Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 138941 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ అమ్మవారు (1805 నుండి 1862) వరకు కనిగిరి దుర్గమందు గార్లపేట ఆశ్రమము నందు అష్టాంగ యోగాలచే మరియు తన తపోశక్తిచేత ఎందరికో ఆత్మసాక్షాత్కారము లభించేలా చేసి ముక్తి మార్గాన్ని బోధించినారు . శిరివబ్రహ్మవిష్ణు స్వరూపములను ఒకటి చేసి సృష్టి మూలవిరాట్ ని దర్శించేలా చేసి ,పరమచైతన్యములో ఐక్యమయ్యేలా ,దాని యందే ఎప్పుడూ నిలిచి వుండేలా యోగమును కల్పించిన సత్ గురుః .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ అమ్మవారు 1862 లో కనిగిరి నుండి బయలుదేరి ఎన్నో గ్రామాలు సందర్శించి అనేక మందిని తన శిష్య బృందములుగా చేసినవారిని చరిత్ర ద్వారా తెలియుచున్నది . ఇప్పటికీ గుంటూరు జిల్లా ,నెల్లూరు జిల్లాలో దొంతులమ్మ అని ,దొంతులరావు అని పేర్లు పెట్టుకొనుట గమనించగలము . అలాగే అమ్మవారికి అనేక మందిరములు ఆశ్రమాలు నిర్మించి ,శిష్యబృందముచే నిర్వహించుచున్నారు . సత్ సాంగత్యము సాధనలు శిష్య పరంపరలచే జరుగుచున్నవి . తుదకు బందరు చేరి సుమారు 60 సంవత్సరములు జీవన ప్రస్థానము గావించినారు . ప్రత్సతి  నామ సంవత్సరము మాఘశుద్ధి తదియ మంగళవారము ది 9-2- 1932 శ్రీ దొంతులమ్మవారు బ్రహ్మ  ఐక్య సిద్ధి పొందుటకై సజీవ సమాధి నొందియున్నారు . ప్రతి సంవత్సరము మాఘశుద్ధ తదియ రోజు నుండి అమ్మవారి ఆరాధనా మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి .   

     
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

  ప్రతినిత్యమూ అనేకమైన కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమము ,చండీ హోమములు ,రుద్ర హోమములు , లక్ష్మి  నరసింహ స్వామి సహిత సుదర్శన హోమములు మరియు అమ్మవారి ఆలయ మూలవిరాట్ నకు మరియు అమ్మవారి పంచలోహ విగ్రహమునకు శాస్త్రోక్తముగా పంచామృతమలచే అభిషేకములు ,చందన   ,కుంకుమ ,చందనపుష్ప అక్షింతలచే అనేక విధములుగా షోడశోపచార పూజలచే విరాజిల్లుచున్నది .   

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

 


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥


శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

శ్రీ దొంతులమ్మ  అమ్మవారి దేవాలయములో 13 రోజులూ  పూజా ,సాంస్కృతిక కార్యక్రమాలచే  ,అనేక సత్సాంగత్యములచే ఆరాధనా మహోత్సవములు జరుపుకుని మాఘశుద్ధ పొర్ణమినాడు బందరు పురవీధుల గుండా ఆశ్చర్యాన్ని గొలిపే విధముగా కళాకారులచే తమ స్వరరస మాధుర్యములచే ప్రజలను భక్తిరస వాహినిలో ఓలలాడించే విధముగా అమ్మవారి రధోత్సవము జరుగును . భక్తులు నిండు మనస్సుతోనూ ,భక్తితోనూ ,మాటలతోనూ ,చేతులతోనూ అమ్మవారిని స్మరించి సర్వమానవ హృదయాలలో గూడుకట్టుకున్న అంధకారాన్ని తొలగించే ఆ ఆదిపరాశక్తి మా ముంగిట వచ్చింది ,మాలో దాగివున్న జ్ఞానాంధకారములను పారద్రోలి పరలోక ప్రాప్తిని మోక్షాన్ని ఇవ్వడానికే ఆ జగత్ జనని రూపములో శ్రీ దొంతులమ్మ  అమ్మవారు విచ్చేసారు అన్న ఆనందము ,అపూర్వము ,బ్రహ్మానందము ,అలాగే దేవాలయ మూలస్థానము నుండి వచ్చే ఆ దివ్య తేజస్సు వర్ణనాతీతము ,అపూర్వము ,మాటలకందని మహాదానందం . మనః ప్రాణః దేహః కర్మలన్నీ ఆగి ధ్యానంలో నిర్విచార నిర్వికల్ప నిరానంద మసమాధిస్థితి కలగజేసేటి ఆహ్లాదకర ఆనంద వాతావరణం దేవాలయ ప్రాంగణం .
 
   
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం 

శ్రీ దొంతులమ్మవారు జీవసమాధి నొందక పూర్వము బందరు పట్టణము మరియు పరిసర ప్రాంతము చుట్టుపక్కల గ్రామాలు సంచరించుతు అనేకమందిని తన శిస్యులుగా చేసుకుని మోక్షమునకు మార్గమును తెలియజేసినారు . ఇప్పటికి శ్రీ దొంతులమ్మ అమ్మవార్ని గురువుగా చేసికొని ఎంతోమంది సాధన చేస్తున్నారు . ఆలాగు గురుః శిష్యపరంపర కొనసాగుతుంది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

 శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం .

శ్రీ దొంతులమ్మ అమ్మవారు ప్రారంభించిన సత్యాంగత్య కార్యక్రమము నేటికి ప్రతి బహుళ చతుర్దశి నాడు అనగా మాసశివరాత్రి అమావాస్యముందు రోజు ఆలయ ప్రాంగణములో అనేకమంది తత్వజ్ఞాన సాధనాపరులచే సత్సాంగత్యము జరుగుచున్నది . పెద్దలు తెలియజేసిన ప్రకారం శ్రీ దొంతులమ్మ అమ్మవారు మీరు పర్వతమునకు ఉత్తర ప్రాంతము ( నైమిశారణ్యము ) అను అరణ్యప్రాంతము నందు జన్మించి నర్మదాకుండ్ అను నర్మదానది పుట్టినచోటనే తపస్సు చేసి పరబ్రహ్మ శక్తి స్వరూపాన్ని దర్శించిన మహోన్నత శక్తి స్వరూపిణి , కారణజన్మురాలు ,సత్యయుగ స్థాపన కొరకై దక్షిణ భారత దేశమును సందర్శించి అనేకమందిని శిస్యులుగా చేసుకొని జన్మరహస్యమును తెలిపి ఆత్మసాక్షాత్కారజ్ఞానమును నింపి మానవులలో దాగివున్న  దివ్యమైన శక్తిని జాగృతపరచి బ్రహ్మజ్ఞానమును ఒసంగి సహస్రామును గూర్చి తెలుపుటకై అవతరించిన ఆదిశక్తి స్వరూపం శ్రీ దొంతులమ్మ అమ్మవారు .
       
   
 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం .

శ్రీ దొంతులమ్మ అమ్మవారు అనేక దివ్య క్షేత్రములను ,అడవులు ,గ్రామాలు తిరిగి చివరకు శ్రీశైలము నుండి కనిగిరి చేరి అచట భక్తులను అలరించి కనిగిరి నుండి బందరు చేరి స్థిరపడినారు . అవధూతగా అనేక గ్రామాలు వీధులవెంట తిరిగి జోగువా చేసి నిరంతరము ధ్యానములో ఉండేవారు . తన చెంత వున్న జోలీని దిండుగా ,భూమిని శయ్యగా చేసుకొని అగ్నిని ఆవాసము చేసుకొని పరుండేవారు . శ్రీ దొంతులమ్మ అమ్మవారు అనేక రూపాలలో భక్తులకు దర్శనభాగ్యమును కలిగించేవారు . ఆమె ఎన్నో మహిమలను ,అద్భుతాలను చేసి అనారోగ్యములను తొలగించి మానసిక ఉల్లాసమును కలిగించేవారని వారి శిష్యులు అంటారు . అమ్మవారు తన శిరస్సుపై దొంతర్లతో కూడిన కుండలను పెట్టుకొని సంచరించేవారు . అందుకే అమ్మవారిని దొంతర్లమ్మగా పిలిచేవారని ,తరువాత "దొంతులమ్మ " గ స్థిరపడిందని తెలిపారు .

 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥
 
శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

అమ్మవారు బందరు పురవీధుల్లో సంచరించినపుడు దుకాణదారులు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి కావలసిన వస్తువులు ఇచ్చేవారు . అందువలన వారికి అనేక లాభములు కలిగేవని వర్తకులు చెప్పువారు . ఇప్పటికి వారు సహాయ ,సహకారములు అపూర్వము .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ  అమ్మవారి జీవిత చరిత్ర

శ్రీ దొంతులమ్మవారి దేవాలయ మూలవిరాట్ ఉన్నచోట అమ్మవారి జీవసమాధి కలదు . అక్కడికి వచ్చిన భక్తుల కోరికలను సమాధినుండే తీరుస్తారు . అమ్మవారి భక్తులకు ,అమ్మవారు స్వప్నములో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేశారు . ఒకే కాలములో పలుచోట్ల అమ్మవారి దర్శభాగ్యము కలుగజేసి నిత్యతేజోమూర్తిగా ,మాతృస్వరూపిణిగా పూజలందుకొనుచున్నారు . అమ్మవారి సంకల్పం మేరకు ,ప్రతి నెలా అమ్మవారు జీవ బ్రహ్మ ఐక్య సిద్ధి పొందినరోజు శుద్ధ తదియ రోజున (అమావాస్య తరువాత మూడవ రోజు ) ప్రత్యేక హారతులు ,హోమములు ,అభిషేకములు ,షోడశోపచార పూజలు అన్నసమారాధన కార్యక్రమములు నిరంతరము జరుగుచున్నవి . శ్రీ దొంతులమ్మవారు బ్రహ్మజ్ఞాని ,కారణం జన్మురాలు ,దేశ సంచారము చేయుచూ ,అనేకమందికి బ్రహ్మజ్ఞాన బోధ చేయుచూ తుదకు బ్రహ్మ ఐక్య సిద్ధి పొందుటకు బందరు జేరినారు . మొదట కొన్ని రోజులు కుమ్మరి వీధి నందు నివశించినారట . తరువాత జగన్నాధపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ,పాత పోస్టాఫీసు వద్ద మరియు తమ్ము మూలాస్వామి కొలిమి వద్ద నివాసము ఏర్పరచుకొని వుండేవారట . 

 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

        శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

తన కొలిమి వద్ద నివాసము ఉండే ఆమెను పిచ్చిమనిషిగా భావించి అక్కడ నుండి వెళ్లగొట్టుటకు చాలాసార్లు ప్రయత్నించి విఫలము చెందినాడు . వారి అనుబంధము గురుశిస్యుల పరంపర కదా ! ఒకనాడు యాదవుల అమ్మాయి తన మెడ పట్టీని పోగొట్టుకున్నది . అది శ్రీ దొంతులమ్మ అమ్మవారికి దొరికినది . ఆ వస్తువును తన దగ్గర వున్న పాత గుడ్డల మూటలో దాచి భద్రపరచింది . అది గమనించిన తమ్ము మూలాస్వామి  తనకు తెలిసినవారే మెడపట్టీ పోగొట్టుకున్నారని ,అది తనకు ఇమ్మని అడిగెను . అంతట అమ్మవారు పోగొట్టుకున్నవారు వచ్చిన యెడల తానే ఇచ్చెదనని తెలిపినారట . అందుకు మూలాస్వామి కోపముతో బలవంతముగా తీసుకోవడానికి ప్రయత్నించెను . అందుకు అమ్మవారు అంగీకరించలేదు . అమ్మశక్తి గ్రహించక ,ఆగ్రహము చెంది ప్రక్కనే వున్న కర్ర పైకెత్తగా అట్లాగే బిగుసుకొని పోయినాడట . ఏమి జరుగుతుందో తెలియనివాడై అమ్మ పాదాల చెంత చేరి క్షమాభిక్ష వేడి జ్ఞానోదయం పొందినవాడై శ్రీ దొంతులమ్మవారిని శరణుజొచ్చి ఆమె శిస్యుడిగా చేరి శ్రీ దొంతులమ్మ వారిని సేవించుచూ తన కొలిమి వద్ద ఆమెకు స్థానము కల్పించెను . ఇప్పటికీ ఆ ప్రాంతమునకు శ్రీ దొంతులమ్మవారి రధోత్సవ ఊరేగింపు వెళ్లి ఆ ప్రాంతమున కొంతసేపు ఆగి ,అక్కడే శ్రీ దొంతులమ్మవారి దివ్యచరణారవిందమును పూజించి చిత్రపటమునకు పూలమాలాంకృతులచే చందనపుష్ప అక్షితలచే షోడశోపచారములచే పూజించి భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేసి భక్తులను అలరించుట జరుగుచున్నది .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

 
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

మరొకనాడు పెడన వాస్తవ్యులు పద్మశాలి కులస్తులు శ్రీ బూసం వెంకయ్యగారు ,బళ్ల సుబ్బనాగయ్య గారు ,ఉమ్మిటి కోటిలింగం గారు వ్యాపార నిమిత్తమై దూరప్రాంతములకు వెళ్లి తిరుగు  ప్రయాణములో బందరు చేరుకొనిరి . అప్పటికే   చాలా  రాత్రి అయినది . ఇంటికి వెళ్ళు  వాహన మార్గము లేక తెల్లవారుఝామున లేచి వెళ్ళవచ్చులే అనుకొని బజారునందుగల విజయవాడ రోడ్డులోని ఒక వసారాలో గల అరుగుపై పడుకొనినారట. ఆ ప్రక్కనే శ్రీ దొంతులమ్మవారు కూడా దిగంబరియై పాతగుడ్డల మూటపై తలపెట్టుకొని గొంగళి కప్పుకొని నేలపై పడుకొనినారట . అర్ధరాత్రి తరువాత ఆమె పైకిలేచి కూర్చొనియుండుట చూసినారట . ఇంతలో వారు చూస్తుండగానే అమ్మవారి కన్నులు నుండి సూర్యకిరణములవలె వెలుగు ప్రసరించి ,తేజోమయయముగా ఆమె కాంతవంతమైన వెలుగులు చిమ్ముతూ కూర్చుని వుందట . ఆమె ఎవరో తపస్సంపన్నురాలని తలంచి ధ్యానించి నమస్కరించిరి . ప్రాధేయపూర్వకముగా పలకరించగా శ్రీ దొంతులమ్మవారు తన గుడ్డల మూట నుండి ఎదో పదార్థము వారి మువ్వురికి చేతిలో పెట్టినారట . అది చూసిన కారపుముద్దగా వుండి ఎంతో రుచిగా కూడా వుందిట ,అది మహాప్రసాదము అను కన్నులకు అద్దుకొని  తినగా ఎంతో రుచి వుండి ఎంతో శక్తి ప్రసాదించెనని వారు చెప్పియున్నారు . ఆ రాత్రి సమయములోనే వినమ్రతతో శరణాగతులై మిక్కిలి ప్రార్ధించగా శ్రీ దొంతులమ్మ వారు వారిని తన ఆశీర్వాదము ఇచ్చి వేదాంత రహస్యములు తెలియజెప్పి ఆత్మ దర్శనము ఎలా కలుగుతుందో ,ఆ సాధన ఎలా చెయ్యాలో తెలియచెప్పి అద్వైత రహస్యములను అనేకము తెలియచెప్పి ఆశీర్వదించెనని వారు తెలియచేసినారు . వారు ధన్యులై జీవిత పరమార్ధము గ్రహించిన వారై అమ్మవద్ద సెలవు తీసుకొని వారి వారి గ్రామాలకు వెళ్లి బందరు వాసులకు ,పరిసర గ్రామ వాసులకు అందరకు శ్రీ దొంతులమ్మ వారి యొక్క మహిమను తెలియజెప్పి వారి సన్నిధికి అనేకమందిని తీసుకువచ్చిన వారై అమ్మ ఆశీర్వాదములు అందించిరి . అప్పుడు శ్రీ దొంతులమ్మవారిని దేవతగా గుర్తించి ఆరాధించిరి .   

 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

 శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

అమ్మవారు ఇప్పుడు దేవాలయము ఉన్నచోటికి తమ నివాసమును మార్చుకుని ఇక్కడే స్థిరపడి అప్పుడప్పుడు బందరు విపణి మార్గమున గల అంగళ్లలో ఇష్టం వచ్చిన దుకాణములలో పొగాకు ,తినుబండారములు కాని తీసుకునేవారట . అంతట దుకాణదారులు ఆనందభరితులై ఎక్కువ వ్యాపారము చేసుకొనేవారట . అంతయూ తల్లిదీవెన అని తలంచి ఆమె రాకకై దుకాణదారులు  ఎదురుచూచెడివారట . ఇప్పటికీ దుకాణదారుల వారసులు ఆ మాటలు చెప్పి ఆనందపడి దేవాలయ నిర్వహణకు తమ శక్తి కొలది ఇచ్చుచున్నారు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

పిల్లలు కలగనివారు అమ్మ దర్శనభాగ్యముతో ప్రార్ధించగా అమ్మవారు కొన్ని ఫలములు ఇచ్చి ఆశీర్వదించేవారట . అంతట వారి సంతానము కలుగగా వారికి దొంతులమ్మగా ,దొంతులక్ష్మిగా ,దొంతులరావుగా ఇలా దొంతు శబ్దముతో పేర్లుపెట్టి కొలుచుచున్నారు . మాఘ శుద్ధ తదియ తేదీ 09-02-1932 సంవత్సరము ,మంగళవారము నాడు శ్రీశ్రీశ్రీ దొంతులమ్మ అమ్మవారు సజీవ జీవసమాధిలోకి ప్రవేశించి జీవ బ్రహ్మైక్యస్సిద్ధి పొంది భక్తుల కోర్కెలు సమాధినుండే తీర్చగలనని తెలియజెప్పి ,భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిరి . అలాగే వారి కుటుంబాలు వంశపారంపరగా అమ్మవారిని కొలుచుచున్నారు . అలాగే అమ్మవారి శిష్యులు వారి శిష్యపరంపర అమ్మవారిని దర్శించుకొని జ్ఞానమార్గాన్ని బడసి ధన్యులగుచున్నారు .
       
అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో  యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

          శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మావారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

అమ్మవారి ఆరాధనా మహోత్సవములు జరిగిన తరువాత బందరు పురవీధుల గుండా రధోత్సవము జరుపుకొని అనంతరము ఆలయములో జరిగే అన్నసమారాధన అపూర్వము . సాక్షాత్తు శ్రీ దొంతులమ్మ తల్లి స్వయముగా వచ్చి వెళతారని భక్తుల నమ్మకము . అలా మానవరూపములో కనిపించి అందరినీ ఆశీర్వదిస్తారని భక్తుల దృఢ విశ్వాసం . అందుకే ఎక్కడనుండో సుదూర ప్రాంతముల నుండి భక్తులు తండోపతండములుగా వచ్చి భక్తితో అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు . ఆ రోజు పరమానందముతో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన జన్మ ధన్యమై పోయినట్లే గదా !

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


               

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2447
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీ శ్రీ శ్రీ దొంతులమ్మ అమ్మవారి జీవిత చరిత్ర ,మచిలీపట్నం

1. ధ్యానము చేయండి సర్వదుఃఖముల నుండి విముక్తిని పొందండి .

2. సాటివారిని ప్రేమగా చూడండి . అరిషడ్ వర్గములకు దూరముగా ఉండండి .

3. మీలో ఉన్న అహంకారములను ఈశ్వరార్పణ చేయండి . ఆత్మ సాక్షాత్కారమును పొందండి .

4. సత్ సాంగత్యము చేయండి . పెద్దల మాటలను ఉపేక్షించకండి . భగవత్ సాక్షాత్కారాన్ని అన్వేషించండి .

5. ఆత్మసాక్షాత్కారాన్ని పొందండి . భగవంతుని సాన్నిధ్యాన్ని ,సామీప్యమును సాక్షాత్కారాన్ని పొందండి .

6. గతాన్ని మర్చిపోండి . భవిష్యత్ ను  భగవంతునికి అర్పించండి . మధ్యమార్గమైన సుషుమ్న మార్గములో వుండండి . వర్తమానములో జీవించండి . జ్ఞానమార్గములో జీవించండి . భగవంతుని సాక్షాత్కారాన్ని పొందండి . బ్రహ్మజ్ఞానాన్ని పొందండి . 

           
    అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!