Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 138859 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
   
శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

సుఖమాత్యంతికం యత్తత్
బుధ్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం
స్థితశ్చలతి  తత్త్వతః  | 21 |

బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది . పవిత్రమైన సూక్ష్మ బుద్ధిద్వారా మాత్రమే గ్రాహ్యమైనది . ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాడు . ( 21 )

యం లబ్ద్వాచాపరం  లాభం
మన్యతే నాధికం  తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన
గురుణాపి విచాల్యతే  | 22 |

పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు ( అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు ) . మరేయితర లాభమునుగూడ  దానికంటె అధికమైన దానినిగా తలంపడు . బ్రహ్మానందానుభవస్థితిలో నున్న యోగిని ఎట్టి బలవద్దుఖములును చలింపజేయజాలవు . ( 22 ) 
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 


శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

తం విద్యాద్ధుఖసంయోగ -
వియోగం యోగసంజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో
యోగో నిర్విణ్ణచేతసా ||   | 23 |

దుఃఖరూపసంసారబంధములనుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని ( భగవస్తాక్షారరూపస్థితిని ) యోగము అని తెలియవలెను . అట్టి యోగమును దృఢమైన ,ఉత్సాహపూర్తితమైన అనిర్విణ్ణ ( విసుగులేని )చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను ( 23 )

సంకల్పప్రభావాన్ కామన్
త్వక్తా సర్వానశేశేషతః |
మనసైవేంద్రియగ్రామం
వినియమ్య సమంతతః | 24 |

సంకల్పములవలన కలిగిన కోరికలనన్నింటిని నిశ్శేషముగా త్యజించి ,ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను .
   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 శనైఃశనైరూపమేత్
బుద్ధ్యా ధృతి హీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా
న కించిదపి చింతయేత్ |  25 |

క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను . ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి ,పరమాత్మనుతప్ప మఱి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతన చేయరాదు .  ( 25 )

యతో యతో నిశ్చరతి
మనశ్చం చలమస్ధిరమ్ |
తతస్తతో నియమ్యైతత్
ఆత్మన్యేవ వశం నయేత్  | 26 |

సహజముగా నిలకడలేని  చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా  పరిభ్రమించుచుండును . అట్టి మనస్సును ఆయా విషయములనుండి పదేపదే మఱల్చి ,దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలెను . ( 26 )   
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ 

 ప్రశాంతమననం హ్యేనం
యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాంతరజసం
బ్రహ్మభూతమకల్మషమ్ | 27 |

ప్రశాంతమైనమనస్సు కలవాడును ,పాప రహితుడును ,రజోగుణము శాంతమైనవాడును ,అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును ,సచ్చిదానంద ఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును . ( 27 ) 

యుంజన్నేవం సదాత్మానం
యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్
అత్యంతం సుఖమశ్నుతే | 28 |

పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే  లగ్నమొనర్చును ,పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును ( 28 )


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః  | 29 |

సర్వవ్యాపమైన అనంతచైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగ యుక్తమైన ఆత్మగలవాడును ,అంతటను అన్నింటిని సమభావముతో  చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను ,ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను  భావించును ( చూచును ) ( 29 )

యో మాం పశ్యతి  సర్వత్ర
సర్వం చమయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి
స చ మే న ప్రణశ్యతి | 30 |

సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను ( వాసుదేవుని ) చూచుపురుషునకు ,అట్లే ప్రాణులన్నింటిని నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను . అతడును నాకు అదృశ్యుడు కాడు .
 

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

సర్వభూతస్థితం యో మాం
భజత్యేకత్వమాస్థితః  |
సర్వథా వర్తమానోపి
స యోగీ మయి వర్తతే | 31 |

భగవంతునియందు  ఏకీభావస్థితుడైనపురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచిదానందఘన వాసుదేవుడనైయున్న నన్ను భజించును . అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను  నాయందే ప్రవర్తించుచుండును .  ( 31 )

ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యది వా దుఃఖం
స యోగీ పరమో మతః | 32 |

ఓ అర్జునా ! సర్వప్రాణులను తనవలె ( మానవుడు తన శరీరమునందలి అవయముల సుఖదుఃఖములను తనవిగా భావించును -అట్లే యోగి సకల ప్రాణులను సమభావముతో జాచుచు వాటి సుఖదుఃఖములను తనవిగా తలంచును . ) ( తనతో ) సమానముగా చూచువాడును ,సుఖమునుగాని ,దుఃఖమునుగాని సమముగా ( సమానముగ ) చూచువాడును ( ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును ) అయినా యోగి పరమశ్రేష్ఠుడు . ( 32 )


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

యోయం యోగాస్త్వయా ప్రోక్తః
సామ్యేన  మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి
చంచలత్వాత్ స్థితిం  స్థిరామ్  | 33 |

అర్జునుడు పలికెను - ఓ మధుసూదనా ! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మన శ్చాంచల్య కారణమున తెలిసికొనలేకున్నాను . ( 33 )

చంచలం హి మనః కృష్ణ
ప్రమాథి బాలవృద్ద్రుఢమ్  |
తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరివ సుదుష్కరమ్ | 34 |

ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది . ప్రమథనశీలమైనది ( బాగుగా మథించు స్వభావము గలది ) . దృఢమైనది . మిక్కిలి బలీయమైనది . కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనువలె మిక్కిలి దుష్కరమని భావింతును . ( 34 )
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
Re:
« Reply #1867 on: May 14, 2019, 04:31:44 PM »

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

శ్రీ భగవాన్ ఉవాచ
అసంశయం  మాహాబాహో
మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే | 35 |

శ్రీ భగవానుడు పలికెను - హే మాహాబాహో ! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే . దానిని వశపరచుకొనుట  మిక్కిలి కష్టము . కాని  కౌంతేయా ! అభ్యాస వైరాగ్యములద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే . ( 35 )

అసంయతాత్మనా యోగో
దుష్ప్రాప ఇతి మే మతిః|
వశ్యాత్మనా తు యతతా
శక్యో వాప్తుముపయాతః    | 36 |

మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము . కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధనద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము .
 
అలివేలు  మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
అర్జున ఉవాచ

అయతిః  శ్రద్ధయోపేతో
యోగాచ్చలిత మానసః |
అప్రాప్య  యోగ సంసిద్ధిం
కాం గతిం కృష్ణ గచ్ఛతి | 37 |

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! యోగమునందు శ్రద్దాద రములతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని  కారణమున అవసాన దశలో మనస్సు చలించి  ,యోగసిద్ధిని ( భగవత్సాక్షాత్కారమును ) పొందకయే మరణించిన సాధకుని గతియేమగును ?

కచ్ఛిన్నోభయవిభ్రష్టః
ఛిన్నాభ్రమిన  నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో
విమూఢో బ్రహ్మణః  పథి  | 38 |

హే ! మహాబాహో ! అతడు (యోగభ్రష్టుడు ) భగవత్ప్రాప్తి మార్గమునుండి జారినవాడై ,ఆశ్రయ రహితుడై ( ఆలంబనము లేనివాడై ) ,ఉభయభ్రష్టుడై ,ఛిన్నాభిన్నమైన మేఘమువలె అధోగతి పాలు కాదు గదా !                        ( 38 )

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

ఏతన్మే సంశయం కృష్ణ
ఛేతుమర్హస్య శేషతః  |
త్వదన్యః  సంశయస్యాస్య
ఛేత్తా న హ్యుపపద్యతే | 39 |

ఓ కృష్ణా ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును . ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు .

శ్రీ భగవాన్ ఉవాచ

పార్థ నైవేహ నాముత్ర
వినాశస్తస్య  విద్యతే  |
న హి  కల్యాణకృత్ కశ్చిత్
దుర్గతిం తాత గచ్ఛతి  | 40 |

శ్రీ భగవానుడు పలికెను - ఓ పార్థా ! అట్టి ( ఆ ) పురుషుడు ఈ లోకమున గాని ,పరలోకమున గాని అధోగతి పాలుగాడు . ఏలనన ,నాయనా 1 ఆత్మోద్ధారణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడును  దుర్గతి పాలుగాడు .
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!
 
శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్
ఉషిత్వా శాశ్వతీః సమాః |
సూచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టో భిజాయతే  | 41 |

యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది -ఉత్తమ లోకములను పొంది ,ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి ,పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును .

అథవా యోగినామేవ
కులే భవతి ధీమతామ్ |
ఏతద్ది  దుర్లభతరం
లోకే జన్మ యదీదృశమ్  | 42 |

అధవా విరాగియైన పురుషుడు ఆ పుణ్య ( ఊర్ధ్వ ) లోకములకు పోకుండగనే  జ్ఞానులైన యోగుల కుటుంబములోనే  జన్మించును . కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్టించుట మిక్కిలి దుర్లభము . ( 42 ) 

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
తత్ర తం బుద్ధి సంయోగాం
లభతే పౌర్వదేహికమ్   |
యుతతే చ తతో భూయః
సంసిద్దౌ  కురునందన | 43 |

అచట ( యోగి కుటుంబమున పుట్టిన పిదప ) పూర్వదేహమున సాధించిన బుద్ధిసంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే  పొందును . ఓ కురునందనా ! ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మఱల  పరమాత్మప్రాప్తి సాధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును . ( 43 )

పూర్వాభ్యాసేన  తేనైవ
హ్రియతే హ్యవశోపి సః |
జిజ్ఞాసురపి  యోగస్య
శబ్దబ్రహ్మాతివర్తతే  | 44 |

శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగ భగవంతుని వైపు ఆకర్షితుడగును . అట్లే సమబుద్ధిరూపయోగజిజ్ఞాసువు గూడ వేదములలో తెల్పబడిన  సకామకర్మల ఫలమును అధిగమించును .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!