Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 108641 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                               శ్రీ గజానన్ మహారాజ్ దివ్యచరిత్ర ( వేము రామ మోహన రావు )

శ్రీ గజానన్ మహారాజ్ 23- 2-1878 తేదీన అకస్మాత్తుగా మహారాష్ట్రములో గల ,అకోలా జిల్లా ,షేగాంలో ప్రత్యక్షమయ్యారు ,వీరు స్వామి సమర్ధ రామదాసుగారి నివాస స్థానమైన "సజ్జన్ గడ్ " నుండి వచ్చారని ఒక వాదన ఉంది . కానీ దానికి సరైన ఆధారాలు ఏమీ లేవు అని తెలుస్తోంది . వారు ప్రకటితమయ్యే నాటికి ప్రజలు అనేక రకములైన కష్ట నష్టములను ఎదుర్కొనుచు వివేకహీనులై ప్రవర్తించుచున్నారు . హిందు ముస్లిముల మధ్య సఖ్యత జరుగుచున్న సమయములో అవతరించారు . శ్రీ షిర్దీ సాయిబాబా సమకాలీకులు . శ్రీ షిర్డీ సాయిబాబా ఊరి వెలుపల వేపచెట్టు వద్ద ప్రకటితమైనారు .
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

« Last Edit: February 23, 2018, 11:14:34 AM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

గోరఖ్ నాథుడు బయట పారవేసిన పెంటలో జన్మించాడట ,కాశీనాథుడు చెవి నుండి ,చాంగ దేవుడు జలము నుండి జన్మించారని వారి చరిత్రలు చెప్పుచున్నవి . అలాంటిదేదో జన్మ రహస్యం గజాననుని విషయంలో గూడా ఉండి  ఉండవచ్చును .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: February 23, 2018, 11:17:11 AM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                           శ్రీ గజానన్ మహారాజ్ దివ్యచరిత్ర ( వేము రామ మోహన రావు )

ఎంగిలి విస్తళ్లలో భుజించుట

పాతూర్కర్ వంశంలో దేవదాసు ఒక సజ్జన మఠాధిపతి ఉండేవాడు . అతను దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు . అతని కుమారుని గ్రహశాంతి కొరకు బ్రాహ్మణ సంతర్పణ ఏర్పాటు చేశాడు . భోజనానంతరం ఎంగిలి విస్తళ్ళు బయటపారేశారు .ఆ ఎంగిలి విస్తళ్ళ వద్దే గజానన మహారాజ్ కూర్చొని ,విస్తళ్లలో మిగిలిన పదార్థములను భుజించి తన జఠరాగ్నిని శాంతపరిచారు . కానీ తాగటానికి నీరు లేదు . అందుచేత స్వామి దగ్గరలో ఉన్న పశువులకై వుంచిన నీరు త్రాగి తృప్తి చెందారు . ఇంతలో త్రాగుటకు నీరు లేదని తెలుసుకొనిన పంత్ నీరు తెచ్చుటకు వెళ్లి తిరిగి వచ్చెను . అప్పటికే స్వామి నీరు  తాగుటచూచి అవి మంచినీరు గాదు  అని చెప్పెను . బ్రహ్మ బ్రహ్మాండమంతా  నిండి ఉన్నప్పుడు పవిత్రం అపవిత్రం ,మంచి -చెడూ అను తేడాలుండవు . నీరు కూడా ఈశ్వరుడే . స్వామి యొక్క అమృత వాక్కులకు ,అవాక్కయి సాష్టాంగ దండ ప్రమాణం చేయబోగా అచ్చట నుండి లేచి వెళ్లిపోయారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                    శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

శ్రీ బంకట్ లాల్ స్వామిని ఆ ఎంగిలి పదార్థములు భుజించుట మెందుకు ? మీకు శుభ్రంగా పెడతాము దయచేయండి అని ఆహ్వానించినా వారిలో ఒకడు . అలా స్వామి వెళ్ళిపోగానే ఆ బంకట్ లాల్ క్రుద్ధు డైనాడు . తానూ సర్వస్వం  పోగొట్టుకున్న వాడిలాగా బాధపడ్డాడు . చేతి కందిన వజ్రం జారిపోయినంత పనైంది . అతనికి ఎటు చూసినా స్వామి స్వరూపమే కనుపించినట్లుగా బాధ పడుతున్నాడు . ఆహార ,నిద్రాదుల ధ్యాసే  లేదు . తన బాధ ఇది అని చెప్పుకోదగ్గ వారెవరు కనబడలేదు . షేగాం అంతా స్వామికోసం వెతికి వేసారిపోయాడు . ప్రయాసే మిగిలింది . ఇంతలో అతని తండ్రి భవానీ రాం కనపడి అతని పరిస్థితి కారణమడిగెను . ఏవో మామూలు మాటలు చెప్పి తప్పించుకున్నాడు . చివరకు తన యింటి ప్రక్కన జమీందారు రాంజీ పంత్ తో స్వామిని గురించి విన్నవించాడు . రాంజీ పంత్ అతను మాహాయోగియై వుంటాడు . వారి దర్శన భాగ్యం నాకు కూడా కలిగించు అని వేడుకున్నాడు .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                        శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )                                             

హరికథా గానము

గోవింద్ భువాటార్క రీర్ అను సంకీర్తనాకారుడు ,"సారంజ్ఞధర " కథాగానం చేస్తే ఆ స్వామి ప్రత్యక్ష మయ్యేవారని  ప్రతీతి . వారు ఆ సమయంలో షేగామ్ కు సంకీర్తన చేయడానికి వచ్చారు . గ్రామంలో పిన్నలు పెద్దలందరు విచ్చేసారు . అక్కడికి బంకట్  లాల్ కూడా వెళ్ళాడు . మార్గమధ్యలో పీతాంబరుడనే దర్జీ కలిసాడు . స్వామిని గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో మందిరం వెనుక స్వామి ఆశీనులైనట్లు కనిపించి దరిద్రునకు ధనము దొరికినంత సంతోషంగా స్వామిని సమీపించి ,తినటానికి ఏమైనా తెమ్మంటారా అని అడిగారు ! జొన్న రొట్టె ,శనగపిండి కూర తెమ్మన్నారు . తరువాత త్రాగటానికి నీరు ఎదురుగా ఉన్న చిన్న కాలువలో తీసుకొనిరమ్మన్నారు . ఆ నీరులో చెంబైన మునగదు పైగా నీరు అపరిశుభ్రముగా  ఉన్నది ఉన్నది అని చెప్పిరి . మరెక్కడైనా తెమ్మందురా అని అడుగగా అక్కర్లేదు నేనేది చెప్పితే అది చెయ్యి అంతే . నా నోటి నుండి వచ్చే మాటలు ఆచరించ లేనప్పుడు నన్ను మందిరములోనికి బలవంతము చేయుట దేనికి . వ్యక్తి యొక్క మాటను బట్టే ప్రవర్తన ఉండాలి . అది సాధకునికి చాలా అవసరము . కీర్తనకారుడు శ్లోకానికి అర్ధం చెబుతూండుట విని భావాన్ని బట్టే నడవడి గూడా మారాలి . కేవలం పొట్ట పోసుకొనటానికే బ్రతకకూడదు . స్వామి ఈ పలుకులకు  చాలా మార్పు చెందాడు . హరిదాసు ( కీర్తనకారుడు ) ,ఎవరి దారిన వారు జరిగిన విషయాన్ని పదే చెప్పుకుంటూ వెళ్లిపోయారు .

 

                                                         


  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                                శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర (వేము రామ మోహన్ రావు )

బంకట్ లాల్ ఇంటికి వచ్చుట

బంకట్ లాల్ మాత్రం స్వామిని తన ఇంటికి తీసుకుపోవాలనెడు కోర్కె తీవ్రంగా వుండి తన తండ్రి అనుమతి పొంది స్వామిని దర్శించి ప్రదోషకాలములో సాదరంగా తన ఇంటికి తోడ్కొని పోయెను . ప్రదోషకాలంలో శివపూజ చేయువాడు పునీతుడు కాగలడు . సాక్షాత్తు స్వామి తన యింటికి ప్రదోష కాలములో రావటం గురించి వేరే చెప్ప నక్కరలేదు . పంచభక్ష్య పరమాన్నములతో భోజనం ఏర్పాటు చేశారు . స్వామి ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేసి అంతా కక్కిపోసారు . అలా చేయుటవల్ల  అమితంగా తినటం మంచిది గాదు  అని చెప్పారు . ప్రకృతి ధర్మాలను మహాత్ములు పాటిస్తూ వాటిని ఆచరింప చేస్తారు . ఇంతలో రెండు భజన మండళ్లు అక్కడకు వచ్చి 'విఠల్ ' దేవు నామాన్ని గానం చేస్తున్నారు . ఆ గానానికి సంతసించి "గణ గణ గణాంత బోతే " అని భజన పాట  ప్రారంభించారు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                    శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

రాను రాను బంకట్ లాల్ గృహము ఒక తీర్థ స్థానంగా మారిపోయింది . స్వామి దర్శనార్థం భక్తులు విరివిగా వస్తూ ఉండేవారు . స్వామి దర్శనార్థం ఒక సన్యాసి కౌపీనం ధరించి ,మృగ చర్మం కప్పుకొని ఒక మూల కూర్చొని ఈ జన సందోహంలో స్వామిని దర్శించేదెలాగ అని ఆలోచిస్తున్నాడు .  ఎవరికీ ప్రియమైన తిను బండారాలు వారు సమర్పిస్తున్నారు . ఈ సన్యాసి గంజాయి సమర్పిద్దామని మ్రొక్కుకున్నాడు . దానిని గ్రహించి స్వామి అతనికి కబురు పంపి నీ మొక్కు తీర్చుకో అని చెప్పారు . సందేహించుచున్న సన్యాసి మనస్సు గ్రహించిన స్వామి గంజాయి అడిగి తీసుకొని మొక్కుకునే సమయంలో లేని సిగ్గు ఇప్పుడెందుకు అన్నారు . కానీ ఆ సన్యాసి మీరెప్పుడూ గంజాయి తాగుతానని మాట ఇవ్వండి అని ఆర్ధించాడు . గంజాయిని వేళాకోళం చేయకండి ,దీనిని శంకరులు 'జ్ఞానవల్లి ' అన్నారు  . అప్పటినుండి గంజాయిని ఇతరులకు లీలగా చూపించటం కోసం మాత్రమే గంజాయి త్రాగటం ప్రారంభించారు . 

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీ గజానన్ మహారాజ్  దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

స్వామి వింత చర్యలు

ఒకప్పుడు గాయకునిలాగా "గణ గణ గణాంత బోతే ! అనే తన భజన గీతం అనేకా రాగాలలో పాడేవారు . ఒకప్పుడు ఏకాంతంగా కూర్చొనే వారు . ఒకప్పుడు అకస్మాత్తుగా ఎవరింటనో కనబడేవారు . ఇది ఆయన దినచర్య . జానారావ్ దేశముఖ్ వ్యాధిగ్రస్తుడై ఏ మందులు వాడినా పనిచేయలేదు . వైద్యులు ప్రయత్నమంతా వృధా అయినది . అతను బతికే ఆశ కనపడలేదు . ఎంతమంది దేవతలకు మొక్కినా లాభం లేకపోయింది . బంకట్ లాల్ ఇంటిలో ఒక యోగి పుంగవుడున్నాడు ,అతనికి విషయము విన్నవించిన కొంతవరకు ఉపయోగముండవచ్చును అని తలచి భవానీరామ్ ను పంపిరి . భవానీరాం ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని స్వామి పాదాలకు తాకించి ,స్వామి ఈ తీర్థాన్ని జానా రావుకు ఇస్తున్నాను అని చెప్పెను . స్వామి దానికి సమ్మతించగా ఆ తీర్థాన్ని జానారావుకు ఇచ్చెను . స్వామి మహిమవలన వ్యాధి తగ్గి ఆరోగ్యవంతుడయ్యెను . యోగులు ఆకస్మికంగా మరణాన్ని తప్పించగలరు గాని విధి విధానాన్ని పూర్తిగా తప్పించలేరు . మృత్యువు మూడురకాలు ,ఒకటి ఆధ్యాత్మికతము ,రెండవది ఆది భౌతికము ,మూడవది ఆది దైవికము . ఈ మూడింటిలో ఆధ్యాత్మిక మృత్యువు బలవత్తరమైనది . శరీరంలో అనేక రోగాలు పుడతాయి . ఇలా వ్యాధి గ్రస్తమైన దేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది . ఐనా సరైన కాలంలో సరైన వైద్యం చేయబడి నట్లయితే దీనిని తప్పించుకోవచ్చును . కానీ వైద్యుడు సిద్దహస్తుడై ఉండాలి . అకస్మాత్తుగా వచ్చిన జబ్బులను ,మృత్యువును మొక్కుబడులు ద్వారా తప్పించుకోవచ్చును . ఇదికూడా భౌతికము ,దైవికము అని రెండు రకాలు . ఇక మూడవది ఆధ్యాత్మిక మృత్యువు ,దీన్నెవరు తప్పించలేరు . సాక్షాత్తు దైవమే ప్రక్కన నిల్చిన మృత్యువు నుండి రక్షణ పొందుట కష్టము .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                           శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

యోగి సేవ చేస్తూ ఒకడుండేవాడు . వాడు మహా గర్విష్టి . స్వామి పేరు చెప్పుకొని ,స్వామికి వచ్చే మిఠాయిలన్ని తానే భక్షించేవాడు . నేను ఏది చెప్పినా స్వామి వింటారు . స్వామి శంకరుడైతే తానూ నందీశ్వరుడనే వాడు . ఇది అంతా స్వామి గ్రహిస్తూనే ఉన్నారు . ఒకరోజు స్వామి నిద్రిస్తున్నారు . భక్తులు స్వామి దర్శనార్ధం వచ్చారు . తొందరగా వెళ్ళాలి . కాని లేపే ధైర్యం ఎవరికి లేదు . డాంబికుడైన సేవకుడు విఠోభా ,అతనితో పని పూర్తి చేసుకోదలచి అతనిని వేడుకున్నారు . అందుకు పొంగిపోయినవాడై వెనక ముందు ఆలోచించక స్వామిని లేపాడు . భక్తుల కోరికైతే తీరింది గాని ,విఠోభా పెద్ద చిక్కులో పడ్డాడు . ఒక పెద్ద కర్ర తీసుకొని విఠోభాను చావమోదారు . ఆ దెబ్బలు భరించలేక ఆశ్రమం వీడిపోయాడు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                                      శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( శ్రీ రామ మోహన రావు )

కరంజా అనే గ్రామములో సజ్జనుడు ,ధనికుడైన లక్ష్మణుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు . ఎన్ని ప్రయత్నాలు చేసిన రోగం తగ్గలేదు . బలహీనతవల్ల నడవలేకపోయేవాడు . కనీసం చేతులెత్తి నమస్కారం చేయలేని స్థితిలో వున్నాడు . భర్త బదులు భార్యయే స్వామికి వినమ్రతతో నమస్కరించి తన భర్తను రోగ విముక్తుణ్ణి చేయవలసినదిగా ప్రార్ధించింది . అప్పుడు స్వామి మామిడిపండు తింటున్నారు . దానిని లక్ష్మణుని భార్య వైపు విసిరి ఆయనచేత తినిపించు ,అంతా సర్దుకుంటుంది అని యింకేమి మాట్లాడకుండా గంజాయి తాగడం ప్రారంభించారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

                                  శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర (వేము  రామ మోహన రావు )

               స్వామి హుక్కా కాల్చుట

బంకట్ లాల్ ఇంటిముందు పిల్లలకు ఒక చిన్న ముచ్చట చూపిద్దామనుకున్నారు . వారు హుక్కాలో పొగాకు వేసి నిప్పంటించమని పిల్లలతో చెప్పారు . నిప్పుకోసం కంగారుపడుతున్నారు . మన వీధిలో కంసాలి ఉన్నాడు కదా అక్కడనుంచి నిప్పు తెద్దామనుకున్నారు , అతని యింటికి వెళ్లి కొద్దిగా నిప్పు యిమ్మన్నారు . ఆమాటలు వింటూనే మండిపడ్డాడు . స్వామి వారికి నిప్పు యిస్తే అది మంగళప్రదం ,ఎంత చెప్పినా ఆ కంసాలి అవహేళన జెసి నిప్పు ఇవ్వ నిరాకరించి గజాననుని గొప్పతనం తెలుసుకొనలేక పోయాడు . అంతటితో ఆగక బంకట్  లాల్ ఒక మూర్ఖుడు కాబట్టి వాడు భజనలు చేస్తుంటాడు . అయినా నిప్పు కొరకు అడుక్కొనమేమిటి ?ససేమిరా నిప్పు ఇవ్వలేదు . చివరకు బంకట్ లాల్ ని ఒక పుల్ల ఆ చిలుం పై ఉంచమని చెప్పారు . కొంచెం ఆగండి నిప్పుపుల్ల తెస్తాను అన్నాడు బంకట్ లాల్ . నువ్వు తేవద్దు . నేను చెప్పినది చెయ్యటమే నీపని . ఇలా పుల్ల తగిలించగానే చిలుం దానంతట అదే అంటుకుంది . కాని కంసాలి యింట్లో అనర్ధం జరిగింది . చింతామణి అనే పదార్ధాన్ని చింతపండు ,బెల్లం మొదలైన వాటితో తయారు చేస్తారు . ఉగాది పచ్చడికి ఎంత ప్రాధాన్యం ఉందో చింతామణికి  అంత ప్రాధాన్యత ఉంది . చింతామణి తయారుచేసి జానకిరాం ఇంటికి చాలా మందిని భోజనానికి పిలిచారు . అంతా భోజనాలకు కూర్చున్నారు . ఆ చింతామణి పోసిన గిన్నె నిండా చాలా పురుగులు వున్నాయి . అందరు అసహ్యించుకొని భోజనాల వద్దనుండి లేచిపోయారు . సాధువైన గజాననుకి అగ్గి ఇవ్వక పోవటం వల్లే ఇట్లా జరిగిందని గ్రహించి ఆయనను తన తప్పును మన్నించవలసినదిగా ప్రార్ధించాడు . దయార్ద్ర హృదయుడైన స్వామి జాలిచెంది చింతామణి ఏ మాత్రం పాడవలేదు . నువ్వు బాగా పరిశీలించు అన్నారు . అక్కడున్న జనులందరూ చూడగా చింతామణిలో ఏ లోపం లేదు . స్వామి చేసిన ఈ చమత్కారం క్షణాలలోవాడవాడలా పాకింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                          శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము  రామ మోహన రావు )

చించాన అనే గ్రామంలో మాధవుడని ఒక నిరుపేద బ్రాహ్మడుండేవాడు . అతని వయస్సు సుమారు 60 సం || లు . ఒంటరివాడు సర్వస్వం పోగొట్టుకున్నాడు. అప్పుడు గాని అతనికి భగవంతుడు జ్ఞప్తికి రాలేదు . షేగాం వచ్చి స్వామి కాళ్ళు పట్టుకొని ఏడ్వసాగాడు. ఇలా ఒకరోజు గడిచింది . అది చూసి స్వామి ప్రాణం పోయేముందు వైద్యుణ్ణి పిలిచి ఏం లాభం . యౌవనంలో బ్రహ్మచారిగా ఉండి  ముసలితనంలో పెళ్లి చేసుకున్నట్లుగా ,అవతల ఇల్లు తగలబడుతూ ఉంటే నుయ్యి త్రవ్వుట ప్రారంభించినట్లుగా ఉన్నది నీ వ్యావహారం . కర్మ అనుభవించవలసినదే . అర్ధరాత్రి దాటిపోయిన తరువాత ఎవరు లేని సమయం చూచి స్వామి యమునిలా భయంకర రూపం దాల్చి ,గర్జిస్తూ మాధవునిపై పడ్డారు . లేచి పారిపోసాగాడు . మహారాజ్ నాకు యమలోకం చూపించారు చాలు . నన్ను ఎలాగైనా వైకుంఠానికి పంపండని చివరిసారిగా అర్ధిస్తున్నాను .అన్నాడు . సిద్ధ యోగులు ,సాధువులే పాపుల్ని పాప విముక్తులను చేసి పావనం చేస్తారని విన్నాను . ఇది మాధవుని ,స్వామి మధ్య జరిగిన విషయము . మాధవుని మృత్యువు స్వామి సన్నిధిలో జరిగింది . బ్రాహ్మణులను పిలచి తదుపరి కార్యక్రమం జరిపించమన్నారు . వేద బ్రాహ్మణుడు లేని ఆ గ్రామంలో వేదం బ్రాహ్మణులను పిలిపించమన్నారు . స్వామి నోటి వెంట ఏమాట వస్తుందో అది జరిగి తీరవలసిందే . అనుకున్నట్లు మధ్యాహ్నాని కల్లా వేద బ్రాహ్మణులు వచ్చారు . వారిని తగిన విధంగా సత్కరించి పంపారు . 

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                    శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర ( వేము రామ మోహన రావు )

షేగాం నుండి పింపల గ్రామానికి

పింపల గ్రామ పొలిమేర్లలోని అడవిలో ఒక ప్రాచీన దేవాలయమున్నది . ఆలయంలోకి స్వామి ప్రవేశించి పద్మాసనంలో ధ్యాన నిమగ్నులయ్యారు . ఆలయం దగ్గర చిన్న కాలువ వుంది . గొడ్లకాపరులు పశువులకు నీరు పెట్టి ఆలయంలో గల స్వామిని చూచి ఆశ్చర్యపడ్డారు . అంతకు ముందెన్నడు స్వామిని అక్కడ చూడలేదు . ఈ సంగతి గ్రామ పెద్దలకు విన్నవించారు . వారు స్వామి ఎదుట కూర్చొని సంకీర్తన చేయసాగారు . గ్రామంలోకి తీసుకువెళ్లాలని నిశ్చయించుకొని ,స్వామిని ఎత్తి పల్లకీలో కూర్చుండబెట్టి మేళ తాళలతో  ,తులసీదళాలు గులాల్ మొదలగునవి జల్లుతూ మారుతి మందిరానికి చేర్చారు . ఒక పెద్ద పీట వేసి స్వామిని సుఖాశీనులను చేసారు . అప్పటికి సమాధి స్థితిలోనే వున్నారు గజానులు . ఎవరికీ తోచిన పదార్థాలు వారి వారి శక్త్యానుసారము స్వామికి సమర్పిస్తున్నారు . స్వామి సమాధి స్థితిని వీడి భక్తులు తెచ్చిన పదార్థములను కొద్దిగా స్వీకరించి అందరి యభీష్టాన్ని పూర్తి చేసారు .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                      శ్రీ గజానన్ మహారాజ్ దియా చరిత్ర ( వేము రామ మోహన రావు )

పింపల గ్రామం నుండి షేగాం కి వెళ్లిన కొంతమంది తమ ఊరికి ఒక స్వామి వచ్చారని ఆయన సిద్ధుడిలా ఉన్నారని ఆ నోటా ఈ నోటా షేగాం  అంతా పాకింది . చివరకు బంకట్ లాల్ కూడా తెలిసింది . బంకట్ లాల్ తన భార్యతో పింపలగ్రామం బయలుదేరాడు . స్వామి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లారు ,పదిహేనురోజులైంది . షేగాం లో భక్తులు అన్నపానీయాలు మానేసారు ,మీరు తిరిగి షేగాం రావాలి . అలా రానిచో నేను దేహ త్యాగం చెయ్యటానికి నిర్ణయించుకున్నాను అని వినయపూర్వకముగా ప్రార్ధించాడు బంకట్ లాల్ . ప్రార్ధన విన్న స్వామి షేగాం వెళ్ళుటకు బండి ఎక్కారు . పింపల్ గ్రామస్థులు బంకట్ లాల్ వద్ద అప్పు తీసుకునేవారు . అందుచేత అతని ప్రయత్నాన్ని నివారించలేకపోయారు . వెడుతూ వెడుతూ బండిలో డబ్బున్న షావుకార్ల పద్ధతి నాకేం అర్ధం కావటములేదు . శ్రీ మహాలక్ష్మినే మీ ఇంట బంధించారు . అప్పుడు మహారాజ్ మీముందు నా ఆస్తంతా తృణప్రాయము . మీరే నా సర్వస్వము . షేగాం ను ముఖ్య కేంద్రం గావించు  మీ యిష్ట మొచ్చిన చోటికి సంచారం చేయండి . కళ్యాణం కోసం ,దేశంలో ఏ మూలకైనా వెళ్ళండి అన్నాడు బంకట్ లాల్ . షేగాం లో కొన్నాళ్ళుండి ఎక్కడికో వెళ్లిపోయారు స్వామి . 
             

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2311
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః
 

            శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

బావిని జలపూరితం చేయుట

దర్వాడ ప్రాంతంలో అడ్ గాం అనే ఊరుంది . ఎవరికి చెప్పకుండా వాయువేగంతో మండుటెండలో వెళుతున్నారు స్వామి . ఎండ వేడిమి మిక్కుటముగా ఉన్నందున దాహం ఎక్కువగా ఉంది . భాస్కరు అనే రైతు పొలం దున్నుకుంటున్నాడు . అతను ఒక కుండతో నీళ్లు తెచ్చుకున్నాడు . ఆ నీటి కుండా వద్ద వెళ్లి మంచినీళ్లు అడిగారు స్వామి . స్వామి పిచ్చివాడని నానా దుర్భాషలు ఆది నీరు ఇవ్వ నిరాకరించాడు . అక్కడకు దగ్గరలో ఒక పాడుబడ్డ నుయ్యి వుంది ,అక్కడకు వెళ్లారు స్వామి . ఆ నుయ్యి ఎండిపోయి కొన్ని సంవత్సరాలయింది అన్నాడు . అయినా చూస్తానన్నారు స్వామి . అది చూస్తూనే ఏమీ చేయకుండా వెళ్లి పోతే లోకానికి మేలు చేసేవాణ్ణి ఎలా అవుతాను అని స్వామి నూతిని సమీపించారు . మాధవుణ్ణి ప్రార్ధించారు . కొద్దీ క్షణాల్లో నూతిలో నీళ్లు నిండాయి . ఇదంతా భాస్కరుడు రెప్పవేయక చూస్తున్నాడు . ఈతడు పిచ్చివాడనుకొన్నాను , సాక్షాత్తు భగవంతుడే . ప్రజల కళ్ళు గప్పి వెర్రివాడి లాగా కనిపిస్తున్నాడు అనుకొని భాస్కరుడు సాష్టాంగ దండ ప్రమాణము చేసి తన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు . హే కృపాళు , దీనబాంధవా ! యీ ప్రపంచమంతా మిథ్య అని తెలుసుకున్నాను . ఇక నీవు కుండతో నీరు తెచ్చుకోవలసిన అవసరం లేదు . ఈ నూతిలో ఎప్పడు నీరు ఉండేటట్లు చేశాను ,కాబట్టి నీవా విషయానికి బాధపడవలసిన అవసరం లేదు . ఈ లౌకిక జీవితం పై విరక్తి కలిగింది . చూడండి కొద్దిపాటి స్వామి సాంగత్యం భాస్కరునిలో ఎంత మార్పు తీసుకొనివచ్చింది . నీరు పడటం వినగానే వూరి వారందరు స్వామిని దర్శించుకునే నిమిత్తం వచ్చారు . తరువాత స్వామీజీ అడ్ గాం లో ఉండకుండా భాస్కరునితో సహా షేగాం కి తిరిగి వచ్చేసారు .

 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!