Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 138857 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్
,గోరఖ్ పూర్   

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య
నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసమ్మూఢో
బ్రహ్మవిద్బ్రహ్మణి  స్థితః | 20 |

ప్రియలాభములకు పొంగిపోనివాడును ,అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోనివాడును ,స్థిరమైన బుద్ధిగలవాడును ,మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానందఘనపరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావస్థితి యందుండును . ( 20 )

బాహ్యస్పర్శేష్వ సకాత్మా
విన్దత్యాత్మని యత్సుఖమ్ |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే | 21 |

ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతః కరణముగల సాధకుడు ఆత్మస్థితాధ్యానజనితమైన సాత్త్వికాత్మానందమును పొందును . పిదప అతడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగము నందు అభిన్నభావస్థితుడై అక్షయానందమును అనుభవించును .   ( 21 ) 
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

యే హి  సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యంతవంతః  కౌంతేయ
న తేషు రమతే బుధః | 22 |

విషయేంద్రియ సంయోగమువలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగాలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే . ఆద్యంతములుగలవి . అనగా అనిత్యములు . కావున ఓ అర్జునా ! వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు . ( 22 )   

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 
 యోఅంతః సుఖో అంతరారామః
తథాంతర్జ్యోతిరేవ  యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతోఅధిగచ్ఛతి ||

( సమిష్టి ) అంతరాత్మయందే సుఖించువాడును ,ఆత్మయందే రమించువాడును ,ఆత్మజ్ఞానియైనవాడును అగు సాంఖ్యయోగి ,సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై ,బ్రహ్మ నిర్వాణమును పొందును .  ( 24 )

లభంతే బ్రహ్మనిర్వాణమ్
ఋషయః  క్షీణకల్మషాః |
చ్ఛిన్నద్వైధా  యతాత్మానః
సర్వభూతహితే రతాః | 25 |

పాపరహితులును ,జ్ఞానప్రభావమున సమస్త సంశయములనివృత్తిని సాధించినవారును ,సర్వప్రాణుల హితమును గోరువారును ,నిశ్చలస్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నముచేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిర్వాణమును పొందుదురు . ( 25 ) 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 
 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్  .

 కామక్రోధావియుక్తానాం
యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనామ్  | 26 |

కామక్రోధరహితులును ,చిత్తవృత్తులను జయించిన వారును అయి ,పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాన్తాపరబ్రహ్మ పరమాత్మయే గోచరించును . (26 )

స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్
చక్షుశ్చైవాంతరే   భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యంతరచారిణౌ  | 27 | 

యంతేన్ద్రియమనోబుద్ధిః
మునిర్మోక్షపరాయణః  |
విగతేచ్ఛాభయక్రోధో
యః సదా ముక్త ఏవ  సః | 28 |

బాహ్యవిషయ భోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను . దృష్టిని భ్రూమధ్యమునందు  స్థిరముగా ఉంచవలెను . నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపానవాయువులను సమస్థితిలో నడుపవలెను .
ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు ,బుద్ధి ,ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును . ఇట్టి సాధనవలన మోక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధ రహితుడై సదా ముక్తుడగును . ( 27-28 )


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

భోక్తారం యఙ్ఞతపసాం
సర్వలోకమహేశ్వరమ్  |
సుహృదం  సర్వభూతానాం
జ్ఞాత్వా మాం  శాంతిమృచ్ఛతి  | 29 |

భగవంతుడు యజ్ఞములకును ,తపస్సులకును భోక్త . సమస్తలోకములకును లోకేశ్వరులకును అధిపతి . సమస్తాప్రాణులకును ఆత్మీయుడు . అనగా అవ్యాజ దయాళువు . పరమప్రేమస్వరూపుడు . ఈ భగవత్తత్వమును ఎఱిగిన భక్తునకు పరమ శాంతి లభించును .  ( 29 )

            ఓం తత్సదితి  శ్రీ మద్భాగవద్గీతాసూపనిషత్సు
       బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే
        కర్మ సంన్యాసయోగో నామ పంచమోధ్యాయః  || 5 ||


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 

                            || ఓం శ్రీ పరమాత్మనే నమః ||
                           అథ షస్థోధ్యాయః
                            ఆత్మసంయమయోగః

                           శ్రీ భగవాన్ ఉవాచ

అనాశ్రితః కర్మఫలం
కార్యం కర్మ కరోతి యః |
స సన్న్యాసీ  చ యోగీ చ
న నిరగ్నిర్న  చాక్రియః  | 1 |
 
శ్రీ భగవానుడు పలికెను - కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి , నిజమైన యోగి ,కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్న్యాసియు  కాడు . అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియుకాడు .  ( 1 )

యం  సన్న్యాసమితి ప్రాహుః
యోగం తం విద్ధి పాండవ |
న  హ్యసన్న్యస్తసంకల్పో
యోగీ భవతి కశ్చన | 2 |

ఓ అర్జునా ! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము . ఏలనన సంకల్ప త్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు . ( 2 )
 
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!!  
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

ఆరురుక్షోర్మునిర్యోగం
కర్మ  కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ
శమః  కారణముచ్యతే |3|

యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును . యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము . (3 )

యదా హి నేంద్రియార్ధేషు
న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ
యోగారూఢస్త దోచ్యతే | 4 |

ఇంద్రియభోగములయందును ,కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూ ఢుడని చెప్పబడును . ( 4 )
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 
  ఉద్ధరేదాత్మానం
నాత్మానమవసాదయేత్   |
ఆత్మైవ  హ్యాత్మనో  బంధుః
ఆత్మైవ రిపురాత్మనః  | 5 |

మనుజులు ఈ సంసార సాగరమునుండి తమను తామే ఉద్ధరించు కొనవలెను . తమకు తామే అధోగతి పాలు కారాదు . ఏలనన లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు ,తమకు తామే శత్రువులు . ( 5 )

బంధు రాత్మాత్మనస్తస్య
యేనాత్మైవాత్మనా   జితః
 అనాత్మనస్తు  శత్రుత్వే
వార్తేతాత్మైవ  శత్రువత్   | 6 |

మనస్సును ,ఇంద్రియములను  ,శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు . అట్లు జయిం పనివాడు తనకు తానే  శత్రువు . అనగా జితేంద్రియునకు మనస్సు ,ఇంద్రియములు ,శరీరము భగవత్ప్రాతిసిద్ధికై మిత్రునివలె సహకరించును . అట్లుగాక జితేంద్రియునకు మనస్సు ,ఇంద్రియములు ,శరీరము భగవదప్రాప్తి సిద్ధికై మిత్రునివలె సహకరించును . అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు ,ఇంద్రియములు ,శరీరము శత్రులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధక ములుగా నిలుచును . ( 6 )


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

 జితాత్మనః ప్రశాంతస్య
పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు
తథామానావమానయోః   | 7 |

శీతోష్ణములు ,సుఖదుఃఖములు ,మానావమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతః కారణవృత్తులు నిశ్చలముగా ( చలింపక ) ఉండి ,స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘనపరమాత్మ చక్కగా స్థితుడైయుండును . అనగా పరమాత్మ చక్కగా స్థితుడైయుండును . అనగా పరమాత్మతప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు . ( 7 )

జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా
కూటస్థో  విజితేంద్రియః  |
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాంచనః  | 8 |

పరమాత్మ ప్రాప్తినందిన యోగియొక్క అంతః కరణమునందు  జ్ఞానవిజ్ఞానములు నిండియుండును . అతడు వికారరహితుడు ,ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు . అతడు మట్టిని ,రాతిని ,బంగారమును సమానముగా చూచును . ( 8 )

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 

సుహృ న్మిత్రార్యు దాసీన -
మధ్య స్థద్వేష్య బంధుషు  |
సాధుష్వపి  చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే  | 9 |

సుహృదులయందును ( స్వార్ధరహితులై అందఱికిని హితమును గూర్చువారు )  మిత్రులయందును ,శత్రువులయందును ,ఉదాసీనులయందును ( పక్షపాతరహితులు ) మధ్యస్థులయందును ( ఇరుపక్షములకును మేలుగోరువారు ) ద్వేషింపదగిన వారియందును ,బంధువుల యందును ,ధర్మాత్ములయందును ,పాపులయందును సమబుద్ధి కలిగి యుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు . ( 9)

యోగీ యుంజీత సతతమ్
ఆత్మానం రహసి స్థితః  |
ఏకాకి యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహః   | 10 |

శరీరేంద్రియ మనస్సులను స్వాధీన పఱచుకొనిన  వాడు ,ఆశారహితుడు ,భోగసామాగ్రిని ప్రోగుచేయని వాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ( ఏకాంత )  ప్రదేశమున కూర్చొని ,ఆత్మను నిరంతరము పరమాత్మ యను లగ్నము చేయవలెను .  ( 10 )

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 
 

శుచౌ దేశే  ప్రతిష్టాప్య
స్థిరమాసనమాత్మనః  |
నాత్యుచ్రితం నాతినీచం
చైలాజినకుశోత్తరమ్  | 11 |

పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును ,జింకచర్మమును ( సహజముగా మరణించిన జింక యొక్క చర్మమునే వాడవలెను . జింక చర్మము లభింపనిచో కంబళిని ఉపయోగించవచ్చును ) ,వస్త్రమును ఒకదానిపై ఒకటి పఱచి  ,అంత ఎక్కువకాని ,తక్కువగా కాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను .

తత్త్రైకాగ్రం మనః కృత్వా
యతచిత్తైంద్రియక్రియః  |
ఉపవిశ్వాసనే యుంజ్యాయత్
యోగమాత్మ విశుద్ధయే  | 12 |

ఆ ఆసనముపై కూర్చొని ,చిత్తైంద్రియ వ్యాపారములను వశము నందుంచుకొని ,ఏకాగ్రతగల మనస్సుతో అంతః కారణశుద్ధికై ధ్యాన యోగమును సాధనచేయవలెను . ( 12 )


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   
 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

సమం కాయశిరోగ్రీవం
ధారయన్నచలం  స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్ | 13 |

శరీరమును మెడను శిరస్సును నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి ( స్థిరసుఖమాసనమ్   ఎక్కువ కాలము సుఖముగా స్థిరముగా కూర్చొని ఆసనము అనియుందురు . ) చూపులను ఏ దిక్కునకును పోనీయక తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను  ( 13 )

ప్రశాంతాత్మా  విగతభీ ః
బ్రహ్మచారీవ్రతే స్థితః  |
మనః సంయమ్య మచ్చిత్తో
యుక్త ఆసీత మత్పరః  | 14 |

ధ్యానయోగి ప్రశాంతాత్ముడై ,భయరహితుడై ,బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు ,మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడైయుండవలెను .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile

 జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥
 
 
  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

యుంజన్నేవం సదాత్మానం
యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణ పరమాం
మత్సంస్థామధిగచ్ఛతి  | 15 |

మనోనిగ్రహాశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి ,నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందును . ( 15 )

నాత్యస్నతస్తు  యోగో స్తి
న చైకాంతమైనశ్నతః  |
న చాతి స్వప్నశీలస్య
జాగ్రతో  నైవ చార్జున | 16 |

అర్జునా ! అతిగా భుజించువానికిని ,ఏ మాత్రము భుజింపనివానికిని , అతిగా నిద్రించువానికిని ,ఎల్లప్పుడూ ( ఏ మాత్రము నిద్రింపక ) మేల్కొనియుండు  వానికి ఈ యోగ  సిద్ధికలుగదు . ( 16 )

అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


 

 
 

 


 

 
« Last Edit: May 03, 2019, 11:29:55 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

యుక్తాహారవిహారస్య
యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నాబోధస్య
యోగో భవతి దుఃఖహా | 17 |

ఆహారవిహారాదులయందును ,కర్మాచరణముల యందును ,జాగ్రత్స్వపాదుల యందును యథాయోగ్యముగ ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యాన యోగము సిద్ధించును . ( 17 )

 యదా వినియతం చిత్తమ్
ఆత్మన్యేవావతిష్ఠతే  |
నిఃస్పృహః సర్వకామెభ్యో
యుక్త ఇత్యుత్యతే  తదా | 18 |

చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని ,దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పినపుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును . అప్పుడతడు యోగయుక్తుడనబడును .  ( 18 )

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2446
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్
 

 యథా దీపో నివాతస్థో
నెంగతే  సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య
యుంజతో  యోగమాత్మనః | 19 |

వాయుప్రసారములేని చోట నిశ్చలముగా నుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్మమైయున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును .

యత్రో పరమతే  చిత్తం
నిరుద్ధం యోగాసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం
పశ్యన్నాత్మని  తుష్యతి | 20 |

ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని  పొంది ,పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ,ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని ,యోగి ఆ సచ్చిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు .  ( 20 )
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!