Author Topic: WHO IS BHAGAVAN RAMANA  (Read 6579 times)

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
WHO IS BHAGAVAN RAMANA
« on: November 24, 2012, 12:17:40 AM »
Reminiscences of Sadhuni Santammal, from Bhagavan smruthulu, by Sri Chalam


   విలక్షణానంద స్వామి అనే యోగి శిష్యులు - భార్యాభర్తలు చిదంబరం నుంచి వచ్చారు, భగవాన్ను చూడ్డానికి. ఆమె నాతో చెప్పింది;ఆ యోగి వాళ్ళని రోజుకి రెండు వేల రామ నామ జపం చేసి, ఆ ఫలితాన్ని అంతా గురువుకే అర్పించమన్నారని. వాళ్ళకి భగవాన్ తోఈ సంగతి చెప్పడం బెరుకై నన్ను చెప్పమన్నారు. నాకు అప్పటికి బాగా చనువు భగవాన్ దెగ్గర; చెప్పాను.

భగవాన్ అన్నారు "రెండు వేల నామాల ఫలితమూ గురువుకే అర్పిస్తే వీళ్ళకేం మిగులుతుంది? అయినా , ఆయన తీసుకునేది వడ్డీయే కదా?"

"అంటే- జపం చేసే మనస్సు వీళ్ళకి మిగిలే ఉంటుంది కదా! పై జపమే కదా గురువుకి" అని అక్కడ ఉన్న మురుగనారు అన్నారు.

"అవును. ఆ స్వామి వడ్డీ తీసుకొని తన భక్తులకి అసలునన్నా వదులుతున్నారు. ఇక్కడ ఈ పెద్ద స్వామి ఉన్నారే - వీరు అసలూ, వడ్డీ అన్నీ మింగేస్తారు. తీరా చూచుకొంటే,  మనది అనేది ఏదీ మిగలదు. :)"

 అని అంటున్నప్పుడు మురుగనారు కళ్ళ నుండి చంపల మీద ధారలుగా అనంద భాష్పాలు దొర్లాయి.అహము కూల్చి ఆత్మ జూపు రమణులకు జయము జయము
JAI  SAI  MASTER

 
« Last Edit: November 24, 2012, 12:22:03 AM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #1 on: November 24, 2012, 07:40:38 AM »
Jai SaiMaster

ఒకప్పుడు శిష్యులు 'రమణసద్గురు రమణసద్గురు రమణసద్గురు రాయరే' అని పాడుచుండిరి.

శ్రీ రమణులును వారితో కలిసి పాడుచుండిరి. 'స్వామి!, మిమ్ము గురించి పాడుచున్నాము.మీరెవరి గురుంచీ' అని ఒకరు అడిగిరి.

'రమణుడనగ ఈ దేహము మాత్రమే అగునా?' అని  స్వామి అనిరి.

దేహాత్మబుద్ద్ధి వారికి శూన్యముగనుక వారికి చేయు  పూజ ఈశ్వరునకే చెల్లును.


- From Ramana Leela (Krishna Bikshu)
« Last Edit: November 24, 2012, 07:45:21 AM by swayam »
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #2 on: November 24, 2012, 12:07:18 PM »
Reminiscences of Sadhuni Santammal, from Bhagavan smruthulu, by Sri Chalam

ఒక భక్తుడు వూరికి వెడుతూ భగవాన్ తో ఇట్లా అన్నాడు
"స్వామీ ! నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికో రాగలగడం, మీ చుట్టూ  ఉండడానికి నోచుకున్న ఈ భక్తులందరూ ప్రతి నిమిషం సాన్నిధ్యమనే అమృతాన్ని రుచి చూస్తున్నారు. ఎంతో దూరం లో ఉన్న ఈ భక్తుడు జ్ఞప్తికి ఉంటాడా? భాగ్యమంటే వీరిది.నన్ను కూడా మీ మనసులో ఏ మూలో ఉంచుకొని సదా రక్షించాలని ప్రార్ధిస్తున్నా." 

ఆ ప్రార్ధనకి భగవాన్ అన్నారు " నీ ప్రార్ధన సరే! ఇతను ఇక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించాలి" అనే తలంపు ఉంటే అతను జ్ఞాని ఎట్లా అవుతాడు? మనస్సు లేని వాడు దేన్ని కాని ఎట్లా మనస్సులో ఉంచుకోగలడు? ఇక్కడ మనవి చేసుకొన్నావు. అంతే కావలసింది. నీ మనవిని ఈశ్వరుడుకి నివేదించాను.  ఆయన చూసుకొంటారు. " అని చెప్పి శలవిచ్చి పంపి, మాతో అన్నారు: " అందరూ అనుకొంటారు, జ్ఞానిని సేవించుకొని వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో  ఎక్కడ ఎంత దూరాన్న ఉంటేనేం? యెవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకొంటాడో, ఎవడు సమస్తమూ గురువేనని- తానేమి కాదని అహంకారాన్ని వర్జిస్తాడో, అట్లాంటి వాణ్ణి ఉద్ధరించడం ఈశ్వరుడి విధి. అట్లా అర్పించుకొన్న వాడు ఏ ప్రార్ధనా చేయనక్కరలేదు. ఈశ్వరుడే పరిగెత్తుకొని వెళ్ళి, సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కన కప్ప నివసిస్తూ ఉంటుంది.ఏ దూరాన్నుంచో తుమ్మెద వచ్చి మకరందం త్రాగి పోతుంది."


-----------------------------------------------------------------------------------------------------------------------------

భగవాన్ మాత్రం "నేను" జ్ఞానిని అని మాత్రం అనలేదు :). ఈశ్వరుడి  బంటుగా మాత్రమే చూపించుకొన్నారు .
After all, ఈ అల్పమైన  "నేను" ఎంత?


JAI  SAI  MASTER
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #3 on: November 25, 2012, 03:37:02 PM »
Jai SaiMaster

From Sri Ramana Leela - Krishna Bikshu

అడిముడి గుడి దగ్గర 1903న స్వామి(భగవాన్) యుండగా శిష్యులు ఇతరులును కూడియుండగా
కావ్యకంఠ గణపతి మునీంద్రులు

      శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  |
      ప్రసన్నవదనం ధ్యాయేత్  సర్వవిఘ్నోపశాంతయే ||

అను వినాయక శ్లోకమును స్వామికి అన్వయించినట్లు చమత్కారముగా నిట్లు వ్యాఖ్యానించెను.

"వీరును తెల్లని వసనమును(కౌపీనమును) ధరించు వారు;
 ఆత్మనిష్ఠులైననందున  విష్ణులు(సర్వ వ్యాపులు);
మనో బుధ్ధి చిత్తాహంకారములను నాల్గింటిని భుజించినారు - నాశనమొనర్చినారు;
ప్రసన్న వదనులు, ధ్యానించువారి మార్గమునగల సర్వవిఘ్నములను శాంతింపచేయుదురు.
"
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #4 on: November 26, 2012, 09:25:48 AM »
Many thnaks Swayam garu for sharing this

Actually, this is the first time Shri Ganapati Muni(Nayana) met Bhagavan at Virupaksha Cave; may be it is 1903;

అప్పట్లో ఒక కపట సాధువు పద్మనాభ స్వామి కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. "నేనే రమణులకు గురువు" నని చెప్పి అందరినీ తన దెగ్గరకు రప్పించుకునేవారు.

అప్పట్లో భగవాన్ను అందరూ బ్రాహ్మణ స్వామి అనే పిలిచేవారు. ఆయన మౌనంగానే ఉండేవారు, ఆ పద్మనాభ స్వామి ఏమన్నా తనకి పట్టనట్టుగానే ఉండేవారు.(రమణ మహర్షి అన్న వ్యవహారిక నామకరణం ఇంకా జరగలేదప్పటికి)   (గణపతి ముని కి కూడా నాయన అన్న నామకరణం జరగలేదప్పటికి)      

గణపతి ముని (నాయన)  మొదటిసారి విరూపాక్ష గుహకి వచ్చినపుడు,పద్మనాభ స్వామి మొహం కేసి చూసి,  కనీసం దండం కూడ పెట్టకుండా కూర్చున్నారు.
అది చూసి పద్మనాభ స్వామి కించ పడి,గణపతి ముని నుద్దేశించి  "శాస్త్రి గారు, మీరు శుక్లాం బరధరం  శ్లోకాన్ని  విష్ణు పరంగా చెప్పగలరా?" అని అహంపూరితంగా అడిగారట.  

అపుడు గణపతి ముని రెట్టించి,శుక్లాం బరధరం  శ్లోకాన్ని విష్ణు పరంగాను, బ్రహ్మ పరంగాను కూడా కూడా చెప్పి "చూడు, మీ బ్రాహ్మణ స్వామి పరం గాను కూడా చెబుతాను"  అని చెప్పిన సంధర్భం లోనిదిది.

కానీ, గణపతి ముని ,ఆ సమయం లో  భగవాన్ను జగద్గురువుగా  ఇంకా గుర్తించలేదు. ఆచార సాంప్రదాయలను కఠినంగా పాటించే గణపతి ముని ఇలా తలిచేరట
"ఈ బాలుడు (at that time Bhagavan was 22 yrs of old) గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు."   కానీ వొంటి మీద యజ్ఞోపవీతం లేకపోవడం ఒక లోపంగా భావించారుట.  

--------------------------------------------------------------------------------------------------------------------
జగద్గురువును గుర్తించాలన్నా, ఆయన పాదాలనాశ్రయించాలన్నా,  ఆయన అనుమతి తప్పని సరిగా కావాలిగా! 


JAI  SAI  MASTER
« Last Edit: November 26, 2012, 09:27:49 AM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #5 on: November 26, 2012, 12:30:04 PM »
Jai SaiMaster

Somu garu, thanks much for sharing the context. I was not aware of that.

Jai SaiMaster
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

bkdileep

 • Full Member
 • ***
 • Posts: 107
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #6 on: November 29, 2012, 01:41:53 PM »
ee kinda meeru cheppindi, Sai Baba cheppina daantO kooDa enta chakkagaa saripOyindO. Jnyaanulandaruu okaTE. Baba kooDaa bhagavantuDu neeku mElu chEstaaDu anE anEvaaru.

Quote
ఆ ప్రార్ధనకి భగవాన్ అన్నారు " నీ ప్రార్ధన సరే! ఇతను ఇక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించాలి" అనే తలంపు ఉంటే అతను జ్ఞాని ఎట్లా అవుతాడు? మనస్సు లేని వాడు దేన్ని కాని ఎట్లా మనస్సులో ఉంచుకోగలడు? ఇక్కడ మనవి చేసుకొన్నావు. అంతే కావలసింది. నీ మనవిని ఈశ్వరుడుకి నివేదించాను.  ఆయన చూసుకొంటారు. " అని చెప్పి శలవిచ్చి పంపి, మాతో అన్నారు: " అందరూ అనుకొంటారు, జ్ఞానిని సేవించుకొని వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో  ఎక్కడ ఎంత దూరాన్న ఉంటేనేం? యెవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకొంటాడో, ఎవడు సమస్తమూ గురువేనని- తానేమి కాదని అహంకారాన్ని వర్జిస్తాడో, అట్లాంటి వాణ్ణి ఉద్ధరించడం ఈశ్వరుడి విధి. అట్లా అర్పించుకొన్న వాడు ఏ ప్రార్ధనా చేయనక్కరలేదు. ఈశ్వరుడే పరిగెత్తుకొని వెళ్ళి, సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కన కప్ప నివసిస్తూ ఉంటుంది.ఏ దూరాన్నుంచో తుమ్మెద వచ్చి మకరందం త్రాగి పోతుంది."
« Last Edit: November 29, 2012, 06:30:51 PM by Admin_smf »

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #7 on: December 02, 2012, 09:36:15 PM »
Reminiscences of Sadhuni Santammal, from Bhagavan smruthulu, by Sri Chalam

ఒక రోజు ఒక సన్యాసి వచ్చి మూడు పక్షాలు ఆశ్రమంలో ఉంటానన్నాడు. భగవాన్ అనుజ్ఞ్య ఇచ్చారు. ఆయన్ని బాగా చూశారు ఆశ్రమం వారు. చివరి రోజున ఆయన్ భగవాన్ దగ్గరికి వచ్చి "స్వామీ! ఇన్ని రోజులు ఆశ్రమంలో నన్ను చాలా ప్రేమతో చూశారు.సర్వ విధాలా తృప్తి అయింది.  ఇక నాకు అత్మ తృప్తిని ప్రసాదించండి. " అని అడిగారు.

భగవాన్ సోఫా మీద నుంచి లేచి నుంచుని, ఆయన చేతుల్ని పట్టుకున్నారు. అట్లా ఇద్దరూ నిశ్చలంగా నుంచున్నారు, చాలా సేపు.
చివరకు ఆ స్వామి "తృప్తి అయింది. ధన్యొస్మి! అంటూ వెళ్ళిపోయినారు. ఈ విధంగా  మౌనంతో, చూపుతో, చూపు కూడా లేకుండా యెందరికి దీక్ష ఇచ్చారో భగవాన్!"


JA  SAI  MASTER
« Last Edit: December 02, 2012, 09:57:36 PM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #8 on: December 09, 2012, 11:15:19 AM »
Jai SaiMaster

Who Is Bhagavan Ramana, this is what He is  :)Jai SaiMaster
« Last Edit: December 09, 2012, 11:17:53 AM by swayam »
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #9 on: December 21, 2012, 11:12:25 AM »
Bhagavan Preached:


Guru is the Self....

Sometimes in his life a man becomes dissatisfied with it, and, not content with what he has, he seeks the satisfaction of his desires, through prayer to God etc.
His mind is gradually purified until he longs to know God, more to obtain His grace than to satisfy his worldly desires.

Then, God?s grace begins to manifest.

God takes the form of a Guru and appears to the devotee, teaches him the Truth and, moreover, purifies his mind by association.

The devotee?s mind gains strength and is then able to turn inward. By meditation it is further purified and it remains still without the least ripple.

That calm expanse is the Self.

The Guru is both ?external? and ?internal?.

From the ?exterior? he gives a push to the mind to turn inward;
From the ?interior? He pulls the mind towards the Self and helps in the quieting of the mind.
That is guru kripa.

There is no difference between God, Guru and the Self.


Who else is Bhagavan Ramanulu?

Bhagavan Ramana is GOD
Bhagavan Ramana is Self
Bhagavan Ramana is SADGURU....outside and inside...

Bhagavan from Outside, gives a push to inside by the upadesha 'Inquire Who Am I"
When this inquiry ripens,
Bhagavan from Inside, pulls strongly the 'Enquirer' and merge the enquirer/ego with the source, the Atman

సద్గురు రమణఅహము కూల్చి ఆత్మ జూపు రమణులకు జయము జయము

« Last Edit: December 21, 2012, 11:16:43 AM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Swayam

 • Hero Member
 • *****
 • Posts: 698
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #10 on: January 18, 2013, 07:53:13 AM »
Jai SaiMaster

Sri T. K. Sundaresa Iyer became a devotee of Ramana Maharshi in 1908. As his secretary and English interpreter, he became uniquely well-versed in his Gurudev's teachings. The following is from Sundaresa's book:Abiding in the Self There is No Space-Time

Mr. and Mrs. S. were visitors from Peru to the Ashram. The couple narrated all their story to Bhagavan, all the privations they had undergone to have a look at Sri Ramana Maharshi. Bhagavan was all kindness to them; He heard their story with great concern, and then remarked: "You need not have taken all this trouble. You could well have thought of me from where you were, and so could have had all the consolation of a personal visit." This remark of Sri Bhagavan they could not easily understand, nor did it give them any consolation as they sat at His feet like Mary. Sri Maharshi did not want to disturb their pleasure in being in His immediate vicinity, and so He left them at that.

Later in the evening Sri Maharshi was enquiring about their day-to-day life, and incidentally their talk turned to Peru. The couple began picturing the landscape of Peru and were describing the sea-coast and the beach of their own town. Just then Maharshi remarked: "Is not the beach of your town paved with marble slabs, and are not coconut palms planted in between? Are there not marble benches in rows facing the sea there and did you not often sit on the fifth of those with your wife?" This remarks of Sri Maharshi created astonishment in the couple. How could Sri Bhagavan, who had never gone out of Tiruvannamalai, know so intimately such minute details about their own place? Sri Maharshi only smiled and remarked:

"It does not matter how I can tell. Enough if you know that in the Self there is no Space-Time."

Jai SaiMaster
గురుబోధయొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకొన్నపుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలాగాకుంటే అది మిథ్యాభక్తే.
Whatever we practice,becomes the swabhAvA.If control is practiced persistently that will become the swabhAvA.

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #11 on: July 17, 2013, 01:20:05 PM »
భగవాన్ దృష్టిలో పడిన వారికి మళ్ళీ  జన్మే లేదు

శ్రీ రామక్రిష్ణ అయ్యర్ గారి ఒకే ఒక కొడుకు రాధ క్రిష్ణన్, తల్లి తండ్రుల వలెనే ఇతడు కూడా మంచి సుగుణసంపన్నుడు.
అతనిని అందరూ 'రాధా'అని పిలవడం అలవాటు.

ఇతడు భగవాన్ యందు అత్యంత భక్తియు, ప్రేమయు, నిండినవాడు. ఇతనికి చిన్న ప్రాయమునుండియే, భగవాన్ తో  మాట్లాడడం,
గిరి ప్రదక్షిణకు పోవడం అలవాటుగా  ఉండేది .

భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు, సాయంకాలం అయిదు గంటలకి చేతిలో మరచెంబుతో నిండుగా కాఫి తీసుకొని కొండకి చేరేవాడు.
చీకటి వరుకు భగవాన్ తో నుండి క్రిందికి వచ్చే వాడు.

రాధా కాఫి తీసుకొని రావడం చూస్తూనే భగవాన్ అక్కడున్న వారిని "టైము సరి చేసుకోండి. రాధా కరెక్టుగా అయిదు గంటలకు వస్తాడు."  అని అనేవారు.

తరువాత రాధ ఒకసారి ఆశ్రమమునకు వచ్చి ఉన్నాడు . అప్పుడు భగవాన్ పల్లాకొత్తుకు పోయే దారిలో నీడ కొరకు చెట్లు పెంచాలని ,
దారికి ఇరు ప్రక్కల గుంటలు త్రవ్వి ఉంచడం జరిగింది.

భగవాన్ ఆ దారి మీదుగా పల్లాకొత్తుకు పోయేటప్పుడు భగవాన్ చేత ఆ గుంటల యందు విత్తులు నాటించాలని వారి కోరిక. దాని ప్రకారం అన్నీ తయారుగా పెట్టి ఉంచడం జరిగింది.

రోజూ వారిగానే భగవాన్ ఆ రోజు పల్లాకొత్తుకు పోయేటప్పుడు ఆ దారిలో వస్తూ ఉండగా ఆ గుంటలను చూచిన వెంటనే
"ఈ గుంటలను ఎందుకు త్రవ్వేరు ?" అని అడిగారు.  
ఒక భక్తుడు దానికి కారణం చెప్పి, నాటవలసిన విత్తనములను ఒక పళ్ళెములో పెట్టి భగవానును గుంటలో వేయమని కోరాడు.

భగవాన్ ఆ పళ్ళెంలోవి విత్తనాలు తన చేతితో తీయడానికి ప్రయత్నిస్తుండగా , అపుడు కొంచెం దూరమునే ఉండి ఇదంతా చూస్తున్న
రాధ పెద్ద గొంతుతో "భగవానే! భగవాన్ ఆ విత్తులను ముట్టకండి. "అని అరుస్తూ తొందరగా పరిగెత్తుకొచ్చాడు.

భగవాన్ కు ఏమీ తోచక వారి వద్ద "మీరేమో విత్తనములను వేయమంటున్నారు.ఈ రాధా యేమో విత్తనములను నాటకండి యని అంటున్నాడు.  నేనేమి చేయుట?" అని చెప్పినంతనే,

రాధ నీళ్ళు నిండిన కళ్ళతో "వీరు చేసే పని ఏమని తెలియునా భగవాన్? నీడ కొరకు చెట్లు పెంచబోతున్నారు. మీ దృష్టిలో  పడిన వారికి జన్మే లేదనిన,
మీరు ముట్టుకొన్న విత్తనాలు ఏ విధంగా  పెరిగి పెద్దవై నీడనిస్తాయి? ? అందువల్లే అవి ముట్టవద్దని చెప్పాను భగవాన్ !"  అని రుద్దమైన కంఠముతో చెప్పాడు .

దీనిని విన్న భగవాన్ అతనినే సూటిగా చూస్తూ నిలుచున్నారు. అక్కడున్న భక్తులు ఆ పిల్లవాడి తీవ్రమైన జ్ఞానము చూచి ఆశ్చర్య పడ్డారు.  

రాధ అలా అనడానికి కారణం అంతకు ముందు జరిగిన ఒక సంఘటనే.

ఒకసారి భగవాను, కుంజు స్వామి, రాధా ముగ్గురూ కలిసి తోట లో ఒక మడి వేసి దానిలో ఎర్ర గడ్డల (ఉల్లిపాయలు)విత్తులను నాటారు.
విత్తనాలను నాటేటప్పుడు, ఎవరు వేసిన విత్తనాలు ముందు పెరిగి  పెద్దవి అవుతాయో చూద్దామనుకుంటూ విత్తనాలు చల్లేరు.  దాని ప్రకారము కుంజు స్వామి,
రాధా వేసిన విత్తనములు బాగా మొలచి పెరిగాయి . భగవాన్ వేసినవి సరిగా మొలవలేదు.  
 
దీనిని జ్ఞాపకము ఉంచుకొనియే రాధ అలా చెప్పాడు. ఆ విషయాన్నే రాధ భగవానుకు చెప్పాడు.
 
దాని విన్న భగవాన్ "ఒహో! అదా సంగతి! ఋజువుతో  చెబుతున్నాడు "అని చెప్పి పెద్దగా నవ్వారు .


ఓం నమో భగవతే శ్రీ రమణాయ

« Last Edit: July 17, 2013, 01:35:00 PM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #12 on: January 15, 2014, 01:02:20 PM »


ఒక రోజు భగవాన్ ఋభుగీత చదువుతూ ఇలా అన్నారు:
"త్రిమూర్తులు వచ్చి జ్ఞానుల ముందు చేతులు  కట్టుకొని నుంచుని ఉంటారు " ఏమి ఆజ్ఞ"  అంటూ ..... వారికి లోక ఉద్దరణ కార్యము ఉండును.
జ్ఞానులకు ఏ పనీ ఉండదు. (ఏ సంకల్పమూ ఉండదు)
 

"జ్ఞాని తన ఇష్టం ఉన్నప్పుడు దేహాన్ని వదల వచ్చు. జ్ఞానికి అయుష్షు తీరినప్పుడు, యముడు వచ్చి చేతులు కట్టుకొని, దూరమున నిలుచుని "దయ చేయుదురా? అని అడుగును.

"వీలు లేదు, పొమ్మని అనిన పోవును" అని అన్నారు భగవాన్ 
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

Raghuram

 • Hero Member
 • *****
 • Posts: 841
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #13 on: January 21, 2016, 09:13:07 AM »
Dear Somayajulu garu, how are you? I'm missing this thread :). Re-reading the old things though!
« Last Edit: January 22, 2016, 02:54:13 PM by Raghuram »

Ananth

 • Global Moderator
 • Hero Member
 • *****
 • Posts: 781
  • View Profile
Re: WHO IS BHAGAVAN RAMANA
« Reply #14 on: December 02, 2018, 09:52:48 AM »
Jai Sai Master, Babu garu!
Jai Sai Master, Sai Bandhus!

"WhoamI" garu  :), Jai Sai Master!

I second Raghuram garu in stating that I am missing your posts.

Jai Sai Master!
Jai Sai Master!
Jai Swamy Sai!