Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137130 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
 శ్రీ భగవాన్ ఉవాచ

బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున  |
తాన్యహం వేద  సర్వాణి
న త్వం వేత్థ పరంతప  | 5 |

శ్రీ భగవానుడు తెలిపెను -ఓ పరంతపా ! అర్జునా ! నాకును నీకును పెక్కుజన్మలు గతించినవి . కాని వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును . నీవెఱుగవు . ( 5 )

అజోపి సన్వ్యయాత్మా
భూతానామీశ్వరోపి సన్  |
ప్రకృతిం స్వామధిష్టాయ
సంభవామ్యయాత్మమాయయా    | 6 |

నేను జన్మ రహితుడను ,నిత్యుడు ,సమస్త ప్రాణులకు ఈశ్వరుడను . అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని ,నా యోగ మాయచే అవతరించుచుందును .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!
 
శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత  |
అభ్యుత్ధామధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్ | 7 |

ఓ భారతా ! ( అర్జునా ! ) ధర్మమునకు హాని కలిగి నప్పుడును ,అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడు డును నన్ను నేను సృజించుకొందును . అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును . (7 )

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయా చ దుష్కృతామ్  |
ధర్మ సంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే | 8 |
సత్పురుషులను పరిరక్షించుటకును ,దుష్టులను రూపుమాపుటకును ,ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును .
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: March 13, 2019, 04:55:48 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

జన్మ కర్మ చ మే దివ్యమ్
ఏవం యో వేత్తి తత్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున | 9 |

ఓ అర్జునా ! నా జన్మ ( అవతారము ) లు ,కర్మములు దివ్యములు . అనగా నిర్మలములు . అలౌకికములు . ఈ తత్త్వరహస్యమును తెలిసికొనినవాడు ( సర్వశక్తిమంతుడై సచ్చిదానంద ఘానా పరమాత్మ అజుడు ,శాశ్వతుడు ,సకల ప్రాణులకును పరమగతి ,పరమాశ్రయుడు . అతడు కేవలము ధర్మమును స్థాపించుటకును ,లోకములనుద్ధరించుటకును తన యోగమాయవలన సగుణరూపములో ప్రకతితుడగుచుండును . కనుక పరమేశ్వరునితో సమానుడైన సుహృదుడు ,ప్రేమాస్పదుడు ,పతితపావనుడు ,మఱియొకడు లేడు -ఈ విషయమును తెలిసికొని ,అనన్యభక్తితో పరమేశ్వరునే చింతన చేయుచు ఆసక్తిరహితముగా ప్రపంచమున ప్రవర్తించువాడే ,పరమేశ్వరుని తత్వమును ఎఱిగినవాడు . ) తనువును చాలించిన పిమ్మట మఱల జన్మింపడు సరికదా ! నన్నే చేరును .

వీతరాగభయక్రోధా
మన్మయా మాముపాశ్రితాః |
బహవో మద్భావమాగతాః  | 10 |

ఇదివరలో గూడ సర్వథా రాగభయక్రోధ రహితులైన వారు ,దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి గలిగి ,నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి . ( 10 )
 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

యే యథా మాం  ప్రపద్యంతే
తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ  వర్తమానువర్తంతే
మనుష్యాః పార్థ సర్వశః | 11 |

పార్థా ! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును . మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు .  ( 11 )

కాంక్షంతః  కర్మణాం సిద్ధిం
యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే
సిద్ధిర్భవతి కర్మణా | 12 |

ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు . ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్దీవారికి శీఘ్రముగా లభించును .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మవిభాగశః  |
తస్య కర్తారమపి మాం
విద్ద్యకర్తారమవ్యయమ్ ||

బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని . ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను  ,శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగ 'అకర్తను 'గా తెలిసికొనుము .  (13 )

న మాం కర్మాణి లింపంతి
న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో భిజానాతి
కర్మభిర్న స బధ్యతే  | 14 |

నాకు కర్మఫలాశక్తి లేదు . కావున కర్మలు నన్నంటవు . ఈ విధముగా నాతత్త్వమును తెలిసినవారు కర్మబద్ధులు కారు . (14 )

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
పూర్వైరపి  ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్ త్వం
పూర్వైః పూర్వతరం కృతమ్  | 15 |

ఓ అర్జునా ! ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగ ( నా తత్త్వ రహస్యమును )  దెలిసికొని కర్మల నాచరించిరి . కావున నీవును ఆ పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము . ( 15 )

కిమ్ కర్మ కిమకర్మేతి
కవయోప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి
యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ | 16 |

కర్మ అనగా నేమి ? అకర్మ యనగానేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు . ( తికమకపడుచున్నారు ) కావున కర్మతత్త్వమును నీకు చక్కగా విశదపరచెదను . దానిని తెలిసికొని నీవు అశుభములు నుండి అనగా కర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు . (16 )

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 
 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్  .

 కర్మణో హ్యపి బోద్ధవ్యం
బోద్ధవ్యం చ వికర్మణః  |
అకర్మణశ్చ బోద్ధవ్యం
గుహనా కర్మణో గతిః   | 17 |

' కర్మ ' తత్త్వమును తెలిసికొనవలెను ,అట్లే 'అకర్మ ' స్వరూపమును గూడ ఎరుగవలెను . 'వికర్మ ' లక్షణములను కూడా తెలిసికొనుట చాల అవసరము . ఏలనన ,కర్మ తత్త్వమును అతినిగూఢమైనది . ( 17 )

కర్మణ్యకర్మ యః పశ్యేత్
అకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు
స యుక్తః కృత్స్నకర్మకృత్  | 18 |

కర్మయందు 'అకర్మను ' ,అకర్మయందు 'కర్మ ' ను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి . అతడు యోగి మఱియు సమస్త కర్మలు చేయువాడు .   (18)


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :ఛైవ

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 యస్య సర్వే సమారంభాః
కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం
తమాహుః పండితం బుద్ధాః  | 19 |

ఎవని కర్మలన్నియును ,శాస్త్రసమ్మతములై ,కామ కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు .  ( 19 )

త్యక్త్వా కర్మఫలాసంగం
నిత్యతృప్తో నిరాశ్రయః
కర్మణ్యభిప్రవృత్తోపి
నైవ కించిత్ కరోతి సః  | 20 |

సమస్తకర్మలయందు వాటి ఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి ,సంసార -ఆశ్రయరహితుడై ,పరమాత్మయందే  నిత్యతృప్తుడైన   నిత్యతృప్తుడైన పురుషుడు ,కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటికి ( కర్మలకు ) కర్తకాడు . ( 20 )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
« Last Edit: March 29, 2019, 04:34:34 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 

నిరాశీర్యచిత్తాత్మా
త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ
కుర్వాన్నాప్నోతి  కిల్బిషమ్ | 21 |

అంతఃకరణమును ,శరీరేంద్రియములను జయించినవాడు ,సమస్త భోగసామాగ్రిని పరిత్యజించిన వాడు ,ఆశారహితుడు ఐన  సాంఖ్యయోగి కేవలము శారీరకకర్మలను ఆచరించుచును పాపములను పొందడు .  ( 21 )

యదృచ్ఛాలాభసంతుష్టో
ద్వంద్వాతీతో  విమత్సరః
సమః సిద్ధావసిద్దౌ చ
కృత్వాపి న నిభత్యతే  | 22 |

తాను కోరకుండగనే లభించిన పదార్థములతో ( అప్రయత్నముగా అమరిన లాభములతో ) సంతుష్టుడైన వాడు ,అసూయలేనివాడు ,హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు ,సిద్ధియందును ,అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును . అట్టి కర్మయోగి కర్మల నాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు .  (22)


అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!!  
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

గతసంగస్య ముక్తస్య
జ్ఞానావస్థితచేతసః  |
యజ్ఞాయాచరతః కర్మ
సమగ్రం ప్రవీలీయతే | 23 |

ఏలనన ఆసక్తి ,దేహాభిమానము ,మమకారము ఏ మాత్రమూ లేనివాడును ,పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును , కేవలము యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా వినీనములగును . అనగా మిగిలియుండవు . ( 23 )

బ్రహ్మార్పణం బ్రహ్మ  హవిః
బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణా హుతమ్ |
బ్రహ్మైవతేన గంతవ్యం
బ్రహ్మకర్మసమాధినా  | 24 |

యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము . యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము . హవనక్రియము బ్రహ్మ్మము . ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలముగూడ బ్రహ్మమే . (24)
 


 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

దైవమేవాసరే యజ్ఞం
యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాజ్ఞావాపరే యజ్ఞం
యజ్ఞేనైవోపజుహ్వతి | 25 |

కొందఱు యోగులు దైవపూజారూపాయజ్ఞమును చక్కగా అనుస్టింతురు . మఱికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మపరమాత్మ రూపాగ్నియందు అభేదదర్శన రూపాయజ్ఞము ( జ్ఞానము ద్వారా పరబ్రహ్మపరమాత్మయందు ఏకీభావస్థితుడై యుండుటచే బ్రహ్మరూపాగ్ని యందు యజ్ఞముద్వారా యజ్ఞమును నడుపుటయందురు .) ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు . ( 25 )

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే
సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య
ఇంద్రియాగ్నిషు  జుహ్వతి |26 |

కొందరు యోగులు శ్రోత్రాది -ఇంద్రియములను సంయమన  రూపాగ్నుల యందు హోమము చేయుదురు . మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియారూపాగ్నులయందు హవనము చేయుదురు . అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు . తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను నాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రమూ ఉండదు . ( 26 )
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

సర్వాణీంద్రియకర్మాణి
ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమ యోగాగ్నౌ
జుహ్వతి జ్ఞానదీపితే | 27|

మరికొందఱు యోగులు ఇంద్రియముల క్రియలను ,ప్రాణముల క్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమయోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు . ( సచ్చిదానంద  ఘనపరమాత్మను తప్ప ఇతరమైనదానిని దేనినీ చింతన చేయకుండుటయే వాటిని ( ప్రాణేంద్రియక్రియలను ) హవనము చేయుట యగును . ) అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై యుందురు . అప్పుడు ప్రాణ -ఇంద్రియక్రియల ప్రభావము వారిపై ఏ మాత్రమూ ఉండదు . ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును . ( 27 )

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
ద్రవ్యయజ్ఞాష్టపోయజ్ఞా
యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ
యుతయః సంశితవ్రతాః | 28 |

కొందరు ద్రవ్యసంబంధ యజ్ఞములను ,మరికొందఱు తపో -రూప యజ్ఞములను ,కొందఱు యోగరూపాయజ్ఞములను చేయుదురు . మఱికొందరు అహింసాది తీక్షణవ్రతములను చేపట్టి ,యత్నశీలురై స్వాధ్యాయ రూపజ్ఞానయజ్ఞములను ఆచరింతురు . (28)


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   
 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

అపానేజుహ్వతి ప్రాణం
ప్రాణే పానం తథాపరే |
ప్రాణాపానగతీ  రుద్ద్వా
ప్రాణాయామపరాయణాః  | 29 |

అపరే నియతాహారాః
ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వేప్యేతే యజ్ఞవిదో
యఙ్ఞక్షపితకల్మషాః  | 30 |

కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును ,మఱికొందరు ప్రాణవాయువు నందు అపానవాయువును హవనము చేయుదురు . ఇంకను కొందఱు నియమితాహార నిష్ఠితులై ,ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపాన గమనములను నిలిపి ,ప్రాణములను ప్రాణముల యందే హవనం చేయుదురు . యజ్ఞవిదులైన ఈ సాధకులందఱును యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు . ( 29-30 )


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!