Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 89148 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

9. "అల్లా " కృపాన లోకన ,
     మెల్లముగా ,విశ్వశాంతి ముఖ్యముగా ,సం
     ధిల్లగ  తపంబొనర్చిన ,
     వల్లియ ,ధర ధన్యమయ్య ,వర కాలేషా !

10. నీకది దర్భా ,రందరు
     వాకొను నీమహిమ ,భక్తి పరవశ మతులై
లోకాన ,నీదు చరితయు
ప్రాకటముగ నిల్చెగాదె ! రహి కాలేషా !


అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

 కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

11. పారావతముల ,కువకువ ,
     లారయనా నందమొసగు ,నద్భుతమగు ,నీ
     సార చరిత్రము జాతికి
     కోరిక లీడేర్చె ,సత్యగుణ ! కాలేషా !

12. నీరూపు ,రేఖ లెట్టివొ ,
     యేరికి గనరావు,సత్య మేంచిన ,సర్వో
     దారుడు ,విశ్వేశుడు ,నిన్
     వారసుని గబంపె ,నంద్రు ,వర కాలేషా ! 


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః


కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
13. నరుల జ్ఞానాంధ ,తమో
      శరధింబడి యీదలేక ,సతమతమై దు
      ర్భర బాధనుండి ,సాకగ
       నరుదెంచితి వీవుగాదె ,వర కాలేషా !

14. నీముందునిల్చి మ్రొక్కిన ,
      వ్రేమోన్నత పథము తెలియు ,పెంపొందగ ,ని
      త్యామాల మార్గము కనబడు ,
       స్వామీ ! కాపాడుమయ్య ! జయ ! కాలేషా !

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   


కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

15. నరులంద రొక్కటే ,య
      ర్వరభేదము లెన్నరాదు ,పరమాత్ముండె
      వ్వరిసొత్తుగాదు ,సర్వుల
      సిరియని చాటితివి ,విశ్వజిత ! కాలేషా !

16. ఎన్నైన పేరులున్నవి ,
      యెన్నగ నీళునకు ,నెవరి యిచ్చాశక్తిన్
      క్రన్నన గొల్చిన ,వశుడగు
      నన్నా ! యని చాటినడవయ! కాలేషా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||



కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

19. భూత ప్రేతాదులు ,దు
      ర్జాతుల్ , నీమ్రోల నిల్చుశక్తిన్ ,లేకన్
      నూతుల ,గోతుల ,దూరుచు ,
     భూతములను ,వీడునంటపొరి ,కాలేషా !

20.కరిముల్లా  ,కరిముల్లా ,
     కరిముల్లా ,యంచు భక్తగణ్యులు మ్రొక్కున్ ,
      నిరతము సుఖములనిత్తువు ,
      కరమరుదుగ ,నీకు సాటిగన ,కాలేషా !


అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 
కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

21. ఖాదరు బాబావలియున్ ,
      సాధుపరుండైన షిర్డి సాయియు ,నీవున్ ,
      కాదనక ,భక్తవరులను
     సాదరముగ జూతురంట ,జయ ! కాలేషా !

22. మువ్వురు మూర్తులు ,పరమున
     కవ్వల నివ్వలను నిల్చి ,యవని జనాళిన్
     నొవ్వక సాకుదురట ,మీ
     కెవ్వరు సము లౌదురెన్న ,నిట ,కాలేషా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

23. ఉరుసుకున కరుదెంచిన ,చో
       నరులకు విజయమ్ము కల్గు ,నాడు త్వదీయ
       స్థిర రూపు గాంచవచ్చును ,
      మురిపెమ్ములుదీర  భక్తి మొన ,కాలేషా !

24. నీయండ దండలుండిన ,
      నేయాపద చేరదంచు ,నెరనమ్ముటచే
     నాయా చోటులనుండియు ,
     నాయాసము వీధివత్తురట ,కాలేషా !

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

25.నిబ్బరము గోలుపోయెను ,
      జబ్బునపడి రోగులెల్ల ,సాకుము వారిన్ ,
       ఇబ్బడి ముబ్బడి ,వరముల
       నబ్బురము గనిమ్ము మౌనివర ! కాలేషా !

26. మనమున దుర్వ్యసనంబులు ,
     పెనుపొందగనీక ,భక్తిపెద్దల యెడలన్
     ఘనమగు రీతిన్ ,సాకుము
    మానసిజజిత! సర్వవిశ్వమత ! కాలేషా !
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )

27.కాలేషా ! కాలేషా !
    కాలేషా ! నీవు మాకు గతియని ,గొల్వన్
   మేలును గూర్తువు ,నాదగు
  లీలలు దెలియంగలేములే ! కాలేషా !

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2175
    • View Profile
    జై సాయి మాస్టర్ !
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

    శ్రీ గురు గీత :

    శ్లో || 22.    మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
                   మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

    అలివేలుమంగమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి (శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    ఓం శ్రీ అలివేలుమంగతాయినే నమః
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ మన్నవ వంశోద్భవాయై నమః
    ఓం శ్రీ భరద్వాజ ధర్మపత్నే నమః
    ఓం శ్రీ భరద్వాజ సహధర్మచారిణే నమః
    ఓం శ్రీ దత్త రూపిణే నమః
    ఓం శ్రీ భక్తవత్సలాయై నమః
    ఓం శ్రీ సర్వజనామోదకాయై నమః
    ఓం శ్రీ ప్రేమరూపిణే నమః
    ఓం శ్రీ ప్రేమప్రదాయినే నమః
    ఓం శ్రీ త్రిగుణాయై నమః
    ఓం శ్రీ గుణరహితాయై నమః
    ఓం శ్రీ గురుపత్నినే నమః
    ఓం శ్రీ రూపరహితాయై నమః
    ఓం శ్రీ చిద్రూపాయై నమః
    ఓం శ్రీ నామరూపాయై నమః
    ఓం శ్రీ నామరూపరహితాయై నమః
    ఓం శ్రీ తాయినే నమః
    ఓం శ్రీ మంగతాయినే నమః
    ఓం శ్రీ మంగళప్రదాయినే నమః
    ఓం శ్రీ భేద వర్జితాయై నమః
    ఓం శ్రీ సద్భోధకాయై నమః
    ఓం శ్రీ సన్మార్గదాయకాయై నమః
    ఓం శ్రీ ఆగ్రహ అనుగ్రహాయై నమః
    ఓం శ్రీ శాంతమూర్తినే నమః
    ఓం శ్రీ చిద్విలాసాయై నమః
    ఓం శ్రీ ప్రేమపాలితాయై నమః
    ఓం శ్రీ వైభవాయై నమః
    ఓం శ్రీ నామవైభావాయై నమః
    ఓం శ్రీ శాంతాకారాయై నమః
    ఓం శ్రీ దుష్టగ్రహ నాశకాయై నమః
    ఓం శ్రీ బాలకృష్ణాపుత్రిణే నమః
    ఓం శ్రీ అనసూయా మాతా సేవావ్రతాయై నమః
    ఓం శ్రీ పతిసేవావ్రతాయై నమః
    ఓం శ్రీ పతిసేవా దురంధరాయై నమః
    ఓం శ్రీ కల్యాణప్రదాయినే నమః
    ఓం శ్రీ సామగానప్రియాయై నమః
    ఓం శ్రీ దీనావత్సలాయై నమః
    ఓం శ్రీ సద్ధర్మ స్థాపనాయై నమః
    ఓం శ్రీ సద్ధర్మచారిణే నమః
    ఓం శ్రీ సంకల్ప మాత్రేన ప్రసన్నాయై నమః
    ఓం శ్రీ భాగవతే నమః
    ఓం శ్రీ భాగవత ప్రియాయై నమః
    ఓం శ్రీ ధ్యాన రూపాయై నమః
    ఓం శ్రీ ధ్యానగమ్యాయ నమః
    ఓం శ్రీ సదసద్వివేక యోగాయై నమః
    ఓం శ్రీ యోగినే నమః
    ఓం శ్రీ ముక్తాయై నమః
    ఓం శ్రీ మూలమంత్రాయై నమః
    ఓం శ్రీ బ్రహ్మస్వరూపిణే నమః
    ఓం శ్రీ విష్ణుస్వరూపిణే నమః
    ఓం శ్రీ శివస్వరూపిణే నమః
    ఓం శ్రీ జ్ఞానప్రియాయై నమః
    ఓం శ్రీ మంత్రరూపిణే నమః
    ఓం శ్రీ మాయా మానుష రూపిణే నమః
    ఓం శ్రీ భవభయ నాశకాయై నమః
    ఓం శ్రీ పాదుకాప్రదాయినే నమః
    ఓం శ్రీ పతిపూజా దురంధరిణే నమః
    ఓం శ్రీ పతివ్రతాయై నమః
    ఓం శ్రీ అవధూతరూపిణే నమః
    ఓం శ్రీ అన్నవస్త్రదాయకయై నమః
    ఓం శ్రీ ఆరోగ్యప్రదాయినే నమః
    ఓం శ్రీ నిర్లిప్తాయై నమః
    ఓం శ్రీ నిశ్చలాయై నమః
    ఓం శ్రీ జన్మదుఃఖ నాశకాయై నమః
    ఓం శ్రీ శరణాగత వత్సలాయై నమః
    ఓం శ్రీ అమృత వర్షిణే నమః
    ఓం శ్రీ కాలరూపిణే నమః '
    ఓం శ్రీ కాల గమనాయై నమః
    ఓం శ్రీ త్రికాలవంధ్యాయై నమః
    ఓం శ్రీ దానప్రియాయై నమః
    ఓం శ్రీ భాగవతోత్తమాయై నమః
    ఓం శ్రీ ఆద్యంత రూపిణే నమః
    ఓం శ్రీ జగత్పాలితాయై నమః
    ఓం శ్రీ సృష్టి స్థితి లయకారణాయై నమః
    ఓం శ్రీ మంత్రమూర్తినే నమః
    ఓం శ్రీ నాదరూపిణే నమః
    ఓం శ్రీ పరమ పావనాయై నమః
    ఓం శ్రీ కారుణ్య మూర్తినే నమః
    ఓం శ్రీ దీనజనోద్ధారిణే నమః
    ఓం శ్రీ భక్తపాలకాయై నమః
    ఓం శ్రీ లక్ష్మీనివాసకాయై నమః
    ఓం శ్రీ జ్ఞానరూపిణే నమః
    ఓం శ్రీ ఓంకార ప్రియాయై నమః
    ఓం శ్రీ అలంకారప్రియాయై నమః
    ఓం శ్రీ సత్సంగ ప్రియాయై నమః
    ఓం శ్రీ సత్యవ్రతాయై నమః
    ఓం శ్రీ సర్వసమ్మతాయై నమః
    ఓం శ్రీ సర్వమంత్రాత్మికాయై నమః
    ఓం శ్రీ సర్వ తంత్రాత్మికాయై నమః
    ఓం శ్రీ సర్వరోగనివారణాయై నమః
    ఓం శ్రీ సర్వదీన శరణ్యే నమః
    ఓం శ్రీ భక్త రక్షణ్యే నమః
    ఓం శ్రీ అమృత వర్షిణే నమః
    ఓం శ్రీ ఆనంద రూపిణే నమః
    ఓం శ్రీ ఆనంద ప్రదాయయకాయై నమః
    ఓం శ్రీ సత్యవ్రతాయై నమః
    ఓం శ్రీ నారాయణీ స్వరూపిణే నమః
    ఓం శ్రీ గురుకుల సేవా తత్పరాయై నమః
    ఓం శ్రీ సాయి సేవా దురంధరణ్యే నమః
    ఓం శ్రీ పతిసేవా తత్పరాయై నమః
    ఓం శ్రీ పరదేవినే నమః
    ఓం శ్రీ లలితా రూపిణే నమః
    ఓం శ్రీ భావరూపిణే నమః
    ఓం శ్రీ జగత్ సాక్షిణే నమః
    ఓం శ్రీ భరద్వాజ కుల దీపినే నమః
    ఓం శ్రీ సర్వజనప్రియ తాయినే నమః
    ఓం శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ భరద్వాజ గురవేనమః [/li]
    [li][/li]
    [/list][/li]
    [li][/li]
    [/list][/li]
    [li][/li]
    [/list]
                     
                           దివ్యజనని అష్టోత్తర శతనామావళి సమాప్తం

    అలివేలుమంగ పతి నీకిదె వందనం !
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
    [/b]

    Gurupriya

    • Hero Member
    • *****
    • Posts: 2175
      • View Profile
    జై సాయి మాస్టర్ !
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

    శ్రీ గురు గీత :

    శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
                  గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   
                   

                                                 ఓం
                                          దివ్యజనని
     దత్త పాదుకా  శతకము( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః

    ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః
     
    ఓం శ్రీ గురు భరద్వాజయ నమః

    ఓం మాతృశ్రీ అలివేలు మంగతాయినే నమః


    గతిర్భర్తా ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్

    సమర్ధ సచ్చితానంద భగవాన్ సాయి సద్గురు


    అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం

    సమర్ధ సచ్చితానంద భగవాన్ సాయిసద్గురు


    పార్వతీపుత్ర ! నా ప్రార్ధన నాలకించి

    మోదంబున కామితముల నొసగుమయ్య

    తలప ,నీదు నామంబె బ్రోచు గాదె

    తొలుత నీకిదె నా వందనంబు


    చదువులకు రాణి -శ్రీవాణి మనవి వినుమ

    చేరి నిన్ను కొలిచెద ఆదుకొనుమ

    నాదు  వాక్కున నిలిచి అండనుండుము తల్లి

    నీకిదె శతశతంబుల వందనములు .


     
    అలివేలుమంగపతి నీకిదె వందనం !
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

    Gurupriya

    • Hero Member
    • *****
    • Posts: 2175
      • View Profile
    జై సాయి మాస్టర్ !                     
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

    శ్రీ గురు గీత :

    శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
                   గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                                             ఓం
                                       దివ్యజనని
    శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    1. సర్వదేవతా స్వరూప శ్రీ సాయి దేవ
        సర్వసాధు స్వరూప శ్రీ సాయి దేవ
        సర్వజీవ స్వరూప శ్రీ సాయి దేవ
        దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

    2. తల్లితండ్రులకన్న దైవంబుకన్న
         సద్గురువె మిన్నయని తెలుసుకోరన్న
         భవ భయంబుల బాపు సాయి సద్గురుని
          దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .


     అలివేలుమంగపతి నీకిదె వందనం !     
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

     

     





     

    Gurupriya

    • Hero Member
    • *****
    • Posts: 2175
      • View Profile
    జై సాయి మాస్టర్ !
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

    శ్రీ గురు గీత :

    శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
                జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥


                                               ఓం
                                           దివ్యజనని
                                    దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    3. కలియుగంబున శ్రీ సాయి కల్పతరువు
        దత్త అవతార మూర్తిగ తాను వెలసె
        రండి రారండి భరద్వాజ గురుని యింట
        దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .

    4. దత్తరూపంబు నీలోన జూచితయ్య
        దత్త పాదుకాస్తుతి తెలియ పలుక
        దత్తమై నా మనసున నిండియుండు
        దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .

    అలివేలుమంగ పతి నీకిదె వందనం !
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
     
     



     
     


                                                                   

                                                                                                                                                                                             

    Gurupriya

    • Hero Member
    • *****
    • Posts: 2175
      • View Profile
    జై సాయి మాస్టర్ !
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
     
    శ్రీ గురు గీత :
    శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
                   యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                 
                                            ఓం
                                       దివ్యజనని
    శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    5. ఎక్కిరాల భరద్వాజ యోగివరుడు
         చేరి శ్రీ సాయినాథు సేవించినాడు
         గురుచరిత్రయు లీలామృతంబును వ్రాయ
         దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

    6. భక్తిభావంబు ,భవ్య చరితలను
        ఎన్ని విధముల ఎందరో వ్రాయలేదె ?
        సత్యపథమందు దివ్వెలుగ నిలువలేదె ?
       దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .


    అలివేలుమంగ పతి నీకిదె వందనం !
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

    Gurupriya

    • Hero Member
    • *****
    • Posts: 2175
      • View Profile
    జై సాయి మాస్టర్ !
    గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
    అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

    శ్రీ గురు గీత :
        శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
                   తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥


                                              ఓం
                                       దివ్యజనని
    శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

    7. ఎందరో మహాత్ముల ఆశీస్సునొంది
        వేవేల కృతులు వ్రాసితిరి మున్ను
        ప్రతి కృతీ శిరోధార్యముగ ఎంచి
        దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .

    8. సాయి -ప్రియ బిడ్డ యందురు మాహాత్ములంత
        మహాత్ముల బిడ్డయందురు సాయీశు భక్తులంత
       సత్యశోధకుడైన మన భరద్వాజ గురుని
       దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .
       

     అలివేలుమంగ పతి నీకిదె వందనం !
    జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!