Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137133 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్


క్లై బ్యం  మా స్మ  గమః  పార్ధ
నైతత్త్వయ్యు పద్యతే
క్షుద్రం  హృదయదౌర్భల్యం
త్యక్త్వో త్తిష్ఠ   పరంతప   | 3|

కావున ఓ అర్జునా ! పిరికితనమునకు  లోనుకావద్దు . నీకిది ఉచితము కాదు . ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయదౌర్భల్యము ను వీడి ,యుద్ధమునకై నడుము బిగింపుము . ( 3)

అర్జున ఉవాచ

కథం భీస్మమహం  సంఖ్యే
ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హా వరిసూదన    | 4|

అర్జునుడు పలికెను - ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మపితామహుని ,ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ? ఏలనన ఓ అరిసూదనా ,ఈ ఇరువురును నాకు పూజ్యులు . ( 4) 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

  గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో  భోక్తుం  భైక్ష్య మాపీహలోకే  |
హత్వార్థకామాంస్తు   గురూనిహైవ
భుంజీవ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్  | 5|

మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా  బిచ్చమెత్తుకొని యైనను  ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే . ఏలనన ఈ గురుజనులను చంపినను ,రక్తసిక్తములైన రాజ్యసంపదలను ,భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండును గదా !  (5)

నచైతద్విద్మః  కథారన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో  జయేయు  |
యానేవ హత్వా న జిజీవిషామః
తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రా ః    | 6 |

ఈ యుద్ధము చేయుట శ్రేష్ఠమా ? లేక చేయకుండుట శ్రేష్ఠమా ? అనునది ఎఱుగము . యుద్ధమున వారిని మనము జయింతుమా ? లేక మనలను  వారు జయింతురా ? అను విషయమును గూడ  ఎఱుగము . మనకు ఆత్మీయులైన  ధార్తరాష్ట్రులే  ఇచట మనలను ఎదిరించి ( పోరాడుటకు ) నిలిచియున్నారు . వారిని చంపి ,జీవించుటకును  మనము ఇష్టపడము . (6)

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

 కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి   త్వాం  ధర్మసమ్మూఢచేతాః  |
యఛ్రెయః స్స్యాన్నిశ్చితం  బ్రూహి తన్మే
శిష్యస్తే హం శాధి మాం త్వాంప్రపన్నమ్     | 7|

కార్పణ్యదోషము  ( పిరికితనము ) నకు  లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను . ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను . నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము . నేను నీకు శిష్యుడను . శరణాగతుడను ,ఉపదేశింపుము .   (7).

న హి ప్రపశ్యామి మామాపనుద్యాత్
యచ్చోకముచ్చోషణ మింద్రియాణాం  |
అవాస్య భూమావాసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి   చాధిపత్యమ్  | 8|

ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది .సిరిసంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను ,కడకు సురాధిపత్యము  ప్రాప్తించినను ఈ శోకాదాహము చల్లారునుపాయమును గాంచలేకున్నాను .   

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

సంజయ ఉవాచ

ఏవముక్త్వా  హృషీకేశం
గుడాకేశ హః   పరంతప |
న యోత్స్య ఇతి గోవిందమ్
ఉక్త్వా తూష్ణీం బభూవ హ | 9 |

సంజయుడు పలికెను -ఓ రాజా ! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు ,"నేను యుద్ధము చేయనే చేయను " అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను .    (9)

తమువాచ  హృషీకేశ ః
ప్రహసన్నివ  భారత  |
సేనయోరుభయోర్మధ్యే
విషీదంతమిదం  వచః   | 10 |

ఓ ధృతరాష్ట్రా  ! ఉభయసేనల మధ్య శోకసంతపుతుడై న   అర్జునుని  జూచి ,శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను .        (10 ) 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

శ్రీ భగవాన్ ఉవాచ

అశోచానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ  భాషసే  |
గతాసూనగతాసూంశ్చ
నానుశోచంతి  పండితాః  | 11 |

శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా ! శోకింపదగని వారికొరకై  నీవు శోకించుచున్నావు . పైగా పండితుని ( జ్ఞాని ) వలె  మాట్లాడుచున్నావు . పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని ,ప్రాణములు పోనివారిని గుఱించి గాని శోకింపరు .  ( 11)


 నత్వెవాహం జాతు నాసం
న త్వం నేమే  జనాధిపాః |
న చైవ న భవిష్యామః
సర్వే  వయమతః  పరమ్  | 12 |

నీవుగాని ,నేనుగాని ,ఈ రాజులుగాని ఉండని కాలమేలేదు . ఇక ముందు కూడ మనము ఉండము  అనుమాటయే లేదు . ( అన్ని కాలములలోను  మనము ఉన్నాము . ఆత్మ శాశ్వతము . అది అన్ని కాలముల యందును ఉండును . శరీరపతనముతో అది నశించునది కాదు )  ( 12 )


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదాభవత్  రాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

దేహినో అస్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం  జరా |
తథా దేహాంతరప్రాప్తిః 
ధీరస్తత్ర  న ముహ్యతి  | 13 |

జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము ,యౌవనము ,వార్ధ్యక్యము ఉన్నట్లే మఱియొక దేహప్రాప్తియు కలుగును . ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు .   (13 )

మాత్రాస్పర్శాస్తు  కౌంతేయ
శీతోష్ణ సుఖదుఃఖదాః
ఆగమాపాయినో అనిత్యాః
తాంస్థితిక్షస్వ   భారత  | 14 |

ఓ కౌంతేయా ! విషయేంద్రియ సంయోగమువలన  శీతోష్ణములు  సుఖదుఃఖములు కలుగుచున్నవి . అవి ఉత్పత్తి వినాశశీలములు . అనిత్యములు . కనుక భారతా ! వాటిని సహింపుము . ( పట్టించుకొనకుము )                     (14 )

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

యం  హి న వ్యథయంత్యేతే
పురుషం   పురుషర్షభ  |
సమదుఃఖసుఖం  ధీరం
సోమృతత్వాయ కల్పతే  | 15 |

ఏలనన ఓ పురుషశ్రేష్ఠా ! ధీరుడైనవాడు సుఖదుఃఖములను  సమానముగా చూచును . అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు  చలింపజేయజాలవు . అతడే మోక్షమును పొందుటకు అర్హుడు .    ( 15 )

నాసతో  విద్యతే  భావో
నాభావో విద్యతే సతః  |
ఉభయోరపి దృష్టో అంతః
త్వనయోస్తత్త్వదర్శిభిః    | 16 |

అసత్తు అనుదానికి ( అనిత్యమైనదానికి ) ఉనికియే లేదు ,సత్తు అనుదానికి లేమిలేదు . ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్త్వజ్ఞానియైన వాడే ఎఱుంగును .    ( 16 )

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

అవినాశి తు తద్విద్ధి
యేన  సర్వమిదం  తతమ్  |
వినాశమవ్యయస్యాస
న  కశ్చిత్  కర్తుమర్హతి  | 17 |

నాశరహితమైన  ఆ సత్యము ( పరమాత్మ తత్త్వము ) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము . శాశ్వతమైన  దానినెవ్వరును  నశింపజేయజాలరు .    ( 17 )

అంతవంత  ఇమే దేహా
నిత్యసోక్తాః  శరీరిణః  |
అనాశినో అప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ  భారత   | 18 |

ఈ శరీరములు  అన్నియును నశించునవియే . కాని  జీవాత్మ నాశరహితము ,అప్రమేయము ( అనిర్వచనీయము ) . నిత్యము ,కనుక ( ఈ విషయమును ఎఱింగి ) ఓ భరత వంశీ ! అర్జునా ! నీవు యుద్ధము చేయుము .
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 య  ఏనం  వేత్తి  హంతారం
యశ్చైనం  మన్యతే హతమ్  |
ఉభౌ తౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే | 19 |

ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును ,అది ( ఆత్మ) ఇతరులచే చంపబడునని  భావించువాడును ,ఆ ఇద్దరును అజ్ఞానులే . ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు ,ఎవ్వరిచేతను  చంపబడదు .  ( 19 )

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వాన భూయః |
అజోనిత్యః శాశ్వతోయం పురాణో
న  హన్యతే  హన్యమానే శరీరే  | 20 |

ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు ,గిట్టదు ,పుట్టి ఉండునది కాదు . ఇది భావ వికారములు  లేనిది (ఉత్పత్తి ,అస్థిత్వము ,వృద్ధి ,విపరిణామము ,అపక్షయము ,వినాశము అను ఆరును భావ వికారములు )  ఇది జన్మలేనిది . నిత్యము ,శాశ్వతము ,పురాతనము . శరీరము చంపడినను ఇది చావదు .             ( 20 )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

వేదావినాశనం  నిత్యం
య  ఎనామజమవ్యయమ్  |
కథం స పురుషః  పార్థ
కం ఘాతయతి  హంతి కమ్  | 21 |

ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము ,నిత్యము  అనియు ,జననమరణములు లేనిదనియు  ,మార్పు లేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ? ఎవరిని ఎట్లు చంపును ?  (21 )

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి   |
తథా శరీరాణి విహాయ జీర్ణా -
న్యన్యాని సంయాతి నవాని దేహీ | 22 |

మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి ,నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతన శరీరములను పొందును . ( 22 )

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
నైనం  ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః  |
న చైనం క్లెదయంత్యాపో   
న శోషయతి మారుతః  | 23 |

ఈ ఆత్మను శస్త్రములు  చేధింపజాలవు .అగ్ని దహింప జాలదు . నీరు తడుపజాలదు . వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు .  ( 23 )

అఛేద్యో యమదాహ్యో యమ్
 అక్లెద్యొషోష్య  ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణుః 
అచలోయం సనాతనః  | 24|

ఈ ఆత్మ ఛేదించుటకును ,దహించుటకును ,తడుపుకును ,శోషింప జేయుటకును సాధ్యము కానిది . ఇది నిత్యము ,సర్వవ్యాపి ,చలింపనిది (అచలము )స్థాణువు (స్థిరమైనది ) సనాతనము . ( శాశ్వతము ).

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

  అవ్యక్తో యమచింత్యో యమ్
 అవికార్యో యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి      | 25|

ఈ ఆత్మ అవ్యక్తమైనది . ( ఇంద్రియగోచరము గానిది ) అచింత్యము ( మనస్సుకునకును అందనిది ) వికారములేనిది . దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము . కనుక ఓ అర్జునా ! నీవు దీనికై శోకింపదగదు . (25 )

అథ చైనం నిత్యజాతం
నిత్యం వా మనస్యే మృతమ్  |
తథాపి త్వం మహాబాహో
నైనాం శోచితుమర్హసి  | 26 |

ఓ అర్జునా ! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు .
   

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 
 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 


 జాతస్య హాయ్ ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ  |
తస్మాదపరిహార్యేఅర్ధే
న త్వం శోచితుమర్హసి | 27 |

ఏలనన పుట్టినవారికి మరణము తప్పదు . మరణించిన వానికి పునర్జన్మ తప్పదు . కనుక అపరిహార్యములైన  ఈ విషయములయందు నీవు శోకింపదగదు .

అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేన
తత్ర కా పరిదేవనా | 28 |

ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియగోచరములు గావు -( అవ్యక్తములు )  మరణానంతరము గూడ  అవి అవ్యక్తములే -ఈ జననమరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు ( ఇంద్రియ గోచరములు ) అగు చుండును . ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము .                   ( 28 )
   

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :ఛైవ

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

 ఆశ్చర్యవత్పశ్యతి  కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః   |
ఆశ్చర్యవ ఛైవనమస్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ | 29 |

ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను ) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును . మరోయొక మాహాత్ముడు దీని తత్త్వమును  ఆశ్చర్యకరమైన దానినిగా వినును . ఆ విన్నవారిలోకూడ కొందరు దీనిని గూర్చి ఏమియు ఎఱుగరు . ( 29 )

దేహీ నిత్యమవధ్యో అయం
దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని
న త్వం శోచితుమర్హసి | 30 |

ఓ అర్జునా ! ప్రతిదేహమునందు ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది . కనుక ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు . ( 30 )

 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
« Reply #1769 on: January 19, 2019, 05:09:25 PM »


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

స్వధర్మపి   చావేక్ష్య
న        వికంపితుర్హసి |
ధర్మయాద్ధి  యుద్ధాచ్రెయో న్యత్
క్షత్రిస్య న విద్యతే  | 31 |

అంతాగక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు . ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మఱియొకటి ఇదియును లేదు .

యదృచ్ఛయా  చోపపన్నం
స్వర్గద్వారమపావృతమ్    |
సుఖినః  క్షత్రియా  ః  పార్థ
లభంతే  యుద్ధమీదృశమ్   | 32 |

ఓ పార్థా ! యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అడ్రసుతవంతులైన  క్షత్రియులకే లభించును . ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది .            ( 32 )

  అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!!