడు గూడా అసూయా ద్వేషాలు కలుగవు ,ప్రేమించడమే  జరుగుతుంది .
     బాబా తాము అన్ని ప్రాణులలోనూ  ఉన్నట్లు చెప్పడమే  గాక అట్టి అనుభవాలను  ప్రసాదించారు గూడ, అట్టి భావన  నిలుపుకున్నపుడు  గూడ అందరినీ ప్రేమించడం సాధ్యమవుతుంది .
  సాటి మానవులు గూడ తమ వంటి బలహీనతలు గలవారే అనుకున్నప్పుడు  వారి యొక్క స్వభావాలను  గూర్చి పట్టించుకోక ప్రేమించడం  జరుగుతుంది ,ఒక్క మానవులే గాక  ఇతరములైన  వాటిని గూర్చి ,వాటి తత్త్వములను  గూర్చి  ఆలోచించినప్పుడు  గూడా సకల జీవులనూ ప్రేమించడం  సాధ్యమవుతుంది .
  అప్పుడు ఎవరి యందూ  ,లేక వేటి  యందూ ఉన్న బలహీనతలు ,లోపాలూ లోపాలుగా  కనిపించక  ఎవరు ఎలా ప్రవర్తించినా  క్షమించడమే  జరుగుతుంది .
అలాగాక మన జీవితాలలోని ప్రతి సంఘటనలనూ బాబాయే  ప్రసాదిస్తున్నారని  తలచినప్పుడు  గూడ  అవతలి వారిని క్షమించడం  జరుగుతుంది .
  పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ విధంగా మన శ్రేయస్సు కోసం  ఎన్నో ముఖ్యమైన  సూచనలు చెప్తుండేవారు ,ఆయన ఒక్కొక్క విషయాన్ని  గూర్చి ఎంతగానో  వివరించేవారు ,ఆయన చెప్పిన వాటిలో కొన్నింటిని  క్లుప్తంగా మాత్రమే  మనమిప్పుడు స్మరించుకున్నాము  .
  ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రవచించిన అమూల్య  సూక్తులను విశ్లేచించుకుని ,వివేచించి  ఆచరించ డానికి  ప్రయత్నిద్దాము ,సమర్ధ సద్గురువులైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని శరణు పొంది ,విశ్వసించి ,సేవిద్దాము .
 ఇటువంటి సద్గురువును ,తన ముద్దు బిడ్డను మనకు ప్రసాదించినందుకు  సమర్ధ సద్గురువులైన   శ్రీ  శిరిడీ  సాయినాధునికి  వందన సహిత కృతజ్ఞతలు  తెలుపుకుందాము . 
                                                 జై సాయి మాస్టర్ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]