జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
శ్రీ గురు గీత :
శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
శ్రీ భగవాన్ ఉవాచ
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినామ్ | 3 |
శ్రీ భగవానుడు పలికెను - ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా ( మాయాజనితములైన గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి ,శరీరేంద్రియ మనస్సులద్వారా జరుగు క్రియలన్నింటి యందును కర్తృత్వాభిమానము లేనివాడై ,సర్వ వ్యాపియైన సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావముతో స్థితుడై యుండుటయే జ్ఞానయోగము . దీనినే సన్యాసము ,సాంఖ్యయోగము అనియు అందురు . ) ద్వారా ( ఫలమును ,ఆసక్తిని వీడి ,భగవదాజ్ఞానుసారము కేవలము భగవదర్ద సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించుటను 'నిష్కామ కర్మయోగము ' అని యందురు . దీనినే 'సమత్వయోగము ' 'బుద్ధియోగము ' 'కర్మయోగము ' 'తదర్థకర్మ ' 'మదర్థకర్మ ' 'మత్కర్మ ' మొదలగు పేర్లతో వ్యవహరింతురు . ) నిష్ఠ కలుగును . ( 3)
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!