Author Topic: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru  (Read 6304 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #15 on: March 03, 2013, 12:37:43 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||27 . దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ |
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణ: ||

                                      " మహాపురుషుడు---పూజ్యగురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

         శ్రీ వాసుదేవానంద శిష్యులైన శ్రీ గుళవణి  మహారాజ్  గారి దర్శనానికై  వెళ్ళినపుడు ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారిని 'సాయి బాబా కా బేటా ' గా ప్రశంసించారు . అంతే  గాక ఆయనకు శ్రీ గురు చరిత్ర  సంస్కృత  గ్రంధాలను  ప్రసాదించారు . వాటినే తెలుగులో తర్జుమా చేసి పూజ్యశ్రీ మాస్టర్ గారు గురు ప్రాశస్త్యాన్ని  ఆంధ్ర దేశానికి తెలియజేసారు .
           శ్రీ కాళహస్తిలో అవధూత గోపాల్ బాబా పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి  "భగవాన్ కి సమాన్ హై భరద్వాజ్ " అన్నారు .
         దత్తోపాసకులగు  శ్రీ తాడేపల్లి  రాఘవ నారాయణ  శాస్త్రిగారు  పరమ నిష్టా గరిష్టులైనప్పటికీ కులమత బేధాలను పాటించని పూజ్యశ్రీ  మాస్టర్ గారి  గృహానికి  విచ్చేసేవారు ,వారి ఆశీస్సులు  కోరిన పూజ్యశ్రీ మాస్టర్ గారితో  ఆయన ,"నీకు ఆశీస్సులివ్వగలవారెవ్వరు ?"అన్నారు  .
        శ్రీ సుధీంద్ర బాబుగారు అనే మహాత్ములు  పూజ్యశ్రీ మాస్టర్ గారిని  గూర్చి "ఆయన ఆచార్య పదవికి అర్హులు ,ఈ కాలానికి  ఎదురీతున్నారు "అన్నారు .
      శ్రీ పాకలపాటి గురువుగారు ,"నాకు శ్రీ భరద్వాజ  శంఖు చక్రాలతో  దర్శనమిచ్చాడు . అతనిని చూడాలని  చాలా బలంగా  అనిపిస్తున్నది . . అతనిని వెంటనే  నా వద్దకు రమ్మని  చెప్పండి "అని పూజ్యశ్రీ మాస్టర్ గారి పితృదేవులైన   శ్రీమాన్ అనంతాచార్యులు గారితో   అన్నారు .
      శిరిడీలో  నివసించిన  శివనేసన్ స్వామి ,"భరద్వాజ గొప్పతనం  ఎంతటిదో  ఎవరికీ అర్ధం గాదు ,అతడు నివురు గప్పిన  నిప్పు ,తన సంగతి బయటపడ నివ్వడు అందుకే  అతనిని అపార్ధం చేసుకోవడానికి అవకాశం  ఎక్కువ ఉంటుంది ,అందరిలో బాబాను దర్శించమని చెప్పిన ఆయనలో దోషా లెంచితే  ఎలా ?" అనేవారు .
      శ్రీ రామ సూరత్ కుమార్ గారు ,("BHARADWAJA  is BHARADWAJA ") "భరద్వాజ అంటే భరద్వాజే "అన్నారు .  అంటే మాస్టర్ గారితో మరెవ్వరూ సమానులు కారన్నమాట !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #16 on: March 04, 2013, 01:05:07 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గూర్ బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ  గుణాత్మనే |
            సమస్త జగదాధారా మూర్తయే  బ్రహ్మణే నమః ||

                              "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

.........  శ్రీ రాఖాడీ బాబా ,"నువ్వు  ఎక్కడ  నమస్కారం పెడితే  అక్కడ సాయినాధుని పాదాలుంటాయి ,గురువు యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ,అందుకే అనసూయా మాత అనుగ్రహం నీకు లభించింది "అన్నారు .
     ఇలాగే ఇంకా ఎందఱో మహాత్ములు పూజ్య మాస్టర్ గారిని ఎంతగానో ప్రశంసించారు  ,తమ  సంపూర్ణ ఆశీస్సులను అందించారు .  ఆయనను చూస్తుంటే ఆయా మహాత్ముల నేత్రాలలో ఒక ప్రయోజకుడైన  పుత్రుని ,తాము చెప్పినది తూ . చ  తప్పకుండా ఆచరించే  శిష్యుని ,ఒక ధర్మ ప్రవర్తకుని ,ప్రపంచ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమపడే ఒక ఔన్నత్యుని  ఒక అత్యద్భుత  ఆధ్యాత్మిక జ్యోతిని చుసిన ఆనందం  తొణికిసలాడేది .  అవధూతయైన  చివటం అమ్మ పూజ్యశ్రీ మాస్టర్ గారు వస్తున్నారంటే  "బాబు వస్తున్నాడే " అంటూ ఒక పండుగలాగా చేసేవారు .
   శ్రీ చీరాల స్వామి ప్రియ పుత్రుని చూస్తున్న తండ్రిలాగా 'ఆ ఎర్రస్వామి ఎప్పుడోస్తాడయ్యా ?' అంటూ పూజ్యశ్రీ మాస్టర్ గారి కోసం  ఎదురు చూసేవారు ,తమ క్రిందటి జన్మ రహస్యాన్ని పూజ్యశ్రీ మాస్టర్ గారికి మాత్రమె చెప్పారు ,విద్యానగర్ లో ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి  తాము నిర్యాణం చెంద బోతున్నామని తమ దివ్య సంకేతంతో  తెలియజేసారు .  ఆ సంకేతాన్ననుసరించి మాస్టర్ గారు వెంటనే చీరాల చేరుకున్నారు ,శ్రీ చీరాల స్వామి ఎంతో ఆప్యాతతో మాస్టర్ గారి చేయి  తమ హృదయంపై  ఉంచుకున్నారు .  అలా మాస్టర్ గారు తమ చెంతకు చేరేవరకు వేచి ఉండి  తర్వాతనే సమాధి చెందారు .
        జిళ్ళేళ్ళమూడి  అమ్మ ఎటువంటి సమయాలలోనైనా పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమ దర్శనం చేసుకోవడానికి రావచ్చని చెప్పేవారు .
        ఇంకా ఎంతో మంది మహాత్ములు ,అవధూతలు ,సిద్ధులు ---ఆయనను ఎంతగానో ప్రశంచించారు ,అయినప్పటికీ ఆయన తాము  గురువునని  అహంకరించలేదు ,శిష్యుడనని విఱ్ఱవీగలేదు ,"నేనూ మీలాంటి వాడినే ,ఇందులో నా గొప్పతనమేమి లేదు "అని  నిగర్వంగా చెప్పుకుంటూ ,అతి నిరాడంబరంగా ఉంటూ సామాన్య మానవునిలా ప్రవర్తించినఆయన ఎవరు ?--ఇంకెవరు  మనందరికీ ప్రియాతి ప్రియమైన సాయి బాబా  కా బేటా !"("శ్రీ సాయి బాబా ముద్దు  బిడ్డడు ") పూజ్యశ్రీ  ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు .
       అటువంటి పూజ్యశ్రీ మాస్టర్ గారి 75 వ జనమ దిన సందర్భంగా ఆయన పాద పద్మాలకు అనంతకోటి ప్రణామములు ! కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు !
                                                    జై సాయి మాస్టర్ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: March 04, 2013, 01:07:44 PM by gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #17 on: March 05, 2013, 08:13:19 PM »
                                                           
 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ |
          తారకం భవసింధోశ్చ  తం  గురుం ప్రణమామ్యహమ్ ||

                                  "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "   
                                                       
                                                                  సద్గురువు
                                                                 
                                                           జై సాయి మాస్టర్ !
     .............   "సద్గురువు "అన్న పదం గుర్తుకు రాగానే  సాయియే  మనస్సుకు స్పురిస్తారు "అని హేమాద్పంతు  అంటాడు .
        పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూసినవారికి ,ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారికీ  గూడ  అలాగే అనిపిస్తుంది .
T . T . D  సంస్ధలో కార్యకర్తగా  పనిచేస్తున్న జి . నాగేశ్వరరావు ఇలా అంటారు :"పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు  ఎవరైనా వెళ్ళవచ్చు ,ఆయన దగ్గరకు వెళ్ళడానికి  ఏమైనా  తీసుకువెళ్ళడము  అలాంటి ఫార్మాలిటీస్  ఏమీ ఉండేవి గావు ,ఎవరుపడితే  వారు ఎక్కడుంటే  అక్కడ ఆయనను  కలవవచ్చు ,ఎవరైనా సరే వారు అడిగిన ప్రశ్నకు  వారి స్ధాయి  నుంచి సునిశితంగా  ,సుకుమారంగా ,లాలిత్యంగా అవసరమైతే  కటువుగా సమాధాలను  శాస్త్రాల నుంచి కోట్  చేస్తూ గూడా  చెప్పేవారు ,ఎంతో మంది ఆయన దగ్గరకు సందేహ నివృత్తి కోసం  వచ్చేవారు ,అలా వచ్చినటువంటి  వారి స్దాయి ఏమిటి ? వారు పండితులా లేక పామరులా  ,ఉన్నవారా ,లేనివారా ?అన్నబేధం  చూపక ఎవరొచ్చి అడిగినా గూడ వారికి విషయాన్ని సమగ్రంగా అవగాహనకు తీసుకు వచ్చి వారిలో ఒక ఎన్ లైట్ మెంట్   తీసుకు వచ్చేవారు ,'విషయం  ఇది బాబు  !ఇలా ఆలోచించాలి 'అని చెప్పగలిగే సాంప్రదాయాన్ని నాకు తెలిసినంతవరకూ  మాస్టారిలా  ప్రచారం చేసినవారూ ,అట్టి  పద్ధతిని  ప్రవేశపెట్టినవారూ ,ఆ పద్ధతిని పరిచయం చేసినవారూ లేరు .
                 ఎవరన్నా ఆయన దగ్గరకు వచ్చినపుడు ముందు అవతలి వారికి ఏమి తెలుసో ,అతనికి ఆ విషయంలో ఎంత పరిజ్ఞానం ఉందొ తెలుసుకునేవారు ,ఆ వచ్చినవారు ప్రయత్నం చేసి భయం చేత  చెప్పలేక పోయేవారు ,ఆ విషయంలో  వారేమనుకుంటున్నారో  కొన్ని ప్రశ్నలు వేసేవారు ,ముందు బెరుకుగా  ఉన్నా ఆయన చూపించే  ఆప్యాయత  వల్ల  ,అందించే   ప్రోత్సాహం వల్ల  ఆ తర్వాత వారికి మొహమాటము ,భయము  పోయి చాలా స్వేచ్ఛగా  తనకేం కావాలో  అది అడిగే చనువు  చొరవ  వారికి లభించి  తమకు కావలసిన దానిని ఫ్రీగా  చెప్పగలిగే వారు ,అప్పుడు మాస్టర్ గారు   వారి స్ధాయి  ఏమిటో తెలుసుకొని అక్కడ నుంచి మొదలు పెట్టేవారు ,ఏ స్ధాయిలో చెబితే వారికి  అర్ధమవుతుందో  ఆ స్ధాయిలో  వారికి చెప్పేవారు ,చిన్న పిల్లలైతే వారి స్ధాయికి దిగి చెప్పేవారు ,పెద్దవారైతే వారి స్ధాయికి ఎదిగి  చెప్పేవారు ,ఇది ఆయనలోని  మరో ప్రత్యేకత ,కానీ అసలు మాస్టారి  స్ధాయి ఏమిటో  ఎవరికీ అంతు పట్టేది  కాదు ,జ్ఞానం కావాలనుకున్నవారికి జ్ఞానపరంగా  చెప్పేవారు ,భక్తులకు  భక్తి ఎలా స్దిరపరచు కోవాలో  చెప్పేవారు ,కర్మిష్టికి కర్మ ఎలా చేయాలో ,అనుభవించాలో చెప్పేవారు ,వైరాగ్యం అంటే ఏమిటో  తెలుసుకోగోరేవారికి  దానిని  విశదీకరించే వారు ,విజ్ఞానపరంగా  భగవంతుని  గూర్చి  చెప్పమని  కోరేవారికి  విజ్ఞానపరంగా  భగవంతుని  ఆస్తిక్యాన్ని ఎలా ఋజువు పరచవచ్చో  తెలియ జేసేవారు ,అలా ఎవరికీ ఏది కావాలో దానిని  వారికి అందించారు ,అందుకే ,'ఓహో  ,సద్గురువంటే  ఇలా ఉంటారు !'అనిపించేది . ....................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #18 on: March 06, 2013, 05:06:59 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||3 . సర్వ తీర్ధావగాహస్య  సంప్రాప్నోతి ఫలం నరః |
           గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ||

                                      "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

చిన్నప్పటినుంచి పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వస్తూ ఉన్న పి . శ్యాంప్రసాద్  ఒకసారి పుస్తకంలో చదివి ప్రాణాయామం చేయడం ప్రారంభించాడు . ఒకరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనిని "ప్రాణాయామం చేస్తున్నావా ఏమిటి ?అని అడిగారు ,అందుకతడు చేస్తున్నానని చెప్పగానే "పుస్తకాలు చదివి ప్రాణాయామం చేయగూడదు ,తెలిసినవారి దగ్గర అభ్యసించి చేయాలి ,లేకపోతె సరిగా చేయడం చేత కాకపొతేను  ,ఆహారనియమాలు పాటించక పోతేను ,మధ్య మధ్యలో అవాంతరాలకు  విరుగుడు తెలియక తికమక పడి   ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది ,ఒక్కొక్కసారి పిచ్చి పట్టవచ్చు గూడా "అని చెప్పారు ,అయితే నన్నేం చేయమంటారో మీరే చెప్పండి  అని అడిగితే  'సోహం ' చేయమని  దానిని ఎలా చేయాలో వివరించి చెప్పారు .
     అతడలా చేయడానికి వెంటనే ప్రయత్నించాడు ,కానీ అతనికి ఆ సాధన చేయడం కష్టమైంది ,కొంతసేపు ప్రయత్నించి విసుగుపుట్టి తన ఊరు మెట్టు గ్రామానికి వెళ్ళాడు ,ఇంటికి వెళ్ళాక రాత్రి పడుకోగానే  అతనికి ,'సోహం 'అనే శబ్దం వినిపించింది , అతడు దానిని గమనించగా తన శ్వాసలోనుంచే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పనట్లు 'సోహం 'అప్రయత్నంగా జరుగుతున్నది !అతడు దానిని గమనిస్తూ ,వింటూనే నిద్రపోయాడు ,మధ్యలో మెలకువ వచ్చింది ,అలాగే ఆ సాధన కొనసాగుతున్నది ,అతనికి భయమేసి ఉదయమే విద్యానగర్ వెళ్లి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించుకుని నమస్కరించి రాత్రి నుంచి తనకు జరుగుతున్న అనుభవం  గురించి చెప్పాడు ,తనకు చాలా భయమేస్తున్నదని  గూడ  చెప్పాడు ,;'ఓహో ! అలాగా !' అంటూనే  పూజ్యశ్రీ మాస్టర్ గారు కాలేజీకి బయలుదేరారు , అతనిని గూడా తమ వెంట రమ్మని   త్రోవలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమాచారాలు ,ఇతర  విషయాలు  అడిగి కాలేజీకి ,వెళ్ళారు అతడు గూడ   ఇంటికి బయలుదేరాడు ,కొంత దూర మెళ్ళాక  'ఏమిటి ?పూజ్యశ్రీ మాస్టర్ గారు తానడిగిన  విషయం   ఏమీ చెప్పలేదు !'అనుకుంటూనే శ్వాస గమనించాడు ,ఆశ్చర్యం !ఆ శబ్దం ఆగిపోయిఉంది ,అట్టి అద్భుత సాధనను అనుభవింప జేయడం ,తిరిగి తీసుకొనడము సద్గురువుకే సాధ్యమని అతడు గ్రహించాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
   
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #19 on: March 07, 2013, 10:09:53 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో ||4. అజ్ఞాన మూల హరణం  జన్మ కర్మ నివారకమ్ |
          జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ||

                                  "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

 .............. ఒకతను దుర్భర పరిస్ధితిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని పూజ్యశ్రీ మాస్తేర్ గారి  వద్దకు వచ్చాడు ,కానీ అతడేమీ ఆయనకు చెప్పలేదు ,అతడు కూర్చున్న కాసేపు తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారు ఉన్నట్లుండి ధ్యానస్దులైనారు ,కాసేపయిన తర్వాత అతనికేసి చూసారు ,అప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి ఏదో శక్తి ఇతనిలోకి  ప్రవహించి నట్లయింది ,ఇంతలో ఆయన మనిషి చచ్చిపోవాలను కోవడమేమిటి ?చనిపోయే బదులు జీవితాన్ని  మానవసేవకు  అంకితం  చేస్తే సరిపోతుంది గదా ! అన్నారు ,ఆ మాటలతో అతని మనస్సులో  చనిపోదామన్న తలంపు   నశించింది .
         మరొకసారి అతనికే ధ్యానం ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు ,ఆ విషయం  అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారికి చెప్పలేదు ,అతడు ఆయనకు పాదనమస్కారం చేసుకుంటుంటే ఆయన అతని వెన్ను నిమిరి ,అతని తలపై తమ అమృత హస్త ముంచారు , అప్పటినుంచీ  అతనికి ధ్యానంలో ఏకాగ్రత  కుదిరింది .
        తన శ్వాసను బట్టీ ప్రశ్నలు  చెప్పే  ఒక వ్యక్తి  పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు ,ఆయన సన్నిధిలో కొద్దిసేపు కూర్చున్న తర్వాత అతనన్నాడు "మీ సన్నిధిలో ఇడ -పింగళ  నాడులన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి సార్ !నేను ఉదయం నుంచీ అవి సమానంగా పనిచేయక తంటాలు పడుతున్నాను ,కానీ మీ సన్నిధిలో వాటంతట  అవే పనిచేస్తాయి " సద్గురు సన్నిధిలో మాత్రమే   అలాంటి అనుభవాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు .
       జి . వి . రమణయ్యకు ఒకనాడు స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒక చోట ధ్యానస్దులై కూర్చుని కనిపించారు . కొంత సేపటికి   ఆయన కూర్చున్నట్లే ఆకాశంలోకి పైకి వెళ్ళసాగారు ,అప్పుడతడు  ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు .  అలా ఇద్దరూ ఆకాశంలోకి ప్రయాణిస్తూ మహా నంది ,అహోబిలము చూసారు ,తర్వాత అవధూతయైనరామిరెడ్డి  తాత కల్లూరి గ్రామము ,మూడవది మహా వృక్షాలతో  నిండి ఉన్న ఎత్తైన పర్వతప్రాంతము ,స్వప్నంలో  త్రిస్ధలీ  యాత్రను  పూజ్యశ్రీ మాస్టర్ గారు అతని చేత చేయించారు . అది సద్గురువులకు మాత్రమే  సాధ్యం .
     పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన లీలలు ఎన్నో ఎన్నెన్నో ......
                                             జై సాయి మాస్టర్ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![13/size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #20 on: March 08, 2013, 09:26:54 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||5 . కాశీక్షేత్రం  నివాసశ్చ  జాహ్నవీచరణోదకమ్  |
           గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం  బ్రహ్మనిశ్చయః ||

                                     "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
                                                             
                                                                  విద్యాప్రదాత 

    ......................... ఉపాధ్యాయ వృత్తి  ఎంతో శ్రేష్టమైనది . కారణం  విద్యార్ధులకు సత్యాన్ని బోధించడానికి ,తద్వారా తరతరాలను తీర్చిదిద్దదానికీ ,అవకాశముంటుంది .  అందుకనే  ఆ వృత్తినే ఎన్నుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు .
             అయన వద్ద విద్య నభ్యసించిన విద్యార్ధులెందరో ఆయనకు శిష్యులైనారు . అలాగాక ఆయనతో విద్య వరకే సంబంధమున్నవారు  గూడా ఆయన బోధించిన విషయాలను ,ఆయననూ ఎన్నడూ మర్చిపోలేదు ,అట్టి విశిష్ట బోధన  ఆయనది !
           ఆధ్యాత్మికతనే ఆయన ప్రధానంగా భావించి నప్పటికీ తరగతిలో  మాత్రం ఆధ్యాత్మికత గూర్చి గాని ,మహాత్ముల గూర్చి గానీ ఎన్నడూ మాట్లాడేవారు గాదు ,ఎవరైనా విద్యార్ధి అటువంటి విషయాల ప్రసక్తి తెచ్చినా ఆయన ఒప్పుకునేవారు గాదు ,కాలేజీ సమయం కానప్పుడు మాత్రమే  ,బయట మాత్రమే  ఆధ్యాత్మికత  గురించి మాట్లాడేవారు ,పాఠ్యాంశాలను చక్కగా వివరించి చెప్పేవారు ,అర్ధమవకపోతే మళ్ళీ మళ్ళీ అడగమని ,ఎన్ని సార్లయినా వారి సందేహాలు తీరుస్తామనీ అనేవారు .
           ఆయన బోధించే తరగతి ఎంతో ప్రశాంతంగా ఉండేది ,విద్యార్ధులు ఆయన తరగతిలో నిశ్శబ్దం గాను , ఉత్సాహంగానూ ఉండేవాళ్ళు ,ఒక విజ్ఞాన వేత్త ,సంఘ సంస్కర్త ,మహాత్ముడు ఆయిన వారి బోధ --అది ఏ  విషయమైనా  గావచ్చు ,అద్భుతంగానే ఉంటుంది .
          ఆయన తమ హృదయపు లోతులలోంచి  బోధిస్తారు ---పెదవి చివరి నుంచి  కాదు ,తమ హృదయం నుంచి విద్యార్ధుల  హృదయపు లోతులలోకి  అందిస్తారు ,చెవుల అంచులకు  కాదు ,అందుకే  ఆయన బోధ వారి  హృదయాలకు  అంతగా హత్తుకుంటుంది .
         ఆయన బోధనా దక్షత  చూసి సాయంత్రం ట్యూషన్ చెప్పమని ఎందఱో విద్యార్ధులు  అడిగేవారు ,అందుకాయన ఇలా సమాధానం  చెప్పేవారు :"నేను  బోధించడానికి  కాలేజీ వాళ్ళు జీతం ఇస్తున్నారు ,కనుక నేను విడిగా బోధించి డబ్బు తీసుకోవడం అధర్మమవుతుంది ,కనుక మీరు నా గదికి వస్తే ఉచితంగా మీకు పాఠాలు చెబుతాను ",ఆయన చెప్పిన నోట్సులను   వీరి విద్యార్ధుల ద్వారా ఇతర కాలేజీలలో చదువుతున్నారు ,ఎందఱో తీసుకుని వెళ్ళేవారు ,అంత చక్కగా వివరిస్తూ  ఆయన చెప్పేవారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #21 on: March 09, 2013, 10:20:34 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో ||6 . గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణ భాసకః |
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి  విమోచకం ||

                                     "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

.............    అందుకే శ్రీ సాయి బాబా గూర్చి పుస్తకాలు వ్రాసి పైక  మార్జిస్తున్నారని అనేవారికి ఆయన ,"నేను డబ్బు సంపాదించు కావాలనుకుంటే సాయి బాబా  మీదే పుస్తకాలు వ్రాయవలసిన  అవసరం లేదు ,నేను గైడ్స్  వ్రాస్తే ఇతరులు వ్రాసిన వెవ్వరూ  కొననంత  బాగా వ్రాయగలను ,కానీ నా మార్గమది కాదు ,నా సంగతి నాకు తెలుసు గనుక ఎన్ని విమర్శలు వచ్చినా  లెక్క చెయ్యను ,నా పని నేను చేసుకుపోతుంటాను "అని సమాధానమిచ్చేవారు .
                  తరగతిలో  ఆయన అప్పుడపుడు విద్యార్ధులతో హాస్య సంభాషణ చేస్తూ సరదాగా ఉండేవారు ,వాళ్ళు ఏమైనా విమర్శ  చేస్తూ గుస గుస లాడుకుంటుంటే  ఆయన "మీరు మాట్లాడుకునేదేదో  మాకూ చెబితే మేమూ నవ్వుకుంటాము గదా !" అని నవ్వుతూ అనేవారు .
     ఆయన దగ్గర చదువుతున్న విద్యార్దులిలా అంటారు :"పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించే విధానం అద్భుతంగా ఉండేది ,షెల్లీ  వ్రాసిన 'స్కైలార్క్ ' పాఠం  చెప్పేటప్పుడు ఆయన ఆధ్యాత్మికతను జోడించేవారు ,ఆత్మ తత్త్వాన్ని షెల్లీ భావనతో పోల్చి  చెబుతుంటే  మేము తన్మయులమై వినేవాళ్ళము ,ఒక దృశ్య కావ్యాన్ని  చూస్తున్న అనుభూతి మాకు కలిగేది , షేక్స్పియర్  వ్రాసిన "క్లియోపాత్ర " డ్రామాను  అభినయిస్తూ  చెప్పేవారు ,అప్పుడాయన పాత్రలలో లీనమైనట్లు గొంతు  మార్చి చెబుతుండేవారు ,ఆయన క్లాసంటే విద్యార్ధులందరికీ  చాలా ఇష్టం ,ఎవరి  క్లాసులకూ  అంత  ఇష్టంగా వెళ్ళే వాళ్లము గాదు ,వంద శాతం  హాజరు ఆయన క్లాసులో  ఉండేది ,విద్యార్ధులందరూ  ఆయన క్లాసు కోసం ఎదురు చూసేవాళ్ళు ".
         అంతేగాదు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు చి || వేదవతి ,ద్వారకనాథ్ కు  పాఠాలు   చెప్పే విధానం ఎంతో బాగుండేది ,ఏ  శాస్త్రం   చెబుతుంటే  అందులోని సూక్ష్మాలు  ,పూర్వాపరాలు వాళ్లకు అర్ధమయ్యే విధంగా చెప్పేవారు ,ఉదాహరణకు  విజ్ఞాన శాస్త్రములోని  భూమి , నక్షత్రములు సూర్యుడు మొ || న వాటి గూర్చి చెప్పేటప్పుడు అవి ఎలా సృస్టించ బడ్డాయో ,ఒకదానినొకటి ఆకర్షిస్తూ  ఎలా తిరుగుతూ ఉంటాయో ,సూర్యుడు ,చంద్రుడు ,భూమి --ఈ మూడు ఎలా ఉంటాయో చెప్పేవారు ,వాళ్లకు బాగా అర్ధమయ్యేందుకు  ఆ మూడింటికీ మూడు బంతులు గాని ,నిమ్మకాయ లాంటి  గాని ఉపయోగించి భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ ,సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ,చంద్రుడు  ఎలా ఉంటాడో చూపించేవారు .........................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #22 on: March 10, 2013, 09:33:56 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||7 . కర్మణా మనసా వాచా  సర్వదారాధ యేద్గురుమ్ |
            దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురు సన్నిధౌ ||

                                 "మహాపురుషుడు ---పూజ్య గురు పత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
.................అలాగే చరిత్ర గురించి చెప్పేటప్పుడు రాజులు ,రాజ్యాల పాలన ,వాటికోసం  పోరాటాలు వివరిస్తూ  యుద్ధాల వల్ల  జరిగిన  నష్టమేమిటి ?లాభమేమిటి ? అసలు రాజ్యాన్ని  ఎవరైనా ఎలా పరిపాలించాలి  అని చెబుతూ ఉదాహరణగా ఇల్లే ఒక రాజ్యమైతే చుట్టూ ప్రక్కల ఇల్లు మరో రాజ్యాలైతే ఎలా ఉంటుందో ,అప్పుడెలా ఉంటే  ఏమి జరుగుతుందో  వివరించేవారు . 
           అలాగే ఒకరోజు తెలుగు పుస్తకంలోని 'పులి -ఆవు 'కధను చి || వేదవతికి  చెబుతున్నారు ,అందులో ఒక పులి ఒక ఆవుపై బడి  చంపబోతుంటే ఆవు తనకు రోజుల పసిబిడ్డ ఉన్నదని ,దానిని ఒక్కసారి చూసి ,పాలిచ్చి ,సాటివారికి అప్పజెప్పి తప్పక వస్తానని ,తన మాట నమ్మమనీ ప్రార్ధిస్తుంది ,పులి జాలి పడి  అందుకు అంగీకరిస్తుంది ,అపుడా ఆవు పరుగు పరుగున తన బిడ్డ దగ్గరకు వచ్చి ,కడుపునిండా పాలిచ్చి ,దానికి ఎలా మెలగాలో సుద్దులు చెప్పి ,సాటి ఆవులకు తన బిడ్డను చూసుకోమని అప్పగించి పులి దగ్గరకు బయలు దేరుతుంది ,ఇంతవరకూ చెప్పడం వచ్చేసరికి చాలా సున్నిత స్వభావం గల  వేదవతి  వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ,అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు   కధ చెప్పడం ఆపి ,"ఎందుకమ్మా ఏడుస్తావు ? ఏం  జరుగుతుందో  చూడు ,ఆ ఆవు పులి చేతికి  చిక్కినప్పుడే  చనిపోవలసింది ,కానీ మాటను తప్పలేదు ,సత్యాన్ని అంటి పెట్టుకుంటే ఏం  జరుగుతుందో చూడు !అది రక్షింప బడుతుంది ,పూర్తిగా విను "అంటూ మిగతా కధ  చదవడం ప్రారంభించారు ,దాని సత్య వాక్య పాలన  చూసిన పులి హృదయం గూడా కరిగిపోయింది ,దానిని చంపకుండా పంపివేస్తుంది ,ఈ కధ చెప్పి మాస్టర్ గారిలా అన్నారు :"ధర్మమనేది అంత గొప్పదన్న మాట ,ఎవరైతే ధర్మానికి అంటి పెట్టుకుని ఉంటారో ,వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది ". ............. 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #23 on: March 11, 2013, 07:42:03 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||8 . శరీరమింద్రియం  ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ |
            ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

..................... అలాగే ద్వారకనాథ్ కు  ఒకసారి వర్షాలు పడడం  గురించి  చెబుతూ ఎండ,వాన ,చలి కాలాలు ఎలా సంభవించేది ,ఎండవల్ల  నీరు ఆవిరియై మేఘాలుగా ఏర్పడి  తర్వాత వర్ష రూపంలో తిరిగి భూమికి ఎలా చేరుకునేది వివరించి చెప్పారు ,కాల చక్రం  ఎందుకు అలా కొనసాగుతుందో చెప్పారు ,అలాగే మొక్కల గురించి చెప్పడానికి ఆయన వాళ్లకు పెరట్లోకి తీసుకు వెళ్లి చిన్న చిన్న మొక్కలను చూపిస్తూ అవి ఎలా మొలకెత్తుతాయో ,వేటి  వల్ల  ఎలా వృద్ధి చెందుతాయో  వ్రేళ్ళు ,కాండము ,కొమ్మలు ,ఆకులు ,పూలు పండ్లు  ఎలా వస్తాయో వివరించేవారు ,"మట్టి ,గాలి ,నీరు ఎండ కలిసి చెట్టు ఎలా అవుతోంది ?"అని ప్రశ్నించి  ఆలోచించనిచ్చేవారు ,అలా ఆలోచనా శక్తి పెంచేదిగా ఉండేది  ఆయన విధానం .
         "ఉపాధ్యాయ పాఠ్యాంశాలను  పరీక్షల కొరకు  మాత్రమే  బోధిస్తే  చాలదు ,వాళ్ళను ఋజు మార్గ ప్రవర్తకులుగా తీర్చి దిద్దాలి ,పసి బిడ్డలపై  తల్లి బాధ్యత  ఎంతటిదో ,విద్యార్ధుల పై ఉపాధ్యాయుల బాధ్యత  అత్యంత  విశిష్ట మైనది ,వారికి పాఠ్యాంశాలనే గాక నైతిక విలువలను బోధించ  వలసిన  ఆవశ్యకత  ఉన్నది ,విద్యార్ధులలో  నైతికత  లోపిస్తే సమాజం దుర్భర పరిస్ధితిని ఎదుర్కోవలసి వస్తుంది ,అందుకని  ప్రాధమిక  విద్య నుండి  విశ్వ విద్యాలయ విద్య వరకూ ధర్మ సూత్రాలను  ,నైతిక విలువలను ,సమాజంలో విద్యార్ధుల బాధ్యతను వివరించడానికి  ప్రతిరోజూ నైతిక తరగతులను విధిగా ప్రవేశ పెట్టాలి ;అప్పుడే పతనమైన మన ధర్మ వ్యవస్ధ తిరిగి పుంజుకుంటుంది .
                 ఆయన తమ తోటివారికి ,విద్యార్ధులకు కేవలం పాఠశాల  విద్యలనే  కాక జీవితానికి ఆవశ్యకమైన అనేక విద్యలను మరెవ్వరూ నేర్పలేనంతగా  నేర్పేవారు ,ఈత ,యోగాసనాలు ,వక్తృత్వం  మొదలుకొని వ్యవసాయం ,వంట విషయాలను సైతం బోధిస్తూ వాటిలోని సూక్ష్మాలను మెలకువలను తెలియ జెప్పేవారు ,నిజానికి వారి  ప్రతి చర్య విద్యా బోధనే .
  వాచా చెప్పడమే గాదు ,విద్యార్ధులకు ఆచరణా పూర్వకంగా బోధించేవారు ,అందుకే ఆయన సాటి లేని  విద్యా ప్రదాత . వారి  బోధనలో తమ ఆలోచనలు అవతల వారిపై  రుద్దడం  ఉండేది కాదు ,అవతలవారిని ఆలోచింప చేసి  వారి ఆలోచనా విధానాన్ని సరి చేసే విధంగా ఉండేది ,అలా ఆయన బోధనా దక్షత సాటి లేనిది .
                                                       జై సాయి మాస్టర్ !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #24 on: March 12, 2013, 01:28:56 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||9 . గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం |
           గురో: పరతరం  నాస్తి తస్మాత్సం పూజయేద్గురం ||

                                        "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

                                                   ఆచార్యుని బోధనా దక్షత
                                                        జై సాయి మాస్టర్ !

పూజ్యశ్రీ మాస్టర్ గారి  దగ్గరకు  ఎందఱో వచ్చి  ఎన్నో  విషయాలు మాట్లాడేవారు ,ఆయన వారి వారికి తగిన సలహాలు  ,సమాధానాలు ఇస్తూ ,ఆయా విషయాల పట్ల వారి అవగాహనను  పెంపొందించే వారు ,అవసరమైతే  సరిదిద్దేవారు ,ఏ  విషయం లోనైనా  వారి బోధనా దక్షత విశిష్టమైనది .
                  ఒకరోజు  రమాకాంత్  అనునతడు  పూజ్యశ్రీ మాస్టర్ గారిని తన స్కూటర్  వెనుక కూర్చో బెట్టుకొని ఒక చోట  జరిగే  సత్సంగానికి  తీసుకు వెళ్తున్నాడు ,అప్పుడతడు  పూజ్యశ్రీ మాస్టర్ గారితో ," మాస్టర్ గారూ !ప్రపంచంలోని  వ్యక్తులందరి పట్ల  వీరు మిత్రులు  అనో ,వీరు శత్రువులు అనో ,బంధువులనో ,పరాయి వాళ్ళు అనో -ఇలా అనేకరకాలైన భావనలు కలుగుతాయి  గాని వారిని  బాబా స్వరూపులుగా చూడడం  ఎలా సాధ్యం ?" అని అడిగాడు ,అప్పుడు పూజ్యశ్రీ  మాస్టర్ గారు ,"చూడు రమాకాంత్ !నీ వెనుక కూర్చుని ఉన్న నన్ను నువ్వు చూడడం లేదు కానీ నీ వెనుక  కూర్చుని ఉన్నది నేనని నీ ధ్యాసంతా నా మీదే ఉన్నది ,కుదుపులు  రాకుండా జాగ్రతగా  నడపాలని ఆలోచిస్తూ జాగ్రత్తగా నడుపుతున్నావు ,నువ్వు రోడ్డు మీద ఇతర వాహనాలను చూస్తునావు ,వాటిని జాగ్రత్తగా తప్పుకుంటున్నావు ,ఎవరైనా పలుకరిస్తే  మాట్లాడుతునావు ,కానీ నేను నీ వెనుక  కూర్చున్నాననే గుర్తింపు  నీ మనస్సులో ఉంటూనే ఉన్నది ,అలాగే వ్యక్తులతో మాట్లాడు తున్నప్పటికీ వారిలో గూడా బాబానే ఉన్నారని ,వారు బాబా  స్వరూపులనీ గుర్తు పెట్టుకోవడం ప్రారంభిస్తే  అభ్యాసం మీద సాధ్యమౌతుంది" అన్నారు .   
         పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు ఒకరోజు ఒక యువకుడు వచ్చి కూర్చుని ,తనకు ఎక్కడో ఒకచోట గుహలో కూర్చుని తపస్సు  చేసుకోవాలని  ఉందని చెప్పాడు ,అప్పుడాయన  అతనితో ,"నువ్వు తపస్సు చేయాలని ఎందుకను కుంటున్నావు ?"అనడిగారు ,అప్పుడతను ,"ఎందుకేమిటి సార్  భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలని  "అన్నాడు .
    "అయితే సన్యాసికి ఎదురయ్యే కష్టాలు గురించి ఆలోచించావా ? శ్రీ సాయి బాబా చరిత్రలో ఒకడు ఆ కష్టాలు ,ఇబ్బందులు గురించి తెలుసుకుని హరిద్వార్ వెళ్ళడం మానుకున్నాడు  అది చదివావా ?"
     "చదివాను సార్ !అవన్నీ ఇబ్బందులుగా  నాకేమీ అనిపించలేదు "
        "భోజనం దొరకచ్చు ,దొరకక పోవచ్చు గదా !ఆ సంగతి ఆలోచించావా ?"
         "ఆ భోజనం దొరికే చోటునే ఎన్నుకుని ఉండామను కుంటున్నాను "
          "అంటే ?"
        "ఏదైనా ఊరికి  దగ్గరగానో ,లేకపోతె భోజనం దొరికే క్షేత్రాలు "
         "ఇందాక గుహలో తపస్సు చేసుకోవాలని  ఉందన్నావ్ మరి !"
          "ఆలోచించలేదు సార్ !"
           మరి పులులు ,సింహాలు భయమో ?!"
           అదీ ఆలోచించలేదు సార్ !"
           "సరే !ఏదో ఒక ఊరికి దగ్గరగా పాడుబడ్డ దేవాలయంలోనో ,ఎక్కడో ఒకచోట ఉందామని అనుకున్నావనుకో !భిక్ష చేసి భోజనం  సంపాదిస్తావు ,ఎట్టి  సౌకర్యాలు  లేకుండా ఉండగలవా ? ఉదాహరణకు పడుకోడానికి పక్క దిండు ,చలికి తట్టుకోవడానికి దుప్పటి ,రగ్గు ,ఒళ్ళు రుద్దుకోవడానికి సబ్బు ,పళ్ళు తోముకోవడానికి పేస్టు  ,బ్రష్ --ఇంకా స్నాన పానాదులకు   అవసరమైన బక్కెట్లు ,చెంబు ,మంచి నీళ్ళు త్రాగడానికి గ్లాసు ,కుండ ,భిక్ష పాత్ర ---ఇలా ఎన్నో --అన్నీ ఆలోచించావా ?'................................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
                       
                                                                           [/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #25 on: March 13, 2013, 07:23:20 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10 . గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవోమహేశ్వరః |
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ||

                                       "మహాపురుషుడు -పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలుమంగతాయారు "

       ................. "అతడు తల గోక్కుంటూ ,అవన్నీ ఆలోచించలేదు సార్ !కానీ తీసుకు వెళ్తే సరిపోతుంది గదా సార్ !"
      "మరి భిక్షకు వెళ్తే ,వాళ్ళు పెట్టె భోజనం నీ కిష్టమౌతుందా ?"
      "చాలా మంది ఇళ్లకు వెళ్తాము గనుక రకరకాల వంటకాలు వస్తుంటాయి గదా ! సన్యాసి వచ్చాడని పిండి వంటలు గూడా వేస్తుంటారు గదా !ఎందుకు బాగుండవు ?"
       "ఓహో !అదా నీ ధైర్యం ?ఒకవేళ రాకపోతే ?వచ్చినా అవి నీకు సరిపడకపోతే  !అప్పుడెలా ?"
         "రుచికరంగా పెట్టే  ఇల్లు చూసుకుని వాళ్ళ ఇళ్లకే వెళ్తే సరిపోలా ?"
         "సరే !మరి నువ్వు యువకుడివి గదా సహజంగా వచ్చే కోరికలు వస్తుంటాయా ?"
          " ఆ వస్తుంటాయి --వాటిని నెట్టేస్తూ ఉంటాను ,మనకు కావలసింది భగవత్సాక్షాత్కారం గదా సార్ !"
           "పూజ్యశ్రీ మాస్టర్ గారు హాస్యంగా  నవ్వుతూ ,"ఏంటోయ్ !మనకు అంటున్నావ్ !నేనేమి సన్యసించలేదు  ,నేను పెళ్లి చేసుకున్నాను ,మరి నీకు పాంటు ,షర్టు  ఎందుకు వేసుకున్నావు ?గడ్డం శుభ్రంగా షేవ్ చేసుకున్నావెందుకు ?"
           "యివన్నీ  ఇక్కడ సార్ !అక్కడకి వెళ్ళాక అవన్నీ ఎలాగో తప్పవు గదా !"
           "అంటే అక్కడ కాషాయం ధరించి ,జడలు ,గడ్డము  పెంచుకుంటావా !లేక తల గొరిగించు కుంటావా ?"
           "అసలలా ఉండడం అవసరమా ?మామూలు పంచె లేక లుంగీ ,బనీను వేసుకుంటే  చాలదా సార్ !గడ్డము  ,జడలు ఉంటె చికాకుగా ఉంది తపస్సుకు అంతరాయం కలుగుతుంది గదా ! అందుకని అవి వద్దనే అనుకుంటున్నాను సార్ !"
      అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారికి అతని అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది ,ఆయన చిన్నగా నవ్వుతూనే అతనితో ,"సరే బాగుందోయ్ ! కానీ ఈ మధ్య  ఏ పుస్తకాలు  చదివావు ? అసలు నువ్వీ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ?"
   "చదివాను సార్ ! రామకృష్ణ పరమహంస చరిత్ర చదివాను ,ఆయన శిష్యులు చాలా మంది సన్యాసం తీసుకుని గొప్ప వాళ్లై  నారట సార్ !"
     ఓహో !గొప్ప వాళ్లై నారా !వివేకానంద చరిత్ర చదివావా ?"
     "ఓ  !చదివాను సార్ !అప్పటినుంచే నాకు ఊపు వచ్చింది ,ఆయనలాగా అవ్వాలని ఉంది ,ఇంకా కొన్ని చదివాను ,అందుకే అన్నీ వదిలేసి  ధ్యానం చేసుకోవాలని ఉంది . " ....................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #26 on: March 14, 2013, 01:06:31 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||11 . అఖండ మండలాకారం వ్యాప్తంయేన  చరాచరమ్ |
              తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ||

                              "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

.................. "ఓహో అదా సంగతి !పురాణ వైరాగ్యము ,ప్రసూతి  వైరాగ్యము ,స్మశాన వైరాగ్యము అని ఉంటాయోయ్ !అందులో మొదటిది నీదన్న మాట !"
             "అంటే ఏంటి సార్ !"
             "ఏమి లేదు ,ఏవైనా మంచి  చదివినప్పుడు మనమూ అలా ఉండాలని అనిపిస్తుంది ,దానిని పురాణ వైరాగ్యము అంటారు ,ఇంతకూ నా దగ్గరకు ఎందుకు వచ్చావు ?"
          "ఏమిలేదు సార్ !నేను వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు  ,నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు ,అదేమంటే తిట్టిపోస్తున్నారు ,అందుకే మీకు చెప్పుకోవాలని వచ్చాను ,వాళ్లకు మీరెట్లాగైనా  చెప్పాలి సార్ !"
    "సరే !వాళ్లకు నేను చెప్తాను గానీ మరి నేను చెప్పేది నువ్వు వింటావా ?"
      "తప్పకుండా వింటాను సార్ !అందుకేగా నేను వచ్చింది "
       "ఒకవేళ నేను గూడా వద్దని చెబితే !"
       "అది మాత్రం ఒప్పుకోను సార్ !"
       " సరే !ఒప్పుకోవద్దు గానీ ,నేను చెప్పేది సాంతం విను "
         "సరే సార్ !"
        "నువ్వు వివేకానంద చరిత్ర  చదివావు గదా !మరి ఆయన మొదట ఎం చేసాడు ?"
      "రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళాడు "
      "మరి నువ్వో ?"
       "ఇంకా వెళ్ళలేదు సార్ !"
      "అంటే మొదట ఒక మహాత్ముని దగ్గరకు వెళ్ళాలన్న మాట !అవునా ?"
      "అవును "
      "తర్వాత ఆయన సేవ చేసుకున్నాడు ,నువ్వు గూడా అలానే చెయ్యాలన్నమాట !అంతే  గాదు ,అంతకు ముందే ఇంట్లోనే  వివేకానందుడు చాలా సాధన చేసాడు ,అది చదివావు గదా !మరి అలాగే కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి  సాధన  చేయాలి ,తర్వాత అటువంటి మహాత్ముడు గురువుగా లభించాలని ప్రతి రోజూ ప్రార్ధన చేసుకుంటూ ఉండాలి ".
    "మరి అప్పటి దాక ఎక్కడికీ  వెళ్ళ కూడదా "
    "వెళ్ళకూడదనే పెద్దలు చెప్పారోయ్ "
    "అలా వెళితే ఏం సార్ !"
     "వెళ్తే ఏమవుతుందంటే -నువ్వు ఇంట్లో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నావు  గనుక అవన్నీ లేకుండా ఉండడం  చాలా కష్టమౌతుంది ,సరైన ఆహారం దొరకక ,దొరికినా శరీరానికి సరిపడక  అనారోగ్యం రావచ్చు ,అప్పటి జీవితం మనం ఊహించినట్లు ఉండదు ,కొందరు దొంగ సన్యాసి అని తలచవచ్చు ,తిట్టవచ్చు ,కొట్టవచ్చు ,పెట్టకనూ పోవచ్చు ,అల్లరి  మూకలు అల్లరి  చేయవచ్చు ,ఇవన్నీ చూసి నీకు భయ మెయ్య వచ్చు ,ఇవన్నీ వద్దులే అని అప్పుడు నీ కనిపించవచ్చు ,కోరికలన్నీ నెట్టి వేసుకుంటున్నావు  గానీ వాటి మీద వ్యామోహం పోలేదు గనుక అవన్నీ కావాలని మళ్ళీ అనిపించవచ్చు ,ఇలా తొందరపడి ఆవేశంలో సన్యసించి ఆ తర్వాత ఇబ్బందులను  ఎదుర్కోలేక ,అలాగని ఇంటికి తిరిగి రావడానికి ఆత్మాభిమానం అడ్డ  మొచ్చి తిరిగి రాలేక ,రెండింటికీ చెడ్డ రేవడులై భ్రష్ట సన్యాసులుగా చాలా మంది తిరుగుతుంటారు ,వాళ్ళు నిజమైన సన్యాసులుగా ఉండి  భగవధ్యాసలో ఉండనూ లేరు ,ఇటు సన్యాసం త్యజించి హాయిగా ఉండనూ లేరు ,కోరికలను అణచు కోలేక చాటుమాటుగా తప్పుడు పనులు చేస్తూ వాటిని వేష భాషలతో కప్పి పుచ్చు కుంటూ  భ్రష్టు లౌతారు "...................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #27 on: March 15, 2013, 09:19:14 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||12 . స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
             తత్పదం  దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ||

                          ................... "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

"అయితే నన్నేం చేయమంటారు సార్ !"
 "ఇప్పుడు హాయిగా ఇంటికి వెళ్ళు ,నీవనుకున్నట్లు అవడానికి మంచి ఉపాయం  ఉంది ,ప్రతిరోజూ నియమంగా జపము ,ద్యానమూ చేసుకో ,సద్గురువు లభించాలని 'శ్రీ గురు చరిత్ర 'ను ఆర్తితో పారాయణ చేయి ,శ్రీ సాయి లీలామృతము నిదానంగా చదువుతూ ఆయన చెప్పిన వాటిని గూర్చి  ఆలోచిస్తుంటే అసలు ఆధ్యాత్మికత  అంటే ఏమిటో ,సాధన అంటే ఎలా చేయాలో ,మహాత్ములంటే ఎలా ఉంటారో తెలుస్తుంది ,ఆర్తితో  నిష్టగా పారాయాణ  చేయడం వల్ల  నీకు సద్గురువు  లభిస్తారు ,అప్పుడాయన  చెప్పినట్లు చేయవచ్చు ,ఆయన సేవలో  ఉండవచ్చు ,అప్పుడు తేలికగా  భగవత్సాక్షాత్కారం  అవుతుంది ,ఇలా ఎక్కడికీ వెళ్లనక్కరలేదు ,అవసరమైతే  వారే ఫలానా చోటికి వెళ్లి తపస్సు చేసుకోమని ఆదేశిస్తారు ,ఇప్పుడు నేను చెప్పినది అర్ధమైందా ?"
   "అర్ధమైంది సార్   ! అలాగే చేస్తాను ,నాకింత వివరం తెలియదు "
    "అందుకే ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకోనిదే దూకరాదు ,తెలిసిందా ?"
    "సరే సార్ !ఒక్క మాట అడగవచ్చా ?మళ్ళీ అప్పుడప్పుడు మిమ్మల్ని  కలుసుకోవచ్చా ?"
    "ఓ !ఎప్పుడైనా రావచ్చోయ్ !శుభం !వెళ్లిరా "
     అతడు అలా ఆదేశం పొందినవాడై పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరించి ఆశీస్షులు  తీసుకుని వెళ్ళిపోయాడు ,ఏ  విషయాన్నైనా సరిగా ఆలోచించక క్షణికావేశంలో ముందడుగు వేసేవాళ్ళు ఎంతమందో !పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఈ ఉత్తమ బోధ ఎంతో మందిని సరియైనా మార్గాన నదిపించగలదని  ఆశిద్దాము . .................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
   


[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #28 on: March 16, 2013, 01:29:00 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||13  . చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం |
              నాదబిందు కళా తీతం  తస్మైశ్రీ గురవేనమః ||

                                     "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

అలాగే ఒకసారి ఒకమ్మాయి పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చుంది ,ఆ అమ్మాయి తరచూ వచ్చే అమ్మాయే ,ఆ రోజు ఏదో బాధగాను ,కోపంగానూ ఉంది ,పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ అమ్మాయిని "ఏమ్మా !బాగున్నావా !"అని అడిగారు ,అందుకా అమ్మాయి "ఆ "అన్నది ,"పారాయణ  చేస్తున్నావా ?" పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రశ్న .
       "చేస్తున్నాను మాస్టారూ !కానీ ఇంక చెయ్య దలచు కోలేదు "
        "ఏం ?ఎందుకని ?"
        "ఎందుకేముంది ?చేసినందు వలన ప్రయోజనమేమీ కన్పించడం లేదు ,ఎన్నాళ్ళు చేసినా ఏ సంబంధమూ కుదరడం లేదు ,ఎవరో రావడము ,వాళ్ళ ముందు నేను బొమ్మలా కూర్చోడము ,వాళ్ళు నన్ను చూడడము ,వెళ్ళడము  -ఇదీ తంతు ,అందుకే  ఇంక  సాయి బాబాను పూజించదలచు కోలేదు "
      అందుకాయన నవ్వుతూ "హమ్మయ్యా ! ఆయన నెత్తిన పాలు పోశావ్ !"అన్నారు .
       "అదేంటి మాస్టారూ !"
       "ఏముందీ ,నువ్వు పారాయణ చేసావనుకో ,పూజ చేసావనుకో ,నీకు సంబంధం కుదర్చాల్సిన బాధ్యత  ఆయన కుంటుంది  గదా ! పైగా మంచి సంబంధం కుదర్చాలి ,ఏదో ఒక సంబంధం చూస్తె చాలదు ,నీకు నచ్చిన సంబంధమే  కుదరాలయె ,మరి నువ్వు ఆయనను సేవించడం మానేస్తే ఆ శ్రమ ఆయనకు తగ్గించినట్లే గదా ! ఆయన నెత్తిన పాలు పోసినట్లే గదా !"
     "మరి ఆయనను సేవిస్తుంటే కుదరట్లేదు గదా !ఇంకెందుకు పూజించడం ?"
       "అదే నేను చెబుతున్నా ,పోనీ మానేసేయ్ "
        "నాకు బాబా మీద భలే కోపమొస్తున్నది మాస్టారూ !"
         "అవునమ్మా ? ఆయన మీద కోపం రావడం సహజమే ,మరి ఆయన మీద గాక ఇంకెవరి మీద వస్తుంది ,ఎవరి మీద వస్తే ఎవరూరుకుంటారు గనుక "
           "ఎవరిమీదైనా ఎందుకు రావాలి ?"
            "నువ్వు సినిమాలు చూస్తావా ?"
            "ఆ చూస్తాను "
             "నవలలు చదువుతావా ?"
             "చదువుతాను "
             "మరి పెళ్లి చూపులంటే ఇంకా అందంగా ఉండాలని మేకప్ (ఫేషియల్ )చేయించుకుం టావా ?"
              "అవును "
              "మంచి చీరె కట్టుకోవాలను కుంటావు గదా !"
               "ఒకసారి ఒక చీరె కట్టుకుంటే వచ్చిన వారికి నచ్చలేదేమోనని  ఈసారి అంతకంటే మంచి చీరె కట్టుకుందామని అనుకుంటావు కదా !"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
Re: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« Reply #29 on: March 17, 2013, 08:50:14 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||14 . చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం |
             అసిత్వం దర్శతంయేన  తస్మైశ్రీ గురవేనమః ||

                                     "మహాపురుషుడు --పూజ్య గురు పత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
 "............. "
  "మరి ఇన్ని చేసినా సంబంధాలు కుదరడం లేదు గదా ! మరి వీటి వేటి  మీదా కోపం రావడం లేదా ?మేకప్ చేసుకున్నందు వలన కుదరడం లేదు ,అయినా మేకప్ చేసుకోవడం మానడం లేదు ,నవలలు చదివితే  కుదరడం లేదు ,గనుక  అవి చదవడం మానుకోవచ్చు గదా ! సినిమాల  చూస్తే  కుదరడం లేదు ,సినిమాలు చూడడం మానుకోవచ్చు గదా !పైగా ఇవన్నీ డబ్బు పెట్టి చేసేవే ,అయినా వాటిని మాత్రం వదులుకోలేవు, ఇంకా ఇంకా విసుగు లేకుండా చేస్తూనే ఉంటావు ,మరి పాపం ఆ 'ముసలాయన'(బాబా ) ఏం  ఖర్చు పెట్టించాడని  మానుకుంటావు ,ఆయన చెప్పిన  విషయాలేవీ చెడ్డవి కావు గదా ?సినిమాలు ,నవలలు మన కాలాన్ని హరిస్తాయి ,చెడుకు  దోహదం చేస్తాయి ,ఆలోచించు ,సాయి బాబా  చరిత్ర  చదివినందు వలన  నీకు కలిగిన నష్ట మేమిటి ? పోనీ చదవడం మానేస్తే  వివాహమవుతుందని నీకు నమ్మక ముందా ?గ్యారంటీ ఇవ్వగలవా ?ఉంటె అట్లాగే చెయ్యవచ్చు "
     "లేదు మాస్టారూ !"
     "గ్యారంటీ లేనప్పుడు వాటిని ఎందుకు వదులుకోలేక పోతున్నావు ?వాటి మీద నీకు కోపం రాదు ,ఇంకా ఇంకా చేస్తూనే ఉంటావు అవునా ?
     "మరి ఏం  చేయాలి ?"
     "ఇక్కడ నువ్వు ఒక విషయం ఆలోచించాలి ,అసలు సాయి బాబాకు  మనతో ఏమి సంబంధము ?మనము ఆయనను ఎందుకు సేవిస్తున్నాము ?ఆయనను పూజించినా ,ఆయన చరిత్ర పారాయణ చేసినా ఆయనకు ఒరిగేదేమిటి ?అసలాయన మన కోరికలు ఎందుకు తీర్చాలి ?
    "ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తారు మాస్టారూ !"
     "మరి ఆ సంగతి తెలిసే నువ్వెందుకు కోపగించు కుంటున్నావు ?"
     "ఇంకా తీర్చలేదు గనుక "
     "ఎందుకు తీర్చలేదంటావ్ ?"
     "అదే తెలియదు "
     "అందుకే ముందు అది తెలుసుకోవాలి మనం ,చరిత్ర  చదివేది ఇవన్నీ తెలుసుకోడానికే ,బాగా అర్ధం చేసుకుంటూ చదవాలి ,కోరిక తీరాలని గబా గబా పేజీలు  తిరగేస్తే ఆయన ఏది ఎందుకు చేస్తాడో అర్ధం గాదు .  

అలివేలు మంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]
« Last Edit: March 21, 2013, 10:03:14 AM by Admin_smf »