Author Topic: "Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru  (Read 6305 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
"Mahapurushudu"---Pujya Gurupatni Srimathi Alivelu Mangatayaru
« on: February 18, 2013, 08:53:49 AM »
 జై సాయి మాస్టర్ !
  గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
  అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో ||1 .అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ  గుణాత్మనే |
           సమస్త జగదాధారా  మూర్తయే  బ్రహ్మణే  నమ: ||

       2 .యదంఘ్రి  కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకం |
           తారకం భవసింధోశ్చ  తం గురుం ప్రణమామ్యహం ||
                                          
                             " మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
                                            
                                                    సత్యాన్వేషి ----నిత్యాన్వేషి

                                                         జై సాయి మాస్టర్ !

దేనినైనా తెలుసుకోవడం కోసం ప్రయత్నించేవాడిని ' అన్వేషి ' అంటారు , అందుకు  చేసే  ప్రయత్నాన్ని  'అన్వేషణ ' అంటారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు సత్యాన్వేషి  మాత్రమే  గాదు నిత్యాన్వేషి గూడ, ప్రతి విషయాన్నీ  తెలుసుకోవాలనే  జిజ్ఞాసతో  ఆయన  నిరంతరం  అన్వేషిస్తూ ఉండేవారు , దానిని  తెలుసుకునేవరకూ  వదలి వచ్చేవారుగాదు ,అంతేగాదు  ,ఆయన నిరంతరం   ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేందుకు  అన్వేషణ జరుపుతూనే ఉండేవారు .
                         ఉపనయనం ఎందుకు చేసుకోమని చెప్పారు ?దానిలోని అంతరార్ధమేమిటో తెలుసుకోవాలని ఆయన తాము ఉపనయనం చేసుకోవడానికి అంగీకరించారు ,ఆయన జిజ్ఞాసకు మెచ్చిన భగవంతుడు మొదటిసారిగా ఆయనపై తమ అనుగ్రహాన్ని వర్షింప జేసి సరియైన ఉపదేశాన్ని ప్రసాదించారు .
                          రెండు సంవత్సరాల వయసుగల ఆయన పెద్దన్నగారి  కుమారుడు  సరిగా ఆయన ఉపనయన  క్రతువులో  జరిపే  మంత్రోపదేశ సమయంలో మరణించాడు ,అదే  ఆయనకు మహా మంత్రోపదేశమైంది ,అప్పుడు  పూజ్యశ్రీ  మాస్టర్ గారు  కాలేజీలో  చదువుతూ పెద్దన్నగారైన  శ్రీ కృష్ణమాచారిగారింట్లో  ఉండేవారు ,పసిపిల్ల వాడైన  అన్నగారి  రెండవ  అబ్బాయిని పూజ్యశ్రీ మాస్టర్ గారు  ఎంతగానో  ముద్దు చేసేవారు , ఆడించేవారు ,లాలించేవారు . ఆ పిల్లవాడికి  గూడ  బాబాయి  అంటే ఎంతో ఇష్టం , తమకు అత్యంత ప్రీతి  పాత్రుడైన  ఆ పిల్లవాని మరణంతో  పూజ్యశ్రీ మాస్టర్ గారి  హృదయానికి  తీవ్ర ఘాతం తగిలింది , ఇది ఆయన జీవితంలో  తగిలిన రెండవ దెబ్బ ,పసితనంలోనే  మాతృశ్రీ  మరణంతో  తగిలిన హృదయఘాతాన్ని  తట్టుకోవడానికి  చాలా సం ||లు  పట్టింది . అయినా దానికి తోడూ  అలాంటిదే  మరొక దెబ్బ ,దెబ్బ మీద దెబ్బ  తగలడంతో ఆ వేదనకు  అంతు  లేకుండా పోయింది .అందులోంచే --మానవులను  ఇంత వ్యధను  కలిగించే  ఈ మరణాన్ని  జయించలేమా ? అన్న ప్రశ్న  ఉదయించింది ,అయితే ఈ మృత్యువును  జయించలేక పోతున్న కారణమేమిటి ? తెలుసుకోవాలన్న  జిజ్ఞాస కలిగింది .అంతటితో  అన్వేషణ ప్రారంభమైంది ..........................


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

   [/13size]
« Last Edit: March 21, 2013, 10:02:06 AM by Admin_smf »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #1 on: February 19, 2013, 09:05:48 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో ||3. సర్వ తీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః |
           గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి  ధారయన్ ||

        4. అజ్ఞాన మూల హరణం జ్జన్మ కర్మ నివారకమ్ |
            జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం  గురో: పాదోదకం పిబేత్ ||  

                          "  మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

........అసలు మరణ మంటే ఏమిటి ?జననమంటే ఏమిటి ?జన్మించిన ప్రతి జీవి మరణించ తీరవలసినదేనా ?అలా నిర్దేశించినది ఎవరు ?ఎవరైనా ఉంటే  అట్టివారి ప్రణాళిక ఏమిటి ?మరణించిన తర్వాత ఏమవుతారు ?మళ్ళీ జన్మనెత్త వలసి  ఉంటుందని  చెబుతున్నారు గదా !మరి మళ్ళీ ఎవరు ఎక్కడ జన్మిస్తారు ?మళ్ళీ ఈ జన్మ సంబంధాలతోనే పుడతారా ?ఒకవేళ అలా జరిగితే మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు క్రిందటి జన్మలోని సంబంధాల తోనే  పుడతారా ? ఒకవేళ అలా జరిగితే  మళ్ళీ  జన్మ   ఎత్తినప్పుడు  క్రిందటి జన్మలోని   సంబంధాలు ఎందుకు గుర్తు ఉండడం లేదు ?అసలు ఈ జన్మలోనుంచి మరొక జన్మలోకి  వెళ్ళేది ఏమిటి ?జీవుడు అయితే ఎలా ఉంటాడు ?మళ్ళీ మరొక  గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు ?ఏ  జీవికి ఆ జీవి స్వతంత్రుడా ?స్వతంత్రుడైతే  తనకు  కావలసిన  జన్మను ఎత్తగలడు  గదా ! అలాగే జరుగుతున్నదా ,జరగడం లేదా ,క్రిందటి జన్మల సంబంధాలలోనే ఒకవేళ కొనసాగితే  అలాగే జరిగిందని  అనుకోవడమెలా ?దీనికంతటికీ కర్త ఎవరైనా ఉన్నాడా ?ఉంటే  ఎక్కడ ఎలా ఉండి  నడిపిస్తున్నాడు ?అసలు మరణ మంటే ఏమిటో తెలుసుకుంటే గాని జననమంటే ఏమిటో తెలుసుకోవడానికి వీలులేదేమో !
        ఈ సృష్టి అంటే ఏమిటి ?పరిమితమైనదా ?అపరిమితమైనదా ,ఇది ఎంత కాలం ఇలా కొనసాగుతుంది ?దీనికి అంతము ఎప్పుడు ? అసలు కాలమంటే ఏమిటి ? కాల స్వరూపమేమిటి ?ఈ సృష్టికీ  నడిపించేవాడు భగవంతుడే అయితే అతడు ఎలా ఉంటాడు ? ,సాకారుడా? నిరకారుడా ?సాకారుడైతే  అతని ఆకారమేమిటి ? నిరాకారుడైతే  గుర్తు పట్టేదేలా  ? భగవంతుడు  ఒక్కడే అయితే ఈ దేవతలందరూ ఎవరు ? ఈ దేవతల  తత్త్వమేమిటి ?పూజించడ మంటే ఏమిటి ? భగవంతుడు కోరికలు  తీరుస్తాడంటున్నారు  గదా ! ఆయన కోరికలు ఎలా  తీరుస్తాడు ?మరి మృత్యువు వద్దనే కోరికను  ఎందుకు  తీర్చడం లేదు ? దీనిలోని అంతరార్ధ మేమిటి ?
          ఇలా తెంపులేని ఆలోచనలు ! అసంఖ్యాకములైన  ప్రశ్నలు ?! సమాధానాల కోసం అన్వేషణ ,తపన ! ఆయన అన్వేషణ  కేవలం  ఆలోచనలకే పరిమితం  కాలేదు ,ఈ సృష్టి ఏమిటి ?ఈ పదార్ధం ఏమిటి ?ప్రాణం అంటే ఏమిటి ,ఆలోచనలు కలిగించే  మనస్సు తత్త్వమేమిటి ?ఇదంతా అనుభవిస్తున్నది ఎవరు ..........................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #2 on: February 20, 2013, 08:50:30 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి  గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||5 .కాశీక్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం  |
          గురుర్విశ్వేశ్వర సాక్షాత్తారకం  బ్రహ్మనిశ్చయః ||

     6 .గుకారః  ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః |
         రుకారోస్తి పరం  బ్రహ్మ మాయాభ్రాంతి  విమోచకం ||

                        "  మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

...................ఇలా ప్రశ్నల పరంపర కలుగుతూ ఉంటే  ఆయన అందరిలాగా "మనకెందుకులే " అనుకోలేదు ,ఎవరో పెద్దలో ,లేక పుస్తకాలో చదివి వాటిలోని విషయాలను గుడ్డిగా నమ్మలేదు ,అన్నిటినీ తన స్వయంకృషితో  గమనించ నారంభించారు ,ప్రాణులు ,వస్తువులు ,భావాలు ,అనుభవాలు సమాజాలు ,ఆరోగ్యము ,నెప్పి ,ఇష్టాఇష్టాలు  ,సాంఘిక పరిస్ధితులు ,ఇలా అన్నిటినీ తీవ్రంగా గమనించేవారు , తనలో తానూ వీటన్నిటినీ  నిష్కర్షగా  ప్రశ్నించేవారు ,తమ  ప్రజ్ఞను ,ఆలోచనా శక్తిని ,విషయగ్రహణ  శక్తిని ,పరిశీలనా శక్తిని మరింత  పెంపొందించు కునే ప్రయత్నం చేసేవారు ,ఈ సృష్టి ఎలా నడుస్తుందో  తన శరీరం ఎందుకు ఎలా పనిచేస్తోందో ,మనస్సు ఎలా పనిచేస్తోందో ఎంతో నిశితంగా గమనించేవారు ,అలా గమనించడానికి వీలుగా పరిస్ధితులను  ఏర్పరచుకునేవారు , నిద్ర ,స్వప్నము  మొదలైన  విషయాలను సైతం ఆయన విడువలేదు ,ఇతర జీవులలో ప్రాణశక్తి  ఎలా పనిజేస్తున్నదో గమనించేవారు ,వాటి అనుభవం ,సృష్టిని ఆ జీవులు దర్శించే విధానం ఎలా ఉంటుందో అంచనా వేసేవారు ,ఇలా వారు గడిపిన నిరంతర కృషి కొన్ని సంవత్సరాల పాటు తదేకంగా  సాగింది ,అది తీవ్రమైన ,సంకీర్ణమైన  అన్వేషణ , అదొక మహా సత్య శోధన ,ఒక యజ్ఞం  ఒక ప్రశస్ధమైన  సాధన .
     పూజ్యశ్రీ మాస్టర్ గారిలో ఈ విధమైన అంతర్మధనం జరుగుతుండగా ఆయన ఒకరోజు ఒంగోలులో  ఊరి బయటకు  వ్యాహ్యాళికి  వెళ్ళారు ,త్రోవలో ఆయన తలలో  పెద్ద శబ్దమైంది ,వెంటనే  మనస్సు ప్రశాంత మైంది ! ఆ మనస్సులో ఎట్టి  ఆలోచనలూ  లేవు !సందేహాలు లేవు !అసలు ప్రశ్నలే  లేవు !శాంతి ! శాంతి ! అంతులేని ప్రశాంతి !!
   "అంతటితో ప్రధానమైన  నా ప్రశ్న  అప్రస్తుతమనిపించింది " అని ఆయనే శ్రీ సాయి లీలామృతంలో  వ్రాశారు ;
   అంతటితో  ఆయన అన్వేషణ ఆగలేదు , ఈ సృష్టి గురించి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకోవడానికి ఆయన  వైజ్ఞానిక  గ్రంధాలనెన్నింటినో చదివారు , ఆయా గ్రంధాలలో  విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు ,తాము స్వయంగా ఆలోచించి  తెలుసుకున్న విషయాలకు  సరిగ్గా సరిపోవడంతో  ఆయన ఆలోచనలు సరియైన వేనన్న   విశ్వాసం  కలిగింది ,అంతేగాక ఎవరైనా సరే ,నిజమైన జిజ్ఞాసతో ఆలోచిస్తేను  ,అన్వేషిస్తేను  వారికి గూడా ఒకే విధమైన విషయాలు అవగతమవుతాయని తెలుసుకున్నారు , కారణం  సత్యం (ఉన్నది )ఒకటే అయినప్పుడు  ఒకే మానసిక స్ధాయి కలిగిన ఎవరికైనా  ఆయా విషయాలు అదే విధంగా అవగత మయి తీరాలి  గనుక ................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #3 on: February 21, 2013, 09:45:08 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో ||7 .కర్మణా మనసావాచా సర్వదారాధ యేద్గురుం |
          దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురు సన్నిధౌ ||
 
       8 .శరీరమింద్రియం  ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ |
            ఆత్మదారాధికం  సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

                             "మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
           
................. ఆ తర్వాత సం ||1963 లో భగవంతుని మీద ,మహాత్మ్ముల మీద తమకెట్టి విశ్వాసమూ లేకపోయినప్పటికీ రెండవ అన్నగారు సాయి దర్శనానికి షిరిడీ వెళ్తూ పూజ్యశ్రీ మాస్టర్ గారిని రమ్మని బలవంతం చేయడంతో ఆయనకు తోడుగా మాత్రమే శిరిడీ  వెళ్ళారు ,ఆ ప్రధమ దర్శనంలోనే సమర్ధ సద్గురుడైన  శ్రీ శిరిడీ  సాయినాధుడు  ఆయనకు ఈ విశ్వానికి మూలమైన ,ఆధారమైన ,నిత్య సత్యమైన  ,ఆత్మానుభూతిని ప్రసాదించారు ,ఆ అనుభవంలో ఆయనకు ఈ సృష్టి తత్త్వమేమిటో   అర్ధమైపోయింది .ఈ సృష్టికి  మూలమైన పరమాత్మను చేరుకోవడమే  మానవజీవిత పరమార్ధమని ఆయనకు అవగత మైంది ,అందుకు  మార్గం చూపగల సద్గురువు  యొక్క ఆవశ్యకత ఎంతగానో అవసరమని ,సద్గురువును ఆశ్రయిస్తే  ఆయన గమ్యాన్ని చేరగలడని ,గమ్యం గూడ  అట్టి సద్గురువేననీ  ఆయన గ్రహించారు .
           అప్పటినుంచీ ఆయన అన్వేషణ మరో మలుపు తిరిగింది ,సద్గురువైన  సాయినాధుని గూర్చి  తెలుసుకునేందుకు  ఆయన నిరంతరం  అన్వేషణ ప్రారభించారు ,ఆయన గూర్చి కనిపించిన వారినల్లా  అడిగారు , భుజాన ఒక సంచీ మాత్రమే   తగిలించుకుని   ఆయన గూర్చిన  వివరాల కోసం  ఊరూరా  తిరిగారు ,ఆయనను  చూసినవారి వద్దకు వెళ్లి ఆయన గూర్చిన  చిన్న వివరాన్ని సైతం విడువక  వారి నుంచి సాయిని  గూర్చి తెలుసుకున్నారు .
         అంతేగాక శ్రీ సాయిబాబా మీద ప్రచురింపబడిన  గ్రంధాలను  పఠించారు ,"శ్రీ సాయి లీలా మాసపత్రిక (మరాఠీ )"లోని   ప్రచురణలను  అన్నింటినీ చదివారు , మరాఠీ  ,ఇంకా ఇతర భాషలలో  ఉన్న సాయి గూర్చిన గ్రంధాలలోని  విషయాలను   చదివించుకుని  విన్నారు ,ఎంతో మంది  సాయిని ప్రత్యక్షంగా  దర్శించిన వారి అనుభవాలు ,సమాధి చెందిన తర్వాత   శ్రీ సాయి ఎందరికో ప్రసాదించిన అనుభవాలను సేకరించారు ,వాటి నన్నింటినీ  అద్భుతమైన కూర్పుతో గ్రంధస్ధం చేసారు .
             అప్పుడాయనకు భగవంతుడు ఒకడే అయితే భగవంతుడి  గూర్చి తెలిపే వివిధ మతాలు ఎందుకేర్పడ్డాయి ? అనే ప్రశ్న ఉదయించింది ,ఆయా మతాలలో  ఏమేమి చెప్పారో తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు ,వివిధ మతాల గ్రంధాలు చదివారు ,ఉన్నది ఒకే భగవంతుడని ,ఆయనను బట్టీ వివిధ మతాలు ఉద్భవించాయనీ  తెలుసుకున్నారు ................................


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని [/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #4 on: February 22, 2013, 09:20:27 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||9 .గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు  శివాత్మకం |
           గురో:  పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ||

      10 .గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః  |
             గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ  గురవేనమః  ||

                                     "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి  అలివేలు మంగతాయారు "

...................ఆయా మతాలలో చెప్పిన బోధనలననుసరించి  సాధన చేసిన ఆయా మతాలలోని  పరిపూర్ణులైన  మహాత్ముల  చరిత్రలు చదివారు ,వారందరూ తెలుసుకున్న సత్యం ఒక్కటేనని ఆయన గ్రహించారు
                         అసలు నిజమైన ఆధ్త్యాత్మికత  అంటే ఏమిటి ?అటువంటి ఆధ్యాత్మికత  సాధించడానికి  కావలసిన  ముఖ్యమైన  అంశాలేమిటి ?మనస్సు యొక్క  తత్త్వమేమిటి ?మనస్సును  జయించడమెలా ?నిజమైన ఆధ్యాత్మిక వేత్త  ఎలా ఉంటాడు ?నిజమైన  భక్తుడు  ఎలా ఉంటాడు ?నిజమైన యోగి ఎలా ఉంటాడు ?సిద్ధుడు ఎలా ఉంటాడు ?దొంగ నకిలీ ఆధ్యాత్మికతలను  గుర్తుపట్టేదెలా ? మొ ||న  విషయాల గురించి  ఎన్నో గ్రంధాలు చదివి ,పరిశోధించి తెలుసుకున్నారు .
                  అంతటితో ఆయన అన్వేషణ పూర్తి  కాలేదు , విజ్ఞాన  శాస్త్రం చెప్పే సృష్టి తత్త్వాన్ని ,ఆధ్యాత్మికత  చెప్పే సృష్టి  తత్త్వానికీ  సంబంధమేమైనా  ఉన్నదా ? ఈ రెండిటికీ సమన్వయం  కుదురుతుందా ?లేకపోతె ఎక్కడ విభేదించింది ?మొ||న  విషయాలను  పరిశోధించి  వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మికతకు  సమన్వయం  ఉందని తెలుసుకున్నారు .
              ఇంకా ఆయన అన్వేషణ ఇలా కొనసాగింది --
     ఆధ్యాత్మికతకు  ,లౌకిక జీవితానికీ ఏమైనా సంబంధమున్నదా ?లౌకిక జీవితం సుఖ శాంతులతో  ఉండడానికి ఆధ్యాత్మికతః  ఎలా పనికి వస్తుంది ?సమాజానికి ఆధ్యాత్మికత ఎలా ఉపయోగ పడుతుంది ?అసలు ఈ సమాజం ఎందుకు ఇలా ఉన్నది ?సరిగా ఉండడానికి చేయవలసినదేమిటి ?
                 ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అన్వేషించని అంశం లేదు ,పరిష్కారం కనుగొనని సమస్యా లేదు ,ప్రతి విషయాన్నీ  నిశితంగా ,నిర్దుష్టంగా ,నిష్కర్షగా ,సంపూర్ణంగా అన్వేషించి పరిశోధించి పరిష్కారాలు  కనుగొన్నారు ......

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


 
           [/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #5 on: February 23, 2013, 10:58:45 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||11.  అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్ |
             తత్పదం దర్శితం  ఏన తస్మైశ్రీ గురవేనమః ||

       12.స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ |
             తత్పదం దర్శితం  యేన తస్మైశ్రీ గురవేనమః ||

                              "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
         
ఆయన పరిశోధించిన అంశాలలో మచ్చుకు కొన్ని :

  కుటుంబ సమైక్యత ,దేశ సమైక్యత ,ప్రపంచ సమైక్యత .

వివిధ మత సమైక్యత (సమ సమాజ నిర్మాణము )

పిల్లల్ల పెంపకము ,ఆరోగ్యము .

యువకుల సమస్యలు ,వ్యక్తిత్త్వ నిర్మాణము .

గృహస్దుల ధర్మము ,నిర్వహణ ,విధులు .

వృద్ధుల కర్తవ్యము .

విద్య

కళలు

           రాజకీయాలు ,నాయకులు ,రాజ్యపాలన ,నిజమైన  ఆధ్యాత్మికతను పెంపొందించుట ,నకిలీ ఆధ్యాత్మికతను నశింప జేయుట  ---మానవాళికి సుఖశాంతులు  కలుగజేయ గలందులకు లౌకికంగాను ,పారమార్ధికంగానూ  ఇంకా ఇంకా ఏమి చేయాలి ?అని ఆయన జీవితాంతమూ ఆలోచిస్తూనే ఉన్నారు ,ప్రయత్నిస్తూనే ఉన్నారు ,పరిశోధిస్తూనే  ఉన్నారు ,ప్రబోధిస్తూనే  ఉన్నారు .

                                                 అందుకే ఆయన సత్యాన్వేషి ,నిత్యాన్వేషి
                                                               జై సాయి మాస్టర్ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #6 on: February 24, 2013, 10:28:39 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||13 .చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం |
            నాదబిందు కళాతీతం  తస్మైశ్రీ గురవేనమః ||

       14 .చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం |
             అసిత్వం దర్శతం యేన  తస్మైశ్రీ గురవేనమః ||
                     
                                     "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
                                                   
                                                              మహాత్ములసందర్శనము 
       
            పూజ్యశ్రీ మాస్టర్ గారు శిరిడీ దర్శించి సద్గురు శ్రీ సాయినాధుని అనుగ్రహం పొందినప్పటినుంచి  ఆయనను సశరీరులుగా చూడలేకపోయానని చుస్తే బాగుండేదని  అనిపించసాగింది . అందుకని అటువంటి పరిపూర్ణులైన సశరీరులైన  మహాత్ముల దర్శనమైనా ప్రసాదించ వలసినదని  శ్రీ సాయినాధుని  ఆయన ప్రార్ధించారు ,శ్రీ సాయినాధుని అనుగ్రహం వల్ల  ఆయనకు ఎందఱో మహాత్ములను దర్స్షించే భాగ్యం లభించింది .
      ఆయన ఏ  మహాత్ముల దగ్గరకు వెళ్ళినా ప్రధమంగా వారి పాదాలకు నమస్కారం చేసుకునేవారు ,వారి వద్ద భక్తి  ప్రపత్తులతోను   ,వినయ విధేయతలతోనూ  మెలిగేవారు .తానొక భక్తుడనని  గానీ ,సాధకుడనని గానీ ,శ్రీ సాయిబాబా తమకు  అంతటి దివ్యానుభవాన్ని  ప్రసాదించారని  గానీ ఆయన గర్వపడడం గానీ ,గొప్పగా చెప్పుకోవడం  గానీ చేసేవారు గారు ,కనీసం తానూ సాయి భక్తుడనని  కూడా చెప్పుకునేవారు గాదు ,ఒక సాధారణ మైన వ్యక్తి  లాగానే వారి వద్ద  ప్రవర్తించేవారు ,వారి యొక్క (ఆ మహాత్ముల యొక్క ) దివ్య సన్నిధిని సాధ్యమైనంత అనుభవించడానికి  ప్రయత్నించేవారు , వారు ఇతరులతో  మాట్లాడే మాటలు శ్రద్ధగా వింటూ ,వాటిలోని పరమార్ధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు ,అవసరమనుకున్నప్పుడు  పరిప్రశ్న  చేసేవారు ,ఆ  మహాత్ములు చెప్పే సమాధానాలలో  తమకేదై నా సందేహాలుంటే తిరిగి తిరిగి తెలుసుకునేవారు  ,ఎవ్వరూ మాట్లాడని  సమయంలో మౌనంగా కూర్చునేవారు .
                       చాలా తక్కువగా మాట్లాడుతూ ,ఎక్కువగా మౌనంగా ఉండే అవధూతల దగ్గర  ఆయన గూడా మౌనంగా వారిని చూస్తూ వారి చర్యలను గమనిస్తూ ధ్యానం చేసుకుంటూ ,అవసరమైన సేవ చేస్తూ ఉండేవారు .
          ఆయన మహాత్ముల దర్శనం కోసం ఎంతో ఆతృత  ,తపన పడేవారు ,మహాత్ములు ,అవధూతలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని  వెంటనే వారి దర్శనార్ధం వెళ్ళేవారు ,వారి దర్శనం కోసం  ఆయనకుండే  ఆరాటంలో ఎన్ని ఇబ్బందులు  ఎదురైనా ఆయనకు పట్టేది గాదు ,ఒక్కొక్కచోట ఆయనకు భోజన వసతి ఉండేది గాదు ,ఒక్కొక్కప్పుడు  ఆయనకు ఇతర  కనీస సౌకర్యాలకు గూడ  ఇబ్బంది పడవలసి వచ్చేది .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !!జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #7 on: February 25, 2013, 11:19:59 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||15 .సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా |
            సంసార మొహనాశాయ తస్మైశ్రీ గురవేనమః

      16 .యత్సత్వేన  జగత్సత్యం  యత్ప్రకాశేన  భాతియత్ |
            యదానందేన  నందంతి తస్మైశ్రీ గురవేనమః ||

                             "మహాపురుషుడు ----పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "
 
              ........ ఆయన ఎప్పుడూ  గూడ  మహాత్ముల దర్శనానికి  వెళ్ళడానికి ముందుగా అనుకోవడమూ ,రిజర్వేషన్ లాంటివి  చేయించుకోవడమూ  చేసేవారు  గాదు ,సెలవలు  వచ్చాయంటే  అప్పటికప్పుడు  ఎక్కడకు వెళ్లాలని  బుద్ధి  పుడితే  అక్కడకు  ఉన్న పళంగా  ఒక చిన్న సంచీలో  ఒక జత బట్టలు  పెట్టుకొని బయల్దేరేవారు ,అలాగే ఒకసారి ఆయన చేసిన ప్రయాణంలో  టికెట్టు  దొరికింది  గాని రైలులో నిలబడడానికి గూడా స్ధలం  లేకుండా తలుపు దగ్గర కడ్డీ  పట్టుకుని చివరగా  నిలబడ్డారు ,అర్ధరాత్రి  అయింది ,సాయంత్రం నుంచీ నిలబడడంతో  కాళ్ళు లాగేస్తున్నాయి ,అంతకు ముందు రెండు ,మూడు రోజులుగా  నిద్ర లేకపోవడంతో నిద్ర ముంచుకొస్తున్నది ,రైలు వాకిలి కడ్డీని పట్టుకున్న ఆయన చేతులు  రెండు ,మూడు సార్లు నిద్ర వాళ్ళ పట్టు తప్పాయి ,ఇక ఇలా లాభం లేదనుకొని  ఆయన తన దగ్గరున్న టవల్ తో తన నడుముకు ,రైలు పెట్టె చువ్వకు (కడ్డీకి ) కలిపి గట్టిగా బిగించి  కట్టుకుని అలాగే తెల్లవార్లూ ప్రయాణం చేశారు .
                 ఆయన అలాగే నైమిశారణ్యానికి  ఆనందమాయి  దర్శనానికై  వెళ్ళారు ,అక్కడ ఎటువంటి  వసతి లభించలేదు  ,తినడానికి ఆహారము  ఏమీ దొరకక ,గడ్డ కట్టే చలిలో రాత్రంతా  ఒక చెట్టు క్రింద  కూర్చొని  గడపవలసి వచ్చింది ,అందువలన  ఆయనకు తీవ్రంగా జలుబు ,జ్వరమూ గూడ వచ్చాయి ,కానీ ఆయనకు అవేవీ పట్టలేదు .
                      అలాగే ఒకసారి  ఎవరో మహాత్ముని ఆచూకి తెలిసి ప్రయాణ మయ్యారు  పూజ్యశ్రీ మాస్టర్ గారు ,ఆ రోజు మధ్యాహ్నం  నాలుగు గంటల  ప్రాంతంలో ఒక పల్లెటూరు  దగ్గర ఆయన ప్రయాణిస్తున్న  బస్సు ఆగిపోయింది ,పూజ్యశ్రీ  మాస్టర్ గారు  రాత్రి నుంచీ  ఏమీ తినలేదు ,విపరీతంగా  ఆకలిగా ఉన్నది ,విచారించగా ఆ ఊరిలో ఒక చిన్న హోటలు  ఉన్నదని  తెలిసింది ,వెళ్లి భోజనము అడిగితే   హోటలు యజమాని భోజనం అయిపోయిందని  చెప్పాడు ,పోనీ ఏదైనా  ఉపాహారం (టిఫెను )ఉంటె పెట్టమంటే  అది గూడా అయిపోయిందని  తాను కడుగుతున్న  ఖాళీ గిన్నెలు చూపించాడు  ,చిరు తిండ్లు ఏమైనా  ఉన్నాయా అని అడిగారు పూజ్యశ్రీ మాస్టర్ గారు .అందుకతడు క్రిందటి రోజు చేసిన గారెలు ఉన్నాయన్నాడు ,అవే  తీసుకు రమ్మంటే అతడు వాటిని పెట్టాడు ,తీరా చూస్తే  అవి పాడైపోయి వాసన కొడుతున్నాయి ,పూజ్యశ్రీ మాస్టర్ గారు  ఆ రోజు అదే భగవంతుడు ఇచ్చిన ప్రసాదమని  భావించి తినేసారు .ఆయన జీవితంలో  ఇలాంటి సంఘటనలు ఎన్నో ......

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #8 on: February 26, 2013, 08:47:21 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె  వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||17 .యస్మిన్  స్దితమిదం సర్వం భాతియద్భానరూపతః |
             యత్ప్రీత్యాప్రియం  పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

       18||ఏ  నేదం దర్శితం తత్త్వం చిత్త  చైత్యాదికం తదా |
             జాగ్రత్స్వప్న  సుషుప్త్యాది  తస్మైశ్రీ గురవేనమః ||

                           "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

              పూజ్యశ్రీ మాస్టర్ గారు సెలవులలో ఎక్కడకు వెళ్ళినా  తమ దగ్గర ఉన్న పైకమంతా తీసుకుని వెళ్ళేవారు ,తిరుగు  చార్జీలకు మాత్రమే   ఉంచుకొని మిగిలినదంతా  ఖర్చు పెట్టేవారు ,ఒకసారి అలాగే తిరుగు ప్రయాణానికి  టికెట్టు కొనుక్కొని రైలెక్కారు ,అది తిరుపతి వెళ్ళే రైలు ,ఆయన గూడూరులో దిగాలి .రాత్రి  చాలా సేపు చదువుకుంటూ ఉండి  తర్వాత పడుకున్నారు ,మంచి నిద్ర  పట్టి గూడూరు స్టేషన్ లో  ఆయనకు మెలుకువ రాలేదు ,రైలు తిరుపతి లో  ఆగింది , ఆయన నిద్రపోతూనే ఉన్నారు ,అందరూ దిగిపోయారు ,చివరకు రైలు  శుభ్రం  చేసేవాడు వచ్చి  పూజ్యశ్రీ మాస్టర్ గారిని నిద్రలేపాడు ,లేచి  చుస్తే  అది తిరుపతి , ఆయన జేబులో  కాఫీ త్రాగడానికి మాత్రమే  డబ్బులు ఉన్నాయి ,నిశ్చింతగా ఆయన  ఆ డబ్బులతో  కాఫీ త్రాగి ప్లాట్ ఫారం  మీద కూర్చుని  బాబాను స్మరించుకుంటున్నారు . కాసేపటికల్లా  ఆయన దగ్గర ఎప్పుడో చదువుకున్న విద్యార్ధి వచ్చి టికెట్టు కొనిచ్చి  తిరుగు ప్రయాణానికి అవసరమైన  డబ్బులిచ్చి  రైలు ఎక్కించాడు .
         శిరిడీ మొ ||పుణ్య క్షేత్రాలలోనూ ,మహాత్ముల   సన్నిధిలోనూ  పూజ్యశ్రీ మాస్టర్ గారు  పాద రక్షలు వేసుకునేవారు గాదు ,ఒక్కొక్కసారి  ఎండవలన  ఆయన పాదాలు బొబ్బలు ఎక్కేవి ,అయినా ఆయన అలాగే నడిచేవారు .
        ఆయనకు విపరీతమైన  నోటిపూత ఉండేది ,ఒక్కొక్కసారి మంచి నీళ్ళు గూడ త్రాగలేక పోయేవారు , అట్టి పరిస్ధితులలో గూడా  మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తినగలిగిన పదార్దాలేవీ ఉండేవి గావు ,ఒక్కొక్కసారి కాఫీ గూడ   దొరికేది గాదు ,అయినా  ఆయనేమీ బాధ పడేవారు గాదు ,మంచి నీళ్ళు మాత్రమే  త్రాగి తృప్తిగా ఉండేవారు .
     ఆయన ఏ  మహాత్ముని దర్శనార్ధం వెళ్ళినా  వారి దర్శనం కోసం ఎంతసేపైన  వేచి ఉండేవారు ,వారి దర్శన ఆశీస్సులు  ప్రసాదించమని  శ్రీ సాయినాధుని  ప్రార్ధించే వారు  గానీ  (ఇంతటి భక్తుడినైన )నాకు వారు దర్శనమివ్వలేదు ,నన్ను గుర్తించలేదు  అని వారిపై  కినుక వహించడం చేసేవారు గాదు ,వసతి సౌకర్యాలు లభించకపోయినా  అక్కడవారి మీద గానీ ,అక్కడి పధ్ధతి మీద గానీ ఆయన  ఆగ్రహించేవారు గాదు ,శ్రీ సాయినాధుడు  ఆ రోజున తమను అలా ఉంచారని  అనుకునేవారు .........................

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #9 on: February 27, 2013, 11:06:03 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె  వందనం !

శ్రీ గురు గీత :

శ్లో 19 .యస్య జ్ఞాన  మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః |
           సదైక రూప రూపాయ  తస్మైశ్రీ గురవేనమః ||
   
     20.అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే |
          జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ||

                                     "మహాపురుషుడు --పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

 ................ఆయన మహాత్ముల దర్శనార్ధం వెళ్ళినప్పుడు తాము వచ్చిన పని చూసుకునేవారు  గానీ అన్య విషయాలపై  దృష్టి  సారించేవారు గాదు ,తమ చర్యల వల్ల  ,మాటల వల్ల  ఎవరికీ ఇబ్బంది కలగకుండా  ప్రవర్తించేవారు ,మహాత్ముల  సన్నిధిలో అవకాశమున్నంత వరకూ గడిపేవారు ,వారిని నిశితంగా పరిశీలిస్తూ  ఉండేవారు ,వారి సన్నిధిలో లేని సమయంలో అక్కడ ఉన్న వారిని ,అక్కడకు వచ్చేవారిని  ఆ మహాత్ముని గూర్చి అడిగి తెలుసుకునేవారు .
       మహాత్ముల దగ్గరకు వెళ్ళినప్పుడే గాదు ,ఎక్కడ ఎవరు  పరిచయమైనా వారు ఏయే ప్రాంతాల వారో తెలుసుకుని ,ఆయా ప్రాంతాలలోని  సశరీరులైన  ,సమాధి చెందిన  మహాత్ముల గురించి అడిగి తెలుసుకునేవారు ,వారి చరిత్రలు ఉంటే  వెంటనే తెప్పించుకుని చదివేవారు ,సాధ్యమైనంత త్వరలో వారి దర్శనం చేసుకునేవారు .
          అవధూతలు  సాధారణంగా మురికి కాలువల ప్రక్కన ,అందరూ మల మూత్ర విసర్జన చేసే ప్రదేశాలలోనూ ,రోడ్డు మీద ,ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ,నిలకడ లేకుండా  ఇష్టమొచ్చినట్లు  తిరుగుతూ  ఉంటారు ,అటువంటి అవధూతల   దర్శనార్ధం వెళ్ళినప్పుడు పూజ్యశ్రీ  మాస్టర్ గారు అసహ్యమనేది  లేక అక్కడే గంటల తరబడి  కూర్చునేవారు  ,అది చూసిన ఒకరు ఇలా అన్నారు .:"ఆ రోజులలో భగవద్భక్తి అంటేనే ఎగతాళి  ,మహాత్ముల దర్శనం చేసుకునేవారే  అరుదు ,అలా చేసుకునే వాళ్ళంటే పిచ్చి వాళ్ళన్న చులకన  భావం ప్రజలలో ఉండేది ,భరద్వాజ గారి  మాటల ప్రభావం  వలన ఒకసారి వారితో పాటు చీరాల స్వామి దర్శనానికి వెళ్లాను స్వామి అందరూ మలమూత్ర  విసర్జన చేసే ప్రదేశంలో  ఎండలో కూర్చుని ఉన్నారు ,భరద్వాజ గారు  బస్సు దిగినప్పటి నుంచీ  కాళ్ళకు చెప్పులు లేకుండానే స్వామి దర్శనానికి వచ్చారు ,అక్కడ ఆయన కూర్చున్న చోటనే నెల మీద కూర్చున్నారు , ఒక వైదిక సాంప్రదాయం లో  పుట్టినవాడు ,శ్రీ వైష్ణవ బ్రాహ్మణుడు ,పైగా కాలేజీలో ఉపన్యాసకుడు --ఎవరైనా తమను చూస్తారనే బిడియం లేకుండా అలా కూర్చుండి పోవడం చూసి  ఆశ్చర్యపోయాను ,నేను స్వామికి నమస్కారం చేసుకుని ,కాసేపు దూరంగా నిలబడి వచ్చేసాను ,ఆయన ఆధ్యాత్మిక స్ధితి ,స్వామి స్ధితికి ఏమి తీసిపోదని  నా కనిపించింది ".

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #10 on: February 28, 2013, 10:17:34 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||21 .శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం |
            గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః  ||

      22 .మన్నాధః  శ్రీ జగన్నాధో  మద్గురు: శ్రీ జగద్గురు:
            మమాత్మా సర్వ భూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ||

                           " మహాపురుషుడు ---పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

అంతేగాదు ,మహాత్ముల ఏదైనా ప్రసాదం పెడితే ,అది తాము తినగలిగినదైనా ,తినలేక పోయినదైనా  సరే వెంటనే తినేసేవారు ,ఒకసారి ఒక మహాత్ముడు ఆయనకు 'చెరుకు గడ ' ప్రసాదంగా  ఇచ్చారు ,అప్పుడు పూజ్యశ్రీ  మాస్టర్ గారికి  నోటిపూత విపరీతంగా  ఉన్నది ,మాట్లాడలేని  స్ధితిలో ఉన్నారు ,ఇక చెరుకు గడ  తినడమంటే సామాన్య  విషయమా ! మామూలు వ్యక్తులకే  చెరుకు ముక్క  ఒకటి తింటేనే నాలుక  గరుకుగా అయిపోతుంది  అలాంటిది ఆయన నోటిపూతతోనే చెరుకు గడ  మొత్తం తిన్నారు ! ఇక ఆయన నోటి పరిస్ధితి ఎలా ఉండి  ఉంటుందో ఊహించగలమా !ఆయన నాలుక నుండీ రక్తం వచ్చింది !!
      అంతే గాదు  పూజ్యశ్రీ మాస్టర్ గారి గృహానికి మహాత్ములు వచ్చినప్పుడు  ఆయన ఆనందం వర్ణనాతీతం !!వారికి ఎటువంటి లోటూ  రాకుండా  అనుక్షణమూ వారి ప్రతి అవసరాన్ని శ్రద్ధగా  చూసుకునేవారు ,అక్కడ --అంటే తమ ఇంట్లో  --తాము  ఒక గురువు  స్ధానంలో ఉన్నాననే భావన ఆయనలో లేశమైనా ఉండేది గాదు ,వారి చెంతన వినమ్రులై  ఉండేవారు ,,అందరూ ఆ మహాత్ముల దర్శనం చేసుకోవాలని తహ తహ లాడేవారు ,తమకు తెలిసిన వారందరికీ కబురు  పంపించేవారు ,వచ్చినవారికి ఆ మహాత్ముల దర్శనం లభించేలా చూసుకునేవారు .
    ఆయన కొన్నాళ్ళు జిల్లెళ్ళమూడి  అమ్మ  ఆశ్రమంలో ఉన్నారు ,అక్కడ ఆయన ఆశ్రమానికి అవసరమైన సేవలు  చేసేవారు ,అక్కడ ముద్రింప బడుతున్న  'మాతృశ్రీ ' అను తెలుగు ,ఆంగ్ల  పత్రికలకు  వ్యాసాలు  వ్రాయడము , ఆ పత్రికలోని  వ్యాసాలకు  ప్రూఫ్ లు  దిద్దడమూ  మొ || నవి చేసేవారు ,అలాగే అవసరమైనపుడు ఆశ్రమానికి చెరువు నుంచి  నీళ్ళు బిందెలతో మోసుకొచ్చే వారు ,అక్కడకు  వచ్చినవారితో ఆధ్యాత్మిక విషయాల గూర్చి మాట్లాడుతుండేవారు  గానీ వ్యర్ధంగా ఒక్క క్షణం గూడా గడిపేవారు గాదు .
  "భగవాన్ హై  భరద్వాజ !"అని  ఆయన శంఖు  చక్రాలతో విష్ణు మూర్తిలా తమకు దర్శనమిచ్చారనీ మహాత్ములే చెబుతుండగా  ఆయన మహాత్ముల దర్శన సేవలకై పరితపించడమేమిటి ?
     అవతార పురుషుడైతే శ్రీ రాముడు మునులను ,ఋషులను సేవించినట్లే ,కొందరు మహాత్ములు గూడా ఇతర మహాత్ముల దర్శన ,సేవలు చేసినట్లే పూజ్యశ్రీ మాస్టర్ గారు గూడ  మనకు ఆదర్శంగా ఉండడానికి మహాత్ములను సేవించారా ? ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది !
  "యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తేదేవే  తరోజనాః  |
   సయత్ప్రమాణం  కురుతే లోకస్తదనువర్తతే ||
                             
                                                     జై సాయి మాస్టర్ !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/13size]

mca.teja

 • Jr. Member
 • **
 • Posts: 57
 • Akkala Kota swami vari padhukalu
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #11 on: February 28, 2013, 10:22:28 AM »
Jai Sai master
gurupriya garu
Thanks neenu amma gaaru raasina "MAHAPURUSHUDU"book chadavalenuamo ani anukunnanu aa book naku yapati ki dorukutundo ani anukunnanu kani meeru daily rastunadhuku chala thanks

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #12 on: February 28, 2013, 10:44:42 PM »
జై సాయి మాస్టర్ ! గురు బంధు  తేజ గారు ,

నా మనసులో ఆలోచన కూడా అదే ,దివ్యజనని అమ్మగారి చేత వ్రాయబడిన దివ్యగ్రంధం "మహాపురుషుడు " 40 రోజులకి  divide  చేసుకున్నాను .జై సాయి మాస్టర్ ![/13size]

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #13 on: March 01, 2013, 01:50:49 AM »
                                                   

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ||23 . ఏక ఏవ పరోబన్ధుర్విషమే  సముపస్ధితే |
             గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ||

       24 . గురు మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో  గురు:
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ||

                              "మహాపురుషుడు -----పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

                                                        మహాత్ముల స్పందన

పూజ్యశ్రీ మాస్టర్ గారు మహాత్ముల నెందరినో  సందర్శించారు ,శ్రీ శిరిడీ సాయినాధుని సమాధి దర్శనం తో  తమకంతటి  అనుభూతి  కలగటం ,శ్రీ సాయి సన్నిధి  భక్తులలో  ఎట్టి  మార్పు కలిగించేదో  చూసిన మాస్టర్ గారు వారిని లోకానికి అందించారు ,అటువంటి  మహాత్ముల  సందర్శనం  కోసం  ఎంతో  తపించేవారు , వారిలోని ఆకాంక్షకు  సంప్రీతులైన  మహాత్ములు వారినెంతగానో  ఆదరించారు ,ఆశీస్సులనందించారు ,ప్రసంశించారు .
      ఆయన సందర్శించిన మహాత్ములలో  ప్రతి ఒక్కరూ ఆయనను  చూడగానే తమ ప్రియ పుత్రుని  చూసినట్లు  ఎంతో ఆనందించేవారు ,వారి అత్యున్నత  ఆధ్యాత్మిక  స్ధాయికి తమదైన  శైలిలో  జోహార్లు తెలిపేవారు ,మహాత్ములందరూ ఆంతర్యంలో  ఐక్యం  కలిగి ఉంటారు .కనుక వారి సమాగం ఎంతో  అద్భుతంగా ఉండేది .
      ఆత్మకూరు వద్ద నున్న అనంత సాగరంలో  నాగ మునీంద్ర స్వామి  అను ఒక మహాత్ముడుండేవారు ,ఒకసారి పూజ్యశ్రీ  మాస్టర్ గారు  కొంత మందితో  కలిసి ఆ స్వామి దర్శనార్ధం వెళ్ళారు ,ఆయన కొబ్బరి కాయలు  కొట్టి ఆ నీళ్ళు ,"గంగ ,యమున  ,సరస్వతీ "అంటూ అందరి శిరస్సులపై పోస్తున్నారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారు  కూడా ఆయన ముందుకు వెళ్ళగానే  ఆయన ,"అబ్బో ,అబ్బో !నీకు కూడా కావాలా అయ్యా !" అన్నారు ,అంటే పూజ్యశ్రీ  మాస్టర్ గారికి  అట్టివి  అవసరం లేదనే గదా ! ఆయనే మరొకసారి ,"ఆ బాపనయ్య  బాబా మనిషయ్యా !చాలా మంచివాడు  దొంగలను  గూడా బాగు చేయాలనుకుంటాడు ,అంత కష్టం  దేనికి ?ఒకసారి  ఆయనను  తీసుకురాయ్యా !"అన్నారు ,మరొకసారి  ఆయనే  ," ఆయన చాలా గొప్పవాడయ్యా ఆయన కొబ్బరి కాయలు నాకు (నైవేద్యంగా ) పంపడమేమిటి ? నేనే ఆయనకు  పంపాలనుకుంటున్నాను "అన్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/13size]
« Last Edit: March 02, 2013, 08:17:56 AM by gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2448
  • View Profile
Re: "MAHAPURUSHUDU"---PUJYA GURUPATNI SRIMATHI ALIVELU MANGATAYARU
« Reply #14 on: March 02, 2013, 08:14:59 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురుగీత :
శ్లో ||25 . మధులుబ్దో  యధాభ్రుంగో  పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ |

             జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం  వ్రజేత్ ||

 

       26. అత్రి నేత్రశ్శివ  స్సాక్షాద్ధ్విబాహుశ్చహరి: స్మృతః  |

             యో చతుర్వదనో  బ్రహ్మ శ్రీ గురు:  కధితః  ప్రియే ||
                                 "మహాపురుషుడు ----పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగతాయారు "

     
 
 ....................అలాగే గుంటూరులో ఉన్న రామభక్తాగ్రేసరులైన  శ్రీ రంగన్నబాబు దర్శనార్ధం  పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్తుండేవారు , వారికి రాముని నిత్య సాక్షాత్కారం ఉండేది ,ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎంతో ప్రేమతో ఆదరించేవారు ,ఎప్పుడు వెళ్ళినా  ఆయనను తన వెంట భక్తుల ఇండ్లకు తీసుకువెళ్ళి వారికి  ఆయన గూర్చి ఎంతో గొప్పగా పరిచయం చేస్తుండేవారు ,పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఇవ్వమని శ్రీరాములవారు ఇచ్చిన ఎన్నో ప్రసాదాలను శ్రీ రంగన్నబాబుగారు ఆయనకు ఇస్తుండేవారు ,శ్రీ రంగన్న  బాబుగారు  ఆయన గురించి అందరికీ ఇలా చెబుతుండేవారు ,"భరద్వాజకేమయ్యా !మహారాజు ! ఆయనకు నా నమస్కారాలు చెప్పండయ్యా !"ఒక్కొక్కసారి ఆయన ,"భరద్వాజ ఎంతో గొప్పవారు ,ఆయనంతటి వారమా అయ్యా మనము ?" అంటూండేవారు .
 
        అలాగే తణుకు సమీపంలోని చివటం అనే గ్రామంలో ఉన్న దిగంబరి యైన అమ్మను దర్శించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు  ,ప్రధమంగా అమ్మ దర్శనానికి వెళ్తున్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఊరి వెలుపలనే చివటం అమ్మ ఎదురైనారు . ఆయనను చూస్తూనే  అమ్మ సాష్టాంగ నమస్కారం చేసారు ! ఆమె పూజ్యశ్రీ  మాస్టర్ గారిని  ఎంతో వాత్సల్యంతో  చూసేవారు ,ఆమె  అంటుండేవారు :"బాబు ఎంత గొప్పవాడే !ఎంత కష్టపడి  పెద్ద బాబు (సాయి బాబా ) చరిత్ర  వ్రాసాడే !లోకం కోసం  ఎంత కష్టపడుతున్నాడే !"అని . 
 
                   శ్రీ అఖండా నంద సరస్వతీ భాగవత పారాయణ ద్వారా భగత్సాక్షాత్కారం  పొందిన మహనీయులు ,ఆయన పూజ్యశ్రీ  మాస్టర్ గారిని చూసి ,అయన ప్రజల యొక్క శాంతి యుత  జీవనానికై  పడుతున్న శ్రమకు చాలా ఆనందించారు .ఎంతో వాత్సల్యంతో    ఆయన "బహుత్ మీఠా "అంటూ  పూజ్యశ్రీ  మాస్టర్ గారిని దగ్గరకు తీసుకున్నారు .
 
                మాతా ఆనందమాయి  దర్శనార్ధమై  పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్ళినపుడు  ఆయనను అమ్మ ఎంతగానో  ఆదరించారు ,ముందుగా  చెప్పి రాకపోయినా  ఆశ్రమ వాసులకు  చెప్పి ఆయనకు  ప్రత్యేకంగా  భోజన వసతులు కల్పించారు ,నీకేమి కావాలో కోరుకోమని అడిగి ,ఆయన కోరుకున్న విధంగా  మరి రెండు సార్లు తమ దర్శన మనుగ్రహించారు .
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !

జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!