Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137071 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ సంఘటనములన్నియు తాతగారు సమాధి చెందుటకు పదిహేను రోజులముందే తాతగారు అందించిన సూచనలు . కానీ ఏ ఒక్కరికి కూడా తాతగారి అవతార సమాప్తి గురించిన తలంపే మదిలో మెదలలేదు . ఇక తాత సమాధియైన రోజున కూడా స్పష్టముగా అనేకమంది దూర ప్రాంతముల భక్తులకు సందేశములిచ్చిరి . ఈ సంఘటలన్నియు తాతగారి మహాప్రస్థానమును గురించి తెలియబరచినవే . ఇప్పుడు మాత్రం భక్తులందరకూ ఈ సందేశములు అర్ధమయ్యి వాటి గురించి వారు ఆందోళన చెందుతుండగనే  తాతగారిని గురించిన వార్త అందరినీ శోకసముద్రములో ముంచి అందరూ పరుగు పరుగున కల్లూరు చేరిరి . అందులో కొన్ని సందేశములను ఇప్పుడు చూద్దాం .

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1411 on: January 02, 2018, 04:50:07 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదులో నివసించే సత్యవాణి గారికి తాత సమాధికి అయిదారు రోజుల ముందు సాయిబాబా కలలో కనిపించి " ఎవ్వరూ నా మాట వినట్లేదు ,నాకు బాగోలేదు ,అందుకే నేను వెళ్ళిపోతాను " అనిరి . అది విన్న సత్యవాణిగారు బాబాను ఎంతగా వెళ్లవద్దని ప్రాధేయపడినప్పటికీ బాబా అందుకు అంగీకరించలేదని కల వచ్చేసరికి ఆవిడ ఎవరికీ ఏ ఆపద రానున్నదో అని భయపడిపోయింది . ఆ తరువాత ఆ కల తాత అవతార సమాప్తిని సూచించినదని తెలిసింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1412 on: January 03, 2018, 09:32:49 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

గుంటూరు 'నాగసాయి ' మందిర కార్యనివాహకులైన శివప్రసాద్ గారి ఇంట్లో ఈశాన్య మూలకు ఔదుంబర వృక్షము ( మేడిచెట్టు ) ఉన్నది . ఒకసారి తాతగారు వారి ఇంటికి వచ్చినపుడు తాతగారిని ఆ వృక్షమును నరికేయవచ్చునా అని అడిగారు . అప్పుడు తాతగారు శివప్రసాదు గారి సతీమణితో " వద్దక్కా అందులో దేముడున్నాడు ,పూజచేసుకో ,ఈ ఫలాలు తినండి ,మంచి జరుగుతుంది " అని చెప్పారు . తాతగారు అంత పెద్దగా మాట్లాడగా వినడము అదే మొదటిసారి . అంత స్పష్టముగా తాత చెప్పేసరికి అప్పటినుండి ఇక ఎవరెన్ని విధములుగా చెపుతున్నా వారు మనసులో ఎటువంటి సందేహములూ ఉంచుకొనక ఆ వృక్ష రాజమును పూజించుచుండిరి . అయితే 15- 1- 1993 న శివప్రసాదు గారి భార్య లక్ష్మీ ప్రసన్న గారికి తెల్లవారుఝామున స్వప్నములో పదిమంది ఆజానుబాహువులైన మగవారు తెల్లని వస్త్రములు ధరించి వీరి ఇంటిలోని మేడిచెట్టును కూకటి వేళ్ళతో సహా పెరికించి వేస్తున్నట్లుగా చూసి కలలోనే భర్తను పిలిచి వారీ విధముగా చేస్తున్నారు . వాళ్ళను ఆపండి అని చెప్పగా ఆయన కూడా కలలోనే పైవాళ్ళ ఆర్డరు అయిపొయింది . మనం వద్దన్నా ఆగరు .మనమేమి చేయలేము . జరగాల్సినది జరిగిపోయింది కాబట్టి దాని గురించి బాధపడవద్దు అని చెప్పారు . అప్పుడు లక్ష్మీప్రసన్నగారు అందులో దేముడున్నాడు ,పూజచేసుకో అని తాతగారు చెప్పారు కదా ,ఇలాగైతే ఎలా అంటూ గాబరాగా కళ్ళు తెరిచేసరికి నిద్ర నుండి మెలకువ వచ్చింది . అప్పుడు  సమయం ఉదయం 4,5 గంటలైనది . ఆ కలపై పొద్దున్నే అందరూ చర్చించుకొనిరి . దీని భావమేమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగనే వారికి తాతగారు తమ భౌతిక కాయమును వదిలిరను వార్త చేరినది . స్వయంగా దత్త స్వరూపుడైన తాత దత్త వృక్షమైన ఔదుంబరమును పూజించుకోమని చెప్పిన ఆ చెట్టే కూకటివేళ్లతో సహా పెరికివేయబడినట్లు కల గాంచడమంటే దత్తుడు తన అవతార సమాప్తి గావించినట్లే కదా . అంత స్పష్టముగా తాతగారు వారికి స్వప్న సందేశమిచ్చిరి . అప్పుడు ప్రసన్నగారికి తాతగారు ఇకలేరు అన్నవార్త బాధ కలిగించినప్పటికీ తాతగారి దృష్టిలో ఎక్కడో అణుమాత్రంగా నైనా తానుండడము వలననే కదా తాత తనకా సందేశమునందించిరని సంతోషము కలిగి తాతకు మనస్సు నమస్కరించుకొనిరి . ఈనాటికీ కూడా ఏదైనా బాధలతో ,సమస్యలతో తాతగారిని ధ్యానిస్తే తప్పనిసరిగా తాత దర్శనం వారికి లభిస్తూనే ఉంటుంది . కాబట్టి వారి దృష్టిలో తాత సమాధి చెందినట్లు కాదు ,ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవము అనే ప్రత్యక్షానుభూతి . 
 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1413 on: January 04, 2018, 09:24:44 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అదే రోజు సాయంత్రము నారాయణరెడ్డిగారు తానూ అప్పటివరకు వ్రాసిన తాతగారి జీవిత చరిత్రను తీసుకుని వరదరాజుల గారింటికి వెళ్లి భాషాపరముగా  కాక ,భక్తిపరముగా  చరిత్రను పారాయణ చేసి వారి అభిప్రాయమును తెలుపుమని చెప్తూ తాతగారి గురించి విశేషములు మాట్లాడుకుంటూ రాత్రి 8 గంటల వరకు గడిపిరి . సరిగ్గా అదే సమయమునకు అక్కడ తాతగారు  సమాధి చెందుట అత్యంత ఆశ్చర్యకరమైన విషయము .


అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1414 on: January 05, 2018, 08:51:29 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అదేవిధముగా బోయినపల్లి (హైదరాబాదు ) వాస్తవ్యులైన శ్రీనివాస్ గారి భార్య జానకి గారికి కూడా తాతగారు స్వామిని సందేశమిచ్చిరి . అదేమిటనగా శ్రీమతి జానకి గారు పూజా ద్రవ్యములు పళ్లెముతో పెద్ద గుడిలోనికి ప్రవేశించగనే గర్భగుడి ద్వారములు మూసివేయబడినవి . అప్పుడామె అయ్యో ఇంతదూరము దైవ దర్శనము కొరకు వస్తే కాకుండగనే  మరలి ఎలా వెళ్ళగలను అనుకుంటూ పూజారిని సమీపించి ఒక్కసారి తలుపులు తీస్తే దైవదర్శనం చేసుకుని వెళ్లిపోతానని ఎంతగా ప్రాధేయపడినప్పటికీ పూజారి సమయము అయిపోయినది కాబట్టే తలుపులు మూసివేసాము ,ఇక తెరువబడవు అని చెప్పి మరలి వెళ్లిపోయిరి . అపశకుములా ఉన్న ఈ స్వప్న సారాంశము ఏమై ఉంటుందా అన్ని కలత చెందుతుండగానే వారికి తాతగారు సమాధి చెందిన వార్త తెలిసింది .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1415 on: January 06, 2018, 04:27:04 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

1993 సం . అయ్యప్ప దీక్షలో నున్న పద్మనాభము శబరిమలై బయలుదేరుటకు ముందు తాత వద్దకు వచ్చి ప్రయాణము సుఖముగా జరిగి ఎటువంటి ఇబ్బందులకూ గురికాకుండా క్షేమముగా ఇంటికి చేర్చుమని తాతను వేడుకోగా తాతగారు వెంటనే తాతగారు వెంటనే ' రెడ్డోళ్ళ బండి వెళ్ళిపోతోంది ' అని అనిరి . అప్పుడు వీరు తాము వెళ్ళవలసిన రైలు గురించి తాతగారు చెపుతున్నారనుకొని త్వరత్వరగా వెళ్ళిపోయి యాత్రను ముగించుకొని తిరిగి వచ్చేసరికి తాతగారు సమాధి చెందిరను భయంకరవార్త వారికై ఎదురుచూచుచున్నది . అప్పుడుగానీ పద్మనాభం కు తాతగారు 'రెడ్డోళ్ళ బండి వెళ్ళిపోతుంది ' అని స్పష్టముగా తన అవతార సమాప్తి గురించి తెలియజేసినప్పటికినీ మూర్ఖుడిలా తానూ గ్రహించుకోలేక వెళ్లడం వలన తాతగారి కడసారి దర్శనమునకు నోచుకోలేకపోతినని ఎంతగానో పశ్చాత్తాపపడి తాత సమాధికి ప్రదక్షిణ నమస్కారములు గావించిరి .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1416 on: January 07, 2018, 06:51:04 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

సాయిబాబాగారు శబరిమలై లో దర్శనము గావించుకుని దీక్షా విరమణ చేసి తిరిగి వస్తుండగా  అందరూ వెళ్లేదారి కాక దగ్గరిదారిలో వెళ్తే తొందరగా ఆ ప్రాంతము దాటి దారిలోని మరిన్ని పుణ్యక్షేత్రములు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిన డ్రైవరు కారును ఆ దారిగుండా నడిపించాడు . ఆ ప్రాంతమంతా పెద్దపెద్ద లోయలతో కూడుకుని ఉంది . సంక్రాంతి మరునాడు కనుమునాడు వీరు తిరుగు ప్రయాణములో ఉండగా రాత్రి సుమారు 7 గంటల ప్రాంతములో హఠాత్తుగా కారు ఆగిపోయింది . డ్రైవర్ ఎంతగా ప్రయత్నించి నప్పటికీ కారు బయలుదేరక పోవుటచే దగ్గరలో ఏమైనా కారు బాగుచేసే దుకాణాలు ఉన్నాయేమో చూసొస్తానని కారుకి గేరువేసి వెళ్ళిపోయాడు . డ్రైవరు వెళ్లిన  తరువాత కారు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించింది .  సాయిబాబాగారితో సహా ఉన్న నలుగురూ ఏమి చేయాలో కూడా తెలియని  అయోమయ స్థితిలో వారందరూ భగవంతుని కాపాడమని అడిగే ఆలోచన కూడా రానటువంటి స్థితికి చేరుకొని అవే తమకు ఆఖరు క్షణాలని వారికర్ధమైపోయి ప్రాణాలు అరచేతులలో పెట్టుకుని కూర్చుండిపోయారు . అప్పుడే వెనుకగా వస్తున్న జీపులోని వారు కారు  వెనుకకు లోయవైపుగా వెళ్తుండడము గమనించి జీపును ఆపివేసి అందరూ పరుగుపరుగున కారును చేరి బలమంతా ఉపయోగించి కారును ఆపగలిగిరి . కనురెప్ప పాటులో ఘోర ప్రమాదము తప్పిపోయింది . కారు అప్పటికే లోయ అంచును తాకింది . ఆ సమయానికి వారు రాకపోయినట్లైతే తామందరమూ మృత్యువాత పడి ఉండే వాళ్ళమన్న నిజము గ్రహించి ఆ జీపువారికి కృతజ్ఞతలు తెలుపుతుండగా డ్రైవరు రావడమూ ,అందరూ ఇంత ప్రమాదానికి కారకుడైన అతనిని బాగా తిట్టి పక్కనే ఉన్న కార్లు బాగుచేసే దుకాణం చూపించి జీపువారు వెళ్లిపోయిరి . అయితే ఎవరెన్ని రకములుగా ప్రయత్నించినా కారు మాత్రం కదలలేదు .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అప్పుడు చుట్టుపక్కల రెండు మూడు దుకాణములవారు కూడా వచ్చి పరీక్షించి ఇంజను పాడైపోయిందనీ , దానిని ఇప్పి చుస్తే కానీ సంగత్గి తెలియదనీ చెప్పి ఇంజను ఊడదీసారు . కారు బాగుచేయడంలో అది చాలా పెద్దపని . అయినప్పటికీ చేసేదేమి లేక అందరూ వేచియుండిరి . మర్నాడు పొద్దున్న సుమారు 8 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఆ కారు బాగుచేయుచున్న అతనికి కారులో చిన్న  నట్టు ఊడిపోయి ఉండడం కనిపించింది . దానిని సరిచేసేసరికి కారు మామూలుగా బయలుదేరింది . ఇంకా బాగు కాదేమో అనుకున్న కారుకి అసలు ఏ సమస్యాలేదు కేవలము ఒక చిన్న నట్టు ఊడిపోవడమే కారణమనీ దానిని గ్రహించలేక 10,11 గంటలు తామందరూ అనవసరముగా అక్కడ ఆగిపోవలసి రావడం చుస్తే అప్పుడు సాయిబాబాగారికి మనస్సులో తాతగారు మెదలి ఇదంతా తాత నడిపించిన లీల అని అర్ధమయ్యింది . అప్పుడు ఆయనకు తాతే జీపులో వచ్చిన వాళ్ళ రూపములో తమను ఈ ప్రమాదము నుంచి కాపాడారని ఇప్పుడు కూడా ఎదో ఘోరము జరిగే ఉంటుందనీ అందుకనే కారణము లేకుండా తాము ఆ రోడ్డుమీద నిలబడవలసిన  అవసరము రాదనీ గ్రహించి వెంటనే ఇక ఏ పుణ్యక్షేత్రములకూ వెళ్లకుండా ఎవరికి ఏ ఆపద సంభవించిందోనన్న అతృతతో ఇంటికి చేరుకుని వస్తూనే భార్యను అందరూ క్షేమమేనా అని అడుగగా భోరున విలపిస్తూ ఆ భార్య తాత సమాధి చెందిన వార్త టీ ,వి లో చూసి తెలుసుకున్నమనీ ,ఎప్పుడెప్పుడు భర్త వస్తే వెంటనే కల్లూరు చేరాలనే ఆత్రుతతో ఉన్నానని తెలిపింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
« Last Edit: January 08, 2018, 09:42:19 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1418 on: January 09, 2018, 11:09:03 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

పిడుగు లాంటి ఈ వార్త విన్న సాయిబాబాగారు నిశ్ఛెస్టులై పోయిరి . ఎవరికైనా బంధువులకు ఎదో ఆపద వచ్చి ఉండవచ్చుననుకున్నాడు . కానీ తమ భగవంతుడు తమను వదిలివెళ్ళారన్న చేదునిజాన్ని జీర్ణించు కోలేకపోయారు . అంతేకాక తానూ సమాధి చెందే సమయములో కూడా వీరిని రక్షించడమే కాక , ఆ సమయమంతా వీరి ప్రయాణమునును ఆపుచేసి వీరు ఇతర పుణ్యక్షేత్రాలను కాక నేరుగా ఇంటికి తిరిగివచ్చు ఏర్పాటు చేయుట చూసి తాత తమపై కురిపించిన ప్రేమామృతమునకు కుటుంబమంతా పరుగుపరుగున కల్లూరు చేరి అప్పటికే సమాధికావింపబడిన తాతకు కనీళ్లతో నమస్కరించిరి .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1419 on: January 14, 2018, 05:00:12 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                       శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాత ఆజ్ఞపై కల్లూరు వదిలి హైదరాబాదు చేరిన సతీష్ కు ఎదో కోల్పోయినట్లుగా ఉండేది . అలా కాలం గడుస్తుండగా దత్తజయంతి నాటి  రాత్రి కలలో తాతగారు మెడలో రుద్రాక్షమాల వేసి ఆశీర్వదించునట్లు కల వచ్చింది . ఇది జరిగిన రెండు మూడు రోజులకే మరో స్వప్నం వచ్చి అందులో తాతగారు అస్వస్థతగా నున్నట్లు ,తమని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఇతనికి  దృశ్యం కలలో కనిపించింది . ఆ కలకు కలవరపడిన సతీష్ ఎలాగైనా కల్లూరు వెళ్లాలనుకుంటే బాబ్రీ మసీదు గొడవలతో హైదరాబాదు ప్రాంతమంతా కల్లోలముగా ఉండడము వలన దిక్కు తోచని ఇతను కలవరపాటుతో కనిపించిన వారినందరినీ తాతగారి గురించి అడగడమే కాక కర్నూలుకు ఫోను చేసి ఒక్కసారి తాతను గురించిన వివరములు కనుక్కుని తెలుపమనగా వారు తాత క్షేమమను వార్తను చెప్పడంతో తనకు వచ్చిన కల మామూలు కలేనని దానికి ఏ ప్రాధాన్యతా లేదనీ ఇతను అనుకున్నాడు . అయితే మనసులో మాత్రము కొంత వెరపు ,జంకు అతనికి ఉంటూనే ఉన్నాయి . ఆవిధముగా తనసమాధికి రెండు నెలలు ముందే ఇతనిని దూరం పంపించిన తాత ఒక నెల ముందే తానూ సమాధి చెందునను సంగతిని అతనికి తెలియజేసిరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

1993 సంక్రాంతి రోజున ఎవరో షిరిడీ వెళ్లాలనుకుని టికెట్టుకొని కూడా వెళ్లక ఆ టికెట్టు శైలజకివ్వగా అనుకోకుండా ఆమె షిరిడీ ప్రయాణమైంది . అయితే ఆమె బస్సులో కూర్చున్నది మొదలు ఆమెకు ఒకవేళ తన తల్లికి ఏమైనా జరిగితే తానెలా తట్టుకోగలను ,అసలు ఆ తరువాత తానెలా బ్రతకాలి వంటి ఆలోచనలు మనసుకు రాగానే భరింపరాని దుఃఖముతో కళ్లనీళ్లు ధారాపాతముగా కారసాగాయి . ఈ విధముగా ఎడతెరిపి లేకుండా రెండు గంటల పాటు ఈ ఆలోచనలే మనసును ఉక్కిరి బిక్కరి చేసాయి . ఆ తరువాత ఆమె పవిత్రమైన షిరిడీ వెళుతూ ఇటువంటి చేదు ఆలోచనలు మనసునకు రానీయకూడదు అని అనుకుంటున్నప్పటికీ అదే భావన కొనసాగుతోంది . అప్పుడు ఇంకా ఏమి చేయాలో ఆ ఆలోచనల నుండి బయట పడాలంటే తాతగారి ప్రథమ దర్శనం నుంచి వరుసగా తాతతో పొందిన అనుభూతులనన్నింటినీ తలచుకుంటూ ఉండడమే సరియైన మార్గమని భావించి అవన్నీ నెమరువేసుకుంటూ అంతకుముందు కలిగిన ఆలోచనలను ,దుఃఖమును దూరం చేసుకుంది .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1421 on: January 16, 2018, 04:27:45 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ రకంగా ఆ రోజంతా తాత ఆలోచనలలో గడిపి కనుమనాడు ఉదయము నాలుగు గంటలకల్లా షిరిడీ చేరుకొని తనకు పరిచయస్థులైన అశోక్ మహల్సాపతి ఇంటికి అంత ఉదయమే వెళ్లి వారికి నిద్రాభంగము కలిగించడము ఇష్టములేక గురుస్థానము బయట కూర్చుని తన వద్దనున్న "డీవోటీస్ ఎక్స్పీరియన్స్ స్  ఆఫ్ శ్రీ సాయిబాబా " (Devotees Experiences of Sri Saibaba ) పుస్తకమును తెరిచేసరికి 'బాబా సమాధి చెందినప్పటికీ వారు మరణించినట్లు కాదనీ అశాశ్వతమైన వారి దేహము కనులముందు నుండి కనుమరుగైనప్పటికీ శాశ్వతమైన వారి అనంతశక్తి మనలను సదా కాపాడుతూనే ఉంటుంది ' అన్న భాగము వచ్చి అది చదివిన తరువాత ఇంకేమి చదవాలని అనిపించక ఆ గురుస్థానమునకు కొంతసేపు ప్రదక్షిణములు చేసింది . ఇంతలో గురుస్థాన్ పూజారి వచ్చి బాబా విగ్రహమునకు అభిషేక పూజలు ,అలంకరణ ముగించి వెళ్లిపోయెను . అప్పుడామె గురుస్థానములో అడుగు పెడుతుండగా పూజారి బాబా తలపై అప్పుడే అలంకారముగా ఉంచిన పెద్ద గులాబి పువ్వు జారి  కింద పడింది . అది చుసిన ఆమె ఆ పూవు బాబా తనకు ఇచ్చిన ప్రసాదముగా భావించి ఆ పూవును తీసుకొనుటకు విగ్రహము వద్దకు వెళ్ళింది . ( 1995 ప్రాంతము వరకు భక్తులను విగ్రహము ,వేపచెట్టు శివలింగమునకు నమస్కరించుటకు అనుమతించెడివారు . కానీ రాను రాను పెరిగిన రద్దీ కారణంగా తరువాతి కాలములో దూరము నుండియే నమస్కరించుకొనుటకు అనుమతిస్తున్నారు ) అయితే దగ్గరకు వెళ్లి చూసేసరికి బాబా కన్నులలో నీరు నిండి ఉన్నది . అది చచూసిన  ఆమెకు ఆశ్చర్యమునకు అంతులేదు . ఎందుకనగా షిరిడి వంటి మహా సంస్థానములో  అప్పుడే అభిషేకము గావించిన పూజారి బాబా విగ్రహమును సరిగా తుడవకుండానే అలంకరణ గావించి వెళ్లిపోయాడని భావించి  చేతిలో ఏమీ లేకపోవుటచే తన చీర కొంగు తో బాబా కళ్ళలోని నీటిని తుడిచి బయటకు వెళ్ళిపోయింది .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1422 on: January 17, 2018, 05:51:36 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత స్నానాదులు ముగించుకుని ద్వారకామాయికి వెళ్లగా అక్కడ గూళ్ళల్లో ముందురోజు వెలిగించిన ప్రమిదలు కనిపించగా ,ఈ గూళ్ళలోనే కదా బాబా నీళ్లతో దీపములు వెలిగించినదని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ ప్రమిదలను ఒక గుర్తుగా తనతో తెచ్చుకొనుటకు నిశ్చయించుకుని , ఆ ప్రమిదలనన్నింటినీ తీసుకున్నది . ఆ తరువాత లేండీబాగుకు రాగా అక్కడ క్రిందటి సంవత్సరమే తాతగారితో కలిసి షిరిడీ యాత్ర ,వారి సమక్షములో జరిపిన భజనలన్నియూ హృదయ ఫలకమున కనిపించుచుండగా తాత తిరిగిన ప్రాంతములన్నీ కలియతిరిగి మదినిండా తాతను నింపుకుని అది షిరిడీ యాత్రలా కాక కల్లూరు యాత్రలా ఉందనీ ,తాతను తానూ సంపూర్ణముగా దర్శించుకొనగలుగుతున్నానని సంతోషించి అదే రోజు సాయాంత్రము హైదరాబాదు తిరిగి ప్రయాణమైనది .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1423 on: January 18, 2018, 09:18:26 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

తెల్లవారి హైదరాబాదు చేరగనే పిడుగులాంటి ఈ వార్త తెలిసి అక్కడ గురుస్థానములో బాబా కళ్ళలో నున్నవి అభిషేకపు నీరు కాదనీ ,అది కన్నీరని గ్రహించింది . అవధూతలకు మరణము లేనప్పటికీ తాతగారి సమాధి విషయమై బాబా ఆ విధముగా ఆమెకు ముందుగనే సూచించుట జరిగినదని తెలుసుకున్నది . అంతేకాక బస్సులో ప్రయాణించునప్పుడు తన తల్లికేమైనా జరిగితే అన్న దుఃఖము కలుగుట వెనుక గల కారణమూ అర్ధమయ్యింది . ఎందుకంటే ముందునుండీ ఆమె తాతగారిని తల్లిగానే భావించేది . అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యము బాబా పుస్తకములో 'బాబా శక్తి అనంత శక్తిలా మనము నిత్యం కాపాడుతూ ఉంటుంది ' అనే సంగతి ద్వారా కలిగినది . ఈ విధముగా తాతగారు ముందుగా సూచించుటయే  ధైర్యమును కూడా ఇచ్చి అప్పుడు కల్లూరుకు రప్పించుకొనిరి .
 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1424 on: January 19, 2018, 07:40:31 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అతితక్కువ సమయములో అత్యంత ప్రేమాదరములు కురిపించి ,అలరించిన తాతగారు ఇకలేరు అన్న వార్త అందరకూ పిడుగుపాటులా తగిలింది . 15-1-1993 కనుమనాడు రాత్రి 7-45 నిమిషములకు అష్టమీ నక్షత్రము ,శుక్రవారంనాడు అవతారము చాలించిరను వాత్ర తెలియగనే కల్లూరు గ్రామము మొత్తం నిమిషముల మీద తాతగారి ఆశ్రమము చేరింది . అవధూత ,దత్త స్వరూపుడు వంటి పెద్దపెద్ద పదములు వారికి తెలియనప్పటికీ ,తాత  అంటే తమ కుటుంబ యోగ క్షేమములు కోరే పెద్ద దిక్కు అనీ ,తమకేవిధమైన కష్టము కలిగినా రక్షించుటకు తాత ఉన్నాడని మాత్రమే వారికి తెలుసు . అటువంటి తాత ఇక లేడు ,రాదు అన్న కఠోర సత్యమును జీర్ణించుకోలేక స్త్రీలు ,పురుషులు ,బాలలు మొత్తం అందరూ వయోభేదము లేకుండా ఒక్కసారిగా తాతను గాంచి గొల్లుమనిరి .
   

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!