Saimasterforums

Leelas & Others => General Discussion => Topic started by: Gurupriya on July 25, 2013, 12:02:53 PM

Title: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 25, 2013, 12:02:53 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 1 . అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయగుణాత్మనే |
            సమస్త జగదాధారా మూర్తయే బ్రహ్మణేనమః ||

          గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

1. నిన్ను నువ్వు తెలుసుకో గలిగిన రోజు భగవంతుణ్ణి తెలుసుకోగలవు,నేను అనేది ఏది ? చెయ్యా,కాలా ,మాంసమా,రక్తమా ,లేక శరీరం లోని మరేదైనా భాగమా ?బాగా ఆలోచించండి ; 'నేను 'అనేది ఏదీ లేదని నీకే తెలుస్తుంది ,నీరుల్లి పాయ పొరలను ఒలిచిన కొద్దీ పొరలు వస్తూనే ఉంటాయి . కాని పలుకు అనదగిన దేదీ  కనపడదు ,అలాగే 'అహంకారం యొక్క స్వరూపం ఏమిటి ? పరిశోధించినప్పుడు  అది అదృశ్యమైపోతుంది . చివరకు మిగిలేది ఆత్మే -చిత్స్వరూపమే . అహంకారం నశించగానే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

--
[/size][/size][/size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 26, 2013, 08:44:54 AM
జై జై సాయి మాస్టర్ !
   గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
   అలివేలు మంగ పతి నీకిదెవందనం !

   శ్రీ గురు గీత :

   శ్లో . 2 . యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకమ్
              తారకం భవసింధోశ్చ టం గురుం ప్రణమామ్యహమ్

 గురూపదేశములు ( శ్రీరామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

2. పక్వం ,అపక్వం అని అహంకారం రెండు విధాలు . " ఇది నా ఇల్లు ,నా గది ,నా కుమారుడు "--ఈ భావం గలది పక్వం కాని అహంకారం . పక్వమైన అహంకారం 'నేను దేవుడి సేవకుణ్ణి; నేను అతడి బిడ్డను ;నేను నిత్య ముక్తుణ్ణి;జ్ఞాన స్వరూపుణ్ణి " అని భావించే టట్టిది.

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
  [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 27, 2013, 02:02:55 PM
జై సాయి మాస్టర్ 1
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదెవందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 3 . సర్వ తీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః
           గురో: పాదోదకం పీత్వా శేషం శిరశిధారయన్

  గురూపదేశములు--(శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

3 . ఒక పురుషుడు శ్రీ రామ కృష్ణులతో " నన్ననుగ్రహించి నా కొక్క మాటలో జ్ఞానోదయం అయ్యేట్లు ఉపదేశించండి " అని అడిగాడు . అందుకాయన ,"బ్రహ్మసత్యం జగన్మిధ్యా "(పరబ్రహ్మమే సత్యమైనది ,జగత్తు మిధ్య )--ఈ తత్త్వాన్ని గ్రహించు " అని పలికి మిన్నకున్నారు .

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 28, 2013, 09:32:01 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదెవందనం !

శ్రీ గురు  గీత :

శ్లో . 4 . అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్
           జ్ఞాన వైరాగ్యసిద్ధ్యర్ధం గురో : పాదోదకం పిబేత్

           గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4 . పురుషుడు శరీరంలో ఉన్నంత కాలం వాడి అహంకారం అతణ్ణిపూర్తిగా విడువదు . ఏమాత్రమో కొంత జాడ సదామిగిలే ఉంటుంది . కొబ్బరి చెట్టు మట్టలు పడిపోయినా ఆ  చోట వాటి గుర్తులు మిగిలి ఉంటాయి . అహంకారం కూడఇలాటిదే . ఐనాస్వలపమైన యీఅహంకారం ముక్తుడైఉన్న  వ్యక్తిని బాధించదు .

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 29, 2013, 08:32:33 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదెవందనం !

శ్రీగురు గీత :

శ్లో . 5 . కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం  బ్రహ్మ నిశ్చయః

              గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

5 . శ్రీ రామకృష్ణుడు (తన గురువైన ) దిగంబర 'తోతాపురి ' స్వామిని "ఇప్పటి తమ పూర్ణావస్ధలొ దినదినమూ ధ్యానించ వలసిన అవసరం ఏమిటి ? " అని ప్రశ్నించగా ,అతడిలా అన్నాడు : " ప్రతి రోజు తోమని పక్షంలో ఇత్తడి పాత్ర మెరుగు మాసిపోతుంది . అనుదినం ధ్యానించ కుంటె మనో పరిశుద్ధత నిలువదు "అప్పుడు శ్రీ రామ కృష్ణుడు ,'పాత్ర బంగారు దయితే మెరుగు మాసిపోనే పోదు " అంటూ బదులిచ్చాడు . అంటే భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇక సాధనలు  అనావశ్యకాలని భావం .

అలివేలు మంగ పతి నీకిదెవందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 30, 2013, 07:28:02 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో   . 6 . గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణ భాసకః
              రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం

            గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

6 . అనులోమం, విలోమం అని  విచారణ రెండు విధాలు . గుజ్జు చిప్పను అంటి ఉంటుంది ;అదే విధంగా చిప్పా గుజ్జును అంటి ఉంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Swayam on July 30, 2013, 06:05:21 PM

6 . అనులోమం, విలోమం అని  విచారణ రెండు విధాలు . గుజ్జు చిప్పను అంటి ఉంటుంది ;అదే విధంగా చిప్పా గుజ్జును అంటి ఉంటుంది .

Jai Sai master

Is there a continuation of this, if not, how to understand the above statement, is this pointing to మర్కటకిశోర న్యాయము - మార్జాలకిశోర న్యాయము ?

Jai SaiMaster
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on July 31, 2013, 08:27:14 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 7 . కర్మణా మనసా వాచా సర్వ దారాధ యేద్గురుమ్
           దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ

          గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

7. 'నేను ' అనే భావం ఉన్నంతవరకు 'నువ్వు ' అనే భావం ఉంటుంది ( 'నేను ' అనే భావంలో 'ఇతర ' మనే భావం ఇమిడి ఉంది ). వెలుతురు  యొక్క అనుభవం ఉన్నవాడు చీకటి యొక్క అనుభవం కూడ  పొంది ఉంటాడు . పాపం తెలిసిన వ్యక్తికి  పుణ్యమూ తెలిసి ఉంటుంది .ఒప్పెరిగిన  వ్యక్తి  తప్పు ఎరిగి ఉంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 01, 2013, 09:03:22 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో . 8 . శరీరమింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్
           ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్

        గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

8 . పాదుకలు ధరించి ముళ్ళ మీద నిరపాయంగా నడవగలవు . ఆధ్యాత్మిక జ్ఞానమనే పాదుకలు  ధరించి (తాపము లనే ) ముళ్ళతో కూడిన యీ సంసారంలో  సురక్షితంగా సంచరించగలవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 02, 2013, 08:55:33 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 9 . గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం
          గురో : పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం

         గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9 . ఆత్మానందం అనుభవిస్తూ ఎవరితోను మాట్లాడకుండా జీవనం గడిపే ఒక సాధు పుంగవు డుండేవాడు . చూసిన వారందరూ అతణ్ణి  పిచ్చివాడని తలచారు . అతడొక రోజు గ్రామంలో  బిచ్చమెత్తి  కొంత అన్నం తెచ్చ్చుకొని ఒక కుక్క వద్ద కూర్చుని తినసాగాడు . ఒక కబళం తన నోట్లో పెట్టుకొని మరొక కబళం కుక్క నోట్లో పెడుతూ , మిత్రుల్లా ,ఆ మహానీయుడూ కుక్కా జతగా తినసాగారు . ఇదంతా చోద్యంగా కనిపించగా ,అనేకులు అక్కడ గుమికూడారు . వారిలో కొందరు ఆ మహనీయుణ్ణి  చూసి ,`వట్టి పిచ్చివా `డని  ఎగతాళి చేస్తూ నవ్వ నారంభించారు . అప్పుడు ఆ మహాత్ముడు ఇలా అన్నాడు : "ఎందుకు నవ్వుతారు ?

శ్లో . విష్ణూ పరి స్దితో విష్ణు: విష్ణు : ఖాదతి విష్ణవే
      కధం హససిరే విష్ణో ,సర్వం విష్ణుమయం జగత్

తే . విష్ణు ఉప విష్ణు డయ్యెను విష్ణు గూడి
     విష్ణు నన్న  మిడుచు నుండె విష్ణువునకు
     విష్ణువా యేల నవ్వెదు విష్ణు జూచి
     విష్ణువే కద యెది చూడ విష్టపముల "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 03, 2013, 08:54:39 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో 10 . గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
          గురు స్సాక్షాత్పరం బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

         గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

10 . అజ్ఞానం వల్ల మనిషి బాహ్యంలో భగవంతుడి కోసం వెదుకుతున్నాడు . భగవంతుడు తన లోనే ఉన్నాడని అనుభవం వల్ల తెలుసుకోవటమే జ్ఞానం . ఇక్కడ దైవం గల వ్యక్తికి (అంటే తనలో భగవంతుడు ఉన్నాడని అనుభవం  తెలిసిన వ్యక్తికి ) అక్కడా దైవం ఉంటాడు . (అంటె అలాటి వ్యక్తి భగవత్పాద పద్మ సన్నిధిన ఉంటాడు . )

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 04, 2013, 08:43:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 11. అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్
           తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః

       గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                              భగవంతుడు
1. దేవుడు జీవుడిలో ఎలా నెలకొని ఉంటాడో తెలుసా ? సంపన్న కుటుంబంలోని స్త్రీలు జల్లి  వెనుక మరుగుపడినట్లే . అందరినీ వారు చూడగలరు ; కాని ఎవరూ వారిని చూడలేరు . సరిగ్గా భగవంతుడు యీ విధంగానే అందరి లోను నెలకొని ఉంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 05, 2013, 08:07:15 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లొ. 12 . స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్
           తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః

     గురూపదేశములు  (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                          భగవంతుడు

2 . వెలుగు నివ్వటం దీప స్వభావం . దాని సాయాన కొందరు వంట చేసుకొంటారు ; కొందరు దొంగ సంతకాలు చేసి దొంగ  పత్రాలు (దస్తావేజులు ) సృస్టిస్తారు . కొందరు భాగవతం చదువుకొంటారు .ఇది దీపం దోషమా ? అదే విధంగా భగవంతుడి దివ్య నామాన్ని జపించి కొందరు ముక్తి పొందాలని ప్రయత్నిస్తుంటే ,మరికొందరు తాము తవ్విన కన్నం పారటానికి  జపించే పక్షంలో అది భగవంతుడి దోషమా ?

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 06, 2013, 07:52:15 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ  పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత ;

శ్లో . 13 .చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం
            నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                         భగవంతుడు

3 . మీరేది కావాలని ప్రయత్నిస్తారో ,అది మీకు లభిస్తుంది . దేవుడు కల్పతరువు వంటివాడు . ఎవ్వడు ఏది కోరి ప్రయత్నిస్తాడో అతడి కది  దేవుడి వల్ల  సద్ధిస్తుంది . పేదవాడి కొడుకు చదువు కొని ఉన్నత న్యాయస్ధానంలో న్యాయమూర్తి పదవి పొంది తన కిక లోటు లేదనుకొంటాడు . దేవుడూ 'ఔ ' నని చెప్పి "నువ్వలాగే వర్ధిల్లు " అంటాడు . తరువాత అతడే పని విరమించి పింఛను (మనలో అనేకులం పెన్షన్ (pension ) అనే మాటను 'పింఛను ' అనేట్లు ,శ్రీ రామకృష్ణుడు 'పెన్సిలు 'అనేవారట ! (చూ : 'శ్రీ రామకృష్ణ లీలా ప్రసంగ ' మనే వంగ గ్రంధం . ) పుచ్చుకొంటూ ,వస్తుతత్త్వాన్ని సరిగ్గా గ్రహించ ఆరంభించినప్పుడు " ఈ జన్మలో నిజానికి నేను చేసిన కార్యం ఏమిటి ?"  తానూ వితర్కించు కొంటాడు . దేవుడూ అతడి మాటలకు తల ఊపి " ఔను ,నిశ్చయమే ,నువ్వు ఏం చేశావు ?" అని అడుగుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!  [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 07, 2013, 07:55:37 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 14 . చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం
            సంసార మొహనాశాయ తస్మైశ్రీ గురవేనమః

     గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                          భగవంతుడు

4 . బ్రహ్మానికీ శక్తికీ ( సగుణ బ్రహ్మానికీ నిర్గుణ బ్రహ్మానికీ ) భేదం ఏమీ లేదు . పరమాత్మే నిష్క్రియమని భావించ బడినప్పుడు శుద్ధ బ్రహ్మ మని పేర్కొనబడుతుంది ; సృష్టి స్ధితి లయాలను ఒనరుస్తూ క్రియాయుతమని భావించ బడి నప్పుడు శక్తి అనీ  సగుణ బ్రహ్మమనీ వ్యవహరించ బడుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 08, 2013, 08:35:23 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 15 . సపితా సచమే మాతాస బంధుస్సచ దేవతా
            సంసారం మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః

    గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                            భగవంతుడు
5 . ఒకరోజు దేవుడి విషయమైన సంభాషణ లో మధుర బాబు (దక్షిణేశ్వరాలయ ప్రతి స్ఠాపకురాలైన  రాణి రాసమణి అల్లుడు )('బాబు ' అనేది వంగ భాషలో ప్రేమ గౌరవాలను సూచించే పదం . )," భగవంతుడు కూడ ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉన్నాడు . అతడు తన యిష్ట ప్రకారం ఏమీ చేయలేడు "అని పలుకగా శ్రీ రామకృష్ణుడు ,"అలా అంటావేమిటి ? భగవంతుడు ఇచ్చామయుడు :అతడేం సంకల్పించినా చేయగలడు "అన్నారు . " సంకల్ప మాత్రాన యీ ఎర్ర పువ్వుల (మందార ) మొక్కన తెల్లపువ్వులు పూయించ గలడా ?" అని మధుర బాబు అడగ్గా ," నిస్సంశయంగా అట్లే చేయగలడు . దేవుడు సంకల్పించిన నాడు యీ ఎర్ర పువ్వుల మొక్కన తెల్లపువ్వులు పూస్తవి "అని శ్రీ రామకృష్ణుడు చెప్పాడు . కాని మధుర బాబుకు పూర్తి  నమ్మకం కుదిరినట్లు కనపడలేదు . తరువాత కొన్ని రోజుల్లో నిజంగా దక్షిణే శ్వర వనంలో ఒక మందార వృక్షం రెండు కొమ్మలలోను పూచిన పువ్వులు ,తెల్లని దొకటీ ఎర్రని దొకటీ కనిపించాయి . శ్రీ రామకృష్ణు డప్పుడు రెండు కొమ్మలన రెండు పువ్వులు పూచి ఉన్న పెద్ద కొమ్మను తీసుకెళ్ళి మధుర బాబుకు చూపించగా ,అతడు ఆశ్చర్యపరవశుడై ,'తండ్రీ ఇక ఎన్నడూ నీతో వాదన చేయను " అని పలికాడు .

అలవేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 09, 2013, 09:25:42 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో .16 .  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్
             యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                          భగవంతుడు

6. భగవంతుడి యొక్క సాకార నిరాకార రూపాలను గురించి నీకేమైనా తెలుసా ? ఈ సాకార నిరాకారాలు మంచు   నీటిని పోలి ఉన్నవి . నీరు ఘనీభవించి మంచుగా రూపొందినప్పుడు సాకారం . ఆ మంచు కరిగి నీరు అయినప్పుడు నిరాకార మవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 10, 2013, 09:51:12 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ  నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 17 . యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియత్భానరూపతః
            యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవే  నమః

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                             భగవంతుడు

7 . అంపశయ్యమీద పడుకొని మరణానికై వేచి ఉన్న భీష్ముడి కళ్ళ నుంచి భాష్పాలు స్రవిస్తున్నాయి . అర్జునుడది  చూసి  శ్రీ కృష్ణుడితో యిలా అన్నాడు ;" బావా ! ఏమిటి యీ వింత ! మా తాతగారు నిరంతర సత్య సంధుడు ,జితేంద్రియుడు ,బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ,స్వయంగా దేవ యోనులైన అష్ట వసువులలో ఒకడు కదా ! ఆయన కూడ దేహ త్యాగ తరుణంలో మాయలోపడి తద్వశాన  కన్నీరు విడుస్తున్నాడే !"కృష్ణ భగవానుడు అప్పుడు భీష్ముడి కీ విషయం తెలుపగా ,భీష్ముడు ఇలా అన్నాడు ; "కృష్ణా ! నేను మాయా ధీనుడనై విలపించడం లేదని నీకు బాగా తెలుసు కదా ! నీ లీలలను కించిత్తు అవగాహన చేసుకో లేకపోయానే అని దుఃఖపడుతున్నాను .  ఎవ్వరి పావన నామ స్మరణంతో మనుష్యులు సమస్త మైన ఆపదల నుంచీ తరిస్తారో అట్టి భగవంతుడే  స్వయంగా పార్ధ సారధియై  పాండవ పక్షం అవలంబించి ఉన్నా వారి కష్టాలకు అంత మంటూ లేకుంది కదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 11, 2013, 09:49:39 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :
శ్లో || 18 . ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా |
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ||

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                              భగవంతుడు

8. శ్రీ రామకృష్ణుడు ఒకసారి మధుర బాబుతో కలసి కాశీ   క్షేత్రానికి ప్రయాణమయ్యారు  . అక్కడ కొంత కాలం బస చేసి ,త్రైలింగ (తెలుగు ) స్వామి దర్శనం చేసుకొని ఆ మహానుభావుణ్ణి ఇలా అడిగారు : " భగవంతుడు ఒక్కడే కదా ,జనం పలుదైవాలు ఉన్నట్లు పలుకుతారెందుకు ?" స్వామి మౌనవ్రతం పాటించి ఉండటంతో కేవలం చేతి వేలొకటి పైకెత్తి ,ధ్యానస్ధితి నవలంబించి ;ధ్యానం వల్ల భగవంతుడు ఒక్కడే అని మనిషి గ్రహిస్తున్నాడనీ  వేదాంత వాద ప్రతి వాదాల వల్ల  భేద బుద్ధి కలుగుతోందనీ సూచించారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 12, 2013, 08:12:55 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 19 . యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదాతః |
              సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ||

      గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                                     భగవంతుడు

9 . సాకారబ్రహ్మం ఒకడూ నిరాకార బ్రహ్మం ఒకడూ అని వేరుగా ఇద్దరు దైవాలు లేరు . సాకారుడైన దేవుడే నిరాకారుడుగా కూడ ఉన్నాడు . భగవంతుడు భక్తుడికి వివిధ రూపాలతో సాక్షాత్కరిస్తాడు .  అనంత జలరాశి ఉన్నట్లు ఊహించు . ఏ వైపునా భూమి కనబడటం లేదు . విశేషమైన చల్లదనం వల్ల కొన్ని స్ధలాలలో మాత్రం నీరు గడ్డ కట్టి ఉంటుంది . బ్రహ్మమే యీ అనంత జల రాశి . మంచు గడ్డగా గట్టి  పడిన  భాగాలు ఆ బ్రహ్మం యొక్క సాకార రూపాలు . శ్రేష్టమైన భక్తే శీతలం . ఎండవేడిమి తగలగానే మంచు కరిగిపోతుంది . ఇట్లే జ్ఞాన సూర్యోదయ మవగానే సాకారం నిరాకారంలో లయిస్తోంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Yagnamachary on August 12, 2013, 12:16:37 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో .16 .  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్
             యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                          భగవంతుడు

6. భగవంతుడి యొక్క సాకార నిరాకార రూపాలను గురించి నీకేమైనా తెలుసా ? ఈ సాకార నిరాకారాలు మంచు   నీటిని పోలి ఉన్నవి . నీరు ఘనీభవించి మంచుగా రూపొందినప్పుడు సాకారం . ఆ మంచు కరిగి నీరు అయినప్పుడు నిరాకార మవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 13, 2013, 08:14:25 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

గురు గీత :

శ్లో || 20  .  జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే |
                జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ||

  గురూపదేశములు ( రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                            మాయ
1. మాయ అంటె ఎలాటిదో మీకు తెలుసా ? అది నీటి గుంటలో తేలివుండే నాచు మొక్కల వంటిది . ఈ నాచును మీరు దూరంగా తోసివేయవచ్చు . కాని అది మళ్ళా వచ్చి చేరుతూనే ఉంటుంది . అలాగే మీరు వేదాంత విచారమూ ,సజ్జన సాంగత్యమూ చేసేటంత కాలం సమస్తమూ నిష్కళంకంగా  ఉన్నట్లు కనిపస్తుంది . కాని వెను వెంటనే విషయవాసనలు  మిమ్మల్ని ఆవరిస్తవి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 14, 2013, 07:59:08 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో || 21 . శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం |
              గురో : పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ||

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                           మాయ

2. పాము కోరలలో విషం ఉన్నప్పటికీ ఆ ఆ విషం వల్ల దానికేమి ప్రమాదం లేదు . విషం దాన్ని బాధించదు . దాని కాటు తగిలిన ఇతర ప్రాణులకే అది విషమై ప్రాణోపద్రవం  కలుగ చేస్తుంది . ఆ విధంగానే భగవంతుడు మాయతో కూడి ఉన్నా అతడు దాన్ని అతిక్రమించే ఉన్నాడు . మనం మాత్రమే మాయాధీనులం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 16, 2013, 03:25:49 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో . 22 . మన్నాదః  శ్రీ జగన్నాధో  మద్గురు: శ్రీ జగద్గురు :
             మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                             మాయ

3. మాయకూ దయకూ భేదం ఏమిటో తెలుసా ?తల్లితండ్రులు ,సోదరులు ,ఆలుబిడ్డలు ,మేనల్లుడు మొదలైన తన బంధు మిత్రాదులపట్ల మనిషి కున్న రాగం ,ప్రేమ -యిదే మాయ . సకల ప్రాణులలోను  భగవంతుడు ఉన్నాడని గ్రహించి సమస్త జీవులను సమానంగా ప్రేమించటమే దయ అవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 17, 2013, 10:18:36 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో . 23 . ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే
             గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః

      గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                               మాయ

4 . దయ్యం పట్టిన మనిషి తన స్ధితిని గ్రహించగానే ఆ దయ్యం అతణ్ణి విడిచిపోతుంది . అదే ప్రకారంగా మాయాధీనుడైన  ప్రతి జీవి తాను మాయ అనే భూతం చే ఆవేశించబడినట్లు  తెలుసుకోగానే  మాయనుంచి విముక్తుడవుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 18, 2013, 10:29:46 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగపతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 24. గురుమధ్యేస్ధితం  విశ్వం విశ్వ మధ్యే స్ధితో గురు:
           గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః

     గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                                  మాయ
5. జీవాత్మ పరమాత్మల నడుమ మాయ అనే తెరవుంది . ఈ తెర తొలగుతేగాని  జీవుడు పరమాత్మను చూడలేడు . ఈ ఉదాహరణ చూడండి ; శ్రీ రాముడు లక్ష్మణుని కంటే కొన్ని అడుగులు ముందు నడుస్తున్నా డనుకోండి . సీత  ఇద్దరి మధ్య ఉన్నదనుకోండి . ఇక్కడ శ్రీ రాముడే పరమాత్మ ; లక్ష్మణుడే  జీవాత్మ ;సీతే మాయ . సీతాదేవి వారి ఇద్దరి నడుమ ఉన్నంత కాలం లక్ష్మణుడు  శ్రీ రాముణ్ణి చూడలేదు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 19, 2013, 08:13:01 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 25 . మధులుబ్ధొ  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ |
              జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ||

        గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                 మాయ
6. మాయ రెండు విధాలు : ఒకటి (విద్యామాయ )భగవంతుడి సన్నిధికి కొనిపోయేది . రెండవది (అవిద్యామాయ )భగవంతుడికి దూరంగా తీసుకొని పోయేది . 'వివేకం ,వైరాగ్యం 'అని విద్యామాయ తిరిగి రెండు విధాలు . ఈ విద్యా మాయను ఆశ్రయించి జీవులు భగవంతుణ్ణి శరణు పొందుతారు . అవిద్యామాయ ఆరు విధాలు .  అవి ,కామం ,క్రోధం ,లోభం ,మోహం ,మదం ,మాత్సర్యం . ఈ తరగతి మాయ 'నేను ,నాది 'అనే బుద్ధిని పుట్టించి మనుష్యులను సంసారంలో బంధిస్తుంది . కాని విద్యామాయ వ్యక్తం కాగానే అవిద్యా మాయ నిర్మూలమవుతుంది .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 20, 2013, 08:38:48 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 26 . అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ద్విబహుశ్చహరి: స్మృతః
            యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు: కధితః ప్రియే

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                              మాయ
7 . మడ్డినీటిలో సూర్యచంద్రుల ప్రతిబింబం స్పష్టంగా గోచరం కాదు . ఆవిధంగానే మాయ అనే తెర తొలగనంత వరకు ,అంటె `నేను ,నాది `అనే బుద్ధి నశించనంత వరకు స్పష్టంగా పరమాత్మ సాక్షాత్కారం కలుగదు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 21, 2013, 07:42:09 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో . 27 . దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్
             తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                మాయ
8 . సూర్యుడు భూమిని ప్రకాశింపచేస్తాడు . కాని ఒక చిరుమబ్బు సూర్యుణ్ణి మన కళ్ళకు కనపడనివ్వక మరుగు చేస్తున్నది . అలాగే మాయ అనే చిన్న తెర సర్వ వ్యాపీ సర్వసాక్షీ ఐన సచ్చిదానందమయుణ్ణి  మనం చూడకుండేట్లు చేస్తోంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 22, 2013, 08:31:29 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 1 . అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
          సమస్త జగదాధార మూర్తయే బ్రాహ్మణే నమః

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                                  మాయ

9. చెరువు నీటి మీద పాచిని దూరంగా తొలగించినా  వెంటనే మళ్ళాయధాస్ధానాన్ని చేరుతుంది . అదే విధంగా మాయను దూరంగా త్రోసివేసినా తిరిగి అది అనతి కాలంలోనే మిమ్మల్ని ఆశ్రయిస్తుంది . కాని ఆ పాచికి అడ్డంగా ఒక వెదురు గడను వేసి అది తిరిగిరాకుండేట్లు చేయగలం . ఇలాగే భక్తి జ్ఞానా లనేట్టి ఆవరణతో మాయను మళ్ళా రానివ్వక తొలగించు కోవచ్చు . మాయ అట్టి అంతరాయాన్ని దాటి రాలేదు . అప్పుడు కేవలం సచ్చిదానం స్వరూపం ప్రకాశిస్తూంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 23, 2013, 09:06:13 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురుగీత :

శ్లో . 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్
         తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్

      గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                               మాయ

10 . ఒక సాధువు దక్షిణేశ్వరాలయంలోని `నహబత్ఖానా` పైనున్న గదిలో కొంతకాలం నివసించాడు . అతడు ఎవరితోను మాట్లాడక కాలాన్నంతా దైవధ్యానంలోనే గడిపేవాడు . ఒకరోజు హఠాత్తుగా మబ్బుపట్టి ,ఆకాశంలో కారు చీకటి కమ్ముకొంది ;వెంటనే పెనుగాలి వీచి మబ్బంతా విడిపోయింది . ఇది చూసి ఆ సాధువు పకపక  నవ్వుతూ నహబత్ఖానా ముందటి వసారాలో `ధై `య్యని నృత్యం చేయసాగాడు . ఈ వింత చూసి శ్రీ రామకృష్ణుడు ,"ఇదేమిటి ? ఇన్నాళ్ళనుంచీ ఇంత నిశ్శబ్దం గా తదేక ధ్యానంతో కాలం గడుపుతూన్న మీరు ఈ వేళ ఇంత ఆనందంగాను నృత్యం చేయటానికి కారణం ఏమిటి ?"అని ఆ సాధువును అడిగారు ,అందుకా మహాత్ముడు "ఈ సంసారాన్ని ఆవరించి ఉన్న మాయా ఇలాటిదే కదా !"అని జవాబిచ్చాడు . మొదట ఆకాశం నిర్మలంగా ఉంటుంది ; హఠాత్తుగా మబ్బు పట్టి చీకటి పడుతుంది . అంతలోనే తిరిగి సమస్తమూ ఎప్పటి మాదిరే అవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె  వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![14/size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 24, 2013, 09:45:00 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురుబందువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 3 . సర్వ తీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః
          గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్

       గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                 అవతారాలు

1. పెద్ద మానొకటి కొట్టుకొని పోయేటప్పుడు ఎన్ని వందల పక్షులనో తనమీద మోసికొన పోగల్గుతుంది : అది మునగదు . అలాగే అవతార పురుషులు ఆవిర్భవించి నప్పుడు వారిని ఆశ్రయించి అనేకులు ముక్తి పొందుతారు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 25, 2013, 08:43:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 4 . అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారకమ్
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                             అవతారాలు
2. పొగబండిని లాగుతున్న యంత్రం తానూ గమ్యస్ధానం చేరటమే కాక ,తనతో సహా సామాన్లతో నిండిన అనేక పెట్టెలను లాక్కుని పోతున్నది . అవతార పురుషులు (సంసార భారంచే కుంగిన )జనాన్ని కొనిపోయి భగవద్సన్నిధిని చేరుస్తున్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 26, 2013, 08:10:45 AM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో .5. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం
        గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                             మానవులు : భిన్నవర్గాలు

1. మనుష్యులు తలగడ దిండ్ల గలేబులు లాంటివారు . ఒక గలేబు ఎర్రగా ఉండవచ్చు . ఇంకొకటి నల్లగా  ఉండవచ్చు . మరొకటి నీలంగా ఉండవచ్చు .కాని వాటి అన్నిటి లోపల ఉండేది దూదే . మానవుల స్ధితీ ఇలాటిదే . ఒకడు అందగాడు. కురూపి ;వేరొకడు సన్మార్గుడు .: ఇంకొకడు దుర్మార్గుడు .కాని వారందరిలోను ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
 [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 27, 2013, 08:14:17 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో . 6 .గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః
         రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                 మానవులు: భిన్న వర్గాలు

2. మనుష్యులు రెండు రీతులు :మొదటి రీతివారు చెరిగే చేటలాంటి వారు :రెండవ రీతి వారు జల్లించే జల్లెడ లాంటి వారు ,చేట పనికి మాలిన పొ ల్లునువిడిచి ,ఉపయోగపడే బియ్యం పప్పు మొదలైన వాటిని తన యందు నిలుపు కొనేట్లు మొదటి తరగతి వారు అయోగ్యులైన కామినీ కాంచనాల వంటి వాటిని విసర్జించి ,పరమ ప్రాప్త్యుడైన భగవంతుణ్ణి మాత్రమే స్వీకరిస్తారు . జల్లెడ సన్నని పదార్ధాలను జారవిడిచి పొల్లును గ్రహిస్తుంది . ఇలాగే రెండవ తరగతి జనం పరమ ప్రాప్త్యమైన వస్తువును పరిత్యజించి కామినీ కాంచనాల వంటి వాటిని చేపడతారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: mannava satyam on August 27, 2013, 11:33:09 AM
in sai master smaran

YOU ARE PICKING DIAMONDS FROM PARAMAHAMSA

MOST MOST USEFUL
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 28, 2013, 07:24:35 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 7 . కర్మణా మనసావాచా సర్వదారాధయేద్గురుమ్।  
          దీర్ఘ దండ నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

      గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                  మానవులు : భిన్న వర్గాలు  

3. లౌకికుడి మనస్సు పేడపురుగు లాటిది అది  పేడలోనే కాలం గడుపుతూ ,అక్కడే ఉండ గోరుతుంది . దాన్ని పట్టుకొని పరిమళిస్తూన్న పద్మం మీద బలవంతంగా పెట్టామా ,అది గిల గిల కొట్టుకొంటుంది ఆ విధంగానే లౌకిక జనానికి లోకాభిరామాయణం తప్ప ఇతర ప్రసంగం ఏదీ రుచించదు . భగవత్కధలనుగాని ,ఆధ్యాత్మిక విషయాలను గాని ప్రసంగిస్తూండే జనం ఉన్న చోటును విడిచి ,పనిమాని లోకాభిరామాయణాన్ని  చెప్పుకొనే వారి వద్దకు పోగానే వారికి హాయిగా ఉంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 29, 2013, 01:18:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 8 . శరీర మింద్రియం ప్రాణమర్ధ స్వజన బాన్ధవాన్ ।
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                     మానవులు : భిన్న వర్గాలు

4 . వలలో పడ్డ చేపలు కొన్ని నిశ్చలంగా వలను అంటుకొని ఉంటవి . అవి బయటపడాలనే
ప్రయత్నమే చేయవు . మరికొన్ని ఎంతో పెనుగులాడి ఇటూ అటూ పోర్లాడుతుంటవి గాని
తప్పించు కోలేవు . మరికొన్ని వలను తెగ కొరికి నెమ్మదిగా ఎలాగో తప్పించుకొని
పోతాయి . ఇలాగే లోకంలో జనం -బద్దులు ,ముముక్షువులు ,ముక్తులు అని మూడు
విధాలుగా ఉన్నారు . (అంటే : కర్మ పాశం చేత బద్దులయినవారు ,కర్మపాశాన్ని
విడిపించుకో యత్నించేవారు ,కర్మపాశాన్ని విదిపించుకొన్న వారు . )

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 30, 2013, 08:57:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 9 . గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

   గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                   మానవులు : భిన్న వర్గాలు

5 . ఒక పల్లె పడుచు తన ఇంటికి పోతూ ,దారిలో ప్రొద్దుగూకి గాలివాన వచ్చినందున సమీపంలోని ఒక పుష్పలావికుడి ఇంటిని చేరింది . అతడు ఆమెను ఆదరించి ,తన పువ్వులు నిల్వ ఉంచుకొనే గదికి ఆనుకొన్న పంచాది అరుగు మీద ఆ రాత్రి గడపమన్నాడు . అంత సదుపాయమైన వసతి లభించినా ఆమెకు కునుకైనా పట్టలేదు . చిట్టచివరికి ఆమె తోటలో విరిసి ఘుమ ఘుమ పరిమళిస్తున్న పువ్వుల సువాసనే తన నిద్రా భంగానికి కారణంగా కనుగొని ,ఖాళీగా ఉన్న తన చేపల బుట్ట మీద కొంచెం నీళ్ళు చల్లి ,ఆ బుట్టను తన ముక్కు దగ్గరగా ఉంచుకొని పడుకొంది . అరగడియలో ఆమెకు గాఢ నిద్ర పట్టింది . లౌకిక జనం సంగతి కూడ  ఇలాగే ఉంటుంది . వారికి సంసార లంపటాల దుర్వాసనే గాని ఇతర మేదీ రుచించదు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on August 31, 2013, 08:06:58 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 10. గురుబ్రహ్మ గురువిష్ణు: గురుర్దేవోమహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                 మానవులు :భిన్నవర్గాలు

6. పావురం పిల్ల కంఠం తడవి చూసినప్పుడు అది ధాన్యపు గింజలతో నిండి ఉందని కనుగొనవచ్చు . ఇలాగే లౌకికుడు తో సంభాషించితే  అతగాడి హృదయం ప్రాపంచిక చింతనలతో  నిండి ఉండటాన్ని గమనించవచ్చు . సంసారం అంటే ఇటు వంటివారు తాపత్రయ పడేటట్టిదే .పారమార్ధిక ప్రసంగాలను ఆలకించటానికి వారికి మనసొప్పదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: SaimasterDevotee on August 31, 2013, 09:21:56 PM
Jai Sai Master!

Quote
గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                 మానవులు :భిన్నవర్గాలు

6. పావురం పిల్ల కంఠం తడవి చూసినప్పుడు అది ధాన్యపు గింజలతో నిండి ఉందని కనుగొనవచ్చు . ఇలాగే లౌకికుడు తో సంభాషించితే  అతగాడి హృదయం ప్రాపంచిక చింతనలతో  నిండి ఉండటాన్ని గమనించవచ్చు . సంసారం అంటే ఇటు వంటివారు తాపత్రయ పడేటట్టిదే .పారమార్ధిక ప్రసంగాలను ఆలకించటానికి వారికి మనసొప్పదు .

Quote
4 . వలలో పడ్డ చేపలు కొన్ని నిశ్చలంగా వలను అంటుకొని ఉంటవి . అవి బయటపడాలనే
ప్రయత్నమే చేయవు . మరికొన్ని ఎంతో పెనుగులాడి ఇటూ అటూ పోర్లాడుతుంటవి గాని
తప్పించు కోలేవు . మరికొన్ని వలను తెగ కొరికి నెమ్మదిగా ఎలాగో తప్పించుకొని
పోతాయి . ఇలాగే లోకంలో జనం -బద్దులు ,ముముక్షువులు ,ముక్తులు అని మూడు
విధాలుగా ఉన్నారు . (అంటే : కర్మ పాశం చేత బద్దులయినవారు ,కర్మపాశాన్ని
విడిపించుకో యత్నించేవారు ,కర్మపాశాన్ని విదిపించుకొన్న వారు . )

Quote
                  మానవులు : భిన్న వర్గాలు 

3. లౌకికుడి మనస్సు పేడపురుగు లాటిది అది  పేడలోనే కాలం గడుపుతూ ,అక్కడే ఉండ గోరుతుంది . దాన్ని పట్టుకొని పరిమళిస్తూన్న పద్మం మీద బలవంతంగా పెట్టామా ,అది గిల గిల కొట్టుకొంటుంది ఆ విధంగానే లౌకిక జనానికి లోకాభిరామాయణం తప్ప ఇతర ప్రసంగం ఏదీ రుచించదు . భగవత్కధలనుగాని ,ఆధ్యాత్మిక విషయాలను గాని ప్రసంగిస్తూండే జనం ఉన్న చోటును విడిచి ,పనిమాని లోకాభిరామాయణాన్ని  చెప్పుకొనే వారి వద్దకు పోగానే వారికి హాయిగా ఉంటుంది .

Excellent Quotes.......

Thanks a lot.

Jai Sai Master!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 01, 2013, 09:48:25 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతినీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
           తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

       గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                           మానవులు ;భిన్నవర్గాలు

7. ముల్లంగి దుంపలను తిన్న వ్యక్తి త్రేన్పులను బట్టే ఆ నిజం బయటపడుతుంది . అదే విధంగా నువ్వొక సాధువును కలుసుకోగానే అతడు ఆధ్యాత్మిక విషయాలను ప్రసంగించ టానికి ప్రారంభిస్తాడు . ఇక లౌకికుడు లౌకిక విషయాలను మాత్రమే పలుకుతాడు . ఏగూటి చిలుకకు ఆ గూటి పలుకు గదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 02, 2013, 10:40:40 AM
జై సాయి మాస్టర్ !
గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో .స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ ।
     తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

     గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                   మానవులు :భిన్నవర్గాలు

8. తేనెటీగ ,జోరీగ అంటూ రెండు రకాల ఈగలున్నాయి . తేనెటీగ తేనెను మాత్రం గ్రోలుతుంది . జోరీగ తేనెను పీల్చటమే గాక ,దానికి సందు దొరికినప్పుడల్లా అంతకంటే ఎక్కువ తమకంతో రసికారు తూండే   పుండు మీద వాలుతుంది . మనుష్యుల విషయం కూడ ఇలాటిదే . భగవద్భక్తులు భగవంతుణ్ణి గురించే కాని ఇతర విషయాలను గురించి మాట్లాడ ఇష్టపడరు . ఇక సంసార మోహితులు కామినీ కాంచనాలను గురించిన సుద్దులు చెవిన పడగానే తాము అదివరకు వింటూండిన భగవద్గోష్టినిని విడిచి తటాలున  సంభాషణ లోకి దిగుతారు .  

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 03, 2013, 01:40:37 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం
           నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః

     గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                            మానవులు :భిన్నవర్గాలు

9 . బొత్తిగా పరలోక చింతన లేని లౌకికుడి నైజగుణం ఏమిటంటే ,భక్తిగీతాన్ని గాన్ని ,స్తోత్రాన్ని  గాని ,చివరకు భగవన్నామాన్ని గాని తానూ వినడు సరికదా ,పరులను కూడ విననివ్వక చెడగొడతాడు ;ధర్మాన్ని, దార్మికులను దూషిస్తాడు .; భగవంతుణ్ణి ధ్యానించేవారిని చూసి వెక్కిరిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 04, 2013, 12:49:04 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో .14.  చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
      అసిత్వం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                  మానవులు : భిన్నవర్గాలు

10. ఎలాటి ఆయుధము చొరశక్యం కానంతటి దట్టమైన చర్మం మొసలిది . అలాగే లౌకికుడికి నువ్వెంత శ్రమించి మత బోధ చేసినా అతగాడి చెవి కెక్కదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 05, 2013, 11:08:34 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత

శ్లో . 15 . సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
             సంసార మొహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                         మానవులు ;భిన్నవర్గాలు

11. సూర్యుడి కాంతి అన్ని తావుల్లోను సమానంగానే ప్రసరిస్తుంది , నీరు ,అద్దం ,మెరుగు పెట్టిన తళుకు గల లోహ వస్తువులు మాత్రమే ఆ కాంతిని చక్కగా ప్రతిఫలింప చేస్తాయి . అలాగే భగవంతుడు అందరిలోను నెలకొని ఉన్నా సాధు జనం హృదయాలలో ఎక్కువ విశదంగా వ్యక్తమవుతాడు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 06, 2013, 01:12:27 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురుబందువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో . 16 . యత్సత్వేన జగత్సస్త్యం యత్ప్రకాశేన భాతియత్ ।
            యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

                   మానవులు : భిన్నవర్గాలు

12 . పిండివంటలు అనేకాలు పైకి ఒకే ఆకారం కలిగి ఉండొచ్చు . ఐనా లోపలి పూర్ణం వేర్వేరు పదార్ధాలతో చేయబడి ఉండొచ్చు . కొన్నిట్లో పాలకోవ ,కొన్నిట్లో పప్పు ఇలా రకరకాలుగా ఉండొచ్చు . మానవ శరీరాలు కూడ ఒకే సామాగ్రి (పంచభూతాల ) తో నిర్మితమైనా మనుష్యులు తమ తమ గుణ భేదాలను బట్టి వేర్వేరుగా ఉంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 07, 2013, 01:05:00 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో . 17 . యస్మిన్ స్ధిత మిదం సర్వం భాతియద్భాన రూపతః
             యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశారత్నాలు )
                   మానవులు :భిన్న వర్గాలు )

13. నీరంతా నారాయణ స్వరూపమే ; ఐనా అన్ని రకాల నీళ్ళూ తాగటానికి పనికి రావు ,సమస్త ప్రదేశాలూ భగవంతుడి నిలయమవటం నిజమే . ఐనా అన్ని తావులూ దర్శింప దగినవు కావు. ఒక రకం నీరు కడుగుకోటానికి ఉపయోగపడుతుంది . మరొకరకం నీరు తాగటానికి అనువుగా ఉంటుంది . వేరొక రకం నీరు తాకటానికైనా పనికి రాకుంటుంది . అలాగేకొన్ని స్ధలాలు దర్శనీయాలు . మరికొన్ని దూరం నుండి మాత్రమే నమస్కరింప దగినవి . ఇలాగే అనేక రకాలుగా ఉంటవి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 08, 2013, 12:12:58 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత ;

శ్లో 18 . ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
          జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
               మానవులు ;భిన్న వర్గాలు

14. పులిలో సైతం దేవుడు ఉన్నాడనటం సత్యమే !అలాగని దానికి ఎదురుగా పోకూడదు . పరమ దుర్మార్గుల లోను భగవంతుడు ఉండటం నిజమే ; కాని వారి సహవాసం చేయటం మనకు ఉచితం కాదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 09, 2013, 12:04:34 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత ;

శ్లో . 19. యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యం భిన్న భేదతః ।
           సదైక రూప రూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                మానవులు ;భిన్న వర్గాలు

15 . సృష్టించబడిన ప్రతిప్రాణీ `శ్రీ మన్నారాయణుడే `అని ఒక గురువు  తన శిష్యుడికి బోధించాడు . శిష్యుడామాటను  గట్టిగా పట్టుకున్నాడు . ఒక రోజు శిష్యుడు వీధిలో వెళుతూంటే ఏనుగు ఒకటి ఎదురు పడింది . మావటివాడు "తప్పుకో ,తప్పుకో "అంటూ అరుస్తున్నాడు .ఎదురుగా వస్తూన్న ఏనుగును చూసి శిష్యుడు తనలో ఇలా వితర్కించుకున్నాడు . `నేనెందుకు తప్పుకోవాలి?నేను నారాయణుణ్ణి ;ఏనుగూ నారాయణుడే ;నారాయణుడికి నారాయణుడి వల్ల భయం ఏమిటి ? ఇలా ఆలోచిస్తూ అతడు కదల కున్నాడు ,చివరకు ఆ ఏనుగు తన తొండంతో పైకెత్తి అతణ్ణి ఒక పక్కకు విసిరేసింది . అతగాడికి గట్టి దేబ్బెతగిలింది . ఆ దెబ్బతోనే గురువు వద్దకెళ్ళి ,తన సాహస కృత్యాన్ని నివేదించాడు . సంగతి విని " బాగా చెప్పావోయ్ ! నువ్వు నారాయణుడివే ,ఏనుగూ నారాయణుడే . కాని `మావటి నారాయణుడు ` నిన్ను తప్పుకోమన్నప్పుడు నువ్వెందుకు లక్ష్య పెట్టావు కావు ?" అంటూ గురువు మందలించాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 10, 2013, 01:28:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత ;

శ్లో . 20 . అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
             జ్ఞాననల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
          మానవులు ; బిన్నవర్గాలు

16 . సజ్జనుల కోపం నీటిమీద గీసిన గీత లాటిది . గీచిన మరుక్షణమే మాయమవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 11, 2013, 11:46:41 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు  గీత :;

శ్లో . 21. శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
            గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                      మానవులు ; భిన్న వర్గాలు

17. బ్రాహ్మణ కుమారుడు జన్మత బ్రాహ్మణుడే ,సందేహం లేదు ,కాని పుట్టి కొందరు శాస్త్రాధ్యయనం చేసి పండితులవుతారు ,కొందరు పురోహితులవుతారు,మరికొందరు వంట బ్రాహ్మణు లుగా పరిణమిస్తారు . ఒక కొందరు సానికొంపల ముంగిట ధూళిలో పోరాలాడుతుంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 12, 2013, 11:36:25 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 22 . మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు:
            మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                  మానవులు : భిన్నవర్గాలు 

18 . గీటు రాయి వల్ల బంగారానికీ ఇత్తడికీ ఉన్న భేదం తెలుస్తుంది . మానవ స్వభావ విషయం కూడ యిట్టిదే . ఫలానావాడు కపట చిత్తుడైనదీ, నిష్కపట చిత్తుడైనదీ భగవంతుడు శోధిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 13, 2013, 11:47:43 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
            గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                       మానవులు :భిన్న వర్గాలు

19 . మనుష్య మాత్రులు ,మనీషా వంతులు అని మనుష్యులు రెండు విధాలు. భగవంతుడి కోసం పరితపించేవారు మాత్రమే రెండవ కోవకు చేరుతారు . కామినీ కాంచనాలను గురించి మోహంధులై ఉండేవారంతా సామాన్య మానవ వర్గం కిందివారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 14, 2013, 01:36:13 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 24 . గురుమధ్యే స్ధితం విశ్వం విశ్వ మధ్యే స్ధితో గురు:।
             గురువిశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                  మానవులు :భిన్నవర్గాలు
 
20. సంసారమోహితులను ఏదీ మేలుకొల్పదు . ఈ సంసారంలో ఎన్నో బాధలు ,ఎన్నో కష్టాలు ,నిర్విరామంగా అనుభవిస్తున్నా వారి మనస్సు రవ్వంత ఐనా మారదు ; బుద్ధిరాదు . ఒంటెను చూశారా ?దానికి ముళ్లంటే ఇష్టం ,నోటి నుంచి బొట బొట రక్తం కారుతూన్నా ముళ్ళను    తినటం మానదు . ఈ విధంగానే సంసార మోహితులకు ఎంతటి గొప్ప ఆపద సంభవించినా వారి మనస్సులో నాటుకోదు .ఏ ఇక్కట్టూ తారసపడని వారిలా తిరిగి కొన్ని రోజులలోనే వారు యధాప్రకారంగా సంచరిస్తుంటారు .

అలివేలు జై సాయి మాస్టర్ !

Post by: Gurupriya on September 15, 2013, 12:48:08 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె  వందనం !

శ్రీ గురు గీత ;

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో: గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

         గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                    మానవులు :భిన్నవర్గాలు

21. 1. విధి విరామాలు లేకుండా సదా వాగుతూండే వారిని ,2. మనస్సు విప్పి మాట్లాడక మూగవాడిలా సంచరించేవారిని ,3 . చెవికి పవిత్ర మైన తులసీ దళాన్ని తగిలించు కొని తమ భక్తిని లోకానికి వెల్లడించబూనే డాంబిక భక్తులను ,4  నాచు మొక్కలతో ఆవృత మై చాల అనారోగ్యకరమైన చల్లని నీరున్న కొలనులను నమ్మక జాగరూకతతో మసలు కోండి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 16, 2013, 01:40:20 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26. అత్రినేత్రశ్శివ సాక్షాద్ధ్విబాహుశ్చ హరి : స్మృతః ।
            యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు : కధితః ప్రియే ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                            గురువు

1. గురువు ఒక్కడే . ఉపగురువులు అనేకులు ఉండవచ్చు . ఎవరివల్ల ఏది ఏ మాత్రం నేర్చినా అతడు ఉపగురువు అవుతాడు . అలాటి ఉపగురువులు అవధూతకు ఇరవై నలుగురు ఉన్నారని భాగవతంలో చెప్పబడింది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 17, 2013, 10:04:47 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27 . దృశ్యవిస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                          గురువు

2. అవధూత ఒకరోజు ఒక పచ్చిక బయలు మీదుగా వెళుతూ ,బాజాభజంత్రీల వాద్య ఘోషతో మహా వైభవంగా తన కెదురుగా వస్తూన్న  ఒక పెళ్లి ఊరేగింపును  చూశాడు . పక్కనే ఒక వేటగాడు ఆ వాద్యాలను కించిత్తు లక్ష్యపెట్టక ,ఒక్కసారి ఐనా వాటికేసి దృష్టి మరల్చక ,తానుగురిపెట్టిన పక్షి మీదే తన దృష్టి నంతా నిల్పి ఉండటం కనిపెట్టి ,అవధూత అతడికి నమస్కరించి ఇలా అన్నాడు :"అయ్యా !నువ్వు నాకు గురువు ;నీ మనస్సు నీ లక్ష్యం మీదే లగ్న మైనట్లు నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు నా మనస్సు ధ్యేయమూర్తి మీద ఎకాగ్రమై నిలబడు గాక !"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 18, 2013, 09:45:03 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !1

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
          సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                         గురువు

3. ఒక జాలరి ఒక నీళ్ళ గుంటలో గాలం వేసి చేపలు పడుతూన్నాడు . అవధూత అతణ్ణి సమీపించి ,"తమ్ముడూ,అక్కడి ఆ చోటుకు వెళ్ళటానికి మార్గం ఏది ? అని అడిగాడు . ఆ సమయంలో చేప ఎరను కొరుకుతూన్నట్లు  గాలపు బెండు తెలియచేస్తోంది . అందుచేత అతడేమీ మారుపలకక తన గాలం మీదే దృష్టిని నిలిపాడు . చేప గాలానికి తగుల్కొన్నాక అతడు వెనక్కు తిరిగి ," అయ్యా ,తమరు ఏం సెలవిస్తూన్నారు ?" అని అడిగాడు . అవధూత అతడికి చేతులు జోడించి ఇలా అన్నాడు ; " అయ్యా నువ్వు నాకు గురువ్వు . నేను నా ఇష్టదైవాన్ని ధ్యానించేటప్పుడు  నీ మార్గాన్నే అనుసరించి నా ధ్యానం పూర్తీ అయ్యేదాకా మరి దేన్నీ లక్షింప కుంటాను గాక !"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 19, 2013, 08:30:07 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
           తారకం భవసింధో శ్చ  తంగురుం ప్రణమామ్యహమ్ ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                             గురువు

4. ఒక గద్ద ముక్కున చేపను కరచుకొని పోతోంది . దాన్ని వెంబడించి కాకి మూకలూ మరికొన్ని గద్దలూ ఆ చేపను పొడుస్తూ ,దాన్ని తన్నుకు పోవాలని ప్రయత్నిస్తున్నవి .  ఆ గద్ద  ఏ దిక్కు కేసి పోతే ,అవి ఆ దిక్కులోనే `కావు కా ` వంటూ  వెంటబడి విసిగించి పీడించగా  ,చివరికది  చేపను విడిచి పెట్టింది . వెంటనే ఇంకొక గద్ద  ఆ చేపను ముక్కున కరచుకోగా తక్కినవన్నీ దాన్ని వెంటాడ సాగాయి . మొదటి గద్ద  కాకుల వల్ల  బాధ తొలగగా ఒకచెట్టు  కొమ్మ మీద నిశ్చింతగా , శాంతంగా కూర్చుని ఉండటం చూసి ,అవధూత దానికి నమస్కరించి ఇలా అన్నాడు : "ఓయీ నువ్వు నాకు గురువ్వు ,ఈ లోకంలో ఎవడైనాతన  ఉపాధులను పరిత్యజించి నప్పుడే  మనశ్శాంతిని పొందుతాడు .అడుగడునా అపాయం ఉందని నువ్వు నాకు బోధించావు "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్య జనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 20, 2013, 07:39:53 AM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ సర్వతీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
       గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )
                              గురువు

5. ఒక కొంగ చేపను పట్టుకోవాలని బురద నేల మీద నెమ్మదిగా పోతోంది . వెనుకనే బోయవాడు కొంగ మీద గురి పెట్టి బాణం వేయ ఆయత్తమవుతూన్నాడు . కాని కొంగకు ఆ విషయమే పట్టనట్టుంది . అవధూత అప్పుడు కొంగకు మొక్కి ఇలా అన్నాడు . " నేను ధ్యానానికి కూర్చునే సమయంలో నీలా వర్తించి నా వెనుక వైపున ఉన్న వ్యక్తిని చూడటానికి ఎన్నడూ నా దృష్టిని మరలింపకుంటాను  గాక !"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 21, 2013, 09:31:42 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4 . అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
            జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశారత్నాలు )
                            గురువు

6 . అవధూతకు  తేనెటీగ మరొక గురువయింది . ఆ మధుకరం చాలాకాలం విశేషించి శ్రమపడి తేనెను కూడ బెడుతోంది . ఎక్కడ నుంచో ఒకడు వచ్చి తేనెపట్టు విదిలించి తేనెనంతా  తాగాడు . చిరకాల కష్టార్జితమైన ఫలం అనుభవించ టానికి ఆ తేనెటీగ నోచుకోలేదు . దీన్ని కనుగొని అవధూత తేనెటీగకు  నమస్కరించి ఇలా అన్నాడు :" ఓ మధుకరమా ! నువ్వే నాకు గురువ్వు ,కూడబెట్టిన ధనానికి నిజానికి ఏ గతి ప్రాప్తించేది నీవల్ల నేను గ్రహించాను ."

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 22, 2013, 09:06:39 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 5. కాశీక్షేత్రం నివాసశ్చ  జాహ్నవీచరణోదకం ।
          గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

     గురూపదేశములు ( శ్రీ రామకృష్ణఉపదేశ రత్నాలు )
                               గురువు

7. " గురువులు వేలాది లభిస్తారు ;కాని శిష్యుడొక్కడు  దొరకటం దుర్లభం " అని పెద్దలు చెబుతారు . శ్రీరంగనీతులు పలికేవారు అనేకులు ; కాని వాటిని ఆచరించేవారు అరుదు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 23, 2013, 07:43:10 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశ రత్నాలు )
                                గురువు

8 . భగవంతుడిలో నిజమైన భక్తి కుదిరి సాధన పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తికి దైవమే సాయపడి తగిన గురువును  తప్పక లభింప చేస్తుంది . అందుకోసం ఆందోళన చెందనవసరం లేదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 24, 2013, 07:04:52 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
           దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

   గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశారత్నాలు )
                              గురువు

9 . ఉత్తములనీ ,మధ్యములనీ ,అధములనీ వైద్యులు మూడు తరగతులుగా ఉన్నారు . రోగి నాడి చూసి ,ఏదో మందు పుచ్చుకోమనీ చెప్పి వెళ్లి పోయేవాడు మూడవ తరగతి వైద్యుడు . రోగి నిజంగా ఆ ఔషధం పుచ్చు కొంటున్నాడా లేదా అని అతడు వాకబు కూడ చేయడు . తాను  నియమించిన ఔషధాన్ని పుచ్చుకొంటే స్వస్ధత చేకూరుతుందని రోగికి నచ్చ చెప్పి ,ఔషధం సేవించటానికి ఇష్టపడకుంటే ,సామోపాయాల నన్నిటిచేతా రోగిని ప్రోత్సహించేవాడు రెండవ తరగతి వైద్యుడు . రోగి ` మందు మింగ ` నని భీష్మించినా జంకక ,అతగాడి రొమ్ముమీద మోకాలు మోసి ,బలవంతంగా మందును అతడి నోట్లో పోయటానికి వెనుదీయని వైద్యుడు ఉత్తమ వైద్యుడు . అదే విధంగా శిష్యుడికి ఉపదేశం చేసి అతన్ని తిరిగి పట్టించు కోనివాడు  గురువులలో అధముడు . శిష్యుడి హితం కోరి ,విషయం గ్రహించే వరకు ఉపదేశాలు నూరిపోసి ,తన శిష్యుడి క్షేమాన్ని గురించి శ్రద్ధ వహించే గురువు మధ్యముడు . శిష్యుడు సరిగ్గా తన ఉపదేశాలు విని యధా విధిగా వాటిని ఆచరించటం లేదని కనుగొనగానే  నిర్భంధం తో అతణ్ణి  విధేయుడిగా చేసేట్టి గురువు ఉత్తముడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 25, 2013, 08:02:23 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 8.శరీర మింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ ।
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

                గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )
మతం సాక్షాత్కార పూర్వక విషయం :చర్చల ,సిద్ధాంతాలతో కూడు కొంది కాదు

1. శ్రుతి స్మృతులలోని విషయాలను గురించి ఎంతవరకు విచారణ చేస్తుండాలి ?సచ్చిదానంద మయుడి సాక్షాత్కారం  కలిగేటంత వరకే . తేనెటీగ పువ్వుల మీద వాలనంత వరకు ఝుమ్మని రొద చేస్తూంటుంది . మకరందాన్ని గ్రోల నారంభించగానే  ఆ గోల అంతా సద్దుమణుగుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !
                             [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 26, 2013, 08:18:32 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 9 .గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
          గురో: పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

      గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

 2. స్మరణీయుడైన  కేశవచంద్రసేన్ ఒక రోజు దక్షిణేశ్వరాలయంలో  శ్రీ రామక్రిష్ణులను  సందర్శించి ఇలా ప్రశ్నించాడు : " విద్వాంసులు అనేకులు ధర్మశాస్త్రగ్రంధాలను సదా పఠిస్తూంటారు  కదా ! వారికి జ్ఞానోదయం కాకపోవటానికి కారణం ఏమిటి ?" అందుకు శ్రీ రామకృష్ణులు ఇలా జవాబిచ్చారు :"గద్దలు  రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూంటాయి . ఐనా వాటి ద్రుష్టి ఎప్పుడూ కుళ్ళి దుర్వాసన వేసే కళేబరాలను వెదుకుతూ సమాధి గోతుల మీదనే నిలబడి ఉంటుంది . పండితులనబడేవారి మనస్సు సాధారణంగా  సాంసారిక విషయాల్లో తగులుకొని ఉండటంతో వారికి నిజమైన జ్ఞానం అలవడదు . ఎన్ని ధర్మశాస్త్రాలు చదివితే ఏం ప్రయోజనం ?"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని ! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 27, 2013, 07:41:38 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగపతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 10. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవోమహేశ్వరః ।
            గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

             గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

3. శ్రీ రామకృష్ణుడు గ్రంధాలను గురించి గ్రంధులని  వచించేవారు . దాన్లోని అభిప్రాయం ఇది : వివేక వైరాగ్యాలు లేనివాడికి కేవల గ్రంధపఠనం వల్ల దురంహంకారం ,గర్వం పెరుగుతుంది . మనోబంధాలు  ఎక్కువవుతాయి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 28, 2013, 09:20:54 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 11. అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరం ।
              తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

ఒకసారి శ్రీ రామకృష్ణుడు ఒక తార్కికుడితో ఇలా అన్నాడు :" ఒక్కమాటలో తృప్తి చెందుతావా నా వద్దకు రా ; అలాగాక తర్క యుక్తుల చేత సత్యాన్ని గ్రహించాలంటావా ,కేశవ చంద్రసేన్ వద్ద కెళ్ళు ."

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 29, 2013, 08:58:51 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 12. స్ధావరం జనగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ ।
              తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

5. కుండ నిండుతూన్నప్పుడు బుడబుడ మని ధ్వని వినపడుతుంది .; నిండగానే శబ్దం శాంతిస్తుంది అలాగె  ఈశ్వర ప్రాప్తి కలగనంత వరకు దేవుడి విషయమై మనిషి `లొడ లొడ ` వ్యర్ధ వాదాలు విశేషంగా చేస్తూంటాడు . ఇక భగవత్సాక్షాత్కారం  పొందిన వ్యక్తి ప్రశాంతంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on September 30, 2013, 07:35:14 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
              నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

    గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

6. వివేక వైరాగ్యాలు లేనివాడు ధర్మ శాస్త్రాల నన్నిటిని సదా రెప్ప వాల్చకుండా చదివినా ప్రయోజనం లేదు . వివేక వైరాగ్యాలు లేనిదే ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి కాదు . వివేక మంటే సద సద్వివేచనా  సద్వస్తుగ్రహణమూ ( అంటే సత్తు అయిన భగవంతుడికీ అసత్తు అయిన ప్రకృతికీ ఉన్న భేద విచారమూ ,భగవంతుణ్ణి ఆశ్రయించటమూ ). `ఆత్మ వేరు ,ప్రకృతి జన్యమైన యీ శరీరం వేరు ` అనే జ్ఞానం కూడ వివేకమనబడుతుంది . ఐహిక విషయాల్లో అనాసక్తే వైరాగ్య మనబడుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 01, 2013, 08:21:26 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు  గీత :
శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

7. పంచాంగంలో `ఇరవై దుక్కుల వర్షం పడుతుంది `అని రాయబడి ఉంది . రాబోయే వర్ష సూచనలతో నిండి ఉండే పంచాంగాన్ని ఎంత మెలిపెట్టి పిండినా దాన్నుంచి ఒక్క నీటి బొట్టైనా పడుతుందా ? ఆ విధంగానే ధర్మ శాస్త్రాలలో అనేక  సద్విషయాలు కనబడతవి . కాని వాటిని కేవలం చదివిన మాత్రాన జనానికి పారమార్ధిక జీవనం అలవడదు . వాటిలో చెప్పిన సాధనలను  అలవరచుకోవాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 02, 2013, 08:17:10 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 15. సపితా సచమే మాతాస బంధుస్సచ దేవతా ।
              సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

8. ఇద్దరు వ్యక్తులు ఒక మామిడి తోటకు వెళ్ళారు . లోపల అడుగు పెట్టగానే వారిలో లౌకికుడు తోటలోని చెట్ల సంఖ్యను ,చెట్టు చెట్టుకూ కాసిన మామిడి పళ్ళను --ఇలాటి వాటి నన్నిటిని గుణించి తోట విలువ ఎంత ఉంటుందో లెక్క కట్టసాగాడు . అతడి స్నేహితుడు తిన్నగా తోటవాడి వద్దకెళ్ళి ,అతడితో పరిచయం చేసుకొని ,అతడి అనుమతితో నెమ్మదిగా మామిడి చెట్టు కిందికి పోయి ,పండుకోసి తినసాగాడు . చెప్పండి : ఈ ఇద్దరిలో ఎవడు బుద్ధిమంతుడు ? మామిడి పళ్ళు తింటే ఆకలి తీరుతుంది . ఆకులను లెక్కించి ,పనికిమాలిన అంచెనా వేయటం వల్ల  ఏం ప్రయోజనం ? ప్రజ్ఞావంతుడనని గర్వించేవాడు  భగవంతుణ్ణి  గురించి నానావిధాలుగా  శాస్త్ర మీమాంసలతోను  తర్క యుక్తులతోను వ్యర్ధంగా కాలం గడుపుతుంటాడు . అణకువ తోకూడిన జ్ఞానవంతుడు భగవదనుగ్రహాన్ని పొంది పరమానందం అనుభవిస్తూంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 03, 2013, 07:54:55 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ॥
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

9. సంతలోకి పోక దూరంగా ఉన్నంత సేపు `హో హో ` అనే అస్పష్టమైన ధ్వని మాత్రం వినబడుతుంది . సంతలో ప్రవేశించగానే ధ్వని అంతా స్పష్టంగా వినిపిస్తుంది . ఒకడు బేరం చేస్తూంటాడు . మరొకడు వస్తువులను కొంటుంటాడు . ఇలా అన్నీ విడివిడిగా వినబడతవి . ధర్మ ప్రపంచానికి మనం దూరంగా ఉన్నంత వరకు దాన్లోని పరమార్ధాన్ని గ్రహించలేం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 04, 2013, 07:41:03 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్ధిత మిదం  సర్వం భాతి యద్భాన రూపతః ।
              యత్ప్రీత్యాప్రియం  పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

10 . వేదాలు ,పురాణాలు మొదలైన పవిత్ర గ్రంధాలన్నీ మానవ ముఖతా ఉచ్చిష్టా లయినవని చెప్పవచ్చు .( దేశ కాలాతీతమైన ) బ్రహ్మాన్ని గురించి మాత్రం ఇలా చెప్పటానికి వీలులేదు . ఎందుకంటే ,ఇంతవరకు ఎవ్వడూ బ్రహ్మం ఇలాటిదని నిర్వచింప జాలినది లేదు కదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 05, 2013, 09:26:25 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18. ఏ నేదం దర్శితం తత్త్వం చిట్టా చైత్యాదికం తదా ।
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

11. విషయాసక్తుడూ మాయమోహితుడూ ఐన సాంసారికుడికి  బ్రహ్మానందానుభవం  ఎలా ఉంటుందో తెలియచేయటం అశక్యం . సంభోగానందాన్ని గురించి పిల్లవాడికి తెలియ చేయటం అసాధ్యం గదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 06, 2013, 08:48:26 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19  . యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యం భిన్న భేదతః ।
                సదైక రూప రూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

12. నోటితో `స ,రి ,గ ,మ ,ద ,ని ` అని పలుకటం సులభమే కాని ,వాటిని ఒక వాయిద్యం మీద వాయించటం అంత సులభం కాదు . అలాగే ధర్మాన్ని గురించి మాట్లాడటం సులభమే  ఆచరించటం కష్టం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 07, 2013, 08:24:52 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లొ॥ 20. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
            జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

13. జటాజూట ధారి ఐన రామచంద్రు డనే బ్రహ్మచారి ఒకరోజు శ్రీ రామక్రిష్ణులను సందర్శింప దక్షిణేశ్వరాలయానికి వచ్చాడు . అతడు ఒకచోట కూర్చుని ` శివోహం ` ` శివోహం ` అంటూ పదే పదే ఉచ్చరించ సాగాడు . అంతేగాని అతడు అన్యధా మౌనంగా ఉన్నాడు . శ్రీ రామకృష్ణుడు నెమ్మదిగా కొంత సేపు ఆ తతంగం కనిపెట్టి అతడితో విమర్శగా ఇలా పలికాడు . "`శివోహం ` అనే పదాన్ని కేవలం పాట పాడినందున  ఏం ప్రయోజనం ? హృదయాలయంలో  పరమ శివుణ్ణి ధ్యానిస్తూ మహా భావాన్ని పొంది అహంకారం  సర్వం నశించగా ,అంతరంగంలో సచ్చిదానంద మయుడైన పరమశివుణ్ణి  ప్రత్యక్షం చేసికొన్న వ్యక్తి మాత్రమే పరమ పవిత్రమైన ఇలాటి మంత్రాన్ని ఉచ్చరించ టానికి అధికారి . అలాటి సాక్షాత్కారం లేని వట్టి సూత్రావృత్తి వల్ల  ఏం ప్రయోజనం ? సాక్షాత్కార  మహాదశ తనకు ప్రాప్తించ నంత దాకా మనిషి భగవంతుడిలో సేవయ సేవక భావం (భగవంతుణ్ణి తన ప్రభువు గాను ,తాను భగవంతుడి సేవకుడిగాను  భావించటం ) కలిగి ఉండటం ఉత్తమం ". అప్పుడు బ్రహ్మచారి తన పొరపాటు గ్రహించి ,ఆ మహోపదేశం తోను ,అలాటి తదితర ఉపదేశాలతోను ,జ్ఞానవంతుడై ,తానా స్ధలం నుంచి వెళ్ళిపోయే ముందు శ్రీ రామకృష్ణులు నివసించిన గదికి ఇవతలి గోడమీద (వంగ భాషలో )ఇలా రాశాడు . " స్వామి చేసిన ఉపదేశం మేరకు రామచంద్ర బ్రహ్మచారి ఇప్పటినుంచి భగవంతుడిలో సేవ్యసేవక భావం కలిగి ఉంటాడు . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 08, 2013, 11:26:28 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 21. శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం ।
              గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
              గృహస్దులు :సముచిత పారమార్ధిక సాధనలు

1. దాగుడుమూతలాటలో ఆటగాడు తల్లిన తాకిన పక్షంలో ఇక అతడికి ఎలాటి బాధ్యతా ఉండదు . అతడు స్వేచ్ఛగా సంచరించ వచ్చు . ఎవరూ అతడి వెంట బడరు . అతడిక దొంగ కానేరడు . అదే విధంగా సంసారం అనే క్రీడా రంగంలో దేవుడి పాదపద్మాలను స్పృశించిన వ్యక్తీ కర్మ బద్ధుడు కాడు ; భగవంతుణ్ణి శరణు పొందే వ్యక్తిని ప్రాపంచిక విషయాలు బాధింప జాలవు , బంధించజాలవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 09, 2013, 10:17:13 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 22. మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు :।
              మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

2. చేపలు పట్టటానికి పిల్ల కాలువలు మొదలైన వాటిలో వలలు వేస్తారు . సన్నని వెదురు జొంపాల వల సందుల నుంచి తళతళ నీరు పారటం చూసి చిరు చేపలు దూరినాక అవి తిరిగి బయటకు రాలేవు . అప్పుడు పట్టుబడి ప్రాణాలు కోల్పోతాయి . ఒకటి రెండు చేపలు మాత్రం తక్కిన వాటి అనుభవాన్ని చూసి తాము తెలివి తెచ్చుకొని ,ఎగిరిపడి మరొకవైపుకు  తప్పించు కొంటాయి . అలాగే మూర్ఖులు ప్రపంచపు మెరుగుల చేత ఆకర్షితులై సంసారంలో ప్రవేశించి ,ఆ మాయలో చిక్కుకుని అనేక బాధల ననుభవించి చివరకు నశిస్తారు . ఇతరుల అనుభవాలతో గుణపాఠం నేర్చిన వారై కామినీ కాంచనాలను  దూరంగా పారద్రోలి  భగవంతుడి పాద పద్మాల శరణు జొచ్చిన వారు మాత్రమె నిజమైన సుఖాన్ని ,ఆనందాన్ని పొందుతారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 10, 2013, 11:11:52 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురు స్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )

3.రామప్రసాదు డనే భక్తుడు ఈ ప్రపంచం స్వప్నమయ మందిరమని చెప్పి ఉన్నాడు . కాని మనిషికి భగవంతుడిలో భక్తి కుదరగానే ఈ ప్రపంచం అతడికి ... ఆనందభవన  మవుతుంది .

`తినెద ద్రావెద బొంకెద దినము లెల్ల
 రాజఋషి జనకున కెంత తేజ మలరె !
వానికేమైనలోపంబు వచ్చేనయ్య ?`

ఎంతమాత్రమూ రాలేదు . అతడు రెండిటి పట్లా (దేవుడి పట్లా దృశ్య ప్రపంచం పట్లా ) యధా విధిగా నడచు కొన్నాడు ; తన మనసును భగవదర్పితం చేసి ఐహిక సుఖాలను అనుభవించాడు . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 11, 2013, 08:31:23 AM

అలివేలు జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో . 24 . గురుమధ్యే స్ధితం విశ్వం విశ్వ మధ్యే స్ధితో గురు:।
             గురువిశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )

 " గృహస్ధుడికి భగవంతుడిలో స్ధిరభక్తి కుదరటం సాధ్యమా?" అని ఒక వక్తి శ్రీ రామక్రిష్ణులను  అడిగాడు . అందుకు శ్రీ రామకృష్ణులు చిరునవ్వుతో ఇలా అన్నారు : " నా స్వగ్రామ ప్రాంతాలలో స్త్రీలు వారి అటుకులను దంచుతూంటే చూశాను . ఒకామె ఒక చేత్తో రోటిలోని  గింజలను  కదిలిస్తూంటుంది ;రెండవ చేత్తో ,తన బిడ్డను రొమ్మున హత్తుకొని పాలిస్తూంటుంది . అప్పుడే కొనుగోలు చేసే వ్యక్తితో ఇలా బేరమాడు తుంది :` పాత లెక్క ప్రకారం నువ్వు నా కింత బాకీ ,ఈ రోజుది ఇంత యివ్వాలి . ` ఒక పక్క ఈ పనులను చూసుకొంటూ ,ఇంకొక వైపు చేతి మీద రోకలి పడి నలగకుండా జాగ్రత్త పడే ఉంటుంది . నువ్వు సంసారంలో ఈ రీతిలో మెలగు . మనసు సదా భగవంతుడిలో నిలపి ఉంచు . మార్గం  తొలగితే ,అనేక అనర్ధాలు వాటిల్లుతాయి . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 12, 2013, 01:00:04 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్దో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ ।
             జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. సంసారంలో ఉన్నా సాధన చేత తన మనస్సు చెదర కుండేట్లు స్వాధీనం చేసుకొని ఉండేవాడు నిజమైన వీరుడు . ఎంత భారం అతడు తల మీద మోస్తున్నా ,ఏ వైపుకు కావాలంటే ఆ వైపుకు తన దృష్టిని మరల్చగలడు . వీరుడైన సాధకుడు సంసార భారం దుర్భరంగా ఉన్నా తన దృష్టిని మాత్రం సదా భగవంతుడిలో నిలిపి ఉంచుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 13, 2013, 06:50:16 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26.అత్రినేత్రశ్శివ  స్సాక్షా ద్ధ్విబాహుశ్చహరి: స్మృతః ।
              యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు : కధితః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

6 .ఉత్తరదేశంలో స్త్రీలు నాలుగైదు కుండలను దొంతరగా తలమీద ఉంచుకొని నీళ్ళు తెచ్చుకొంటూ ,తోవలో తమ కష్ట సుఖాలను గురించీ ,లోకాభిరామాయణమూ ముచ్చటించు కొంటూ పోతారు .  అంతసేపూ తలమీద ఉన్న నీటి కుండలు జారి పడకుండా మనస్సు వాటి మీద నిలిపి ఉంచుతారు . ధర్మ మార్గంలో నడిచేవారూ అదే విధంగా వర్తించాలి . ఎలాటి పరిస్ధితులు ఎదురైనా న్యాయమార్గం తప్పకుండేట్లు  తమ మనస్సును ధృఢ పరచుకోవాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 14, 2013, 09:01:24 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణ ॥

    గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

7. సంకీర్తనం చేస్తూ యాచించే పాటగాడు తంబుర నొక చేత్తో మీటుతూ ,చిరుతల నొక చేత్తో వాయిస్తూ ,నోటితో పాడుతూంటాడు కదా ! ఇలాగే ఓ గ్రుహస్దులారా మీ సంసార కృత్యాల నన్నిటినీ చేతులార చేస్తూ భాగవన్నామాన్ని మరువక భగవంతుణ్ణి సదా మనసారా స్మరిస్తూండండి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 15, 2013, 09:32:52 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

8 . ఇంటిపనులను అన్నిటిని చక్కబెట్టుకొంటూనే వేశ్య తన విటుడు ఎప్పుడు వస్తాడా అని విటుడిలోనే నిరంతర చింత గలదై ఉంటుంది . ఓ గృహస్దులారా ! అదే రీతిలో మీరూ మీ సంసార కృత్యాలను నిర్వర్తించు కొంటూ మీ హృదయాన్ని మాత్రం భగవంతుడి మీదే నిలపండి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 16, 2013, 09:20:50 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9 . సంసారం అంటుకోకుండా జీవించటం అంటే ఏమిటో మీకు తెలుసా ?మనిషి బురదలోని చేపను పోలి వర్తించాలి . మట్ట గిడస  బురద నీటిలో జీవిస్తున్నా దాని వల్ల మాలిన్యం పొందదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 17, 2013, 07:59:26 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

3.శ్లో ॥  సర్వతీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
           గురో :పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

10. బరువుగా ఉన్న తక్కెడసిబ్బి కిందికి పోతుంది ,తేలిక సిబ్బిపైకి పోతుంది . మనిషి మనస్సు యీ తక్కెడ దండి లాటిది . దాని కుడుకలపై రెండు భిన్న విషయాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుంటవి : ఏవంటే -1. సంసారంలోను ,కీర్తి గౌరవాలలోను ప్రీతి ,2 . వివేక వైరాగ్యాలూ ,భగవద్భక్తీ  . మొదటిది బరువయితే ,మనస్సు (తక్కెడ దండిలా ) సంసారం వైపుకు మొగ్గుతుంది ;భగవంతుడికి ఎడమై పోతుంది . రెండవది బరువయిందా ,చిత్తం భగవంతుడి వైపుకు మొగ్గి సంసారానికి దూరమవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 18, 2013, 07:55:15 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4.అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారకమ్ |
           జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్

   గురూపదేశములు  (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

11. ఒక రైతు రోజంతా చెరకు తోటకు నీరు పెడుతున్నాడు , పని అయ్యాక అతడు గమనించగా  ఒక్క చుక్క నీరైనా తోటకు  ఎక్కలేదు ,నీరంతా దూరంలోని కొన్ని ఎలుక బొరియల గుండా   బయటకి  పోయింది ,భగవంతుణ్ణి ఆరాధిస్తున్నా ఐహిక విషయాల్లోనూ పేరు ప్రతిష్ఠ ల్లోను ఆసక్తుడై ఉండే భక్తుడి స్ధితి కూడ  ఇలాటిదే ,యావజ్జీవం ఉపాసన చేసినప్పటికీ ,చివరి కెంత మాత్రం శ్రేయోభివృద్ధి పొందలేదని తనకే విశదమవుతుంది ,అతడి సాధనలన్నీ  ఈ కామ్యము లనే  ఎలుక బొరియల్లోకి పోయి బూడిదల్లోకి  పోసిన పన్నీరు చందమవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 19, 2013, 08:59:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 5.కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం ।
           గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥ 

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

12. బాలుడొకడు స్తంభాన్ని పుచ్చుకొని తల తిరిగేట్లు దాని చుట్టూ దిర్దిర తిరుగుతున్నాడు . ఐనా  తిరుగుతున్నంతసేపు అతడి దృష్టి  సదా స్తంభంలోనే నిలిచి ఉంది . స్తంభాన్ని అంటి ఉండేటంత వరకు తానూ కింద పడననీ ,ఆ పట్టు విడిచాక భళ్ళున తలకిందుగా పడతాననీ అతడు బాగా ఎరుగును . అదే విధంగా భగవంతుడి మీద సదా దృష్టి  నిలిపి యీ సంసారంలో మీ విధులను నిర్వర్తించిన నాడు మీకు ఏ అనర్ధాలు వాటిల్లవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 20, 2013, 10:15:12 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణ భాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

13. ఐహిక సుఖాసక్తి చేత అనేకులు మతాచార ధర్మాలను అవలంభిస్తారు . కాని ఏదైనా ఆపద సంభవించి నప్పుడు గాని ,మరణం ఆసన్న మైనప్పుడు గాని భగవంతుణ్ణి  తలవనే తలవరు . చిలుక సామాన్యంగా రోజంతా " రాధాకృష్ణ " అనే నామాన్ని జపిస్తూనే ఉంటుంది . కాని పిల్లి దాన్ని పట్టుకోగానే భగవన్నామాన్ని  మరచి నైజమైన  కూతనే కూస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 21, 2013, 08:07:16 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
            దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

14 . నీటిని మాత్రం పడవలోకి పోనివ్వక పొతే ,పడవ  నీటిలో ఉండటం వల్ల  ప్రమాదం లేదు . నీరు జొరబడిందా , బుడుంగుమని మునుగుతుంది . ఇలాగే సంసార మోహం  మనస్సులో ప్రవేశింపనివ్వని పక్షంలో భక్తుడు సంసారంలో ఉన్నప్పటికీ హాని లేదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 22, 2013, 09:31:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 8 . శరీరమింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ ।
             ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

15. సంసారం ఎటువంటిది ? అంబాళపు  పండు లాంటిది -అంతా తొక్కాటెంకే గాని గుజ్జు అతి స్వల్పం . అది తింటే శూల వస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 23, 2013, 05:57:51 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 9 . గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
            గురో : పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

16 . చేతులకు నూనె రాచుకొని పనస పండును ఒలిస్తే పాలవంటి దాని జిగురు (బంక ) చేతులకు అంటుకోదు . అలాగే ముందు నీ మనస్సుకు భక్తి  అనే నూనెను పూసుకొన్న పక్షంలో ,కామినీ కాంచనాలచేత  మాలిన్యం పొందక సంసారంలో మనగలవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 24, 2013, 10:45:40 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 10. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

17 . పామును పట్టుకోబేతే ,అది కాటు వేస్తుంది ,కాని గరుడ మంత్రం నేర్చినవాడు పదిపాములను మెడకు తగిలించికొని వాటిని బహువిధాల ఆట లాడిస్తాడు .ఆ విధంగానే వివేక వైరాగ్యాలను సముపార్జించాక పురుషుడు సంసారంలో ఉన్నా సంసార వ్యామోహం చేత ఎన్నడూ మాలిన్యం పొందడు . వివేక వైరాగ్యాలు మంత్రగాడికి అభయమిచ్చే `మంత్ర భస్మం` లాంటివి  .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 25, 2013, 11:46:36 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
             తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

18 . ముల్లంగి దుంపలను తిన్నావా ,నీ త్రేనుపుల వాసనతోనే ఆ సంగతి బయట పడుతుంది . మాట్లాడటం వల్లనే లోన తలపులు బయట పడతాయి . ఇలాగే సంసారుల సాధు  సాంగత్యం చేయబోయినా ,తరచు లోకాభిరామాయణాన్నే ప్రస్తావిస్తుంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 26, 2013, 09:20:55 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

19 . ప్రతి విషయానికీ మనస్సే  మూలమని తెలుసుకో ,ఒకణ్ణి బుద్ధిమంతుణ్ణి  చేసినా బుద్ధి హీనుణ్ణి  చేసినా ,కర్మ బద్దుణ్ణి  గావించినా ,కర్మ విముక్తుణ్ణి  గావించినా ,సన్మార్గుడిగా మార్చినా ,పాపాత్ముడిగా చేసినా దుర్మార్గుడిగా మార్చినా , పుణ్యాత్ముణ్ణి  గావించినా సర్వం మనస్సే  చేస్తుంది . సదా భగవంతుడి స్మరణ మననాలను చేస్తుండే సంసారులకు ఇతర సాధనలు అనావశ్యకం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 27, 2013, 11:09:38 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 13 . చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
               నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీరామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

20 . బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి స్ధితి ఎలా ఉంటుందో తెలుసా ? అలాటి వ్యక్తి   సర్వవ్యాపి ఐన పరమాత్మను లోపలా బయటా కూడ  చూస్తుంటాడు . అద్దాల తలుపులున్న గదిలో ఉండే తీరులో అతడు సంసారంలో మసలుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 28, 2013, 08:35:51 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14 . చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

21. భగవద్గీతను ఆసాంతం పారాయణ చేసిన ఫలం ఆ గీతా శబ్దాన్ని పదిమార్లు ఉచ్చరించిన దానికి సమమవుతుంది . `గీతా `గీతా అని పదిసార్లను ,అప్పుడది `త్యాగీ ` ` త్యాగీ ` అన్నట్లుంటుంది . ఒక్కమాటలో  చెబితే ,భగవద్గీత త్యాగాన్ని ఉపదేశిస్తుంది . అన్నిటిని  పరిత్యజించి  పరమేశ్వరుడి పాదపద్మాలను శరణు పొందు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 29, 2013, 10:44:37 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 15. సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
             సంసార మొహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                        ఆధ్యాత్మికసాధన : అధికారులు

1. మామిడి ,జామ మొదలైన పళ్ళు పక్షులు పొడవక బాగా ఉన్నప్పుడే  భగవంతుడికి అర్పించటానికైనా ,ఇతర కార్యాలకైనా ఉపయోగపడతవి . ఒక్కసారి కాకి పొడిచిన పండు దేవుడికి అర్పించటానికి పనికిరాదు . బ్రాహ్మణుడికి దానం ఒసగటానికీ తగింది కాదు . ఎవరు తినటానికీ శ్రేష్టం కాదు . అలాగే పవిత్ర హృదయులైన బాలురూ యువకులూ సంసారేచ్చల  చేత వీసమైనా కళంకితులు కాకుండటం వల్ల వారు పక్షులు పొడవని  పళ్ళ వంటివారు అలాటి  వాంఛలు ఒక్కసారి మనస్సులో చొరబడ్డవా ,వారిని మోక్ష మార్గంలో పెట్టటం అనితర సాధ్యం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 30, 2013, 09:21:32 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి  నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

2. యువకులంటే నాకింత ప్రేమ ఎందుకు ? ఎందుకంటే వారి మనస్సుల మీద వారికి సంపూర్ణాధిపత్యం (16 అణాల వంతు )ఉంది . వయసు ముదిరిన కొద్దీ మనస్సు భాగాలయి ,విభాగాలాయి చెదిరిపోతుంది . పెళ్ళాడిన వ్యక్తీ మనస్సు సగం (8 అణాల వంతు )అది ఎత్తుకొని పోతుంది . బిడ్డ పుడితే ,నాల్గవ వంతు (4అణాల వంతు ) దాని పరమవుతుంది . మిగిలిన నాల్గవ పాలు తల్లితండ్రుల మీదా ,కీర్తి సంపాదనల్లోను ,వేష భాషల్లోను  చెదిరిపోతుంది . కాబట్టి కోమలమైన హృదయం భగవంతుణ్ణి సులభంగా తెలుసుకొంటుంది . వృద్ధులు ఇలా తెలుసుకోటం దుర్ఘటం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on October 31, 2013, 09:09:58 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ।
              యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. చిలుక కంఠంలోని సన్నపొర ముదిరి గిడసబారినాక దానికి మాటలు నేర్పజాలం . అలాగే ముసలితనంలో భగవంతుడి మీద మనస్సు నిలపటం కష్ట సాధ్యం ; చిన్నతనంలో ఇది సుసాధ్యమవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 01, 2013, 08:40:27 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18 . ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
               జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదెశ రత్నాలు )

4. సేరు పాలలో గిద్దెడు నీరు మాత్రం కలిసి ఉండే పక్షంలో ,ఎక్కువ కష్టం లేకుండా కొద్ది కట్టెలను ఉపయోగించి కాచినా చిక్కపడుతుంది . సేరు పాలలో పావు సేరు నీరు చేరి ఉండే పక్షంలో ,ఆ పాలు సులభంగా గట్టిపడవు . ఎంతో వంట చెరకు కావలసి ఉంటుంది . పిన్న వయస్కులకు ,సంసార వాంఛలు చాలా తక్కువగా ఉండటం తో  వారి మనసు భగవంతుడిపై అనాయాసంగా తిప్ప వచ్చును . ఇక వయసు చెల్లిన వారి  మనసు విశేషంగా విషయ వాంఛల కు లోనై చెడి ఉండటం వల్ల  వారి చిత్తం మరల్చటం కష్ట సాధ్యం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: SaimasterDevotee on November 01, 2013, 09:43:32 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి  నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

2. యువకులంటే నాకింత ప్రేమ ఎందుకు ? ఎందుకంటే వారి మనస్సుల మీద వారికి సంపూర్ణాధిపత్యం (16 అణాల వంతు )ఉంది . వయసు ముదిరిన కొద్దీ మనస్సు భాగాలయి ,విభాగాలాయి చెదిరిపోతుంది . పెళ్ళాడిన వ్యక్తీ మనస్సు సగం (8 అణాల వంతు )అది ఎత్తుకొని పోతుంది . బిడ్డ పుడితే ,నాల్గవ వంతు (4అణాల వంతు ) దాని పరమవుతుంది . మిగిలిన నాల్గవ పాలు తల్లితండ్రుల మీదా ,కీర్తి సంపాదనల్లోను ,వేష భాషల్లోను  చెదిరిపోతుంది . కాబట్టి కోమలమైన హృదయం భగవంతుణ్ణి సులభంగా తెలుసుకొంటుంది . వృద్ధులు ఇలా తెలుసుకోటం దుర్ఘటం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]

Jai Sai Master!

Dear Madam,

what is the meaning of 'దుర్ఘటం'? Is this a synonym of దుర్ఘమం or 'దుర్లభం' ???

Jai Sai Master!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Dwarakanath on November 01, 2013, 05:09:40 PM
Jai Sai master!!

durghatam means difficult to happen. :)

Jai Sai Master!!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 02, 2013, 07:41:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19. యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యభిన్న భేదతః ।
              సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
5. లేత వెదురు సునాయాసంగా వంగుతుంది . ముదిరిన వెదురును వంచబోతే ,అది ఫళుక్కున  విరుగుతుంది గాని వంగదు . మనసు కోమలంగా ఉన్నప్పుడు సునాయాసంగా భగవంతుడి కేసి మరల్పవచ్చు . వయస్సు మళ్ళిన వారి మనస్సు వంగ దీసేటప్పుడు పట్టు వదిలించు కొంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 03, 2013, 05:33:31 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
             జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6. మానవుడి మనస్సు ఆవాల మూట లాటిది . మూట పగిలినప్పుడు ఆవగింజలు నలుదిక్కులకూ చెదిరి పోతవి . వాటిని తిరిగి పోగు చేయటం కష్టం . అలాగే అనేకమైన ఐహిక విషయాలలో చిక్కుకొని అటూ ఇటూ పరుగులు పెట్టే  మనస్సును పట్టి ఒక్కచోట నిలపటం మాటలు కాదు , దుస్సాధ్యమైన పని . యువకుడి మనస్సు లోకావ్యావృత్తులలో చెదరక పోవటం చేత ఏదైనా ఒక లక్ష్యంలో నిలపటం సులభసాధ్యం . వయస్సు మళ్ళిన వ్యక్తి చిత్తమో ,పూర్తిగా లౌకిక విషయాలచేత ఆక్రమింపబడి ఉంటుంది . అందువల్ల అతగాడికి తన మనస్సును ఇతర వ్యావృత్తుల నుంచి మరల్చి భగవంతుడిలో నే ఏకాగ్రత చేయటం ఎంతో కష్టసాధ్యం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 04, 2013, 10:34:30 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 21. శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
              గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

7. సూర్యోదయం కాక మునుపే పాలను చిలికితే చక్కగా వెన్న వస్తుంది . పగటి వేళ చిలికిన పాలలో సరిగ్గా వెన్న లభించదు . ఆ విధంగానే చిన్నతనంలో భగవంతుడి మీద మనస్సును మరల్చి పారమార్ధిక సాధనలను అభ్యసించిన వారే భగవంతుణ్ణి తెలిసికొంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 05, 2013, 08:02:36 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 22. మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
              మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

8. అగ్గిపుల్ల తడిసి నెమ్ముకొన్నప్పుడు ఎంత గీచినా వెలగదు ; దాన్లోని మందు నలుసు నలుసుగా ఊడిపోతుంది . నేమ్ముకోక పొడిగా ఉండే పుల్లను కాస్త రాయగానే బుస్సున అంటుకొంటుంది . నిష్కపటమై ,సరళమై ,స్వచ్చమై విషయ వాంఛలచేత మలినం కాని హృదయం పొడి అగ్గిపుల్ల వంటిది . అలాటి వారికి ఒక్కసారి ఉపదేశం చేయగానే వారి హృదయంలో ఈశ్వరానురాగం ఉదయిస్తుంది .కాని ధన కనకాలలో ఊరిన ఐహిక రతుడి మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్ల . అలాటి వాడికి భగవంతుణ్ణి గురించి వందసార్లు ఉపదేశించినా భక్త్యగ్ని రాజుకోదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 06, 2013, 08:20:01 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥  ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
        గురు స్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                సాధకులు : విభిన్న తరగతులు

1. సాధకులు రెండు రకాలు . ఒక తరగతి వారికి మర్కట కిశోర న్యాయం (అంటే కోతి  పిల్ల యొక్క రీతి .)వర్తిస్తుంది . మరొక తరగతి వారికి మార్జాల కోశోర న్యాయం (అంటే పిల్లి కూన  యొక్క రీతి )వర్తిస్తుంది . కోతి  పిల్ల తల్లిని గట్టిగా పుచ్చుకొంటుంది . అప్పుడు దాన్ని తల్లి కోతి ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకొని పోతూంటుంది . పిల్లికూన తన తల్లిని పట్టుకోదు . తల్లి దాన్ని ఎక్కడ విడిచి పెడితే అక్కడే జాలి పుట్టేట్లు `మ్యావ్ ` మంటూంటుంది . అప్పుడు తల్లి పిల్లి వచ్చి దాని మెడను నోట కరచుకొని యిచ్చ వచ్చిన చోటికి తీసుకొని పోతుంది . ఈ రీతిగానే జ్ఞాన యోగాన్ని గాని ,(నిష్కామ ) కర్మ యోగాన్ని గాని అవలంబించే సాధకుడు ముక్తి పొందటానికి స్వీయ ప్రయత్నం మీదనే ఆధారపడతాడు . ఇక భక్తి మార్గం అనుసరించే సాధకుడు సర్వం దైవాధీనమని గ్రహించి భగవదనుగ్రహాఅన్ని కోరి పూర్ణ విశ్వాసంతో అతణ్ణి శరణు జొస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 07, 2013, 08:10:18 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 24. గురు మధ్యే స్ధితం విశ్వం విశ్వ మధ్యే స్ధితో గురు: ।
              గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. భగవంతుడు ఒక్కడే ; కాని అతడి కళలు అనేకాలు . ఒకే గృహ యజమాని తన కుటుంబంలో ఒకరికి తండ్రీ  ,మరొకరికి పినతండ్రీ ,వేరొకరికి బావా ,ఇంకొకరికి మామగా ఉంటూ ఒక్కొక్కరిచే ఒక్కో విధంగా భావింప బడుతూంటాడు . అలాగే వారి వారి భావనా విశేషం మేరకు ఒక్కొక్క భక్తుడు భగవంతుణ్ణి ఒక్కో రీతిలో భజిస్తుంటాడు . కొందరు స్నేహితుడు గాను ( సఖ్య భావం ),కొందరు ప్రభువుగాను (దాస్య భావం ),కొందరు బిడ్డగాను (వాత్సల్య భావం ),మరికొందరు భర్తగాను (మధుర భావం ) భావించి భగవంతుణ్ణి సేవిస్తారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 08, 2013, 08:32:55 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధొ యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ ।
              జ్ఞానలుబ్ధస్తధా శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3 . మీరు దేన్ని ఆశించి ప్రయత్నిస్తారో దాన్ని సాధిస్తారు . భగవంతుణ్ణి అన్వేషించే వ్యక్తి  భగవంతుణ్ణి పొందుతాడు . ఐశ్వర్యం గాని ,అధికారం గాని ఆశించి ప్రయత్నించేవాడు దాన్ని సంపాదిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 09, 2013, 11:07:34 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26. అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విబాహుశ్చహరి: స్మృతః ।
              యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు : కధితః ప్రియే ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. రాజభవనానికి వెళ్లి పుచ్చకాయ ,సొరకాయ లాటి అల్ప వస్తువులను కోరుకున్న యాచకుడు మతిలేనివాడు . రాజరాజేశ్వరుడైన జగత్ప్రభుని ద్వారం వద్ద నిలబడి భక్తి  జ్ఞానాలనే అమూల్య రత్నాలను ఉపేక్షించి అష్ట సిద్ధుల లాటి తుచ్చాలను కోరుకునే భక్తుడు అవివేకి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 10, 2013, 03:10:00 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27 . దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. ఉపాసకుడు జ్ఞానమార్గం అవలంబిస్తున్నాడో ,భక్తి  మార్గం అవలంబిస్తున్నాడో అతడి స్వభావాన్ని నిజానికి తెలుసుకోవడం ఎంతో కష్టం . ఏనుగుకు రెండు రకాల దంతాలుంటాయి . వెలుపలి దంతాలు అలంకారప్రాయాలు . నమలటానికి  ఉపయోగమయ్యేవి లోపలి దంతాలు . అలాగే ఉపాసకుడు తరచూ నిజస్వభావాన్ని మరుగు పరచి వేరొక రీతిని సంచరిస్తూంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని ![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 11, 2013, 07:53:25 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 1. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6 . యోగులు గూఢ యోగులూ ,ప్రకట యోగులూ అని రెండు తరగతులు ,మొదటి తరగతి వారు రహస్యంగా యోగసాధనలను  అవలంబిస్తూ ప్రజల దృష్టిలో పడక గూఢoగా ఉంటారు . రెండవ రీతివారు యోగుల బాహ్య చిహ్నాలైన యోగ దండాదులను ధరించి సర్వవిధాలైన పారమార్ధిక విషయాలను గురించీ సంభాషిస్తూంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 12, 2013, 08:01:32 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
           తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                             ఉత్తమ భక్తుడు
1. రాయి వేలాది సంవత్సరాలు నీటిలో పడి  ఉండవచ్చు . ఐనా ఒక్క నీటి చుక్క కూడ దాన్లోకి పోదు . కాని మన్ను నీరు తగులగానే మెత్త పడుతోంది . అలాగే ఎన్ని బాధలు కలిగినా ,ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ,విశ్వాసవంతుడైన భక్తుడు కుంగిపోడు . ధృఢ విశ్వాసం లేనివాడో ,కించిత్తు కష్టం ప్రాప్తించగానే చలించిపోతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 13, 2013, 07:49:02 AM
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 3. సర్వ తీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
           గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ప్రహ్లాదుడి ప్రార్ధనలకూ స్తోత్రాలకూ శ్రీహరి సంతుష్టుడై " నీకేం వరం కావాలి " అని అడిగాడు . అందుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు : "ప్రభూ ! నన్ను హింసించిన వారిని క్షమించు . వారిని దండించడం నిన్ను నువ్వు దండించు కోటమే కదా ! ఎందుకంటే ,నిశ్చయంగా నువ్వు ప్రతి ప్రాణి లోను నెలకొని ఉన్నావు ".

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 14, 2013, 07:31:10 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
శ్లో ॥ 4. అజ్ఞాన మూల హరణం జన్మకర్మ నివారకమ్ ।
            జ్ఞానవైరాగ్య  సిద్ధ్యర్ధం  గురో: పాదోదకం పిబేత్ ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. శ్రీ రామకృష్ణులకు సాధుశీలుడైన కేశవచంద్రసేన్ను చూడాలనే కుతూహలం కలిగింది . కేశవచంద్రుడు అప్పుడు బ్రహ్మమతస్ధులైన తన శిష్యులతో కలిసి `బేల్ ఘర్ `లోని జయ గోపాల్సేన్ ఉద్యాన మందిరంలో నివసిస్తూన్నాడు . శ్రీ రామకృష్ణుడు హృదయ ముఖోపాధ్యాయుణ్ణి వెంట పెట్టుకుని బండి మీద అక్కడకు ప్రయాణ మైనాడు . అప్పుడు కేశవబాబు తన శిష్యులతో కలిసి తోట కొలనులో స్నానం చేయటానికి ఆయత్తపడుతూంటే  ,శ్రీ రామకృష్ణుడు కనుగొని కేశవబాబు నుద్దేశించి ,"ఇక్కడ ఉన్న వాళ్ళలో తోక ఊడినవాడు అతడొక్కడే " అని విమర్శించి పలికాడు . అందుపైన కేశవచంద్రుడి శిష్యులందరూ కడుపుబ్బనవ్వసాగారు . కేశవబాబు వారిని మందలిస్తూ ,"మీరు నవ్వకూడదు ,ఆయన మాటల కేదో గూడార్ధం ఉంటుంది "అని పలికాడు . అప్పుడు శ్రీ   రామకృష్ణుడు ఇలా విశదీకరించాడు .
 "కప్ప   పిల్ల తోక ఊడనంత వరకూ నీళ్ళలో మాత్రమే  నివసించ గలుగుతుంది . తోక ఊడగానే భూమ్మీద నీటిలోను కూడ  జీవించ గలదు . అలాగే దైవ ధ్యానం వల్ల ఎవడి అజ్ఞానమనే వాలం ఊడుతుందో అతడు యధేచ్చగా బ్రహ్మానంద వార్దిలో  మునుగనూ గలడు ,సంసారంలో వర్తించనూ గలడు ".

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!  [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Priya on November 14, 2013, 10:59:31 AM
Quote
" కప్పు పిల్ల తోక ఊడనంత వరకూ నీళ్ళలో మాత్రమే  నివసించ గలుగుతుంది . తోక ఊడగానే భూమ్మీద నీటిలోను కూడ  జీవించ గలదు . అలాగే దైవ ధ్యానం వల్ల ఎవడి అజ్ఞానమనే వాలం ఊడుతుందో అతడు యధేచ్చగా బ్రహ్మానంద వార్దిలో  మునుగనూ గలడు ,సంసారంలో వర్తించనూ గలడు ".

జై సాయి మాస్టర్!

చాలా బావుంది. మస్టర్ గారు చెప్పినది  కూడా ఇదే కదా!

జై సాయి మాస్టర్!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 15, 2013, 08:37:37 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 5. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీచరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
                      సాధనలు : అవాంతరాలు
1. అడుగునసూదిబెజ్జమంత రంధ్రం ఉన్నా కడవెడు నీరూ క్రమంగా కారిపోతుంది . అలాగే సాధకుడిలో ఏ మాత్రపు లోలతఉన్నా అతడి జపతపాలన్నీ  నీరుకారి పోతవి (అంటె నిష్ప్రయోజనాలవుతవి )

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 16, 2013, 09:26:07 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
            రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥
 
  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. మెత్తని మట్టిని ఏ ఆకృతిలోకైనా మలచ వచ్చు ;కాల్చిన మట్టి ఆకృతి మారదు . అలాగే విషయ వాంఛలనే అగ్ని చేత కాల్చబడిన హృదయంలో పారమార్ధిక భావాలు హత్తుకోవు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్! జై దివ్యజనని!! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 17, 2013, 10:53:52 AM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువులనమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
            దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. ఇసుకా చక్కెరా కలిసిపోయినా చీమ చక్కెరను తిని ఇసుకను విడిచి వేస్తుంది . అదే విధంగా పుణ్య పురుషులూ పరమ హంసలూ అసత్తను (అంటె కామినీ కాంచనాలను ) విసర్జించి సద్వస్తువు (సచ్చిదానందమయుణ్ణి ) గ్రహిస్తారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
 జై సాయి మాస్టర్ !జై దివ్యజనని ![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 18, 2013, 08:36:40 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 8. శరీరమింద్రియం ప్రాణమర్ధ స్వజనబాన్ధవాన్ ।
            ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. నూనె రాసిన కాగితం రాతకు పనికిరాదు . అదే రీతిలో కామినీ కాంచనాలనే తైలం చేత మలిన మైన హృదయం పారమార్ధిక సాధనలకు తగదు . కాని నూనె కాగితం మీద సుద్ద పామినప్పుడు రాతకు తగి ఉండేటట్లుగా త్యాగమనే సుద్ద చేత రుద్దబడిన మనస్సు పారమార్ధిక సాధనలకు తిరిగి యోగ్యమవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 19, 2013, 07:51:51 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5 . పారమార్ధిక సాధనాలను చేస్తునప్పుడు మత విషయాలపట్ల విముఖులయ్యే వారితో సావాసం చేయరాదు  . అలాటివారు భగవంతుణ్ణి సేవించేవారిని ,ధ్యానించేవారిని చూసి హేళన చేస్తారు . భక్తి అన్నా భక్తులన్నా వారు వెక్కిరిస్తారు .వారి   దరి  చేరక సుదూరంగా మసలుకో .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 20, 2013, 09:29:18 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 10 . గురుబ్రహ్మ గురు విష్ణు: గురుర్దేవోమహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

6. ఆవుల మందలోకి అన్య జంతువు ఏదైనా జొరబడితే , ఆ మంద అంతా కలిసి దాన్ని కుమ్మి తరిమి వేస్తుంది . కాని మరొక ఆవే వస్తే అవన్నీ చుట్టూ చేరి దానితో నెయ్యం కలిపి ఒకదాన్ని ఒకటి నాకు కుంటవి . అదే విధంగానే భక్తుడు వేరొక భక్తుణ్ణి కలుసుకొన్నప్పుడు వారిద్దరూ పారమార్ధిక విషయాలను గురించి ముచ్చటించు కొంటూ ,అన్యోన్య సహవాసం చేత ఆనందిస్తారు . ఎడబాటును సహించలేరు . కాని నాస్తికులను వారు కలుసుకో ఇష్టపడరు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 21, 2013, 09:31:20 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
              తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల  ఉపదేశరత్నాలు )

7 . లోతులేని చెరువుకు పోయి దాన్లోని నీటిని తాగాలను కొన్నవాడు కలగకుండేట్లు పైనీటిని మెల్లగాతీసుకొవాలి . నీరు కలగిందా ,అడుసు పైకి తేలి నీటిని మలినపరుస్తుంది అలాగే ఈశ్వర ప్రాప్తి కోరినావంటే ,నీ గురువు ఉపదేశంలో విశ్వాసవంతుడవై పూనికతో సాధనలు చేస్తూండు . శుష్క వేదాంత చర్చ ల్లోకి ,వాగ్వాదాల్లోకి దిగి నీ శక్తిని వ్యర్ధం చేసుకోకు . ఎందుకంటే క్షుద్ర మనస్సు సులభంగా కలకబారుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 22, 2013, 08:27:17 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం ।
              తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

   గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

8. దయ్యం పట్టిన వాడి మీద మంత్రించిన ఆవాలను జల్లితే ,దయ్యం వాణ్ణి వదిలిపోతుంది . కాని దయ్యం ఆవాలలోనే ప్రవేశించినప్పుడు ,ఆ ఆవాలు పిశాచాన్ని ఎలా వెళ్ళ గొట్ట గలుగుతవి ? దైవాన్ని ధ్యానించ వలసిన మనస్సే ఐహిక విషయాలలో ఆసక్తి పొందినప్పుడు పారమార్ధిక సాధనల్లో ఎలా ఉత్తీర్ణు డవు కాగలవు ?

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 23, 2013, 09:55:26 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
              నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9. మాటా ఆలోచనా ఒకటై ఉండాలి ,ఇదే సరైన పారమార్ధిక సాధన . లేకుంటే ," ఓ దైవమా ! నా సర్వస్వం నువ్వే " అంటూ ,అంతరంగంలో సంసారమే తన సర్వస్వమని నమ్మినప్పుడు నువ్వు చేసే జపతపాలన్నీ గంగలో కలిసిపోక తప్పదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 24, 2013, 02:59:33 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥. 14.     చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
                   అసిత్వం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

               గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

10. దారపు కొనలో ఏ మాత్రం విడిపోయిన పోగులున్నా అదెన్నడూ సూది బెజ్జంలోకి పోదు . అదే విధంగా మనస్సులో కామం కించిత్తు ఐనా మిగిలి ఉన్నంత వరకు ఎవరూ ఆత్మరాజ్యంలో ప్రవేశించలేడు . మనస్సు కామాల బారి నుంచి తొలగి పరిశుద్ధమైనప్పుడు మాత్రమే సచ్చిదానంద లాభం చేకూరుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 25, 2013, 07:55:27 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 15. సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

11. ఈశ్వర ప్రాప్తిని కోరుకునే వ్యక్తి ఎంత మాత్రమూ కామినీ కాంచనాలకు సందు ఇవ్వకూడదు . లేశమైనా ఇలాటి రాగం ఉన్నవాడు సిద్దుడవటం కలలోని వార్త. ఇసుకతో కలిసి పెనం మీద వేగిన వడ్ల గింజలలో పైకెగిరి అవతల బడ్డ పెలాలైన కొద్ది గింజలు మాత్రం మాడి మసిబారక ఉంటవి . పేలక ,పెనం మీదనే మిగిలిఉన్న గింజలన్నీ కాలిన ఇసుక వేడిమి చేత ఏదో ఒక పక్కన మాడి ఉండక మానవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 26, 2013, 07:42:12 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
             యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

12. సిరిసంపదలు ,కీర్తిగౌరవాలు ,పుత్ర లాభం మొదలైన సంసార సుఖేచ్చలు మనస్సులో ఉంచుకోక ఎవ్వరూ భక్తి సాధన చేయకుంటారు గాక ! ఇతర ఆపేక్షలు లేక భగవంతుణ్ణి కోరి భజించే వ్యక్తికి అభీష్టం సిద్ధిస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 27, 2013, 09:23:45 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్దితమిదం సర్వం  భాతియద్భానరూపతః ।
             యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

13. గాలిచేత కదులుతున్న నీళ్ళలో ఏ వస్తువూ ప్రతిబింబించలేదు . అలాగే విషయేచ్చలనే గాలి చేత కల్లోలమైన హృదయంలో దేవుడి ప్రతి బింబం గోచరించదు . ఉచ్చ్వాస నిశ్వాసల వల్ల  మనస్సు చలిచటం చేత యోగి దైవ ధ్యాన ఆరంభానికి ముందు కుంభక ప్రాణాయామం చేత మనస్సును ఏకాగ్రం చేసుకొంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 28, 2013, 10:28:50 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18.ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైద్యాదికం తదా ।
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥ 

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

14. తన మనోభావాలపట్ల ద్రోహి కాని వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి ప్రార్ధిస్తాడు . అంటె భక్తి విశ్వాసాలూ ,సరళ భావమూ భగవంతుణ్ణి పొందే మార్గాలు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on November 30, 2013, 09:56:40 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19.యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
            సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥ 

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

15 దార్లో పామును చూసినప్పుడు ," ఓ మానస మాతా !(సర్పాధి దైవతమా !)నీ తలను నాకు కనిపించకుండా మరుగుపరచి నీ తోకను మాత్రం చూపించు " అనటం వాడుకలో ఉంది . ఆ విధంగానే నువ్వు యవ్వనవతి ఐన స్త్రీని చూసినప్పుడు `తల్లీ !` అంటూ ఆమెకు నమస్కరించి ఆమె ముఖం కేసి చూడక పాదాలవైపు చూడు . అలా చేశావా ,నీకు మోహ భయం కలుగదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![14/size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 01, 2013, 07:24:31 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం ।

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 20.అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
             జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

16. ప్రతి సన్యాసీ ప్రతి భక్తుడూ స్త్రీల నందరినీ ,యోగ్యురాళ్ళయినా కాకున్నా ,ఆనందమయి ఐన జగన్మాత స్వరూపాలుగా భావించాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 02, 2013, 08:44:40 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 21.శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణఉపదేశ రత్నాలు )

17. ఏకాంత స్ధలంలో ఒక యువతిని చూసి ఎవడు మాతృ  భావంతో తన మనస్సులో ఆమెకు నమస్కరించి తొలగిపోతాడో అతడే యదార్ధమైన త్యాగశీలి . కాని ఎవడు ఆడంబరం కోసం పది మంది ఎదుట ఈ రీతిగా సంచరిస్తాడో  అతడు నిజమైన త్యాగి అనదగడు . అలాటివాడు వట్టి డాంబికుడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం ।
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 03, 2013, 08:11:20 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !\
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత .

శ్లో ॥ 22. మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు : శ్రీ జగద్గురు :।
              మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )

18. అహంకారం నిర్మూలించు కోటం దుస్సాధ్యం . మేక తలను మొండెం నుంచి ఖండించినా ఆ మొండెం కొంచెం సేపు అటూ ఇటూ దొర్లుతూనే ఉంటుంది . అహంకారం కూడ  ఇలాటిదే .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 03, 2013, 11:31:53 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురు స్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశారత్నాలు )

19. అహంకారాన్ని తొలగించుకోవటం ఎంతో కష్టం . వెల్లుల్లి రసం గాని నీరుల్లి రసంగాని పోసి ఉంచిన పాత్రను ఎన్నివందల సార్లు కడిగినా ఆ ఉల్లి గడ్డల దుర్వాసన పోనే పోదు . అలాగే పురుషుడి అహంకారపు జాడ కూడ కొంత సదా మిగిలి ఉంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం ।
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 04, 2013, 09:37:48 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 24. గురుమధ్యే స్ధితం విశ్వ మధ్యే స్ధితో గురు :
             గురువిశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

20.నిజమైన సన్యాసికి త్యాగికి లక్షణం ఏమిటి ? ఇద్దరూ కామినీ కాంచనాల సంపర్కం విసర్జించి ఉండాలి . ధనాసక్తత ఉన్నా ,స్వప్న స్ఖలనం పొందినా వారి జపతపాలన్నీ గంగలో కలుస్తవి . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 05, 2013, 08:18:53 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీగురు గీత

శ్లో ॥ 25. మధులుబ్ధో యధా భ్రుంగో పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ ॥
              జ్ఞానలుబ్ధ స్తధా శిష్యోగురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశ రత్నాలు )

21. భగవంతుడు కల్పవృక్షం వంటివాడు . కల్పవృక్షం కింద కూర్చుని ఎవ్వరేది కోరినా వారికది లభిస్తుంది . తపోధ్యానాల వల్ల మనసు పరిశుద్ధమైనాక సాధకుడు జాగరూకుడై విషయ వాంఛల నన్నిటిని విసర్జించాలి . ఈ సందర్భంగా ఒక కథ చెబుతా వినండి :
    ఒక బాటసారి ప్రయాణమై పోతూ దారిలో ఒక మైదానాన్ని చేరుకొన్నాడు . చాల సేపు అతడు మండు టెండలో నడిచినందున ,అలసిపోయి ఒళ్లంతా ముచ్చెమటలు పట్టగా కాస్సేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు . అలా కొంత సేపు అయ్యాక అక్కడ నిద్ర పోవటానికి తన కోక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా  ఉంటుందో కదా అని ఊహించసాగాడు . నిజానికి తాను  కల్పవృక్షం కింద కూర్చున్న సంగతి పాపం ఆ బాటసారి ఎరుగడు . పైకోరిక మనస్సులో మెదలగానే అతడి పక్కన ఒక హంస తూలికాతల్పం ప్రత్యక్షమైంది . అది చూసి అమితాశ్చర్యం తో దాని మీద పవ్వళించాడు . కాస్సేపటికి తన కొక యువతి వచ్చి సుతి మెత్తగా పాదాలు ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకొన్నాడు . తక్షణమే ఒక యువతి రావటమూ ,తన పాదాలు ఒత్తుతూండటమూ  చూసి బాటసారి పరమానంద భరితుడయ్యాడు . ఆ తరువాత అతడికి అమితంగా ఆకలివేసింది . అప్పుడతడు ఇలా ఊహించాడు . "నేను కోరుకున్న దంతా ప్రాప్తించింది , నా కిక ఏదైనా రుచ్యాహారం లభించకుంటుందా ?" మరుక్షణంలో అతడి ముందు పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించ బడ్డాయి . ఆవురావురుమంటూ ఆ విందు భోజనాన్ని ఆరగించసాగాడు . తృప్తిగా ఆరగించి ,తల్పం మీద నడుం వాల్చి ఆ రోజు జరిగిన వృత్తాంతాన్ని  గురించి చింతించసాగాడు . ఇలా ఆలోచిస్తూ ," ఇప్పుడు హఠాత్తుగా నన్నొక పులి  వచ్చి గుటుక్కున మింగితే !" అని ఊహించగానే ,క్షణంలో `గాండ్రు ` మంటూ ఒక పెద్ద పులి అతడి  మీదికి ఉరికి మెడ కొరికి రక్తం పీల్చ నారంభించింది . ఇలా ఆ బాటసారి ప్రాణాలను కోల్పోయాడు . సామాన్యంగా లోకుల గతి ఇలాగే  పరిణమిస్తూంటుంది . ధ్యానం చేస్తూ సంతానంగాని ,ధనం గాని ,కీర్తి గౌరవాలను గాని  వాంఛించి   భగవంతుణ్ణి ప్రార్ధించే పక్షంలో మీ కోరికలు కొంతదాకా తప్పక సిద్ధిస్తవి . కాని వాటి వెనుకే పెద్దపులి దాగి ఉందని నమ్మండి ,రోగం ,శోకం ,తాపం ,మానం ,,అవమానం లోనైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటె వేయి రెట్లు ఎక్కువ భయంకరాలు కదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 06, 2013, 09:08:22 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26 . అత్రినేత్రశ్శివ స్సాక్షద్విబాహుశ్చ హరి: స్మృతః ।
               యోచతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు: కధితః ప్రియే ॥

 గురూపదేశములు (  రామకృష్ణ ఉపదేశరత్నాలు )

22. ఒక పురుషుడు హఠాత్తుగా వైరాగ్యావేశం పొంది తనకు సంసారంలో అనురాగం సడలి పోయిందనీ ,భగవంతుణ్ణి  ధ్యానించటానికై  నిర్జన వనానికి పోదలచాననీ  తన స్నేహితులతో చెప్పాడు . ప్రశంసించ దగిన అతడి ఉద్దేశానికి  వెంటనే వారు తమ ఆమోదాన్ని తెలిపారు . తదనంతరం అతడు ఇల్లు విడిచి ,ఏకాంత స్ధలానికి పోయి ,పన్నెండేళ్ళు తీవ్ర తపస్సు చేసి ,కొన్ని మనశ్శక్తులను  సముపార్జించి ,తిరిగి ఇంటికి వచ్చాడు . చిరకాలానికి తిరిగి తమ స్నేహితుణ్ణి  చూడగలిగినందుకు  అతడి మిత్రులు చాల సంతోషించి ,చిరకాల తపోనిష్ట వల్ల ఏపాటి జ్ఞానం సంపాదించావని ప్రసంగవ శాత్తు అతణ్ణి అడిగారు . అతడు చిరునవ్వుతో ,సమీపంలో ఒక ఏనుగును చూసి ,దాని దగ్గర కెళ్ళి ,దాన్ని మూడుసార్లు తాకి ," గజమా నువ్వు క్షణంలో మరణించు "అనే మాటలు పలుకగానే ఆ ఏనుగుకు జీవలక్షణాలు ఉడిగాయి . మరుక్షణమే అతడా ఏనుగును తాకి ,"గజమా ,నువ్వు   సజీవంగా రా "అనటంతో ఏనుగు మళ్ళా బతికింది . తరువాత తన ఇంటి ప్రక్కన పారుతున్న ఒక నది వద్ద కెళ్ళి కొన్ని మంత్రాలు జపించి నదికి అడ్డంగా నీళ్ళ మీద నడచి ,అలాగే తిరిగి ఇవతలకి నడిచి వచ్చాడు . స్నేహితులు అతడి ప్రజ్ఞను చూసి అబ్బురపడినా ,సాక్షేపంగా అతడితో ఇలా అన్నారు :"అన్నా నీ తపస్సు నిష్ప్రయోజన మయింది ,ఏనుగు బతికితే నీకేం ?చస్తే నీకేం ?పన్నెండేళ్ళు తీవ్ర తప మాచరించి నదికి అడ్డంగా నడచి నువ్వు ప్రదర్శించిన ఘన కార్యాన్ని మేం దోనెవాడికి  ఒక పైసా ఇచ్చి దాటటంతో చేస్తున్నాం . కాబట్టి నీ పాట్లు ఎలా వృధా అయినవో చూశావా !" . ఈ ఎద్దేవా మాటలతో తెలివి తెచ్చుకొని అతడిలా చింతించాడు . "నిజానికి నాకీ మన శ్శక్తులతో ఏం ప్రయోజనం కలిగింది ?"ఇలా విమర్శించుకొని ఈ పర్యాయం తీవ్రమైన జప తపాల చేత భగవంతుణ్ణి పొందాలని ఇల్లు  విడిచి పెట్టాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 07, 2013, 07:46:31 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనం ।
             తాదృశస్యైవ కైవల్యం సచద్వెతిరేకణః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

23.తనను తానూ మెచ్చుకొంటే ,తన్ను కొన్నట్లే ఉంటుంది . కాకీ తన కార్యాల పట్ల తానూ తెలివిగల దాన్నే అని తలపోస్తూ ఉంటుంది . ఐనా అది అశుద్ధం తిని బతుకుతూంటుంది  కదా ! అలాగే ప్రాపంచికుడు తాను మహా `లౌక్యుడ ` నను కొంటూ ,తానూ తవ్విన గోతిలో తానె పడి చెడుతూంటాడు . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 08, 2013, 08:45:10 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

24. ఒక రోజు రూపాయను ఒక చేతిలో ,మట్టిగడ్డను ఒక చేతిలో పుచ్చుకొని గంగ ఒడ్డున నిలబడి దీర్ఘా లోచనా పరుడనై ,ఆ రెండింటికీ బేధం లేదని నిశ్చయించి గంగలో వాటిని విసిరి వేశాను . కాన దీని మూలంగా మహాలక్ష్మి నా మీద కోపగించు కొంటుందో లేక నాకు అన్నం పుట్టకుండా చేస్తుందో అని మనస్సులో కొంత బెంగ పుట్టింది . అంతలోనే మరొక ఆలోచన రాగా ,ఇలా అనుకొన్నాను :" తల్లీ !మహాలక్ష్మీ నా హృదయాన్ని నీ సింహాసనంగా చేసుకో ; నీ ధనం కించిత్తూ నాకు అక్కర్లేదు " .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 09, 2013, 05:49:38 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

25. భగవంతుడు మందహాసం చేసే సందర్భాలు రెండు . అన్నదమ్ములిద్దరు  తండ్రి గతించాక తమ భూములను ఒక తాడుతో కొలిచి పంచుకొంటూ " ఈ వైపు నాది ; ఆ వైపు నీది " అని చెప్పుకొనేటప్పుడు ఒకసారి ,రోగి జీవిస్తాడనే ఆశ పోయి ప్రాణోపద్రవకరంగా ఉన్నప్పుడు విలపిస్తున్న బంధు మిత్రులతో వైద్యుడు ,"భయపడకండి ; రోగి స్వస్ధత పొందటం నా పూచి "అంటూ అభయం ఇచ్చేటప్పుడు మరొకసారి . కాలుడి ఆజ్ఞ అయ్యాక రోగిని ఏ మానవుడూ బతికించ లేడని పాపం ఆ వైద్యుడు ఎరుగడు .!

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 10, 2013, 07:03:31 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 3. సర్వ తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
           గురో : పాదోదకం పీత్వా శేషం శిరశిధారయన్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

26. "అష్ట సిద్దులలో నీ వశంలో  ఒక్కటి ఉన్నప్పటికీ పరాత్పరుడైన నన్ను నువ్వు తెలుసుకోలేవు " అని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో వచించాడు . కాబట్టి నిజమైన భక్తుడు గాని ,జ్ఞాని గాని ఇలా ఏ సిద్దులనూ వాంఛించ దగదు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 11, 2013, 07:32:35 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4. అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారకమ్ ।
            జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో : పాదోదకం పిబేత్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

27. సాధు సాంగత్య శీలుడైన లక్ష్మీ నారాయణు డనే ఒక మార్వాడీ సంపన్నుడు ఒకప్పుడు శ్రీ రామక్రిష్ణులను సందర్శించటం జరిగింది . వారిద్దరూ వేదాంత విషయాలను గురించీ పారమార్హ్దిక వేదాంత విషయాలను గురించీ చాల సేపు ముచ్చ టించు కొన్నారు . లక్ష్మీ నారాయణుడు శ్రీ రామకృష్ణుల తత్త్వ వివరణలకు సంతృప్తి చెంది ,సెలవు పుచ్చుకొనే ముందు శ్రీవారి సేవ నిమిత్తం పది వేల రూపాయలు ఇవ్వ చూశాడు .ఆ సూచన శ్రీ రామకృష్ణులకు తల మీద అఘాతంలా సోకగా ,దాదాపు ఆయన మూర్చ పోయాడు . తెలివి రాగానే లక్ష్మీ నారాయనుణ్ణి  చూసి ,అతడు తన ముందు చేసిన ప్రస్తావన చేత తనకు కలిగిన జుగుప్సను వ్యక్తం చేస్తూ బాలుడిలా ," మూడుడా ! ఈ గదిలో నుంచి వెంటనే వెళ్ళిపో ,ధనాశ చూపి నన్ను మాయలోకి దింపదలచావా ?" అంటూ గద్దించాడు . శ్రీ రామక్రిష్ణులను  అమితంగా అభిమానించే లక్ష్మీ నారాయణుడు క్షణం పాటు కాస్త కలవరం చెంది ,"స్వామీ ! మీరింకా ఒక మెట్టు కిందనే ఉన్నారు " అనగానే "అది ఎలాగ ?"అని శ్రీ రామకృష్ణులు అడిగారు . అందుకు లక్ష్మీ నారాయణుడు ,"మహా పురుషుడైన వ్యక్తి  తనకు  సమర్పించిన దాన్ని పరిగ్రహాపరిగ్రహాల (పుచ్చుకోవటం ,పుచ్చుకోకపోవటం ) విషయంలో భేద భావన చేయడు . తన కేదైనా ఇస్తే సంతోషపడడు  ,తనది ఏదైనా పుచ్చుకొంటే వగవడు " అని జవాబిచ్చాడు . శ్రీ రామకృష్ణులు చిరునవ్వుతో  విషయాన్ని అతడి కిలా విశదీకరించాడు :" ఇలా చూడు అడ్డం మీద డాగు  ఉండినా దాన్లో నీ ముఖం స్పష్టంగా ప్రతిబింబించదు ,అలాగే పరిశుద్ధ మనస్సులో కామినీ కాంచనాల జాడ కూడ ఉండతగదు . " అప్పుడతడు ," మంచిది పోనివ్వండి ,మీ సేవ నిమిత్తం మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్న మీ ఆప్తుడు హృదయుడు స్వీకరించవచ్చు " అని చెప్పగా శ్రీ రామకృష్ణుడు ,"వద్దు ;అదీ వద్దు ఎందుకంటే ,`ఎవరికైనా కొంత సొమ్ము ఇవ్వు `అని హృదయుణ్ణి అడిగాననుకో ,లేకుంటే ఎందుకైనా కొంత పైకం ఖర్చు చేయటానికి ఉద్యమించా ననుకో ,అందుకు అతడు ఒప్పుకోకపోతే సామాన్యంగా నా కేమని తోచుతుంది ? `సొమ్ము తనది కాదు ,నా తరపున మాత్రమే తన వద్ద ఉంచుకొన్నాడు `అని తోచటం సహాజం కదా ! ఇలాటి అహంకారం కూడ  తొలగించు కోవటం మంచిది " అని విశదీకరించాడు .ఇలా అరటి పండు ఒలిచి పెట్టినట్లు విశదీకరించగా  విని లక్ష్మీ నారాయణుడు ఆశ్చర్యపడి శ్రీ రామకృష్ణుల అపూర్వ  త్యాగశీలానికి  అపరిమితానంద భరితుడై ఇంటికి బయల్దేరాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 12, 2013, 07:09:12 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 5. కాశీ క్షేత్ర నివాసశ్చ  జాహ్నవీచరణోదకం ।
            గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

28 . తాము ధనవంతులమని ప్రగల్భాలు పలకటం వెర్రితనం . నువ్వు ధనికుడనంటావా ,నిన్ను మించిన ధనికులున్నారని తెలుసుకో . చీకటి పడగానే మిణుగురు పురుగులు బయల్దేరి లోకానికి తామే వెలుగు నిస్తున్నావని తలచుతవి . కాని నక్షత్రాలు పొడసూపగానే వాటి గర్వం అణగారి పోతుంది . అప్పుడు నక్షత్రాలు తామే లోకాన్ని ప్రకాశింప చేస్తున్న వనుకొంటవి .కానిచంద్రోదయం అవగానే అవి  సిగ్గు చేతనో అన్నట్లు వెలవెల బోతవి . ఆపైన చంద్రుడు తానే తన కిరణాలతో లోకాన్నంతా ప్రకాశింప చేస్తున్నానని భావిస్తాడు . కాని సూర్యుడు ఉదయించగానే చంద్రుడు కాంతి విహీనుడై కనబడ కుంటాడు . ధనికులం అనుకొనే వారు ప్రకృతి సిద్ధాలైన ఈ విషయాలను గమనించితే ఇక ఎన్నడూ తమ ఐశ్వర్యానికి గర్వించి ప్రగల్భాలు పలుకరు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 13, 2013, 08:41:42 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

29. "కౌపీన సంరక్షణార్ధం మాయం పటాటోపః "( ఈ పటాటోప  మంతా గోచిని సంరక్షించు కోటానికే ) . ఒక సాధువు పారమార్ధిక సాధనాలను అవలంబించటానికి తన గురువు ఆదేశం మేరకు ఊరి బయట దూరంగా ఒక పర్ణశాల నిర్మించుకొని దాన్లో నివసిస్తున్నాడు . ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి తన విడిచిన తడి వస్త్రాన్ని -కౌపీనాన్ని పర్ణశాల వద్ద ఒక చెట్టుకు ఆరగట్టుతూ  వచ్చాడు . సమీప గ్రామానికి భిక్ష కోసం వెళ్లి తిరిగి వచ్చి చూస్తె ,కౌపీనాన్ని ఎలుకలు కొట్టివేశాయి . కొత్త కౌపీన సంపాదనకై  మర్నాడు గ్రామానికి పోవలసివచ్చింది . కొన్ని రోజులు ఇలా జరగగా ,సాధువు తన గోచీని పర్ణశాల మీద పరచి ,మునుపటి మాదిరే గ్రామానికి భిక్ష కోసం వెళ్లి వచ్చాక చూస్తె ,ఎలుకలు గోచీని పీలికలు చేసి ఉంచాయి . అప్పుడతడు విసిగి వేసారి ,`గోచి గుడ్డ కోసం ఎవరి వద్దకు వెళతాను ? ఎవరిని యాచిస్తాను ?` అని లోలోన చింతించాడు . ఎలాగినా కానిమ్మని మర్నాడు మళ్ళా గ్రామస్ధులను చూసి ఎలుకలు చేసిన అఘాయిత్యాన్ని తెలిపాడు . అతడు ఏకరువు పెట్టిందంతా విని ," రోజు రోజుమీ  కెవరు బట్టలు కట్ట బెడతారు ? ఒక్క పని చేయండి ,ఒక పిల్లిని పెంచారా ,ఎలుకలు మీ జోలికి రావు " అంటూ వారు ఉపాయం చెప్పారు . తదనంతరం ఆ గ్రామంలో ఒక పిల్లి కూనను సంపాదించి ,ఆ సాధువు తన పర్ణశాలకు తీసుకుపోయాడు . ఆనాటి నుంచి ఎలుకల బెడద తొలగి నందున సాధువు అపరిమితానందం పొందాడు . అది మొదలుగా ఆ పిల్లి పిల్లను జాగ్రత్తగా తన భిక్షాటనలో  తెచ్చిన పాలు పోసి పెంచ సాగాడు . ఇలా కొన్ని రోజులు గడిచాక గ్రామస్ధుడొకడు " స్వామీ ! ప్రతి రోజు మీకు పాలు కావాలి ,ఎంతో యాచించి కాసిన పాలు కొంత కాలం తేగలరు గాని ఏడాది పొడవునా ఎవరు ఇస్తారు ? ఒక సంగతి చెప్తాను వినండి . ఒక ఆవును చేర దీస్తే ,పాలు తాగి మీరూ సుఖ పడ  వచ్చు . కొంత మీ పిల్లికి పోయవచ్చు " అని చెప్పాడు . క్రమంగా సాధువు గోవు కోసం గడ్డి యాచింప వలసి వచ్చింది . అందుకై  ఊరూరా తిరిగి యాచించగా  ,గ్రామస్ధులు ," మీ పర్ణశాల వద్ద బీడు భూములు కావలసినన్ని ఉన్నాయి . వాటిని దున్ని సాగు చేస్తే ,మీ ఆవు కోసం గడ్డి యాచింప అవసరం ఉండదు ." అని చెప్పారు . వారి హితోపదేశం ప్రకారం అతడు వ్యవసాయం ప్రారంభించాడు . క్రమంగా కూలివారిని నియోగించీ తదనంతరం పంటనంతా  నిలువ చేయటానికి గాదెలు కట్టించవలసి వచ్చింది . ఈ విధంగా సంపూర్తిగా సంసార నిమగ్నుడైన గృహస్ధుడిలా  అతడు కాలం గడపసాగాడు . కొంత కాలం అయిన తరువాత అతడి గురువు శిష్యుణ్ణి చూడవచ్చి ,ఇంటి కామాట మంతా కనుగొని కలవరపడుతూ ,"ఇక్కడ ఒక సన్యాసి ఒక పర్ణశాల లో నివసించేవాడు ; అతడు ఎక్కడకు పోయాడో చెప్పగలవా ?" అని ఒక సేవకుణ్ణి  అడగ్గా ,అతడేమీ చెప్పలేక పోవటంతో సాహసించి ఆ ఇంట్లోకి పోగానే తన శిష్యుడు కనిపించాడు . అతణ్ణి  చూసి గురువు "నాయనా ! ఈ తతంగం అంతా ఏమిటి ?" అని అడగ్గా ,శిష్యుడు సిగ్గుతో కుంచించుకుపోయి  గురువు పాదాల మీద పడిపోయి ," గురుదేవా ! కౌపీన సంరక్షణార్ధం  మయం  పటాటోపః " అని జరిగినదంతా విన్నవించాడు . గురు సందర్శనంతో తన సంసార బంధాలు విచ్చిన్న మవటంతో  అతడు తన కామాటాల నన్నిటిని విడిచి తిన్నగా గురువును అనుగమించాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 14, 2013, 06:08:44 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
           దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురు సన్నిధౌ ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                       సాధన : అనుకూలపరిస్ధితులు

1. ప్రారంభంలో సాధకుడు తానొక చోట ఏకాంతంగా ఉండి మనస్సును ఏకాగ్రం చేయటానికి ప్రయత్నించాలి . లేకుంటె మనస్సు నానా విషయాల చేత తబ్బిబ్బు కావచ్చు . పాలనునీటిని చేరిస్తే తప్పక రెండూ కలసి పోతవి . కాని పాలను చిలికి వెన్న తీయగానే ఆ వెన్న నీటిలో కలిసి పోటానికి మారుగా దానిమీద దాని మీద తేలుతుంది . అదే విధంగా ఎవడు చిరకాల అభ్యాసంతో తన చిత్తాన్ని వశ పరచు కొంటాడో అతడు నిర్జన వనంలో ఉన్నా లేకున్నా భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించ గలుగుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 15, 2013, 05:58:42 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 8. శరీర మింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ ।
            ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )
2.మనస్ధైర్యవంతులు ఏ స్ధితిలో ఉన్నా భగవచ్చింతన చేయగలరు . తదేక నిష్ఠలేనిదే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటం దుర్లభం . భర్త పట్ల పరిపూర్ణ భక్తి గల స్త్రీ పతివ్రత అనిపించుకొని అతడి ప్రేమకు పాత్రురాలవుతుంది . అలాగే ఇష్టదేవతా నిష్టులైన వారికి ఇష్టదేవతా దర్శనం లభిస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 16, 2013, 06:45:48 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
            గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3 'ఈ దినం తిథి ఏమిటి ?' . అని హనుమంతుణ్ణి ఒకరు అడగ్గా ,అతడు `తిథి వార నక్షత్రాలు ఏవీ నాకు తెలియవు . శ్రీ రామచంద్రుడి పాద పద్మాలను మాత్రమె నే నెరుగుదును ` అని పలికాడు . 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 17, 2013, 05:25:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 10. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవోమహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. మనస్సు ,వనం ,కోణం (ఏకాంత ప్రదేశం )అనే ఈ మూడూ ధ్యాన యోగ్యాలైన స్ధలాలు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 18, 2013, 05:37:03 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
             తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. ఏకాంతస్ధితి లేనివాడు ప్రబలమైన రోగాన్ని ఎలా కుదురుస్తాడు ? సన్నిపాత జ్వరం వల్ల సంసార మోహితుడు బాధ పడుతుంటే ,అలాటి రోగి పడుకున్న గదిలో నీటి కుండను రుచ్యమైన ఊరగాయను ఉంచుతావా ? ఊరగాయ లాటిది కామం . ఐహిక విషయాలను అనుభవించాలనే  వాంఛ  నీటి కుండ లాటిది . ఈ సందర్భంలో రోగం ఎలా నయమవుతుందని తలుస్తావు ?కొంత కాలం నిర్జన ప్రదేశానికి వెళ్లి జపతపాలను అభ్యసించాలి . ఈ భవ రోగనివారణోపాయాన్ని అవలంబించటం చేత సంపూర్ణంగా స్వస్ధుడై తిరిగి ఇంటికి వచ్చినవాడు ఇక నిర్భీతుడై ఉండగలడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 19, 2013, 04:54:43 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
              తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6. ఆధ్యాత్మిక జీవన ప్రారంభదశలో మనిషి భగవంతుణ్ణి  ధ్యానించటానికై  నిర్జన ప్రదేశానికి వెళ్లి ,తన చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రయత్నించాలి . సదా ఇలా సాధన చేస్తూ రాగా ,మనసు  స్వాధీనమవుతుంది . ఆ తరువాత ఎక్కడైనా ఇష్టం వచ్చిన చోట ధ్యానించటానికి  సాధ్యమవుతుంది . చిన్న మొక్క చుట్టూ కంచె పాతి జాగ్రత్తగా సంరక్షించాలి . లేకుంటే మేకలు ఆవులు దాన్ని నమిలి వేస్తాయి . ఆ మొక్కే పెరిగి (లావైన ) మాను గలిగిన పెద్ద చెట్టైనప్పుడు మేకలను ఆవులను కట్టినా అవి దానికి హాని చేయలేవు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని ![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 20, 2013, 09:39:52 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
               నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

7 . యువకుడైన ఒక శిష్యుడు శ్రీ రామక్రిష్ణులను  ," ప్రభూ ,కామాన్ని జయించటం ఎలా ?" అని అడిగాడు . శ్రీ రామకృష్ణులు చిరునవ్వుతో ఇలా అన్నారు :" స్త్రీల నందరినీ నీ తల్లులుగా భావించు . స్త్రీల ముఖం కేసి ఎన్నడూ చూడబోకు ; వారి పాదాలవైపు చూడు . అప్పుడు చెడు తలంపులన్నీ  తొలగిపోతాయి . "

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 21, 2013, 06:42:36 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
            అసిత్వం దర్శితంయేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

8. సహనం ప్రతి మనిషికీ అత్యావశ్యం . సహన శీలుడు మాత్రమే వినాశం పొందడు . సహనమే ప్రధానమని తెల్పుతూ `స ` వేర్వేరు రూపాలలో వర్ణాల మధ్య మూడుసార్లువస్తోంది ( శ ,ష ,స ).

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 22, 2013, 06:38:53 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 15. సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
              సంసార  మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9 . సహనాన్ని మించిన సుగుణం మరొకటి లేదు . ప్రయత్నించి అందరూ సహనాన్ని అలవరచుకోవాలి . కమ్మరి తన దాకటి మీద ఎన్ని దెబ్బలు కొట్టినా అది నిశ్చలంగా ఉంటుంది . అదే రీతిలో ప్రతి వ్యక్తీ ధృఢనిశ్చయంతో ఇతరులు ఏం అన్నా ,ఏం చేసినా సహనం పాటించాలి .

అలివేలు మంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 23, 2013, 08:50:06 PM
జైసాయి  మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
             యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

10. చెరువులో రుచి గల ఎరను పడవెయ్యగానే చేపలు అన్ని వైపుల నుంచి దాని కోసం పోటీ పడి  వస్తాయి . భక్తుడి విశ్వాసం భగవద్విషయంలో ఇలా వర్తిస్తూంటుంది . అలాటి విశ్వాసవంతమైన భక్తి  చేత ఆసక్తుడై భగవంతుడు భక్తుడి వద్దకు హుటాహుటిన  వచ్చి ప్రత్యక్షమవుతాడు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 24, 2013, 08:59:05 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ।
              యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

11. వర్ష ఋతువులో బయల్వెడలిన  పురుగు రివ్వున జ్వాల మీద పడి  చావనన్నా చస్తుంది కాని వెనక్కు తిరిగిచీకటి మొగం పెట్టదు . అలాగే భక్తుడు భగవంతుణ్ణి  గురించి సంభాషిస్తూ జీవించే సాధు జనుల దరిచేరటానికి  ఆతురపడుతూంటాడు . నిస్సారాలైన విషయాకర్షణలకు  దూరంగా తొలగి అతడు భక్తి  సాధనల్లో  తన కాలం వినియోగిస్తాడు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 25, 2013, 10:01:07 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికిగురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18. ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

12. ఒకసారి పార్వతి మహాదేవుణ్ణి ఇలా అడిగింది :" నాథా ! భగవల్లాభం  కలుగ చేసే కీలకం ఏది ?" "నమ్మకమే " అని మహాదేవుడు జవాబిచ్చాడు . మీ గురువు ఉపదేశాలలో పరిపూర్ణమైన విశ్వాసమూ శ్రద్ధా లేకుంటే మీరు దేవుణ్ణి కొనుగొనలేరు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 26, 2013, 09:29:37 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
              సదైక రూప రూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

  గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

13. సాధారణంగా లభ్యం కాని మానవ జన్మ ఎత్తి ఈ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకోలేని మనిషి పుట్టుక నిరుపయోగం ,నిరర్ధకం .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 27, 2013, 10:36:54 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20 . అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణులఉపదేశరత్నాలు )

14 . లౌకికుడు ఉక్కు తీగల చుట్టల (springs )తో తయారు చేయబడ్డ సోఫా లాటి వాడు . సోఫా మీద కూర్చోగానే అది అణగి ఉంటుంది . లేవగానే అది తన ఎప్పటి రూపాన్ని పొందుతుంది . ప్రాపంచిక వ్యావృత్తులలో మునిగిన సంసారికి సజ్జన సాంగత్యం తో కలిగే పవిత్ర భావాలు ,తాను  అలాటి సహవాసాన్ని వీడినంతనే అంతర్ధాన మవుతవి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 28, 2013, 09:53:58 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 21. శోషణం భవసింధోశ్చ దీపనం క్షర సంపదాం ।
              గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

15. భగవన్నామంలో రుచీ విశ్వాసమూ కలిగిన వ్యక్తికి ఇక సాధనా విచారమూ అనావశ్యకం . పావనమైన భగవన్నామ ప్రభావంతోనే సమస్త సంశయాలూ సమసిపోతవి ; మనస్సు నిర్మల మవుతుంది ; భగవంతుడు ప్రత్యక్షమవుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 29, 2013, 08:50:19 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 22. మన్నాధ : శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు : ।
              మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

16. బాలుడి నమ్మకాన్ని పోలిన విశ్వాసం వల్లా ,నిష్కపట హృదయం వల్లా భగవంతుణ్ణి  పొందవచ్చు . ఒకానొక పురుషుడు ఒక సాధువును చూసి తనకు ఉపదేశం చేయమని వినమ్రుడై కోరాడు . " అంతఃకరణ శుద్ధిగా భగవంతుడిలో అనురక్తి కలిగి ఉండు " అని సాధువు ఉపదేశించగా ,అతడు ," భగవంతుణ్ణి నేను ఎన్నడూచూడలేదు ;నా కతడి సంగతి కొంచెమైనా తెలియదు ; అతడి యందు అనురక్తి పొందటం నా కెలా సాధ్య పడుతుంది ?" అని విన్నవించాడు . ఆ మహాత్ముడప్పుడు ,"నీకు దేని మీద ప్రేమ ఉంది ?"అని అడగ్గా ,అతడు ," నేనుసంరక్షించ వలసిన వారుఎవరూ లేరు ;నా కొక  గొర్రె ఉంది ; నేను ప్రేమించేది దాన్ని ఒక్క దాన్నే " అని బదులు చెప్పాడు . " అలా అయితే ,భగవంతుడు దాన్లో వెలసి ఉన్నాడని జ్ఞప్తిలో ఉంచుకొని ,ఆ జంతువును మనస్పూర్తిగా ఆదరించి దాన్ని సంరక్షిస్తూండు "అంటూ ఉపదేశించి ఆ ఆ మహనీయుడు వెళ్ళిపోయాడు . ఆ వ్యక్తి జాగరూకుడై ఆ జంతువులో భగవంతుడు వెలసి ఉన్నాడని సంపూర్ణంగా విశ్వసించి తన గొర్రెను ప్రేమాదరాలతో సంరక్షించి పెంచసాగాడు . చాలాకాలానికి ఆ సాధువు తిరిగి ఆ మార్గానవస్తూ తాను  ఉపదేశించిన వ్యక్తిని కనుగొని కుశల ప్రశ్న చేయగా ,ఆ సాధువుకు మొక్కి ,అతడు ఇలా అన్నాడు ;" గురూత్తమా ! తమ కృపతో క్షేమంగా ఉన్నాను . తమరు ఆనతి ఇచ్చిన మేరకు భావన చేస్తున్నందువల్ల నాకు గొప్ప మేలు కలిగింది . చతుర్భుజాలు గల ఒక అపురూపమూర్తిని నా గొర్రె యందు గాంచి పరమానంద భరితుడ నవుతున్నాను ."

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 30, 2013, 09:57:39 PM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు  గీత :

శ్లో ॥ 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

17. సత్యాగంత్యం బియ్యపు కడుగు లాటిది . మధ్యపానం వల్ల కలిగే మైకం కుడితిచే నివారింపబడేట్లు సంసారమోహ మనే సారాయిచే కలిగే మత్తు  సాధు  సాంగత్యం తో తొలగిపోతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on December 31, 2013, 10:38:43 PM
జై సాయి మాస్టర్ !
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 24. గురు మధ్యేస్ధితం విశ్వం విశ్వ మధ్యేస్ధితో గురు:।
              గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

18 . శ్రీ రామకృష్ణుడు సాధువులను సర్పాలతో పోల్చేవాడు . పాము తన కోసం బిలాన్ని తవ్వుకోదు ; కాని ఎలుక బొరియలో దూరుతుంది . ఆ విధంగానే సాధువు లేక ,సన్న్యాసి తన కోసం ఇల్లు కట్టుకోడు ; కాని అవసరమైనప్పుడు పరుల ఇళ్ళలో నివసిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 01, 2014, 09:31:38 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
              జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

19. న్యాయవాదిని చూసినప్పుడు వ్యాజ్యాలూ న్యాయస్దానాలూ ,వైద్యుణ్ణి చూసినప్పుడు రోగాలూ మందులూ స్పురించేటట్లే సాధు జనులు భక్తులు కనపడినప్పుడు భగవంతుడూ ఆముష్మికమూ జ్ఞప్తికి వస్తవి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 02, 2014, 10:09:11 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26. అత్రి నేత్రశ్శివ స్సాక్షాద్ధ్విబాహుశ్చహరి: స్మృతః ।
              యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు : కధితః ప్రియే ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                         సాధన :దీక్ష

1. సముద్రగర్భంలో లెక్కలేనన్ని రత్నాలున్నవి . ఒక్కసారి మునగగానే  రత్నం చేజిక్కని పక్షంలో రత్నాకరంలో  రత్నాలు లేవని నిర్ధారణ చేయకూడదు . ఏవో కొన్ని సాధనలు  చేయగానే నీకు భాగవత్సాక్షాకారం కాకపొతే ,అంతటితో నిరుత్సాహపడకు . దీక్షతో నీ సాధనలను సాగించు . నిస్సంశయంగా నీకు యుక్త కాలంలో భగవత్కృప  కలుగుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 03, 2014, 07:46:15 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనం ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ముత్యపు చిప్ప అద్భుతమైన స్వాతి వర్షపు చినుకు ఒకటి పట్టుపడే వరకు తన చిప్పలను విస్తారంగా తెరచికొని సముద్రం మీద తేలియాడు తూనే ఉంటుంది . అప్పుడది సముద్ర గర్భం వరకు మునిగి మళ్ళా పైకి రాదు . ఆ విధంగానే నిజమైన సాధకుడు తనకు గురూపదిష్టమైన అమూల్య మంత్రం లభ్యం కాగానే ఐహిక విషయాలను క్రీగంట  ఐనా చూడక అగాధమైన ధ్యాన సాగరంలో నిమగ్నుడవుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 04, 2014, 08:22:20 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. ధనికుడి దర్శనం చేయాలనుకొన్నవాడు ముందుగా ద్వారపాలకులను సుముఖులను చేసుకోవాలి . భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందాలంటే ముందుగా సాధుసాంగత్యం జపతపాలు మొదలైన సాధనలు  అలవరచుకోవాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 05, 2014, 10:39:34 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

4. కట్టెలు కొట్టేవాడు ఒకడు అడవి నుంచి తెచ్చిన వంట చెరకును అమ్ముకొంటూ అతి కష్టం మీద జీవిస్తూండేవాడు . ఒకరోజు సన్నని కట్టెల మోపును మోసుకొని పోతూ ఉండగా ,ఒక పురుషుడు ఎదురుపడి   ' ముందుకు సాగిపో  ' అని హితోపదేశం చేశాడు . మర్నాడు అలాగే అడవి మధ్యకు సాగిపోగా ,అక్కడ చెట్టు దట్టంగా పెరిగి ఉండటంతో ,తానూ మోయగాలిగినన్ని కట్టెలు కొట్టి ,వాటిని విక్రయించి మునుపటి కంటె అధిక లాభం గడించాడు . ఆ మర్నాడు అతడు 'నన్ను ముందుకు సాగిపొమ్మని ఆ పురుషుడు ఉపదేశించాడు కదా ,ఈ రోజు మరింత దూరం వెళ్లి చూస్తె ఏం  ' అనుకొంటూ అడవిలోకి మరింత దూరం పోగా ,ఒక చోట మంచి గంధపు చెట్లు దట్టంగా పెరిగి ఉండటం చూశాడు . తానూ మోయగలిగినన్ని  గంధపు చెక్కలను కొట్టుకొని పోయి ,వాటిని విక్రయించి ఎంతో దానం గడించాడు . తనకు ఎదురుపడ్డ పురుషుడి మాటలు తిరిగి స్మరించి ఆ ఆమరునాడు మునుపటి కంటె  ఎక్కువ దూరం అడవిలోకి వెళ్ళాడు . అతడి కొక రాగి గని కనిపించింది . అక్కడతో ఆగక ,నానాడు మున్ముందుకు సాగిపోగా వెండి గనులు ,బంగారు గనులు ,వజ్రాల గనులు కనిపించటంతో ఆ కట్టెలు కొట్టేవాడు చివరకు అమిత సంపన్నుడయ్యాడు . ఆధ్యాత్మిక మార్గం కూడ ఇట్టిదే ,ఏవో కొన్ని దివ్యదర్శనాలు గాని ,మానసిక శక్తులు గాని కనబడినంతనే తానూ సమస్తం సాధించాననుకోక సాధకుడు సదా ముందుకు సాగిపోవాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 06, 2014, 08:34:36 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 3. సర్వ తీర్ధావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
           గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

5. ఒక చెరువులో పెద్ద చేపలు సమృద్ధిగా ఉన్నవని తెలిసినప్పుడు జాలరి ఏం చెయ్యాలి ? ఆ చెరువులో మునుపు వలవేసి చేపలను పట్టిన బెస్తల వద్ద కెళ్ళి తనకు తెలియవచ్చిన సమాచారం నిజమా ? అలా అయితే అందుకు అత్యనుకూలమైన  ఎర ఏది ?-ఈ రకంగా వాకబు చేస్తూ కాలం గడిపినాడంటె ,అతగాడు ఎన్నటికీ చేపలను పట్టటానికి ప్రారంభమే చేయలేడు . అతడు చేయవలసిన పని ఏమిటంటె ,తిన్నగా చెరువుకు పోయి ,గాలాన్ని విసిరి ,ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి . అప్పుడు కాస్సేపటికి మత్స్యాలు ఎరను కొరుకుతవి . క్రమంగా పెద్ద చేప ఒకటి గాలానికి తగులుకొంటుంది . సాధన విషయం కూడ ఇలాటిదే . మహనీయులైన సాధువులా భగవద్భాక్తులా వచనాలలో శ్రద్ధ పూని ,భక్తి  అనే ఎరను వేసి ,ఓర్పు అనే దండ పాశాలను చేపట్టి సావధానులమై ఉండాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 07, 2014, 09:13:12 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4. అజ్ఞాన మూల  హరణం జన్మ కర్మ నివారకమ్ ।
           జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురౌ: పాదోదకం పిబేత్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )

6. ఒకానొక పురుషుడు శ్రీ రామక్రిష్ణులను  చూసి  " అయ్యా ,నేను చిరకాలం జపతపాలను అభ్యసించాను గాని ఎప్పటి మాదిరే నా కంతా అంధకారం గానే ఉంది . నావంటి వారికి ఇవి పనికి రావు  " అని పలికాడు . శ్రీ రామకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు :  "ఇలా చూడు ,వంశ పారపర్యంగా వచ్చిన రైతు పన్నెండేళ్ళు వరుసగా వాన కురవకున్నా పొలాన్ని దున్ని సాగు చేయటం మానడు . మొదటినుంచీ ఆ వృత్తి  చేయక విశేష లాభం పొందాలనే దురాశతో కృషి ఆరంభించినవాడు  వర్షం ఒకఏడు  కురవని పక్షంలో నిరుత్సాహపడతాడు . నిజమైన విశ్వాసం గల భక్తుడు తన యావజ్జీవం ధ్యానించి ఈశ్వరుణ్ణి కానక పోయినా భగవన్నామ గుణాను కీర్తనాన్ని ఎన్నటికీ విడువడు  "
 ఈత నేర్వటానికి ముందు నువ్వు నీళ్ళలో కొంతకాలం పాట్లు పడాలి . అలాగే సచ్చిదానంద సాగరంలో ఈద దలచావా ,ముందుగా అనేక పాట్లు పడాలి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 08, 2014, 08:48:35 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 5. కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం ।
           గురుర్విశ్వేశర స్సాక్షాత్తారకం  బ్రహ్మనిశ్చయః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                          భాగవత్పరితాపం

1. భగవంతుడి పట్ల మన ప్రేమ ఎంత గాడంగా  ఉండాలో తెలుసా ? లోకులకు ఐహిక విషయాల పట్ల ఉండే రాగం ,లోభికి తానూ కూడ బెట్టిన ధనం మీద ఉండే మక్కువ ,పతివ్రతకు భర్త మీద ఉండే ప్రేమా అనే ఈ రాగ త్రయం కలిసిన అనురాగం ఎంత ధృడంగా  ఉంటుందో అంత గాఢమైన భక్తి భగవంతుడిలో కుదిరితే ,నరుడు తప్పక నారాయణుణ్ణి  చూస్తాడు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !!
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 09, 2014, 09:20:05 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః ।
            రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ఒక తల్లికి నలుగురు పిల్లలున్నారు . ఆమె ఒక బిడ్డకు బొంగరం ,మరొక బిడ్డకు బొమ్మ ,వేరొక పిల్లకు మిఠాయి ఇస్తుంది . అప్పుడు బిడ్డ లందరూ తల్లిని మరచి ఆట బొమ్మల మీదనే దృష్టి నిలిపి ఉంటారు కాని ,వారిలో ఏ బిడ్డ తన ఆట వస్తువులను ఆవల పారవేసి ," అమ్మా ,అమ్మా " అంటూ తల్లి కోసం దొర్లి ఏడుస్తుందో వాడి వద్దకు తల్లి పరుగెత్తుకొని వచ్చి ఆ బిడ్డను లాలిస్తుంది . కాబట్టి ఓ మానవా ! నువ్వు మోహలోభాలలో మునిగి ఉన్నావు . వాటిని ఆవలకు తోసివేసి ఆనందమయి అయిన లోకమాత కోసం పరితపించగానే నీ వద్దకు ఆ తల్లి వచ్చి నిన్ను ఎత్తుకొని బుజ్జగిస్తుంది .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 10, 2014, 07:00:31 PM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగపతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
            దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. పుత్రసంతానం కలగలేదనో ,ఐశ్వర్యం లేదనో ఎందరో కన్నీరు కాలువలై పారేట్లు విలపిస్తారు . కాని ,ఆహా ! భగవంతుణ్ణి చూడ్డానికి గాని ,ఆయన్ను భక్తితో కొలవటానికి గాని ,తాను  నోచుకో లేకపోయానే అని ఒక్క చుక్క కన్నీరు విడిచేవాడెవ్వడు ?

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: BSudhakar on January 11, 2014, 09:53:53 AM
JAI SAI MASTER!
Guru kutumbam,Swamiji garlaku Guru Bandhula Saadara Pranaamamulu.

Great saying by the Paramahamsa.
It reminds me quote by Swamiji  - "Did you ever weep for not doing Paaraayana?"

Jai sai Master!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 11, 2014, 09:29:27 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 8. శరీరమింద్రియం  ప్రాణమర్ధస్వజన బాన్ధవాన్ ।
            ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. ఏసుక్రీస్తు ఒకరోజు సముద్రతీరంలో నడుస్తుంటే ,భక్తుడొకడు అతణ్ణి సమీపించి ," ప్రభూ ! భగవంతుణ్ణి పొందటం ఎలా ?" అని అడిగాడు . క్రీస్తు అతన్ని వెంటబెట్టుకొని తిన్నగా సముద్రంలోకి దిగి ,నీళ్ళలో అతణ్ణి అణచి పట్టు కున్నాడు . కాసేప్పటికి అతణ్ణి విడిచి లేవదీసి ," నీ కేలా ఉంది ?" అని అడిగాడు . " ప్రాణం పోతూన్నట్లు అనిపించింది , గిల గిల కొట్టుకున్నాను !" అని భక్తుడు బదులు చెప్పాడు . అప్పుడు ఏసు క్రీస్తు ఇలా చెప్పాడు : " నువ్విప్పుడు ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరై ఎలా పరితపించావో అంతగా ఆ తండ్రిని గురించి పరితపించితే ,నీకు ఆయన కనిపిస్తాడు ".

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 12, 2014, 06:36:16 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
            గురో: పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. డబ్బిమ్మని బిడ్డ తల్లిని బతిమాలుతుంది ; వేధిస్తుంది ; చివర కామె కొడుతుంది ; పోరుపెట్టి ఏడుస్తుంది . ఇలాటి బిడ్డలా ఏ మనిషి దివ్యమాత తనకు అత్యంత ఆప్తురాలని నమ్మి ఆ అమ్మకోసం తపించి విలపిస్తాడో అతడు ధన్యుడు . ఆ తరువాత ఒక నిమిషమైనా దివ్యమాత అతడికి మరుగుపడి ఉండలేదు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 13, 2014, 09:03:30 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 10 . గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవోమహేశ్వరః ।
               గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6 . జగన్మాతను చూడటానికై తాను పొందిన పరితాపాన్ని గురించి ముచ్చటిస్తూ శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు :" దక్షిణేశ్వరాలయంలో  సాయంకాలం భగవతీ పూజా సమయంలో తాళాలు ,గంటలు ,జేగంటలు మొదలైన వాద్యాలు ఏక స్వనంలో మోగటం వినగానే గంగాతీరానికి పరుగెత్తి భగవతి నుద్దేశించి ,'తల్లీ !మరొక రోజు గడిచి పోయింది ; కాని ఇప్పటికైనా అనుగ్రహించి నీ పుత్రుడికి సాక్షాత్కరించకున్నావు !' అని అరుస్తూండేవాణ్ణి ."

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 14, 2014, 06:53:43 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు  బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 11. అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్ ।
             తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

7 . దాహంతో నోరు ఎండిపోతున్నప్పుడు ఎవడైనా గంగాజలం కలిగి ఉందని తాగక మానేసి ,అప్పటి కప్పుడు మంచినీటి కోసం చెరువు తవ్వబోతాడా ? పరమార్ధ పిపాస లేనివాడు సర్వమతాలను ఖండిస్తూ ,వాటిని గురించి అనంతాలైన వాగ్వాదాలు చేస్తూ తిరుగుతూంటాడు , నిజమైన పిపాస (దాహం ) గల వ్యక్తికి  అంతటి మీమాంస చేయటానికి వ్యవధి ఉండదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 15, 2014, 07:26:31 PM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 12. స్ధావరం జంగమం వ్యాప్తం యేన చరాచరమ్ ।
              తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

                             భక్తి : భావం

1. లక్షలు విలువ చేసే రత్నాలు అంగడిలో దొరుకుతవి . కాని ఒక్క శ్రీ కృష్ణ భక్తి రత్నం లభించటం దుర్లభం కదా ! ( అంటె సంపన్నులు అనేకులు ఉండవచ్చును కాని భగవానుణ్ణి  భజించే భక్త వరులు అరుదని భావం .)

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 16, 2014, 07:12:31 PM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
              నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. సాధారణ అద్దంలో ప్రతిబింబం పడదు . కాని రసాయన పూత  ఉన్న ఛాయా చిత్ర ఫలకం మీద ప్రతిబింబం పడుతుంది . అలాగే భగవద్భక్తి పూతమైన హృదయంలో సర్వేశ్వరుడు ప్రతిఫలిస్తాడు . కాని పరిశుద్ధమైనదైనా భక్తి పూతం కాని పక్షంలో హృదయం భగవంతుణ్ణి ప్రతి బింబించ జాలదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 17, 2014, 08:35:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. ప్రేమ (భగవంతుడి పట్ల అనురక్తి )అంటే ఏమిటి ? మధురమైన హరినామం ఉచ్చరించి నంతనే బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరచి అంతేకాదు ,ప్రియతమమైన నిజ శరీరాన్ని మరచి -ఉండటం ప్రేమ (లేక ఈశ్వరానురక్తి ) అనబడుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 18, 2014, 07:47:15 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 15.సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
             సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. మొదట దైవభావం ; తదుపరి ప్రేమాతిశయం లేక భావావేశం ;చివరకు భావ సమాధి . మీ రెరిగినదే ,చూడండి : జనం అనేకులు కూడి భగవన్నామ సంకీర్తనం ప్రారంభించినప్పుడు మొట్ట మొదట వారు " మత్తగజము నా నిత్యానందుడు ...... " అనే కీర్తనలో పల్లవి నంతా పాడుతుంటారు . వారిలో ఒకరికి భావం కలిగినంతనే  'నిత్యానందుడు ' అనే పదాన్ని మాత్రమె ఉచ్చరించగలుగుతాడు . కాసేప్పటికి అతడి మనస్సు భావావేశం పొందగానే ఆ పదం కూడ పూర్తిగా పలకటానికి అతడికి అలవికాదు . చివరకు భావ సమాధిలో 'ని ; అనే మొదటి అక్షరాన్ని మాత్రమే పలుక గలుగుతాడు , ఇలా క్రమక్రమంగా ఏదీ పలుక లేక బాహ్య ప్రపంచాన్నే గుర్తించ లేకుంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 19, 2014, 09:25:50 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !!
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. కుటీరంలో ప్రవేశించిన ఏనుగు పునాదులు అదిరేటట్లు  కంపింప చేసి తదుపరి దాన్ని కూల్చేట్లు  భగవంతుడిలో గల నిర్భర ప్రేమ దుర్భలమైన మానవ శరీరమనే ఇంటిని కూల్చివేస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 20, 2014, 07:56:04 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ।
              యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6. ఉత్తమ భక్తుడు ఎలా భావిస్తాడో తెలుసా ? " దేవా ! నేను యంత్రాన్ని నువ్వు యంతవు ( యంత్రాన్ని నడిపించేవాడు ); నేను వాసస్ధానాన్ని ; నువ్వు నివాసివి ; నేను రధాన్ని ,నువ్వు సారధివి ; నువ్వెలా పలికిస్తే నేనలా పలుకుతాను ; నువ్వెలా ఆడిస్తేనేనలా  ఆడతాను . నన్ను ఏ రీతిలో వర్తింప చేస్తే నేనలా వర్తిస్తాను ."

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 21, 2014, 10:13:23 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18. ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

7. భగవత్ప్రేమను కలిగితే ,అదే మనిషి కర్మ కలాపాన్ని క్షీణింప చేస్తుంది . ఈశ్వరుడిలో అనురక్తి కలవాడు లౌకిక వ్యాపారాలలో ప్రీతి గొనలేడు . పటిక బెల్లపు పానకం ఒకసారి రుచి చూసినవాడు బెల్లపు నీటి కోసం ఆశపడడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 22, 2014, 07:38:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధవుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19 . యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
                సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

8 . సంధ్యావందనాది నిత్య నైమిత్తిక కర్మలు భగవంతుడి పట్ల భక్తి కుదరకుండేటంత వరకు మాత్రమే ఆవశ్యకాలు ;అంటె భగవన్నామ సంకీర్తన చెవిన పడగానే ఆనందాశ్రువులు ప్రవహింపకా ,భక్తి పారవశ్యంలో శరీరం గగుర్పొడనకా ఉండేటంత వరకే ఆ కర్మలు ఆవశ్యకాలు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 23, 2014, 09:29:47 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ।
              జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9. వీధి నాటకాలను చూశారు కదా ? వాటిలో మృదంగ తాళ వాద్యాల ధ్వనుల చెలరేగ ,పాటగాళ్ళు ,కంఠమెత్తి  బిగ్గరగా ," రావయ్యా ,నమో కృష్ణ ! ఇమ్ము దర్శనము .... " అని పాడేటంత వరకు అక్కడే ఉండీ , కృష్ణ వేషధారి వారి పలుకులను పట్టించుకోడు . పొగతాగుతూ  ,పక్కవారితో ప్రగల్భాలు కొడుతూ ,నెమ్మదిగా వేషం ధరించు కొంటుంటాడు . వారి రొద అణగి ,నారద మహర్షి మార్ధవమూ  మనోహరమూ ఐన కంఠ స్వరంతో , " శరణం తవచరణం భవ హరణం మమ గోవింద ...." అంటూ గానం ఆరంభించగానే శ్రీ కృష్ణుడు ఇక ఆలశ్యం చేయక వెంటనే రంగంలో ప్రత్యక్ష మవుతాడు .సాధకుడి  విషయం కూడ  ఇలాటిదే . " ప్రభూ ! అనుగ్రహించు , నాకు దర్శనం కలిగించు " అని అతడు అరుస్తూండేటంత వరకు ఈశ్వరుడు అతడికి దూరంలోనే ఉంటాడని గ్రహించండి . భగవంతుడు తనకు సాక్షాత్కరించే టప్పుడు  భక్తుడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు . ప్రేమ పూరిత హృదయుడై  భక్తుడు ప్రార్ధించగానే  భగవానుడు ఒక్క నిమిషమైనా నిజరూపం చూపటంలో జాప్యం చేయడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 24, 2014, 10:35:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 21. శోషణం భవ సింధోశ్చ దీపనం క్షరసంపదాం ।
              గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

10 . శ్రీ రాముడితో అహల్య ఇలా అంది : " ఓ రామచంద్రా ! నేను సూకర గర్భంలో జన్మించినా జన్మిస్తాను గాక ! నీ పాద పద్మాల పట్ల స్ధిరమైన భక్తి విశ్వాసాలు మాత్రం విడనాడ కుండేట్లు నన్ను కరుణించు ,మరే వరమూ నిన్ను కోరను . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 25, 2014, 07:44:06 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 22. మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
              మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                 ధ్యానం

1. సాత్త్విక స్వభావుడు ఎలాధ్యానిస్తాడో తెలుసా ? అతడు రాత్రివేళ తన పడక మీద కూర్చుని తెర మరుగున ధ్యానిస్తాడు . ఇంట్లోవాళ్ళు అతడు నిద్రపోతున్నాడని  భావిస్తారు . ఇలాటి వ్యక్తి తన భక్తిని ఎంత మాత్రం వెల్లడించ ఇష్టపడడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 26, 2014, 09:53:46 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే సముపస్ధితే ।
               గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. సాధకుడు ఒకానొకప్పుడు ధ్యాన మధ్యంలో యోగ నిద్ర పొందుతాడు . ఇలాటి సమయంలో సాధకులనేకులు  ఒక విధమైన దివ్య రూపాలను చూస్తుంటారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 27, 2014, 11:06:42 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 24. గురుమధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
              గురుర్విశ్వం  నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః !!

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. ధ్యానానికి కూర్చుని ఉన్నప్పుడు భగవంతుడిలో నువ్వు తన్మయత్వం పొందాలి . గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు మీద పక్షి వాలినా భక్తుడు గుర్తించకుంటాడు . కాళీదేవి ఆలయం లోని నాట్య మందిరంలో నేను ధ్యానానికి కూర్చునే వాణ్ణి . ఆ సమయంలో నా శరీరం మీద పిచ్చుకలు మొదలైన చిన్న పిట్టలు వాలి ఇటూ అటూ కదలాడేవని  చూపరులు చెప్పుకొనేవారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: BSudhakar on January 28, 2014, 09:46:28 AM
JAI SAI MASTER!

Guru Kutumambamunaku Guru Bandhula Pranaamamulu!

'Gurthinchaka untaadu' ani undalemo telupagalaru

JAI SAI MASTER!
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 28, 2014, 07:54:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25 . మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
              జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

                        సాధన : ఆహార నియమం
1. ఎవడు హవిష్యాన్నాన్నే ( పరమ సాత్త్విక ఆహారం ) తింటున్నా ఈశ్వర ప్రాప్తిని కోరుకోడో ,అతడికి ఆ హవిష్యాన్నం  సైతం గోమాంస మంతటి అనర్ధకమే అవుతుంది . ఇక ఎవడు గోమాంసాన్ని తింటున్నా బ్రహ్మ ప్రాప్తిని కాంక్షిస్తాడో  అతడికి గోమాంసమే  హవిష్యాన్న మంతటి మంచిదవుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 29, 2014, 09:07:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26 . అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ద్విబాహుశ్చ హరి : స్మృతః ।
               యో చతుర్వదనొ బ్రహ్మ శ్రీ గురు : కథితః ప్రియే ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. స్మరణీయుడైన విజయకృష్ణగోస్వామి అత్త  ఒక రోజు శ్రీ రామక్రిష్ణులను  దర్శించ వచ్చింది . శ్రీ రామకృష్ణులు ఆమెను చూసి ," మీరు న్యాయమార్గాన్ని అనుసరిస్తున్నారు . సంసారంలో ఉన్నా మీ అంతఃకరణాన్ని  ఈశ్వరుడికి అర్పించి నారు " అని పలుకగా ,ఆమె " అదెలా ? నా జ్ఞానం అభివృద్ధి అవుతూన్నట్లు నాకు తోచదు , నేనింకా పరుల ఉచ్చిష్టాన్ని తినలేకున్నాను " అని అన్నది . అప్పుడు శ్రీ రామకృష్ణులు  విమర్శన ధోరణిలో యిలా అన్నారు :" ఏమిటి ? పరుల ఎంగిలి తినటం మనకు పరమావధియా ? కుక్కా నక్కా ఎంగిళ్ళే  తింటున్నవి  కదా ! అందుకు ఫలితంగా వాటికి బ్రహ్మ జ్ఞానం అలవడుతోందా ?"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 30, 2014, 08:50:35 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

                             భగవత్కృప

1. గదిలో అనేక శతాబ్దాల నుంచి ఆవరించి ఉన్న చీకటి కూడ  అగ్గి పుల్ల వెలిగించగానే  మాయమవుతోంది . అలాగే అనేక జన్మాంతరాల నుంచి పెరుగుతూ వచ్చిన పాపరాశి  ఐనా  భగవంతుడి కటాక్ష వీక్షణం ఒక్కటి ప్రసరిస్తే చాలు ,నశిస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on January 31, 2014, 11:45:14 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
           సమస్త జగదాధార మూర్తయే బ్రాహ్మణే నమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. మలయమారుతం వీస్తున్నప్పుడు  చేవగల చెట్లన్నీ చందన వృక్షా లవుతవి . చేవలేని ( అరటి ,వెదురు మొదలైన ) చెట్లు మార్పు చెందక ఎప్పటి లాగానే ఉంటవి . ఆ విధంగానే ఈశ్వరానుగ్రహం లభించి నప్పుడు సౌజన్య పుణ్యాంకురాలు  గల పురుషులు శీఘ్రంగా మహాపురుషు లవుతారు . ఇక నిర్భాగ్యులైన విశయాసక్తులు  మాత్రం సులభంగా మార్పు చెందరు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 01, 2014, 11:08:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాపనివారకమ్ ।
           తారకం భవసింధోశ్చ  తమ గురుం ప్రణమామ్యహం ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. తల్లి తమవద్ద లేనంత వరకు బిడ్డలు బొమ్మలతో ఆటలాడు కొంటారు . వారి దృష్టంతా ఆటల మీదే ఉండటంతో భయ విచారాలనేవి  వారిని బాధించవు . ఐనా తల్లి లోపల అడుగిడగానే  తమ చేతనున్న ఆట బొమ్మలను అవతల పారేసి , " అమ్మా ,అమ్మా !" అంటూ ఆమె వద్దకు పరుగు పెడతారు . మీరూ ఇలా సంసారంలో ధన కీర్తి గౌరవాలనే బొమ్మలతో ఆటల్లో మరగి నిర్విచారంగా ఉన్నారు . ఐనా ఆనందమయి ఐన  జగజ్జనని సందర్శనం ఒక్కసారి క్షణకాలం మీకు సంప్రాప్తించిందా  ,ధన కీర్తి  గౌరవాలను లక్షించక ,యీ  ఆట బొమ్మలను అవతల పారేసి ఆమె వద్దకు పరుగెత్తుతారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 02, 2014, 10:57:06 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 3. సర్వతీర్ధావగాహస్య సంప్రాప్నోతి  ఫలం నరః ।
            గురో : పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

4. బూడిదలోను ,బురదలొను దొర్లి ఒళ్ళు మలినం చేసికోటం  బిడ్దల స్వభావం . ఐనా తల్లి తండ్రులు వారిని అలా అపరిశుద్ధంగా  ఉండనీరు . ఆ విధంగానే సంసార వ్యామోహాల నడుమ జీవిస్తూ ,మనిషి ఎంత మాలిన్యం పొందుతున్నా పరమేశ్వరుడు అతడి ఆత్మపరిశుద్ధికై సాధన సామాగ్రిని కల్పిస్తూనే ఉంటాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 03, 2014, 10:25:57 PM
జై సాయి మాస్టర్  !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4. అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారకమ్ ।
            జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం గురో : పాదోదకం పిబేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                   సిద్ధావస్ధ

1. పరుసవేదిని తాకి ఇనుము బంగారంగా మారిన పక్షంలో ,దాన్ని భూమిలో పాతిపెట్టినా  ,పెంటకుప్పలో  విసిరివేసినా అది బంగారంగానే ఉంటుంది . భగవత్సాక్షాత్కారం  పొందిన వ్యక్తి  స్ధితీ ఇలాటిదే . అతడు సంసార వ్యామోహాల నడుమ నున్నా ,అరణ్యంలో ఏకాంతంగా ఉన్నా అతడిని ఎలాటి మాలిన్యమూ అంటదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 04, 2014, 11:25:22 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురుర్విశ్వేశ్వర  స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. పరుసవేది స్పర్శచే బంగారు కత్తిగా మారిన ఉక్కు కత్తి బాహ్యాకారంలో   మునుపటిలా ఉన్నా , అది ఎవ్వరికీ హాని చేయజాలదు . అట్లాగే భగవత్పాదారవిందాలను  స్పృశించిన వ్యక్తి  బాహ్య రూపం మారకున్నా ,అతడెవరినీ  హింసించ జాలడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 05, 2014, 11:46:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6.గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః ।
          రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

3. " సిద్ధావస్ధ ఎలాటిది ?" అని ఒకరు శ్రీ రామక్రిష్ణులను అడుగగా ,ఆయన ఇలా అన్నారు : " పక్వం చేయబడిన బంగాళ దుంప కాని ,వంకాయ కాని మెత్త బడేట్లు,  జ్ఞానంచే  సిద్ధుడూ  మెత్తని మనస్కు డవుతాడు . అతడి అహంకారం పూర్తిగా పోతుంది ."

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 06, 2014, 09:34:49 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7.కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
           దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥ 

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

 4.శ్రీ రామకృష్ణుడు తన శరీరాన్ని చూసి ఇలా అంటూండేవారు  :" ఇది కేవలం ఒర లాటిది . ఆనందమయి అయిన జగజ్జనని దీన్లో ఉంటూ తన లీలలను జరుపుతోంది ."

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 07, 2014, 10:24:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :
 8.    శరీర మింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ ।
        ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5.రామప్రసాదుడి కీర్తనలు ఎప్పుడూ సరి కొత్తగానే ఉంటవి . ఎందుకో తెలుసా ? వాటిని అతడు రచించినప్పుడు జగన్మాత అతడి హృదయంలో నెలకొని ఉండినది .
 
  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 08, 2014, 11:40:00 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 9 . గురురేకో  జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
             గురో: పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6. సిద్ధావస్ధ  లోకంలో అనేక విధాలుగా లభిస్తుంది . స్వప్నసిద్ధులు , మంత్రసిద్ధులు ,హఠాత్సిద్ధులు అని నానా రకాలుగా సిద్ధులు (ముక్తులు ) వెలస్తున్నారు .
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 09, 2014, 09:00:29 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 10.గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
             గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

 7.( ఇష్టదైవాన్ని గురించిన ) మంత్రాన్ని స్వప్నంలో ఉపదేశం పొంది దాన్ని జపించటం  చేత సిద్దులైనవారు స్వప్నసిద్ధు లనబడతారు . యోగ్యుడు ,సమర్ధుడు ఐన గురువు వల్ల మంత్రోపదేశం పొంది గుర్వాజ్ఞ ప్రకారం జపాది సాధనలు  అవలంబించి సిద్దులైన వారు మంత్రసిద్ధులు . ఒకానొక మహాపురుషుడి అనుగ్రహంతో ఆకస్మికంగా సిద్ధి పొందినవారు హఠాత్సిద్ధులు . పుట్టుకతోనే సిద్దులైనవారు నిత్య సిద్ధులు . వీరు గుమ్మడి తీగ వంటివారు . ఎలాగంటే గుమ్మడి ముందే పిందెలు పెట్టి తరువాత పువ్వులు పూస్తుంది .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 10, 2014, 10:01:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత:
శ్లో ॥ 11.అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్ ।
            తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥
గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
 8.  వంతెనకింద నిరాఘాటంగా నీరు పారుతూంటుంది ,కాని అక్కడ నీరు మురుగదు . అలాగే `ముక్తపురుషుల ` చేతులనుంచి ధనం నిరాకాటంగా బయటకి పోతుంటుంది . వారు ఎన్నడూ ధనం నిల్వచేయరు . ఇలాటివారి వద్ద విషయబుద్ధి -కించిత్తూ ఉండదు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 11, 2014, 09:16:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 12 . స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
               తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9 .  ' ధ్యానసిద్ధుడికి మోక్షం కరతలామలకం  ' అనే సామెత ఒకటి ఉంది . ధ్యానానికి కూర్చోగానే భగవంతుడిలో తన్మయత్వం పొందేట్టివాడు  ' ధ్యానసిద్ధు ' డని పేర్కోబడతాడు .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![14/size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 12, 2014, 09:34:48 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
             నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

10. ముక్తుడు సంసారంలో ఎలా వర్తిస్తాడో తెలుసా ? అతడు నీట మునిగే (ప్లవమనే ) పిట్ట మాదిరి వర్తిస్తాడు . అది నీటిలో మునిగినా దాని ఈకలు తడిసిపోవు . ఒకవేళ దాని శరీరంలో ఏ నీటి కణాలయినా  అంటుకొన్నా  ,రెక్కలను విదల్చగానే  అవి జలజల రాలిపోతవి .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 14, 2014, 12:21:46 AM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 14.  చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

11. ఓడ ఏ దిశలో పోతున్నా దాన్లోని దిక్సూచీ యంత్రంలోని అయస్కాంత సూది ఉత్తరదిశనే సూచిస్తూంటుంది . అందుచేత ఓడ తన మార్గాన్ని తప్పిపోదు . ఇలాగే మనిషి ఎప్పుడూ మనసును దైవం వంకకు తిప్పి సంచరిస్తూన్నాడా , అతడికి ఎలాటి భయమూ కలుగదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 14, 2014, 10:19:08 PM
[size=14]జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 15. సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
              సంసారమోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

12. చెకుముకిరాయి శతాబ్దాల పర్యంతం నీటిలో పడిఉన్నా , దాని గుణం ఎన్నటికీ కోల్పోదు . నీటి నుంచి పైకితీసి ఉక్కు ముక్కతో కొట్టగానే  అగ్ని కణం రాలుతుంది . ఇట్లే నిజమైన భక్తుడు ఎన్ని సంసార మొహాల నడుమ మెలగినా ,అతడి భక్తి విశ్వాసాలు సడలవు , కొరవడవు . భగవన్నామం వినగానే ఆతడు భక్త్యావేశంతో  ఒడలు మరచి పోతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !! [/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 15, 2014, 08:34:52 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
             యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

 13.  ' యద్భావం తద్భవతి ' --ఎవరికి ఎలాటి భావం అలవడుతుందో  అతడికి అలాటి సిద్ధీ కలుగుతుంది . భ్రమరాన్ని గురించి తదేకంగా చింతించటం వల్ల  బొద్దింక తానే ఆ భ్రమరంగా  పరిణమిస్తుందని చెబుతారు . ఇలాగే బ్రహ్మానందాన్ని గురించి సదా ధ్యానించే పురుషుడు తానే  బ్రహ్మానందమయు డవుతున్నాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 16, 2014, 08:40:43 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 17. యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ।
              యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

14. ముదిరిన మామిడికాయ ముగ్గి దానంతట అదే రాలేట్లు సాధకుడికి బ్రహ్మజ్ఞానం కలిగినంతనే కర్మబంధాలన్నీ తమంతట తామే సడలిపోతవి . స్వజాతి మతధర్మాలను బలాత్కారంగా వీడటం తగదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 17, 2014, 10:21:18 PM
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 18. ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా।
              జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

15 . ముక్తులు సంసారంలో ఎలా వర్తిస్తారొ తెలుసా ? అహంకారంగాని ,ప్రత్యేకమైన కోర్కెగాని లేకుండా ,గాలి ఏవైపుకు వీస్తున్నా ,ఆ వైపుకు ఎగిరే ఎండుటాకుల్లా ఉంటారు . అవి ఒకప్పుడు పెంటకుప్ప మీదా ,ఇంకొకప్పుడు పరిశుద్ధమైన స్ధలంలో పడతవి . ముక్తుల విషయమూ ఇలాటిదే .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 18, 2014, 09:54:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 19. యస్య జ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
              సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

16. శ్రీ రామకృష్ణులు ఇలా అంటూండేవారు : " 1. గురువు , 2. కర్త , 3. బాబా ( తండ్రి ) అనే ఈ మూడు పలుకులూ నా హృదయంలో ములుకులు మాదిరి సొకుతవి . నేను కర్తను కాను . భగవంతుడే కర్త . నేను యంత్రాన్ని ; భగవంతుడు యంత్రాన్ని నడిపించేట్టి వాడు ( యంత )"

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 19, 2014, 07:37:12 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 20. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
              జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

17. ఉడుకబెట్టని వరిగింజ మొలుస్తుంది ; ఉడుకబెట్టింది  మొలకెత్తదు . అలాగే పరిపక్వదశను పొందిన సిద్ధుడు ప్రపంచంలో మళ్ళా జన్మ నెత్త నక్కరలేదు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 20, 2014, 07:52:13 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత:

శ్లో ॥ 21.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
              జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

18. ఏ స్ధితిని పొంది మనిషి పరమహంస అనిపించుకొంటాడు ? హంస నీరు కలసిన పాలనుంచి నీటిని వర్జించి పాలను మాత్రమె తాగుతుంది . అలాగే పరమహంస అనిత్యమైన మాయా ప్రపంచాన్ని విసర్జించి నిత్యమైన బ్రహ్మాన్ని గ్రహిస్తాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 21, 2014, 10:46:33 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 22. మన్నాధః శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు : ।
               మమ్మాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

19. ముందు అజ్ఞానం ; తరువాత జ్ఞానం . మానవుడికి ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు అతడు జ్ఞానాజ్ఞానాలను  రెంటిని అతిక్రమించే ఉంటాడు . ఒక దృష్టాంతం ; నీ పాదంలో వాడియైన ముళ్ళు గుచ్చు కొంటే దాన్ని తీసివేయటానికి నీకు మరో ముల్లు  కావాలి . మొదటి ముల్లును ఊడ తీసిన పిదప రెండిటినీ పారేస్తావు కదా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 22, 2014, 11:41:38 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23. ఏక ఏవ పరోబన్ధుర్విషమే  సముపస్ధితే ।
             గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

20. సిద్ధావస్ధ పొందిన వ్యక్తి ,అంటె పరమేశ్వర సందర్శనం పొందిన వ్యక్తి ,దుష్కార్యం ఏదీ చేయజాలడు . ఆరితేరిన నర్తకుడు ఎన్నడూ తప్పుటడుగు వేయడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 23, 2014, 08:48:02 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 24. గురు మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
              గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

21. దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు సమాధి స్ధితి నుండి తిరిగి బాహ్య ప్రజ్ఞకు వస్తూన్నప్పుడు ఋషులు అతణ్ణి  ," నీ కిప్పుడు ఎలా ఉంది ? అని అడిగారు . కచుడు ఇలా అన్నాడు : " సర్వం బ్రహ్మమయమ్ -ప్రతి వస్తువు లోను భగవంతుడు అంతర్యామిగా ఉన్నట్లు తోచుతోంది . భగవంతుడు తప్ప అన్య్వస్తువు వేదీ  నాకు కనబటటం లేదు . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 24, 2014, 09:35:54 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
              జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం  వ్రజేత్ ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                                సర్వమతసామరస్యం

1. వాయుదీపాల ( గ్లాస్ లైట్ల ) వెలుతురు  పట్టణంలోని  ఆయా స్ధలాలలో  వేర్వేరుగా ప్రకాశిస్తూంటుంది . అయినా ఆ దీపాలకు ఆధారమైన వాయువు ఒకే యంత్రం నుంచి వస్తోంది . అదే విధంగా సమస్త దేశాలలోనూ జాతులలోనూ గల ఆచార్యులందరూ  ఒకే పరబ్రహ్మం వల్ల  దివ్య ప్రభావాన్ని జ్ఞానాన్ని పొందుతున్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 25, 2014, 09:12:41 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 26.  అత్రినేత్రశ్శివ సాక్షాద్ధ్విబాహుశ్చ హరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ఒకడు మేడమీదకి నిచ్చెనతోనో ,వెదురుసాయంతోనో ,మెట్లగుండానో ,తాటితోనో , ఎగబాకియో పోవచ్చు . అలాగే భగవంతుణ్ణి  చేరటానికి అనేకాలైన సాధనాలూ మార్గాలూ ఉన్నవి . లోకం లోని ప్రతి మతమూ అలాటి మార్గాలలో ఒకదాన్ని చూపుతుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 26, 2014, 10:04:46 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 27.  దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురుపదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వేతిరేకణః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణఉపదేశరత్నాలు )

3. భగవంతుడు ఒక్కడే ఐనా అతడికి అనేక నామాలున్నాయి . అతణ్ణి గురించి భావించదగిన రూపాలూ అనంతాలుగా  ఉన్నవి . ఏ నామంతో భగవంతుణ్ణి  స్మరించినా ,ఏ రూపంలో ఉపాసించినా తప్పక నువ్వు అతడి సాక్షాత్కారాన్ని పొందగలవు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 27, 2014, 09:05:40 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 1. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
           సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥

 గురూపదేశములు ( శ్రీ రామకృష్ణ ఉపదేశరత్నాలు )

4. ఏ రూపంలో గాని ,ఏ నామంలో గాని ,ఏ  మార్గంలో గాని ,సచ్చిదానంద స్వరూపుడు ఒక్కడే అనే నమ్మికతో ఎవడు భగవంతుణ్ణి  ఆరాధించినా అతడు నిస్సంశయంగా భగవంతుణ్ణి  పొందుతాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on February 28, 2014, 08:35:55 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
          తారకం భవసింధోశ్చ  తం గురుం ప్రణమామ్యహమ్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

5. వేర్వేరు మత సంప్రదాయాలు భగవంతుణ్ణి చేరటానికి అనువైన వేర్వేరు మార్గాలు ; అంతే . ఈ కాళికాలయానికి  అనేక మార్గాలున్నవి . కొందరు ఇక్కడకు పడవల మీదా ,కొందరు బండ్ల మీదా , మరికొందరు నడచీ వస్తారు . ఆ విధంగానే వేర్వేరు మతాల ననుసరించి  భగవంతుణ్ణి  దర్శిస్తారు .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 01, 2014, 08:26:18 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥3 . సర్వతీర్ధావగాహస్య  సంప్రాప్నోతి  ఫలం నరః ।
            గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

6. తల్లి పిల్లలందరినీ సమానంగానే ఆదరిస్తుంది . ఐనా ఎవరెవరికి ఏదేది హితమో ,వారి వారి కా ఆహారాన్నే తయారు చేసి పెడుతుంది . అలాగే భగవంతుడు వారి వారి శక్తి సామర్ధ్యాల మేరకు వారి వారి ఆత్మ వికాసానికి అనుకూలించేట్లు వేర్వేరు మార్గాలను జనానికి అనుగ్రహించి ఉన్నాడు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 02, 2014, 08:46:32 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 4. అజ్ఞాన మూల హరణం జన్మకర్మ నివారకమ్ ।
           జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

7 . " భగవంతుడు ఒక్కడే కదా , ' వేర్వేరు మత సంప్రదాయాలతో యింత  వైషమ్యం ఉండటానికి కారణం ఏమిటి ?" అని కేశవచంద్రసేన్ శ్రీ రామక్రిష్ణులను అడిగాడు . అందుకు శ్రీరామకృష్ణులు ఇలా సమాధానం చెప్పారు : " ప్రతివాడూ ' ఇది నా భూమి ,ఇది నా ఇల్లు ' అంటూ ,అవి తమ సొత్తని పంపకం చేసికోవచ్చు . కాని ఎవడూ పైనున్న ఆకాశాన్ని పంచుకోలేడు . అలాగే సామాన్య మానవుడు అజ్ఞానంతో , ' నా మతం మాత్రం సత్యమైనది ; నా మతమే శ్రేష్ఠ మైన ' దని వాదులాడుతూంటాడు . కాని అతడికి జ్ఞానోదయం అవగానే స్వమతాభిమానంతో కూడిన యీ కోలాహలమంతా సద్దు మణుగు తుంది . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 03, 2014, 10:22:08 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥5. కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం ।
           గురుర్విశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

8. ప్రశ్న : హిందువులలో అనేక శాఖా సంప్రదాయాలున్నాయి కదా ? వాటిలో ఏ శాఖను ,సంప్రదాయాన్ని మనం అనుసరించాలి ?

జవాబు : పార్వతి పరమేశ్వరుణ్ణి ఒకసారి ," నాథా ! బ్రహ్మానందం పొందటానికి కీలకం ఏది ?" అని అడగ్గా ,పరమేశ్వరుడు ఇలా వచించాడు : " దృఢ విశ్వాసమే .  మత సంప్రదాయాల్లో ఏమీ విశేషం లేదు " ప్రతివారూ తమ మతాన్ని అనుసరించి శ్రద్ధతో సాధన చేస్తారు గాక !

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 04, 2014, 07:14:38 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 6. గుకారః ప్రధమో వర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

9 . మతాలలోకల్లా తమ మతమే శ్రేష్ఠమైనదని వాదులాడుతూ  ,పరాయి మతాలను దూషిస్తూ ,శాఖలను ఏర్పరచు కొనేవారు సంకుచిత బుద్ధులు . ఎవరి హృదయం భగవంతుడి కోసం పరితపిస్తూంటుందో  అలాటి వ్యక్తి  శాఖాభిమానాన్ని వివాదాలను విడిచి ,పారమార్ధిక సాధన లలో తన కాలాన్ని వినియోగిస్తాడు . శాఖోపశాఖలతో కూడుకొన్న నాచు మొక్కలు నదీ ప్రవాహంలో పెరుగవు .కాని చెరువులలోను ,చిన్న గుంటలలోను  ,మురికి నీటిలోను పెరుగుతవి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 05, 2014, 08:22:31 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 7. కర్మణా మనసావాచా సర్వదారాధయేద్గురుమ్ ।
            దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణులఉపదేశరత్నాలు )

10. ఒక పెద్ద చేపను కుటుంబ సభ్యుల వేర్వేరు రుచుల మేరకు ( కూరగా , పులుసుగా ,తదితరులుగా ) వేర్వేరుగా వండుతారు . భగవంతుడు ఒక్కడే ఐనా భక్తులు వారి వారి అభిరుచుల ప్రకారం నానావిధాలుగా ఉపాసిస్తారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 06, 2014, 08:18:27 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 8 . శరీరమింద్రియం ప్రాణమర్ధస్వజనబాన్ధవాన్ ।
            ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

11. పరమాత్మ ఒక్కడే ; ఉపాసనా మార్గాలు మాత్రం వేర్వేరుగా ఉన్నవి . ఇందుకొక దృష్టాంతం చూడండి . ఒకే పదార్ధమైన నీరు వేర్వేరు కాలాలలో వేర్వేరు దేశాలలో జనుల చేత వేర్వేరు పేర్లతో వ్యవహరించ బడుతోంది . వంగ భాషలో జల్ అనీ , హిందీ లో పానీ అనీ ,ఆంగ్లంలో వాటర్ అనీ వాడబడుతోంది . ఒకరి భాష ,మరొకరికి తెలియక పోవటంతో జనులు ఒకరి భావాన్ని ఒకరు తెలుసుకోలేకున్నారు . తెలిసిన నాడు ఎలాటి దురభిప్రాయమూ కలగటానికి అవకాశం లేదు .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 07, 2014, 08:46:04 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥9. గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుం ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

12. భగవంతుణ్ణి ఎలా ధ్యానించినా ,భగవన్నామాలను ఎలా కీర్తించినా నీకు ఆత్మవికాసం కలుగుతుంది . పంచదారతో చేయబడిన అప్పాన్ని తినేటప్పుడు దాన్ని నిబ్బరంగా పట్టుకొన్నా ,వంచి పట్టుకొన్నా అది మధురంగానే ఉంటుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !![/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 08, 2014, 08:20:44 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత :
శ్లో ॥10. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
             గురుస్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ॥
గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                               కర్మఫలం
1. పాపమూ పాదరసమూ ఎన్నడూ మరుగున ఉండలేవు . రసమిశ్రితమైన ఔషధాన్ని ఎంత రహస్యంగా వాడినా ఎప్పుడో ఒకప్పుడు శరీరం మీద బొబ్బలు ఎత్తక మానవు . అలాగే చేసిన పాపానికి ఫలం ఎన్నటికైనా అనుభవించక తప్పదు .
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 09, 2014, 09:45:59 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥11. అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్ ।
          తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. పట్టుపురుగు తన చొంగలో తానే మూసుకొని పోతుంది . అట్లే ఐహిక జీవి తన కర్మపాశాలలో తానే చిక్కుకొంటున్నాడు . కాని ఆ పట్టు పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెందినప్పుడు పట్టు గూటిని విదిలించు కొని స్వేచ్చగా సంచరిస్తుంది .   అదే విధంగా లౌకికుడూ  వివేక వైరాగ్యా లనే  రెక్కలను పెంచు కోటంతో  కర్మ బంధం నుంచి విముక్తుడవుతాడు .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 10, 2014, 09:25:26 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥12.స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
           తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

                         యుగధర్మం

1. శ్రీ రామకృష్ణులు తరచూ ఇలా అంటూండేవారు : " ఉదయ సాయంకాలాల్లో చేతులతో తాళం వేస్తూ ఎలుగెత్తి హరినామ సంకీర్తనం చేయండి . మీ పాపాలు తాపాలూ అన్నీ మిమ్మల్ని విడిచి వేస్తాయి . చెట్టు కింద నిలబడి చప్పట్లు చరచినప్పుడు చెట్టు మీది పక్షులు ఎగిరి పోతవి . చేతులు తట్టుతూ హరినామ సంకీర్తనం చేశారా ,మీ శరీర మనే వృక్షం నుంచి అవిద్యా రూపమైన దురాలోచనలనే పక్షులు ఎగిరిపోతవి . "

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 11, 2014, 10:54:43 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥13. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం ।
            నాదబిందు కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ఎరిగి కాని ,ఎరుగక కాని ,స్పురణతో కాని ,స్పురణ లేక కాని -ఏ స్దితిలోనైనా భగవన్నామం ఉచ్చరిస్తే దాని వల్ల  తప్పక సత్ఫలితం కలుగుతుంది . బుద్ధి పూర్వకంగా ఏటికి పోయి స్నానం చేసిన వ్యక్తికీ స్నాన లాభం కలుగుతుంది . మరొకరిచేత నీట తోయబడ్డ వ్యక్తికీ స్నాన ఫలం కలుగుతుంది . అంతే గాక గాఢ నిద్ర పోతూంటే ఎవరైనా మీద నీళ్ళు పోసినా స్నానం ప్రాప్తిస్తుంది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 12, 2014, 07:43:03 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం

శ్రీ గురు గీత :

శ్లో ॥14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
            అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశ రత్నాలు )

3. అమృతకుండంలో ఏ రీతిలో పడినా మనిషి అమరత్వం పొందుతాడు . ( అంటే మరణం లేని వాడవుతాడు ). ఎన్నో సాధనలు చేసి దాన్లో పడినా అమరుడవుతాడు . అలాగే దాన్లో తోయబడిన వ్యక్తీ అమృత తత్వాన్ని పొందుతాడు . తెలిసి ఐనా భగవన్నామాన్ని ఉచ్చరించారంటే ,దానికి తగిన పుణ్య ఫలం పొందుతారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 13, 2014, 08:46:14 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥15. సపితా సచమే మాతాసబంధుస్సచ దేవతా ।
            సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

4. ఈ కలియుగంలో నారదీయ భక్తి విధ్యుక్తం ; ఇదే ప్రశస్తం . ఇతర యుగాలకు తీవ్ర తపస్సులూ ,యోగసాధనలూ నియమింప బడినవి . ఈ యుగంలో వాటిని జయప్రదంగా అనుష్టించటం దుస్సాధ్యం . శరీరాన్ని బలహీనపరచే ' మలేరియా ' జ్వరం మాట అలా ఉంచితే ,ఇప్పుడు మానవుల ఆయు: ప్రమాణం స్వల్పం . ఇలాటి స్ధితిలో  కఠిన సాధనలు  జనులు ఎలా అవలంబిస్తారు ?
.
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 14, 2014, 07:36:47 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో ॥ 16. యత్సత్వేన జగత్స్యం యత్ప్రకాశేన భాతియత్ ।
            యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥
 
గురూపదేశములు (శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )
                   ధర్మ ప్రచారం

 1. మహనీయుడైన ఆచార్యుడు స్ధానికంగా తన బంధు వర్గం చేత గౌరవం పొందక పరదేశాల్లో కీర్తి గౌరవాలను పొందటానికి కారణం ఏమిటి ? గారడివాడి విద్యను చూడటానికి అతడి బంధు జనం వచ్చి చుట్టూ మూగరు . కాని ఎక్కడో దూరంలో నివసించే పరాయి జనం వచ్చి అతడి ఐంద్ర జాలాన్ని చూసి నోరు వెళ్ళ బెట్టుకొని అబ్బుర పడుతూంటారు .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
[/14size]
Title: Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
Post by: Gurupriya on March 15, 2014, 09:54:25 PM
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం

శ్రీ గురు గీత :

శ్లో ॥17.యస్మిన్ స్ధితమిదం సర్వం భాతియద్భానరూపతః ।
           యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ।।

గురూపదేశములు ( శ్రీ రామకృష్ణుల ఉపదేశరత్నాలు )

2. ముళ్ళ చెట్టు విత్తనాలు తిన్నగా చెĶ