Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 139259 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శరణన్న వారిని తానే స్వయముగా రక్షించెదనని అమ్మవారి వాక్కు . ఈ యుగమునందు శారీరక ,మానసిక ప్రశాంతత కొరకు ,సర్వదుఃఖ పరిహారం కొరకు శ్రీ దొంతులమ్మ అమ్మవారి దివ్యనామాన్ని ఓ మంత్రంగా చేసుకుని అష్టాంగ యోగములతో కూడిన ధ్యానముతో సాధన చేసిన శ్రీ దొంతులమ్మ వారి ఆశీస్సులతో శాంతి ,సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ,ఆత్మదర్శనము పొంది తన శరీరములోని సమస్త దోషములు తొలగి కారణ శరీరమునకు విముక్తి కలిగి జీవుడుకు గత జన్మ కర్మదోషములు తొలగి ,విషయ వాంఛలు తొలగి అంతః ర్ముఖమై ,జ్ఞానియై ,యోగియై సదా తానే ఆ సర్వేశ్వర ప్రతిబింబ స్వరూపమై విరాజిల్లును అని శ్రీ దొంతులమ్మవారి దివ్యామృత వాక్యములు .

   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 
 
     
    శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్టణం

జీవులకు మోక్షమార్గాన్ని అన్వేషించి చూపిన కరుణామయి ,కారణజన్మురాలు శ్రీ దొంతులమ్మ అమ్మవారు . పరిపక్వమైన జ్ఞానము ,భగద్విభూతిని అనుభవించి జీవితము అత్యంత విలక్షణమైన దానిని జీవులకు అందించటానికి ఈ కలియుగమందున జన్మించిన దేవతామూర్తి . జ్ఞానసంపత్తిని ,సలక్షణమైన విలక్షణమై రమణీయమైన భగవద్విభూతి మూర్తీభవించిన ధన్యులు శ్రీ దొంతులమ్మ అమ్మవారు . అమ్మ దివ్యనామ సంకీర్తనలే మోక్షమార్గాలు . ఆ తల్లి మహనీయ ఉపదేశములు జీవులకు పరమపావన మహోపదేశములు ,మోక్షమార్గములు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

మానవులలో అంతఃర్గతముగా వున్న దైవశక్తిని మేల్కొలిపి ఈ వెలుగులో ఆ సర్వేశ్వరుని దర్శించే భాగ్యము కలుగజేసే మహోన్నతమైన సత్ గురు ,మాయను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రసాదించే అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి ప్రతిబింబ రూపము . ఈ కలియుగమున జన్మించి మనముందు నిలిచిన సచిదానంద సత్ గురుః శ్రీ దొంతులమ్మ అమ్మవారు ,అష్టాంగ యోగమనే మణిహారాన్ని ఆ భగవంతునికి స్వీకారయోగ్యము చేసి పంచేంద్రియములను మించి మనోనేత్రముతో ఆ సర్వేశరుని దర్శించే భాగ్యాన్ని భక్తులకు అందించిన జ్ఞాన సుసంపన్న తత్వజ్ఞాన సద్గురు శ్రీ దొంతులమ్మ అమ్మవారు ,వారిని ధ్యానించి పూజించి వారిని అనుసరించుచూ ,చేసేటి ,సాధన ,భగవత్ దర్శనాన్ని తప్పక అందించును ,సదాయోగీశ్వరులై ముక్తిని పొందగలరు అందరికీ ఆ భగవంతుని ఆశీర్వచనములు అందుగాక . సదా ఆ ఆదిపరాశక్తి అయిన శ్రీ దొంతులమ్మ వారి దీవెనలు అందరికీ అందుగాక .

జై శ్రీ దొంతులమ్మ తల్లికి జై
 అమ్మవారి ఆశీస్సులతో ... సదా అమ్మవారి సేవలో ....

                                                                     -ఓ భక్త రేణువు

అహంబ్రహ్మస్మి
 తత్వమసి
ప్రజ్ఞానం బ్రహ్మ
అయమాత్మ బ్రహ్మ

సర్వేజనా సుఖినోభవంతు
సహనమవతు వదీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

అథ ప్రధమో అధ్యాయః
అర్జున విషాదయోగః

ధృతరాష్ట్ర ఉవాచ

ధర్మక్షేత్రే      కురుక్షేత్రే
సమవేతా      యుయుత్సవః ||
మామకాః       పాండవాశ్చైవ
కిమకుర్వత   సంజయ  || 1 ||

ధృతరాష్ట్రుడు పలికెను - ఓ సంజయా ! యుద్ధసన్నద్ధులై  ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును ,పాండుపుత్రులును ఏమి చేసిరి ?                                                        (1)

సంజయ ఉవాచ

దృష్ట్వాతు   పాండవానీకం
వ్యూఢం      దుర్యోధనస్తదా  |
ఆచార్య      ముపసంగమ్య
రాజా          వచనమబ్రవీత్ | 2 |

సంజయుడు పల్కెను - ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించుయున్న పాండవసైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను .                     (2)


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 పస్యైతాం పాండుపుత్రాణాం
ఆచార్య మహతీంచమూమ్ |
వ్యూఢాం దూపపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా |3|
ఓ ఆచార్యా ! బుద్ధిమంతుడైన మీ శిస్యుడును ,దుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు .                                    3
 
అత్ర శూరా మహేష్వాసా
భీమార్జునసమా విరాటశ్చ
ద్రుపదశ్చ  మహారథః | 4|

ధృష్టకేతుశ్చేకితానః
కాశీరాజశ్చ  వీర్యవాన్ |
పురుజిత్ కుంతిభోజశ్చ
శైబ్యశ్చ  నరపుంగవః | 5|

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో  దౌపదేయాశ్చ
సర్వ ఏవ మాహారధా: | 6 |

ఈ సేవలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు . వారిలో సాత్యకి ,విరాటుడు ,మహారధియైన ద్రుపద మహారాజు ,ధృష్టకేతువు ,చేకితానుడు ,వీరుడైన కాశీరాజు ,పురుజిత్తు ,కుంతిభోజుడు ,నరశ్రేష్ఠుడైన శైబ్యుడు ,పరాక్రమవంతుడైన యుధామన్యుడు ,వీరుడైన ఉత్తమౌజుడు ,సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ,ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు . వీరందరును మహారథులు . శౌర్యమున భీమార్జునసమానులు .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

అస్మాకం  తు  విశిష్టా  యే
తాన్నిబోధ  ద్విజోత్తమ |
నాయకా  మమ  సైన్యస్య
సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే   | 7 |

ఓ బ్రాహ్మణోత్తమా ! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు . మీ యెఱుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను .

భవాన్    భీష్మశ్చ   కర్ణశ్చ
కృపశ్చ      సమితింజయ : |
అశ్వత్ధామ         వికర్ణశ్చ
సౌమదత్తిస్తైథైవ         చ  || 8 ||

మీరును ,భీష్ముడు ,కర్ణుడు ,సంగ్రామ విజయుడగు  కృపాచార్యుడు ,అశ్వత్ధామ ,వికర్ణుడు ,సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు . 
 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: December 09, 2018, 04:24:15 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

అన్యే చ బహువః   శూరా
మదర్థే     త్యక్తజీవితాః  |
నానాశస్త్రప్రహరణాః
సర్వే    యుద్ధవిశారదా:   | 9 |

ఇంకను పెక్కుమంది శూరులును ,వీరులును మన సైన్యమునందు కలరు . వీరందరును యుద్ధవిశారదులు ,నానాశాస్త్రాధారులు . నాకొరకు  తమ ప్రాణములు నొడ్డియైన యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు .

అపర్త్యాపం     తదస్మాకం 
బలం   భీష్మారక్షితమ్  |
పర్యాప్తం   త్విదమేతేషాం
బలం    భీమారక్షితమ్   | 10 |

భీష్మపితామహునిచే  సురక్షితము ,అపరిమితముగా నున్న  మనసైన్యము అజేయమైనది . భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము .   (10 ) 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

అయనేషు   చ  సర్వేషు
యథాభాగమవస్థితా:  |
భీష్మమేవాభిరక్షంతు
భవంతః  సర్వ   ఏవ  హి  | 11 | 

కనుక మీరందరును మీమీ స్థానములలో  సుస్థిరముగా నిలిచి ,అన్నివైపులనుండి  నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు .         (11)

తస్య   సంజనయన్  హర్షం
కురువృద్ధ:  పితామహః   |
సింహనాదం  వినద్యోచ్హై :
శంఖం  దద్మౌ  ప్రతాపవాన్  | 12 |

కురువృద్ధుడును ,ప్రతాపశాలియును  ఐన భీష్మపితామహుడు  ( దుర్యోధనుని ఈ మాటలు విని ) అతనిని సంతోషపరచుటకై ఉచ్చ స్వరముతో  సింహనాద మొనర్చి తన శంఖమును పూరించెను . (12)
 
       
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile
 

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదాభవత్  రాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

తతః    శంఖాశ్చ  భేర్యశ్చ
పణవానక గోముఖా:
సహసైవాభయహన్యంత
స   శబ్దస్తుములో   | 13 |

మరుక్షణమునందే  శంఖములు ,నగారాలు  ,తప్పెటలు ,మృదంగములు ,గోముఖవాద్యములు మొదలుగునవి ఒక్కసారిగా మ్రోగినవి . దిక్కులను పిక్కటిల్లజేయు  ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి .       (13 )

తతః       శ్వేతై ర్హ యైర్యుక్టై
మహతి  స్యందనే  స్థితా  |
మాధవః  పాండవశ్చైవ
దివ్యౌ  శంఖౌ ప్రదద్మతు :  | 14 |

తదనంతరము   శ్వేతాశ్వములను  పూంచిన  మహారథముపై ఆసీనులైయున్న శ్రీ కృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి .     ( 14 )

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 
పాంచజన్యం   హృషీకేశో
దేవదత్తం  ధనంజయః       |
పౌండ్రం   దధ్మౌ   మహాశంఖం
భీమకర్మా  వృకోదరః    | 15 |

శ్రీకృష్ణుడు పాంచజన్యమును ,అర్జునుడు దేవదత్త (శంఖ ) మును  పూరించిరి . అరివీరభయంకరుడైన భీముడు "పౌండ్రము " అను మహా శంఖమును పూరించెను .      (15 )

అనంతవిజయం     రాజా
కుంతీపుత్రో  యుధిష్ఠరః   |
నకులః    సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ      | 16 |

కుంతీపుత్రుడును రాజును ఐన యుధిష్ఠిరుడు  'అనంతవిజయము ' అను శంఖమును ,నకుల సహదేవులు 'సుఘోష ' ' మణిపుష్పకము ' లను శంఖము లను పూరించిరి .     (16)

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

కాశ్యశ్చ  పరమేష్వాసః
శిఖండీ  చ మహారథః  |
ద్రుష్టద్యుమ్నో  విరాటశ్చ
సాత్యకిశ్చాపరాజితః     | 17 |

ద్రుపదో   ద్రౌపదేయాశ్చ
సర్వసః   పృథివీపతే  |
సౌభద్రశ్చ  మహాబాహు:
శంఖాన్ దధ్ము: పృథక్  పృథక్  | 18 |

ఓ రాజా ! మహాధనుర్ధారియైన  కాశీరాజు ,మహారథుడైన "  శిఖండి " యు , ద్రుష్టద్యుమ్నుడును ,విరాటరాజు ,అజేయుడైన  'సాత్యకి ' యు ,ద్రుపద మహారాజు ,ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులును ,భుజబలశాలియు  సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి    (17-18 )

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :


శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

స ఘోషో  ధార్తారాష్ట్రాణాం
హృదయాన్ని వ్యదారయత్  |
నభశ్చ పృథివీం చైవ
తూములో వ్యనునాదయన్  | 19 |

పాండవపక్షమహాయోధుల  శంఖనినాదములకు  భూమ్యాకాశములు దద్దరిల్లినవి . ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలము లయ్యెను .        (19 )

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
ధార్తరాష్ట్రాన్  కపిధ్వజ: |
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య  పాండవః | 20 |
హృషీకేశం తదా వాక్యమ్ 
ఇదమాహ   మహీపతే  | 

అర్జున ఉవాచ

సేనయోరుభయోర్మధ్యే
రథం స్థాపయ మే అచ్యుత  | 21|
ఓ ధృతరాష్ట్ర మహారాజా ! పిమ్మట యుద్ధమునకై  నడుము బిగించి సమారా సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను  చూచి ,కపిధ్వజుడైన  అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను . " ఓ అచ్యుతా ! నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము ".    (20-21 )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

యావదేతాన్  నిరీక్షే హం
యోద్దుకామానవస్థితాన్
ఖైర్మయా  సహ  యోద్ధవ్యమ్
అస్మిన్ రనసముద్యమే    | 22 |

రణరంగమునందు  యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధు లందరిని బాగుగా పరిశీలించునంత వరకును ,వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము    (22)

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

యోత్స్య మానాన వేక్షేహం
య ఏతే త్ర  సమాగతాః  |
ధార్తరాష్ట్రస్య  దుర్భుద్దే :
యుద్ధే  ప్రియచికీర్షవః     | 23 |

" దుర్భుద్దియైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న  రాజులను అందరిని ఒకపరి పరికించెదను " (23)

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2450
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 సంజయ ఉవాచ

ఏవముక్తో  హృషీకేశో
గుడాకేశన  భారత |
సేనయోరు భయోర్మధ్యే
స్థాపయిత్వా  రథోత్తమమ్  | 24 |
భీష్మద్రోణప్రముఖతః
సర్వేషాం  చ మహీక్షితామ్ |
ఉవాచ పార్ధ పశ్యైతాన్
సమవేతాన్  కురూనితి  | 25 |

సంజయుడు పలికెను -- ఓ ధృతరాష్ట్రా ! అర్జునుని  కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును , ఆ పక్షమునందలి  మహారాజు లందరికిని ఎదురుగా ఉభయసేనలమధ్య నిలిపెను . పిదప అతడు అర్జునునితో "పార్థా ! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము " అని నుడివెను .
   

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!