Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 83692 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1155 on: April 18, 2017, 05:12:07 PM »
జై సాయి మాస్టర్ !                   
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
             గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సుబ్బలక్ష్మి గారి భర్తగారైన సీతారామయ్యగారు ఉద్యోగ నిమిత్తము వేరే ఊరిలో ఉంటున్నారు . తాతగారు వీరింటికి వచ్చినపుడు ఆయన అక్కడనే ఉండుట తటస్థించింది . ఈ సంగతి ఎవ్వారూ తాతగారికి చెప్పనప్పటికీ తాతగారి స్వయముగా వారితో " ఏం ఇంటికి వెళ్తావా " అని అడిగారు . ఇంట్లోనే ఉన్న తనను తాత ఎందుకిలా ప్రశ్నించారో అప్పుడు వారికి అర్ధంకాకపోయినా వారం తిరిగేసరికల్లా వారికి తమ స్వగ్రామమునకే ట్రాన్సఫర్ అయి తిరిగి రావడం జరిగినపుడు తాత మాటలోని అంతరార్ధం బోధపడి కోరకుండానే కోరికలు తీర్చే ఇలవేల్పుగా తాతను కొలుచుకున్నారు . తాతగారు వారింటికి వచ్చినపుడు దూరముగా కూర్చుని ఉన్న సుబ్బలక్ష్మిగారు ఎవరికో తాతగారికి పూలదండ వేయమని చెప్పగా తాతగారు ఆవిడతో "ఇక్కడొచ్చి కూర్చో అక్కా ,పూలదండ వెయ్యి " అని తనకు తానుగా పిలిచారు . అప్పుడు ఆనందముతో దగ్గరకు వెళ్లి పూలదండ వేసి తాతగారికి పాదనమస్కారము చేయుచుండగా తాత " నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా " అని ఆమె మనసులోని భావమును పాటరూపములో పాడి వారిని ఆనందపరచిరి . ఆ తరువాత తాతగారు సమాధి చెందినపుడు కల్లూరు వెళ్లిన సుబ్బలక్ష్మిగారు తాత అంతిమ యాత్ర పూర్తయి తాతకు మంగళ స్నానములు చేయించి ఆ వస్త్రములు తొలగించి తాతను సమాధిలో కూర్చుండ బెట్టగా వెంటనే ఆమె ఆ వస్త్రమును తీసుకుని అది తాతగారు తనకు ప్రసాదించిన ప్రసాదముగా భావించి ఆ వస్త్రమును తీసుకుని భద్రపరచుకొనిరి .

 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1156 on: April 19, 2017, 05:00:33 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )


నీ పనిచూసుకో :

గూడూరులో నివసించే శ్యామలమ్మ గారు ఊళ్ళో లేని సమయములో తాతగారు గూడూరు సాయి మందిరమునకు విగ్రహ ప్రతిష్ఠ నిమిత్తమై వచ్చి వెళ్లిరని తెలిసి వారిని దర్శించుకోలేక పోయినందుకు అమితముగా బాధపడింది .
ఇది జరిగిన రెండు మూడు నెలలకు శ్యామలమ్మ గారి మరిది ఉద్యోగ నిమిత్తమై భరద్వాజ మాస్టారుగారి భార్య ( అమ్మగారు )ఆశీస్సులు పొందుటకు ఒంగోలు వెళ్లగా అప్పుడు అమ్మగారు ఇంకొంతసేపటిలో రామిరెడ్డి తాతగారు వేంచేయనున్నారు కాబట్టి వేచి ఉండవలసినదిగా చెప్పడం జరిగింది . తాతగారు విశ్రాంతి తీసుకునే సమయములో శ్యామలమ్మగారు తాత వద్ద కూర్చుని పాదసేవ చేసుకుంటుండగా తాతగారి పక్కన ఎవరో ఒక ఆవిడ పాటలు పాడుకుంటూ నిలుచుని ఉంది . కొంత సేపటి తరువాత తాత ఆమెతో "పాడిన కాడికి చాలు ! కూకో !" అన్నారు . అప్పుడు శ్యామలమ్మ ఆమెతో తాతగారు వద్దంటున్నారు కాబట్టి కూర్చుని నామజపం చేసుకోమని చెప్పారు . అప్పుడు తాత శ్యామలమ్మతో "స్వామికాడ ఉన్నప్పుడు నీపని చూసుకో "అని కోపంగా అన్నారు . శ్యామలమ్మ గారికి తాతగారి కోపములోని అంతరార్ధము అర్ధముకాగా భగవంతుని సమక్షములో ఉన్నప్పుడు మనస్సును ఇతర విషయములవైపు పోనీయక నిశ్చలముగా ,నిర్మలముగా ఉంచుకోవలసినదని తాతగారు సందేశమిచ్చినట్లు అర్ధమయింది .
 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                       
« Last Edit: April 19, 2017, 05:02:15 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1157 on: April 20, 2017, 03:48:15 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
                యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇది ఒక్క శ్యామలమ్మగారికి మాత్రమే గాక యావన్మంది భక్తులకు తాతగారు అందించిన సందేశమని గ్రహించాలి . ఎందుకంటే మనలో చాలామందికి తమ గురించి తమకు కాక ఇతరుల విషయాలపట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది . మనం ఎక్కడకు వెళ్లినా ,ఎలా ఉన్నా మన దృష్టి మాత్రం ఇతరులపై కేంద్రీకృతమై వాళ్లలోని లోపాలు చూడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మన తప్పులు గ్రహించడం కానీ ,దిద్దుకునే ప్రయత్నం చేయడం కానీ ఉండదు . ఇది మానవ నైజము కావచ్చు కానీ ఇది తప్పని భగవంతుని సన్నిధిలో మాత్రమే కాక్క మనం ఎక్కడున్నా పరులపై నిండా కూడదని ఈ సందర్భంగా తాతగారు సుతిమెత్తగా హెచ్చరించిరి . ఈ మర్మాన్ని గ్రహించి బాగుపడగలిగినవారు ధన్యులే .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1158 on: April 21, 2017, 04:47:33 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత శ్యామలమ్మగారికి తాతగారి చేతులమీదుగా తాతగారి ఫోటోను తీసుకోవాలన్న కోరిక కలిగి తాతతో వచ్చిన మదిలేటితో సంగతి చెప్పగా మాదిలేటి తాతగారి చేతికి ఫోటోను ఇచ్చి శ్యామలమ్మకు ఇవ్వమని చెప్పడం జరిగింది . శ్యామలమ్మగారు తాతకు నమస్కరించి తాతను ఆ ఫోటోపై తాతగారి సంతకము చేసి ఇవ్వమని కోరగా ఆ ఫోటోవైపు తదేకముగా చుసిన తాత ఆ తరువాత " రా రె "( రామిరెడ్డి ) అని ఫోటో వెనుక సంతకము చేసి ఇచ్చారు . తాత స్వయముగా సంతకము చేసి ఇచ్చిన అపురూప కానుకను ప్రసాదముగా స్వీకరించుటయే కాక శ్యామలమ్మ గారికి ఈ సందర్భములోనే తాతగారి కేశములు లభించగా వాటిని ఆవిడ ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకొనిరి . శ్యామలమ్మగారి మరిదిని  తాత ఆశీర్వదించగా అతనికి రెండు నెలలోనే ఉద్యోగము లభించింది .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1159 on: April 22, 2017, 02:50:13 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
          సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

ఇది జరిగిన నెలలోనే తాతగారు గూడూరు రావడము తటస్థించింది . వీళ్ళ ఇల్లుగలావిడకు వివాహమై 12 సం . లు గడిచినా పిల్లలు లేకపోవుటచే శ్యామలమ్మగారు ఆవిడను తాత వద్దకు తీసుకుని వెళ్లి ఆమెను సంతాన భాగ్యము ప్రసాదించమని ప్రార్ధించగా తాత చేతులతో తన పొట్టను నిమురుకుంటూ "తప్పేదేముంది సరే !" అన్నారు . తాత పొట్ట నిమురుకోవడం ద్వారా ఆమెకు కడుపు పండి ఒక సంవత్సరముకల్లా ఆడపిల్ల పుట్టినది .

ఒకసారి తాతగారు సిగరెట్టును విసిరివేయగా ,అది ప్రసాదముగా భావించి భద్రపరచుకోవాలా అని తాతను అడుగగా తాత అందుకు అంగీకరించిరి . తాతగారి కేశములను ,సిగరెట్టును ఫోటో కట్టించి పూజలో పెట్టుకొని తాతపై తమకు గల అభిమానమును చాటుకొనిరి . ఇతర సాయి భక్తుల సలహాపై తాతగారి మాటలు పొందుపరచిన డైరీని కాపీ చేసుకుని తమ వద్ద ఉంచుకొనిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1160 on: April 23, 2017, 06:01:11 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇక పొండసే :

మాస్టారు గారి ఆదేశానుసారము రంగారావుగారు కర్నూలు వాస్తవ్యులైన దయాళ్ శరణ్ గారితో కలిసి తాతగారిని దర్శించారు . వీరు దర్శించిన మొదటి అవధూత తాతగారే . రంగారావుగారు తాతగారు దేహాభిమానమును వదిలి ,జీవన్ముక్తావస్థలో ఉన్న అవధూతగా గ్రహించారు . అంతేకాక ముందుగా ఆగ్రహించి ఆ తరువాత అనుగ్రహ ఆశీస్సులను వెల్లువలా కురిపించే దత్తావధూతే రామిరెడ్డి తాత అని తెలుసుకున్నారు . తాత ఉగ్రరూపం చూసి మనసులో సాయి అష్టోత్తరం చదువుతూ ఉండగా తాతగారు పూజ అయ్యేవరకు నిలబడి ఉండి ఆ తరువాత సిగరెట్టు వెలిగించి ఇవ్వమన్నారు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1161 on: April 24, 2017, 04:02:11 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3. సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత ఒకసారి రంగారావుగారు ,శ్రీ మేడా జయరాం ,శ్రీ నేరెళ్ల శ్రీరామమూర్తి దత్త దీక్ష చేసి యాత్రలో ఆఖరిభాగంగా రామిరెడ్డి తాత గారిని దర్శించుటకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కల్లూరు చేరిరి . తాతగారిని దర్శించుకుని తొందరగా తిరిగి 5 గంటల ఒంగోలు బస్సుకు వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్న వీరికి తాతగారు ఎంతకూ వెళ్ళుటకు అనుమతి నివ్వకపోవటమే కాక ,వారితో పాదసేవ చేయించుకున్నారు . ఆ తరువాత వీరు ఇచ్చిన బిస్కట్లను నమిలి ఆ ఉచ్ఛిష్ఠాన్నే ప్రసాదముగా ఇవ్వగా అవధూతల పట్ల మంచి అవగాహన కలిగిన రంగారావుగారు దానినే  తినిరి . ఆ తరువాత తాతగారు 'ఇక పొండసే ' అని అనుమతినిచ్చారు . బస్సు వెళ్ళిపోయి ఉంటుంది ఎలా అనుకుంటూ బస్టాండుకు చేరిన వీరికి 5 గంటల బస్సు రిపేరు రావడంతో అది వీళ్ళు వెళ్లేసరికి బాగయి 7 గంటలకు బయలు దేరుటకు సిద్ధముగా ఉన్నది . అది చూసిన రంగారావుగారు వాళ్లకు తాతగారు తాము వెళ్తామని తొందరపడినా అనుమతివ్వక ఆ తరువాత ప్రసాదము ననుగ్రహించి ,ఆశీర్వదించి బస్సు బయలుదేరు సమయమునకు తమను పంపించిన తాత ప్రేమకు ముగ్దులైరి .
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1162 on: April 25, 2017, 02:52:52 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

పుణ్యక్షేత్రములు :

దోరగర్ల వాసియైన అంకయ్య గారికి ఒకసారి అద్భుతమైన సంకల్పము కలిగింది . అదేమనగా 40 రోజుల పాటు పుణ్యక్షేత్రములు తిరిగి అవధూతలను దర్శించి రావాలని అతని కోరిక . దుర్లభమైన ఈ కోరిక నెరవేరాలంటే తాతగారి ఆశీస్సులే ఈ పనిని సాధ్యపరచగలదని భావించినవాడై తాత దర్శనానికి కల్లూరు చేరి తాతను ప్రార్ధించగా తాతగారు పిచ్చి పిచ్చిగా చూడడం ,పిచ్చి చేష్టలు ,మాటలు చుసిన ఇతను అది పిచ్చి కాదనీ అవధూత ముఖ్య లక్షణమైన ఉన్మత్త భావమనీ తెలిసినవాడు కాబట్టి తాత పాదాలు గట్టిగా పట్టుకొని తాత మహానుభావుడన్న సంగతి తనకు తెలుసుననీ ,తాత ఆశీర్వాదము కోసము వచ్చిన తనను నిరాశపరచక తన యాత్రలకు తాత ఆశీస్సులు అందించమనీ  పరిపరి విధముల కోరగా కొంతసేపటి తరువాత తాతగారు లేచి నిలబడి "లేచిపో " అన్నారు . అంతే ! అదొక్క వాక్కే ఆశీర్వాదమై నిర్విఘ్నముగా దుర్లభమైన అవధూతల దర్శనమూ ,సుమారు 70 పుణ్యక్షేత్రముల దర్శన భాగ్యము ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా పూర్తి చేయగలగడం కేవలము తాత ఆశీర్వాద బలమేనన్న సత్యమును గ్రహించి యాత్రలు ముగించుకొనిరి .
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1163 on: April 26, 2017, 03:18:11 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !


శ్రీ గురు గీత :
శ్లో ॥  5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥     

               శ్రీ రామావధూత జీవిత చరిత్ర (టి . శైలజ )

ఇది చాలా చిన్న విషయముగా కనిపించవచ్చు కానీ తరచి చుస్తే ఇది ఎంతటి ఆద్భుతలీలో అర్ధమవుతుంది . తన సంకల్పము ఎంత కఠినమైనదో తెలుసు కాబట్టే అంకయ్యగారు తాత  పాదాలు పట్టి శరణాగతి కోరారు . తాతగారు కూడా అతని మనసుకు తగిన ఓదార్పునిచ్చి అతి దుర్లభమైన అవధూతల దర్శనము ,పుణ్యక్షేత్రముల సందర్శన భాగ్యం గురుకృప ద్వారా సాధ్యమేనని తేటతెల్లం చేసిరి . అయితే ఇది జరిగిన ఎన్నో సంవత్సరములకు "తాతగారి జీవిత చరిత్ర " గ్రంథ రచన విషయ సేకరణకై గొలగమూడి చేరిన వారికి అదే సమయమునకు గొలగమూడి యాత్రకు వేంచేసిన అతను యథాలాపముగా తారసపడి తాతగారితో తనకు గల అనుబంధమును ఎంతో భావోద్వేగముతో వివరించడం కూడా తాతగారి లీలనే .
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1164 on: April 27, 2017, 02:18:33 PM »

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మిక్స్ చెయ్యెద్దు :

నిర్మల్ నందు నివాసముండు నలుగురు అన్నదమ్ములు దేవేందర్ గుప్తా ,నరేందర్ గుప్తా ,సురేందర్ గుప్తా ,రఘేందర్ గుప్తాలు ,అనేక సంవత్సరములుగా దత్త వెంకటసాయి సమాజము పట్ల అత్యంత భక్తిశ్రద్ధలు కలవారు . అంతేకాక వారి కుటుంబ సభ్యులందరూ ఏ చిన్న కష్టమునకైనా ఈ మందిరమునకు వచ్చి ధునిలో కాయను వేసుకొనుట ద్వారాను ,పారాయణముల వల్లనూ తమ కష్టముల నుండి గట్టెక్కడివారు . వ్యాపారస్థులైన అన్నదమ్ములందరూ ఎంతో కలిసిమెలిసి జీవించెడివారు . ఈ కుటుంబము ప్రభాకర్ మహారాజ్ సాంగత్యము వలన అవధూతల విశిష్టతను తెలుసుకున్నవారై ఏ అవధూత దత్తగడ  వచ్చిరని తెలిసినా ఎంతటి రాత్రైనా ,ఏనాడైనా వానైనా లెక్కింపక అప్పటికప్పుడు కుటుంబమంతా విచ్చేసి అవధూతల ఆశీస్సులు విశేషముగా పొందుచుండెడివారు . ఈ కుటుంబమునకు తాతగారు ఏ విధముగా ఆశీర్వదించిరో తెలుసుకుందాం .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1165 on: April 28, 2017, 02:31:44 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
               ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||
                         
శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
మొట్టమొదటిసారిగా వీరు తాతగారిని దర్శించుకొనుటకు దత్తగడకు  వెళ్లేసరికి అక్కడ వర్షం మొదలయ్యింది . వర్షం పడుతోంది కాబట్టి తాతగారు తడిసిపోతారనే ఉద్దేశ్యముతో లోపలకు రమ్మని ప్రార్ధించగా తాత  'మనకేమిట్రా ' వాడు చూసుకుంటాడు అన్నారు . అంతే అక్కడున్న అందరూ తడిసారు కానీ తాతపై ఒక్క చుక్క నీరు కూడా పడలేదు . ఆ రకముగా ప్రధమ దర్శనంలోనే వారిని ఆనందింపచేసిన తాత వారి మనసులను కట్టిపడేసారు . దేవేందర్ గుప్తా నరేందర్ గుప్తాలిద్దరూ తర్బూజ్ ,కర్బూజ్ కాయలను తాతగారికి ప్రసాదముగా తీసుకువెళ్లి తాతను స్వీకరింపుమని ప్రార్ధింపగా తాతగారు 'మిక్స్ చెయ్యద్దు సారూ " అన్నారు . అనగా ఈ రెండు పండ్లముక్కలనూ కలపవద్దని తాతగారు అంటున్నారని వీరు భ్రమించారు . అయితే ఆ తరువాతి కాలములో ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి చేసిన వ్యాపారములో తీవ్రనష్టము సంభవించుటయే కాక ప్రాణప్రదంగా మెలిగే అన్నదమ్ముల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదములు కలిగి అన్ని విధాలా నష్టపోయి తిండికి కూడా లేని స్థితికి చేరుకున్నారు . అప్పుడు తాతగారి మాటలలో అంతరార్ధము మిక్స్ చేయవద్దు అన్నది పండ్లను గురించి కాదనీ అది తమను భాగస్వాములుగా ఉండి వ్యాపారము చేయవద్దని తాతగారు చెప్పినట్లు గ్రహించిన వారై ఎవరి వ్యాపారములు వారు మొదలు పెట్టిరి . తరువాత అన్నదమ్ములు విభేదాలన్నీ మరచి అరమరికలు లేకుండా ఆనందంగా ఉంటున్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
« Last Edit: August 26, 2017, 08:48:47 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1166 on: April 29, 2017, 02:52:58 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥   

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి  శైలజ )

తాతగారు సమాధియైన తరువాత మొదటి ఆరాధనోత్సవమునకు  నలుగురు అన్నదమ్ములూ నాలుగురకాల స్వీట్లను ఎవరికి వారు ప్రత్యేకముగా తీసుకువెళ్లి తాత సమాధికి నైవేద్యము పెట్టుటకు అక్కడున్న వారికి ఇచ్చిరి . వేలమంది భక్తజన సందోహములో తాత సమాధికి నమస్కరించి సాయంత్రంఎప్పుడో తిరుగు ప్రయాణమునకు సన్నద్ధము కాగా చంద్రారెడ్డి వారికి ప్రసాదముగా స్వీటు డబ్బాలు ఇవ్వడం  జరిగినది . మధ్యదారిలో ప్రసాదము తినుటకు తెరచి చూడగా ఎవరు తీసుకువెళ్లిన స్వీటు వారికే తిరిగి వచ్చినది . నాలుగురుకూ అదే విధముగా జరగడం చూసి ఆనాడు శరీరముతో ఉన్నప్పుడు 'మిక్స్ చెయ్యొద్దు ' అని చెప్పినట్లుగనే నేడు సమాధి నుండి ఎవరు తెచ్చిన స్వీటు వారికి రావడంతో తాతగారిచ్చిన ఈ అద్భుత లీలనూ ,సందేశమునూ గ్రహించిన వారై ఆనందముతో మరలి వెళ్ళిరి . నేటికీ కూడా అన్నదమ్ములందరూ ఏ చిన్న సమస్యకైనా తాతగారిపై ఆధారపడి తాతను ప్రార్ధించి ,తాత సమాధిని దర్శించుట ద్వారా మేలు పొందుతున్నారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1167 on: April 30, 2017, 11:32:39 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

రామసన్నిధి :

హైదరాబాదు లోని కబూతర్ ఖానా దత్తసాయి  సంస్థానము నందు విగ్రహ ప్రతిష్టకు వేంచేసిన తాత అక్కడే ఉన్న శైలజతో 'ఎక్కడకూ వెళ్ళకమ్మా ' అని సెలవిచ్చిరి . ఆ మాటలకు అర్ధమేమై ఉంటుందో తెలియని శైలజ మాట్లాడకుండా నిలబడగా తాతగారు ఆమెతో ఎక్కడకూ వెళ్ళనను మాట తీసుకున్నారు . అప్పుడామె మనసులో ఇక ఏ బంధువుల ,స్నేహితుల కార్యక్రమములకు వెళ్లకుండా కేవలము దైవసంబంధమైన కార్యక్రమములకే పరిమితమైనది . ఆమెతో ఈ మాట తీసుకున్న మరునాడే తాతగారు రామారావు అనే భక్తుడు తానూ కట్టుకున్న నూతన ఇంటికి తాతగారు పాదము మోపి పావనము చేయుటే నిజమైన గృహప్రవేశమని భావించగా ఆ భక్తుని కోరికను మన్నించి ఆ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యము స్వీకరించిన తాత దైవము తప్ప ఇక ఏ ఇతర బంధములకూ ప్రాధాన్యత నివ్వని ఆయనను నిండుగా ఆశీర్వదించిరి . తాతగారు సమాధి చెందిన తరువాత 1994 సం . లో ఒకరకముగా సన్యాసాశ్రమము గడుపుతున్న రామారావు గారికి తన స్వార్జితమైన తన ఇంటిని ఎవరైనా ముందుకు వచ్చి ఆశ్రమముగా మలచి ఏదైనా సమాజమునకు పనికివచ్చు కార్యక్రమము మొదలు పెట్టిన బాగుండునని ఆలోచన కలిగి వెలిబుచ్చగా అంతకు మునుపే తాతగారు తనకిచ్చిన ప్రేరణ ఆధారముగా ఇందుకు అంగీకరించిన శైలాజ పిల్లలపై ఉన్న మక్కువతో అనాధ శరణాలయమును స్థాపించి పిల్లలతో తన జీవితము గడుపుటకు ముందుకు వచ్చింది . అప్పటినుంచి రామారావుగారు శైలజను దేవుడిచ్చిన చెల్లెలుగా మనస్ఫూర్తిగా భావించేవారు . ఆ తరువాత రామారావుగారు ప్రాణాపాయ స్థితిలో కూడా సన్నిధానము గడప దాటాక అవధూలపై ఆధారపడగా అనసూయమాత ఆయనను కర్మ విముక్తుని చేసి ముక్తి నొసగినది .

                                         ఓం ముక్తి నిలయాయ నమః

ఆ విధముగా ఆనాడు ఎక్క్కడకూ వెళ్లవద్దని ఆదేశించిన తాత ,తాను గృహప్రవేశము చేసిన ఇంటిని తన సన్నిధిగా మలచుకొనుట ద్వారా "రామసన్నిధానము " ఆవిర్భవించింది .

అదే సమయమునకు వేరొక మందిరమున ధుని ప్రజ్వలించు కార్యక్రమమునకు వేంచేసి యున్న అనసూయమాత ,తాత దివ్య మంగళ రూపము కనుమరుగైనప్పుడు తాతపై ఉన్న ప్రేమతో రామసన్నిధానము బాధ్యత స్వీకరించి అచ్చట అఖండ ధునిని వెలిగించి ఈ ఆశ్రమమందు తన శక్తిని ప్రతిస్థించింది. ఆ రకముగా తాతగారిచే స్వయముగా 'అనక్క ' అని పిలిపించుకున్న అనసూయమాత తాతపట్ల తన సోదరీ భావమును నిర్ధారించింది .

 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 
 
                


 

                                                     
 
 
 
                                                                     
             
   

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీరామవధూత జీవిత చరిత్ర
« Reply #1168 on: May 01, 2017, 08:40:29 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
                  శ్లో || 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
                                 గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ  గురవేనమః ॥   

                  శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                              ఓం అనక్క సోదరాయనమః

ఇద్దరు అవధూతలు మేలు కలయికతో ప్రారంభమైన ప్రేమమందిరమైన "రామసన్నిధానము " లో చేరిన పసిపిల్లలను వీరిద్దరే కాక ఇతర అవధూతలు కూడా తమ పిల్లలుగా భావించి బాధ్యత వహించి రక్షిస్తున్నారు .

               కల్లూరులో తాతగారిని దర్శించుకున్నప్పుడు శైలజ తల్లియైన కృష్ణలీల అప్పటికే తాతగారి భక్తురాలిగా ఉన్న తన కూతురు యోగక్షేమములు తాతని చూడాలని మనస్ఫూర్తిగా తాతగారిని మనసులోనే ప్రార్ధించగా వెంటనే తాతగారు 'ఆ 'అని సమాధానమిచ్చిరి . ఆ సమాధానము ఆమెకెంతో నిశ్చింతని ప్రసాదించి తాతగారితో పాటుగా ఢిల్లీ తప్ప అన్ని యాత్రలూ చేసుకుంది . . అయితే తాత సమాధి తరువాత రామసన్నిధానము ఏర్పడినప్పుడు మాత్రము కన్నతల్లిగా తట్టుకోలేక తల్లడిల్లిపోయింది . అప్పుడు ఆమె తన బాధనూ ,ఆందోళన నూ తనలోనే దాచుకుని మౌనముగా తాతగారినే కూతురు క్షేమము కోసము ప్రార్ధించినప్పుడు ఆ తల్లి మూగవేదననూ ,ఆందోళననూ ఆలకించిన తాత ఆమెకు మానసిక ధైర్యమునూ ,శక్తినీ ఇచ్చిరి . తాత ప్రసాదించిన శక్తితో సన్నిధానము పట్ల ఎంతో భక్తి భావన కలిగి సన్నిధానమునకు ఎప్పుడు ఏ సేవ అవసరమైతే నిస్వార్ధముగా ఆ సేవ చేసుకుంటున్నది . అయితే తన బాధ్యతలు ముగిసే పెద్ద వయసులో సన్నిధానము పిల్లల బాధ్యతను స్వీకరించి ,ఆ పిల్లలను సంపూర్ణముగా ,మస్ఫూర్తిగా అమ్మమ్మలా ఆదరించి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నది . పిల్లలతో అనుబంధము పెంచుకుని జీవిస్తున్న శైలజ నీతి నియమములకు కట్టుబడి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ రామసన్నిధానము గడప దాటక తాత ఆమెకు సూచించిన జీవన విధానమును వేదవాక్కులా భావించి కట్టుబడి యుండుట చేతనే ఆమె జీవితమునకు సరియైన సార్ధకత కలిగించుటకే తాతగారు తన జీవిత చరిత్ర రాయు అదృష్ట భాగ్యమును భిక్షారూపముగా తన కూతురుకు ప్రసాదించిరని తెలుసుకున్న తల్లి ఆనాడు 'ఆ ' అన్నపదముతో తనకు ధైర్యము నివ్వడమే కాక తన కూతురుకు తాత రక్షా కవచములా నిలిచిరని తెలుసుకుంది . జన్మనిచ్చిన తల్లిని తానె అయినా తన కూతురు పట్ల తాతగారు కురిపించిన మాతృప్రేమకు పొంగిపోతూ 'మాతృదేవోభవ ' అన్న పదమునకు నిర్వచనమైన తాతగారికి మనఃపూర్వక నమస్కారము లర్పించుకుంటున్నది .
తాతగారి వాక్కుకున్న మహిమ ఈపాటికి పూర్తిగా అర్హ్డంయింది కదా . తాతగారు శరీరంతో లేనప్పటికీ వారి శక్తి కలకాలం నిలిచి ఉంటుంది . కాబట్టి మనకు అవసరమైనప్పుడల్లా ఏ స్వప్న సందేశము ద్వారానో లేక తాతగారికి -తాతగారి గ్రంధానికీ తేడాలేదు కాబట్టి ఆ గ్రంధం ద్వారా కూడా మనం తాత వాక్కును గ్రహించవచ్చు . ఎటువంటి సమస్యకానీ ,క్లిష్ట పరిస్థితి కానీ ఎదురైనప్పుడు తాతగారిపై ఆధారపడిన భక్తులు తాతనుండి సంపూర్ణమైన ,తృప్తికరమైన సమాధానమునూ ,ఫలితమునూ నేటికి కూడా పొందగలుగుతున్నారు .

                       త్వమేవ సర్వం మమ దేవదేవ
                 ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2113
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1169 on: May 02, 2017, 07:48:19 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
      తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                      అధ్యాయము -9
                    శ్రీ గణేశాయనమః  శ్రీ సరస్వత్యేనమః  శ్రీ రామవధూతాయనమః

         మహోగ్రం మహాకాయం ముగ్ధమోహనాకారరూపం
         తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

రామిరెడ్డి తాత ప్రేరణ ,ప్రోద్భలము ,ఆశీస్సులతో ప్రప్రథమముగా సేలము నుండి దేవీమాయమ్మ తరలిరాగా ప్రత్యక్షముగా శ్రీ సాయినాథుని దర్శన భాగ్యంతో అపూర్వ త్రివేణి సంగమ మేలు కలయికతో అత్యద్భుతముగా రూపుదిద్దుకున్నది గుంటూరు లోని నల్లపాడులో వెలసిన సాయిమందిరము .

నాగసాయి మందిరము - నల్లపాడు :

ఏదైనా ఒక మహత్కార్యమును సాధించవలెనన్నా ఏదైనా ఒక మహాద్భుతము సృష్టించాలన్నా దానికి అంతులేని పట్టుదల ,కృషితో పాటు దైవానుగ్రహం కూడా సంపూర్ణముగా కావాలి . ఈ దైవబలముతోనే అనేక కష్టనష్టముల కోర్చి ఒక అపూర్వ కలయికకు శ్రీకారం చుట్టి సాధించిన ఘనత నాగసాయి మందిర వ్యవస్థాపకులైన బాలచందర్ గారికి ,వారికాన్ని విధములా సలహాలను ,సహాయ సహకారములు అందచేసిన మామిడి శివప్రసాద్ గారికి చెందుతుంది . తాతగారే స్వయముగా సంకల్పము కలిగించి ఒక మహత్తర కార్యక్రమమును సాధించుటలో భక్తులకు అండదండలుగా నిలుచుటయే కాక ఆ దారిలో ఉన్న ఆటంకములను తొలగించి ఆ కార్యక్రమము జయప్రదముగా జరిగేలా చూసారు . ఆ వివరములన్నియు ఇప్పుడు తెలుసుకుందాము .
 

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!