Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 126386 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                       దివ్యజనని అలివేలుమంగమ్మ తల్లి నక్షత్రమాల ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

21. తాయి తాయి అనుచు నిను వేడగ
      తల్లడిల్లిన బిడ్డల చేరబిలిచి
      అభీష్టంబుల నెరవేర్తువు కదా
     వెన్నపూస -తల్లి నీదు మనసు

22. కడుదీనులనైన కనికరింతువు నీవు
      మా నోముల పంటవు  నీవు తాయి
      తలచిన వారి కొంగు బంగారమైతివి
      నిను తాకిన పోవు పాతకములన్ని .
     
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

                దివ్యజనని అలివేలుమంగమ్మ తల్లి నక్షత్రమాల ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

23. నిను చూచినంత సర్వదోషములు తొలగు
      ఆర్తి బాపుదువు ఆర్తజనులయందు
      మంచి ముత్యము పగిది చెంతనున్న తల్లి
     అందుకో శతశత వందనములు .

24. ఆది అంతము లేని దివ్య చైత్యమూర్తి
     నీ మహిమలెన్న మా జన్మ తరమె
     కననీదు ప్రాభవం కన్నులు చాలవు
     మనసున శాశ్వతముగ కొలువుండు తాయి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

           దివ్యజనని అలివేలుమంగమ్మ తల్లి నక్షత్రమాల ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

25.నిను చూచి మైమరచి పులకించి పోతిని
     కన్న తల్లిని మరల చూడగల్గితిని
     హృదయ పూర్వక వందనం అందుకో తాయి
     ఆదరముగ మమ్ము ఆడుకో తాయి .

26. నిను వేడి శరణొంద నీదు నామావళిని
      వ్రాసితిని మరి నాకు శాంతి నొసగు
      ప్రేమేమూర్తివి యీ చిన్న బిడ్డను కాపాడు
     మనసెరిగిన తాయి ఖ్యాతినొసగు .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

     దివ్యజనని అలివేలుమంగమ్మ తల్లి నక్షత్రమాల (శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

27. దివ్యజననీ నీకు ఈ నక్షత్రమాలను
      ఏర్చికూర్చి అర్పణ చేసితమ్మ
      అందుకొని యీ దీన వందనము గొనుము
     ఆశీస్సునిమ్ము ! నిను తలచు భాగ్యమిమ్ము !!

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 
 
         దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్రమాల (శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

1. అదె అర్కపురము మన ఆంధ్రరాష్ట్రము నందు
    వెలసె అవతారమూర్తి రాజరాజేశ్వరి దేవి ,
    శక్తి అనసూయ ,మాత ఆ తేజస్విని
    సాధు ,సజ్జనులతో చర్చించు దివ్యజనని .

2. అచట చేరిరి సాధు సంగంబులెల్ల
     అట్టివారిలో  అలివేలు మంగతాయి
     అమ్మకింపుగ సేవచేయుచునుండె
    'సత్సంగత్యే నిస్సంగత్వం ' అనిన ఇదియె గాదె . 

3.  చెలులందరు గూడి చెరువు నీరు దెచ్చి
     సేవచేసి పూజాదులు చేసినారు
     ఎంతని వర్ణింతురు మన్నవ వారి ఆడపడుచును
     చెప్పుకొనగ మన్ననలకు  దరి మరేది .

4. మన్నవ బాలకృష్ణ గారి గారాబు బిడ్డ
    తల్లి రంగనాయకమ్మ గారి ముద్దు తనయ
    మన్నవ వారి మర్యాద నిలిపె తాయి
    మన్ననల వారి పదముల భక్తితో గొలుతు

5. అమ్మ అనసూయమాత ఆశీస్సులందె
   సద్గురుని చేరి ఆశ్రమము పొందె
  వారి ఆశీస్సులే తాయికి జయముగా
 గురుభరద్వాజ చేయి పట్టెనమ్మ .

6. డెబ్బది అయిదు మార్చి ఆరునాడు
    స్వామి కోవెలలోన సాయి ఆశీస్సుతోడ
   జరిగె కళ్యాణము లోకకళ్యాణముగా
   వీక్షించిన జనుల కనుల ధన్యమయ్యె .

7. ఏ నోము నోచితినో ఏ పూజ చేసితినొ
    ఏ వ్రతము సలిపితినొ ఏమి చేసితినొ
    ముక్కోటి దేవతలు ప్రత్యక్షమైనట్టు
   తాయి భరద్వాజ దంపతుల కనులకంటిని .

8. కళ్యాణ రూపమున మిమ్ము తలవగ తాయి
    వేదిక కనిపించె వేద విధులతో నిండి
    మంగళ వాద్యములు మారుమ్రోగుచునుండ
    చిన్నగ తలవంచి చిరునవ్వు నవ్వె

9. స్వామిని చూచుటకు కోరికను గలిగి
   నీట ప్రతిబింబము తోచగా బెదిరి
   దిటవు చేసికొని పతిదేవుని చూచి
   చేతులు జోడించి ఆశీర్వాదమును కోరె .

10. గురుని చేయందుకొని ఏడడుగులు నడిచి
      తృప్తిపొందినది మరి శాంతినొందినది
     పంచభూతములపై ఆన పరమాత్మ పొందినది
    భరద్వాజ సాటి సద్గురుడు లేడే లేడు .11. గురుని చేయందుకొని వచ్చి గురుపత్నియైనది
      ఎల్లప్రజ ఆనందమొందునటుల
     ఒక్క ఎక్కిరాల వంశమును గాదు
    భక్తి వరుల గూడ నిద్ధరించు తాయి .

12. గురుని అడుగు జాడలె గురుతుగా నడిచియు
      మమ్ము గూడ నడిపించితీవి నీవు
      విసుగు పడు పనులెన్ని ఎదురైన గాని
      ఓర్పుతో చక్కబరచు శాంతమూర్తివమ్మ.


15. మాస్టారు మాటకు మారు మాటాడక
      చిరునవ్వుతో సేవలు సలుపు తాయి
     పట్టి కొలుతుమమ్మ మీ పాదములను
     నీబిడ్డలము మామ్మాదరించు .

16. మాస్టారు బోధింప భక్తిగా విని
      పుణ్యచరితల పూజలెన్నో చేసి
      తెలిసి కొంటివి జ్ఞానబోధలన్ని
     సారములు తెలిసిన గుణోపాసన తాయి .17. వనిత లోకానికి వన్నె తెచ్చిన తాయి
      వనితలంతా నిను జూచి నేర్చుకొనరె
      బాధలోన శ్రీ భగవానుని తలచి
      బోధలందించిన తాయి వినతు విడుదు .

18. అమ్మరో నిను జూచి ఆనంద పడితిమి
      నీ సన్నిధియె మా పెన్నిధియైనది
      కోర్కెలు దీర్చమ్మ కోటిదండాలు
      పుట్టుసార్ధకమైన లోకమాన్య చరిత


19. ఒకరోజు మాష్టారు పంచెలను పంచమన
      వారు వీరనక అందరికీ పంచితివమ్మ
      ఇంటిలో వస్త్రములు నిండుకొనే దాక
      దానశీల ,నిను స్మరణ చేసేదమ్మ .

20. సీతవో ,సావిత్రివో ,అనసూయావో
      కాక అరుంధతివో అల దమయంతివి
      ఆనందమయివి మా అమ్మవు అలివేలు మంగ నీవు
      తెలుపు తాయి నీదు మాయ మము పిలుపు తాయి .

21. తాయి తాయి అనుచు నిను వేడగ
      తల్లడిల్లిన బిడ్డల చేరబిలిచి
      అభీష్టంబుల నెరవేర్తువు కదా
     వెన్నపూస -తల్లి నీదు మనసు

22. కడుదీనులనైన కనికరింతువు నీవు
      మా నోముల పంటవు  నీవు తాయి
      తలచిన వారి కొంగు బంగారమైతివి
      నిను తాకిన పోవు పాతకములన్ని .

23. నిను చూచినంత సర్వదోషములు తొలగు
      ఆర్తి బాపుదువు ఆర్తజనులయందు
      మంచి ముత్యము పగిది చెంతనున్న తల్లి
     అందుకో శతశత వందనములు .

24. ఆది అంతము లేని దివ్య చైత్యమూర్తి
     నీ మహిమలెన్న మా జన్మ తరమె
     కననీదు ప్రాభవం కన్నులు చాలవు
     మనసున శాశ్వతముగ కొలువుండు తాయి .

25.నిను చూచి మైమరచి పులకించి పోతిని
     కన్న తల్లిని మరల చూడగల్గితిని
     హృదయ పూర్వక వందనం అందుకో తాయి
     ఆదరముగ మమ్ము ఆడుకో తాయి .

26. నిను వేడి శరణొంద నీదు నామావళిని
      వ్రాసితిని మరి నాకు శాంతి నొసగు
      ప్రేమేమూర్తివి యీ చిన్న బిడ్డను కాపాడు
     మనసెరిగిన తాయి ఖ్యాతినొసగు .

27. దివ్యజననీ నీకు ఈ నక్షత్రమాలను
      ఏర్చికూర్చి అర్పణ చేసితమ్మ
      అందుకొని యీ దీన వందనము గొనుము
     ఆశీస్సునిమ్ము ! నిను తలచు భాగ్యమిమ్ము !!

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

       శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

1. భారత భూమిని పరిపాలన జేయ
    పరదేశవాసులు వచ్చేరయా
    ఆరు వత్సరంబులు యేకరీతిగా
    అంబ యొక్కతె అవని నేలేనయ్య .

2. ఉత్తరదేశమున వైశ్యకులమందు
    ఉత్తమ గందొకడు బుట్టేనయా
    హత్తుగన్ని దేశముల వారంత
     సత్తుగ పూజలు జేసేరయా .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 


    శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

3. లోకమంతయు ఏకంబుగా జేసి
    యేకు పట్టెడువాడు వచ్చేనయా
   ప్రాకటంబుగను లోకంబులో తాను
   మేకై నిలిచి జనుల మేలెంచేనయా .

4. పండ్రెండు రాశులలో పాల ముందార
    పద్మనాభుడు అయిదు నడిపేనయా
   చుండూరు వద్దాను సుడిగాలి చేతాను
   సుడిబాడి వెధవాలు జచ్చేనయా .
 
                                       
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

5. మేషరాశిలో శని ప్రవేశమయితేను
    మేలు కొందరికి అయ్యేనయా
    దోషకారులెల్ల దూళ్లయ్యి పొయ్యేరు
    ధూమకేతువు మింట బుట్టేనయా .

6. కల్లలాడేవార్ని విర్రుగానుగాలలో
    మల్లించి పొర్లించి గూల్చేరయా
    తొల్లి చండికదేవి శనివద్ద జేరింది
   కలియుగమున వింతగల్గినయా .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు .

7. జాతిజాతికి చాల వైరముల్ గల్గిని
   జనయోగము తల్లడిల్లేనయా
  పెన్నయొడ్డున యుండే చెన్నూరు గ్రామము
   వరదల పాలయి పొయ్యేనయా .

8. ఈశాన్యము నుండి విషగాలి వచ్చియు
   విపరీత నరులంత జచ్చేరయా
  కపట కిరాతుల ఖండించి వేయును
  కలికావతారుడు వచ్చేనయా .
   

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
 
 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు .

9. అద్దంకి సీమలో బీద యాదవునింట
    బుద్ధుడంతటివాడు బుట్టేనయా
    ఇద్దరు జనుల కనేక భవిష్యత్తులం
    ఐదేండ్ల ప్రాయమున తెలిపేనాయా .

10 . దాసుల యోగులు ధరణిలోన దాగేరు
       మోసదాసుల యోగులను మించేరయా
       మీసము లేనోడు దేశానికొచ్చేవి
       మహికొండలకుజండా లేపేనయా .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

 శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

11. మానవసీమకు మారెమ్మ వచ్చీని 
      మనుజుల తర్వాత మ్రింగేనయా
      కోనసీమలోన కలతాలు బుట్టీని
      సుఖసన్ని రోగాల సమాసేనయా

12. కర్ణాటక భూములకు కాళీ సంపూరక
      వాణిసీమకు దుర్గీ వచ్చేనయా
      మొరస రాజ్యానికి భద్రకాళి పంపు
      ధర భద్రదేవి కొచ్చేనయా . 
       
   
 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile

గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

13. వీరభద్రుని పంపు వచ్చీని మూలలకు
       భైరవుని పంపు వచ్చేనయా
       ఊరేగేంద్రుని పంపు మహానంది కొచ్చీని
      కర్నూలుకు నందిపంపు వచ్చేనయా .

14. తల్లులూ బిడ్డలు తగవులు నడిచీని
      తల్లాడించే దినములొచ్చేను
      కల్లగాదీమాట యుల్లాము సాక్షిగా
     గద్దాన్నొడిసి కాకి దన్నేనయా .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

15. బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు
       మహిలో వేసే దినము లొచ్చేనయా
        మధుర తంజావూరు పరిహరణమయ్యీని
        మహానంది శిఖరము విరిగేనయా .

16. హంపి విరూపాక్ష రెండూళ్ల నడుమాను
      అగ్ని వర్షములు గురిసేనయా
      పెంపుతో ఏడునాల్గు గ్రామాలు మండీని
       భూమి వణికి గ్రామా లదిరేనయా .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వేదవాక్యములు

17. నాల్గువేల యాసమన్నూట ముప్పదియేండ్లుమ్
      కలియుగాబ్దమూలు జరిగేనయా
     కలియందు శ్వేతముఖులు దొరలయ్యేడు
     మెలకువతో రాజ్య మెలేరయా

18. అయిదువేల ముప్పడెనిమిదింటిలో
     రాజు అవని వదిలి దివి కేగేనయా
    ఆయురారోగ్య ఐశ్వర్యంబుల క్షేమమయ్యే
   యోగజనుల కొచ్చేనయా ( 1936)

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile


జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

19. మబ్బు మాయలబడి దబ్బరలాడేరు
      మబ్బు నడతలు బహు నడచేరయా
       గొబ్బున వారెల్ల నాశనమయ్యేరు
       గుణవంతులీ భువిలీ నిలిచేరయా .

20.    రుద్రూడు కాలాగ్ని రౌద్రూడు
        శ్రీ వీరభద్రూని భూమి గొలిచేరయా
        క్రోధుడై క్షుద్రాల రుద్రాభూమి కంపి
         ముద్రాభ్యాసుల విడిపించేనయా .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: October 02, 2018, 05:04:29 PM by Gurupriya »