Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137063 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 అథ చేత్వమిమం  ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి |
తతః  స్వధర్మం  కీర్తిం చ
హిత్వా పాపమవాప్స్యసి  | 33 |

ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము . ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అగుదువు . దానివలన కీర్తిని కోల్పోదువు . పైగా నీవు పాపము చేసినవాడవగుదువు .      (33)

అకీర్తిం చాపి భూతాని
కథఇష్యంతి  తే వ్యయామ్  |
సంభావితస్య  చాకీర్తి:
మరణా దతిరిచ్యతే  | 34 |

లోకులెల్లరును బహుకాలము వఱకును  నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు . మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది .                    (34 )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: January 21, 2019, 11:12:35 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 భయాద్రణాదుపరతం
మస్యంతే  త్వాం మహారథాః  |
యేషాం  చ త్వం  బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్  | 35 |

ఈ మహారథుల దృష్టిలో నీవు మిక్కిలి మాన్యుడవు . యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు . అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు .    ( 35 )

అవాచ్య వాదాం శ్చ    బహూన్
వది ష్యంతి  తవాహితాః   |
నిందంతస్తవ   సామర్థ్యం
తతో దుఃఖ తరం ను కిమ్  | 36 |

నీ శత్రువులు నీ సామర్ధ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు . అంతకంటె విచారకరమైన విషయ మేముండును ?   ( 36 )
 

 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

హతో నా ప్రాప్స్యసి స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్  |
తస్మాదుత్తిష్ఠ  కౌంతేయ
యుద్ధాయ కృతనిశ్చయః  | 37 |

ఓ అర్జునా ! రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్టించును . యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు . కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము .   ( 37 )

సుఖదుఃఖే  సమే  కృత్వా
లాభాలాభౌ  జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైనం  పాపమవాప్స్యసి  | 38 |

జయాపజయములను ,లాభనష్టములను సుఖదుఃఖములను  సమానముగా భావించి ,యుద్ధసన్నద్ధుడవు కమ్ము ,అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు .  ( 38 )
 
  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

ఏషా తే భిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శృణు  |
బుద్ధ్యా యుక్తో యయా పార్ధ
కర్మబంధం ప్రహాస్యసి  | 39 |

ఓ పార్ధా ! ఈ ( సమత్వ ) బుద్ధిని ఇంతవఱకును జ్ఞానయోగ దృష్టితో తెల్పితిని . ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించెదను . వినుము . దానిని ఆకళింపు చేసికొని ,ఆచరించినచో కర్మ బంధములనుండి నీవు ముక్తుడయ్యెదవు . (39 )

నేహాభిక్రమనాశోస్తి
ప్రత్యవాయో  న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ | 40 )

ఈ ( నిష్కామ ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు . దీనికి విపరీత ఫలితములే యుండవు . పైగా ఈ (నిష్కామ ) కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యు రూప మహాభయమునుండి కాపాడును .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్ 

 వ్యవసాయాత్మికా   బుద్ధి :
ఏకేహ  కురునందం |
బహుశాఖా హన్యంతాశ్చ
బుద్ధయో వ్యవసాయినామ్  | 41 |

ఓ అర్జునా ! ఈ (నిష్కామ ) కర్మయోగమునందు  నిశ్చయాత్మకబుద్ధి  ఒకటియే యుండును . కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ,ఒకదారీ  తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును . (41)

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   
 
శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 యామిమాం పుష్పితాం వాచం
ప్రవదంత్యవిపశ్చితః  |
వేదవాదరతాః   పార్థ
నాన్యదస్తీతి   వాదినః  | 42 |

కామాత్మానః స్వర్గపరా
జన్మకర్మఫలప్రదమ్   |
క్రియావిశేషబహులాం
భోగైశ్వర్యగ తిం  ప్రతి | 43 |

భోగైశ్వర్యప్రసక్తానాం
తయాపహృతచేతసామ్  |
వ్యవసాయాత్మికా బుద్ధి ః
సమాధౌ న విధీయతే  | 44 |

ఓ అర్జునా ! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలై  యుందురు . వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యార్ధములయందే ప్రీతివహింతురు . వాటి అంతరార్ధముల జోలికేపోరు . స్వర్గమునకు మించిన దేదియును లేదనియు ,అదియే పరమప్రాప్యమనియు వారు భావింతురు . క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి  ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదరు . ఆఇచ్చకపుమాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యఆసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు . ( 42-44 )


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్వంద్వొ నిత్యసత్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్  | 45 |

ఓ అర్జునా ! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు ,వాటిని పొందుటకై చేయవలసిన సాధనలు గూర్చియు ప్రతిపాదించును . నీవు ఆ భోగములయెడలను వాటి సాధనలయందును  ఆసక్తిని త్యజింపుము . హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము . నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము . నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము . నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపడవద్దు . అంతఃకరణమును వశము నందుచు కొనుము .

 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

 శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

 యావానార్థ  ఉదపానే
సర్వతః సంప్లతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః | 46 |

అన్నివైపులా జలములతో నిండియున్న మహా జలాశయము అందుబాటులో నున్నవానికి చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో ,పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము .

కర్మణ్యే వాధికారస్తే
మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూ ః
మా తే సంగోస్త్వకర్మణి   | 47 |

కర్తవ్యకర్మము నాచరించుటయందే నీకు అధికారము గలదు . ఎన్నటికినీ దాని ఫలములయందులేదు . కర్మఫలములకు నీవు హేతువు కారాదు . కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు . అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనా చరింపుము .అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్       

యోగస్థ: కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధనంజయ  |
సిద్ధ్యసిద్ధ్యో: సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే | 48|

ఓ ధనంజయా ! యోగస్థితుడవై ఆసక్తిని వీడి ,సిద్ధి -అసిద్ధుల యెడ సమత్వ భావమును కలిగియుండి ,కర్తవ్యకర్మలను ఆచరింపుము . ఈ సమత్వభావమునే యోగమందురు .  ( 48 )

దూరేణ  హ్యవరం కర్మ
బుద్ధియోగాద్ధనంజయ
బుద్ధౌ  శరణమన్విచ్ఛ
కృపణాః  ఫలహేతవః | 49 |

ఈ సమత్వబుద్ధి యోగముకంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది . కావున ఓ ధనంజయా ! నీవు సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపుము . ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యన్తాదీనులు ,కృపణులు .     (49 )
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   
 

బుద్ధి యుక్తో జహాతీహా
ఉభే  సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ  యుజ్యస్వ
యోగః  కర్మసు కౌశలమ్  | 50 |

సమత్వ బుద్ధియుక్తుడైన పుణ్యపాపములను రెండిటిని ఈ లోకమునందే త్యజించును . అనగా కర్మఫలములు వానికి అంటవు . కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము . ఇదియే కర్మాచరణమునందు కౌశలము . అనగా కర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము .  (50 )

కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం  త్వక్త్వా మనీషిణి ః    |
జన్మబంధవినిర్ముక్తాః
పదం గచ్చంత్యానామయమ్   | 51 |

ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి ,జనన మరణబంధముల నుండి ముక్తులయ్యెదరు . అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు .  (51)

   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 


శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

యదా తే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా     గంతాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ | 52 |

మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన ,వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యమును పొందగలవు  ( 52)

శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధవాచలా  బుద్ధి:
తదా యోగమవాప్స్యసి | 53 |

నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన ) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు . అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత ) సంయోగము ఏర్పడును .
 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

 

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

అర్జున ఉవాచ

స్థితప్రజ్ఞస్య  కా భాషా
సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిమ్ | 54 |

అర్జునుడు పలికెను -ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి ? అతడు ఎట్లు భాషించును ? ఎట్లు కూర్చొనును ? ఎట్లు నడుచును ? ( 54 )

శ్రీ భగవాన్ ఉవాచ
ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్ఠ ః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే   | 55 |

శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా ! మనస్సు నందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి ,ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైనవానిని ,అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు . ( 55 ) 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

  శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః  |
వీతరాగభయక్రోధః
స్థితధీర్మునిరుచ్యతే | 56 |

దుఃఖములకు కృంగిపోనివాడును ,సుఖములకు పొంగిపోనివాడును ,ఆసక్తిని ,భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మననశీలుడు ( ముని ) స్థితప్రజ్ఞుడనబడును . ( 56 )

యః సర్వత్రానభిస్నేహః
తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందంతి  న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా | 57 |

దేనియందును మమతాసక్తులు లేనివాడును ,అనుకూల పరిస్థితులయందు హర్షము ,ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును . ( 57 )

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్

యదా సంహరతే చాయం
కూర్మోఅంగానీవ   సర్వశ ః |
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా | 58 |

తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా ,ఇంద్రియములను ఇంద్రియార్ధముల ( విషయాదుల ) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన  పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను . (58 )

విషయా వినివర్తంతే
నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోప్యస్య
పరం దృష్ట్యా నివర్తతే | 59 |

ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వానినుండి ఇంద్రియార్ధములు మాత్రము వైదొలగును . కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును . స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తి గూడ తొలగిపోవును . ( 59 )
 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

శ్రీమద్భగవద్గీత ( శ్లోకతాత్పర్యములు )-గీతాప్రెస్ ,గోరఖ్ పూర్   

  యతతో హ్యపి  కౌంతేయ
పురుషష్య  విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి  ప్రసభం మనః | 60 |

ఓ అర్జునా ! ఇంద్రియములు ప్రమథన శీలములు . మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయిత్నించినను ,ఆసక్తి తొలగి పోనంతవఱకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును .

తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః |
వశే  హియస్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా | 61|

కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని ,సమాహతచిత్తుడై ( చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినవాడై ) మత్పరాయణుడై ,ధ్యానమునందు కూర్చొనవలెను . ఏలనన ఇంద్రియములను వశమునందుచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును .  ( 61 )


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!