Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137114 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 
యఙ్ఞశిష్టామృతభుజో
యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకోస్త్యయజ్ఞస్య
కుతోన్యః  కురుసత్తమ |31|

ఓ కురుసత్తమా ! ( అర్జునా ! ) యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును ,పరబ్రహ్మమును అగు పరమాత్మయొక్క లాభము కలుగును . యజ్ఞము చేయనివారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు . ఇంకా పరలోక విషయము చెప్పనేల ?  ( 31 )

ఏవం బహువిధా యజ్ఞా
వితతా బ్రాహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్
ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే |32|

ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి . ఈ యజ్ఞములనన్నింటిని త్రికరణశుద్ధిగా ( మనో వాక్కాయయములచే ) ఆచరించినపుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము . ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొని ,అనుష్ఠించుటవలన నీవు ప్రాపంచిక ( కర్మ ) బంధములనుండి సర్వథా విముక్తుడయ్యెదవు . ( 32 )
 

 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

శ్రేయాన్ ద్రవ్యమాయాద్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞః  పరంతప |
సర్వం కర్మాఖిలం పార్ధ
జ్ఞానే  పరిసమాప్యతే | 33|

ఓ పరంతపా ! అర్జునా ! ద్రవ్యమాయయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది . కర్మలన్నియును జ్ఞానమునందే పరిసమాప్తమగును .

తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి  తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శినః | 34|

నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ,ఆ జ్ఞానమును గ్రహింపుము . వారికి దండప్రణామము లాచరించుటవలనను ,సేవలొనర్చుటవలనను ,కపటము లేకుండ భక్తిశ్రద్ధలతో సముచితరీతిలో ప్రశ్నించుటవలనను పరమాత్మతత్త్వమును చక్కగా నెఱింగిన జ్ఞానులు సంప్రీతులై ,నీకు ఆ పరమాత్మ తత్త్వజ్ఞమును ఉపదేశించెదరు . ( 34 ) 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్
ఏవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ
ద్రక్ష్యస్యాత్మన్యథోమయి |35 |

ఓ అర్జునా ! ఈ తత్త్వజ్ఞానము నెఱింగినచో మఱల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు . ఈ జ్ఞాన ప్రభావముతో సమస్తప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు . పిమ్మట సచ్చిదానందఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు . ( 35 )

అపి చేదసి పాపేభ్యః
సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సంతరిష్యసి  | 36 |

ఒకవేళ పాపాత్ములందఱి కంటెను నీవు ఒక మహాపాపివి అయినచో ,జ్ఞాననౌక సహాయముతో పాపసముద్రమునుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు . ( 36 ) 
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

యథైదాంసి సమిద్ధోగ్నిః
భస్మాసాత్కురుతేర్జున  |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
భస్మాసాత్కురుతే తథా | 37 |

ఓ అర్జునా ! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మల నన్నింటిని భస్మమొనరించును  ( 37 )

న హాయ్ జ్ఞానేన సదృశం
పవిత్రమిహ విద్యతే |
తత్సయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి | 38 |

ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది మరియొకటి లేనేలేదు . శుద్ధాంతః కరణముగల సాధకుడు బహుకాలమువరకు కర్మయోగాచరణము  చేసి ,ఆత్మయందు అదే జ్ఞానమును తనంతటతానే పొందగలడు . ( 38 ) 


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 


శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ద్వా పరామ్ శాంతిమ్
అచిరేణాగచ్ఛతి | 39 |

జితేంద్రియుడు ,సాధనపరాయణుడు శ్రద్దాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును . ఆ జ్ఞానము కలిగిన వెంటనే ( ఏ మాత్రము విలంబము లేకుండ ) అతడు భగవతత్త్వ రూపమైన పరమశాంతిని పొందును . (39)

ఆజ్ఞాస్ శ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోస్తిన పరో
న సుఖం సంశయాత్మనః | 40 |

అవివేకియు ,శ్రద్ధారహితుడును అయిన సంశయాత్మకుడు పరమార్ధ విషయమున ఆవశ్యకము భ్రష్ఠుడేయగును . అట్టి సంశయాత్మునకు ఈ లోకము నందుగాని ,పరలోకమునందుగాని ఎట్టి సుఖమూ ఉండదు .  ( 40 )   

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

యోగ సన్న్య స్తకర్మాణం
జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం  న కర్మాణి
నిబద్నంఠీ ధనంజయ | 41|

ఓ ధనంజయా ! ( ఓ అర్జునా !) విధిపూర్వకముగ కర్మలను ఆచరించుచు ,కర్మఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు ,వివేకముద్వారా సంశయములనన్నింటిని  తొలగించుకొనుచు ,అంతః కరణమును వశమునందుంచు కొనిన వానిని కర్మలు బంధింపజాలవు .   (41 )

తస్మాదజ్ఞాన సంభూతం
హృత్ స్థం జ్ఞానాసినాత్మనః |
చిత్త్వైనం  సంశయం యోగమ్
అతిష్ఠోత్తిష్ఠ  భారత | 42 |

కావున ఓ భారతా ! ( అర్జునా !) నీ హృదయము నందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేకజ్ఞామను ఖడ్గముతో రూపుమాపి ,సాంత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము . (42 )

ఓం తత్సదితి శ్రీ మద్భాగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణానర్జున సంవాదే
జ్ఞానకర్మ సంన్యాసయోగో నామ చతుర్ధో ధ్యాయః  || 4 ||     
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ 

|| ఓం శ్రీ పరమాత్మనే నమః ||

అథ పంచమో ధ్యాయః
కర్మసన్న్యాసయోగః

అర్జున ఉవాచ
సన్న్యాసం కర్మణాం కృష్ణ
పునర్యోగం చ శంససి |
యఛ్రెయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితమ్  | 1 |

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! ఒక్కసారి కర్మసన్న్యాసమును  ,మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు . నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము . (1)

శ్రీ భగవాన్ ఉవాచ

సన్న్యాసః  కర్మయోగశ్చ
నిః శ్రేయసకారావుభౌ  |
తయోస్తు కర్మసన్న్యాసాత్
కర్మయోగో  విశిష్యతే | 2 |

శ్రీ కృష్ణ భగవానుడు పలికెను -కర్మసంన్యాసము ( శరీరేంద్రియ మనస్సులద్వారా జరుగు సమస్తకర్మలయందును కర్త్రుత్వభావము లేకుండుట .
) ,కర్మయోగము ( సమత్వబుద్ధితో భగవర్ధ కర్మలను ఆచరించుట ) అను ఈ రెండును పరమకల్యాణ దాయకములే . కాని ఈ రెండింటిలోను కర్మసన్న్యాసము కంటెను కర్మయోగము సాధన యందు  శ్రేష్ఠమైనది   ( 2 )

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

జ్ఞేయః స నిత్యసన్న్యాసీ
యో న ద్వేష్టీ న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి  మహాబాహో
సుఖం బంధాత్ ప్రముచ్యతే | 3|

మహాబాహో ! ఎవ్వరినీ ద్వేషింపని ,దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా  ఎఱుంగ వలెను . ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధముల నుండి ముక్తుడగును .

సాంఖ్యయోగౌ పృథ గ్భాలాః
ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యక్
ఉభయోర్విందతే  ఫలమ్ | 4|

సాంఖ్య ,కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు . పండితులట్లు పలికరు . ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ( విధివిధానుముగ) ఆచరించినవాడు ఈ రెండింటి  ఫలస్వరూపమైన పరమాత్మను పొందును . (4) 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 యాత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి  గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ
యః పశ్యతి స పశ్యతి | 5 |

జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు . జ్ణాయోగఫలమును ,కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును .

సన్న్యాసస్తు  మహాబాహో
దుఃఖ మాప్తు మాయోగతః |
యోగయుక్తో మునిర్భ్రహ్మ
నచిరేణాధిగచ్ఛతి |6|

కాని ఓ అర్జునా ! కర్మయోగమును అనుష్టింపక సన్న్యాసము అనగా మనస్సు ,ఇంద్రియములు ,శరీరముద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము . భగత్స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగ పొందగలడు .  ( 6)

   
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 
యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా
కుర్వన్నపి  న లిప్యతే | 7|

మనస్సును వశము నందుంచుకొనినవాడు ,జితేంద్రియుడు ,అంతఃకరణశుద్ధి కలవాడు ,సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు . (7)

నైవకించిత్  కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
అశ్నన్  గచ్ఛన్  స్వపన్ శ్వసన్  | 8 |

ప్రలవన్  విసృజన్ గృహ్ణన్
ఉన్మనిషన్  నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్ధేషు
వర్తంత ఇతి ధారయన్ | 9 |

తత్త్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు ,వినుచు ,స్పృశించుచు ,ఆఘ్రాణించుచు ,భుజించుచు ,నడుచుచు ,నిద్రించుచు ,శ్వాసక్రియలను నడుపుచు ,భాషించుచు ,త్యజించుచు ,గ్రహించుచు ,కనులను తెరుచుచు ,మూయుచు  ఉన్నను ఇంద్రియములు తమతమ విషయములయందు వర్తించుచున్నవనియు ,తానేమియు చేయుటలేదనియు భావించును . ( 8,9 )
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సంగం త్యక్తా కరోతి యః |
లిప్యతే న స పాపేన
పద్మపత్రమివాంభసా  | 10 |

కర్మలన్నింటిని  భగవదర్పణము గావించి ,ఆసక్తిరహితముగ కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువులవలె పాపములు అంటవు . ( 10 )

కాయేన మనసా బుద్ధ్యా
కెవలైరింద్రియైరపి  |
యోగినః కర్మ కుర్వంతి
సంగం త్యక్తాత్మశుద్ధయే | 11 |

కర్మయోగులు మమతాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు ,మనస్సు ,బుద్ధి ,శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు . ( 11 ) 
 
అలివేలు  మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   


యుక్తః కర్మఫలం త్యక్త్వా
శాంతిమాప్నోతి నైష్టికీమ్ |
అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే | 12 |

నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి ,భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును . కర్మఫలాసక్తుడైనవాడు ఫలేచ్చతో కర్మలాచరించి బద్ధుడగును .

సర్వకర్మాణి మనసా
సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ
నైవ కుర్వన్ న కారయన్  | 13 |

అంతఃకరణమును అదుపులోనుంచుకొని ,సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే ,ఆచరింపజేయకయే ,నవద్వారములు గల శరీరమునందు సమస్తకర్మలను మానసికముగా త్యజించి ,సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై ,ఆనందమును అనుభవించును . (13)


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

నాదత్తే  కస్యచిత్ పాపం
న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యంతి జంతవః  | 15 |

సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు . అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు . (15 )

జ్ఞానేన తు తదాజ్ఞానం
యేషాం  నాశిత మాత్మనః  |
తేషామాదిత్యవత్  జ్ఞానం
ప్రకాషయతి తత్పరమ్ | 16 |

కాని  వారి ( ప్రాణుల అజ్ఞానము పరమాత్మతత్త్వజ్ఞాన ప్రాప్తిద్వారా తొలగిపోవును . అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానందఘన పరమాత్మను సూర్యుని వలె ( సూర్యప్రభవలె )  దర్షింపజేయును ( పరమాత్మ స్వరూపమును ప్రత్యక్షప్రత్యక్షమొనర్చును ) 
 
  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!
 
శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

జ్ఞానేన తు తదాజ్ఞానం
యేషాం  నాశితమాత్మనః |
తేషామాదిత్యవత్ జ్ఞానం
ప్రకాశయతి  తత్పరమ్ | 16 |

కాని వారి ( ప్రాణుల ) అజ్ఞానము పరమాత్మతత్త్వజ్ఞాన ప్రాప్తిద్వారా తొలగిపోవును . అప్పుడు ఆ జ్ఞానము వారికి స్సీసచ్చిదానంద ఘనపరమాత్మను సూర్యుని వలె ( సూర్యప్రభవలె ) దర్షింపజేయును . ( పరమాత్మస్వరూపమును ప్రత్యక్షమొనర్చును . ( 16 )

తద్బుద్ధయస్త దాత్మానః
తన్నిష్ఠాస్తత్పరాయణాః  |
గచ్ఛంత్య పునరావృత్తిం
జ్ఞానానిర్ధూతకల్మషాః   | 17 |

తద్రూపమును పొందిన మనోబుద్ధులుగలవారై ,సచ్చిదానందఘనపరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై ,తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై ,పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు .  ( 17 )   


అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 విద్యావినయసంపన్నే 
బ్రాహ్మణే గవి హస్తిని  |
శుని  చైవ శ్వపాకే  చ
పండితాః సందర్శినః  | 18 |

జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును ,గోవు ,ఏనుగు ,కుక్క మొదలగు వానియందును ,చండాలుని యందును సమదృష్టినే కలిగి యుందురు     ( 18 )

ఇహైవ తైర్జితః  సర్గో
యేషాం  సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రాహ్మణి తే స్థితాః | 19 |

సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఈ జన్మ యందే  సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు . అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు ( ప్రాపంచిక బంధములనుండి ముక్తులయ్యెదరు ) . సచ్చిదానంద ఘనపరమాత్మ దోషరహితుడు ,సముడు ,సమభావ స్థితామనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు . కనుక వారు త్రిగుణాతీతులు ,జీవన్ముక్తులు . ( 19 )


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!