Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137079 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 
ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే  |
సంగాత్ సంజాయతే కామః
కామాత్ క్రోధో భిజాయతే | 62|

విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును . ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును . ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును .  ( 62 ) .

క్రోదాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్భుద్దినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి | 63 |

అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును . దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును . స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును . బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును . ( 63 )   

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

  రాగద్వేషవియుక్తైస్తు
విషయాంద్రి యైశ్చరన్  |
వస్యైర్విధేయాత్మా
ప్రసాదమధిగచ్ఛతి   | 64 |

అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ,ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును .

ప్రసాదే సర్వదుఃఖానాం
హానిరస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధిః  పర్యవతిష్ఠతే | 65 |

మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖము లన్నియును నశించును . ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయములనుండి వైదొలగి ,పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదాభవత్  రాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

నాస్తి బుద్ధిరయుక్తస్య
న చాయుక్తస్య భావనా |
న చాభావయుతః శాంతిః
అశాంతస్య సుఖమ్  | 66 |

ఇంద్రియములు ,మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు . అట్టి ఆయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్తికభావమే కలుగదు . తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు .మనశ్శాంతి   లేనివానికి సుఖము ఎట్లు లభించును ?

ఇంద్రియాణి  హి చరతాం
యన్మనోను  విధీయతే |
తదస్య హరతి .ప్రజ్ఞాం
వాయుర్నావమివాంభసి   | 67 |

నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును . అట్లే ఇంద్రియార్ధముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా శక్తిని హరించివేయును . (67) 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

తస్మాద్యస్య  మాహాబాహో !
నిగృహీతాని  సర్వశః|
ఇంద్రియాణీంద్రియార్ధేభ్య ః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా |68 |

కనుక ఓ అర్జునా ! ఇంద్రియములను ఇంద్రియార్ధములనుండి అన్ని విధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును .

యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునే ః  | 69 |

నిత్యా జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును . అది ఇతరప్రాణులన్నింటికిని  రాత్రితో సమానము . నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండును . అది పరమాత్మతత్త్వమును నెఱిగిన  మునికి ( మననశీలునకు ) రాత్రితో సమానము . ( 69 )

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!
 
శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

 అపూర్వమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వన్ |
తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ | 70 |

సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏ మాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును . అట్లే సమస్తభోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను   కల్గింపకయే వానిలో లీనమగును . అట్టి పురుషుడే పరమశాంతిని పొందును . భోగాసక్తుడు శాంతిని పొందజాలడు . ( 70 )

విహాయ కామన్ యః సర్వాన్
పుమాంశ్చ రతి  నిఃస్పృహః |
నిర్మమో నిరంహంకారః
స శాంతిమధిగచ్ఛతి | 71 |

కోరికలన్నింటిని త్యజించి ,మమతా -అహంకార ,స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును . (71)
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్ధ
నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలేపి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి | 72 |

ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే . ( ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి ). ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు . అంత్యకాలమునందును ఈ  బ్రాహ్మీస్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును .

 ఓం తత్సది శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు
 బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః || 2 ||

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

|| ఓం శ్రీ పరమాత్మనే నమః ||

అథ తృతీయోధ్యాయః
కర్మయోగః

అర్జున ఉవాచ

జ్యాయసీ చేత్ కర్మణస్తే
మతా బుద్ధిర్జనార్ధన |
తత్కిం కర్మణి ఘోరే మాం
నియోజయసి  కేశవ | 1 |

అర్జునుడు పలికెను - ఓ జనార్దనా ! కేశవా ! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో ,భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ?  (1)

వ్యామిశ్రేణేవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య
యేన శ్రేయోహమాప్నుయామ్ | 2 |

కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు . కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము . ( 2 )

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
 
శ్రీ భగవాన్ ఉవాచ

లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినామ్ | 3 |

శ్రీ భగవానుడు పలికెను - ఓ అనఘా ! అర్జునా ! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా ( మాయాజనితములైన గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి ,శరీరేంద్రియ మనస్సులద్వారా జరుగు క్రియలన్నింటి యందును కర్తృత్వాభిమానము లేనివాడై ,సర్వ  వ్యాపియైన సచ్చిదానంద ఘన పరమాత్మయందు  ఏకీభావముతో స్థితుడై యుండుటయే జ్ఞానయోగము . దీనినే సన్యాసము ,సాంఖ్యయోగము అనియు అందురు . ) ద్వారా ( ఫలమును ,ఆసక్తిని వీడి ,భగవదాజ్ఞానుసారము  కేవలము భగవదర్ద సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించుటను 'నిష్కామ కర్మయోగము ' అని యందురు . దీనినే 'సమత్వయోగము ' 'బుద్ధియోగము ' 'కర్మయోగము ' 'తదర్థకర్మ ' 'మదర్థకర్మ ' 'మత్కర్మ ' మొదలగు పేర్లతో వ్యవహరింతురు . )  నిష్ఠ కలుగును .   ( 3) 

 
     అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
న కర్మణామానారంభాత్
నైష్కర్మ్యం పురుషోశ్నుతే |
న చ సన్న్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి | 4|

మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యము అనగా యోగనిష్ఠాసిద్ధి ( ఏ స్థితిలో పురుషుని కర్మలు అకర్మలగునో అనగా ఫలమును ఉత్పన్నము చేయలేవో ఆ స్థితిని నైష్కర్మ్యమందురు .

న హాయ్ కశ్చిత్ క్షణమపి
జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః  కర్మ
సర్వః ప్రకృతిజైర్గుణైః  | 5 |

ఏ మనుషుయుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు . ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు . ఏలనన మనుష్యులందఱును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు . ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవసియే యుండును . (5)


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 
 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

కర్మేంద్రియాణి సంయమ్య
య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా
మిధ్యాచారః స ఉచ్యతే | 6 |

బలవంతముగా ,బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి ,మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిధ్యాచారి అనగా దంభి  అనియందురు .  (6)

యస్త్వింద్రియాణి   మనసా
నియమ్యారభతే ర్జున
కర్మేంద్రియైః కర్మయోగమ్
అసక్తః  స విశిష్యతే | 7 |

కాని అర్జునా ! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని ,అనాసక్తుడై ఇంద్రియములద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడు శ్రేస్థుడు .   
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :ఛైవ

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

నియతం కురు కర్మ త్వం
కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి  చ తే
న ప్రసిద్ధ్యేద కర్మణః  | 8 |

నీవు శాస్త్ర విహిత కర్తవ్య  కర్మలను ఆచరింపుము . ఏలనన ,కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము . కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము గూడ సాధ్యము గాదు . (8)

యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర
లోకోయం కర్మబంధనః |
తదర్ధం కర్మ కౌంతేయ
ముక్తసంగః  సమాచార | 9 |

ఓ అర్జునా ! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చుక్కుపడుదురు . కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్ధమే కారవ్యకర్మలను చక్కగా ఆచరింపుము .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
పురోవాచ  ప్రజాపతిః   |
అనేన ప్రసవిష్యధ్వమ్ 
ఏష వోఅస్త్విష్ట కామధుక్ | 10 |

కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి ," మీరు ఈ యజ్ఞములద్వారా వృద్ధిచెందుడు .ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోర్కెలనెల్ల తీర్చును " అని పల్కెను . ( 10 )

దేవాన్ భావయతానేన
తే దేవా భావయంతు  వః |
పరస్పరం భావయంతః
శ్రేయః  పరమవాప్స్యథ  | 11 |

" ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు . మఱియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు . నిస్స్వార్ధ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచు కొనుచు పరమశ్రేయస్సును పొందగలరు " అని పల్కెను .  ( 11 )


 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా
దాస్యంతే  యజ్ఞభావితాః  |
తైర్దతానప్రదాయైభ్యో
యో భుంక్తే స్తేన ఏవ  సః  | 12 |
 
యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు ( మానవులకు ) ఆయాచితముగనే  ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు . ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే .  ( 12 )

యజ్ణశిష్టాశినః  సంతో
ముచ్యంతే  సర్వకిల్భిః  |
భుజంతే తే త్వఘం పాపా
యే పచ్చంత్యాత్మకారణాత్  | 13 |

యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు  అన్ని పాపములనుండి ముక్తులయ్యెదరు . తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపఱచు  (వండు ) కొను పాపులు పాపమునే భుజింతురు . ( 13 )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

అన్నాద్భవంతి భూతాని
పర్జన్యదన్నసంభవః  |
యజ్ఞాద్భావతి  పర్జన్యో
యజ్ఞ కర్మసముద్భవః  | 14 |

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి
బ్రహ్మాక్షరసముద్భవమ్  |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్  | 15 |

ప్రాణులన్నియు అన్నము ( ఆహారము ) నుండి జన్మించును . అన్నో త్పతి  వర్షములవలన ఏర్పడును . యజ్ఞములవలన వర్షములు కురియును . విహితకర్మలు  యజ్ఞములకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు . వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలిసికొనుము . అందువలన సర్వవ్యాపియు ,అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు . ( 14- 15 )


 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః  |
అఘాయురింద్రియారామో
మోఘం పార్థ స జీవతి | 16 |

ఓ అర్జునా ! ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి . అట్టివానియొక్క జీవితము వ్యర్ధము .

యష్ట్యాత్మరతిరేవ  స్యాత్
ఆత్మతృప్తశ్చ మానవః  |
ఆత్మన్యేన  చ  సంతష్టః
తస్య కార్యం న విద్యతే | 17 |

సచ్చిదానందఘనపరమాత్మప్రాప్తినందిన  జ్ఞానియైన మాహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును . అతడు పూర్ణకాముడు . కనుక ఆత్మయందే తృప్తినొందును . అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు . అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!