Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 83735 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

29. రామా ! యన్న ,రహీమటన్న ,మదిలో క్రైస్తన్న ,నీ ముగ్గురున్
      ప్రేమాధారులు విశ్వవంద్యులు కదా ! వేయేల వాదాలు ,ఏ
      దోమార్గంబుని వారిగొల్పి నిజధర్మోద్దీప్తి వెల్గింపగా
      లేమా ! వాదములేల ? స్వార్ధరహితమ్మే ముక్తి ;ఖాదర్వలీ !

30. కులమర్యాద నతిక్రమింప నతడే ,క్షోణీతలింబుత్రు -డ
       త్యలఘ ప్రేమ ,పతింభజించునదియే ,తథ్యంబుగాదార ,న
      త్యల స్దరీతి,వచించు నాతడెగురుండీ ,మువ్వురున్ ,జీవికిన్
      తొలిజన్మ వ్రధలభ్యమౌదురు గదా ! తోడ్తోన ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

31. పురుషుండన్ ,ననుగొల్చి యుండవలయున్ ,పూబోడి , యంచూరకే
     గరువంబున్ ,మదిజేర్చి ,పల్కవల దాకాంతామణీ భావమున్,
     బరికింపన్ వలె -నిర్వురన్ గలిసి నిర్వర్తింప ,సంసార సా
    గరతీరంబును జేరవచ్చు నలవోకన్ ,మౌల్వి ,ఖాదర్వలీ !

32. కాంతాకాంచనముల్ ,వ్యధాభరితముల్ కంగారుపుట్టించుచున్
       స్వాంతంబుం ,బులకింపజేయు ,నరుద్దీసత్యంబు నూహించియున్
      పంతంబు గొను వానిబొంద -పరతత్త్వ ప్రాప్తికీ రేండు నున్
      చింతాకంతయు తోడుపడ్డ కథలేవీ ! లేవు ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

33. జితకాముల్ ,పరతత్త్వ బోధకులు ,సృస్టిన్ మార్చు యోగీంద్ర ,స
      త్కృతులవ్వారికె చెల్లుగాని ,నిరతాంధీభూత చేతన్కు ,లు
     ద్దతులేరీతి గ్రహింత్రు నిన్ను - గురుబోధానంద సంధాన స
     ద్గతి యెవ్వారికి దక్కు ,నీ యెడల తథ్యంబిద్ధి ఖాదర్వలీ !

34. నీసందర్శన మాచరించుకొనగా -నీ సేవలో నిల్వగా
     నీ సాన్నిధ్యము నందు శాంతి సుఖసందేశమ్ములన్ బొందగా
    నీ సంబంతయు వీలుచిక్కదు కదా ! హీనాతిహీనంబుగా
    గాసించేందు ,కుటుంబభారమున ,లోకారాధ్య! ఖాదర్వలీ !


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

35. నినుసేవించి ,జగత్ప్రసిద్దిగను ,వారింగూర్చి విన్నాడ -వా
      రిని నిత్యంబును సాకుదంట కరుణాదృష్టిన్ ,మహోదార భా
     వనకుం ,దర్పణ మైవెలుంగు భవదీయంబైన రూపంబు ,నా
     మనమందేంతునతమ్ము సాకగదవే మన్నించి ,ఖాదర్వలీ !

36. భగవంతుడన నెవ్వడో -యెచటనో బ్రహ్మాదులందుగాన రా
      సుగుణోదీపకునంచు  నెంతురిదియే చోద్యంబు - నీలోననే
     సగుణాకారుని కాంచగల్గితిమి విశ్వాసంబు మిన్నంద -నీ
    జగతిన్ -భక్తజనైక రక్షక ! జగత్ సంధాన ! ఖాదర్వలీ !


అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥


 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

37. దరిజేరన్ భయమందు భక్తవరునిన్ ,దాక్షిణ్యమేపార -ద
      గ్గరకుం జేర్చి వరంబులిత్తువట -రోగగ్రస్తులంబిల్చి సా
      దరపూర్వంబుగ సేదదీర్తువట -నిత్యంబాపర బ్రహ్మ ,సం
     స్మరణన్ ముక్తికి దారి చూపుదట -ధర్మాధీన ! ఖాదర్వలీ !

38. " అల్లా " యంచు నమాజు చేయుదురు ,ప్రాయశ్చిత్తముంగోరి -తా
        మెల్లన్ వేళల నల్పు పాపములకున్ విశ్వాసహీనుల్ -నిజం
       "బల్లా " యంచు దలంపబోరు -ధనమందాసక్తితో నిత్యమున్
        కల్లల్ బల్కుదు ,రట్టివారలకు ,స్వర్గంబున్నె ? ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )

39.  పరులన్ వంచనజేసి ,విత్తమును సంపాదించినన్ దానితో
       ధరసౌఖ్యంబు లభింప బోవదు రుజాతాపంబు తీద్రించుచున్
      నరునిన్ కృంగదీయు ,నిత్యమును పంతంగూర్చు -సద్భక్తితో ,
     దరిసింపన్ ,నిను ,దీరుకష్టములు ,సత్యస్ఫూర్తి ! ఖాదర్వలీ !

40. ఎవరిందిట్టక ,నెట్టికష్టములలో ,విశ్వాసమున్ వీడకా
     దివిజాధీశుని ,భక్తిగొల్చునితడే ,దేదీప్యమానంబుగా ,
    భూవివర్ధిల్లును ,సర్వమానవులకున్ , పూజ్యుండుగానిల్చు ,దు
    ర్వ్యవసాయంబున కీడునల్ప ,కలుగున్ వైరంబు ,ఖాదర్వలీ !


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

41. " అచ్ఛాహై  " ఇటురమ్ము నీవు "ఖుదరత్  వాలావు " నామాటలో
        బొఛెంబింతయులేదు -నావలననే పుణ్యంబు గణ్యంబుగా
       నిచ్చల్ గల్గును నీకు -సర్వశుభముల్ నిండున్ ,దురాలోచనల్
        " బచ్చా " వీడుమటన్న నీనుడులు సంభావింతు ఖాదర్వలీ !

42. కుడిచేతన్నొక ,దీపమార్పి యెడమన్ ,కోర్కెన్ వెలిగించు దు
      ష్టుడు సంపద్ సుఖముల్ ,గడించినను వంశోద్దారకుల్ ,పుత్రులె
      న్నడు ,కాజాలరు ,పాపముణ్యములరెంటన్ దుల్యుటంచాతనిన్
      నుడువన్ నేర్తుమె ? దుర్విదగ్ధ గుణచిత్తుంబూన్క ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 
శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

 


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

43. నీకేమేలొన గూడ గాదలతువో నీయాత్మ లోనద్దియే
      సాకల్యంబుగ కోరుకొమ్మొ రులకున్ సర్వేశ్వరుం ,డెప్పుడ
      స్తోక శ్రీ సమకూర్చు నీకనుచు ,సంస్తుత్యంబుగా ,పల్కునీ
      నాకుల్ ,నమ్మిన వారికెట్టి సడిచేరంబోడు ;ఖాదర్వలీ !

44. దైవాధీనము ,కష్టనష్టములు ,విద్యాద్మాన్యు లీనత్యమున్ ,
      భావంబందు ,దలంత్రుకాని ,వరులీ వాక్యంబులో నెంచకన్ .
      దైవంబుంగడుదూరుచుండ్రు -సిలుగుల్ దండింప ,జన్మాంతరం
      బౌవిజ్ఞానము ,సాకుచుండు జనులన్ పల్మారు ;ఖాదర్వలీ !

                               
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

45. ఉన్నాదొక్కడునంత విశ్వమతడే మోమున్ సదాయంచు నీ
      వన్నావయ్యది దబ్బరంచు బలుకంగా చెల్లునే ! తాదృశుల్
      తిన్నంగా గనుగొంద్రు సర్వసమతా దృష్టిన్ మహోదారసం
      పన్నానంద తపోవిభూతి పరులెట్లాసింత్రు ? ఖాదర్వలీ !

46. " మేరేనామ్ నునకర్ ఫిరిస్తగవూదూర్మే ఠేరే గే " యంబు బల్
         ధీరత్వంబున జాటిచెప్పితివి మూర్తీభూవ దైవంబ వీ
         వౌరా ! అందరు జ్యోతిషంబునకు నీయాయుష్షు స్వచందవుం
         దీరేగా భవదీయ మృత్యుదశ సిద్ధింబొంద ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!