Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 88647 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత 1996 వ సం . ఏ శ్రీరామనవమి నాడైతే తాతగారి చేతుల మీదుగా శంఖుస్థాపన జరిగినదో అదే శ్రీరామనవమి నాడు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన గావించిరి . అంతకు మునుపే అనసూయా మాత చేతుల మీదుగా అఖండ ధుని ప్రారంభోత్సవము గావించిరి . ఈ విధముగా తమ శక్తివంచన లేకుండా మందిర నిర్మాణమే కాక ,ఆ మందిర బాగోగులు నేటికి కూడా గమనిస్తూ మందిర అభివృద్ధికి అంతులేని కృషిని సలుపు వీరికి తాతగారి ఆశీస్సులు సదా నిలిచి ఉంటాయి .

                                              త్వమేవ సర్వం మమ దేవదేవ
                                        పన్నెండవ అధ్యయము సంపూర్ణము
                                        నాలుగవరోజు పారాయణము సమాప్తము
 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1261 on: August 01, 2017, 04:42:23 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                           అయిదవరోజు పారాయణము
                                                 క్షేత్ర గాణుగాపూరు
                                                  అధ్యాయాము -13

                         శ్రీ గణేశాయనమః   శ్రీ సరస్వత్యైనమః   శ్రీ రామావధూతాయనమః

            దిగంబరం దేదీప్యమానం దివ్యమంగళరూపం
             తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

మహారాష్ట్రలోని కరంజా గ్రామములో జన్మించిన బాల నరహరి ఉపనయమయిన వెంటనే వారణాశి చేరి సన్యాసదీక్షను పొంది శ్రీ శ్రీ శ్రీ నృసింహ సరస్వతి నామము ధరించి దేశ పర్యటన గావించి నృసింహవాడిలో 12 సం . పంచగంగానదీ తీరములో భక్తులకు అనేకానుభూతులను కలిగించి అక్కడినుండి గుల్బర్గా జిల్లాలోని గాణుగాపురము చేరిరి . నృసింహ సరస్వతి  పాదస్పర్శచే పునీతమైన ఈ నేల  కర్మభూమిగా మారి ఎందరెందరి కర్మములను ,కష్టములను తప్పించి క్షేత్ర గాణుగా పురముగా ప్రసిద్ధి గాంచినది .  అవతార సమాప్తి సమయములో గ్రామములోని మఠములో తన నిర్గుణ పాదుకలుంచుటచే  ఆ స్థలమునకు మాహాత్మ్యము నిచ్చి శ్రీశైలము చేరి అక్కడి పాతాళగంగలో అంతర్హితులైరి . స్వామి సశరీరులుగా ఉండి తరింప చేసిన  ఔదుంబర్ వృక్షము ,ఆ సంగమ నది ,పాదుకాలయము ఎంతో పవిత్రత నొంది భక్తుల బాధలు బాపుచున్నవి .
 
 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1262 on: August 02, 2017, 04:25:14 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

దత్తస్వరూపుడైన రామిరెడ్డి తాతను ,దత్తక్షేత్రమైన శ్రీ క్షేత్ర గాణ్గాపురంలో దర్శించుకోవాలనే చిరుకోరిక అఖండ సాయినామ  సమితికి కలిగింది . ఈ కార్యక్రమానికి శివరాత్రే తగిన సమయమని భావించి తాత అనుమతి ,ఆశీర్వాదాలను   పొంది పూజ్యశ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశానుసారం 72 గంటలు అఖండ సాయినామ సంకీర్తన ,అన్నదానం చేయదలచి సకల ఏర్పాట్లనూ కూర్చుకుని 23-2-1991 వ తేదీని నిర్ణయించారు . శ్రీ క్షేత్ర గాణ్గాపురంలోని సంగం వద్ద నామ సంకీర్తన ,మఠం వద్ద తాత వసతికి ఏర్పాట్లు జరిగాయి . అనుకున్న ప్రకారం భక్త బృందమంతా సంగం చేరి భజన ఏర్పాట్లలో నిమగ్నమైనారు . శ్రీ క్షేత్ర గాణ్గాపురం చేరిన మరుక్షణం నుంచి తాత చిద్విలాసంగా ఉండి భక్తులను ఆనందింపచేసారు . భక్తబృందమంతా భజనలో పాల్గొనగా తాత సేవకై కొంతమంది భక్తులు మాత్రం తాతతో పాటు మఠంలోనే ఉండిపోయారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1263 on: August 03, 2017, 05:53:36 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

శివరాత్రి పర్వదినాన భక్తులు తాతగారికి తలస్నానం చేయించదలచి వారి ఆజ్ఞకై వేడుకున్నారు . అప్పుడు మంచం మీద కూర్చుని ఉన్న తాత " ఆ అలాగే కానివ్వండి " అని అనుమతినిచ్చారు . అనుమతినైతే ఇచ్చారు కానీ వారు కూర్చున్న మంచం మీద నుండి ఒక్క అంగుళమైనా పక్కకు జరుగకపోవడమే కాక తలస్నానం చేయించమని తొందర చేయసాగారు . ఆ మంచం మీద తాతకు ఎలా తలస్నానం చేయించాలో అర్ధంకాక భక్తులంతా తెల్లబోయారు . అప్పుడు ఒక భక్తురాలు ముందుకు వచ్చి ఒక్క చుక్క నీరు తాత కళ్ళలో కానీ ,శరీరంపైనకానీ ,మంచం మీద కానీ పడకుండా అత్యంత శ్రద్ధగా ,సమర్ధవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసింది . ఇదంతా వేడుకగా గమిస్తున్న తాత కూడా  ఆమెకు సహకరిస్తున్నట్లుగా కొంచెమైనా కదలక మెదలక కూర్చుని తలరుద్దడం అయిన వెంటనే ఎవ్వరూ ఏమీ అడగకమునుపే తనకు తానుగా లేచి బయటకు వచ్చి స్నానానికై నిలబడ్డారు . ఈ చర్య ద్వారా తాత భగవంతుని సేవించడానికి భక్తి ప్రేమలతో పాటు ఏకాగ్రత అనేది ఎంత ముఖ్యమో అనుభవపూర్వకంగా భక్తులు గ్రహించి ఆచరించేలా చేసారు . ధ్యాసమళ్లకుండా మనం చేసే ప్రతి పనీ ,పూజ సేవ కూడా ధ్యానము ,జపము ,తపస్సులతో సమానమైనవి తాత తన చేతల ద్వారా నిరూపించారు . ఇదే సద్గురువు లక్షణం . వారు మనకేమి బోధలు చేయకుండానే తమ చేతల ద్వారా శిష్యులకు సరియైన మార్గంలో నడిపించి ఆధ్యాత్మికోన్నతికి మార్గం చూపుతారు .

అంతేకాక ఆమె భక్తి ప్రపత్తులకు మెచ్చినట్లుగా తాత శివరాత్రి పర్వదినాన పచ్చి గంగైనా ముట్టని ఆమెచేత తానూ స్వయంగా తన మహాప్రసాదాన్ని తినిపించారు . ఆ రకంగా ఏ పరమేశ్వర సాక్షాత్కారానికై  మనమంతా ఈ భక్తి సాధనలు చేస్తామో ఆ భగవంతుడే ప్రత్యక్షంగా మహాప్రసాదాన్నను గ్రహించి ఆమె జన్మకో సార్ధకత నిచ్చారు .

 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1264 on: August 04, 2017, 08:07:33 PM »
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.    గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

72 గంటల అఖండ సాయినామం పూర్తవ్వడంతో భజన బృందమంతా తాత దర్శనానికై వేంచేసారు . ఇక అప్పటి నుండి తాత తన లీలా విలాసాన్ని ఏ రకంగా చూపించారో ఇప్పుడు తెలుసుకుందాం . తాత అక్కడున్న భక్తులందరకూ తన చేతలు లీలలు ద్వారా చిన్ని కృష్ణుని ,బాల నృసింహ సరస్వతిని తలపింపచేసారు . ఇదంతా గమనిస్తున్న ఆ బృందంలోని నాట్యాచార్యులైన శేషుబాబుకు తాతను దర్శించడం అదే ప్రథమం . అంతేకాదు అసలు ఒక అవధూతను ప్రత్యక్షంగా దర్శించడమే మొదటిసారి అయినప్పటికీ అతనికి ప్రథమ దర్శనంలోనే తాత కదలికలు ,చేష్టలు ,చర్యలు బాలకృష్ణుని తలపింప చేయగా రకరకాల రంగస్థలాలపై ఎన్నో రకాల నాట్యాలను ప్రదర్శించిన అతను ప్రత్యక్ష నృత్యాన్ని అభినయించాడు . ఓకే అలౌకికానందంతో అతను చేస్తున్న ఆ నృత్యం అక్కడున్న వారందరినీ సమ్మోహితులను చేసింది . భక్తులంతా ఆనంద సాగరంలో ఓలలాడారు . ఆ రకంగా  నృత్యం ముగించిన శేషుబాబు  తాత పాదాలపై వ్రాలి ఆశీర్వదించమని కోరగా తాత అతనిని ఆశీర్వదించారు . అప్పుడు అతనికి మూడు రోజులుగా మౌనం పాటిస్తున్న తాతను మాట్లాడించాలనే చిరుకోరిక కలిగింది . అందుకే అతను తాతను తన నోటితో ఆశీర్వదించమని కోరాడు . అతని కోరిక విన్న తాత తిరిగి చిరునవ్వుతో ఆశీర్వదించారు . అతనికి కావలసినది తాత పలుకు . అది నెరవేరకపోయేసరికి అతను "పలుకే బంగారమాయెనా -ఓ తాతా -నీ  పలుకే బంగారమాయెనా  " అంటూ సంగీతంలో ఎన్ని రకాల రాగాలు ఉన్నాయో అన్ని రకాలుగా తాతను బుజ్జగించి ,లాలించి ప్రేమతో వేడుకున్నాడు . అక్కడున్న భక్తులంతా తాత ఏం చేస్తారో అన్న అతృతతో ఎదురు చూస్తున్నారు . అప్పటివరకు మామూలుగా ఉన్న తాత మనస్ఫూర్తిగా అతను చేసిన విన్నపమును ,ప్రార్ధనను ఆలకించి మౌనమైతే వీడలేదు కానీ భాషకందని అవ్యాజ్య కరుణతో అతనిని నిండుగా దీవించారు . తాత మౌనం వీడనప్పటికీ అక్కడున్న భక్తులెవ్వరికీ తాత అతని కోరిక తీర్చలేదన్న అసంతృప్తికానీ ,బాధ కానీ తెలియని ఒక అలౌకిక ఆనందాన్ని అక్కడున్న ప్రతి భక్తుడూ అనుభవించాడు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామావధూత జీవిత చరిత్ర
« Reply #1265 on: August 05, 2017, 03:38:43 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇంతమంది మనసులను దోచి ,అందరి కోరికలనూ మన్నించి ఆశీర్వదించిన తాత ఎందరెన్ని రకాలుగా వేడినా మౌనం వీడకపోవడానికి కారణం ఆ స్థానం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిది కావడమే కారణం . ఎందుకంటే నృసింహ సరస్వతి స్వామి కరంజా అనే గ్రామములో పుట్టిన మరుక్షణమే అందరి పిల్లలలా ఏడవడానికి బదులు "ఓం " అని ప్రణవనాదాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి ఊరుకున్నారు . ఆ బాలునకు నరహరి అనే నామమిడి అల్లారు ముద్దుగా తల్లితండ్రులు పెంచుకున్నారు . ఆ నరహరి  బాల్య చేష్టలతో తన అవతార ప్రాముఖ్యాన్ని తెలిపినప్పటికీ మౌనం తప్పలేదు . ఉపనయన సమయంలో వేదమంత్రోచ్చారణ తోనే మౌనం వీడిన మంత్రమూర్తి ఆ స్వామి . ఆ స్వామి స్థానంలో నిలిచారు కాబట్టి తాత తానూ కూడా ఈ క్షేత్రంలో మౌనం పాటించి అలనాటి నృసింహ సరస్వతి స్వామిని కన్నులారా గాంచిన నేటి భక్తులకు ఆ దర్శన భాగ్యం కలిగించారు . ఆ రకంగా భక్తులందరూ తాత సాంగత్యాన్ని ,ప్రేమను ,అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనుభవించి ధన్యతనొందిరి .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1266 on: August 06, 2017, 04:53:38 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇక ముగింపు కార్యక్రమంలో భాగంగా అప్పటివరకు తాతలో బాలకృష్ణుని దర్శించిన రాములు అనే భక్తుడు ఇక తాతను వదిలి వెళ్లాలనే తలంపు రాగానే గోపాలకృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళితే ఆ యమునానది ,గోపికలు పడే బాధను ఇక్కడ భక్త బృందానికి అన్వయిస్తూ  " యమునారోరే -పర్ హంభీ రోరే -గోకుల్ సే గోపాల్ చలే " అనే పాటను అత్యంత ఆర్ధ్రతతో గానం చేయగానే అప్పటివరకు తాత ప్రేమలో మైమరచిన భక్తులంతా ఒక్కసారిగా బాహ్యస్మృతి కలిగి తీవ్ర వేదనకు గురైనారు . అక్కడ ఆ దృశ్యం నిజమైన యమునాతీరాన్ని తలపింప చేసింది . భక్తులందరూ కూడా తాతను ,ఆ ఆనందాన్ని వదిలి తిరిగి సంసార బంధంలో చిక్కుకోవలసిందే కదా అన్న తలంపే భరించలేకపోయారు . నిజమేకదా ఒక్కసారి అమృతాన్ని రుచి చూసిన తరువాత ఇక చక్కర తీపి మాధుర్యాన్ని ఇవ్వగలదా . భక్తులందరూ తాతను వీడిపోతున్నామనే బాధతో భారమైన హృదయాలతో మరలి వెళ్లారు .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1267 on: August 07, 2017, 03:57:50 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారితో పాటు సమితి నిర్వాహకులు కొంతమంది మాత్రం ఆ రోజుకు అక్కడే ఉండి మరునాడు సంగమతీరం చేరి నృసింహ సరస్వతి స్వామి వారు తరింప చేసిన ఔదుంబర వృక్షాన్ని సమీపించారు . అక్కడ తాత నిజమైన అవధూత లక్షణాలను సంపూర్ణంగా ప్రదర్శించారు . బాలోన్మత్త పిశాచ వేషధారియైన తాతకు సాధారణ మానవులు పాటించే నియమ నిష్టలతో ప్రమేయమేముంటుంది ? అందుకే తాత  ఆ ఔదుంబర వృక్షం వద్దకు తన పాదరక్షలతోనే వెళ్లారు . ఎంతో నియమానుసారం నడిచే కర్మభూమియైన ఆ సంగమ క్షేత్రంలో తాత ఈ చర్య ఎవ్వరి దృష్టికీ రాలేదు . స్వయంగా సృష్టే అక్కడ నిలిచి ఉండగా మానవులు పాటించే ఈ ఆచార వ్యవహారాలతో భగవంతునికి నిమిత్తం లేదని తాత స్వయంగా నిరూపించి చూపించారు . ఆ దృశ్యాన్ని కన్నులారా గాంచి తరించిన భక్తులు ఆ సంగమ తీరంలో ఆనందసాగరంలో తేలియాడారు . ఆ మధురానుభూతిని మదిలో నిలుపుకొని ఆనందముతో మారాలి వచ్చిరి .

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1268 on: August 08, 2017, 05:52:56 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

విద్యానగరు -సాయిమందిరము :

విద్యానగరులోని సాయిమందిరమునకు ఏ మహాత్ముడు వచ్చినా ఒక ప్రత్యేక స్థలములో వారిని ఆసీన పరచి పూజా పునస్కారములు జరిపించుట ఆనవాయితీ . నెల్లూరు యాత్రలో భాగముగా మాస్టారుగారి ఆధ్వర్యంలో నిర్మింపబడిన ఈ మందిరమునకు తాతగారిని మాస్టారుగారి శిష్యులందరూ భక్తి పూర్వకముగా ఆహ్వానించిరి . అయితే ఎవ్వరూ ఏమీ చెప్పకమునుపే తాతగారు మహాత్ములను కూర్చుండబెట్టు  ఆ ఆసనంపై  కూర్చుండి తన మహాత్మ్యమును చెప్పకయే చెప్పిరి .  తరువాత ఆకాశం వైపు చూస్తూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ చాల సేపు గట్టిగా అరచిరి . ఆ తరువాత తాత అందరికీ తన పాద దర్శన భాగ్యం కలిగించి అక్కడున్న పండ్లతో ఆడుకున్నట్లుగా చేస్తూ తాను  ఎవరికి ఆ ప్రసాదం ఇవ్వదల్చుకున్నారో సరిగ్గా వారి ఒడిలో కానీ ,చేతిలో కానీ పడేటట్లు ఆ పండును విసిరిరి . ఎప్పుడో కానీ ఈ విధముగా ప్రవర్తించని తాత ఎంతో ఉల్లాసముగా నుండి భక్తులను ఆనందింపజేసిరి . ఆ భక్త బృందములో గూడూరు వాసి అయిన ఒకతను ఛాతీ వ్యాధితో బాధపడుతుండగా తాతగారు అతను కోరకమునుపే తాను  తాగిన సిగరెట్టు అతనికిచ్చి తాగించుటచే అతని వ్యాధి తగ్గిపోయినది .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1269 on: August 09, 2017, 04:47:34 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 ఈ ప్రయాణంలోనే తాతగారు ఒంగోలుకు వచ్చినపుడు మందిరంలో తాత ఉగ్రరూపము చూసి అందరూ భయపడిరి . తాతగారురాక   సందర్భముగా మందిరములో  ఏర్పాట్లు గావించగా తాతగారి రౌద్రం చూసి భయపడిన భక్తులు గట్టిగా  భజన చేస్తే తాతగారి  మరింత పెంచిన వాళ్ళమౌతామేమోనని నెమ్మదిగా చేయసాగిరి . అప్పుడు తాతగారు వారితో " ఇంత తింటారు ,ఏం గట్టిగా చెప్పలేరా " అని అరిచే సరికల్లా రాత్రి వరకు ముక్తకంఠంతో భజన గావించారు . తాతగారి ఉగ్రరూపానికి  స్థానములో ఒక్కొక్క కారణముంటుంది . దీనిని అర్ధము చేసుకొవడము అంత సులభం కాదు . భజన కార్యక్రమము ముగించి అందరూ వెళ్ళిపోయిన తరువాత శాంతించిన తాతగారు అక్కడున్న కొందరు భక్తులకు తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశములను  రూపములోను ,వారడిగిన ప్రశ్నలకు సమాధానములుగాను ఎన్నెన్నో విషయములను విడమరచి చెప్పి వారి ఆధ్యాత్మిక ప్రగతికి బాటను సుగమము చేసారు . ఆ పాటలలో ముఖ్యముగా "కనుపాప కరువైన కనులెందుకూ ,తన వారె పరులైన బ్రతుకెందుకు " అని పాత పాడారు . అనగా ఆధ్యాత్మిక దృష్టితో భగవంతుని చూడలేని కనులెందుకనీ ,అశ్వాశ్వతమైన బంధాలు అనుబంధాలూ  తనవాడైన భగవంతుని లీలలను గ్రహించలేని బ్రతుకు వ్యర్ధమనీ తెలియచేసిరి . భగవంతుడు స్వయముగా దిగివచ్చి ఇంతగా విడమరచి చెప్తున్నా ఎందరు దానిని గ్రహించి అమలు పెడుతున్నారు ,అందుకే తాతగారు " మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు " అని పాడసాగిరి . ఈ విధముగా రాత్రంతయూ  వారికి ఆధ్యాత్మిక  గావించిరి . తాతగారిచ్చిన ఈ సందేశమును సరిగా గ్రహించగలిగి వారు తరువాత కాలములో దానిని అమలుపరచి ఉన్నత స్థితిని చేరుకొనిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సాయిదత్త భరద్వాజ మందిరము :

కృష్ణానంద్ గారు మాస్టారు గారి ప్రియశిష్యులుగా ఉండి  వారి అడుగు జాడలలో నడిచేవారు . వీరి సతీమణి జయశ్రీగారు కూడా చిన్నతనం నుండే మాస్టారుగారి సాంగత్యములో  పెద్దయి అటవీశాఖలో ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ  మాస్టారుగారి ఆశీర్వచన ఫలమని భావిస్తూ  వారిపట్ల భక్తి  భావములు కలిగి ఉండేది . ఈ రకముగా భార్యాభర్తలిద్దరూ మాస్టారు గారి అడుగుజాడలలో నడిచేవారు . కృష్ణానంద్ గారు 1986 లో మాస్టారుగారితో పాటుగా షిరిడీ యాత్రలో పాల్గొన్నప్పుడు తాతగారిని దర్శించుకోవడం జరిగింది . ఆ తరువాత తాతగారిని కల్లూరు నుండి నెల్లూరు తీసుకురావడం వలన ఆ 25 రోజుల యాత్రలో తాతగారితో పాటుగనే ఉండి  సేవచేసుకునే భాగ్యం దక్కింది . తాతను తీసుకుని వచ్చిన తాను  తాతగారిని కల్లూరుకు పంపించేవరకు తాతను వదలక తిరుగుట తన కర్తవ్యముగా ఈయన భావించారు . అయితే ఊహించని విధముగా ఈయన భార్య జయశ్రీగారికి ఆరోగ్యము దెబ్బతిని లేవలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ రెండవ ఆలోచన చేయక ఇంటికి కూడా వెళ్లక తాతపట్ల తన ధర్మాన్ని సంపూర్ణముగా నెరవేర్చుకున్నారు . ఆ తరువాత జయశ్రీగారు మాస్టారుగారితో పాటు తాతను గొలగమూడిలో దర్శించుకున్నారు . జయశ్రీగారు ఒకసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు రాను పోను ఆటో మాట్లాడుకుని తాత దర్శనానికి వెళ్లగా తాతగారు ఇంట్లోలేరు . ఎంతసేపటికీ రాలేదు . అప్పుడు వీరు ఆటోను ఆపుకుని వెంటనే వెళ్లిపోవాలని వచ్చినందుకే తాత దర్శనం కాలేదని గ్రహించి ఆటోను పంపించి వచ్చేసరికి తాతగారి దర్శనం లభించింది . తన తల్లిగారి ఆరోగ్య విషయమై ఆందోళనగా  ఈవిడ తాతను అడుగగా తాత 'పరవాలేదు పో ' అని దీవించారు .  ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు .

                                                                   త్వమేవ సర్వం మమదేవదేవ
                                                           పదకొండవ అధ్యాయము సంపూర్ణము .
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత అనుకోని ఎదురు దెబ్బల వలన కృష్ణానంద్ గారి ఆర్ధిక పరిస్థితులు పూర్తిగా చితికిపోయి కుటుంబం తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకుంది  ఆఫీసరు అయినప్పటికీ ఆర్ధిక పరిస్థితుల నుండి తప్పించుకోలేకపోయారు . అటువంటి స్థితిలో తాత దర్శనానికి వెళ్లగా తాతగారు ధనమున్న పెద్ద మూటను వీరికివ్వడం జరిగింది . ఆనందముతో ఆ డబ్బును తీసుకుని వెనుకకు వచ్చిన వీరు ఏనాడూ ఆ మూటను విప్పి కనీసం ఎంత ఉందో కూడా చూడకుండా అలాగే దానిని భద్రపరచుకొనిరి . ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా కుదుటపడి పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
« Reply #1272 on: August 12, 2017, 05:08:00 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥


                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సద్గురువైన సాయినాథునితో పాటుగా దత్తాత్రేయుని విగ్రహమే కాక తాము గురుదేవులుగా భావించే మాస్టారుగారి విగ్రహమును కూడా సమపీఠముపై  ప్రతిష్ఠించి మాస్టారుగారి పట్ల తమ భక్తి ప్రపత్తులు ఆ విధముగా చాటుకొనిరి .

                                                            త్వమేవ సర్వం మమ దేవ దేవ
                                                 పదమూడవ అధ్యాయము సంపూర్ణము

 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1273 on: August 13, 2017, 04:56:43 PM »

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                             లీలావిలాసము
                                            అధ్యయము -14
                     శ్రీ గణేశాయనమః        శ్రీ సరస్వత్యైనమః       శ్రీ రామవధూతాయనమః

                         బోధాత్మకం భావనాగమ్యం  భవపాపనాశకం
                         తారయతి  సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

పూర్వకాలంలో మునులు ,ఋషులు  వందలకొద్దీ సం . లు తపస్సు చేసి భగవద్దర్శనము ,అనుగ్రహము పొందుటకు ఎంతో శ్రమించి నప్పటికీ ఏ కొద్దిమంది భాగ్యులకో ఆ అదృష్టం దక్కేది . సూతుడు ,వ్యాసుడు  మొదలగు మహానుభావులు ఈ మునులకు కలిగిన ఆధ్యాత్మిక సందేహములనూ ,భగవంతుని లీలా విలాసమునూ ఉపదేశముల ద్వారా బోధిస్తూ వారినెప్పటికప్పుడు  ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కుకుని పురోగతి నొందుటకు ఉత్సాహ పరస్తుండేవారు . గురుపరంపపరలో ఆద్యుడైన దత్తాత్రేయుడు కూడా తన శిష్యులైన కార్తవీర్యార్జునుడు ,యదుమహారాజు ,ప్రహ్లాదుడు మున్నగు వారిని ఈ ఉపదేశముల ద్వారానే అనుగ్రహించి ఆశీర్వదించి వారి ఉన్నతికి మార్గము సుగమము చేసారు . ఆ కాలంలో ఇదంతా అరణ్యంలో తపస్సు చేసుకునే మునులకు మాత్రమే పరిమితమయ్యేది . స్వయంగా బ్రహ్మదేముడే గురుభక్తుల జోలికి పోరాదని కలిసి శాసించుటచే కలిప్రభావం గురుభక్తులపై ఉండదు . అందుకనే నేటి సమాజంలో మారిన పరిస్థితులలో గురుకృపతో కలిప్రభావం నుండి తప్పించుకోవడం ఈ జనారణ్యంలో ఉన్న ప్రతి సామాన్య మానవునికి కూడా తప్పనిసరైంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2169
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1274 on: August 14, 2017, 03:53:38 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
               ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ కారణం చేతనే దత్తావధూత సాంప్రదాయ మేర్పడి కాలానుగుణంగా అనేక మార్పులు చెందుతూ సామాన్య మానవునికి అత్యంత చేరువై వారిని ఏ విధంగానైనా గురుకృపా రక్షా కవచంలో ఉంచుటకు ఎప్పటికప్పుడు అవధూతలు అవతరిస్తూ ఈ యాగఫలాన్ని భక్తజన కోటికి అందుబాటులోకి తెస్తున్నారు .

 భగవత్స్వరూపులైన రామిరెడ్డి తాత వంటి అవధూతలు వారికేమీ అవసరము లేనప్పటికీ తమ లీలావిలాసంతో భక్తులను అనుగ్రహిస్తూ వారిని సన్మార్గంలో ఉంచి వారిని భక్తి మార్గంలోకి మళ్లించి వారిపై కలిప్రభావము పడకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు . అటువంటి తాతగారి జీవితం నిత్యనూతనం . లీలామయం . అందులో మచ్చుకు కొన్ని మాత్రమే ఇప్పుడు తెలుసుకోబోయే లీలలు .....
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
« Last Edit: August 26, 2017, 08:44:57 PM by Gurupriya »