Author Topic: భగవానుకు భగవానే సాటి :)  (Read 1324 times)

WhoAmI

  • Hero Member
  • *****
  • Posts: 577
  • Have you seen yourself ???
    • View Profile
    • Self Enquiry (search yourself)
ఓం నమో భగవతే  శ్రీ రమణాయ


భగవాన్ యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు  గురియైన వారు దాని నుండి తప్పి బయట పడుట అసాధ్యము.

భక్తుల ఫ్రాణమును (అహంకారము) గురి తప్పక హరించుటలో వారికి వారే సాటి! ఇట్టి అపూర్వ విద్యను ఎక్కడ నేర్చితిరి? అని మురుగనార్  భగవాన్ ను ప్రశ్నించు పాట చాలా రసవత్తరమైనిది. 

"నీవు ఈ అపూర్వమైన విద్యను నేర్చిన కళాశాల ఏది? అదెక్కడున్నది? దాని పేరేమి? 

ఈ హత్య చేసే విద్యలో నీకు శిక్షణ ఇచ్చిన గురువు ఎవరో? :) వింతగా ఉన్నది.

ఎందుకనిన నీవు పుట్టిన కుటుంబము కరుణకు పేరు గాంచిన భ్రాహ్మణ వంశము.

అట్టి కులమున పుట్టి ఇట్టి  పనులు చేయుచున్నావే?  నీవు ఈ పని చేయుటయందు ఒక విశేషమున్నది.

ఈ లోకమున ఎవరైతే  నీవే  గతియని నిన్ను ఆశ్రయింతురో   అట్టి వారి ఫ్రాణమును (అహంకారము)  హరింతువు. ఇతర ప్రాణములు  నీకు రుచింపవు.  :)

నువ్వీ రీతిగ వున్న వెంకట గురువరా!  నిన్నాశ్రయించిన వారు తరించిపోవుచున్నారు.   "


అని నిందా స్తుతిగా మురుగనారు పాడారు.   

భగవానుకు భగవానే  సాటి :)


ఓం నమో భగవతే  శ్రీ రమణాయ

« Last Edit: May 28, 2009, 10:41:28 AM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana