Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 96153 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1245 on: July 17, 2017, 04:27:00 PM »

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

నారాయణరెడ్డిగారు తెల్లవారుఝామున బ్రహ్మ ముహూర్త సమయములో తాతగారిని తమ ఇంటికి ఆహ్వానించగా తాత వారితో పాటు వారింటికి వెళ్లిరి . ఊహించని విధముగా తమకు కలిగిన భాగ్యమునకు ఆ కుటుంబ సభ్యులందరూ ఆనంద భాష్పములచే తాత పాదములు అభిషేకించి పూజించిరి . అటు పిమ్మట తాతగారిని శ్రీనివాసులు గారింటికి తీసుకొని వెళ్లిరి . తరువాత సమితి వారికి తాతగారి రాకను గురించి చెప్పగా మందిరములో తలెత్తిన సమస్యలను రూపుమాపుటకే తాత ఎవ్వరూ ఆహ్వానించక మునుపే హైదరాబాదు వచ్చిరని తెలుసుకున్నవారై ఆనందముతో తాతగారిని దత్తసాయి సంస్థానమునకు రావలసినదిగా ప్రార్ధించగా తాత మందిరమున ప్రవేశించెను . నిర్మాణంలో ఉన్న మందిరంలో ప్రవేశించిన తాత తన వింత చేష్టలతో ,చర్యలతో మందిర ప్రాంతమంతా కలియదిరిగి నిర్మాణంలో ఉన్న ఆటంకాలు తొలగేలా చేసారు . అంతేకాక మందిరంలో దత్తపాదుకలను ప్రతిష్టించే స్థలంలో కూర్చుని తానే  దత్తుడనని నిరూపించారు . ఆ రకంగా పిలవనైనా పిలవకుండా వేంచేసిన తాత భగవంతుని కార్యక్రమంలో వచ్చిన ఆటంకాలను తొలగించి నిర్వాహకుల ఆందోళనను తొలగించి వారిలో నూతనోత్సాహం కలిగేలా చేసారు . ఇక అప్పటినుండి దేవాలయ నిర్మాణం నిరాటంకంగా సాగిపోయింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1246 on: July 18, 2017, 06:30:02 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
               ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మందిర నిర్మాణంలో భాగంగా అఖండ ధునిని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందుగానే ధుని ప్రారంభోత్సవం చేయడం దేవాలయానికి అత్యంత ఆవశ్యకమనీ , ఈ కార్యక్రమాన్ని వైదేహీ సతీ అనసూయమాత ( పరాడ్ సింగా , నాగపూర్ ) చే ఆరంభిపచేస్తే మందిర పవిత్రత ఇనుమడిస్తుందని పూజ్యశ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశించగా నిర్వాహకులు అందుకు అంగీకరించారు . అయితే మందిర నిర్మాణానికి నిధులు సమకూర్చడం ఒక భాగమైతే అత్యున్నత వ్యయ ప్రయాసలతో కూడుకున్న అఖండ ధుని ప్రారంభోత్సవానికి అనసూయమాతను ఆహ్వానించి వారిచే ఈ కార్యక్రమం జయప్రదంగా సాగేటట్లు చూడడం నిజంగా అగ్నిపరీక్షే . అప్పుడు సమితి సభ్యులొకరికి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును భిక్షాటన ద్వారా సమకూర్చి భక్తులందరూ ఈ పుణ్య కార్యక్రమాలలో భాగం కల్పించుకుని తరించేలా చేయడం ఉత్తమమని ఆలోచవచ్చింది . తక్కువ వ్యవధిలో ఇంతటి మహత్తర కార్యానికి రూపాన్నిచ్చి భగవంతునిపై భారం వేసి ఒక నిర్దేశిత ప్రణాళికను సిద్ధం చేసుకుని సభ్యులందరినీ కలుపుకుని ఒక పవిత్ర కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తనవంతు భక్తి ప్రపత్తులను చాటి ధుని ప్రారంభోత్సవానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోగలిగారు . ఈ  బృహత్ కార్యక్రమానికి తే . 14. 2 1989 న సుముహూర్తం నిర్ణయించారు . అనుకున్న కార్యక్రమాలన్నీ తాతగారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా సాగగా మొట్టమొదటిసారిగా విదేహీ సతీ అనసూయమాతతన పవిత్ర పాదాన్ని భాగ్యనగరంలో మోపి ఆ నగర ధన్యత నొందేలా చేసిరి . ధుని ప్రారంభోత్సవం అనసూయమాత చేతుల మీదుగా అత్యంత వైభవంగా జయప్రదంగా ముగిసింది . ఈ భిక్షా కార్యక్రామానికి రూపకల్పన నిచ్చి ఆ కార్యక్రమం సజావుగా సాగేలా రాత్రియంబవళ్ళు శ్రమించి అనసూయమాత రాకచే తొక్కిసలాటలో వెనుకకు తోసివేయబడ్డ భక్తురాలిని అనసూయమాత ప్రత్యేకంగా పిలిపించి ఊరేగింపు కార్యక్రమంలో తన పక్కనే కూర్చుండబెట్టుకొని ఆశీర్వదించడం ద్వారా భగవంతునికి కావలసిన పైపై భేషజాలు ఆంతరంగికంగా ఉన్న నిజభక్తే భగవంతుని చేరేదని అనసూయమాత ఈ సందర్భంగా నిరూపించింది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
« Last Edit: August 26, 2017, 08:45:48 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీరామవధూత జీవిత చరిత్ర
« Reply #1247 on: July 19, 2017, 04:38:48 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి  శైలజ )

దేశంలోనే ప్రప్రధమంగా "ద్వారకామాయి " సాయిబాబా విగ్రహాన్ని చెక్కించి షిరిడీ తీసుకువెళ్లి స్వామీజీచే పూజ హారతులిప్పియించి కల్లూరులోని తాతగారి గురుస్థానంలో ఉంచారు . ఆ రకంగా ఎంతో భక్తి ప్రేమలతో మందిర నిర్మాణం సజావుగా పూర్తయ్యింది . సాయిబాబా విగ్రహంతో పాటుగా రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహమును కూడా ప్రతిష్టింప దలచిరి . అమందిర నిర్మాణ ప్రారంభంనుంచే తాత ఆశీస్సులు ,అనుమతితో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి సాయిబాబాకు ముఖ్యమైన శ్రీరామనవమి పుణ్యదినాన ఈ మందిర విగ్రహ ప్రతిష్టాపనను  తాత చేతుల మీదుగా జరిపించడం ద్వారా ఆ మందిరానికి సంపూర్ణత్వం చేకూరుతుందని భావించిన సమితి అందుకు సుమూహుర్తం నిర్ణయించిరి . అయితే ఆ సమయంలో భాగ్యనగరం హిందూ ముస్లిముల రాజకీయ మాత కలహాలతో అట్టుడికిపోతోంది . తాత తప్ప శరణు లేడని తాత పాదాల నాశ్రయించి తాత చేతులమీదుగా ఈ ప్రతిష్టాపన జరిపించడానికి తాతను వేడుకోగా తాత కూడా నిండుగా దీవించి అభయమిచ్చారు . తాత అభయ వాక్కుతో విగ్రహ ప్రతిష్టాపనకు కావలసిన వనరులన్నీ  సమకూరాయి .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1248 on: July 20, 2017, 03:57:57 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ విగ్రహ ప్రతిష్టాపనకు వేంచేసిన తాత అట్టుడిగి పోతున్న హైదరాబాదు నందు ఈ కార్యక్రమములో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండునట్లు అత్యంత బాధ్యతను తన భుజ స్కంధములపై నుంచుకొనిరి . ఈ  కార్యక్రమము నిమిత్తమై వచ్చినప్పటి నుండే తాత విపరీతమైన కోపముతో నుండి ఎవ్వరినీ దరిచేయనీయలేదు . అప్పటివరకు తాత ప్రసన్నతనే చూసిన భక్తులందరూ మిక్కిలి భయపడిపోయిరి . ఈ పరిస్థితిని ఎలా అధిగమించి కార్యక్రమమును జయప్రదం గావించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో నిర్వాహకులు మునిగిపోయిరి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 
                


 

                                                     
 
 
 
                                                                     
             
   
« Last Edit: July 20, 2017, 04:01:44 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10.  గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
             గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ గురవేనమః ॥

                    శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                  రెండు మూడు రోజులు ముందుగా వచ్చినప్పటికీ తాత ఒక్క క్షణమైనా మందిరములోనికి రమ్మన్నా రాలేదు . అటువంటి ఉగ్రమూర్తిని చంద్రారెడ్డి ,మల్లేష్ ఒక్క సెకను కూడా పక్కకు జరుగకుండా వెన్నంటి ఉండి తాతను శాంతపరచుటకు విశ్వప్రయత్నం చేసారు . ఆ రెండు రోజులూ తాతగారు హైదరాబాదు నగరము నాలుగు దిక్కులా చాలాదూరం ప్రయాణించి వెనుకకు మరలేవారు . ఒకవైపుకు వెళ్లిన తరువాత అటు కాదని వేరొకవైపు ఇలా నగరము మొత్తమూ ప్రదక్షిణములు చేయించిరి . తాత ప్రవర్తనకు అర్ధము మొదట్లో తెలియనప్పటికీ సమయం గడుస్తున్నకొద్దీ తాత ఒక్కొక్క ప్రాంతమునూ ఏ విధముగా పర్యవేక్షించి అక్కడి పరిస్థితులను ఏ విధముగా అదుపులోకి తెస్తున్నారో గ్రహించిన ప్రత్యక్ష సాక్షి మల్లేష్ మాత్రమే . ఈ రెండు రోజులూ అతని భక్తికీ ఓర్పుకూ పరీక్షా సమయముగా నిలిచాయి . అయితే తాతపై అనన్య భక్తి ప్రపత్తులు కలిగిన ఇతను ఈ పరీక్ష యందు అవలీలగా నెగ్గాడనడంలో సందేహములేదు . ఆ విధముగా ప్రతిష్ట కార్యక్రమమునకు ముందుగానే మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తాత సాయిబాబాను ఆహ్వానించుటకు పరిస్థితులను సిద్ధముగా నుంచిరి . అటువంటి రౌద్రమూర్తిని శాంతింపచేసి ప్రతిష్టాపన జరిగేలా చూడడం నిజంగా కత్తిమీద సాము వంటిదే . నిర్వాహకుల భక్తికి నిజపరీక్ష ,అయితే సమితి ఈ పరిస్థితిని సజావుగా అధిగమించింది . కల్లూరు గ్రామములో నుంచిన ద్వారకామాయి విగ్రహమును అత్యంత వైభవముగా అలంకరించిన నెమలి రథముపై ఊరేగింపులా తరలించగా గ్రామ గ్రామమునందునా భక్తులు సాయినాథునకు మంగళ నీరాజనములిచ్చి ఆనందముగా సాగనంపిరి . ఈ కార్యక్రమ  బాధ్యతను స్వీకరించిన కృష్ణమూర్తిగారు సాయిబాబా గారు రథము వెంట రాగా అడుగడుగునా హారతులందుకుంటూ అత్యంత వైభవముగా సాయినాథుడు హైదరాబాదు నందలి కబూతర్ ఖానాకు చేరెను .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1250 on: July 22, 2017, 08:56:14 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ప్రతిష్ఠాపన కన్నా ముందు నుండే సాయినామ సప్తాహము ప్రారంభమైనది . ప్రతిష్టా సమయమందు వేద మంత్రోచ్ఛారణముల ఘోషను సాయినాస్మరణ అధిగమించినట్లు అంబర మంటిన ఆనందముతో ప్రతి భక్తుడూ ఈ భజనలో మైమరచి గానం చేస్తుండగా ప్రత్యక్ష దైవమైన తాతగారి సమక్షము నందు సకాలమున విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవముగా జరిగినది . ఆ విధంగా ఎన్నెన్నో అనుభూతులు ,అనుగ్రహాల మధ్య ఎటువంటి చిన్న అవాంతరమూ లేక బాబా విగ్రహం ,అమ్మవారి విగ్రహాలతో పాటు దత్తపాదుకా ప్రతిష్ట ఎంతో ఆనందోత్సవాల మధ్య విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంతో పాటే తాతగారి రౌద్రరూపం కూడా కనుమరుగై వారి సహజ సిద్ధమైన ప్రేమ కరుణలు భక్తులందరిపై కురిపించి అందరినీ అలరింపచేసారు .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1251 on: July 23, 2017, 07:08:11 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

   
                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారి ఆశీస్సులతో పూర్తయిన ఈ మందిరమునకు తాతగారు రెండుసార్లు మరల విచ్చేసి ఈ మందిర పవిత్రతను పెంపొందించిరి . నారాయణ రెడ్డిగారికి , శ్రీనివాసులు గారికి ఒక గురుపౌర్ణమి నాడు తాతగారి వద్దకు వెళ్లి తాతగారికి సాయిబాబా ధరించు కఫనీ వస్త్రమును ధరింపచేసి తాతలో సాయిని గాంచి పూజించవలెనను సంకల్పము కలిగి కల్లూరు చేరి తాతను ప్రార్ధించగా తాతగారు అంగీకరించి దత్తసాయి సంస్థానమునకు వేంచేసిరి . అప్పుడు రెడ్డిగారు ,శ్రీనివాసులు గారు తాతగారికి కఫనీ ధరింపచేసి అందముగా అలంకరించి తాత మోమును గాంచి ఆందించుచుండగా ఎంతో ప్రసన్నంగా వీరి ప్రేమను స్వీకరించిన తాత 'బాగున్నావా ' అని అడిగి వీరిని సంతృప్తి పరచిరి . ఆ తరువాత భక్తులందరూ తాతగారిని దర్శించి గురుపూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనిరి . ఆ రాత్రి చాలా పొద్దుపోవు వరకు భక్తుల పూజలు ,భజనలతో ఆ ప్రాంతమంతా ఉత్సాహముగా నుండెను . ఆ తరువాత తెల్లవారుఝామున గం . 3. నిమిషములకు హఠాత్తుగా కోపోద్రిక్తుడైన తాత అపార రుద్రుడైనాడు . భారీకాయముతో నుండి బరువుగా కదిలే తాత ఆ సమయములో శివతాండవమే చేసినాడు . జడలు కట్టిన జుట్టుతో సంపూర్ణ దిగంబరంగా తాత నాట్యం చేస్తూంటే మందిర భవనమంతా గడగడలాడిపోయింది . తాత ఈ ఉగ్రరూపమునకు కారణం తెలుసుకోలేక ,తాతను ఆపే ధైర్యము లేక అందరూ నిశ్చేష్టముగా నిలిచిపోయిరి .

                                                        ఓం రుద్రాయ నమః

ఆ తరువాత తాత తనంత తానుగా మామూలు స్థితికి వచ్చువరకూ ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితులలో ఉండిపోయిరి . సుమారు అరగంట పాటు తన విశ్వరూపమును చాటిన పిమ్మట తాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చిరి . ఆ రకముగా తాత అందరి మనసులలో గురుపూర్ణిమను మధురస్మృతిగా నిలిపిరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1252 on: July 24, 2017, 11:07:41 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

వేరొక సందర్భములో హైదరాబాదు వచ్చిన తాతగారిని మరొక్కసారి మందిరమునకు ఆహ్వానించగా తాత అంగీకరించి వేంచేసిరి . అనుకోని విధముగా విచ్చేసిన తాత ఈ సందర్భములో భక్తులు త్రికరణ శుద్ధిగా భగవంతుని పూజించుట వలన కలుగు ఫలితమును తెలియచేసిరి . ఆ విధానమును ఇప్పుడు తెలుసుకుందాం . సాయిబాబా మందిరములో ప్రతి మంగళవారము లలిత సహస్ర నామ పూజ చేసి రాజ్జరాజేశ్వరీ అమ్మవారితో పాటుగా అక్కడ ఉన్న తాతగారి పటమునకు కూడా గారెలు నైవేద్యముగా పెట్టి తాత తింటున్నట్లు భావించి ధునిలో వేయుట శైలజ అలవాటు . ఒకసారి దీపావళి పండుగ మంగళవారము కావడమూ ,అనుకోకుండా అదే రోజు మధ్యాహ్నము శైలజ కల్లూరు వెళ్ళుట తటస్థించి అందరూ ఇచ్చిన నైవేద్యములతో పాటు తాను  గారెలను కూడా తీసుకువెళ్ళింది . అయితే గారెలను తినిపించబోయిన వ్యక్తితో తాతగారు తాను  అంతకుముందే వాటిని తిన్నానని స్పష్టపరచి శైలజ వైపు సాభిప్రాయముగా చూసిరి . ఆ విధముగా మనస్ఫూర్తిగా తాతగారు తినాలన్న ఉద్దేశ్యముతో హైదరాబాదులో పెట్టిన నైవేద్యము కల్లూరులో కూర్చుని తాత  గ్రహించారంటే వారికి ఎల్లలు లేవని తెలియుటయే కాకా ,భక్తితో మనం చేసే ప్రతి విన్నపమూ తాతను చేరుతుందని తేటతెల్లమయినది .

 ఈ విధంగా పూజ్యశ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశాల మేరకు ఇద్దరు అవధూతల పాదధూళితో పవిత్రత నొందిన ఈ మందిరం భక్తుల కర్మలను ,కష్టాలను బాపుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఈ మందిరంలో ఒకసారి కోటి భస్మార్చన ,108 రోజుల అఖండ సాయినామము వంటి బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించడం ద్వారా మందిర నిర్వాహకులు ఆలయ పవిత్రతను సదా కాపాడుతున్నారు .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

BSudhakar

 • Full Member
 • ***
 • Posts: 198
  • View Profile
Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
« Reply #1253 on: July 25, 2017, 01:59:26 PM »
JAI SAI MASTER!
Babu Gariki Saadara Pranaamamulu!
Sai Bandhulaku Abhivandanalu!

Appreciate if some one tells me full name, correct location (with landmarks) of this Kabuttarkhana Sai Mandir (Sactified by Sri Ramireddy Tata Avadhutha)
Search is revealing 134 Sai temples in Hyderabad but no one  shows Kabuttarkhana location.

JAI SAI MASTER!!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1254 on: July 25, 2017, 07:53:36 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

షాద్ నగర్ - సాయిబాబా మందిరము :

షాద్ నగర్ వాసులైన డా . విజయకుమార్ ,డా . శారద గార్లు కొత్తగా నర్శింగ్ హోంను నిర్మించి అఖండ సాయినామ సప్తాహ సమితి వారిచే అక్కడ సాయి భజనను నిర్వహించిన తరువాత వీరికి తామొక సాయిమందిరము నిర్మిస్తే బాగుండునని ఆలోచన కలిగి సమితి వారికి తెలుపగా వారు స్థల నిర్ణయము జరిగిన తరువాత శ్రీరామిరెడ్డి తాతగారి చేతుల మీదుగా శంఖుస్థాపన గావించిన శుభము చేకూరునని తెలిపిరి . అప్పుడప్పుడే ఆర్ధికముగా నిలదొక్కుకుంటున్న వీరు స్థలము కొనడానికి వెళ్లగా సరిగ్గా వీరు దాచుకున్న మొత్తము 40,000 రూపాయలకే స్థల నిర్ణయము జరిగినది . ఆ విధముగా ముందుగనే బాబా వీరిచే డబ్బులు జాగ్రత్త పరచి వారి సంపాదనను సద్వినియోగ పరచిరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీరామవధూత జీవిత చరిత్ర
« Reply #1255 on: July 26, 2017, 10:58:04 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
 
తరువాత సమితి వారికి తెలియపరచగా హైదరాబాద్ లోని కబూతర్ ఖానా సాయి మందిర విగ్రహ ప్రతిష్టాపనకు వేంచేయుచున్న తాతగారి చేతులమీదుగా శంఖుస్థాపన చేయించుటకు సుముహూర్తము నిర్ణయించిరి . దత్తసాయి సంస్థాన్ ప్రతిష్టాపన ముగిసిన వెంటనే తాతగారు షాద్ నగర్ పయనమైరి . ఆహ్లాదకర వాతావరణములో తాతగారు ఎంతో ప్రసన్నులుగా ఉండి ఈ కార్యక్రమము జయప్రద మగునట్లు చేసిరి . ఆనాటి వరకు ఎంతో రౌద్రముగా నున్న తాత ప్రతిష్ఠాపన ముగిసిన వెంటనే ప్రసన్నులైరి . కాబట్టి తాతగారు ఆ ప్రదేశములో ఆనందముగా గడిపిరి . అంతేకాక శంఖుస్థాపన నిమిత్తమై ఒక కొబ్బరికాయను తాతగారి చేతికందించగా తాతగారు కొంతసేపు దానిని చేతులతో ఆడించి హఠాత్తుగా నేలకేసి కొట్టగా అక్కడున్న రాయికి తగిలి ఆ కాయ పగలడమే కాక మూడు ముక్కలవ్వడం అందరినీ ఆశ్చర్యపరచి తాత దత్తస్వరూపము తేటతెల్లమైనది . ఈ సందర్భములో తాతగారు డాక్టరుగారి ఒక సంవత్సరము వయసు కలిగిన సాయిప్రసాదును విశేషముగా ఆశీర్వదించుట అక్కడున్న వారందరికీ ఆనందం  కలిగించింది . ఆ బాబు కూడా తాతతో అంత చిన్నవాడైనప్పటికీ పరిచయమున్న వానివలె కొత్త అని భయపడక హాయిగా ఆడుకున్నాడు . తాతగారు ఆ బాబుకు తాను  తింటున్న బిస్కట్టును తినిపించి అతనికి తిరుగులేని ఆశీస్సులందించిరి .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1256 on: July 27, 2017, 06:06:04 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత తాతగారిని తమ హాస్పటల్ కు రావలసిందిగా భార్యా భర్తలిద్దరూ వేడుకోగా వెంటనే అందుకు అంగీకరించిన తాత బయలుదేరి హాస్పటల్ ప్రాంగణము చేరి పరిసరములన్నింటినీ క్షుణ్ణముగా పరిశీలించి హాస్పటల్ ఆమూలాగ్రమూ సాభిప్రాయముగా తమ దృష్టిని సారించిరి . నిలుచున్న స్థలము నుండి ఒక్క అడుగైనా కదలిక తాతగారు మొత్తము హాస్పటల్ ను పరికించి చూసిరి . ఆ విధముగా తాతగారి అమృతమయ దృక్కులు సోకిన ఆ హాస్పటల్ దినదినాభివృద్ధి నొంది మందిర నిర్మాణమునకు స్వయముగా పూర్తిచేయగలిగిరి . తరువాత తాతగారు షిరిడీ యాత్ర సమయములో విజకుమార్ గారు కుటుంబముతో సహా షిరిడీ వచ్చి తాతను దర్శించుకున్నప్పుడు  తాతగారు వీరితో "గుడి ఎట్లున్నది "? అని ప్రశ్నించిరి . అవధూతలకు వ్యక్తులతో కానీ ,సంస్థలతో కానీ సంబంధముండదు . అటువంటిది తాతగారు వీరిని ప్రత్యేకముగా గుడి గురించి వివరములు ప్రశ్నించుట వలన తాతగారు వీరిని ఆ మందిర నిర్మాణమునకు ఎంచుకొనిరను విషయము స్పష్టమయినది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1257 on: July 28, 2017, 08:38:34 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

17.  శ్లో ॥ యస్మిన్ స్ధిత మిదంసర్వంభాతియద్భానరూపతః ।
            యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                    శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

రామిరెడ్డి తాత సమాధి చెందినప్పుడు తాతగారిని తాతగారి గృహమునందే సమాధి చేసిరను వార్తను శారదగారు భర్తకు తెలుపగా డాక్టరుగారైన ఆయనకు ఈ విధముగా చేయడము అసహజముగా అనిపించి ఆ విధముగా చేయడమేమిటని మనసులో వేరు భావన కలుగగా ఆ మరునాడు వీరు నిద్రిస్తున్న సమయములో డాక్టరుగారి కలలో సమాధి ఒక పక్కకు ఏటవాలుగా పడుకుని ఉన్న తాతగారు చెయ్యెత్తి వేలు చూపిస్తూ  " ఏందిరా అన్నావు " అని ఒక రంధ్రము నుండి చూస్తూ కోపముతో పలికేసరికి తన తప్పుడు ఆలోచనకు భయపడిపోయిన డాక్టరుగారు "ఏం అనలేదు ,తాతా తప్పైపోయింది ,తప్పైపోయింది " అని మరీ మరీ క్షమించమని కలలోనే తాతను ప్రార్ధించిరి . ఆ విధముగా ఆయన మనసులో కలిగిన అనుమానమును రూపుమాపుటయే కాక ఎవ్వరకూ లభించని అపూర్వ దర్శనమును పొందిరి .
 
 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!!                         

 
 
 
 
 Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1258 on: July 29, 2017, 04:25:37 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సమాధి నుండి తాతగారి సమాధానము ఎవ్వరికైనా లభించవచ్చు  కానీ సమాధిలో ఏటవాలుగా పడుకొని దర్శనమివ్వడమన్నది ఎవ్వరకూ లభించని దివ్యదర్శనము . తాతగారిని కూర్చుండబెట్టి సమాధి చేసినప్పటికీ డాక్టరుగారికి కలలో  కనిపించిన విధముగనే తాతగారు ఆ స్థితిలోనే పడుకుని యుండిరను సంగతి 21 రోజుల తరువాత తాతగారి పాదదర్శనము వలన అందరకూ తెలియవచ్చినది . అయితే డాక్టరు గారికి మాత్రము ఈ దర్శనము కేవలము తాత సమాధి చెందిన వారము లోపే లభించిందంటే ఒక డాక్టర్ గా ఆయన తాత మహాత్యమును శంకించినప్పటికీ తాత ఆయన మనసులోని అనుమానము తీర్చడమే కాక అపురూప దర్శన భాగ్యము కలిగించిరి .

అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2254
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1259 on: July 30, 2017, 04:28:10 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

19. శ్లో ॥    యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
              సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః   

                                                  శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారు సమాధి చెందిన తరువాత హైదరాబాదు నుండి కల్లూరుకు పాదయాత్ర చేయు భక్తులకు వీరు నిండు మనసుతో భోజన ఏర్పాట్లు గావించి డాక్టరుగారైన శారదగారు  తానే స్వయముగా వండి పంపించి తాతగారికై నడిచే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ దారిలో కలుగకుండునట్లు తమ వంతు కృషి తాము చేసి తాతపట్ల తమ ప్రేమను ఆ ఆవిధముగా చూపించిరి .

 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!