జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
శ్రీ గురు గీత :
శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥
శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
మనము ఇంతకుముందు చూసిన అనేక సందర్భములలో ఒకరి విషయములో కుటుంబ సభ్యులు తప్ప వేరొకరు కలిగించుకుంటే ఈ కర్మ సిద్ధాంతములో దానిని అంగీకరించని తాత ,ఈ విషయములో మాత్రము వీరి కోరికను మన్నించారంటే వారు ఆమె పట్ల స్వచ్ఛమైన మనసు ,కలిగి ఉండి త్రికరణ శుద్ధిగా ఆమెను తల్లిగా భావించడమూ ,నేటి ఆమె స్థితికి ఎంతగానో ఆందోళన చెందడమే కారణము . మనచుట్టూ పరిచయస్థులు ,మనను ప్రేమించేవారు అనేకమంది ఉండవచ్చు కాక ,కానీ క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలిచి నేనున్నానని బాధ్యత వహించేవారే నిజమైన అభిమానులు . ఆమెపట్ల ఈ భావన కలిగిన వీరికి ప్రేమను వెల్లడి చేయవలసి వచ్చినపుడు వారు స్వచ్ఛముగా ఈ బాధ్యతను వహించిరి . ఆ విధముగా ఎంతో బాధ్యయుతముగా తాతగారిని హైదరాబాదు ఆమె ఇంటికి తీసుకువచ్చి తాత తప్ప శరణు లేడని ప్రార్ధించగా తాతగారు ఆమెను సమీపించి కేవలము కరుణాదృక్కులు ఆమెపై కురిపించి వారి ఆతిధ్యమును స్వీకరించి మరలివెళ్లిరి . తాతగారిని తిరిగి కర్నూలుకు తీసుకువెళ్ళినపుడు రాజు ,మల్లేష్ లు ఎంతో ఆతృతగా తాతగారిని ఆమెకిక ఏమీ ఫరవాలేదా అని అడుగగా తాత చిరునవ్వే వారికి సమధానమైనది . తాత చర్యలలోని అంతరార్ధము తెలిసిన వారైనప్పటికీ ,ఆందోళనతో నున్న వీరికి గండము నిజముగనే గడించినదా లేదా అన్న భయము మాత్రము వీడలేదు . ఇది తాతగారి శక్తిపట్ల ఉన్న అనుమానము కాక ,ఈ విషయములో తాతగారు ఎంతవరకు బాధ్యత స్వీకరించారో నాన్న భయము వారిని వెంటాడసాగినది . అయితే హైదరాబాదు తిరిగి వచ్చిన వీరికి ఆమె పరిస్థితిలో కొట్టొచ్చిన మార్పు కనిపించి కనిపించి జీవకళ ప్రారంభమైంది అని అర్ధమయ్యింది . అయితే ఇంకా ఆతృత తగ్గని వీరు ఈ విషయమును స్వామీజీకి తెలిపి వారి ఆశీస్సులు కూడా పొందుటకు రాజు కారులోనే షిరిడీ వీరు స్వామీజీకి సంగతినంతా వివరించగా స్వామీజీ ' తాత వచ్చి వెళ్లారు కదా ఇక భయములేదు ' అని ధైర్యమునిచ్చిరి . అయినప్పటికీ మల్లేష్ కు ఇంకా ఆతృత తగ్గక వీరికి ధైర్యం చెప్పడానికే స్వామీజీ అలా తెలిపారా నిజముగా గండము గడిచిందా అను అనుకుంటూ ప్రతినిత్యం చావడిలో భజన చేసే స్వామీజీ ఆనాటి భజనలో ఫలానా పాట పాడితేనే ఈ గండం నిజముగా గడిచినట్లు లేనిచో కానట్లు అని తలచి చావడిలో కూర్చుని ఉండగా ఇతని మనసులో ఉన్న భావము గ్రహించినట్లుగనే స్వామీజీ అదే పాటను పాడి అతని మనసుకు ధైర్యమునిచ్చిరి .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!